హమీర్పూర్ వద్ద పాక్ సైన్యం కాల్పులు | Pakistan Army again violates ceasefire on Line of Control | Sakshi
Sakshi News home page

హమీర్పూర్ వద్ద పాక్ సైన్యం కాల్పులు

Published Sat, Oct 18 2014 8:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

Pakistan Army again violates ceasefire on Line of Control

జమ్మూ: పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని హమీర్పూర్ సెక్టార్ సమీపంలో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత శిబిరాలే లక్ష్యంగా పాక్ జరిపిన కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టిందని రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదని తెలిపారు. 

గత మూడు రోజులుగా హమీర్పూర్ ప్రాంతంలో వరుసగా కాల్పులకు పాక్ సైన్యం తెగబడుతుందని చెప్పారు. అక్టోబర్ 6వ తేదీన భారత్ సరిహద్దు వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా, 62 మంది గాయపడిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement