పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటా! | i want to join the Army to take revenge for my fathers death, says Akshay Kumar | Sakshi
Sakshi News home page

పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటా!

Published Thu, Jul 20 2017 11:48 AM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటా!

పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటా!

సిమ్లా: తాను ఆర్మీలో చేరి తన తండ్రి ప్రాణాలు బలిగొన్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటానని సుబేదార్ శశికుమార్ కుమారుడు అక్షయ్ కుమార్ అన్నాడు. జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్లో పాక్ ఆర్మీ తెగబడి జరిపిన కాల్పుల్లో సుబేదార్ శశికుమార్ అమరులయ్యారు. ఆయన మరణవార్త విన్న కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. సుబేదార్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని హమిర్పూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

అయితే శశికుమార్ కుమారుడు మాత్రం తండ్రి మృతికి కారణమైన పాకిస్తాన్ పై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్షయ్ కుమార్ తెలిపాడు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించడం వల్లే తమ కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందన్నాడు. భారత ఆర్మీలో చేరి, తండ్రిని పొట్టనపెట్టుకున్న పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉందని చెప్పాడు. స్వగ్రామంలోనే సుబేదార్ శశికుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement