సాక్షి, బెంగళూరు: కన్నూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎక్స్‌పప్రెస్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు పట్టాలపై బండరాళ్లు పడంటతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 3.50 సమయంలో కదులుతున్న రైలు తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో తోప్పూరు-శివాడి ఘాట్ వద్ద బండ రాళ్లను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.
చదవండి: దాడులతో నన్ను భయపెట్టలేరు: మాలిక్
రైలులో ఉన్న 2,348 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్‌ఓ వెల్లడించారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన చోటుకి వైద్య బృందాన్ని, డివిజినల్ అధికారుల బృందాన్ని పంపించామని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తొప్పూరులో మొత్తం 15 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment