poonch district
-
జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం.. ఐదుగురు జవాన్ల మృతి
ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. పూంచ్‌లో జిల్లాలో సైనికులతో వెళుతున్న వాహనం 350 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 11 మద్రాస్ లైట్ ఇన్ఫాంట్రీ (11 ఎంఎల్ఐ)కి చెందిన వాహనం నీలం హెడ్‌క్వార్టర్స్ నుండి బాల్నోయి ఘోరా పోస్ట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 11 ఎంఎల్ఐ క్విక్ రియాక్షన్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుంది. గాయపడిన జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.🚨 SAD NEWS! 5 soldiers lost their lives after an army vehicle met with an accident in the Poonch sector. Rescue operations are ongoing, and the injured personnel are receiving medical care.PRAYERS 🙏 pic.twitter.com/oltXwzFCIH— Megh Updates 🚨™ (@MeghUpdates) December 24, 2024 -
ఐఏఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటన..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఈ నెల 4వ తేదీన భారత వైమానిక దళం కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ ఘటనలో విక్కీ పహాడే అనే కార్పొరల్ మృత్యువాతపడగా ఆయన సహచరులు మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఉగ్రవాదులను పాక్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, పాక్‌కే చెందిన ఉగ్రవాది హదూన్, లష్కరే తోయిబా కమాండర్ అబూ హమ్జా(30) అని తేలింది. కాల్పుల సమయంలో వీరివద్ద అత్యాధునిక అసాల్ట్ రైఫిళ్లయిన అమెరికా తయారీ ఎం4, రష్యా తయారీ ఏకే–47 ఉన్నట్లు తేలింది. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురి పోలికలున్న చిత్రాలతో అధికారులు పోస్టర్లను విడుదల చేశారు. వీరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించారు. -
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
చండీగఢ్: జమ్ము-కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో చోటు చేసుకున్న ఉగ్రదాడి.. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ చేస్తున్న స్టంట్ అని పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జలంధర్‌లో నిర్వహించన ఎన్నికల ప్రచారంలో చన్నీ బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు. ‘‘ఎన్నికల ముందు ఇవన్నీ బీజేపీ చేస్తున్న స్టంట్లు తప్ప ఉగ్రదాడులు కాదు. వాటిల్లో అసలు నిజమే లేదు. బీజేపీ ప్రజలు, శవాలతో ఆటలాడుతోంది. ఈ దాడులు నిజంగా జరిగినవి కావు. కేవలం బీజేపీకి ప్రయాజనం చేసేవి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. గతంలో లాగా బీజేపీ ఇలాంటి చిల్లర స్టంట్లు చేస్తుంది’’ అని చన్నీ దుయ్యబట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ కేంద్ర మంత్రి స్పందించారు. ‘‘చన్నీ ఉగ్రదాడిపై సైతం చాలా దిగజారిన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన మనస్తత్వానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు. శనివారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనంపై జరిగిన ఉగ్రదాడిలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విక్కీ పహాడే సైనికుడు మరణించగా.. నాలుగురు సైనికులు గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరగనున్న అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పూంఛ్ ఉంది. -
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
జమ్మూ: జమ్మూకశీ్మర్‌లోని పూంఛ్ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్‌టోప్‌లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్‌కోటె పరిధిలోని షాసితార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్్రస్కీన్పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు ఉధమ్‌పూర్‌లోని కమాండ్ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రా్రïÙ్టయ రైఫిల్స్ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్’లో పోస్ట్చేసింది. గత ఏడాది డిసెంబర్ 21న ఇక్కడి దగ్గర్లోని బఫ్లియాజ్లో సైన్యంపై మెరుపుదాడి చేసి నలుగురిని పొట్టనబెట్టుకున్న ఉగ్రముఠాయే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఫూంచ్‌లో గత రెండేళ్లుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. -
army vehicles attacked: దాడి వెనుక పాక్, చైనా
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం ఆర్మీ వాహనాలపై దాడి వెనుక పాక్, చైనాల హస్తముందని రక్షణ శాఖ వర్గాలు అంటున్నాయి. లద్దాఖ్ సరిహద్దుల్లో భారీగా మోహరించిన ఆర్మీని మరోవైపు తరలించేలా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకే ఆ రెండు దేశాలు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నాయి. కశ్మీర్ లోయలో ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో ఉన్న పూంఛ్, రాజౌరీ సెక్టార్లలో భారత ఆర్మీ లక్ష్యంగా ఇటీవల పెరిగిన ఉగ్ర దాడుల ఘటనలకు చైనా, పాకిస్తాన్ల ఉమ్మడి వ్యూహమే కారణమని చెబుతున్నాయి. ఆర్మీపై దాడుల ద్వారా భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఇప్పటికే పూంఛ్ అటవీ ప్రాంతాల్లోకి 25 నుంచి 30 మంది వరకు ఉగ్రవాదులను దొంగచాటుగా పంపించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. కశ్మీర్ వైపు దృష్టి మళ్లించేందుకే.. గల్వాన్ సంక్షోభం అనంతరం భారత్ లద్దాఖ్‌కు భారీగా సైన్యాన్ని తరలించడం చైనాకు రుచించడం లేదు. అందుకే తిరిగి కశ్మీర్ వైపు భారత్ దృష్టిని మళ్లించేందుకే, పాక్‌తో కుమ్మక్కయి పశ్చిమ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రాజేసేందుకు పూనుకుంది. భారత్ 2020లో ప్రత్యేక శిక్షణ పొందిన రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలను పూంఛ్ నుంచి లద్దాఖ్‌కు భారత్ తరలించింది. ఈ చర్యతో ఎంతో కీలకమైన లద్దాఖ్ ప్రాంతంలో చైనాపై భారత్‌దే పైచేయి అయ్యింది. అయితే, అదే సమయంలో పూంఛ్‌లో ఉగ్రవాదులను నిలువరించే వనరులు తక్కువపడ్డాయి. ఈ విషయం గ్రహించిన చైనా పూంఛ్‌లో పాక్‌కు దన్నుగా నిలుస్తూ ఉగ్ర చర్యలకు ఊతమివ్వసాగిందని రక్షణ రంగ నిపుణుడు కల్నల్ మనోజ్ కుమార్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో కడుపుమంట జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుపై చైనా, పాకిస్తాన్‌లు అసంతృప్తితో రగిలిపోతు న్నాయి. అందుకే, కశ్మీర్లో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న పూంఛ్, రాజౌరీల్లో అశాంతిని ప్రేరేపించేందుకు కాచుక్కూర్చు న్నాయని రిటైర్డు కల్నల్ అజయ్ కొథియాల్ చెప్పారు. తాజాగా, సుప్రీంకోర్టు కూడా రద్దు సరైందేనని తీర్పు ఇవ్వడం ఆ రెండు దేశాలకు పుండుమీద కారం చల్లినట్లయిందన్నారు. ఇకపై జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు అవి ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలున్నాయన్నారు. అమెరికా తయారీ రైఫిళ్లు: గురువారం నాటి దాడికి తమదే బాధ్యతంటూ పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరేతోయిబా అనుబంధ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. దాడికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి చేతుల్లో అమెరికా తయారీ అత్యాధునిక ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిళ్లు కూడా కనిపిస్తున్నాయి. గతంలోనూ ఉగ్రవాదులు వీటిని వాడిన దాఖలాలున్నాయి. హెలికాప్టర్లు.. స్నైపర్ డాగ్స్ పూంచ్ జిల్లాలో అయిదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరుల కోసం గాలింపు ముమ్మరమైంది. గురువారం మధ్యాహ్నం సురాన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గలి– బఫ్లియాజ్ మార్గంలో ఉన్న ధట్యార్ మోర్హ్ సమీపంలోని మలుపులో ఎత్తైన కొండపై ఉగ్రవాదులు పొంచి ఉన్నారు. బలగాలతో వెళ్తున్న రెండు వాహనాల వేగం బ్లైండ్ కర్వ్‌లో నెమ్మదించగానే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో అయిదుగురు జవాన్లు నేలకొరగ్గా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ముష్కరులు ఇద్దరు జవాన్ల మృతదేహాలను ఛిద్రం చేయడంతోపాటు వారి వద్ద ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు లేదా నలుగురు ముష్కరులు పాల్గొని ఉంటారని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)అధికారులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన ఉగ్రవాదుల కోసం అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. ఉగ్రవాదుల జాడను పసిగట్టేందుకు స్నైపర్ జాగిలాలను రంగంలోకి దించారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసిన బలగాలు శుక్రవారం ఉదయం నుంచి అణువణువూ శోధిస్తున్నాయి. -
జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం.. వెలుగులోకి కీలక విషయాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సాయుధ ఉగ్రవాదులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. రెండు సైనిక వాహనాలపై మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సురాన్‌కోట్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. గాలింపు చర్యల కోసం వెళ్తున్న సైనిక వాహనాలపై దత్యార్మోర్హ్ వద్ద ముష్కరులు దాడి చేశారు. ఒక ట్రక్కు, మరో జిప్సీపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ యాంటీ–ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. గతంలో కూడా ఈ సంస్థ దాడులకు పాల్పడింది. 2019లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా(ఆర్టికల్ 370) రద్దు చేసిన తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు, పౌరులపై జరిగిన ఉగ్రదాడుల్లో చాలా వరకు పీఏఎఫ్ఎఫ్ చేసినవే. ఈ అటాక్‌లో ఉగ్రవాదులు అమెరికా తయారీ రైఫిళ్లు 4 కార్బైన్‌ను ఉపయోగించారు. దాడికి పాల్పడిన ఆయుధాలతో ఉగ్రవాదులు సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. M4 కార్బైన్ అనేది 1980లలో యూఎస్‌లో అభివృద్ధి చేశారు. గ్యాస్ ఆపరేటెడ్, తేలికపాటి మ్యాగజైన్ ఫెడ్ కార్బైన్. ఇది అమెరికా సాయుధ దళాల ఆయుధం. ప్రస్తుతం దీనిని 80కి పైగా దేశాల్లో వాడుతున్నారు. పలు తీవ్రవాద సంస్థలు ఈ ఆయుధాన్ని వాడుతున్నాయి. వారు దాడులను రికార్డు చేసేందుకు బాడీ కెమెరాలను ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత ఈ వీడియోలను తమ సంస్థను ప్రచారం చేసేందుకు ఉపయోగించుకుంటాయి. ఈ విధంగానే ఈ ఏడాది ఏప్రిల్‌లో పూంచ్‌లో ఆర్మీ ట్రక్కుపై పీఏఎఫ్ఎఫ్ దాడి చేసి వీడియో తీసింది. దాడిలో మరణించిన సైనికుల ఆయుధాలతో ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నట్లు చూపించిన వీడియోను తరువాత విడుదల చేసింది. -
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల కాల్పులు.. ఐదుగురు జవాన్ల వీర మరణం
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఇవాళ ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో ఉగ్రదాడి ఇది. . పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలో ఆర్మీ ట్రక్‌పై మెరుపుదాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారని అధికారులు తెలిపారు. ఆకస్మిక దాడి జరిగిన ప్రాంతానికి ఆర్మీ బలగాలను పంపినట్లు సమాచారం. కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురికి గాయాలుకాగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెలలో రాజౌరీలోని కలాకోట్‌లో సైన్యం ప్రత్యేక బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లతో సహా సైనికులు మరణించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో సైన్యంపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10 మంది సైనికులు మరణించారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో 35 మందికి పైగా సైనికులు మరణించారు. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట
పూంచ్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐదుగురు జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం వేట ముమ్మరం చేసింది. డ్రోన్లు, జాగిలాలతోపాటు హెలికాప్టర్‌తో గాలింపు కొనసాగిస్తోంది. బాటా–డోరియా అటవీ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది జల్లెడ పడుతున్నారు. గాలింపు చర్యలను సైనిక, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించింది. గురువారం ముష్కరుల దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగానికి చెందిన ఐదుగురు చనిపోవడంతోపాటు మరొకరు గాయపడిన సంగతి తెలిసిందే. అమర జవాన్ల మృతదేహాలకు ఉన్నతాధికారులు శుక్రవారం నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను పటిష్టం చేశారు. ముష్కరుల దుశ్చర్యను ఖండిస్తూ బీజేపీ, వీహెచ్‌పీ, రాష్ట్రీయ బజరంగ్ దళ్, శివసన, డోగ్రా ఫ్రంట్, జమ్మూ స్టేట్హుడ్ ఆర్గజనైజేషన్ జమ్మూలో భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్‌నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్‌నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్‌గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్‌పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్‌లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
జమ్మూకాశ్మీర్‌లో విషాదం.. నలుగురు జవాన్లు సజీవదహనం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు సజీవదహనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. జమ్ము-పూంఛ్ రహదారిపై భారత ఆర్మీకి చెందిన వాహనం వెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Indian Army truck catches fire in #Poonch district of Jammu & Kashmir pic.twitter.com/Eg75UdE875 — Swamy (@SwamyJourno) April 20, 2023 -
‘మిఠాయి దౌత్యం’.. స్వీట్లు పంచుకున్న భారత్, పాక్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఇరు దేశాల భద్రతా సిబ్బంది కలిసిపోతారు. ప్రత్యేక దినాల్లో ఇరు సైనికులు స్నేహాభావంతో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. తాజాగా బక్రీద్ పర్వదినం సందర్భంగా దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులు కూడా పండుగ చేసుకున్నారు. ఇరు దేశాల సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని ఆనందంలో మునిగారు. పూంచ్- రావల్కోట్ సరిహద్దు వద్ద ఉన్న భారత్ పాక్ సైనికులు ‘మిఠాయి దౌత్యం’ నిర్వహించారు. ఇటు పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దులో కూడా ఇరు దేశాలు సైనికులు మిఠాయి దౌత్యం చేపట్టారు. ఇక పంజాబ్‌లోని వాఘా సరిహద్దులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. పండుగ సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని మిఠాయి దౌత్యం నిర్వహించామని పూంచ్‌లోని భారత లెఫ్టినెంట్ కమాండర్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద మిఠాయిలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు, పాక్ రెసిడెంట్లు మార్చుకున్నట్లు వివరించారు. ఇలాంటి వాటితో రెండు దేశాల మధ్య స్నేహం, విశ్వాసాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి మిఠాయి దౌత్యం నిర్వహించారు. పూంచ్ జిల్లాలోని సరిహద్దులో మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటున్న ఇరు దేశాల సైనికులు (ఫొటో: హిందూస్తాన్ టైమ్స్) -
పాక్ దుశ్చర్య, కుటుంబంలో పెను విషాదం
శ్రీనగర్: నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గల ఎల్వోసీ సమీపంలో ఉండే ప్రాంతాలు, జనావాసాలపై పాకిస్తాన్ ఆర్మీ శుక్రవారం రాత్రి మోర్టార్ షెల్స్ ప్రయోగించింది. దాంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఖారీ కర్మారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు భారీగా మోర్టార్ షెల్స్ ప్రయోగించడంతో కర్మారా గ్రామంలోని ఇంటిపై ఒక షెల్ పడింది. ఈ దాడిలో మొహద్ రఫీక్ (58), అతని భార్య రఫియా బీ (50), కుమారుడు ఇర్ఫాన్ (15) అక్కడికక్కడే మరణించారు. (చదవండి: ప్రేయసి కోసం నడిచి పాకిస్తాన్‌కు..) అలాగే కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని, మరికొంత మంది గాయపడ్డారని రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఇక తాజా ఘటనపై భారత్ ఆర్మీ స్పందించిందని వారు వెల్లడించారు. పాక్‌కు సరైన గుణపాఠం చెప్పాలని భారత సైన్యానికి ఆదేశిలిచ్చినట్లు రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు .కాగా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ పర్యటనకు ఒకరోజు ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. పాకిస్తాన్‌తో ఉన్న ఎల్వోసీ వెంట పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన శనివారం అక్కడ పర్యటించనున్నారు. జూన్ నెలలో పాక్ 411 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు సమాచారం. (నెటిజనుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్) -
సరిహద్దులో పాక్ కాల్పులు
పూంచ్(జమ్మూ కశ్మీర్) : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తుట్లు పొడిచింది. సరిహద్దుల్లో శాంతి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. దాయాది దేశం మాత్రం ఎప్పటిలానే తన బుద్ధిని ప్రదర్శించింది. గురువారం పూంచ్ జిల్లాలోని కృష్ణా ఘాటీ సెక్టార్ నంగి టేక్రీ ప్రాంతంలో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అయితే వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యదినోత్సవం రోజున ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న పాక్‌కు సరైన రీతిలో బదులు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే ఇలాంటి ఘటనలను భారత్ చూస్తూ ఊరుకోదని పాక్‌ను హెచ్చరించారు. -
సరిహద్దు దాటాడు.. మిఠాయి ఇచ్చి పంపారు
నగ్రోటా, జమ్మూ కశ్మీర్ : కెనడా యువతి ఒకరు బీచ్‌లో జాగింగ్ చేస్తూ అనుకోకుండా దేశ సరిహద్దులను దాటి అమెరికాలో ప్రవేశించిన వార్తను ఈ మధ్యే చూశాం. ఇలాంటిదే మరో సంఘటన ఇప్పుడు మన దేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)కు చెందిన 11 ఏళ్ల మహ్మద్ అబ్దుల్లా అనే కుర్రాడు ఈ నెల 24న పొరపాటున జమ్మూకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో ప్రవేశించాడు. బాలుడిని గమనించిన స్థానికులు వివరాలు తెలుసుకుని అదే రోజున అతన్ని జమ్మూ కశ్మీర్ పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు మహ్మద్‌ను తిరిగి అతని స్వస్థలానికి పంపించడానికి అవసరమైన లాంఛనాలను పూర్తి చేసి కొత్త బట్టలు, మిఠాయిలు ఇచ్చి మరీ మహ్మద్‌ను అతని సొంత ఊరికి పంపించారు అధికారులు. ఈ విషయం గురించి మాట్లాడిన డిఫెన్స్ అధికారి ఒకరు ‘భారత సైన్యం విలువలకు కట్టుబడి ఉంటుంది. అమాయకుల పట్ల మేం జాగ్రత్తగా వ్యవహరిస్తాం. అతను పెరిగి పెద్దవాడవుతున్న క్రమంలో భారత్-పాక్ సంబంధాల గురించి మంచిగానే ఆలోచించాలి. భారత్ అంటే నమ్మకం కలగాలి. అందుకే మానవతా దృష్టితో మేం మహ్మద్‌ను తిరిగి పంపించాం’ అన్నారు. -
ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం
-
ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్-లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు బుధవారం ప్రయత్నించారు. ఆ విషయాన్ని గమనించిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. దీంతో సదరు ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. -
జమ్మూలో మళ్లీ కాల్పుల మోత
-
జమ్మూలో మళ్లీ కాల్పుల మోత
జమ్మూ: జమ్మూకశ్మీర్ మళ్లీ కాల్పుల మోతతో హోరెత్తుతోంది. పూంచ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతోన్నాయి. నిన్న ఉగ్రవాదులు పూంచ్‌లోని మినీ సెక్రటేరియట్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. అదే ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఇక నిన్న జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరణించినవారిలో ముగ్గురు ఉగ్రవాదాలు కాగా, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. ఎదురు కాల్పుల్లో మరో అయిదుగురు గాయపడ్డారు. వారిలో ఓ పోలీస్ అధికారితో పాటు, ముగ్గురు జవాన్లు, ఓ సాధారణ వ్యక్తి ఉన్నారు. ఇక పూంచ్‌లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. -
ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం
జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్-లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు గురువారం ప్రయత్నించారు. ఆ విషయన్ని గమనించిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. దీంతో సదరు ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఈ మేరకు భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. -
సరిహద్దులో కాల్పుల మోత
శ్రీనగర్: భారత్- పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దయిన తర్వాత కొద్దిరోజుల విరామం అనంతరం పాక్ రేంజర్లు మళ్లీ రెచ్చిపోయారు. కశ్మీర్ సరిహద్దులోని పూంఛ్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్విరామంగా కాల్పులు జరుపుతున్నారు. సోమవారం ఉదయం వరకు తుపాకుల మోత కోనసాగుతూనే ఉన్నది. బీఎస్ఎఫ్ జవాన్లు కూడా ఎదురుకాల్పులతో పాక్ బలగాలకు బుద్ధిచెప్పేపనిలో ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
'హద్దు'లేని పాకిస్థాన్ కాల్పులు
జమ్మూ: ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పాకిస్థాన్ వైఖరిలో మార్పు రావడం లేదు. దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 'హద్దు' మీరి కవ్వింపులకు పాల్పడుతోంది. సరిహద్దు వెంబడి కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని సాజియాన్, మండీ సెక్టార్లపై పాకిస్థాన్ బలగాలు కాల్పులకు దిగాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి కాల్పులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కాల్పులు సాగించిందని భారత రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. 120, 80 ఎంఎం మోర్టార్లు, భారీ మెషీన్ గన్లతో దాడికి దిగిందని వెల్లడించారు. పాక్ బలగాల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. మన సైనికులు ఎవరూ గాయపడలేదని చెప్పారు. సరిహద్దు వెంబడి శని, ఆదివారాల్లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు భారత పౌరులు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) అనిల్ వాధ్వా.. ఆదివారం ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించుకుని తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు. -
జమ్ముకాశ్మీర్‌లో పాక్ కాల్పులు.. ముగ్గురి మృతి
శ్రీనగర్: పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్‌లో ముగ్గురు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. పాక్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు దిగింది. శనివారం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులో కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా సరిహద్దులో పాక్ బలగాలు శనివారం కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. పాక్ భద్రతా బలగాలు మూడుసార్లు కాల్పులకు దిగాయని వెల్లడించింది. ఈ కాల్పుల్లో నలుగురు సామాన్యులు గాయపడినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సరిహద్దులో రెండుసార్లు పాక్ కాల్పులు
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దులో కాల్పులకు తెగబడింది. జమ్మూకశ్మీర్ లోని పూంచ్ జిల్లా కృష్ణగాటి సెక్టార్ వద్ద పాక్ బలగాలు సోమవారం కాల్పులు జరిపాయని భారత్ ఆర్మీ తెలిపింది. పాక్ భద్రతా బలగాలు రెండుసార్లు కాల్పులకు దిగాయని వెల్లడించింది. కాల్పుల్లో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. -
మరోసారి కాల్పులకు తెగబడిన పాక్
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ పూంఛ్ జిల్లాలోని బాలాకొట్ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. గత రాత్రి 8.30 ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని చెప్పారు. దాదాపు గంటపైగా ఇరువైపులా కాల్పులు జరిపుకున్నాయని మెహతా వివరించారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలిపారు.