Rawalpindi
-
పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్.. సిరీస్ అక్కడే
పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణపై పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టతనిచ్చింది. తమ దేశంలోనే ఈ సిరీస్ జరుగుతుందని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముల్తాన్, రావల్పిండి ఇందుకు ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. అక్టోబరు 7 నుంచి 28 వరకు ఇరుజట్ల మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు వెల్లడించింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు తమ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ స్వయంగా పేర్కొన్నాడు. అందుకే భారీ మొత్తంలో నిధులు కేటాయించి స్టేడియాల్లో మెరుగైన వసతులతో పాటు.. పలు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపాడు.శ్రీలంక లేదంటే యూఏఈలో అంటూ వదంతులువచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నాటికి అంతా సిద్ధం చేస్తామని నక్వీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. స్టేడియాల ప్రక్షాళన నేపథ్యంలో పీసీబీ ఇంగ్లండ్‌తో సిరీస్ వేదికను మార్చే యోచనలో ఉందని.. శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి.అయితే, అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ పీసీబీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. తమ దేశంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబరు 7-11, 15-19 మధ్య జరుగనున్న తొలి రెండు మ్యాచ్‌లకు ముల్తాన్.. అక్టోబరు 24-28 వరకు జరుగనున్న ఆఖరి టెస్టుకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. నిజానికి కరాచీలో జరగాల్సిన ఈ చివరి టెస్టును అక్కడి నుంచి తరలించడానికి కారణం.. పునరుద్ధరణ కార్యక్రమాలే అని పేర్కొంది. అక్టోబరు 2న ఇంగ్లండ్ జట్టు ముల్తాన్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్తాన్ చివరగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడింది.ఘోర పరాభవం నుంచి కోలుకునేనా?ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగమైన ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓడటమే గాకుండా.. 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. ఫలితంగా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తదుపరి జరుగనున్న టెస్టు సిరీస్ షాన్ మసూద్ బృందానికి విషమ పరీక్షగా మారింది.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
పేస్‌కు, స్పిన్‌కు మధ్య సమరం.. నేటి నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు
రావల్పిండి: పేసర్లతో పటిష్టంగా పాకిస్తాన్.. స్పిన్నర్లే ప్రధాన బలంగా బంగ్లాదేశ్.. టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 టెస్టులు జరిగాయి. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా టెస్టుల్లో పాక్‌ను ఓడించలేకపోయింది. ఈసారి మాత్రం గెలుపుతో చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. ఆ్రస్టేలియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ సొంతగడ్డపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. మొదటి టెస్టు జరగనున్న రావల్పిండి పిచ్ పేస్‌తో పాటు బ్యాటింగ్‌కు సహకరించనుంది. ఇక్కడ జరిగిన గత నాలుగు టెస్టుల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. షాహీన్ షా అఫ్రీది, నసీమ్ షా, ఖుర్రం షహజాద్, మొహమ్మద్ అలీతో పాకిస్తాన్ పేస్ విభాగం దుర్బేధ్యంగా కనిపిస్తుంటే.. ప్రధాన స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్‌నే బంగ్లాదేశ్ నమ్ముకుంటోంది. సుదీర్ఘ కాలంగా బంగ్లాదేశ్ జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తున్న షకీబ్‌పై టీమ్ మేనేజ్మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది. ‘అతడు చాన్నాళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాజకీయ విషయాలు అతడి ఆటతీరుపై ప్రభావం చూపవు. ఈ సిరీస్‌లో అతడు ఏదైనా ప్రత్యేకంగా చేస్తాడనుకుంటున్నాం. పాకిస్తాన్ పేసర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదని తెలుసు. అయినా రాణించగలమనే నమ్మకం ఉంది’ అని బంగ్లాదేశ్ కెప్టెన్ నజు్మల్ షాంటో పేర్కొన్నాడు.ఆ్రస్టేలియా మాజీ పేసర్ జాసన్ గెలెస్పీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాకిస్తాన్ ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కాగా... బ్యాటింగ్‌లో బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీఖ్, షాన్ మసూద్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ కీలకం కానున్నారు. బంగ్లా తరఫున నజ్ముల్ షాంటో, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్, లిటన్ దాస్ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆట సాగే ఐదు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ (36.66 పాయింట్లు) ఆరో స్థానంలో.. బంగ్లాదేశ్ (25.00 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. -
వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..!
ఇస్లామాబాద్: వయాగ్రా వినియోగంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో కామోద్ధీపన కోసం ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు అక్కడి యువకులు. ఈక్రమంలో ఉడుం కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉడుములు వేటాడే ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో రావల్పిండి యువకులు ఈ ఉడుం నూనె కోసం పరితపిస్తున్నారు. ఎంత డబ్బైనా వెచ్చింది దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు నూనెలో మేరినేట్ చేసి ఎరుపు రంగు మసాలలలో ఉపయోగిస్తారు. లేదా దీనితో సాందా తైలాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే లైంగిక వాంఛ, సామర్థ్యం పెరిగి పడకగదిలొ రెచ్చిపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రావల్పిండిలోని రాజా బాజార్లో ఉడుం నూనె కోసం యువకుల తాకిడి పెరిగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో చాలా ముంది ఉడుముల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉడుములను చంపడం తమకు బాధగా అన్పిస్తోందని, కానీ జీవనోపాధి కోసం తప్పడం లేదని వారు చెబుతున్నారు. దశాబ్దాలుగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఎక్కుమంది పిల్లల్ని కంటేనే సమాజంలో ఆ దంపతులను గౌరవం ఉంటుంది. పిల్లలు లేకపోతే పరువు పోతుందని చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా ఉపయోగించేవారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఉడుం నూనెకు డిమాండ్ పెరిగింది. అయితే దీని వల్ల లైంగిక వాంఛ, సామర్థ్యం, పటుత్వం పెరుగుతుందని ఇప్పటివరకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఉడుం వేటగాళ్లు మాత్రం నిజంగానే దీనిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలున్నాయని చెబుతున్నారు. చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో.. -
'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా'
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అనగానే మదిలో మెదిలే బౌలర్ పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్. ఇప్పుడు అదే 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' పేరుతో బయోపిక్ రూపొందించాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను ముహ్మద్ ఫర్హాజ్ ఖాసిర్ డైరక్టర్‌గా వ్యవహరించగా.. క్యూ ఫిలిం ప్రొడక్షన్ తెరకెక్కించింది. అయితే తాజాగా బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు షోబయ్ అక్తర్ శనివారం రాత్రి ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ప్రొడక్షన్ హౌస్‌తో వచ్చిన విబేధాల కారణంగానే బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు తన అనుమతి లేనిదే బయోపిక్ రూపొందిస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్‌ను హెచ్చరించాడు. ''రావల్పిండి ఎక్స్‌ప్రెస్ బయోపిక్ నుంచి తప్పుకోవడం చాలా బాధాకరం. కొన్ని నెలల కింద నుంచే మేకర్స్‌తో మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగానే బయోపిక్ రూపొందించడాన్ని విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నా. త్వరలోనే నా మేనేజ్మెంట్, లీగల్ టీమ్ మేకర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుంది. నా అనుమతి లేకుండా మేకర్స్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే మాత్రం లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా'' అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. ఇక పాకిస్తాన్ క్రికెటలో తన ఆటతో అక్తర్ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లు ఆడాడు.అక్తర్ ఒక మ్యాచ్‌లో 161 కిమీవేగంతో విసిరిన బంతి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది. Important announcement. pic.twitter.com/P7zTnTK1C0 — Shoaib Akhtar (@shoaib100mph) January 21, 2023 చదవండి: భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కన్నెర్ర చేసిన ఐసీసీ.. 8 నెలల్లో రెండోసారి
నాసిరకం పిచ్ తయారు చేసినందుకు గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కన్నెర్ర చేసింది. పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌కు (డిసెంబర్ 1 నుంచి 5) వేదిక అయిన రావల్పిండి పిచ్‌ను మందకొడిగా తయారు చేసినందుకు గాను ఐసీసీ.. పీసీబీకి మొట్టికాయలు వేసింది. ఈ పిచ్‌ను బిలో యావరేజ్‌గా పేర్కొన్న ఐసీసీ.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే పిచ్‌లా లేదని అక్షింతలు వేసింది. బౌలర్లకు ఏమాత్రం సహకారం అందించిన రావల్పిండి పిచ్.. ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఐసీసీ టెక్నికల్ కమిటీ సీరియస్ అయ్యింది. చర్యల్లో భాగంగా ఓ డీ మెరిట్ పాయింట్‌ను రావల్పిండి పిచ్‌కు అలాట్ చేసింది. 8 నెలల వ్యవధిలో ఈ పిచ్‌కు డీ మెరిట్ పాయింట్ రావడం ఇది రెండో సారి. JUST IN - The verdict is in on the Rawalpindi pitch used during the first Test between Pakistan and England 👀#PAKvENG | #WTC23https://t.co/PQO7PS2cTj — ICC (@ICC) December 13, 2022 ఇదిలా ఉంటే, బ్యాటర్ల కోసం మాత్రమే రూపొందించినది చెప్పుకునే రావల్పిండి పిచ్‌పై ఇరు జట్ల క్రికెటర్లు పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 7 సెంచరీలు నమోదయ్యాయి. బౌలర్లు ఏమాత్రం సహకరించని ఈ పిచ్‌పై ఇంగ్లండ్.. తమ బజ్‌బాల్ అప్రోచ్‌ను ఇంప్లిమెంట్ చేసి 74 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడగా.. పాక్ ప్లేయర్స్ అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్) శతకాలు నమోదు చేశారు. -
పిచ్చ కొట్టుడు కొట్టారు.. డీఆర్ఎస్ కూడా లేకపాయే!
పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన ఇంగ్లండ్ తొలి టెస్టులోనే అదరగొట్టే ప్రదర్శన ఇస్తుంది. మ్యాచ్ తొలి రోజునే ఇంగ్లండ్ బ్యాటర్లు పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వన్డే తరహాలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ జట్టు తొలిరోజు ఆట ముగిసేసమయానికి 75 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగుల భారీస్కోరు చేసింది. ఇక తొలి టెస్టుకు డీఆర్ఎస్ లేకపోవడంతో పాకిస్తాన్‌కు చుక్కలు కనబడుతున్నాయి. ఎల్బీల విషయంలో డీఆర్ఎస్ లేకపోవడంతో పాక్ జట్టు తెగ ఇబ్బంది పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను నసీమ్ షా వేశాడు. ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడో ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన నసీమ్ షా ఒక మంచి డెలివరీ వేశాడు. బంతి జాక్ క్రాలీ ప్యాడ్లకు తాకింది. అయితే థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేస్తే ఔటయ్యే అవకాశాలున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం డీఆర్ఎస్కు వెళ్లలేకపోయింది. ఏవో సాంకేతిక సమస్యల కారణంగా ఈ మ్యాచ్‌కు డీఆర్ఎస్ అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ డీఆర్ఎస్ కోరుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చూసిన అభిమానులు పీసీబీని ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ తన ఇన్నింగ్స్‌ను ఓవర్‌కు ఆరుకు పైగా రన్‌రేట్‌తో కొనసాగించడం విశేషం. ఇంగ్లండ్ బ్యాటర్లలో నలుగురు బ్యాటర్లు శతకాలతో రెచ్చిపోయారు. తొలుత ఓపెనర్లు జాక్ క్రాలీ(122 పరుగులు), బెన్ డకెట్(107 పరుగులు) చేయగా.. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన ఓలీ పోప్ 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ప్రస్తుతం హ్యారీ బ్రూక్(81 బంతుల్లోనే 101 నాటౌట్) సూపర్ ఫాస్ట్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తుండగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ బౌలర్లంతా దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జునైన్ మహమూద్ 23 ఓవర్లు వేసి ఏకంగా 160 పరుగులు ఇచ్చుకోవడం విశేషం. నసీమ్ షా కూడా 15 ఓవర్లలో 96 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. First ball of a historic series! ☄️#PAKvENG | #UKSePK pic.twitter.com/n442yzcVTE — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 No DRS available due to a glitch in Pakistan Vs England Test match. #engvspak #PAKvsEng — Dhruv Barot (@dhruv_441) December 1, 2022 No DRS😂🤣🤣🤣, someone please raise funds for Pakistan Cricket... So they can afford these technology in historic series😜 — Anshul (@Anshulkhandal03) December 1, 2022 చదవండి: టెస్ట్ మ్యాచా లేక టీ20నా.. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం, ఒకే రోజు నలుగురు సెంచరీలు -
17 ఏళ్ల తర్వాత పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన!
రావల్పిండి వేదికగా గురువారం పాకిస్తాన్‌తో తొలి టెస్టులో తలపడేందుకు ఇంగ్లండ్ సిద్దమైంది. 17 ఏళ్ల తర్వాత తొలి సారి పాక్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. అయితే తొలి టెస్టులో పాల్గోనే తమ తుది జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. ఇక విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్ తరపున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. పాకిస్తాన్‌తో తొలి టెస్టుకు లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు దక్కింది. అతడు ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. మరోవైపు గత కొన్నేళ్లగా ఇంగ్లండ్ టెస్టు జట్టుకు దూరంగా ఉన్న బెన్ డకెట్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు జాక్ క్రాలీతో కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. ఇక పాక్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ లీచ్, ఆలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్. -
పాకిస్తాన్‌తో తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్
3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు సిరీస్ ప్రారంభానికి ముందే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా తొలి టెస్ట్‌కు దూరమాయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ అధికారికంగా ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్-2022 సందర్భంగా తుంటి గాయం బారిన పడిన వుడ్.. ఇంకా కోలుకోలేదని, రెండో టెస్ట్లోగా అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని మెక్కల్లమ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్లు మధ్య తొలి టెస్ట్ రావల్పిండి వేదికగా డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 9 నుంచి రెండో టెస్ట్ (ముల్తాన్), 17 నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ (కరాచీ) జరుగనుంది. ఇంగ్లండ్ జట్టు.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ క్రాలే, జో రూట్, కీటన్ జెన్నింగ్స్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ ఓవర్టన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, బెన్ ఫోక్స్, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్ పాకిస్తాన్ జట్టు.. బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అజార్ అలీ, షాన్ మసూద్, ఇమామ్ ఉల్ హాక్, అఘా సల్మాన్, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్, మహ్మద్ నవాజ్, నౌమాన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, అబ్రర్ అహ్మద్, నసీం షా, మహ్మద్ అలీ, జహీద్ మహమూద్, హరీస్ రౌఫ్ -
Shoaib Akhtar: పట్టాలెక్కనున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్
పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అక్తరే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రానికి ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనే పేరును ఖరారు చేస్తూ.. 'రన్నింగ్ అగెయిన్స్ట్ ది ఆడ్స్' అంటూ టైటిల్ క్యాప్షన్‌ను జోడించాడు. అందమైన ప్రయాణానికి ఇది ప్రారంభం.. ఈ సినిమా ద్వారా ఇప్పటివరకు వెళ్లని రైడ్‌కు మీరు వెళ్లనున్నారు.. పాకిస్తాన్ క్రీడాకారునికి సంబంధించి ఇది తొలి విదేశీ చిత్రం.. వివాదాస్పదంగా మీ షోయబ్ అక్తర్ అంటూ అక్తర్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. Beginning of this beautiful journey. Announcing the launch of my story, my life, my Biopic, "RAWALPINDI EXPRESS - Running against the odds" You're in for a ride you've never taken before. First foreign film about a Pakistani Sportsman. Controversially yours, Shoaib Akhtar pic.twitter.com/3tIgBLvTZn — Shoaib Akhtar (@shoaib100mph) July 24, 2022 బయోపిక్కు సంబంధించిన గ్లింప్స్‌ను అక్తర్ ట్విటర్ ద్వారా విడుదల చేస్తూ.. 2023 నవంబర్ 16న సినిమా విడుదల అవుతుందని స్ఫష్టం చేశాడు. పాక్ దర్శకుడు ముహమ్మద్ ఫరాజ్ కైజర్ ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు. ఈ బయోపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన అక్తర్ తన క్రికెట్, క్రికెటేతర జీవితంలోని అనుభవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో భారత క్రికెటర్లు సచిన్, ధోని, మిథాలీ రాజ్, ప్రవీణ్ తాంబేల బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. 1997లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అక్తర్.. 13 ఏళ్ల కెరీర్లో 46 టెస్ట్‌లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడి ఓవరాల్‌గా 444 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind Vs WI: మీ అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో తెలియదా? అతడి విషయంలో ఎందుకిలా? -
తీరిన కోరిక: పాకిస్తాన్ వెళ్లాలి మా ఇల్లు చూడాలి
15 ఏళ్ల వయసులో దేశ విభజన సమయంలో రావిల్పిండిని వదిలి వచ్చేసింది రీనా వర్మ కుటుంబం. అప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్లి తన ఇంటిని చూసుకోవాలని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె కోరిక. ఎన్ని దశాబ్దాలు ప్రయత్నించినా వీసా ఇవ్వలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఆమెకు. వీసా వచ్చింది. 75 ఏళ్ల తర్వాత వాఘా సరిహద్దును దాటి పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. ఆమె ఉద్వేగాలు ఎలా ఉంటాయో. ఎవరికైనా ఇది ఎంత గొప్ప అనుభవమో. గత సంవత్సరమే హిందీలో ఒక సినిమా వచ్చింది. నీనా గుప్తా లీడ్ రోల్. సినిమా పేరు ‘సర్దార్ కా గ్రాండ్సన్’. ఇందులో అమృత్‌సర్‌లోని 90 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలు లాహోర్‌లో ఉన్న తన ఇంటిని చూడాలనుకుంటుంది. దేశ విభజన సమయంలో అల్లర్లకు భర్త చనిపోగా నెలల బిడ్డను తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ లాహోర్ విడిచిపెట్టి భారత్‌కు చేరుకుంటుందామె. మళ్లీ పాకిస్తాన్ వెళ్లడం కుదరదు. తన ఇంటితో ముడిపడ్డ జ్ఞాపకాలను తలచుకోని రోజు ఉండదు. పోయే ముందు ఆ ఇంటిని చూసి పోవాలని ఆమె కోరిక. కాని ప్రయాణం చేసే శక్తి ఉండదు. ఆమె బాధను మనవడు అర్థం చేసుకుంటాడు. ఆమె పాకిస్తాన్ వెళ్లకపోతే ఏమి ఆమె ఉన్న ఇంటినే ఇక్కడకు తెస్తాను అని పాకిస్తాన్ వెళ్లి ఆ ఇంటికి చక్రాలు కట్టి (బిల్డింగ్ మూవర్స్ సహాయంతో) తెచ్చి ఆమెకు చూపిస్తాడు. ఇది కొంచెం కష్టసాధ్యమైనా సినిమాలో ఎమోషన్ పండింది. అయితే రీనా వర్మ విషయంలో ఇంత ప్రయాస లేదు. అదృష్టవశాత్తు ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ వీసా ఇచ్చింది. కాకపోతే 1965 నుంచి ట్రై చేస్తుంటే 2022కు. మొన్న శనివారం (జూలై 16) వాఘా సరిహద్దు దాటి ఆమె పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. 15 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ను వదిలాక ఇన్నేళ్ల తర్వాత తన ఇంటిని చూసుకోవడానికి అక్కడకు వెళ్లింది రీనా వర్మ. రావల్పిండిలో బాల్యం పూణెలో నివసిస్తున్న 90 ఏళ్ల రీనా వర్మ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పుట్టి పెరిగింది. అక్కడి ‘ప్రేమ్‌నివాస్’ అనే ఏరియాలో ఆమె బాల్యం గడిచింది. ‘మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసేవాడు. నాకు నలుగురు తోబుట్టువులు. నేను అక్కడి మోడర్న్ స్కూల్లో చదువుకున్నాను. మా నాన్న ఆ రోజుల్లోనే చాలా ప్రోగ్రెసివ్. ఆడపిల్లలను చదివించాలనుకున్నాడు. మా పెద్దక్క 1930లలోనే కాలేజీలో చదివింది. రావల్పిండి శివార్లలో మూరీ అనే హిల్ స్టేషన్ ఉంది. కొన్నాళ్లు అక్కడ మా నాన్న పని చేశాడు. అక్కడంతా బ్రిటిష్ వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లతో మేము కలిసి మెలిసి ఉన్నాం’ అని చెప్పింది రీనా వర్మ. ఆమె అసలు పేరు రీనా చిబ్బర్. పెళ్లయ్యాక రీనా వర్మ అయ్యింది. దేశ విభజన 1932లో పుట్టిన రీనా వర్మకు దేశ విభజన నాటికి 15 ఏళ్లు. ‘దేశ విభజన వరకూ మాకు మత కలహాలు అంటే తెలియదు. మా ఇంటికి ముస్లింలు, శిక్కులు వచ్చి పోతుండేవారు. అందరూ స్నేహంగా ఉండేవాళ్లు. కాని దేశ విభజన సమయానికి అల్లర్లు పెరిగిపోయాయి. మా అమ్మ అసలు దేశం విడిపోతుందంటే నమ్మలేదు. కాని మేము ఢిల్లీ వచ్చేశాం’ అంది రీనా వర్మ. ‘ఢిల్లీ వచ్చాక ఆమె తొలి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం నాకొక గొప్ప అనుభూతి. అప్పుడు నెహ్రూగారిని చూశాను. మళ్లీ 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత జరిగిన రిపబ్లిక్ డేలో లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ పాడుతున్నప్పుడు నేను నెహ్రూ గారి వెనుకనే కూచుని ఉన్నాను. ఆయన కన్నీరు కార్చడం నేను చూశాను’ అంటుంది రీనా. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు వచ్చి కావేరీ ఎంపోరియమ్‌లో పని చేయడం మొదలెట్టింది. భర్త హెచ్.ఏ.ఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లో చేసేవాడు. కాని ఎక్కడ ఉన్నా ఆమెకు ఒక్కసారి తిరిగి రావల్పిండి చూసి రావాలనే కోరిక వేధించేది. 1965 నుంచి ప్రయత్నిస్తే... 1965లో పాకిస్తాన్ వీసా కోసం ప్రయత్నిస్తే రాలేదు. కాని మధ్యలో క్రికెట్ మేచ్‌ల కోసం వీసాలు ఇస్తున్నారంటే 1990లో లాహోర్‌కు వెళ్లింది కాని రావల్పిండికి వెళ్లలేకపోయింది. 2021లో ఆమె తన ఫేస్బుక్లో రావల్పిండి గురించి రాస్తే పాకిస్తాన్‌కు చెందిన సజ్జద్ హైదర్ అనే వ్యక్తి రావల్పిండిలోని ఆమె ఇంటి ఫొటో తీసి పంపాడు. అది చూసినప్పటి నుంచి ఆమెకు ఇంకా ఆ ఇల్లు చూడాలనే కోరిక పుట్టింది. మళ్లీ వీసా కోసం అప్లై చేస్తే రాలేదు. ఇంకోసారి వీసాకు అప్లై చేసి ఆ విషయాన్ని ఫేస్బుక్లో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీకి ట్యాగ్ చేయడంతో 90 ఏళ్ల రీనా వర్మ కోరికను మన్నించాల్సిందిగా ఆమె ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఆమెకు వెంటనే మూడు నెలల వీసా మంజూరు చేసింది. వాఘా సరిహద్దు గుండా ఆమె రోడ్డు మార్గంలో పాకిస్తాన్లో అడుగుపెట్టింది. మాలాంటి వాళ్ల కోసం నిజానికి భారత్, పాకిస్తాన్ల మధ్య 60 ఏళ్లు దాటిన వారి కోసం సరిహద్దుల్లో తక్షణ వీసాలు ఇచ్చే ఒప్పందం ఉంది. కాని దానిని పాటించడం లేదు. ‘విడిపోకుండా ఉంటే బాగుండేది. సరే విడిపోయాం. కాని మాలాంటి వాళ్ల కోసం ఇరుదేశాలు వీసాలు ఇస్తే కొన్ని పాత జ్ఞాపకాలను సజీవం చేసుకుంటాం’ అంటుంది రీనా వర్మ. ఈ కథనం అంతా వాఘా దాటిన వెంటనే రాస్తున్నది. ఆమె అక్కడ ఏం చూసిందో ఏం చేసిందో మరో కథనంలో చెప్పుకుందాం. ఒక మంచి తలంపును గట్టిగా తలిస్తే నెరవేరుతుంది అనడానికి రీనా వర్మ ఒక ఉదాహరణ. -
Pak Vs Aus: పాక్ ఫ్యాన్స్‌కు ద్రోహం చేశాడు.. ఈ వయసులో నువ్వు కూడా!
Pakistan Vs Australia 1st Test: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాపై మండిపడ్డాడు. పనికిమాలిన పిచ్ తయారు చేయించిందే గాక.. ఇంకా సమర్థించుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా సుదీర్ఘ కాలం తర్వాత మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా మార్చి 4-8 మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. పేలవమైన ఈ పిచ్ ఒక్కసారి కూడా బౌలింగ్‌కు అనుకూలించకపోవడం గమనార్హం. ఫలితంగా బ్యాటర్లు చెలరేగారు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేయగా.. అజర్ అలీ, అబ్దుల్లా షఫిక్(136 నాటౌట్) చెరో శతకం బాదారు. ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్ ఖావాజా 97, లబుషేన్ 90 పరుగులు చేశారు. ఈ క్రమంలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో పిచ్ రూపొందించిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన పీసీబీ చీఫ్ రమీజ్ రాజా.. మ్యాచ్ పేలవ డ్రాగా ముగియడాన్ని తాను స్వాగతించడం లేదని, నాణ్యమైన పిచ్‌లను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఇందుకు సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. PCB Chairman reflects on the Rawalpindi Test and reiterates his plans on pitches for domestic and international matches in the country#PAKvAUS l #BoysReadyHain pic.twitter.com/OuD7wDvJw1 — Pakistan Cricket (@TheRealPCB) March 9, 2022 ఈ నేపథ్యంలో కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా రమీజ్ రాజా తీరుపై దుమ్మెత్తిపోశాడు. ‘‘రమీజ్ రాజా పాక్ అభిమానులకు ద్రోహం చేశాడు. వెన్నుపోటు పొడిచాడు. ఆయన తన కుమారుడి పెళ్లి పనులతో బిజీగా ఉన్నాడేమో! పర్లేదు! ఇప్పుడు మాత్రం ఈ జీవం లేని వికెట్ గురించి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది. కానీ.. మీరు.. ఇలంటి పిచ్ రూపొందించారు. బౌలర్లు రాణిస్తే చూడటం ఇష్టం లేదా? మీ కెప్టెన్ ఒక అసమర్థుడు. దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నాడు. ఇది ఎలాంటి పిచ్ అంటే రమీజ్ రాజా ఈ వయసులో కూడా అక్కడ పరుగుల వరద పారించగలడు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ ఆసీస్‌తో తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని డ్రాగా ముగించింది. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు స్కోర్లు: ఆస్ట్రేలియా- 459 ఆలౌట్ పాకిస్తాన్ 476/4 డిక్లేర్డ్ & 252/0 చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. చెలరేగి ఆడుతోన్న పాక్
రావల్పిండి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 245 పరుగులు సాధించింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హఖ్ (132 బ్యాటింగ్; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. అజహర్ అలీ (64 బ్యాటింగ్)తో కలిసి రెండో వికెట్‌కు ఇమామ్ 140 పరుగులు.. ఓపెనర్ షఫీఖ్ (44)తో తొలి వికెట్‌కు 105 పరుగులు జత చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయాన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఇది ఇలా ఉంటే.. పెషావర్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడి ఆస్ట్రేలియా క్రికెటర్లను ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే పెషావర్‌కు 187 కిమీ దూరంలో ఉన్న రావల్పిండి వేదికగానే తొలి టెస్ట్ జరగుతోంది. చదవండి: India Vs Sri Lanka 1st Test: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. తొలి రోజు మనదే.. -
పాకిస్తాన్లో మరో ఘోర ప్రమాదం
ఇస్లామాబాద్: ఘోర రైలు ప్రమాదం జరిగి 50 మంది మృతి చెందిన సంఘటన మరువకముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సింధు నదిలో వ్యాన్ పడిపోవడంతో 17 మంది దుర్మరణం పాలయ్యారు. సింధు నదిలో ప్రవాహం ఉధృతి ఉండడంతో మృతదేహాలు వెలికితీయడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఘటన ఆ దేశంలోని పానిబా ప్రాంతంలో జరిగింది. ఓ కుటుంబానికి చెందిన వారంతా వ్యాన్ అద్దెకు తీసుకుంటూ టూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్తాన్ చిలాస్‌కు చెందిన ఓ కుటుంబం వ్యాన్‌ను అద్దెకు తీసుకుంది. డ్రైవర్‌తో సహా మొత్తం 17 మందితో కూడిన వ్యాన్ చిలాస్ నుంచి రావల్పిండికి బయల్దేరింది. మార్గమధ్యలో కోహిస్తాన్ జిల్లాలోని పానిబా ప్రాంతానికి చేరుకోగానే వ్యాన్ అదుపు తప్పి సింధు నదిలోకి పడిపోయింది. డ్రైవర్‌తో సహా అందరూ మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వ్యాన్‌లో మృతదేహాలు కనిపించలేదు. ఆ ప్రవాహానికి మృతదేహాలు కొట్టుకుపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఒక మహిళ మృతదేహం మాత్రమే లభించినట్లు కోహిస్తాన్ పోలీస్ ఆరీఫ్ జావేద్ తెలిపారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బాయ్.. బయోబబూల్‌లో ఉన్నాం మర్చిపోయావా
రావల్పిండి: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన సహచర ఆటగాడు అజర్ అలీని ట్రోల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. ఆటలో నాలుగోరోజైన ఆదివారం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఒక పిల్లి మైదానంలోకి పరిగెత్తుకు వచ్చింది. పిల్లిని చూసిన అజర్ అలీ దానిని గ్రౌండ్ నుంచి బయటికి పంపడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన రిజ్వాన్.. అజ్జూ బాయ్.. మనం బయోబబూల్‌లో ఉన్నాం.. అది(పిల్లి) లేదు.. ముందు దానికి కరోనా టెస్టు నిర్వహించి ఆ తర్వాత బయటికి పంపు అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. రిజ్వాన్ వ్యాఖ్యలు విన్న పాక్ ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇస్మాయిల్ ఫారుక్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా రెండో టెస్టులో విజయం సాధించాలంటే ఇంకా 243 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఒక వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. మక్రమ్ 59, వాన్‌డర్ డస్సెన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు క్రితం రోజు స్కోరుతో నాలుగోరోజు ఆటను ఆరంభించిన పాక్ మహ్మద్ రజ్వాన్ సెంచరీతో( 115, 204 బంతులు; 15 ఫోర్లు) మెరవడంతో 298 పరుగులకు ఆలౌటై దక్షిణాఫ్రికా ముందు 370 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. సోమవారం ఆటకు ఆఖరిరోజు కావడం.. తొలి ఇన్నింగ్స్ హీరో హసన్ అలీ మరోసారి బౌలింగ్‌తో రెచ్చిపోతే ప్రొటీస్ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. కాగా ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. Cat enters ground. Azhar Ali chases it. Ajju bhai test nahi kiya ye bubble me nahi hai-Rizwan 😂#PAKvSA #Rizwan pic.twitter.com/qlphrGxjDE — Ismaeel Farrukh (@IsmaeelFarrukh) February 7, 2021 -
అంధకారంలో పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ చిమ్మచీకట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. విద్యుత్ సరఫరా గ్రిడ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో అంధకారం నెలకొంది. కరాచి, రావల్పిండి, ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, ఫైజలాబాద్ తదితర ప్రధాన నగరాల్లో శనివారం అర్ధరాత్రి ఒకే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే కొన్ని నగరాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు పాకిస్తాన్ ఇంధన శాఖ మంత్రి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం వెల్లడించారు. సింధ్ ప్రావిన్స్‌లోని గుడ్డు పవర్ ప్లాంట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం అర్ధరాత్రి 11.41 గంటలకు గ్రిడ్ కుప్పకూలిపోయింది. ఈ గ్రిడ్ నుంచే అత్యధిక నగరాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, కొన్ని నగరాల్లో పాక్షికంగా విద్యుత్‌ని పునరుద్ధరించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా జరగడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ అత్యంత పురాతనమైనది కావడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి షిబ్లిఫరాజ్ అన్నారు. -
జింబాబ్వే ‘సూపర్’ విక్టరీ.. 22/3 టూ 278/6
రావల్పిండి: పాకిస్తాన్‌కు జింబాబ్వే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న పాకిస్తాన్‌కు ఊహించని పంచ్ ఇచ్చింది. సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధించింది. సూపర్ ఓవర్లో పాకిస్తాన్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో మూడు పరుగుల టార్గెట్‌నే నిర్దేశించింది. ఈ టార్గెట్‌ను జింబాబ్వే బ్యాట్స్‌మన్ రాజా ఫోర్ కొట్టి మూడో బంతికే ముగించాడు. అంతకుముందు ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ అద్భుతంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. అయితే 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జింబాబ్వే.. అసాధారణ ప్రదర్శనతో అదగొట్టింది. 50 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉండి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మరో మూడు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేయడం ఇక్కడ విశేషం. అది కూడా పాకిస్తాన్ గడ్డపై జింబాబ్వే ఈ తరహా ప్రదర్శన చేయడం చర్చనీయాంశమైంది. జింబాబ్వే ఆటగాళ్లలో సీన్ విలియమ్స్(118), బ్రెండన్ టేలర్(56), రాజా(45), మద్వెరె(33)లు రాణించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ సరిగ్గా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. బాబర్ అజామ్(125), వహాబ్ రియాజ్(52), ఖుష్దీ షా(33)లు ఆకట్టుకున్నారు. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు కావాల్సిన తరుణంలో 12 పరుగులే చేసింది. దాంతో మ్యాచ్ టై కాగా, సూపర్ ఓవర్లో జింబాబ్వే గెలవడం గమనార్హం. ఇందులో జింబాబ్వే 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సందర్భం నంచి కోలుకోవడం ఒకటైతే, పాకిస్తాన్‌ను టై వరకూ తీసుకురావడం మరొకటి. ఇక సూపర్ ఓవర్లో పాక్‌ను ఓడించడంతో ఈ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. -
‘మీరు బాగా ఆడారు; లేదు.. ఔటయ్యాను’
రావల్పిండి: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభమైంది. బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఈ క్రమంలో గురువారం ఆట ముగిసిన తర్వాత లంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్ విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్ల ప్రశ్నలు డిక్వెల్‌తో పాటు అక్కడున్న మిగతా ఆటగాళ్లకు నవ్వులు తెప్పించాయి. ఇంతకీ విషయమేమిటంటే... మ్యాచ్ గురించి ఓ విలేకరి మాట్లాడుతూ... ‘ మీరు చాలా బాగా ఆడారు. సెంచరీకి దగ్గరగా ఉన్నారు. ఈ పిచ్‌పై శతకం సాధిస్తానని అనుకుంటున్నారా అని డిక్వెల్‌ను ప్రశ్నించాడు. ఇందుకు చిరునవ్వులు చిందించిన డిక్వెల్... ‘నేను డిసిల్వాను కాదు. డిక్వెల్‌ను అంటూ బదులిచ్చాడు. అయినప్పటికీ మరో విలేకరి సైతం ఇలాంటి ప్రశ్ననే సంధించడంతో..‘ మీరు నా గురించేనా మాట్లాడేది. నేను డిక్వెల్. ఇప్పటికే ఔట్ అయ్యి పెవిలియన్‌లో కూర్చున్నాను. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో వీలైతే సెంచరీ గురించి ఆలోచిస్తా’ అంటూ డిక్వెల్ ఓపికగా మళ్లీ అదే సమాధానమిచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో మ్యాచ్ వివరాలు, ఆటగాడి పేరు కూడా తెలుసుకోకుండా విలేకర్ల సమావేశానికి ఎలా వస్తారు. కనీస అవగాహన లేకుండా ప్రశ్నలు అడగడం సబబేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డిక్వెల్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా గురువారం ఆట ముగిసే సరికి ధనంజయ డిసిల్వా(72 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు. Dickwella’s classic replies #PAKvSL @OsmanSamiuddin @Athersmike @TheRealPCBMedia pic.twitter.com/s4LYrQwO96 — Rizwan Ali (@joji_39) December 12, 2019 -
పాక్‌లో ఇళ్లపై కూలిన విమానం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఒక చిన్న సైనిక విమానం మంగళవారం తెల్లవారుజామున రావల్పిండిలోని నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనిక సిబ్బంది సహా 19 మంది మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్ విమానం మోరా కలు గ్రామ శివారులో కూలడంతో ఐదారు నివాస గృహాలు ధ్వంసం అయ్యాయని పాకిస్తాన్ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ఐదుగురు సిబ్బంది మరణించారని వెల్లడించింది. అయితే 19 మంది మృతదేహాలను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు స్థానిక సహాయ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అగ్నిప్రమాదం సంభవించింది. -
జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి
రావల్పిండి : పాకిస్తాన్ ఆర్మీకి చెందిన విమానం కూప్పకూలిన ఘటనలో 17 మంది మృతిచెందారు. మంగళవారం తెల్లవారు జామున రావల్పిండిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా పాక్ అధికారులు తెలిపారు. మృతుల్లో 5 గురు విమాన సిబ్బంది కాగా, 12 మంది పౌరులు ఉన్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందిని దగ్గర్లోని అధికారులు ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. ఈ విమానాన్ని పాక్ ఆర్మీ ట్రైనింగ్ కోసం వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. విమానం కుప్పకూలడంతో ఆ చుట్టపక్కల పలు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రమాదం జరిగిన చోటుకి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. -
రావల్పిండి ఆర్మీ హాస్పిటల్లో భారీ పేలుడు
-
పాక్‌లో ఊహించని పరిణామాలు
రావల్పిండి : పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్‌లో ప్రధాన రాజకీయ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్)కు చెందిన నేతలకు పలు కేసుల్లో శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పులు వెలువడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే స్వదేశంలో అడుగుపెట్టిన ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను, ఆయన కూతురు మరియమ్‌ను పాక్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు హనీఫ్ అబ్బాసీకి జీవిత ఖైదు విధిస్తూ సీఎన్ఎస్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ముందర ఆందోళనకు దిగారు. పాక్ ఆర్మీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్)కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జూలై 25న జరిగే ఎన్నికల్లో తాము అనుకున్న వారిని గెలిపించుకోవడానికి ఐఎస్ఐ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. తీవ్రవాదం వెనుక పాక్ ఆర్మీ హస్తం ఉందని విమర్శించారు. యూఎస్ కూడా పాక్ ఎన్నికల్లో ఉగ్రవాదులు పోటీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి షౌకత్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఐఎస్ఐ మీడియాను, న్యాయవ్యవస్థను కంట్రోల్ చేస్తుందని అన్నారు. రావల్పిండి బార్ అసోసియేషన్ కూడా ఐఎస్ఐపై తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా వచ్చేలా న్యాయమూర్తులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. షరీఫ్, మరియమ్ కేసుల్లో కూడా అలానే జరిగిందని అన్నారు. కాగా పాక్ మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పాక్ ఆర్మీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ సమాఖ్య భావిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాది రెహమాన్ ఖలీల్ కూడా పీటీఐ పార్టీకి మద్దతుగా ప్రకటన చేయడం ఆందోళన కలిగించే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అంతా అనుకున్నట్లే జరిగింది...
లాహోర్: అవెన్ ఫీల్డ్ కేసులో జైలు పాలైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యమ్‌లు అప్పుడే ఒకరోజు జైలు జీవితం గడిపేశారు. లాహోర్ ఎయిర్‌పోర్ట్‌లోనే నవాజ్‌ను అదుపులోకి తీసుకుని నేరుగా రావల్పిండిలోని అదియాలా జైల్‌కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఆయనకు బీ క్లాస్ ట్రీట్మెంట్ను అందిస్తున్నట్లు సమాచారం. బీ క్లాస్ వసతులు.. పాక్‌లో నేరం తీవ్రత ఆధారంగా జైల్లో సదుపాయాల కల్పన ఉండదు. ఎంతటి నేరాలు చేసినా.. సోసైటీలో అప్పటిదాకా వారికి ఉండే హోదా, వారి ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు ఆధారంగానే ట్రీట్మెంట్ అందుతుంది. అయితే ఏ క్లాస్ కాకుండా బీ క్లాస్ గదులను నవాజ్‌కు కేటాయించటం చర్చనీయాంశంగా మారింది. గదిలో ఓ మంచం, ఓ కుర్చీ, చెంబు, మరుగుదొడ్డి సదుపాయం మాత్రమే ఉంటాయి. ఒకవేళ న్యాయస్థానం అనుమతిస్తే.. గదిలో ఫ్రిజ్, ఏసీ, టీవీ సదుపాయాలను కల్పిస్తారు. అయితే మరియమ్‌కు మాత్రం ఊరటనిచ్చిన అధికారులు.. సీహాలా రెస్ట్ హౌజ్‌కు తరలించి తాత్కాలిక సబ్‌జైలును ఏర్పాటు చేశారు. జైల్లో నవాజ్‌కు బీ కేటగిరీ సదుపాయాలు కల్పించటంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) కార్యకర్తలు మండిపడుతున్నారు. పనామా పత్రాలు, అవినీతి కేసుల్లో, లండన్‌లో అక్రమాస్తుల సంపాదన.. తదితర ఆరోపణలు రుజువు కావటంతో అకౌంటబిలిటీ కోర్టు.. నవాజ్ షరీఫ్(68)కు పదేళ్లు, ఆయన కూతురు మర్యమ్(44) ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. షరీఫ్ భార్య అనారోగ్యం కారణంగా లండన్‌లోనే కుటుంబం ఎక్కువగా గడుపుతోంది. అయితే జూలై 25న జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం ఆయన, మర్యమ్‌లు తిరిగి శుక్రవారం స్వదేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ పరిస్థితుల మధ్య అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసి.. జైలుకు తరలించారు. అరెస్ట్‌కు ముందే షరీఫ్ తనపై చేస్తున్న కుట్రను వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేయటం తెలిసిందే. -
బాంబు పేలుడు: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
కరాచీ: పాకిస్థాన్ సింధు ప్రావెన్స్లో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో ట్రాక్‌పై వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారని పాకిస్థాన్ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రావల్పిండి నుంచి క్విట్టాకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. పేలుడు వల్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైందని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ప్రకటించలేదు. -
కోర్టులో ఆగంతకులు కాల్పులు: ముగ్గురు మృతి
పాకిస్థాన్ కోర్టు తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది. ఆ కాల్పులలో పోలీసు, ఖైదీతోపాటు ఓ పౌరుడు మృతి చెందారు. ఆ ఘటన రావల్పిండిలోని స్థానిక కోర్టులో శుక్రవారం చోటు చేసుకుందని డాన్ పత్రిక వెల్లడించింది. స్థానిక కోర్టులో ఈ రోజు ప్రశాంతంగా ఓ కేసు విచారణ కొనసాగుతుంది. అయితే అప్పటికే కోర్టు హాల్లోకి ప్రవేశించిన ఆగంతకులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో కోర్టులోని వారంత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి....నలుగురు నిందితలను ఆదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అయితే ఆ దాడికి పాల్పడింది తామేనంటూ ఇంత వరకు ఏ సంస్థ ప్రకటించ లేదని డాన్ పేర్కొంది. ఆ సంఘటనలో గాయపడిన వారు పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.