Rajouri
-
Jammu: రాజౌరిలో ఉగ్రకుట్ర భగ్నం
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసేందుకు తాజాగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ పోస్ట్ రాజౌరిలోని గుండా ఖవాస్ ప్రాంతంలో ఉంది.జమ్ము ప్రాంతంలో గత కొన్ని నెలలుగా తీవ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడుల వెనుక పాక్ హస్తం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో చొరబాటు ఘటనలు కూడా పెరిగాయి. జమ్ములో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా సంస్థలు ముమ్మరంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తాజాగా అత్యున్నత స్థాయి సంయుక్త భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చేవారిని అంతమొందించేందుకు అన్ని ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలన్నారు. చొరబాట్లను నిరోధించేందుకు భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సిన్హా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
అనంత్‌నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
జమ్మూ కశీ్మర్లో అనంత్‌నాగ్–రాజౌరీ స్థానంలో పోటీ ఈసారి ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మెహబూబా ముఫ్తీ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోలింగ్ మే 7న మూడో విడతలో జరగాల్సింది. బీజేపీ, ఇతర పారీ్టల విజ్ఞప్తి మేరకు ఆరో విడతలో భాగంగా మే 25కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది... 2022 పునర్విభజనలో అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం కాస్తా అనంత్‌నాగ్–రాజౌరీగా మారింది. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కశీ్మర్ లోయలో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయి. లోయలోని 3 లోక్‌సభ స్థానాలూ 2014లో పీడీపీకే దక్కాయి. 2019లో వాటన్నింటినీ ఎన్సీ కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎంపీ హస్నాయిన్ మసూదీ కేవలం 6,676 ఓట్లతో గట్టెక్కారు. ఎన్సీ ఈసారి వ్యూహాత్మకంగా గుజ్జర్ బకర్వాల్ మత నాయకుడు, పార్టీ సీనియర్ నేత మియా అల్తాఫ్‌ను బరిలో దింపింది. ఆయనకు పూంచ్, రాజౌరిలో గట్టి మద్దతుంది. ఇది ఇతర పారీ్టల ఓట్లను చీల్చే అవకాశముంది. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో పహాడీ జాతి సమూహాలకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇచ్చాక సమీకరణాలు మారాయి. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) నుంచి మహమ్మద్ సలీమ్ పారే, అప్నీ పార్టీ నుంచి జాఫర్ ఇక్బాల్ మన్హాస్ బరిలో ఉన్నారు. ఆరి్టకల్ 370 రద్దు నేపథ్యంలో బల్దేవ్ కుమార్ రూపంలో జమ్మూకశీ్మర్‌లో తొలిసారిగా ఓ స్థానికేతరుడు పోటీ చేస్తుండటం విశేషం. ఆయన స్వస్థలం పంజాబ్. లెక్కలు మార్చేసిన డీలిమిటేషన్! 2022కు ముందు జమ్మూలో రెండు (జమ్మూ, ఉధంపూర్), కశ్మీర్లో మూడు (శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్), లద్దాఖ్‌లో ఒక లోక్‌సభ స్థానముండేవి. డీలిమిటేషన్ తర్వాత జమ్మూలో రెండు స్థానాలు కొనసాగినా అక్కడి పూంచ్, రాజౌరి జిల్లాల్లో చాలా భాగాన్ని కశీ్మర్లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానంతో కలిసి అనంత్‌నాగ్–రాజౌరీగా చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 18 అసెంబ్లీ సీట్లున్నాయి. మొత్తం 18.3 లక్షల ఓటర్లున్నారు. 10.94 లక్షల మంది కశీ్మర్ ప్రాంతంలో, 7.35 లక్షల మంది జమ్మూలో ఉన్నారు. మెజారిటీ కశీ్మరీలు ముస్లింలు. జమ్మూలో 3 లక్షల మేర గుర్జర్లు, బేకర్వాల్ సామాజిక వర్గం ఉంది. మిగతా జనాభా పహాడీలు (హిందువులు, సిక్కులు ఇతరత్రా). వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చడం వంటి చర్యల ద్వారా బీజేపీ నెమ్మదిగా లోయలో పాగా వేయజూస్తోంది. ఈసారి పోటీ చేయకున్నా వేరే పారీ్టలకు మద్దతిస్తోంది. బీజేపీ నేతలు తీవ్రంగా ప్రచారమూ చేస్తున్నారు. ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీలపై సభలు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు! ఆ మూడింటికి కాకుండా ఎవరికైనా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కశీ్మరీ పండిట్ ఒంటరి పోరు కశీ్మరీ పండిట్లు. 1980ల్లో పెచ్చరిల్లిన హింసాకాండకు తాళలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోయిన ప్రజలు. ఏళ్ల కొద్దీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వర్గానికి చెందిన దిలీప్ కుమార్ పండిత (54) ఈసారి అనంత్‌రాగ్–రాజౌరి నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు! ముఫ్తి, మియా అల్తాఫ్ అహ్మద్‌లకు గట్టి సవాల్ విసురుతున్నారు. పౌర చర్చల ద్వారా పండిట్లు, ముస్లింలతో పాటు కశ్మీరీలందరినీ ఏకం చేస్తానన్నది ఆయన హామీల్లో ప్రధానమైనది. నిజాయితీగా ఆయన చేస్తున్న ప్రయత్నం స్థానికులను ఆకర్షిస్తోంది. ప్రతి గడపకూ వెళ్లి ఓట్లడుగుతున్నారు. స్థానికులతో భేటీ అవుతున్నారు. ఐదు వలస శిబిరాల్లో ఉన్న 35,000 మంది పండిట్లను తనకే ఓటేయాలని కోరారు. ‘‘35 ఏళ్లుగా ఇంటికి దూరంగా బతుకుతున్నాం. మాకిప్పటికీ న్యాయం జరగలేదు. కశీ్మరీ పండిట్లకు న్యాయం కోసం, వారు లోయలోకి సురక్షితంగా తిరిగొచ్చే పరిస్థితులను నెలకొల్పడం కోసం పోరాడుతున్నాను’’ అని మీడియాకు తెలిపారు పండిత.బీజేపీ అడ్డుకుంటోంది: ముఫ్తీ తాము ప్రజలను కలవకుండా మోదీ సర్కారు అడ్డుకుంటోందని ముఫ్తీ ఆరోపిస్తున్నారు. ‘‘ఆరి్టకల్ 370 రద్దుతో వారు నెలకొల్పామంటున్న శాంతి నిజానికి శ్మశాన వైరాగ్యం. మాకది ఆమోదయోగ్యం కాదు. జమ్మూ కశ్మీర్ యంత్రాంగం దన్నుతో దక్షిణ కశీ్మర్లో ఎన్కౌంటర్లు మొదలయ్యాయి’’ అని మండిపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలు పూంఛ్, రాజౌరీల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణ కోసమని తీసుకెళ్లి ముగ్గురు పౌరులను ఆర్మీ అధికారులు చంపేశారంటూ పార్టీల నేతలు, స్థానికులు నిరసనకు దిగారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది. వదంతులు వ్యాపించకుండా పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ నెల 21న పూంఛ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు అసువులు బాయడం తెలిసిందే. అనంతరం ఆర్మీ అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు శుక్రవారం రాత్రి శవాలై కనిపించారు. వారిని చిత్రహింసలు పెట్టిన వీడియోలు బహిర్గతమయ్యాయి. ఇది ఆర్మీ అధికారుల పనేనని స్థానికులు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన నలుగురిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. కశ్మీర్లో మళ్లీ ఉద్రిక్తతలు -
సరిహద్దుల్లో ఉగ్రకాల్పులు
రాజౌరీ/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కెపె్టన్లు, ఒక హవీల్దార్, ఒక జవాను వీరమరణం పొందారు. కాల్పులు జరుగుతున్న అటవీప్రాంతంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించేందుకు మరింతగా భద్రతా బలగాలు అక్కడకు చేరుకుంటున్నాయని సైన్యాధికారులు బుధవారం చెప్పారు. నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు విదేశీయులని సైన్యం వెల్లడించింది. గులాబ్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంలో గాలింపు చేపట్టగా ధరమ్‌సాల్ పరిధిలోని బజిమాల్ సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుందని ఆర్మీ ట్వీట్‌చేసింది. ఈ ఘటనలో ఒక మేజర్, ఒక జవాను గాయపడ్డారు. -
జమ్ముకశ్మీర్‌లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు జవాన్లు. ఓ గుహలో ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే జవాన్లు లక్ష్యంగా ఉగ్రవాదులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు సైనికులను బలిగొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిటన్లు తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య కాల్పుల ఘటన జరగడం మూడు రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. గురువారం బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్.. మంత్రిపై దాడి.. రైళ్లు బంద్ -
మైకేల్ లేకుంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవే!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాజౌరీలో కొత్త సంవత్సరం వేడుకల సమయంలో హిందూ కుటుంబాలుండే చోటుని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. మారణకాండకు తెగబడి ఆరుగురిని బలిగొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల ఎరివేత కోసం రెండు వేల మంది సిబ్బందితో భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అక్కడ. అయితే.. ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి అప్రమత్తమై మరికొందరి ప్రాణాలు పోకుండా కాపాడాడు మైకేల్. వాడొక పెంపుడు కుక్క!. స్థానికంగా నివాసం ఉంటున్న నిర్మలా దేవి కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. అయితే దాడి జరిగిన రోజు (ఆదివారం).. ముసుగులు తుపాకులతో ఉగ్రవాదుల రాకను దూరం నుంచే గమనించిన మైకేల్.. ఏకధాటిగా మొరుగుతూనే ఉంది. సాధారణంగా కంటే గట్టిగా అది మొరగడం గమనించిన నిర్మలా దేవి మనవరాలు.. ఏం జరిగిందా? అని బయటకు వచ్చి చూసింది. కాలనీ చివరి నుంచి తుపాకులతో ఇద్దరు ఇంటి వైపు వస్తుండడం గమనించింది. వెంటనే విషయాన్ని నిర్మలా దేవికి చెప్పడంతో ఆమె మరో గదిలోకి పరిగెత్తుకెళ్లి తలుపులు వేసుకుంది. ఈలోపు ఆ ఇంటి హాలులోకి వచ్చిన ఉగ్రవాదులు.. ఎవరూ కనిపించపోయేసరికి టీవీ, ఫర్నీచర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కుక్క మొరగడం, ఆపై తుపాకుల మోతతో చుట్టుపక్కల వాళ్లు కూడా అప్రమత్తమై ఇళ్లలోనే ఉండిపోయారు. అంతా అలా అప్రమత్తం కావడానికి కారణం మైకేల్గా భావించి.. దాని మీదకు పలు రౌండ్ల కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. అయితే మైకేల్ మాత్రం అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. సమయానికి అప్రమత్తమై ప్రాణాలతో తాము ఉండడానికి మైకేల్ కారణమని భావించిన కాలనీవాసులు దానికి ఘనంగా సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక రాజౌరీలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్ర దాడుల్లో(కాల్పుల ఘటన, ఐఈడీ బ్లాస్ట్) ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉండడం గమనార్హం. తమ ప్రాణాలకు భద్రత కరువైందని హిందువులు రోడ్డెక్కి నిరసన చేపట్టగా.. వాళ్లను భద్రతా అధికారులు శాంతింపజేసి పంపించారు. -
Rajouri: హిందువులపై దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం
శ్రీనగర్: రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఉగ్రదాడులు.. ఆరుగురి దుర్మరణం.. ఇందులో ఇద్దరు చిన్నారులు.. పదుల సంఖ్యలో గాయపడడంతో సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. హిందూ కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చెలరేగిపోతుండడంతో.. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజౌరి జిల్లాలో భారీగా పారామిలిటరీ ట్రూప్స్‌ను మోహరిస్తోంది కేంద్ర హోం మంత్రిత్వశాఖ. ఇప్పటికే సీఆర్పీఎఫ్ తరపున 18వేల సిబ్బంది రంగంలోకి దిగారు. గత మూడు రోజులుగా వందల సంఖ్యలో బలగాలు రాజౌరీలో మోహరించగా.. మరికొన్ని కంపెనీలు జమ్ముకి బయల్దేరాయి. దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఎరివేతే లక్ష్యంగా సైన్యం, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్తో కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్ము కశ్మీర్లో ఇప్పటికే సీఆర్ఎఫ్ బలగాలు ఉనికి భారీగా ఉంది. డెబ్భైకి పైగా బెటాలియన్లు(మొత్తం సీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యంలో 3వ వంతు) జమ్ము కశ్మీర్‌లోనే భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. ఇక రాజౌరి జిల్లా ఉప్పర్ డాంగ్రీ గ్రామంలో.. ఆదివారం సాయంత్రం ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ మరుసటి రోజే ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు పాతిన ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులను చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. నెల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి ఘటన. గత నెలలో ఆర్మీ క్యాంప్ సమీపంలోనే ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. హిందూ కుటుంబాల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో.. చాలా మంది అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు భద్రతకు తమది హామీ అని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. -
రక్తపాతం జరుగుతుందన్నారు.. ఇప్పుడేమైంది.. అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరిలో భారీ ర్యాలీకి హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన ప్రసంగించే సమయంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు 'మోదీ-మోదీ' నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తే రక్తపాతం జరగుతుందని భయపెట్టిన వారికి ఈ నినాదాలే సమాధానం అని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వంలో కశ్మీర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. కశ్మీర్‌ను 70 ఏళ్ల పాటు మూడు కుటుంబాలే పాలించాయని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలో వచ్చాక కశ్మీర్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచామని, మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని, 100కుపైగా పాఠశాలలు కొత్తగా వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని, హైవేల కోసం రూ.లక్ష కోట్లు మంజూరు చేశామని షా తెలిపారు. 2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతే ఇవన్నీ జరిగాయని చెప్పారు. #WATCH | Today's rally and your 'Modi-Modi' chants are answers to those who said if 370A will be abrogated, there will be a blood bath: Union Home Minister Amit Shah, in Jammu and Kashmir's Rajouri pic.twitter.com/1WJlHnK2nl — ANI (@ANI) October 4, 2022 అమిత్ షా కశ్మీర్ పర్యటనలో పలు కీలక ప్రకటనలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పహరీ వర్గాన్ని ఎస్టీల జాబితాలో చేర్చే విషయంపై అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. మూడు రోజుల పర్యటనలో దీనిపై స్పష్టత రానుంది. చదవండి: చీతాలకు లంపీ డిసీజ్‌కు ముడిపెట్టిన నానా పటోలే.. ఏకిపారేసిన బీజేపీ -
ఇండియన్ ఆర్మీపై దాడులకు పాక్ ఆర్మీ స్కెచ్
శ్రీనగర్: భారత గడ్డపై దాడులకు పాక్ సైన్యం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో.. భారత్‌లో దాడులకు సుపారీ తీసుకున్న ఓ ఉగ్రవాదిని భారత సైన్యం నిలువరించగలిగింది. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్ నుంచి భారత్‌లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్‌ను కట్ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం. అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్‌కోట్‌కు చెందిన తబరాక్ హుస్సేన్‌గా గుర్తించింది. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌద్రీ తనను పంపించాడని, భారత ఆర్మీపై దాడులకు పాల్పడాలంటూ తనకు రూ.30వేల పాక్ రూపాయలను ఇచ్చాడని వెల్లడించాడు. ఆయుధాలతో పాటు పాక్ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. విశేషం ఏంటంటే.. 2016లో తబరాక్ నియంత్రణ రేఖ వెంబడి తన సోదరుడితో సహా చొరబడేందుక యత్నించగా.. ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే మానవతా ధృక్పదంతో ఏడాది జైలుశిక్ష తర్వాత అతన్ని మళ్లీ వెనక్కి పంపించేసింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం. #WATCH | Tabarak Hussain, a fidayeen suicide attacker from PoK, captured by the Indian Army on 21 August at LOC in Jhangar sector of Naushera, Rajouri, says he was tasked by Pakistan Army's Col. Yunus to attack the Indian Army for around Rs 30,000 pic.twitter.com/UWsz5tdh2L — ANI (@ANI) August 24, 2022 ఇదీ చదవండి: మరో జలియన్ వాలాబాగ్.. 80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం -
జమ్మూకశ్మీర్: ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్లు వీర మరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్‌పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపులోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరికి 25 కి.మీ దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజౌరీలోని దర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను గురువారం తెల్లవారుజామున మట్టుబెట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఘటనా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు. చదవండి: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా -
నేలకొరిగిన మరో ఇద్దరు జవాన్లు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపులో జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీవో) సహా ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. దీంతో సోమవారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు జేసీవోలు సహా మొత్తం 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లయింది. గురువారం నార్‌ఖాస్ ప్రాంతంలో ఉగ్రమూకలతో ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలోనే తాజాగా జేసీవో అజయ్ సింగ్, జవాన్ హరేంద్ర సింగ్ మృతదేహాలు దొరికాయని అధికారులు తెలిపారు. పర్వతమయమైన దట్టమైన అటవీప్రాంతంలో గాలింపు కష్టసాధ్యంగా, ప్రమాదకరంగామారిందన్నారు. మెంధార్ నుంచి థానామండి వరకు మొత్తం అటవీ ప్రాంతాన్ని పారా మిలటరీ కమాండోలు, హెలికాప్టర్లతో జల్లెడపడుతున్నామన్నారు. ఇలా ఉండగా, బిహార్‌లోని బాంకా ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వలసవచి్చన అర్వింద్‌కుమార్ షా(30)ను శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో, యూపీ నుంచి వచ్చిన సాగిర్ అహ్మద్ అనే కార్పెంటర్‌ను పుల్వామాలో శనివారం ఉగ్రవాదులు కాల్చి చంపారని అధికారులు వెల్లడించారు. లష్కరే కమాండర్ హతం జమ్మూకశీ్మర్‌లోని పుల్వామా జిల్లా పంపోరే ప్రాంతంలో శనివారం భద్రతాబలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖాన్దేతోపాటు మరో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. పలు నేర ఘటనలతోపాటు ఈ ఏడాది జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యతో ఖాన్దేకు సంబంధముందని అధికారులు తెలిపారు. -
ఉగ్రవాదుల ఘాతుకం.. ఆర్మీ అధికారి మృతి
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి అలజడి రేగింది. ఉగ్రవాదులు పెట్టిన బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఓ ఆర్మీ మేజర్ మృతిచెందగా.. ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వద్ద పెట్రోలింగ్ చేస్తున్న భద్రత బలగాలకు రాజౌరీలోని నౌషీరా సెక్టారు వద్ద బాంబు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ క్రమంలో అక్కడ అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) ఉండటం గమనించిన ఆర్మీ అధికారి దానిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బాంబు ఒక్కసారిగా పేలడంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న జవాను కూడా తీవ్రంగా గాయపడినట్లు లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ పేర్కొన్నారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేసే అంశమై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. The Major-rank army officer was killed while defusing an Improvised Explosive Device (IED) which had been planted by terrorists. The officer is from the Corps of Engineers. The IED was planted 1.5 kms inside the Line of Control in the Naushera sector, Rajouri district, in J&K https://t.co/ZyWFS9RbWR — ANI (@ANI) February 16, 2019 -
పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటా!
సిమ్లా: తాను ఆర్మీలో చేరి తన తండ్రి ప్రాణాలు బలిగొన్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటానని సుబేదార్ శశికుమార్ కుమారుడు అక్షయ్ కుమార్ అన్నాడు. జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్లో పాక్ ఆర్మీ తెగబడి జరిపిన కాల్పుల్లో సుబేదార్ శశికుమార్ అమరులయ్యారు. ఆయన మరణవార్త విన్న కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. సుబేదార్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని హమిర్పూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే శశికుమార్ కుమారుడు మాత్రం తండ్రి మృతికి కారణమైన పాకిస్తాన్ పై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్షయ్ కుమార్ తెలిపాడు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించడం వల్లే తమ కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందన్నాడు. భారత ఆర్మీలో చేరి, తండ్రిని పొట్టనపెట్టుకున్న పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉందని చెప్పాడు. స్వగ్రామంలోనే సుబేదార్ శశికుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
కొనసాగుతున్న కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట పాక్ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయి. వరుసగా మూడోరోజూ పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుందని భారత సైన్యం వెల్లడించింది. అయితే.. పాక్‌కు ధీటుగా సమాధానం ఇస్తున్నట్లు ఆర్మీ అధికారి తెలిపారు. రాజౌరీ జిల్లా భీంబర్ గలి(బీజీ) సెక్టార్‌లోని భారత పోస్టులను లక్ష్యంగా చేసుకొని మోర్టార్స్, ఆటోమేటిక్ వెపన్స్‌తో పాక్ సైన్యం దాడులకు పాల్పడుతుందని తెలిపారు. గురువారం జరిపిన కాల్పల్లో ఇద్దరు భారత జవాన్లు గాయపడిన విషయం తెలిసిందే. జాన్‌లో మొత్తం 23 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైన్యం ఉల్లంఘించిందని అధికారులు వెల్లడించారు. -
తల్లీ కొడుకులను కాల్చి చంపారు
రాజౌరి: జమ్మూకాశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. వీడిసీ (గ్రామీణ రక్షణ కమిటీ) సభ్యుల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ వీడిసీ చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. దీంతో ఆ తల్లి కుమారులు ప్రాణాలు కోల్పోయారు. అతడు ఈ హత్య ఎందుకు చేశాడనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్యకు గురైన షమిమా భర్త గత కొన్నేళ్లుగా సౌదీ అరేబియాలోనే పనిచేస్తున్నాడు. ఈ వారంలోనే అంతకుముందు నేషనల్ కాన్ఫరెన్స్ యూత్ నాయకుడు మరో వీడీసీ సభ్యుడి చేతిలో దారుణ హత్యకు గురికాగా ఇది రెండో ఘటన. వీడీసీని పూర్తి స్థాయిలో రూపుమాపాలని గత కొంతకాలంగా పలు నేషనల్ కాన్ఫరెన్స్ తో సహా పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులుగానీ, సైన్యంగానీ అందుబాటులో లేని గ్రామాలకు ఆ గ్రామంలోనే కొందరి వ్యక్తులకు ప్రత్యేక శిక్షణ ఆయుధాలు ఇచ్చి గ్రామానికి రక్షణగా పెడుతుంటారు. వీరినే వీడీసీలు అంటారు.