మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన | Pakistani violates ceasefire along LoC in Poonch | Sakshi
Sakshi News home page

మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన

Published Sat, Aug 9 2014 9:51 AM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM

Pakistani violates ceasefire along LoC in Poonch

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని బింబర్ గాలి సబ్ - సెక్టార్పైకి పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. దాంతో భారత్ జవాన్లు అప్రమత్తమైయ్యారు. పాక్ సైన్యం కాల్పులను భారత్ జవాన్లు తిప్పికోట్టారు. ఈ ఘటన గత రాత్రి చోటు చేసుకుందని డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. పాక్ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని చెప్పారు. పాక్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ జవాన్ సత్యశీల్ యాదవ్ను భారత్కు అప్పగించిన కొన్ని గంటల్లోనే ఈ కాల్సులు చోటు చేసుకున్నాయని మెహతా వెల్లడించారు.

ఇటీవల బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న నావ చీనబ్ నదిలో తిరగబడింది. ఆ ఘటనలో సత్యశీల్ అనే జవాన్ ఆ నదిలో కొట్టుకుని పోయాడు. ఆ క్రమంలో సియాల్ కోట్ వద్ద అతడ్ని పాక్ బలగాలు పట్టుకున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి సత్యశీల్ను భారత్ అప్పగించాలని పాక్కు కోరింది. దాంతో సత్యశీల్ను శుక్రవారం భారత్కు అప్పగించారు. సత్యశీల్ను భారత్కు అప్పగించి కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement