
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేని పాకిస్తాన్ కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తోంది. వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. సరిహద్దు వెంబడి మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్‌బానీ ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో కాల్పుల విరమణ ఉల్లంఘానికి తూట్లు పొడుస్తూ పాక్ సైన్యాలు భారీ షెల్స్‌ను ప్రయోగిస్తూ కాల్పులు జరిపాయి. దీన్ని భారత సైన్యం భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో కాల్పులను ఆపివేశారు. ఈ దాడిలో భారత జవానుకు బుల్లెట్ తగిలి గాయాలపాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment