
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్‌పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపులోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరికి 25 కి.మీ దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజౌరీలోని దర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను గురువారం తెల్లవారుజామున మట్టుబెట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఘటనా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు.
చదవండి: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా
Comments
Please login to add a commentAdd a comment