సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది.
జమ్ము: సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో అధీన రేఖవద్ద పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు వుహిళలు సహా ఆరుగురు పౌరులు గాయుపడ్డారు. పాక్ కాల్పులను భారత్ సైన్యం దీటుగా ప్రతిఘటించిందని సైన్యం అధికారులు తెలిపారు. కాల్పుల్లో గాయుపడిన ఒక మహిళ పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నారు.
పూంచ్ సెక్టార్‌లోని సబ్జియూన్, మండీ ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం చిన్నతరహా ఆయుధాలు, మోర్టార్ బాంబులతో బుధవారం సాయుంత్రం నుంచి అర్థరాత్రి వరకూ నిరంతరాయంగా కాల్పులు జరిపిందని, కాల్పుల్లో ఆరుగురు పౌరులు గాయుపడ్డారని, ఆరు ఇళ్లు దెబ్బతిన్నాయుని భారత సైన్యాధికారి ఒకరు చెప్పారు. పాక్ కాల్పుల్లో భారత సైనికులు ఎవరూ గాయపడలేదని తెలిపారు.
***