బాంబు పేలుడు: పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు | 10 injured as blast hits railway track in Pakistan | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు: పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు

Published Sun, Jun 7 2015 8:51 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

10 injured as blast hits railway track in Pakistan

కరాచీ: పాకిస్థాన్ సింధు ప్రావెన్స్లో రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో ట్రాక్పై వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారని పాకిస్థాన్ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

జాఫర్ ఎక్స్ప్రెస్ రావల్పిండి నుంచి క్విట్టాకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. పేలుడు వల్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైందని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ప్రకటించలేదు.    
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement