Pakistan Army
-
Kargil War: ఎట్టకేలకు అంగీకరించిన పాక్
కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు ఎట్టకేలకు దాయాది దేశం పాక్ అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ సైన్యాధిపతి బహిరంగ ప్రకటన చేశారు. దీంతో.. పాతికేళ్ల తర్వాత పాక్ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్లయ్యింది.శుక్రవారం రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో పాక్ డిఫెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగిస్తూ.. ‘‘భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.Pakistan Acknowledges Role in 1999 Kargil War for the First Time#DY365 #Pakistan #KargilWar pic.twitter.com/pW6JcCNqQO— DY365 (@DY365) September 7, 20241999 మే-జులై మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన శత్రుసేనలు.. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. కౌంటర్‌గా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ విజయ్’ పెట్టింది. ఈ ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్.. తోకముడుచుకుని పారిపోయింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించగా.. అప్పటి నుంచి ఆ తేదీన కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం.అయితే.. ఈ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ చెబుతూ స్న్నేతోంది. ముజాహిదీన్ ఫైటర్లు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పాట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్‌లో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని చెప్పారు. ఆ ఆపరేషన్‌ను ‘ఫోర్ మ్యాన్ షో’ అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) షాహిద్ అజీజ్ అభివర్ణించారు. అయితే పాక్ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. తాజా ప్రకటనతో.. పాక్ ఓటమి గుట్టు బట్టబయలైంది.సంబంధిత వార్త: గెలవలేని యుద్ధం చేసిన పాక్ -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. గత ఏడాది మే నెలలో సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించిన 12 కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ సహా పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీలకు ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ వర్గీయులైన స్వతంత్ర అభ్యర్థులు ఎక్కవ మంది గెలిచిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో అప్పట్లో నిరసనలు చెలరేగాయి. ఆ హింసాత్మక ఘటనల్లో రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంతో సహా 20కి పైగా సైనిక స్థావరాలు, రాష్ట్ర భవనాలు దెబ్బతిన్నాయి. ఈ నిరసనలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టు పదేళ్ల జేలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీకి కూడా కోర్టు పదేళ్ల జైలు శిక్షవిధించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 8న పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ వర్గీయులకు ఊహించని ప్రజా మద్దతు లభించింది. మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి. ఇదీ చదవండి: Pakistan Elections 2024: ‘పాక్’ ఫలితాల మధ్య ఇమ్రాన్ ‘విక్టరీ స్పీచ్’ -
పాక్ కౌంటింగ్ వేళ.. ట్విస్టులు, ఝలక్‌లు!!
పాకిస్థాన్‌లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ.. అయోమయం, గందరగోళం నెలకొంది. అక్కడ హింస చెలరేగినట్లు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున్న ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (PTI) పార్టీని పోటీ చేయకుండా.. కనీసం గుర్తు క్రికెట్ బ్యాట్‌ను వినియోగించకుండా అక్కడి ఎన్నికల సంఘం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన ఖాన్ మద్దతుదారులు.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటున్నట్లు సమాచారం. ఫలితాల ప్రకటనలో జాప్యం.. ఫలితాల తారుమారు చేసేందుకేనంటూ పీటీఐ ఆందోళనకు దిగగా.. ఆందోళనకారులపై ఆర్మీ, అక్కడి పోలీసు బలగాలు దాడులకు తెగబడినట్లు ప్రచారం నడుస్తోంది. కాల్పుల్లో పలువురు మరణించినట్లు.. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు ఫొటోలు, వీడియోల్ని వైరల్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఆర్మీ రిగ్గింగ్‌కు దిగిందంటూ కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. పాకిస్థాన్ ఎన్నికల సంఘం మాత్రం ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొందరు మాత్రం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ వెనుకంజలో ఉందని(షరీఫ్ మాత్రం గెలిచారు).. ఖాన్ మద్దతుదారులు విజయ దుందుభి మోగిస్తున్నట్లు పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అయితే పీఎంఎల్-ఎన్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. షరీఫ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమంటూ ఆయన వర్గీయులు ప్రచారానికి దిగగా.. ఇమ్రాన్ ఖాన్ పేరిట ఎన్నికల్లో నెగ్గుతున్న అభ్యర్థులు సైతం తమకే మద్దతు ఇస్తారంటూ పీఎంఎల్-ఎన్ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. Social media is flooded with hundreds of such rigging videos. What other evidence could there be than a present on-duty police officer involved in rigging? #ElectionResultspic.twitter.com/eps8QWQ9WX — Usama Butt 🇵🇰 🇬🇧 (@OsamaAhmedButt) February 9, 2024 పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇప్పటికే సగానికిపైగా సీట్లు సాధించినట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. I have never seen visuals like these in Bahawalpur in my whole life - not even on 9th May.#ElectionResults pic.twitter.com/yU0fumVsEM — نورالہدی 🇵🇰 (@raqsyjunoon) February 9, 2024 ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లో గురువారం సాయంత్రం ఎన్నికలు ముగియగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని (Pak Poll Results) ప్రకటించారు. పీటీఐ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి సమియుల్లా ఖాన్ గెలుపొందినట్లు ఈసీపీ ప్రత్యేక కార్యదర్శి జాఫర్ ఇక్బాల్ మీడియాకు వెల్లడించారు. అయితే.. ఆ తర్వాత ఏం ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. یہ توقع نہیں تھی کہ ہماری فوجی جوان اس ناکارہ عمل کا کھلم کھلا حصہ بنے گے pic.twitter.com/sp8yWUuyfC — Sabir Shakir ARY 𝓯𝓪𝓷𝓼 (@ARYSabiirShakir) February 9, 2024 కొన్ని గంటల తర్వాత తిరిగి ప్రకటించడం ప్రారంభించారు. అయితే.. ‘ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్థాన్ (ECP)’ కావాలనే ఫలితాలను ఆలస్యం చేస్తోందని పీటీఐ ఆరోపించింది. మరోవైపు జాప్యంపై పాక్ హోంశాఖ వివరణ ఇచ్చింది. భద్రతా కారణాలు, కమ్యూనికేషన్ లోపం కారణంగానే ఫలితాలు ఆలస్యమవుతున్నాయని తెలిపింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు గురువారం ఉదయం 8 గంటల నుంచి పాక్ కేర్‌టేకర్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని ఇంకా పునరుద్ధరించకపోగా.. కొందరు మాత్రం పాక్‌లో ఇదీ పరిస్థితి అంటూ నెట్లో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. -
సైన్యం పడగ నీడన... పాక్‌లో ఎన్నికలకు వేళాయె
అది 2018. పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమయం. సైన్యం ఆగ్రహానికి గురై అవినీతి కేసుల్లో దోషిగా తేలడంతో నవాజ్ షరీఫ్ అప్పటికి ఏడాది క్రితమే ప్రధాని పదవి పోగొట్టుకున్నారు. జైల్లో మగ్గుతున్నందున ఎన్నికల్లో పోటీకీ దూరమయ్యారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ఖాన్ సైన్యం ఆశీస్సులతో ఎన్నికల్లో నెగ్గి ఏకంగా ప్రధాని పీఠమెక్కారు. ఆరేళ్లు గడిచి పాక్ మళ్లీ సాధారణ ఎన్నికల ముంగిట నిలిచేనాటికి ఈ ఇద్దరు మాజీ ప్రధానుల విషయంలో ఓడలు బళ్లు, బళ్లు ఓడలూ అయ్యాయి. సైన్యం కన్నెర్రతో ఇమ్రాన్ పదవి పోగొట్టుకోవడమే గాక అవినీతి కేసుల్లో జైలుపాలయ్యారు. శిక్షల మీద శిక్షలు అనుభవిస్తూ ఎన్నికలకు దూరమయ్యారు. పార్టీకి కనీసం ఎన్నికల గుర్తు కూడా దక్కని దుస్థితి నెలకొంది! చికిత్స పేరుతో ఆరేళ్ల కింద లండన్ చేరి బతుకు జీవుడా అంటూ ప్రవాసంలో కాలం వెళ్లదీసిన నవాజ్ మళ్లీ సైన్యం దన్నుతో దర్జాగా స్వదేశాగమనం చేశారు. సైన్యం స్క్రిప్టులో భాగంగా అవినీతి కేసులన్నీ కొట్టుకుపోయి నాలుగోసారి ప్రధాని అయ్యేందుకు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇలా దశాబ్దాలుగా పాక్‌లో నేతల భాగ్యరేఖలను ఇష్టానికి నిర్దేశిస్తూ వస్తున్న సైన్యం కనుసన్నల్లో ఎప్పట్లాగే మరో ఎన్నికల తంతుకు సర్వం సిద్ధమవుతోంది... ఏ పౌర ప్రభుత్వమూ పూర్తి పదవీకాలం మనుగడ సాగించని చరిత్ర పాక్ సొంతం. చాలాకాలం పాటు ప్రత్యక్షంగా, మిగతా సమయంలో పరోక్షంగా సైనిక నియంతృత్వపు పడగ నీడలోనే ఆ దేశంలో పాలన సాగుతూ వస్తోంది. అలాంటి దేశంలో సైనిక పాలన ఊసు లేకుండా వరుసగా మూడోసారి సాధారణ ఎన్నికలు జరగబోతుండటం విశేషం! ఇలా జరగడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న పోలింగ్‌కు సర్వం సిద్ధమవుతోంది. ఎప్పటి మాదిరే ఈసారి కూడా ఏయే పార్టీలు పోటీ చేయాలో, వాటి తరఫున ఎక్కణ్నుంచి ఎవరు బరిలో ఉండాలో కూడా సైన్యమే నిర్దేశిస్తూ వస్తోంది. దేశ ఆర్థికంగా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ ఆకాశాన్నంటుతూ ప్రజల బతుకే దుర్భరంగా మారిన వేళ జరుగుతున్న ఎన్నికలివి. అక్కడ ఏ ఎన్నికలూ వివాదరహితంగా జరగలేదు. కానీ ఈసారి మాత్రం అవి పరాకాష్టకు చేరాయి. నిజానికి గత నవంబర్‌లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సింది. జనగణనను కారణంగా చూపి ఫిబ్రవరి దాకా వాయిదా వేశారు. నవాజ్ స్వీయ ప్రవాసం నుంచి తిరిగొచ్చి కాలూచేయీ కూడదీసుకుని బరిలో దిగేందుకు వీలుగానే ఇలా చేశారన్న ఆరోపణలున్నాయి. ఏదెలా ఉన్నా కనీసం ఈసారన్న కాస్త సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నది సగటు పాక్ పౌరుల ఆశ. అమెరికాతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి అవసరమైన ఆర్థిక సాయం రాబట్టి అవ్యవస్థను చక్కదిద్దడంతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న భారత్‌తో సంబంధాలను మెరుగు పరుచుకోవాలన్నది వారి ఆకాంక్ష. కానీ సర్వం సైన్యం కనుసన్నల్లో సాగుతున్న తీరును బట్టి చూస్తే ఈసారీ అది అత్యాశే అయ్యేలా కనిపిస్తోంది. నవాజ్ షరీఫ్ పాక్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు 74 ఏళ్ల నవాజ్ సొంతం. భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిచ్చే నేతగానూ పేరుంది. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడని కూడా చెబుతారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) సారథిగా మూడోసారి ప్రధానిగా ఉండగా 2017లో పనామా పేపర్స్, లండన్ అపార్ట్మెంట్స్ వంటి నానారకాల కేసుల్లో ఇరుక్కున్నారు. పదవి పోగొట్టుకుని జైలుపాలై ప్రాణ భయంతో లండన్ పారిపోయారు. అనంతరం పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌కూ నాలుగేళ్లలోపే అదే గతి పట్టింది. 2022లో నవాజ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవడంతో నవాజ్‌కు మంచి రోజులు తిరిగొచ్చాయి. గత అక్టోబర్‌లో ఆయన తిరిగొచ్చి పీఎంఎల్ (ఎన్) పగ్గాలు చేపట్టడం, సైన్యంతో పాటు న్యాయ వ్యవస్థ దన్నూ తోడై ఆయనపై అవినీతి కేసులు, శిక్షలూ ఒక్కొక్కటిగా రద్దవడం చకచకా జరిగిపోయాయి. అడ్డంకులన్నీ తొలిగి ఎన్నికల బరిలో నిలిచిన నవాజ్ నాలుగోసారి ప్రధాని కావడం ఖాయమేనంటున్నారు. ఇమ్రాన్‌ఖాన్ అనితరసాధ్యమైన క్రికెట్ నైపుణ్యంతో పాక్ ప్రజలను ఉర్రూతలూగించి నేషనల్ హీరోగా వెలుగు వెలిగిన 71 ఇమ్రాన్ రాజకీయ పిచ్‌పై మాత్రం నిలదొక్కుకోలేక చతికిలపడ్డారు. అవినీతిని రూపుమాపి, కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి సర్వం చక్కదిద్దుతానంటూ మార్పు నినాదంతో 2018లో ప్రధాని అయ్యారాయన. కానీ ఇమ్రాన్ హయాంలో ఆర్థికంగానే గాక అన్ని రంగాల్లోనూ దేశం కుప్పకూలింది. హింసతో, అశాంతితో పాక్ అట్టుడికిపోయింది. ఆయనకు ఆదరణా అడుగంటింది. నిజానికి సైన్యం చేతిలో పావుగానే ఇమ్రాన్ రాజకీయ ప్రవేశం జరిగిందంటారు. అలాంటి సైన్యానికే ఎదురు తిరగడంతో ఇమ్రాన్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఎంత ప్రయతి్నంచినా పదవిని కాపాడుకోలేకపోయారు. పైగా జైలు శిక్ష వల్ల తాను పోటీ చేసే అవకాశం లేదు. ఆయన పార్టీ తరఫున కొందరు ధైర్యం చేసి ఇండిపెండెంట్లుగా బరిలో దిగుతున్నా చాలామంది జైలుపాలయ్యారు. పలువురు ఫిరాయించగా మిగిలిన వారు అజ్ఞతంలోకి వెళ్లిపోయారు. ఈ సమస్యలు చాలవన్నట్టు పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌పైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. దాంతో లక్షలాది మంది నిరక్షరాస్య ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై ఇమ్రాన్ పార్టీని గుర్తించను కూడా లేరంటున్నారు. బిలావల్ భుట్టో 35 ఏళ్ల బిలావల్ భుట్టో జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్. దారుణ హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కుమారుడు. షహబాజ్ షరీఫ్ సర్కారులో విదేశాంగ మంత్రిగా తన పనితీరుతో స్వదేశంలో విమర్శలపాలు, భారత్‌లో నవ్వులపాలయ్యారు. గత ఎన్నికల్లో పీపీపీ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి అన్నీ కలిసొస్తే బహుశా కింగ్‌మేకర్ అవ్వొచ్చంటున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులుంటారు. 266 మందిని నేరుగా ఉన్నుకుంటారు. 70 సీట్లను మహిళలు, మతపరమైన మైనారిటీలకు; ఆరింటిని గిరిజన ప్రాంతాల వారికి రిజర్వు చేశారు. ఈ స్థానాలను పార్టీలకు గెలుచుకున్న స్థానాలను బట్టి నైష్పత్తిక ప్రాతిపదికన కేటాయిస్తారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ ఆర్మీ పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి
పెషావర్: పాకిస్తాన్లో తాలిబన్ ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. ఆర్మీ పోస్టుపై వెంటవెంటనే జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 23 మంది సైనికులు మృతి చెందారు. ఈ ఘటన ఖైబర్ పంక్తున్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం దారాబన్ ఏరియాలోని ఆర్మీ కార్యాలయంలోకి కొందరు ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆర్మీ వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో వేగంగా వచ్చి గేటును ఢీకొట్టారు. అనంతరం మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రెండు దాడుల్లో ఆర్మీ కార్యాలయ భవనం కుప్పకూలింది. అనంతరం ఆర్మీకి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది సైనికులు చనిపోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఈ ఆత్మాహుతి దాడులకు తమదే బాధ్యతంటూ తెహ్రీక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)అనుబంధంగా కొత్తగా ఏర్పడ్డ తెహ్రీక్–ఇ–జిహాద్ పాకిస్తాన్(టీజేపీ)ప్రకటించుకుంది. ఇలా ఉండగా, ఇదే జిల్లాలోని దారాజిందా, కులాచి ప్రాంతాల్లో సైన్యం జరిపిన దాడుల్లో 21 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ తెలిపింది. ఇద్దరు సైనికులు కూడా చనిపోయినట్లు పేర్కొంది. -
పాక్ కాల్పులతో పెళ్లిళ్లకు చిక్కులు
శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న విచక్షణారహిత కాల్పులతో జమ్మూలోని పలు గ్రామాల్లో పెళ్లిళ్లకు చిక్కులొచ్చి పడ్డాయి. దాంతో చివరి నిమిషంలో పలు పెళ్లిళ్లకు వేదికను మార్చుకోవాల్సి రావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. భారీ కాల్పుల దెబ్బకు అతిథులు పెళ్లి విందు మధ్య నుంచే అర్ధంతరంగా నిష్క్రమిస్తున్న ఉదంతాలూ చోటుచేసుకుంటున్నాయి. పాక్ రేంజర్లు ఇలా కాల్పులకు తెగబడటం 2021 కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచీ అరి్నయా తదితర ప్రాంతాలపై కాల్పులు ఏడు గంటలకు పైగా కొనసాగాయి. మరోవైపు వరి కోతల వేళ కాల్పులకు భయపడి కూలీలెవరూ పొలాలకు కూడా వెళ్లడం లేదు. బంకర్లోనే పాఠాలు! కాల్పుల భయంతో జమ్మూ జిల్లాలో పలు స్థానిక స్కూళ్లు మూతబడ్డాయి. అయితే సరిహద్దుకు సమీపంలోని షోగ్పూర్లో ఉన్న సర్కారీ పాఠశాల మాత్రం శుక్రవారం భూగర్భ బంకర్లలో నడిచింది! తమ ఇంట్లోవాళ్లు భయపడ్డా తాను మాత్రం స్కూలుకు హాజరయ్యానని సునీతా కుమారి అనే విద్యారి్థని చెప్పింది. ఆమెతో పాటు దాదాపు 20 మంది విద్యార్థులు స్కూల్లోని బంకర్లో పాఠాలు విన్నారు. -
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్‌కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్‌హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
విపత్తు దిశగా పాక్.. పిరికిపందల్లా పారిపోను: ఇమ్రాన్ ఖాన్
లాహోర్: పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పీటీఐ(తెహ్రీక్ ఎ ఇన్సాఫ్) అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గతంలో మాదిరి మిగతా రాజకీయ నేతల్లా తాను దేశం విడిచి వెళ్లనని, చివరిశ్వాస వరకు ఇదే గడ్డ మీద ఉంటానని గురువారం తన సందేశంలో పేర్కొన్నారు. పాకిస్థాన్ విపత్తు దిశగా వెళ్తోందన్న ఇమ్రాన్ ఖాన్.. తూర్పు పాకిస్తాన్ మాదిరి దేశం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన పార్టీకి, ఆర్మీకి మధ్య ఘర్షణ వాతావరణం తెచ్చేందుకు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. తాను ఆర్మీని విమర్శించానంటే తన పిల్లలను మందలించినట్లుగా భావించాలన్నారు. పాక్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతను తొలగించేందుకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని చెప్పారు. తాను ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లేది లేదని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటానన్నారు. ఇక్కడి నుండి పరారై లండన్ లో ఉన్న నవాజ్ షరీఫ్ వంటి నేతలు ఈ దేశ రాజ్యాంగం గురించి ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవస్థలు, పాక్ ఆర్మీకి వస్తోన్న చెడ్డపేరు గురించి వారికి ఆలోచన ఉందా? అని నిలదీశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ నివాసాన్ని చుట్టుముట్టిన పారామిలిటరీ దళాలు, పోలీస్ బలగాలు.. ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ సుప్రీం కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టులు ఇమ్రాన్ ఖాన్‌కు ఇచ్చిన ఊరట ఆదేశాలను సైతం పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క పాక్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. పీటీఐ కార్యకర్తల ఆగడాలను భరించేది లేదని ఆర్మీ ఛీప్ ప్రకటించారు కూడా. -
కారు అద్దాలు బద్దలు కొట్టి, కాలర్ పట్టుకొని లాక్కెళ్లి.. ఇమ్రాన్ అరెస్టు
ఇస్లామాబాద్/లాహోర్: అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్(70)ను పారామిలటరీ రేంజర్లు మంగళవారం అరెస్టు చేశారు. ఇదే కేసులో ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు హాజరైన ఆయనను న్యాయస్థానం ఎదుటే అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు పాకిస్తాన్ సైన్యం కుట్ర పన్నుతోందంటూ ఆరోపించిన మరుసటి రోజే ఇమ్రాన్‌ను అరెస్టు చేయడం గమనార్హం. కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. కోర్టులో ప్రవేశించేందుకు తన వాహనంలో కూర్చొని బయోమెట్రిక్ ప్రక్రియ నిర్వహిస్తుండగా పారామిలటరీ రేంజర్లు రంగప్రవేశం చేశారు. వాహనం గ్లాస్ డోర్‌ను పగులగొట్టి, ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ భద్రతా సిబ్బందిని, లాయర్లను రేంజర్లు దారుణంగా కొట్టారని పీటీఐ సీనియర్ నేత షిరీన్ మజారీ ఆరోపించారు. ఇమ్రాన్ పట్ల రేంజర్లు అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వా రా వెల్లడయ్యింది. కాలర్ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లి, జైలు వ్యాన్‌లోకి విసిరేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 1న అరెస్టు వారెంట్ ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి చెందిన అల్–ఖదీర్ ట్రస్టుకు బాహ్రియా పట్టణంలో రూ.53 కోట్ల విలువైన భూమిని బదిలీ చేసిన కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు ఇస్లామాబాద్ పోలీసులు ప్రకటించారు. మంగళవారం ఉదయమే అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆయనను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్ఏబీ)కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇమ్రాన్ అరెస్టు వారెంట్‌ను ఈ నెల 1న జారీ చేసినట్లు దానిపై ఉన్న తేదీని బట్టి తెలుస్తోంది. అవినీతి వ్యవహారాల్లో ఆయన నిందితుడని అందులో పేర్కొన్నారు. అరెస్టు తర్వాత ఇమ్రాన్‌ను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా ట్విట్టర్లో వెల్లడించారు. ఇమ్రాన్‌ను హింసించారంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాలేదని, అందుకే ఎన్ఏబీ ఆ యనను అదుపులోకి తీసుకుందని తెలియజేశారు. ఇమ్రాన్ వాహనం అద్దాలు పగులగొట్టి ఆయనను అదుపులోకి తీసుకుంటున్న పారామిలటరీ రేంజర్లు. అనంతరం బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న దృశ్యం Imran Khan’s lawyer badly injured inside the premises of IHC. Black day for our democracy and country. pic.twitter.com/iQ8xWsXln7 — PTI (@PTIofficial) May 9, 2023 140కి పైగా కేసులు ఇమ్రాన్ అరెస్టు పట్ల పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రాంగణంలోనే లాయర్లపై రేంజర్లు దాడి చేశారని, దేశంలో అరాచకం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. కస్టడీలో ఉన్న ఇమ్రాన్‌ను దారుణంగా హింసిస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇమ్రాన్ పదవి కోల్పోయారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అవినీతి, ఉగ్రవాదం, దైవదూషణ, హత్య, హింసకు ప్రేరేపించడం వంటి ఆరోపణల కింద ఇమ్రాన్‌పై 140కిపైగా కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ అరెస్టు నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జైలుకు వెళ్లడానికి సిద్ధం: ఇమ్రాన్ ఇమ్రాన్ అరెస్టయిన తర్వాత.. ముందుగా రికార్డు చేసిన ఓ వీడియోను పీటీఐ విడుదల చేసింది. ‘‘నా మాటలు మీకు చేరుకునేలోపు ఎలాంటి ఆధారాల్లేని కేసులో నన్ను అరెస్టు చేస్తారు. పాకిస్తాన్లో ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యానికి సమాధి కట్టినట్లు దీనిద్వారా తేటతెల్లమవుతుంది. అవినీతికి పాల్పడినట్లు నేను అంగీకరించాలని వారు(పాక్ పాలకులు) కోరుకుంటున్నారు. దిగుమతి అయిన ప్రభుత్వాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దారు. వారెంట్ ఉంటే నన్ను అరెస్టు చేసుకోండి. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా’’ అని ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ అనుచరుల విధ్వంసం పాకిస్తాన్లో అవాంఛనీయ దృశ్యాలు కనిపించాయి. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పీటీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు వీధుల్లోకి వచ్చారు. విధ్వంసానికి పాల్పడ్డారు. రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన గేటును ధ్వంసం చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ప్రధాన గేటును ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి. లాహోర్‌లో సైనిక కమాండర్ నివాసాన్ని సైతం నిరసనకారులు దిగ్బంధించారు. సైనిక కంటోన్మెంట్లో గుమికూడి నినాదాలు చేశారు. రహదారులపై బైఠాయించడంతో లాహోర్ నుంచి చాలాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇమ్రాన్ అరెస్టు వార్తా ఉదయమే దావానలంగా వ్యాపించింది. వెంటనే ఆయన అనుచరులు వివిధ నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇమ్రాన్‌ను పారామిలటరీ రేంజర్లు శారీరకంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని నినదించారు. నిరసనలు హింసాత్మకంగా మారాయి. పెషావర్, కరాచీ, హైదరాబాద్, క్వెట్టా తదితర ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పింది. భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి, ఇమ్రాన్ మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చదవండి: 150 కిలోల పేలుడు పదార్థాలు.. క్షణాల్లో నేలమట్టమైన బ్రిడ్జి.. వీడియో వైరల్ LIVE: Former Pakistan Prime Minister Imran Khan Arrested Live Updates Read @ANI | https://t.co/KTWAOqwf83#ImranKhan #ImranKhanArrested #Pakistan pic.twitter.com/R8Y8PZC3kk— ANI Digital (@ani_digital) May 9, 2023 -
భారత ఆర్మీతో పోలికా! అంత సీన్ లేదు.. కుండ బద్దలు కొట్టిన పాక్ ఆర్మీ మాజీ చీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ కమర్ జావెద్ బద్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత సైన్యం సత్తాపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. భారత్ సైన్యంతో పారాడే శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తి పాకిస్తాన్ ఆర్మీకి లేదని కుండబద్దలు కొట్టారు. బ్రిటన్‌లోని పాకిస్తాన్ మీడియా జర్నలిస్టులు హమీద్ మీర్, నజీం జెహ్రాలకు ఇచ్చిన ఇంటర్వూలో జావెద్ ఈ వాఖ్యలు చేశారు. 'భారత ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సరితూగలేదు. భారత్‌తో పాక్ యుద్ధం చేసే పరిస్థితి లేదు. ట్యాంకులు కూడా పనిచేయడం లేదు. ఫిరంగులను తరలించడానికి డీజిల్ కూడా లేదు' అని బజ్వా తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ఆ దేశ సైనిక సామర్థ్యాలపై ప్రశ్నలు లేవెనత్తేలా, సైన్యం నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయి. ఏదేమైనా ఆయన చెప్పిన దాంట్లో మాత్రం వాస్తవం ఉంది. భారత సైన్యం వీరపరక్రమాల ముందు పాక్ సైన్యం సరితూగదని జగమెరిగిన సత్యం. పాకిస్తాన్ కమాండర్స్ సదస్సులోనే బజ్వా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో పాకిస్తాన్ శుత్రుత్వం పెంచుకోకుండా స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపరుచుకుంటేనే మంచిదని ఆయన అన్నారు. భారత్‌తో సుదీర్ఘ విరోధం పాకిస్తాన్‌ను హరించివేస్తుందని పేర్కొన్నారు. భారత్‌తో పోరాడేందుకు అవసరమైన ఆయుద సంపద, ఆర్థిక బలం పాకిస్తాన్‌కు లేవని, అందుకే కశ్మీర్ సమస్యపై ఇరుదేశాలు శాశ్వత పరిష్కారానికి వచ్చే విషయంపై ఆలోచిస్తున్నట్లు కూడా బజ్వా పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ సంక్షోభంతో ప్రజల జీవితాలు దుర్బరంగా మారాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి, ఉద్యోగాలు పోయి అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. చదవండి: సూడాన్ ఆర్మీ-పారామిలిటరీ బలగాల పోరు.. 72 గంటలపాటు కాల్పుల విరమణ! -
ఇండియన్ ఆర్మీపై దాడులకు పాక్ ఆర్మీ స్కెచ్
శ్రీనగర్: భారత గడ్డపై దాడులకు పాక్ సైన్యం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో.. భారత్‌లో దాడులకు సుపారీ తీసుకున్న ఓ ఉగ్రవాదిని భారత సైన్యం నిలువరించగలిగింది. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్ నుంచి భారత్‌లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్‌ను కట్ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం. అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్‌కోట్‌కు చెందిన తబరాక్ హుస్సేన్‌గా గుర్తించింది. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌద్రీ తనను పంపించాడని, భారత ఆర్మీపై దాడులకు పాల్పడాలంటూ తనకు రూ.30వేల పాక్ రూపాయలను ఇచ్చాడని వెల్లడించాడు. ఆయుధాలతో పాటు పాక్ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. విశేషం ఏంటంటే.. 2016లో తబరాక్ నియంత్రణ రేఖ వెంబడి తన సోదరుడితో సహా చొరబడేందుక యత్నించగా.. ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే మానవతా ధృక్పదంతో ఏడాది జైలుశిక్ష తర్వాత అతన్ని మళ్లీ వెనక్కి పంపించేసింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం. #WATCH | Tabarak Hussain, a fidayeen suicide attacker from PoK, captured by the Indian Army on 21 August at LOC in Jhangar sector of Naushera, Rajouri, says he was tasked by Pakistan Army's Col. Yunus to attack the Indian Army for around Rs 30,000 pic.twitter.com/UWsz5tdh2L — ANI (@ANI) August 24, 2022 ఇదీ చదవండి: మరో జలియన్ వాలాబాగ్.. 80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం -
చైనా వక్రబుద్ధి.. పాకిస్థాన్ ఆర్మీ కోసం పీఓకేలో నిర్మాణాలు
న్యూఢిల్లీ: భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా తన వక్రబుద్ధిని మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదోరకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ ఆర్మీ కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), బలోచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్‌గా పిలుస్తారు. కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరోవైపు.. సింధ్, బలోచిస్థాన్ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే రానికోట్, నవాబ్షా, ఖుజ్దార్ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే.. పాకిస్థాన్ ఆర్మీకి కావాల్సిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం ఎందుకు పాల్గొంటుందన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సీపెక్ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవటం వల్లే పాకిస్థాన్ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీపెక్ ద్వారా సింకియాంగ్‌ను గ్వాదర్ పోర్ట్‌తో అనుసంధానించాలని భావించారు, అయితే అది అక్కడికి చేరుకోవడానికి చాలా దూరంలో ఉంది. ఇదీ చదవండి: చైనా, పాక్ తీరుని తిట్టిపోసిన భారత్! ఊరుకునేది లేదని వార్నింగ్ -
సాక్షి కార్టూన్ 07-07-2022
ఇందులో ఏ ‘రాజకీయం’ లేదుగా..! -
మా చేతులు కట్టేసినట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ ఆర్మీ వ్యవస్థపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతి ఒక్కరూ బ్లాక్మెయిల్ చేశారని, తన చేతుల్లో అధికారం ఉండేది కాదని, ఎవరి ఆధీనంలో ఉండేదో అందరికీ తెలుసని పరోక్షంగా ఆర్మీని ఉద్ధేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఏప్రిల్‌లో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంలో నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. అయితే అమెరికా తనను లక్ష్యంగా చేసుకొని పన్నిన కుట్రల కారణంగానే తాము అధికారం కోల్పోయామని మండిపడ్డారు. రష్యా, చైనా, అప్ఘనిస్తాన్ విషయంలో స్వతంత్ర విదేశాంగ విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్లే అమెరికా ఆ పనిచేసిందన్నారు. బుధవారం ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ... పాక్ ఆర్మీపై మండిపడ్డారు. ‘మా ప్రభుత్వం చాలా బలహీన సర్కారు. మా చేతులు కట్టేసినట్లుగా పరిస్థితి ఉండేది. ఎన్నికల్లో గెలిచిన సమయంలో పలు పార్టీల సాయం తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రతిచోట నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి. నేను ప్రధానిగా ఉన్న సమయంలో అధికారం నా చేతిలో లేదు. అది ఎవరి చేతుల్లో ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్ చేతికి అమెరికా రాకెట్లు! ‘శత్రువుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున తమ దేశానికి బలమైన సైన్యాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. అయితే బలమైన సైన్యం, బలమైన ప్రభుత్వానికి మధ్య "సమతుల్యత" పాటించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మా హయాంలో అది మాత్రం సాధ్యపడలేదు. మేము అన్ని వేళలా వారి (ఆర్మీ)పైనే ఆధారపడ్డాము. వాళ్లు చాలా మంచి పనులు కూడా చేశారు. కానీ చేయాల్సిన అనేక పనులు చేయలేదు. జాతీయ జవాబుదారీ సంస్థ (ఎన్ఏబీ)లు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. అందుకే అధికారం మొత్తం వారి చేతుల్లోనే ఉంటుంది’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. కాగా 2018లో మిలటరీ అండతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంలో పదవీచ్యుతుడైన ఏకైక పాక్ ప్రధాని. ఆయన స్థానంలో పీఎంఎల్-ఎన్‌కు చెందిన షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎంపికయ్యారు. అలాగే 75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది. -
ఇమ్రాన్ ఖాన్‌పై మరియం షరీఫ్ సంచలన ఆరోపణలు.. చివరి క్షణం వరకూ..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అధికార పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించారని ధ్వజమెత్తారు. తను పదవిలో ఉన్న చివరి నిమిషం వరకు పాకిస్థాన్ ఆర్మీని వేడుకున్నాడని అన్నారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తనను గట్టెక్కించాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఉపాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని కూడా బతిమాలారని మరియం విమర్శించారు. అవిశ్వాసంపై ఓటింగ్‌ను వాయిదా వేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడని, అందుకే తాము అర్ధరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించామని మరియమ్ అన్నారు. లాహోర్‌లో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్‌కు కష్టాలు వచ్చే రోజులు మొదలయ్యాయని మరియం ఆరోపించారు. ఒకవేళ నవాజ్ షరీఫ్ తిరిగి వస్తే ఇమ్రాన్ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకోవాలన్నారు. రాజకీయాలంటే కప్పు టీ తాగినంత సులువు కాదని ఇమ్రాన్ క్రికెట్ ఆడటమే మంచిదని ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, త్వరలోనే ఇమ్రాన్‌తోపాటు అతని మంత్రివర్గ సభ్యులు తిరుగులేని అవినీతి ఆరోపణలపై కటకటాల పాలవుతారని మండిపడ్డారు. చదవండి👉 పాకిస్తాన్లో మహిళా సూసైడ్ బాంబర్.. షాకింగ్ విషయాలు వెల్లడి కాగా మూడుసార్లు పాకిస్థాన్‌కు ప్రధానిగా పనిచేసిన నవాజ్‌షరీఫ్ కూతురే మరియం షరీఫ్. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న సమయంలో నవాజ్‌పై అనేక అవినీతి కేసులు పెట్టించాడు. అయితే లాహోర్ హై కోర్టు అనుమతితో 2019 నవంబర్‌లో చికిత్స కోసం లండన్ వెళ్లారు. ప్రస్తుతం పాక్‌లో అధికారంలోకి వచ్చిన పీఎమ్ఎల్ ప్రభుత్వం నవాజ్‌కు కొత్త పాస్‌పోర్టు అందించి అతన్ని దేశానికి తీసుకొచ్చేందుకు మార్గం సుగుమం చేసింది. కాగా 75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌కు షెబాష్ షరీఫ్‌కు మధ్య రాజకీయ వివాదాలు తలెత్తడంతో ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సైన్యం నిరాకరించింది. ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మాణం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్ 10న పదవి కోల్పోయారు. దీంతో పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాసం ఎదర్కొని పదవీచ్యుతుడైన తొలి ప్రధానికిగా నిలిచారు. చదవండి👉 ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో.. -
భారత్ భేష్.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామాకు తాను వెనకాడబోనని చెప్పిన పాక్ పీఎం.. విపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా పాక్ ఆర్మీని విమర్శిస్తూ.. భారత్‌పై ప్రశంసలు గుప్పించాడు. ఖైబర్ ఫక్తూన్వాలో ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాసం తేబోతున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ.. తన ప్రభుత్వ పని తీరును సమర్థించుకున్నాడు. పనిలో పనిగా.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నాడు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అలాగే భారత విదేశాంగ విధానం అద్భుతంగా ఉంటుందని, పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుందంటూ ఆకాశానికి ఎత్తాడు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండడం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు భారత్ విధానాలు ఆ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్. ఇక పదవీ గండంపై స్పందిస్తూ.. రాజీనామాకు తాను ఎప్పటికైనా సిద్ధమని పేర్కొన్నాడు. అలాగని విపక్షాల ఒత్తిళ్లకు తాను తలొగ్గనని, ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని, పదవిని నిలబెట్టుకోలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్’ తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని కోరిన సంగతి తెలిసిందే. చదవండి: ఖాన్ సాబ్.. మీరు దిగి పోవడమే మంచిది! -
పాకిస్తాన్లో భారీ పేలుడు.. భయాందోళనలో ప్రజలు.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఇటీవలే క్షిపణి ప్రయోగం చేసి.. అది విఫలమవడంతో సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆదివారం పాక్ సైనిక స్థావరంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం ధాటికి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. నార్త్ పాకిస్తాన్లో ఉన్న సియాల్కోట్లోని సైనిక స్థావరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల మేర సౌండ్ వినిపించడంతో ఏం జరిగిందోనని స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే, పంజాబ్ ప్రావిన్స్‌లోని కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలో పేలుడు శబ్ధం వినిపించినట్లు సమాచారం. కాసేపటి తర్వాత ఈ పేలుడుపై పాక్ ఆర్మీ మీడియా విభాగం ఓ ప్రకటనలో ప్రమాదవశాత్తు మిలటరీ బేస్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని తెలిపింది. Something is Happening in #Sialkot Cant #Sialkot pic.twitter.com/UsZ97NhW7M— MariA RazAa (@RazaaMaria) March 20, 2022 కాగా, ఈ ఘటనలో మందుగుండు సామగ్రి షెడ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాడంతో వేగంగా స్పందించి భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. భారీ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
హ్యాండ్ ఇచ్చిన ఆర్మీ.. ఇమ్రాన్ ఖాన్ ఆశలు గల్లంతు
Pakistan Political Turmoil: నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హడావిడిగా శనివారం అంతా పాక్ కీలక విభాగాలతో భేటీ అయ్యాడు. ఇందులో భాగంగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వస్తే.. సాయం చేయాలని ఇమ్రాన్ ఖాన్ కోరగా, అందుకు పాక్ ఆర్మీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భేటీలో ఆర్మీ చీఫ్, ఇమ్రాన్ ఖాన్‌కు రాజీనామా సలహానే ఇచ్చినట్లు తెలుస్తోంది. అవిశ్వాసంలో గనుక ఓడితే.. ఈ నెలాఖరులో జరిగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్ (OIC) తర్వాత పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్‌తో.. ఆర్మీ ఛీప్ ఖనార్ జావెద్ బజ్వా చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో బజ్వాతో పాటు ముగ్గురు సీనియర్ లెఫ్టినెంట్ జనరల్స్, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) డీజీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాదు బజ్వాతో పాటు మిగిలిన మిలిటరీ అధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్‌తో గద్దె దిగిపోమనే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఖాన్‌కు దారులన్నీ మూసుకుపోయాయి. ప్రభుత్వం గనుక కూలిపోయే పరిస్థితి వస్తే సైన్యం సాయం తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ భావించాడు. అంతకు ముందు ఆర్మీ మాజీ ఛీఫ్ రహీల్ షరీఫ్.. బజ్వాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఇమ్రాన్ ఖాన్ తరపున రాయబారం నడిపే ప్రయత్నం చేశాడు. కానీ, రహీల్ దౌత్యాన్ని సైతం పాక్ ఆర్మీ ఛీ కొట్టిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం దగ్గరపడిందనే సంకేతాలు అందాయి. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కించాలంటూ ప్రధాని వారిని కోరినా తామేమీ చేయలేమంటూ వారు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అవిశ్వాస తీర్మానంతో పాటు ఓఐసీ సమ్మిట్, బెలూచిస్థాన్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇక ఈ భేటీపై పీటీఐ నేతలు గంపెడు ఆశలు పెట్టుకోగా.. ఫలితం ఇలా రివర్స్ రావడంతో అసంతృప్తిలో కూరుకుపోయారని క్యాపిట్ టీవీ కథనం ప్రసారం చేసింది. మొదటి నుంచి పాక్ ప్రభుత్వాన్ని నియంత్రించే పనిలో ఆర్మీ ఉంటోంది. ప్రతిపక్ష నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆర్మీ ఛీఫ్ బజ్వా మొదటి నుంచి పీటీఐ నేతలకు చెబుతున్నా.. స్వయంగా ఇమ్రాన్ ఖానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్న దేశం.. ఇప్పుడీ రాజకీయ సంక్షోభంతో మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆర్మీ. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా, యూరోపియన్ యూనియన్ పై అనవసర వ్యాఖ్యలు చేశారంటూ ఇమ్రాన్ పై ఆర్మీ గుర్రుగా ఉంది. ఇప్పటికే సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కే చెందిన 24 మంది నేతలు.. ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ దిగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. చదవండి: సొంత పార్టీలోనే తిరుగుబాటు.. ఎందుకు? -
పాకిస్తాన్లో అంతర్యుద్ధం?
కరాచీ: ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో అట్టుడుకుతున్న పాకిస్తాన్ క్రమంగా అంతర్యుద్ధం దిశగా పయనించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనాతో దేశం అతలాకుతలం అవుతుండగా మరోపక్క ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరుతోంది. ఆర్మీకి, పాక్ పోలీసులకు మధ్య గొడవలు పెరిగి కాల్పులకు దారితీశాయి. ఇంటర్నేషనల్ హెరాల్డ్ తన తాజా ట్వీట్లో పాక్‌లో సివిల్ వార్ ఆరంభమైందని వ్యాఖ్యానించింది. కరాచీలో సింధ్ పోలీసులకు, పాక్ ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు పది మంది పోలీసులు మరణించినట్లు ఇంటర్నేషనల్ హెరాల్డ్ నివేదించింది. సింధ్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ముష్టాఖ్ అహ్మద్ మహర్‌ను ఆర్మీ నిర్బంధించడంతో గొడవ మొదలైందని సమాచారం. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు మహ్మద్ సఫ్దార్ను అరెస్టు వ్యవహారంలో మహర్‌ను నిర్బంధించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఘటనలపై పాక్ ప్రధాని, ప్రభుత్వం స్పందించలేదు. సఫ్దార్ అరెస్ట్ కోసం.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇటీవల ఏర్పాటు చేసిన పీడీఎం వేదికపై నవాజ్ షరీఫ్ కూతురు మరియం, ఆమె భర్త సఫ్దార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీకి నచ్చని ‘ఓటుకు విలువ ఇవ్వండి’ అని సఫ్దార్ నినాదాలు చేశారని, దీంతో కేసు నమోదైందని తెలిసింది. ఈ కేసులోనే సఫ్దార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తక్షణమే సఫ్దార్ను అరెస్ట్‌చేసేలా పోలీసులకు ఉత్వర్వులు ఇవ్వాలని సింధ్ పోలీస్ ఐజీపీ మహర్‌పై సైన్యం ఒత్తిడి చేసిందని, అందుకోసం ఆయనను సైన్యం నిర్బంధించిందని సింధ్ మాజీ గవర్నర్ మహ్మద్ జుబేర్ ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారి అయిన మహర్ నిర్బంధం విషయం తెల్సి ఆర్మీపై పోలీసులు తిరగబడ్డారని సమాచారం. ఈ సందర్భంగా సైన్యం, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగాయని, పది మంది పోలీసులు మరణించారని తెలుస్తోంది. సైన్యం కాల్పులకు నిరసనగా ఏఐజీ ఇమ్రాన్‌సహా సీనియర్ పోలీసు అధికారులు విధులను బహిష్కరించి సెలవు తీసుకున్నారు. అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో మహర్ తన సెలవును వాయిదా వేసుకున్నారు. 10 రోజులదాకా సెలవు కోసం దరఖాస్తు చేసుకోరాదని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ గొడవకు కారణమైన అంశాలపై విచారణ జరపాలని ఆర్మీ చీఫ్ జనరల్ కమార్‌జావెద్ బజ్వా ఆదేశించారు. నిరసనల్లో భారత జెండా ఇటీవల పాక్‌లో జరిగిన భారీ నిరసనల్లో భారత జాతీయజెండాలు చేతబూనారని బుధవారం ట్విట్టర్లో కొంతమంది పోస్ట్‌లు పెట్టారు. వేలాది మంది జనం గుమికూడిన ఈ ఫొటోల్లో కొందరి చేతిలో మువ్వన్నెల జెండాలున్నాయి. పాక్‌కు చెందిన పాకిస్తాన్ అవామీ తెహ్రీక్ పార్టీ జెండాలో అవే రంగులుంటాయని, అవి ఆ జెండాలని కొందరు స్పందించారు. పాక్‌లో ప్రభుత్వ అసమర్థత కారణంగా ఆహార కొరత వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో సామాన్యుల జీవనం అస్తవ్యస్థంగా మారింది. నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్రాన్ గద్దె దిగాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆందోళనలను అణిచివేస్తోంది. -
వాళ్లకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐతో సంబంధాలు!
న్యూఢిల్లీ: యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ ‘పెద్దల’పై బంధుప్రీతి, వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ బైజయంత్ జై పాండా మరో బాంబు పేల్చారు. పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ, పాక్ సైన్యంతో పలువురు బీ-టౌన్ ప్రముఖులకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో హింసను ప్రేరేపిస్తున్న పాకిస్తానీలు, ఎన్ఆర్ఐలతో వీరు వ్యక్తిగత, వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారని.. తద్వారా పరోక్షంగా పాక్ ఆర్మీకి సహాయపడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి దేశభక్తి గల బాలీవుడ్ నటులు ఇలాంటి వాళ్లతో కలిసి పనిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇందులో ఆయన ఎవరి పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.(హర్ట్ అయ్యుంటే సారీ చెప్తాను: అనురాగ్) కాగా ఒడిశాకు చెందిన జై పాండా ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా, అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఇక జై పాండా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి ద్రోహులను ఏరివేయాలంటే దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని కొంతమంది డిమాండ్ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఈ ఆరోపణలు నిజమే అయితే ఇన్నాళ్లు నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన నాటి నుంచి బాలీవుడ్లో నెపోటిజంపై విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శక నిర్మాత కరణ్ జోహార్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ తదితరులపై సుశాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదే విధంగా అవుట్‌సైడర్ల తరఫున గళమెత్తిన కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. Came across shocking threads documenting personal & business links of some Bollywood personalities with certain Pakistanis & NRIs with undeniable track record encouraging violence in J&K, who have verifiable links to ISI & Pak army. I urge patriotic Bollywoodies to renounce them. — Baijayant Jay Panda (@PandaJay) July 22, 2020 -
పాక్ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ నిగార్ జోహర్ అరుదైన ఘనత సాధించారు. పాక్ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ హోదా దక్కించుకున్న తొలి మహిళగా చరిత్రకెక్కారు. అదే విధంగా ఆర్మీ సర్జన్ జనరల్‌గా విధులు నిర్వర్తించనున్న మొదటి మహిళగా నిలిచారు. ఈ విషయాన్ని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్ మాజ్ జెన్ బాబర్ ఇఫ్తిఖర్ మంగళవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘లెఫ్టినెంట్ జనరల్‌గా పదోన్నతి పొందిన తొలి మహిళ ఈమె. పాక్ ఆర్మీ తొలి మహిళా సర్జన్‌గా నియమితులయ్యారు’’ అని పేర్కొన్నారు.(మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్ పెత్తనం?) కాగా రావల్సిండిలోని ఆర్మీ మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జోహర్.. 1985లో పాక్ ఆర్మీ మెడికల్ కార్స్ప్లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో మేజర్ జనరల్ స్థాయికి చేరుకున్నారు. ఆమె కంటే ముందు షహీదా బాద్షా, షహీదా మాలిక్ అనే ఇద్దరు మహిళలు మాత్రమే ఈ హోదా దక్కించుకున్నారు. ఇక జోహర్ తండ్రి, భర్త కూడా పాక్ ఆర్మీలో సేవలు అందించిన వారే కావడం గమనార్హం. -
ఇమ్రాన్ ముందు అనేక సవాళ్లు
కరాచీ: పొరుగు దేశం పాకిస్తాన్ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం లక్ష్యాల్లో ఏ ఒక్కటీ సాధించలేకపోయింది. ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా చేపట్టిన సర్వేలో పాక్ జీడీపీలో అప్పు 88 శాతానికి ఎగబాకనుండగా ఆర్థిక వ్యవస్థ 68 ఏళ్ల కనిష్టానికి చేరుకుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు డా. అబ్ధుల్ హఫీజ్ షేఖ్ పాక్ ఆర్థిక సర్వే ఫలితాలను విడుదల చేశారు. ఇలాంటి దీనావస్థలో ఉన్న పాక్ భారత్‌కు నగదు బదిలీ సాయం చేస్తానంటూ ముందుకు రాగా.. భారత్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే కరోనా కారణంగా 10 మిలియన్ల మంది పాక్ ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారు. (మీరా మాకు సాయం చేసేది) కశ్మీర్‌ను రాజకీయం చేయని పాక్ ఈ నేపథ్యంలో తిండిగింజకు ఇబ్బందులు పడే అవకాశమున్నందున ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో లాక్డౌన్ విధించబోనంటూ మార్చిలో ఓ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ ఆర్మీ లాక్డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య ఉన్న విబేధాలు మరోసారి బయటపడ్డాయి. అయితే దేశంలోని తిరుగుబాట్లు, రాజకీయ వివాదాలు, ఆర్థిక లోటుపై ప్రజల దృష్టి మరల్చేందుకు పాక్ ఏళ్ల తరబడి కశ్మీర్ అంశాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ వస్తోంది. కానీ ఏడాది కాలంగా అది కశ్మీర్ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని పక్కన పెట్టేశాడు. ప్రభుత్వంపై పట్టు కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్ మరోవైపు ఆర్మీ అధికారులే కీలక పదవులు దక్కించుకుంటూ పాక్ ప్రభుత్వంపై పెత్తనం కొనసాగిస్తున్నారు. కరోనా సమీక్షలోనూ సైన్యాధికారులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. బ్లూమ్‌బర్గ్ నివేదిక సైతం పాక్ ప్రభుత్వంపై సైన్యం తన పట్టును బిగిస్తోందని వెల్లడించింది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న ఈ సవాళ్లే ప్రధాని ఇమ్రాన్ మౌనానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండేళ్లుగా ఆయన పాపులారిటీ కూడా తగ్గిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. (మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్ పెత్తనం) -
ఇద్దరు తప్ప అందరూ..
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం కరాచీ విమానాశ్రయం దగ్గర్లోని ప్రజానివాస ప్రాంతంలో కుప్పకూలింది. శనివారం ఉదయానికి ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి సంఖ్య బయటకు వచ్చింది. విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 97 మంది మరణించగా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న వారిలో 51 మంది పురుషులు, 31 మంది మహిళలు, 9 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రులకు తరలించారు. 19 మృతదేహాలు ఎవరివనేది గుర్తించినట్లు తెలిపారు. విమానం కూలిన ప్రాంతంలో 25 ఇళ్లు ధ్వంసం కాగా, 11 మంది నివాసితులు గాయపడ్డారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ అసోíసియేషన్ డిమాండ్ చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం ఇప్పటికే నలుగురు సభ్యులతో కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. సాంకేతిక సమస్యల వల్ల విమానం కూలి ఉండవచ్చని, దర్యాప్తులో వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. -
‘కర్తార్‌పూర్’పై పాక్ వేర్వేరు ప్రకటనలు
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాతో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే కర్తార్‌పూర్ కాడిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించి పాక్ భిన్నమైన సమాచారమిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. కర్తార్‌పూర్ కారిడార్ సందర్శనకు వచ్చే భారతీయ యాత్రీకులు పాస్‌పోర్ట్‌ను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదని, ఏదైనా చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రం తెచ్చుకుంటే చాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ గతంలో పేర్కొన్నారు. తాజాగా, భద్రతా కారణాల రీత్యా భారతీయ యాత్రీకులు తమ వెంట పాస్‌పోర్ట్ తెచ్చుకోవాల్సిందేనని పాక్ ఆర్మీ స్పష్టం చేసింది. పాక్ తీరుపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక ఒప్పందం అంశాలను పాక్ అమలు చేయాలని కోరింది. కాగా, పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూకు శనివారం జరిగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో పాకిస్తాన్ తరఫున పాల్గొనడానికి ప్రభుత్వం గురువారం రాజకీయ అనుమతి ఇచ్చింది. -
తెల్ల జెండాలతో వచ్చి శవాలను తీసుకెళ్లారు
న్యూఢిల్లీ: భారత సైన్యాన్ని కాల్పులతో ఎదుర్కోలేక పాకిస్తాన్ ఆర్మీ తెల్ల జెండాతో హాజిపిర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖలోకి ప్రవేశించింది. భారత్–పాక్ సైన్యాల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ ఆర్మీ ఈ పద్ధతిని ఎంచుకుంది. దీనికి ముందు పాక్ ఎల్ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా తిరిగి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఈ నెల 10న పాక్ సైనికుడు గులాం రసూల్ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ తిరిగి కాల్పులు జరుపుతూ చొరబడాలని ప్రయత్నించింది. భారత సైన్యం తిరిగి కాల్పులు జరపడంతో మరో సైనికుడు మృతిచెందాడు. దీంతో రెండు రోజుల తర్వాత పాక్ సైన్యం తెల్ల జెండాతో ముందుకొచ్చింది. తెల్ల జెండా పట్టుకొని ఉంటే కాల్పులు జరపబోమని సంకేతం. ఈ జెండాతో మరణించిన తమ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లింది. మరణించిన ఇద్దరినీ పంజాబ్‌కు చెందిన ముస్లింలుగా భావిస్తున్నారు. జూలై 30–31న కీరన్ సెక్టార్లో జరిగిన కాల్పుల్లో దాదాపు ఏడు మంది పాక్ సైనికులు మరణించినప్పటికీ, పాక్ వారి మృతదేహాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. బహుశా వారు కశ్మీర్ నేపథ్యం ఉన్నవారుగానీ, పాకిస్తాన్‌లోని ఉత్తర లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన వారు అయి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కేవలం పంజాబీ పాకిస్తానీలు మరణిస్తేనే పాక్ ముందుకు వస్తుందని విమర్శించారు.