
రావల్పిండి : పాకిస్తాన్ ఆర్మీకి చెందిన విమానం కూప్పకూలిన ఘటనలో 17 మంది మృతిచెందారు. మంగళవారం తెల్లవారు జామున రావల్పిండిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా పాక్ అధికారులు తెలిపారు. మృతుల్లో 5 గురు విమాన సిబ్బంది కాగా, 12 మంది పౌరులు ఉన్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందిని దగ్గర్లోని అధికారులు ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
ఈ విమానాన్ని పాక్ ఆర్మీ ట్రైనింగ్ కోసం వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. విమానం కుప్పకూలడంతో ఆ చుట్టపక్కల పలు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రమాదం జరిగిన చోటుకి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment