train derailed
-
నాగ్‌పూర్‌లో పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సుభాష్ చంద్రబోస్ రైల్వేషన్ సమీపంలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరిన ఈ రైలు షాలిమార్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.రైలులోని S1, S2 కోచ్‌లు, గూడ్స్ కోచ్ పట్టాలు తప్పాయి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పట్టాలు తప్పిన హౌరా–ముంబై రైలు
జంషెడ్పూర్/రాంచీ/చాయ్‌బసా/కోల్‌కతా: జార్ఖండ్‌లోని సెరాయ్‌కెరా–ఖర్సావాన్ జిల్లాలో హౌరా–ముంబై మెయిల్ రైలు పట్టాలు తప్పింది. 18 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయపడ్డారు. జంషెడ్పూర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని బారాబంబూ స్టేషన్ దగ్గర్లోని పోటోబెబా గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి సమీపంలోనే గూడ్సు రైలు ఒకటి పట్టాలు తప్పిందని, రెండు ఘటనలు ఒకేసారి జరిగాయా అనేది తేల్చాల్సి ఉందని సౌత్‌ఈస్ట్‌రైల్వే అధికార ప్రతినిధి ఓం ప్రకాశ్ చరణ్ చెప్పారు. అయితే ఆగిఉన్న గూడ్సు రైలును హౌరా–ముంబై రైలు ఢీకొట్టిందని వెస్ట్ సింఘ్భమ్ డెప్యూటీ కమిషనర్ కుల్దీప్ చౌదరి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.1 లక్ష ఇవ్వనున్నారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఘటన జరిగిన రైల్వే మార్గం గుండా వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దుచేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. -
బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
పాట్నా: ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా బీహార్‌లో మరో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని కామాఖ్యాకు వెళ్తోన్న నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్పుర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వివరాల ప్రకారం.. నార్త్ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు బీహార్‌లోని రఘునాథ్పుర్ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పాయి. బుధవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపుగా 21 బోగీలు పట్టాలు తప్పాయని, మూడు బోగీలు పల్టీలు కొట్టినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందగా.. 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే స్తానిక ఆసుపత్రులకు తరలించారు. #WATCH | Bihar: Visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night Restoration work is underway. pic.twitter.com/xcbXyA2MyG — ANI (@ANI) October 12, 2023 రైలు ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్ఎఫ్కు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఘటనాస్థలికి పంపించామని, క్షతగాత్రుల్ని పట్నాలోని ఎయిమ్స్‌కి తరలిస్తామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. రైలు ప్రమాదం జరగడంతో రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. పాట్నా: 9771449971, ధన్పూర్: 8905697493, కమాండ్ కంట్రోల్: 7759070004, ఆరా : 8306182542 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. #WATCH | Bihar: Morning visuals from the Raghunathpur station in Buxar, where 21 coaches of the North East Express train derailed last night 4 people died and several got injured in the incident. pic.twitter.com/aiZZOYpfCc — ANI (@ANI) October 12, 2023 #WATCH | Bihar: Rescue operation by NDRF underway after 21 coaches of the North East Express train derailed near Raghunathpur station in Buxar pic.twitter.com/7mEvv9f6SE — ANI (@ANI) October 11, 2023 #WATCH | North East Express train derailment: Visuals from Primary Health Centre, Brahampur where some of the injured passengers have been admitted As per the General Manager of East Central Railway, 4 people died and several were injured after 21 coaches of the North East… pic.twitter.com/UOAC2FbuaA — ANI (@ANI) October 11, 2023 -
పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్.. పలు రైళ్లు ఆలస్యం
సాక్షి, తిరుపతి: పద్మావతి ఎక్స్‌ప్రెస్ బుధవారం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్ 6 వ ప్లాట్ ఫారంలో ఎక్స్‌ప్రెస్‌లోని ఒక భోగి పట్టాలు తప్పడంతో గుర్తించిన సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. సత్వర చర్యలు చేపట్టిన అధికారులు సమస్యను పరిష్కరించారు. షంటింగ్ చేస్తుండగా బోగీ పట్టాలు తప్పిందని వెల్లడించారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు సాయత్రం 4.55 గంటలకు బయలు దేరాల్సిన 12763 నెంబర్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ 19.45 నిమిషాలకు బయలుదేరనుంది. 12793 నెంబర్ తిరుపతి - నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ బయలుదేరే సమయం కూడా అధికారులు రీ షెడ్యూల్ చేశారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ 20:00 గంటలకు బయలుదేరనుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: వైఎస్సార్సీపీ నేత మృతి..) -
గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్..50 మందికి గాయాలు!
ముంబై: గూడ్స్ రైలును వెనకనుంచి ఢీకొట్టిన ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 50మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజస్థాన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మూడు బోగీలు పట్టాలు తప్పినట్లు చెప్పారు. గోండియా, గుధ్మా రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం రాత్రి 1.20 గంటల ప్రాంతంలో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ‘ ప్రాథమిక ఆధారాల ప్రకారం భగత్ కి కోథి ఎస్ఎఫ్ ఎక్స్‌ప్రెస్(20843) లోకో పైలట్ రైలును నియంత్రించలేకపోయాడు. దాంతో ముందు నిలిపి ఉంచిన గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. దాంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. కొందిరికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఓ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు.’ అని తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ రిలీఫ్ ట్రైన్, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైలును అక్కడి నుంచి పంపించారు. ఇదీ చదవండి: రూ.500 కోసం హత్య.. తల నరికి చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు..! -
రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
సాక్షి, బెంగళూరు: కన్నూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎక్స్‌పప్రెస్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు పట్టాలపై బండరాళ్లు పడంటతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 3.50 సమయంలో కదులుతున్న రైలు తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో తోప్పూరు-శివాడి ఘాట్ వద్ద బండ రాళ్లను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. చదవండి: దాడులతో నన్ను భయపెట్టలేరు: మాలిక్ రైలులో ఉన్న 2,348 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్ఓ వెల్లడించారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన చోటుకి వైద్య బృందాన్ని, డివిజినల్ అధికారుల బృందాన్ని పంపించామని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తొప్పూరులో మొత్తం 15 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. -
పట్టాలు తప్పిన షిరిడీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్‌లో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి షిరిడీకి వెళుతున్న సాయినాథ్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే రైల్వేస్టేషన్‌ను సమీపించిన రైలు నెమ్మదిగా రావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన రైల్వేకోడూర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వేసిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ఈ ఘటనపై షిరిడీకి వెళ్తున్న భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
పట్టాలు తప్పిన రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్
రాజస్థాన్ : రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 బోగీలు పక్కకు ఒరిగాయి. జైసల్మేర్ నుంచి ఖత్గోడం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదానికి గల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
బాంబు పేలుడు: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
కరాచీ: పాకిస్థాన్ సింధు ప్రావెన్స్లో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. ఆ సమయంలో ట్రాక్‌పై వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది రైలు ప్రయాణికులు గాయపడ్డారని పాకిస్థాన్ రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రావల్పిండి నుంచి క్విట్టాకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. పేలుడు వల్ల రైల్వే ట్రాక్ ధ్వంసమైందని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ప్రకటించలేదు. -
న్యూయార్క్‌లో పట్టాలు తప్పిన మెట్రో రైలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న బ్రాంక్స్ ప్రాంతంలో మెట్రో నార్త్‌కు చెందిన ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా 67 మంది గాయపడ్డారని న్యూయార్క్ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్‌కు వెళ్తున్న రైలు బ్రాంక్స్ ప్రాంతంలోని స్పైటెన్ డ్వైవిల్ స్టేషన్ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7గంటలకు పట్టాలు తప్పినట్టు తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో రైలుకున్న 8 బోగీల్లో ఆరు బోగీలు చెల్లాచెదురయ్యాయని, వీటిలో ఒక బోగీ సమీపంలోని హార్లెం నదికి ఒక్క అడుగు దూరంలో పడి ఆగిందని వివరించారు. పోలీసులు దాదాపు 100 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారని అదేవిధంగా ఈతగాళ్లు నదిలో ఎవరైనా పడ్డారేమోనని గాలింపు చేపట్టారని వివరించారు. అత్యంత ప్రమాద కరమైన మలుపుగుండా రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోరం సంభవించినట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది. రైలు ఎక్కువ వేగంగా ప్రయాణించినందునే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని ఓ ప్రయాణికుడు తెలిపాడు.ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు.