ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఇటీవలే క్షిపణి ప్రయోగం చేసి.. అది విఫలమవడంతో సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆదివారం పాక్ సైనిక స్థావరంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం ధాటికి ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
వివరాల ప్రకారం.. నార్త్ పాకిస్తాన్‌లో ఉన్న సియాల్‌కోట్‌లోని సైనిక స్థావరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల మేర సౌండ్ వినిపించడంతో ఏం జరిగిందోనని స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అయితే, పంజాబ్ ప్రావిన్స్‌లోని కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలో పేలుడు శబ్ధం వినిపించినట్లు సమాచారం. కాసేపటి తర్వాత ఈ పేలుడుపై పాక్ ఆర్మీ మీడియా విభాగం ఓ ప్రకటనలో ప్రమాదవశాత్తు మిలటరీ బేస్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని తెలిపింది.
Something is Happening in #Sialkot
Cant #Sialkot pic.twitter.com/UsZ97NhW7M— MariA RazAa (@RazaaMaria) March 20, 2022
కాగా, ఈ ఘటనలో మందుగుండు సామగ్రి షెడ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాడంతో వేగంగా స్పందించి భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. భారీ పేలుడుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment