indian jawan
-
పాక్ పై ప్రతీకారం తీర్చుకుంటా!
సిమ్లా: తాను ఆర్మీలో చేరి తన తండ్రి ప్రాణాలు బలిగొన్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటానని సుబేదార్ శశికుమార్ కుమారుడు అక్షయ్ కుమార్ అన్నాడు. జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ సెక్టార్లో పాక్ ఆర్మీ తెగబడి జరిపిన కాల్పుల్లో సుబేదార్ శశికుమార్ అమరులయ్యారు. ఆయన మరణవార్త విన్న కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. సుబేదార్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో హిమాచల్ ప్రదేశ్లోని హమిర్పూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే శశికుమార్ కుమారుడు మాత్రం తండ్రి మృతికి కారణమైన పాకిస్తాన్ పై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్షయ్ కుమార్ తెలిపాడు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించడం వల్లే తమ కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందన్నాడు. భారత ఆర్మీలో చేరి, తండ్రిని పొట్టనపెట్టుకున్న పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉందని చెప్పాడు. స్వగ్రామంలోనే సుబేదార్ శశికుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నుంచి స్వదేశానికి చేరుకున్నభారత్ జవాన్ సత్యశీల్ యాదవ్ ఆ దేశం తనపై చూపిన ప్రేమకు ముగ్ధుడయ్యాడు. తనను ఆ దేశ అధికారులు చాలా బాగా చూసుకున్నారని స్పష్టం చేశాడు. ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాన్ ను ఆ దేశం సురక్షితంగా అప్పగించిన అనంతరం కుటుంబ సభ్యులను కలిసిన సత్యశీల్ మీడియాతో మాట్లాడాడు. ' నన్ను పాకిస్తాన్ బాగా చూసుకుంది. నేను అనుకున్నదానికంటే ఎక్కువగా ఆ దేశం నాపట్ల అమితమైన శ్రద్ధ చూపించింది' అని తెలిపాడు. కొన్ని రోజుల క్రితం బీఎస్ఎఫ్ జవాన్ యాదవ్ చీనాబ్ నదిలో కొట్టుకుపోయి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కాడు. జమ్మూలోని ఆర్ ఎస్ పురా సెక్టార్లోని జీరో లైన్ వద్ద పాక్ సైనికాధికారులు సత్యశీల్ను ఈ రోజు బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. సత్యశీల్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు.