అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు! | Captured BSF jawan returns to India, says 'treated well by Pakistan' | Sakshi
Sakshi News home page

అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు!

Published Fri, Aug 8 2014 7:33 PM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు!

అనుకున్న దానికంటే పాకిస్తాన్ లో బాగా చూశారు!

ఇస్లామాబాద్: పాకిస్తాన్ నుంచి స్వదేశానికి చేరుకున్నభారత్ జవాన్ సత్యశీల్ యాదవ్ ఆ దేశం తనపై చూపిన ప్రేమకు ముగ్ధుడయ్యాడు. తనను ఆ దేశ అధికారులు చాలా బాగా చూసుకున్నారని స్పష్టం చేశాడు. ప్రమాదవశాత్తూ పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించిన భారత జవాన్ ను ఆ దేశం సురక్షితంగా అప్పగించిన అనంతరం కుటుంబ సభ్యులను కలిసిన సత్యశీల్ మీడియాతో మాట్లాడాడు. ' నన్ను పాకిస్తాన్ బాగా చూసుకుంది. నేను అనుకున్నదానికంటే ఎక్కువగా ఆ దేశం నాపట్ల అమితమైన శ్రద్ధ చూపించింది' అని తెలిపాడు. కొన్ని రోజుల క్రితం బీఎస్ఎఫ్ జవాన్ యాదవ్ చీనాబ్ నదిలో కొట్టుకుపోయి పాకిస్థాన్ రేంజర్లకు చిక్కాడు.

 

జమ్మూలోని ఆర్ ఎస్ పురా సెక్టార్లోని జీరో లైన్ వద్ద పాక్ సైనికాధికారులు సత్యశీల్ను ఈ రోజు బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. సత్యశీల్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement