Banglore
-
చిచ్చు రాజేసిన ఎండుగడ్డి.. 150 వాహనాలు అగ్నికి ఆహుతి
బెంగళూరు : శ్రీరామ్ పురాలో (srirampura) భాగీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 150 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. బెంగళూరు (bangalore) పోలీసు వివరాల మేరకు.. బెంగళూరు సిటీ పోలీసులు వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాల్ని జక్కరాయనకెరె ప్రాంతంలో రెండెకరాల స్థలంలో పార్క్ చేస్తుంటారు.ఈ నేపథ్యంలో బుధవారం వాహనాలు పార్క్ చేసిన ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పార్క్ చేసిన వాహనాల్లో 150 వాహనాలు దహనమైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు ఫైరింజన్లను ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు రెండుగంటల పాటు నిర్విరామంగా ప్రయత్నించారు. ఇక అగ్నికి ఆహుతైన వాహనాల్లో 130 ద్విచక్రవాహనాలు,10 ఆటోలు, పది కార్లు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న శ్రీరామ్ పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో ఎండిన గడ్డి కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. కేసు విచారణ కొనసాగుతోంది.Massive fire in Bangalore. Somewhere north of BTM#Bangalore #fireaccident #Bengaluru pic.twitter.com/xEkxCRRYQt— Shashank Shekhar (@qri_us) January 29, 2025 -
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్‌ను కిగాలీ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
యోగి ఆదిత్యనాథ్ విమర్శలపై మండిపడ్డ ప్రియాంక్ ఖర్గే
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన విమర్శలుపై కాంగ్రెస్ అధ్యక్షుడ మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఖర్గే చిన్ననాటి విషాదాన్ని యోగి ప్రస్తావించటంపై మండిపడ్డారు. ఆ సంఘటనను కాంగ్రెస్ చీఫ్ ఖర్గే.. రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఉపయోగించుకోలేదని అన్నారు. 1948లో తన తండ్రి ఇంటిని తగలబెట్టింది హైదరాబాద్ నిజాం రజాకార్లని, కానీ మొత్తం ముస్లిం సమాజాన్ని కాదని ‘ఎక్స్’లో స్పష్టం చేశారు.‘‘మా ఇంటిని కూల్చిన చర్యలకు పాల్పడింది రజాకార్లు, కానీ మొత్తం ముస్లిం సమాజం కాదు. ప్రతి సంఘంలో చెడు, తప్పు చర్యలకు పాల్పడే వ్యక్తులు ఉంటారు. నా తండ్రి ఖర్గే.. తృటిలో విషాదం నుంచి తప్పించుకున్నారు. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగారు’ అని తెలిపారు.Yes, @myogiadityanath ji, in 1948, the Razakars burned down Sri @kharge ji’s house, taking the lives of his mother and sister. Though he narrowly escaped, he survived and rose to become a 9 time MLA, twice Lok Sabha and Rajya Sabha MP, central minister, the Leader of the Lok…— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) November 13, 2024 మల్లికార్జున ఖర్గే నిజాంల పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో జన్మించారు. భారతదేశంలో విలీనానికి ముందు హైదరాబాద్‌లో చెలరేగిన రాజకీయ అశాంతి సందర్భంగా నిజాం అనుకూల రజాకార్లు ఖర్గే గ్రామాన్ని తగలబెట్టారు. ఈ విషాదంలో ఖర్గే.. తన తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులను కోల్పోయారు.ఇటీవల మహారాష్ట్రలోని అచల్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ తన ‘బాటేంగే తో కటేంగే (విభజిస్తే నశిస్తాం)’ అనే నినాదంపై మల్లికార్జున్ ఖర్గే చేసిన విమర్శలపై స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘నా మీద కోపం తెచ్చుకోకండి. కావాలంటే హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి. హైదరాబాద్ నిజాం రజాకార్లు మీ గ్రామాన్ని తగలబెట్టారు. హిందువులను దారుణంగా హత్యచేశారు. మీ గౌరవనీయమైన తల్లి, సోదరి, మీ కుటుంబ సభ్యులను హత్యచేశారు. ఎప్పుడైతే విడిపోతామో ఆనాటి క్రూరమైన పద్ధతిలో విడిపోవాల్సి వస్తుందనే సత్యం ప్రస్తుతం దేశం ముందు ఉంది. ముస్లిం ఓటు బ్యాంక్ దెబ్బతింటుందనే భయంతో కాంగ్రెస్ చీఫ్ ఈ సత్యాన్ని అంగీకరించడానికి సంకోచిస్తున్నారు’’ అని అన్నారు. -
విచారణకు రావాలి.. సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసు కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అయితే.. తాజాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.అందులో భాగంగా ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక..బుధవారం (నవంబర్ 6) ఉదయం సీఎం సిద్ధరామయ్య తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు.. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.‘‘ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసు జారీ చేశారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళ్లుతా’ అని అన్నారు. ఇక.. ఇదే కేసులో ఇటీవల సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త ప్రశ్నించిన విషయం తెలిసిందే.సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.Haveri: Karnataka CM Siddaramaiah says, "Yes, Mysore Lokayukta has issued a notice regarding MUDA. I will go to Mysore Lokayukta on 6th November." pic.twitter.com/cWNydSusOR— ANI (@ANI) November 4, 2024ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది.ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది.కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు.‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు.అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. -
మహిళల ఉచిత బస్సు పథకం రద్దుపై కర్ణాటక సీఎం క్లారిటీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే 'శక్తి' పథకాన్ని పునఃసమీక్షించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే.. ఈ పథకంపై చర్చ జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల వ్యాఖ్యలుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే గురువారం స్వయంగా సీఎం సిద్ధరామయ్య స్పష్టత ఇచ్చారు. ‘‘ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు. డీప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ కొంతమంది మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన సమయంలో నేను లేను’అని అన్నారు.ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో.. ఉచిత బస్సు ప్రయాణాన్ని పొందుతున్న మహిళలు తమ ప్రయాణానికి డబ్బు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తనను సంప్రదించారని శివకుమార్ పేర్కొన్నారు. ‘‘ చూద్దాం, మేం దీనిపై కూర్చుని చర్చిస్తాం. మరికొంతమంది మహిళలు.. కొంత చార్జీని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. రవాణా మంత్రి రామలింగారెడ్డి, నేను ఈ అంశంపై పరిశీలన చేస్తాం’అని అన్నారు. కొందరు మహిళలు టికెట్ డబ్బులు చెల్లిస్తామని ట్వీట్లు, మెయిళ్లు పెడుతున్నారని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. ఇక.. ఐదు గ్యారంటీల్లో భాగంగా గతేడాది నుంచి కర్ణాటకలో ‘శక్తి’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. -
ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం.. చివరికి ఏమైందంటే?
బెంగళూరు : మంచి కంపెనీ. సంస్థ పేరుకు తగ్గట్లు ప్యాకేజీ. అందుకే ఓ టెక్కీ ఆ ఆ భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కేవలం నాలుగు రౌండ్లు జరిగే ఒక్క ఇంటర్వ్యూ కోసమే ఏడు నెలలు కష్టపడ్డాడు. అలా అని సదరు టెక్కీ.. క్ బెంచ్ స్టూడెంటా అంటే అదీ కాదు. చదువులో టాపర్. ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ పూర్వ విద్యార్థి. మరి ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలలు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందని అడిగితే.. సదరు టెక్కీ ఏం చెప్పారంటే?ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాకు చెందిన చిత్రాంశ ఆనంద్. భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఒరాకిల్‌లో కంపెనీలో రెండేళ్ల పాటు పనిచేశాడు. ఏడాదికి రూ.40 లక్షలు ప్యాకేజీ. మంచి శాలరీ, అనుభవం కోసం మరో కంపెనీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. చివరికి ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో తన అనుభవానికి తగ్గట్లు ఉద్యోగం ఉందని తెలుసుకుని అప్లయి చేశాడు.అనంతరం తన ఇంటర్వ్యూల కోసం ఏడు నెలల రీసెర్చ్ చేశాడు. రేయింబవళ్లు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాడు. ఇందుకోసం లీట్‌కోడ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. ఇందులో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌ను ఎలా చేధించవచ్చో తెలుసుకోవచ్చు. అలా ఏడు నెలల అనంతరం ఉబెర్ ఇంట్వ్యూకి అటెండ్ అయ్యాడు. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలో బోర్డ్ సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలకు నేను చదవిన చదువుకు.. సంబంధం లేదు. అయినప్పటికీ వాటికి ఆన్సర్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రూ.60లక్షలు ఇచ్చేందుకు ఉబర్ ముందుకు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.ఈ సందర్భంగా ఆనంద్ ఒరాకిల్,ఉబర్‌లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాడు. ఒరాకిల్‌లో ఐదు రోజులకు మూడురోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి వచ్చింది. ఉబర్‌లో వారానికి రెండు రోజులు మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేస్తా. అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు. నా కెరియర్ ప్రారంభంలో ఉంది కాబట్టి ఆఫీస్- పర్సనల్ లైఫ్ విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందడం లేదు. నేను అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేయాలి. ఆ తర్వాత లైఫ్ బ్యాలెన్స్ విషయాలపై దృష్టిసారిస్తా అని చెప్పుకొచ్చాడు. -
చెన్నై, బెంగళూరులో భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు
చెన్నై: దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై, బెంగళూరులో పాఠశాలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కేరళ రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.#WATCH | Chennai, Tamil Nadu: Heavy rainfall causes waterlogging in several parts of the city(Visuals from Choolaimedu area) pic.twitter.com/3hWHlXfPSL— ANI (@ANI) October 16, 2024 భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైన సేవలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మూసివేయలని పేర్కొంది.Good morning #Chennai. 16 Oct 4:45 am : System moving North West towards North TN and South AP coast #Chennairains #Chennai Most of the main band over South Andhra coastDrizzle rain band over #Chennai. No need to worry for now. pic.twitter.com/r7aWnpm5nd— Chennai Weather-Raja Ramasamy (@chennaiweather) October 15, 2024రేపు (గురువారం) తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి, నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పీడన ప్రాంతం పశ్చిమం నుంచి వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం అల్పపీడనంగా మారింది. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో బెంగళూరు, చెన్నైలలో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని నగరంలో మోహరించారు.Palavanthangal Subway. 7 AM #ChennaiRains pic.twitter.com/v2YIiRUxv3— Dhivya Marunthiah (@DhivCM) October 16, 2024 3 தலைமுறையா கொள்ளை அடிச்சுட்டு இருக்கானுங்க அப்பவும் பத்தல போல.அவ்ளோ பணத்த வச்சு என்னதான் பண்ணுவானுங்களோ, கொஞ்சமாவது மக்கள் நலனுக்கு செலவு பண்ணுங்கடா!!!#ChennaiRains pic.twitter.com/YamVQQ0Zo2— Arvinth Easwaran (@arvinth_e) October 16, 2024 ‘‘బెంగళూరులో భారీ వర్షాల నేపథ్యంలో బెంళూరులో హై అలర్ట్ ప్రకటించాం. ఇప్పటికే బెంగళూరులో సుమారు 60 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించాం. ఏదైనా అవసరం కోసం సిద్ధంగా ఉండటానికి మరో 40 మందిని మళ్లీ నియమించాం. అగ్నిమాపక , అత్యవసర సేవలను సిబ్బందిని అందుబాటులో ఉంచాం’ అని కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ తెలిపారు.Current situation of BangloreAs Per Wheather Reports 5 Days light moderate and some time Heavy rain at Banglore#BangloreRains #INDvsNZpic.twitter.com/oYC0GKyXxf— Cricket Manchurian (@Cric_man07) October 16, 2024Bengaluru Weather Alert: Depression taking slightly northwards path. #Bengaluru will experience cloudy weather with intermittent light rain or drizzle for 36 hours with moderate rain spells in afternoon/evening. Strong impact will be near #Hindupur -#Nellore belt slightly north. pic.twitter.com/mQSFRb4AEL— 🛑 Bengaluru Rain Alert (@Bengalururain) October 16, 2024 -
కర్ణాటకలో ‘ముడా’ ప్రకంపనలు.. ఖర్గే కీలక నిర్ణయం!
బెంగళూరు: గత కొంత కాలంగా మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.Amid the MUDA scam, Congress President @kharge's son @PriyankKharge has returned the 5 acres of KIADB land.The fear among the corrupt is clearly showing. Just wait – soon even the Gandhi-Nehru family will be added to the list! pic.twitter.com/xV19YWwge4— Tulla Veerender Goud (@TVG_BJP) October 13, 2024ఆయన కుటుంబానికి సంబంధించిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ప్రభుత్వం.. బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్లో ఐదు ఎకరాల భూమిని మంజూరు చేసింది. అయితే ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. కర్ణాటక ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సిద్ధార్థ విహార్ ట్రస్టుకు కేటాయించగా.. మల్లికార్జున్ ఖర్గే, ఆయన అల్లుడు రాధాకృష్ణ, కుమారుడు రాహుల్ ఖర్గే మొదలైన వారు ట్రస్టీలుగా ఉన్నారు. ఇక.. ఈ స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇటీవల ఓ వ్యక్తి కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే తమ ట్రస్టుకు కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది.చదవండి: MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్ -
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రామనగర జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో అత్యాచారం ఘటన జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే మునిరత్న సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోద చేసినట్ల తెలిపారు. మునిరత్నం రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే.Karnataka | A rape, sexual harassment case has been filed against Rajarajeshwari Nagar BJP MLA Munirathna. The case was registered at Kaggalipura police station in Ramanagara district. As per the complaint, the incident took place at a private resort under Kaggalipura police…— ANI (@ANI) September 19, 2024ఇప్పటికే మునిరత్న ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో ప్రస్తుతం బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్‌పై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇవాళ( గురువారం) విచారణ చేపట్టనుంది.అయితే మునిరత్న జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే.. తాజాగా కేసులో ఆయన్ను జైలు దగ్గరే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ తిరస్కరణకు గురైతే కగ్గలిపుర పోలీసులు వారెంట్ దాఖలు చేసి ప్రొసీజర్ ప్రకారం అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) కాంట్రాక్టర్‌ను బెదిరించినందుకు మునిరత్నను బెంగళూరు పోలీసులు సెప్టెంబర్ 14 రాత్రి అదుపులోకి తీసుకున్నారు.చదవండి: Actor Darshan: కారాగారంలో 100 రోజులు -
‘జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!’ ఎపిసోడ్లో ట్విస్ట్!
తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెప్పిన 34 ఏళ్ల టెక్కీ విపిన్ గుప్తా ఎపిసోడ్‌పై ఆయన భార్య శ్రీపర్ణ దత్త స్పందించారు. తాను భర్తను వేధించానంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. భార్య వేధిస్తుంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తన భర్త గత కొంత కాలంగా కెరియర్ గురించి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. గతంలో తన భర్తపై మిస్సింగ్ కేసు వేసిన శ్రీపర్ణ దత్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నా భర్త విపిన్ రెండుసార్లు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తండ్రికి అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఉపశమనం పొందేందుకు తిరుమల దర్శనం అనంతరం నోయిడా వెళ్లినట్లు చెప్పారు. అన్నీ అవాస్తవాలేఈ సందర్భంగా తాను విపిన్‌ను వేధిస్తున్నానంటూ వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. ‘నేను నా భర్తను వేధిస్తే.. ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తాను. నేను నా భర్తను ఎప్పుడూ వేధించలేదు. అదే జరిగితే, అతనిని వెతకాలని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తాను? ఆచూకి కోసం సోషల్ మీడియాలో పోస్ట్‌లు ఎందుకు పెడతాను’ అని ప్రశ్నించారు. మానసికంగా కృంగిపోయాడు కాబట్టే భర్తను పునరావాస కేంద్రానికి పంపించినట్లు ఆమె చెప్పారు.బెదిరింపులు ఎక్కువయ్యాయ్తన భర్త దొరికిన తర్వాత కూడా తనకు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని వాపోయారు శ్రీపర్ణ దత్త. నా భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు సైబర్ నేరస్తులు మెసేజ్‌లు పంపినట్లు వెల్లడించారు. భార్య పోరు పడలేకేగతవారం బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించే ఐటీ ఉద్యోగి విపిన్ గుప్త ఇంటి నుంచి నోయిడా వెళ్లాడు. అయితే విపిన్ జాడకోసం ఆయన భార్య శ్రీపర్ణ దత్తా పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని పోలీసుల్ని కోరాడు. అయితే పోలీసులు విపిన్‌ను బుజ్జగించడంతో కష్టం మీద ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. భార్యే విపిన్ మానసిక సమస్యకు చికిత్స ఇప్పించేందుకు పునరావస కేంద్రానికి పంపించారు. -
కేంద్రం కుట్రపై న్యాయపోరాటం చేస్తాం: సిద్ధరామయ్య
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రజాస్వామమ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. విజయనగరలో అక్రమంగా భూములు కేటాయించలేదు. కేంద్రం చెప్పినట్లుగా గవర్నర్ నడుచుకుంటున్నారు. బీజేపీ ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోంది. అందుకు గవర్నర్ థావర్ను పావుగా వాడుకుంటోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని సిద్ధరామయ్య అన్నారు.Bengaluru | On Karnataka Governor granting permission to prosecute him in the alleged MUDA scam, CM Siddaramaiah says, "We have called an urgent cabinet meeting today. I thank DK Shivakumar and all my ministers. Congress party also stands with me. Congress workers are also… pic.twitter.com/z4GIw7ZWSa— ANI (@ANI) August 17, 2024చదవండి: MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’ -
బెంగళూరులో కుక్కర్ పేలుడు.. రంగంలోకి ఎన్ఐఏ
బెంగళూరు: బెంగళూరులో కుక్కర్ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి వంట సామాను మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వెనక ఉగ్రవాద కోణం లేదని పోలీసులు పేర్కొన్నప్పటికీ.. తీవ్రతను పరిశీలించడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం సంఘటనా స్థలానికి రంగంలోకి దిగింది. బెంగళూరులోని జేపీ నగర్‌లోని ఉడిపి ఉపహారా ఫుడ్‌షాప్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు కుక్కర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్, మొహిసిన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇద్దరూ ఉత్తర ప్రదేశ్‌కి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ‘‘పేలుడు పదార్థాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాం. ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడుగా తేలింది. ఉదయం దర్యాప్తు కోసం అక్కడి సామగ్రిని పరిశీలించాం. అల్లర్లు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే పేలుడు తీవ్రతను తెలుకునేందుకు ఎన్ఐఏ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు’ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఏడాది మొదట్లో బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. -
నీట్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీర్మానం!
బెంగళూరు: నీట్ యూజీ- 2024 పేపర్ లీక్, నిర్వహణలో అవకతవకలు దేశంలో దుమారం రేపాయి. అయితే తాజాగా నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మరో రెండు తీర్మానాలను సోమవారం కర్ణాటక రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం. మరో రెండు తీర్మానాలు ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల విభజనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నీట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రాలే సొంతంగా తమ పరీక్షలను నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో నీట్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయగా.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఇదే తరహా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.మరోవైపు.. కేబినెట్లో ఆమోదం పొందిన ఈ తీర్మానాలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపట్టనున్నారు. వీటీతోపాటు, గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ బిల్లు 2024కు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ధోతీ ధరించాడని.. మాల్‌లోకి అనుమతి నిరాకరణ!
బెంగళూరు: ధోతీని ధరించినందుకు ఓ వృద్ధరైతుకు షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశం నిరాకరించారు. ఈ ఘటన బెంగళూరులోని జీటీ మాల్లో చోటుచేసుకుంది. ఒక వృద్ధ రైతు జీటీ మాల్లో సినిమా చూడటానికి తన కుమారుడితో కలిసి వెళ్లారు. అయితే వృద్ధుడు ధరించిన ధోతీని చూసి.. భద్రతా సిబ్బంది ఆయన్ని, ఆయన కుమారుడుని మాల్ లోపలికి వెళ్లకుండా ఆపేశారు.This mall should be fined! Elderly farmer denied entry to GT world shopping mall in #Bengaluru cuz he was wearing a Dhoti 🤷🏽♀️Fakeerappa, a farmer in his 70's was hoping to watch a movie with his family, had booked his ticket prior, but was stopped at the gates of GT mall… pic.twitter.com/xpKaeBJzzf— Nabila Jamal (@nabilajamal_) July 17, 2024 మాల్ యాజమాన్యం ధోతీ ధరించినవారిని లోపలికి అనుమతించకూడదని ఆదేశించినట్లు తెలిపారు. మాల్‌లోకి ప్యాంట్స్ వేసుకొని వచ్చినవాళ్లను మాత్రమే అనుమతించాలని చెప్పారని అన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో వృద్ధుడిని అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. తర్వాత ఆయనకు క్షమాపణలు తెలిపారు.మరోవైపు.. ‘ఈ ఘటనపై పోలీసులు మాల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే వేలమంది రైతులతో నిరసనకు దిగతాం’ అని రైతు నాయకుడు కురుబురు శాంతకుమార్ డిమాండ్ చేశారు. ఇక.. సోషల్‌మీడియాలో సైతం నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ.. మాల్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఓ వ్యక్తి సంచి నెత్తిన పెట్టుకొని రాజాజీనగర్ మెట్రోస్టేషన్‌కు వెళ్లితే.. అక్కడి సిబ్బంది ఆయన దుస్తులు సరిగాలేని అనుమతింలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారటంతో స్టేషన్ ప్లాట్‌ఫామ్ అధికారులు క్షమాపణలు తెలిపారు. -
‘రియల్’ రికార్డ్!! ఒక్క రోజులోనే 2,000 ఇళ్లు సేల్..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇళ్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి రోజే 2,000 పైగా ఇళ్లను విక్రయించింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ షేర్లు రికార్డు లాభాలను అందుకున్నాయి.ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్-బుడిగెరె క్రాస్‌లోని గోద్రేజ్ వుడ్స్కేప్స్లో రూ. 3,150 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ అనేది విలువ, అమ్మకాల వాల్యూమ్ల పరంగా తమ "అత్యంత విజయవంతమైన" లాంచ్ అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఫైలింగ్ తెలిపింది. గత నాలుగు త్రైమాసికాలలో ప్రారంభంలోనే రూ. 2,000 కోట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ ఆరో ప్రాజెక్ట్ ఇది.బెంగళూరులో గోద్రెజ్ వుడ్‌స్కేప్స్ విజయంతో విక్రయాలలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో 500% పైగా వృద్ధిని సాధించింది. సుమారు రూ. 3,000 కోట్ల ఆదాయ అంచనాతో పుణె, బెంగళూరులో ల్యాండ్ పార్సెల్‌లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్స్ కొత్త గరిష్టాలకు ఎగిశాయి. 3.23% లాభాన్ని నమోదు చేశాయి. -
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడిపై లైంగిక ఆరోపణలు.. బెదిరింపులపై ఫిర్యాదు
బెంగళూరు: జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక ఆరోపణల కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆయన సోదరుడు సూరజ్ రేవణ్ణపై ఓ యువకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పోలీసులకు లేఖ రాశారు. దీనిపై సూరజ్ రేవణ్ణ స్నేహితుడు శివకుమార్ సదరు యువకుడితో పాటు మరో వ్యక్తిపై హసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘చేతన్, అతని బావ ఇద్దరూ నన్ను కలిశారు. వారు నా దగ్గర రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. వారు కోరినట్లు రూ. 5 కోట్లు ఇవ్వకపోతే.. సూరజ్ రేవణ్ణపై లైంగిక దాడి కేసు నమోదు చేస్తామని బెదిరించారు’ అని శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చేతన్ ముందు తననను కలిసి.. ఉద్యోగం ఇప్పించటం కోసం సాయం చేయాలని కోరాడని శివకుమార్ తెలిపారు. దీంతో నేను సూరజ్ రేవణ్ణ ఫోన్ నంబర్ ఇచ్చాను. అతనికి ఉద్యోగం ఇప్పించనందుకే తమ ఇద్దరినీ (శివకుమార్, సూరజ్ రేవణ్ణ)ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫోలీసులకు శివకుమార్ ఫిర్యాదు చేశారు.మరోవైపు.. చేతన్ సైతం ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సూరజ్ రేవణ్ణ తనను ఆయన ఫామ్ హౌజ్‌లో లైంగిక వేధింపులుకు గురిచేశాడని ఆరోపించారు. ఇక.. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్న కొన్ని రోజులకే ఓ యువకుడు అతని సోదరుడు సూరజ్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు రావటం రాజకీయం తీవ్ర చర్చనీయాంశం అయింది. -
కర్ణాటకలో కొత్త ట్విస్ట్.. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్‌లోని వారి నివాసంలోనే జూన్ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. #BreakingS.I.T issues another notice to #PrajwalRevanna's mother #BhavaniRevanna in the kidnapping case.Prajwal Revanna will shortly be taken for a medical examination, and after that, he will be brought to the City Civil Court Complex for further questioning...: @dpkBopanna… pic.twitter.com/G9croxFBP6— TIMES NOW (@TimesNow) May 31, 2024 ఇక.. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక.. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్‌కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘నన్ను టార్గెట్ చేస్తున్నారు’.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కాంగ్రెస్ ప్రభుత్వం, తనపై కొందరు తాంత్రిక పూజలు జరుపుతున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ కాంగ్రెస్ ప్రభుత్వం, నాపై కేరళలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో, ఎప్పటి నుంచి ఆ పూజలు చేస్తున్నారలో నాకు తెలుస్తునే ఉంది. ఈ పూజలను కొందరు నాతో పాటు సీఎం సిద్ధరామయ్యపై కూడా చేయిస్తున్నారు. కేరళలోని రాజ రాజేశ్వరీ ఆలయంలో శత్రువులను తొలగించటం కోసం కొందరు ‘‘శత్రు భైరవీ యాగం’’ (అగ్నిబలి) పేరిట పూజలు చేస్తున్నారు. పంచబలి(ఐదు వస్తువులను బలి ఇవ్వటం) చేస్తున్నారు. దీని కోసం ఎర్రమేక, 21 బర్రెలు, మూడు నల్ల మేకలు, ఐదు పందులను బలి ఇచ్చారు. దీని ఫలితంగా అగ్ని బలి జరుగుతుంది. ఫలితంగా శత్రువులు తొలిగిపోతారని నమ్మకం ఉంది’’ అని డీకే శివ కుమార్ అన్నారు.ఈ పూజలు ఇంకా కొనసాగుతున్నాయని డీకే తెలిపారు. ఆ పూజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అందుతోందని అన్నారు. అయితే ఈ పూజలు ఎవరూ జరిపిస్తున్నారన్న విషయాన్నిమాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, ఓ ప్రతిపక్ష నాయకుడి ఆదేశాల మేరకు ఈ తాంత్రిక పూజులు జరుగుతున్నాయని తెలిపారు.‘‘అలా చేయటం వారి నమ్మకం. దాన్ని వారికే వదిలేస్తున్నా. వారు ఏం చేయాలకుంటే అది చేసుకోవచ్చు. వాళ్ల పూజల నుంచి మమ్మల్ని రక్షించే శక్తి మా వెంటే ఉంది’’ అని డీకే శివకుమార్ అన్నారు. -
బెంగళూరులో బిగ్ ట్విస్ట్.. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.చదవండి: ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణSuspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.చదవండి: మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవణ్ణపలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్ గత ఏప్రిల్‌లో భారత్ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే.చదవండి: ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్యచదవండి: ప్రజ్వల్ రేవణ్ణకు తాత దేవెగౌడ వార్నింగ్.. వెంటనే భారత్‌కు రావాలి -
రేవ్ పార్టీ అంటే ఏమిటి?
-
ఎంపీ ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి లైంగిక దాడి, వైరలైన అభ్యంతర వీడియోల వ్యవహారంపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా తొలిసారి ఈ వ్యవహారంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణపై నేరం నిరూపణ అయి దోషిగా తేలితే.. చర్యలు తీసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. హెచ్డీ రేవణ్ణపై మహిళల వేధింపు, కిడ్నాప్ కేసులు కావాలని సృష్టించినవి’ అని దేవెగౌడ్ అన్నారు. ‘‘హెచ్ డీ రేవణ్ణకు సంబంధించిన కేసు కోర్టు ఉంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ప్రజ్వల్ విదేశంలో ఉన్నాడు. ఈ వ్యవహరంలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం ప్రభుత్వం విధి. మహిళ వేధింపుల కేసులో ఇంకా చాలా మందికి సంబంధం ఉంది. నేను ఎవరీ పేరును బయటపెట్టాలనుకోవటం లేదు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని, వారికి నష్ట పరిహారం అందిచాలని ఇప్పటికే హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు’’ అని దేవెగౌడ అన్నారు.ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించిన లైంగిక దాడి కేసులో కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనుసాగుతోంది. అభ్యంతరమైన వీడియోలు వైరల్ అయిన అనంతరం జర్మనీ వెళ్లిపోయిన ప్రజ్వల్ ఇంకా భారత్‌కు తిరిగిరాకపోవటం గమనార్హం. -
రూ.49కే 48 కోడిగుడ్ల స్టోరీతో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ కావడం గ్యారెంటీ!
‘మేడం..మేడం మంచి తరుణం మించిన దొరకదు..ఆలోచించిన ఆశా భంగం.. నాలుగు డజన్ల కోడిగుడ్లు రూ.49కే అందిస్తాం’ అంటూ ఓ మహిళకు మెయిల్ వెళ్లింది. ఆ తర్వాత ఏమైందంటే? టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని అటు పోలీసులు, ఇటు సోషల్ మీడియాలో సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పలువురు మోసాల బారిన పడుతున్నారు. భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకున్న తర్వాత లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. తాజాగా, బెంగళూరులోని వసంత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఫిబ్రవరి 17న మెయిల్ వచ్చింది. అందులో కోళ్ల ఫారం నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ తక్కువ ధరకే కోడిగుడ్లను అందిస్తుంది. అందులో కోళ్ల పెంపకం, కోడిగుడ్ల డెలవరీ గురించి ఓ రెండు మూడు లైన్లు ఆకట్టుకునే కంటెంట్. ఇంకేముంది ఆ అడ్వటైజ్మెంట్ మెయిల్ చూసిన సదరు మహిళకు సంతోషం తట్టుకోలేకపోయింది. అమ్మో..! రూ.49కే నాలుగు డజన్ల కోడిగుడ్లా.. వెంటనే కొనేయాలి. లేదంటే ఆఫర్ మిస్సవుతుందంటూ ఆ మెయిల్ ఓపెన్ చేసింది. అందులో షాపింగ్ లింక్‌ను క్లిక్ చేసి నాలుగు డజన్ల కోడిగుడ్లను రూ.49కే కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. కానీ పేమెంట్ కాకపోగా.. ఆమె బ్యాంక్ వివరాలు, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు కావాలంటూ పక్కనే గూగుల్ ఫోరం తరహాలో ఓ ఫోల్డర్ కనిపించడం, వెంటనే వివరాల్ని ఇవ్వడం అంతా క్షణాల్లో పూర్తి చేసింది. అనంతరం, క్రెడిట్ కార్డ్‌తో మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంది. వెంటనే తన క్రెడిట్ కార్డ్ సాయంతో రూ.49 చెల్లించింది. ఇంకేముందు సైబర్ కేటుగాళ్లు తమ పనిని మొదలు పెట్టారు. ఫలితంగా బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 10 రెట్ల డబ్బును అంటే రూ. 48,199 మాయం చేశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం సదరు బ్యాంక్‌కి కాల్ చేసి క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్ చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ఆశకు హద్దుండాలి కదమ్మా..రూ.49కే 48గుడ్లు ఇస్తున్నామంటే? మీరెలా నమ్మారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
karnataka: కాంగ్రెస్‌పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బి శివరాము సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వంలో 40 శాతం అవినీతి జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్.. అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. తన సొంత జిల్లా హసన్‌లోనే ఈ అవినీతి.. బీజేపీ హాయాంలోని 40 శాతం కంటే అధికంగా పెరిగిపోందన్నారు. ఈ విషయాన్ని తాను నేరుగా సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతిపై పార్టీ కార్యకర్తల్లో సైతం తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. తాను అవినీతి విషయంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నేతల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్న అవినీతిపై చర్చ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా.. ఎప్పటికప్పుడు పార్టీ నేతలపై నిఘా ఉంచాలని అన్నారు. తాను సొంతపార్టీ నేతల అవినీతిపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చెడ్డవాడిగా ముద్రవేస్తారని తెలుసని అన్నారు. కానీ, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల కోసమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ ఎమ్మెల్యే శివరాము.. అధికారంలో ఉన్న సొంత పార్టీపై అవినీతి ఆరోపణలు చేయటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం గానీ.. సీఎం సిద్ధరామయ్య గాని ఎలా స్పందిస్తారో చూడాలి. చదవండి: ఢిల్లీలో ఆప్, బీజేపీ హోరాహోరీ నిరసనలు -
కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు. మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు. కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు. భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! -
గోవాలో స్టార్టప్ సీఈఓ దారుణం.. ఆపై బెంగళూరుకు..
పనాజీ: బెంగళూరులో ఓ స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తున్న మహిళా సీఈఓ గోవాలో దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి మృతదేహాన్ని కర్ణాటక వరకు తీసుకువెళ్లింది. బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెల్సిజెన్స్‌కు సంబంధించిన మైండ్‌ఫుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీకి సుచనా సేథ్ సీఈఓగా ఉన్నారు.అయితే ఆమె గోవాలోని ఓ అపార్టుమెంట్ భవనంలో తన నాలుగెళ్ల కుమారుడిని చంపినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమె తన కొడుకు మృతదేహాన్ని బ్యాగ్‌లో మూటకట్టి టాక్సీలో కర్ణాటకకు తీసుకువెళ్లింది. మంగళవారం జరిగిన ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేశారు. టాక్సీలో ఉన్న బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఆరెస్ట్ చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరు చెందిన మహిళ.. గోవాలో తన కొడుకును హత్య చేయడానికి గల కారణాలపై లోతుగా విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. చదవండి: రూ.45 వేలకోట్లతో రివర్‌క్రూజ్ టూరిజం.. ఏం చేస్తారో తెలుసా.. -
Hijab: కర్ణాటక హోం మంత్రి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు :కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ నిషేదంపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని చాలా లోతుగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇటీవల ఒక పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడూతు సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో హిజాబ్‌పై మళ్లీ చర్చ స్టార్టైంది. తమ ప్రభుత్వం హిజాబ్‌పై నిషేదాన్ని ఇంత వరకు ఎత్తివేయలేదని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని సిద్ధరామయ్య అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ స్పందించింది. అసలు రాష్ట్రంలో హిజాబ్‌పై నిషేదమే లేనప్పుడు దాన్ని ఎలా ఎత్తివేస్తారని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రశ్నించారు. డ్రెస్ కోడ్ అమలులో ఉన్న కొన్ని చోట్ల మాత్రమే హిజాబ్‌ను అనుమతించడం లేదని మిగిలిన చోట్ల అంతా మామూలేనని బొమ్మై అన్నారు. మరోపక్క హిజాబ్ నిషేదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్‌పై నిషేదం ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని విమర్శించారు. ఇంకా దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెబుతున్నారని మండిపడ్డారు. ఇదీచదవండి..చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
‘ఎక్స్’లో హాట్‌టాపిక్‌గా దోశ ధర..!
గురుగ్రామ్: ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ హోటల్లో ఇచ్చిన దోశ బిల్లుపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గురుగ్రామ్‌లోని 32 ఎవెన్యూ ఏరియాలో కర్ణాటక కేఫ్‌లో ఆశిశ్ సింగ్ అనే యువకుడు రెండు దోశలు, ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. 30 నిమిషాల తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. హాయిగా దోశలు తినేసి బిల్లు చూస్తే ఆశిశ్‌కు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. బిల్లు ఏకంగా వెయ్యి రూపాయలు వచ్చింది. దీంతో ఆశిష్ ఈ విషయాన్ని ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆశిష్ ట్వీట్‌పై పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘తమిళనాడులో అయితే అవే దోశలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. మీరు పే చేసింది ఏరియా ప్రీమియమ్’ అని ఒకాయన కామెంట్ చేశాడు. ‘వీధి టిఫిన్ బండి దగ్గర మీరు పే చేసిన ధరలో పదవ వంతుకే ఆ దోశలు వచ్చేవి’ అని మరొకతను రిప్లై ఇచ్చాడు. గురుగ్రామ్‌ను వదిలి బెంగళూరుకు రండి తక్కువ ధరలో మంచి దోశలు ఉంటాయి’ అని మరో కర్ణాటక అతను కామెంట్ పెట్టాడు. Bc gurgaon is crazy, spent 1K on two Dosa and idli after waiting for 30 min. Suggest good and reasonably priced dosa places. pic.twitter.com/HYPPK6C07U — Ashish Singh (@ashzingh) December 4, 2023 ఇదీచదవండి..రిస్క్ చేయాలేగానీ..మా తర్వాతే ఎవరైనా..! -
ఐపీఎస్‌ల ప్రజారవాణా సందేశం
బెంగళూరు : ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవం సందర్భంగా బెంగళూరు నగరంలో ఐపీఎస్‌లు కార్లు వదిలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాట పట్టారు. బస్సులు, మెట్రో రైలులో ప్రయాణించి తమ కార్యాలయాలకు చేరుకుని విధులు నిర్వహించారు. బస్సు, మెట్రోరైలులో విధులకు వెళ్లే ఫొటోలను తమ ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ, బెంగళూరు, ముంబై మెట్రో నగరాల్లో పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు పెరిగి ట్రాఫిక్, కాలుష్యానికి కారణమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోనైతే శీతాకాంలో సరి, బేసి పద్ధతిలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఐపీఎస్ ఆఫీసర్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణం మంచి సందేశానిచ్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. #Bengaluru: On #WorldPublicTransportDay, several IPS officers in the city took public transport while heading to the office. pic.twitter.com/nUwdcM807c — South First (@TheSouthfirst) November 10, 2023 -
మన దేశంలో దివ్యాంగులకు అనువైన ఇల్లు ఉందా..?
అద్దెకు ఎన్నో ఇళ్లు, ఫ్లాట్లు ఉంటాయి కదా అనిపించవచ్చు. కాని వీల్‌చైర్‌లో మాత్రమే జీవనం గడిపేవారికి ఆ ఇళ్లేవీ పనికి రావు. బెంగళూరులో ఐటి ఇండస్ట్రీలో పని చేస్తున్న మృణ్మయి తను నివసించడానికి బెంగళూరులో తగిన ఫ్లాటే దొరకడం లేదని ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ విశేషంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. లిఫ్ట్‌లో అడుగు పెట్టడం దగ్గరి నుంచి బాత్రూమ్ల వరకూ ప్రతిదీ వీల్‌చైర్‌కు వీల్లేనివేనని ఆమె తెలిపింది. ఆమె మాత్రమే కాదు సాధారణ వ్యక్తులకు జబ్బు చేస్తే వీల్‌చైర్‌లో ఆస్పత్రికి వెళ్లిరావడం కూడా దుర్లభమే. మన నిర్మాణ పద్ధతుల్లో మానవీయత రాదా? ‘అందరికీ అందుబాటు’ (యాక్సెసెబిలిటీ టు ఆల్) అనే మాట వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కాని అది ఆచరణ యోగ్యం కావడం ఇంచుమించు అసాధ్యంగా ఉంది మన దేశంలో. ‘మా ఇంటికి రండి’ అని ఆహ్వానిస్తే అందరూ ఆ ఆహ్వానాన్ని మన్నించగలరా? మన ఇల్లు దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉందా? నివసించే ఫ్లాట్స్‌లో సులభంగా వీల్‌చైర్‌తో ప్రవేశించడం సాధ్యమవుతుందా? కట్టుకున్న ఇళ్ల మెయిన్గేట్నైనా వీల్‌చైర్ దాటగలదా? అందరూ మెట్లు వాడగలరని, మెట్లు ఉంటే సరిపోతుందని ఇప్పటికీ భావిస్తున్నామంటే యాక్సెసెబిలిటీ టు ఆల్ హక్కును నిరాకరిస్తున్నట్టే. ర్యాంప్‌లు కట్టి దివ్యాంగుల రాకపోకలను అన్ని ప్రయివేటు, పబ్లిక్ ప్లేసుల్లో సులభం చేసినప్పుడే మెరుగైన సమాజాన్ని ఏర్పాటుచేసుకున్నట్టు. ఇల్లు కావాలి బెంగళూరులో అమేజాన్‌లో పనిచేస్తున్న మృణ్మయి‘నాకు ఇల్లు కావాలి. కాని అలాంటి ఇల్లు దొరకడం లేదు’ అని ‘ఎక్స్’ (ట్విటర్)లో తాజాగా పెట్టిన పోస్టు దివ్యాంగుల ఘోషను మరోసారి బయటపెట్టింది. ‘నేను ఇన్నాళ్లు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. అందులో ర్యాంప్‌లు ఉన్నాయి. నా మోటర్డ్ వీల్‌చైర్‌తో కిందకు రావడం మళ్లీ ఫ్లాట్‌లోకి వెళ్లడం సులభంగా ఉంటుంది. ఫ్లాట్‌లో కూడా ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని ఇప్పుడు మా ఫ్లాట్ ఓనర్ ఏవో కారణాల రీత్యా ఖాళీ చేయమన్నాడు. అప్పటి నుంచి తగిన ఫ్లాట్ కోసం ఎంతో వెతుకుతున్నాను. కాని వీల్‌చైర్‌తో రాకపోకలు సాగించేలా ఒక్క ఫ్లాట్ కూడా లేదని తెలపడానికి చింతిస్తున్నాను’ అని ఆమె రాసుకొచ్చింది. అన్ని చోట్లా మెట్లే చాలా ఫ్లాట్లలో లిఫ్ట్ దగ్గర మెట్లు ఉండటం ఒక సమస్యగా మృణ్మయి చెప్పింది. అంటే ఒకటో రెండో మెట్లు ఎక్కి లిఫ్ట్ ఎక్కాలి. కొన్ని లిఫ్ట్‌లు చాలా చిన్నవిగా ఉంటాయి. వీల్‌చైర్‌తో ప్రవేశించి లోపల దానిని తిప్పుకుని డోర్ వైపుకు ముఖం పెట్టడం కష్టం. ‘అపార్ట్‌మెంట్స్‌లో చాలా ఫ్లాట్లకు గడప అడ్డంగా ఉంటుంది. వీల్‌చైర్‌తో దాటలేము. దాటినా అన్ని ఫ్లాట్లలో బాత్రూమ్లు ఒక మెట్టు ఎత్తులో ఎందుకు కడతారో అర్థం కాదు. నేను వీల్చైర్తోటే బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేయాలి. కాని సింకో, టాయిలెట్ సీటో అడ్డంగా ఉంటుంది. అదీగాక బాత్రూమ్ ద్వారాలు మరీ సన్నగా పెడతారు. నా వీల్‌చైర్‌తో అడుగుపెట్టాలంటే అవి కనీసం 25 అంగుళాల వెడల్పు ఉండాలి. అలా ఉండవు’ అంటుంది మృణ్మయి. ‘మరో సమస్య ఏమిటంటే... ఇలా వీల్‌చైర్‌కు అనువుగా ఉన్న ఫ్లాట్లకు రెంట్ ఎక్కువ అడుగుతున్నారు. 25 వేల రూపాయల ఫ్లాట్ 40 వేలు చెబుతున్నారు’ అందామె. యాక్సిడెంట్ వల్ల మృణ్మయి అందరిలా హుషారుగా తిరిగే అమ్మాయి. కాని 2011లో జరిగిన కారు ప్రమాదం వల్ల ఆమెకు స్పైనల్ కార్డు ఇంజూరీ జరిగింది. సర్జరీ చేసినా రెండు భుజాల కింద ప్రాంతమంతా అధీనాన్ని కోల్పోయింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మోటర్డ్ వీల్‌చైర్ ద్వారా ఆమె మామూలు జీవనం గడపడానికి ప్రయత్నిస్తోంది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఆఫీస్ పని కోసం డిక్టేషన్ సాఫ్ట్వేర్ వాడతాను. వేళ్ల మీద అధీనం ఉంది కాబట్టి టచ్ స్క్రీన్ ఉపయోగిస్తాను. కాని నాకూ తిరగాలని ఉంటుంది. బయటికొస్తే రెస్టరెంట్‌కు కూడా పోలేను. ప్రతి రెస్టరెంట్కూ మెట్లు ఎక్కి వెళ్లాలి. ఎక్కడా ర్యాంప్‌లు ఉండవు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నవారికే ప్రవేశం అన్నట్టుగా మన నిర్మాణాలు ఉంటాయి. సినిమా హాళ్లు చెప్పే పనే లేదు. టాక్సీ సర్వీసులు కూడా వీల్‌చైర్ ఫ్రెండ్లీ కావు. అందుకే మాలో చాలామంది యాక్సెసబిలిటీ యాక్టివిస్ట్లుగా మారి సమాజంలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాం’ అని తెలిపింది మృణ్మయి. ‘ఎక్స్’లో మృణ్మయి పెట్టిన పోస్ట్‌కు చాలామంది స్పందించారు. నిజంగా మీ ఇబ్బంది మీరు చెప్తుంటే తెలుస్తోంది అని చాలామంది చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆఫీసులు, పార్కులు, హాస్పిటళ్లు, విద్యా సంస్థలు.. ఇలా ప్రతిదీ దివ్యాంగుల రాకపోకలకు అనువుగా మారడం, మార్చడం తప్పనిసరి. వాటిని వాడేది ఒకరిద్దరైనా ఆ ఒకరిద్దరి హక్కును నిరాకరించే అధికారం మనకు లేదు. (చదవండి: ఎవరికి వారే.. మహిళా‘మణులే’! ) -
లాటరీ ఏజెంట్ జాక్‌పాట్.. అమ్ముడుపోని ఆ టికెట్‌తోనే..
అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్, బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ జీవితాలు అలాగే మారిపోయాయి. కోటీశ్వరులయ్యారు. కేరళలో లాటరీ (Kerala Lottery) ఏజెంట్ అయిన ఎన్‌కె గంగాధరన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అమ్ముడుపోని లాటరీ టికెట్ విజేత నంబర్‌గా మారడంతో అతనికి అదృష్టవశాత్తూ కోటి రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఆయన లాటరీ స్టోర్‌కు మొదటిది కావడంతో పాటు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. 33 సంవత్సరాలు బస్ కండక్టర్‌గా పని చేసిన గంగాధరన్ ఆ తర్వాత కోజీకోడ్‌లో లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తన దుకాణంలో మొదటి విజేత ఆయనే కావడం గమనార్హం. అమ్ముడుపోకుండా తన మిగిపోయిన లాటరీ టికెట్టే ఆయనకు కోటి రూపాయలను తెచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరూ రూ.5,000 గెలుచుకున్నారు. దీంతో లాటరీ ఏజెంట్‌కి, ఆయన కస్టమర్లకు ఆనందాశ్చర్యాలను కలిగించింది. ఆఫర్లో వచ్చిన టికెట్‌కి రూ. 44 కోట్లు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వాటక్కే కోరోత్, అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 44 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. అయితే మొదట్లో ఇది స్కామ్‌గా భావించిన అరుణ్ నంబర్‌ను కూడా బ్లాక్ చేస్తూ కాల్‌ను డిస్కనెక్ట్ చేశాడు. అరుణ్ కుమార్ 'బై టు గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లో ఈ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఆఫర్ కింద వచ్చిన ఆ టికెట్‌కే జాక్‌పాక్ తగిలింది. -
మహేశ్ బాబు నుంచి మరో మల్టీఫ్లెక్స్ థియేటర్ రెడీ.. ఎక్కడో తెలుసా?
బెంగళూరులో కొన్ని దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరించిన కపాలి సినిమా థియేటర్ 3 సంవత్సరాల క్రితం కూలగొట్టేశారు. గాంధీనగర్‌లో గతంలో కపాలి థియేటర్ ఉన్న స్థలంలో ఇప్పుడు ఒక మాల్‌ను నిర్మిస్తున్నారు. అక్కడ AMB మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. కపాలి సినిమా థియేటర్ స్థానంలో ఇప్పుడు మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్ రావడం కన్నడ సినీప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ కన్నడ చిత్రసీమలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలకు సాక్షిగా నిలిచిన 'కపాలి' థియేటర్ నేలమట్టం కావడంతో కొంతమేరకు సినీజనాలను కలిచివేసింది. (ఇదీ చదవండి: అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన తండ్రి) కానీ కపాలి థియేటర్ కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించడంతో దానిని రీమోడల చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అంతిమంగా అక్కడ మల్టీప్లెక్స్‌లు నిర్మించడం జరిగిపోతుంది. ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ సినిమాస్‌తో పాటు హైదరాబాద్‌లో AMB సినిమాస్ మల్టీప్లెక్స్‌లను నడుపుతున్నాడు. ఇప్పుడు వారు బెంగళూరులో కూడా AMB ప్లాన్ చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్ కపాలి 1968లో సుబేదార్ చత్రం రోడ్డులో 44,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో కపాలి సినిమా నిర్మించబడింది. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ సినిమాను ప్రారంభించారు. కపాలి ప్రారంభంలో మొత్తం 1,465 సీట్లతో ప్రపంచంలోని అతిపెద్ద థియేటర్లలో ఒకటి. కపాలి థియేటర్ యజమానులుగా ఉన్న దాసప్ప సోదరులు 4 సంవత్సరాల క్రితం థియేటర్ స్థలాన్ని బెల్గాం వ్యాపారికి విక్రయించారు. చివరకు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జయన్న కపాలి సినిమాను లీజుకు తీసుకున్నారు. 5 సంవత్సరాల లీజు గడువు ముగిసిన తర్వాత థియేటర్ విక్రయించబడింది. కన్నడలోనే కాకుండా హిందీ, ఇంగ్లీషు సినిమాలు కూడా కపాలీ థియేటర్లో విడుదలయ్యాయి. డా. రాజ్‌కుమార్ నటించిన చాలా సినిమాలు ఈ థియేటర్లో విడుదలయ్యాయి. కపాలిలో శతదినోత్సవం జరుపుకున్న తొలి సినిమా 'మణ్ణిన మగ', హాలు జెను. ఈ సినిమాల విడుదల సందర్భంగా భారీ కటౌట్లను థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కటౌట్ ట్రెండ్ మొదలైంది. ఆ సినిమా 30 సార్లు విడుదల శివన్న-ఉపేంద్ర జంటగా నటించిన ‘ఓం’ సినిమా కపాలి థియేటర్లలో 30 సార్లు విడుదలైంది. రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం 'అపూర్వ రాగంగల్' కూడా ఇదే థియేటర్లో విడుదలైంది. మొదట్లో సీటింగ్ కెపాసిటీ 1,465 ఉండగా, తర్వాత 1,112కి తగ్గించారు. 2017లో విడుదలైన 'హులిరాయ' సినిమానే కపాలి థియేటర్లో చివరిగా ప్రదర్శించబడిన చిత్రం. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల దీనిని విక్రయించేశారు. 49 సంవత్సరాల తర్వాత క్లోజ్ దశాబ్దాల క్రితం గాంధీనగర్‌లో 10కి పైగా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు సంతోష్, నర్తకి, త్రివేణి, అనుపమ థియేటర్లు మాత్రమే మిగిలాయి. 49 సంవత్సరాల తర్వాత, కపాలి థియేటర్ దాని తలుపులను శాశ్వతంగా మూసివేశారు. ఆ తర్వాత దానిని నేల మట్టం చేశారు. ఇప్పుడు అక్కడ పెద్ద ఐదంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభమవుతుందని పెద్ద హోర్డింగ్ కూడా నిలబెట్టారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో 5 నుంచి 6 మల్టీప్లెక్స్ స్క్రీన్లు అక్కడ రానున్నాయి. మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాకుండా ఎన్నో వెంచర్లలో పెట్టుబడులు పెట్టాడు. కొన్ని రోజుల క్రితమే సినిమా మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు. కన్నడ సినిమాకు ప్రాధాన్యత హైదరాబాద్‌లో ఏఎమ్బి సినిమాస్ సక్సెస్ కావడంతో మహేష్ బాబు ఆ చైన్‌ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. మూడేళ్ల క్రితమే బెంగళూరులో కొత్త మల్టీప్లెక్స్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడి మల్టీప్లెక్స్‌లలో కన్నడ సినిమాలకు తొలి ప్రాధాన్యం లభించకపోవడం బాధాకరం. కానీ మహేశ్ బాబు మాత్రం అక్కడ తొలి ప్రాధాన్యం కన్నడ సినిమాలకు ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమచారం. -
కాంగ్రెస్ నేతపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: ఒక్కసారిగా పదవి పోతే రాజకీయ నాయకులు నిరాశలో కుంగిపోతుంటారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత బీజేపీ నేతల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. తమ ఉనికిని చాటుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత ఎస్.డీ.సోమశేఖర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనను తన రాజకీయ గురువుగా చెబుతూ కాంగ్రెస్ తలుపు తట్టే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎస్.డీ.సోమశేఖర్ గౌడ మాట్లాడుతూ.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన రాజకీయ గురువు అని సహకార శాఖలో నేను ఏదైనా సాధించానంటే అది అయన చలవేనని అన్నారు.అయన నాకు చాలా సహాయం చేశారు. మొదట్లో నాకు జేపీ నగర్ బ్లాకు ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఫీకే శివకుమార్ నన్ను జేపీనగర్ జాయింట్ సెక్రెటరీగా నియమించారు. అక్కడి నుండి ఆయన నాకు అనేక సందర్భాల్లో అండగా నిలిచారు. ఉత్తరహళ్లి నియోజకవర్గం అభ్యర్థిగా నా పేరును ఆయనే ప్రతిపాదించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడో నెలలోనే ఆయన కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం చూస్తే ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. 2019లో కాంగ్రెస్ పార్టీని నిలువునా ముంచి యాడ్యూరప్ప ప్రభుత్వానికి అండగా నిలిచిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సోమశేఖర్ కూడా ఒకరు. కాంగ్రెస్ నాయకుడిని పొగుడుతూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. బహుశా ఆయన ఎదో అసంతృప్తితో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయనతో మాట్లాడితే సమస్య సర్దుకుంటుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే.. -
78 ఏళ్ల వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఇంతవరకు గుండె, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి విన్నాం. కానీ ఊపరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి వినలేదు కదా. ఇది కాస్త రిస్క్‌తో కూడిన అపరేషన్ మాత్రమే గాక వైద్యులకు కూడా ఒక రకంగా సవాలుతో కూడిన ఆపరేషనే. అలాంటి శస్త్ర చికిత్సను ఆసియాలోనే అత్యంత వృద్ధుడికి చేశారు చెన్నైకి చెందిన వైద్యులు. వివరాల్లోకెళ్తే..బెంగళూరు నివాసి అయిన 78 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి సంబంధించిన ఆస్పిరేషన్ న్యుమోనియాతో బాధపడుతున్నాడు. అతను గత 50 ఏళ్లుగా కృత్రిమ ఆక్సిజన్ సపోర్టుతోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అయితే రోగి మంచి ఆరోగ్యంగా ఉండటమే గాక శస్త్ర చికిత్సకు తట్టుకోగలడని వైద్యులు నిర్ధారించేక అతనికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనే నిశ్చయానికి వచ్చారు. ఆ రోగికి శస్త్ర చికిత్స చేయడానికి చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎంజీఎం హెల్త్‌కేర్ ముందుకొచ్చింది. అలాగే సదరు వృద్ధుడు కూడా ద్వైపాక్షిక ఊపిరితిత్తుల మార్పిడి కోసం స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నాడు. అతనికి సరిపడా ఊపిరిత్తులను ఇచ్చే దాత అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు వైద్యులు. ఈ ప్రక్రియకు ముందే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అయినా వైద్యలు రిస్క్ తీసుకుని మరీ ఈ శస్త్ర చికిత్సకు పూనుకున్నారు. ఈ ఆపరేషనే రిస్క్ అనుకుంటే అతడి వయసు, ఆరోగ్య పరిస్థితి మరింత సవాలుగా మారింది వైద్యలకు. ఈ మేరుకు అతనికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డైరెక్టర్ కే ఆర్ బాలకృష్ణన్, కో డైరెక్టర్ సురేష్ రావు, కేజీ పల్మనాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అపర్ జిందాల్‌తో కూడిన వైద్య బృందం ఆ వృద్దుడికి ఆపరేషన్ నిర్వహించారు. అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతమవ్వడమే గాక అతను కూడా మంచిగా కోలుకుంటున్నాడు. దీంతో వైద్య బృందం హర్షం వ్యక్తం చేయడమే గాక మా ఆస్పత్రి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సదా అంకితభావంతో పనిచేస్తుందని సగర్వంగా పేర్కొంది. ఇక ద్వైపాక్షిక ఊపరితిత్తు మార్పిడి అంటే..దీనిలో సర్జన్లు వ్యాధిగ్రస్తులైన ఊపిరితిత్తులను ఒక్కొక్కటిగా తీసివేసి ఆపై దాత ఊపిరితిత్తులను రోగి శ్వాసనాళాల్లోకి గుండెకు దారితేసే రక్తనాళాలను జతచేస్తారు. (చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?) -
ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్ వీడియో
బెంగళూరు: పేరెంట్స్ మీ పిల్లలను ప్రీ స్కూల్స్‌కు పంపిస్తున్నారా?. అయితే, ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. మీ బిడ్డ చదువుతున్న స్కూల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఒక్కసారి కచ్చితంగా తెలుసుకోంది. ఈ వీడియోలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రీ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో ఓ కుర్రాడు మరో చిన్నారిపై దాడి చేశాడు. ఈ వీడియో బాధిత చిన్నారి తల్లి కంటతడి పెట్టింది. ఇక, ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చిక్కలసండ్రలోని టెండర్ ఫూట్ ప్రీ స్కూల్లోని ఓ రూమ్‌లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో క్లాస్ రూంలో నుంచి ఓ టీచర్, ఆయా బయటకు వెళ్లడంతో ఓ బాలుడు మరో చిన్నారిని కొట్టడం ప్రారంభించాడు. చేతులతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ దాడి చేశాడు. మధ్యలో క్లాస్ రూం కిటికీలో నుంచి టీచర్ వస్తున్నది లేనిదీ చూసుకుంటూ పదే పదే చిన్నారిపై దాడి చేశాడు. ఆ చిన్నారిని కింద పడేసి కాళ్లతో తన్నడం, మెడ కొరకడం వంటివి చేశాడు. ఇక, ఇదంతా క్లాస్‌రూంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. ఈ విషయం బాధిత చిన్నారి పేరెంట్స్‌కు తెలియడంతో పిల్లలను అలా వదిలేసి వెళ్లడంపై తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. తలుపు వేసి ఉన్న రూంలో పిల్లలను ఎలా వదిలేశారని మండిపడ్డారు. అనంతరం, ఈ ఘటనపై చిన్నారి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చట్టప్రకారం స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను ఈస్ట్ బెంగళూరుకు చెందిన సిటిజన్స్ మూమెంట్ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. ఈ క్రమంలో పిల్లల పేరెంట్స్‌ను హెచ్చరించింది. ఈ స్కూల్లో మీ పిల్లలను చేర్పించవద్దని సూచించింది. ఇక, ఈ వీడియో చూసి పేరెంట్స్ షాక్ అవుతున్నారు. సదరు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. We received a disturbing video of a preschool where toddlers are left unattended in a closed room. A senior kid is seen hitting repeatedly a junior school. The school's name is Tenderfoot, Chikkalasandra, Bengaluru- 560061. Please don’t send your kid there! 🙏🏻 #childabuse pic.twitter.com/IeGsj2M9b2 — Citizens Movement, East Bengaluru (@east_bengaluru) June 22, 2023 ఇది కూడా చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే.. -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
సిద్దిరామయ్య క్యాబినెట్...24 మంది ప్రమాణస్వీకారం
-
చూడటానికి కిరాణా కొట్టులా... కానీ నెలకు 4 కోట్ల ఆదాయం
-
ఐపీఎల్ లో ఫిక్సింగ్ జరిగిందా? అందుకే టాప్ టీమ్స్ అలా
-
దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ
న్యూఢిల్లీ: లిథియం అయాన్ సెల్ తయారీలో దేశంలో తొలి ప్లాంటు బెంగళూరు సమీపంలో ప్రారంభం అయింది. బ్యాటరీ టెక్నాలజీ స్టార్టప్ లాగ్9 మెటీరియల్స్ దీనిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం తొలి దశ సామర్థ్యం 50 మెగావాట్ అవర్. ‘దేశీయ మార్కెట్ కోసం సెల్స్‌ను భారత్‌లో రూపొందించాం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు ఇక్కడి వాతావరణ పరిస్థితులు, కస్టమర్లకు అనువుగా ఉంటాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయం చేస్తూ భారత్‌ను స్వావలంబన చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నాం’ అని లాగ్9 కో–ఫౌండర్, సీఈవో అక్షయ్ సింఘాల్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ బ్యాటరీలు 3,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించారు. 20కిపైగా నగరాల్లో విస్తరించినట్టు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఎన్నికల వేళ కర్ణాటకలో హవాలా డబ్బు కలకలం
-
చైల్డ్ ఆర్టిస్ట్ సించన ఆకస్మిక మృతి.. డాక్టర్ల డాక్టర్ల నిర్లక్షమేనన్న పేరెంట్స్
యశవంతపుర: బుల్లితెర బాలనటి సించన (15) ఆకస్మికంగా మృతి చెందింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వాంతి, విరేచనలు కావటంతో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆస్పత్రికి రాకముందే మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సించన చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సించనకు గొంతు వద్ద ఇంజక్షన్ ఇవ్వటంతో రక్తస్రావం ఎక్కువై మృతి చెందినట్లు తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు బాగలకుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. -
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!
బెంగళూరు: పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫిబ్రవరి 11 వరకు చలాన్లపై 50 శాతం డిస్కంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వాహనదారులు పేటీఎం, ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. అందరికీ న్యాయం చేకూర్చేలా ట్రైఫిక్ ఫైన్లపై రాయితీ కల్పించాలని కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తీర్మానం చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు ఈ ప్రతిపాదన పంపింది. దీంతో కర్ణాటకవ్యాప్తంగా చలాన్లపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రవాణా శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 11 వరకు విధించే ట్రాఫిక్ చలాన్లపై 50శాతం డిస్కంట్ వర్తిస్తుందని చెప్పింది. అయితే ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. చదవండి: దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని.. -
దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని..
బెంగళూరు: అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడ్ని దారుణం హత్య చేశారు నలుగురు వ్యక్తులు. కర్రతో కొట్టి అతడ్ని హతమార్చారు. కర్ణాటక బెంగళూరులో ఈ పాశవిక ఘటన వెలుగుచూసింది. మృతుడి పేరు గోవిందరాజు. కొద్దిరోజులుగా ఓ అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన అనిల్ అనే వ్యక్తి అతనిపై కక్ష పెంచుకున్నాడు. పథకం పన్ని అతడ్ని ఇంట్లో నుంచి బయటకు పిలిపించాడు. బైక్‌పై అంద్రల్లి తీసుకెళ్లాడు. అనంతరం లోహిత్, భరత్, కిశోర్ కూడా అంద్రల్లి వెళ్లారు. నలుగురు కలిసి గోవిందరాజుపై విచక్షణా రహితంగా కర్రతలో దాడి చేశారు. అతడ్ని చావబాదారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం గోవిందరాజు మృతదేహాన్ని లోహిత్ కారులో దాచారు. తర్వాత తీసుకెళ్లి ఛార్ముడిఘాట్ ప్రాంతంలో పడేశారు. సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారు. అయితే గోవిందరాజు కన్పించడం లేదని అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్లు నేరం అంగీకరించారు. వారు చెప్పిన వివరాలతో గోవిందరాజు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు -
ముగిసిన అబ్జర్వేషన్.. తారకరత్న హెల్త్‌పై అప్పుడే క్లారిటీ!
నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. తారకరత్నకు కుప్పంలో యాంజియోప్లాస్టీ తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స కొనసాగిస్తోంది. అయితే తారకతరత్నకు ఈరోజు నిర్వహించే వైద్య పరీక్షలు కీలకం కానున్నాయి. ఈరోజు ఆయనకు ఎమ్ఆర్ఐ(MRI)స్కాన్ తీయనున్నారు. దీని ఆధారంగా ట్రీట్మెంట్ కొనసాగించనున్నారు. ఈనెల 27న తారకరత్న గుండెపోటుకు గురికాగా అప్పటి నుంచి పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ ఆదివారం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. -
తారకరత్న గురించి గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్
సినీనటుడు నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అతని ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గానే ఉన్న నేఫథ్యంలో కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే బాలయ్య అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తుండగా నిన్న(ఆదివారం)తారక్, కల్యాణ్ రామ్‌లు కుటుంబసమేతంగా బెంగళూరులోని హాస్పిటల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు మంచు మనోజ్ తారకరత్నను చూసేందుకు బెంగళూరుకు వెళ్లారు. అతని ఆరోగ్యంపై వైద్యులను అడిగిన తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'తారకరత్నను చూడటం జరిగింది. రికవరీ అవుతున్నాడు. త్వరలోనే కోలుకొని బయటకు వచ్చేస్తాడు. తారకరత్న స్ట్రాంగ్ ఫైటర్. అతనికి ఇది టెస్టింగ్ టైమ్. నేను వందశాతం కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఆ దేవుడి దయ వల్ల తారకతరత్న త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నారు. visited #Tarakratna and am filled with hope and optimism for his future. He has our unwavering support and I'm sure with the grace of God and all the prayers of the people who care for him, he will make a full recovery soon and be back home with us. Love u babai 🙏🏼❤️ — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 29, 2023 -
తారకరత్న క్రిటికల్ కండీషన్ నుంచి బయట పడ్డారని చెప్పలేం: జూ. ఎన్టీఆర్
నందమూరి తారకరత్నను చూసేందుకు జూ. ఎన్టీఆర్ బెంగళూరు చేరుకున్నారు. కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితపై వైద్యులను తెలుసుకున్న అనంతరం తారక్ మీడియాతో మాట్లాడారు. 'అన్నయ్య(తారకరత్న) చికిత్సకు స్పందిస్తున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోంది. ప్రస్తుతం పోరాడుతున్నారు. క్రిటికల్ కండిషన్ నుంచి బయట పడ్డారని చెప్పలేం. కుటుంబసభ్యుడిగా ఇక్కడికి వచ్చాను. డాక్లర్లు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం, ప్రార్థనలు అవసరం' అని పేర్కొన్నారు. ఇక కల్యాణ్ రామ్ మాట్లాడుతూ... 'మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు త్వరగా కోలుకొని మన ముందుకు రావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అని తెలిపారు. -
నిలకడగా తారకరత్న ఆరోగ్యం.. చికిత్సకు స్పందిస్తున్నారు : బాలయ్య
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. చికిత్స కొనసాగుతుందని, అతను కోలుకుంటాడన్న నమ్మకం తమకు ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''ప్రస్తుతం తారకరత్న వెంటిలేటర్‌పైనే ఉన్నారు. స్టంట్ వేయడం కుదరలేదు, మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రత్యేక వైద్య బృందం అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. నిన్నటితో పోలిస్తే ఇవాల్టికి కాస్త మూమెంట్ ఉందని డాక్టర్లు చెప్పారు. తారకరత్న కోలుకుంటాడన్న నమ్మకం మాకు ఉంది. బ్రెయిన్ డ్యామేజ్ ఎంతవరకు ఉందన్నది తెలియాల్సి ఉంది. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్థించండి. అభిమానుల ప్రార్థనలతో త్వరగా కోలుకుంటాన్న నమ్మకం ఉంది'' అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. -
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్
సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్మెంట్ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తారకరత్నను చూసేందుకు జూ ఎన్టీఆర్ ఇవాళ(ఆదివారం)బెంగళూరుకు వెళ్లనున్నారు. కల్యాణ్ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇప్పటికే తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు ఫోన్ చేసి ఎన్టీఆర్ ఆరా తీశాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరుకు చేరుకుంటున్నారు.కాగా తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. @tarak9999 @NANDAMURIKALYAN Visit In #TarakaRatna #TarakaratnaHealthUpdate #TarakaRathna #JrNTR #NandamuriBalakrishna pic.twitter.com/IPT3czlQTo — Ram_Yash (@mynameismr6) January 29, 2023 -
ఫుల్లుగా తాగి.. అర్ధరాత్రి రెస్టారెంట్‌కు వెళ్లి రచ్చ రచ్చ చేసిన గ్యాంగ్..
బెంగుళూరు: కర్ణాటక బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో కొందరు ఫుల్లుగా తాగి రచ్చ రచ్చ చేశారు. బుధవారం అర్ధరాత్రి విలేజ్ రెస్టారెంట్‌కు వెళ్లి హల్చల్ చేశారు. రాత్రి 11.20 గం. సమయంలో రెస్టారెంట్లోకి వెళ్లిన ఈ గ్యాంగ్.. తమకు ఫుడ్ కావాలని సిబ్బందిని అడిగారు. అయితే సమయం దాటిపోయిందని, రాత్రి 11.00 గంటలకే ఆర్డర్లు తీసుకుంటామని వాళ్లు బదులిచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన మందుబాబులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ ఆర్డర్ తీసుకోవాలన్నారు. మాటా మాటా పెరగడంతో అది పెద్ద గొడవగా మారింది. ఇరు వర్గాలు పోట్లాడుకున్నాయి. అక్కడున్న కొందరు ఈ ఫైటింగ్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. మొత్తం ఐదుగురుని అరెస్టు చేశారు. Brawl at village restaurant in Electronic City, Bangalore. Gang attacks hotel staff as they said last order is at 11pm and you’ve reached at 11:20pm and food can’t be served. 5 arrests made so far, identity of the remaining being ascertained. pic.twitter.com/RBFa4IPwyN — Nagarjun Dwarakanath (@nagarjund) December 1, 2022 చదవండి: మహిళా యూట్యూబర్‌పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్.. -
షాకింగ్.. ఇంజనీరింగ్ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులోని న్యూ హారిజన్ ఇంజినీరింగ్ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొట్టడంతో కళాశాల యాజమాన్యం ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. వాళ్ల తల్లిదండ్రులుకు కూడా నోటీసులు పంపింది. మరోవైపు కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే వీళ్లు కావాలాని ఈ నినాదాలు చేయలేదని, సరదాగా చేసి ఇబ్బందుల్లో పడ్డారని పోలీసులు తెలిపారు. కాలేజీలో ఫెస్ట్.. అయితే ఈ కాలేజీలో నవంబర్ 25,26 తేదీల్లో ఇంటర్-కాలేజ్ ఫెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా తమకు నచ్చిన ఐపీఎల్ జట్లు, వివిధ దేశాల పేర్లతో నినాదాలు చేశారు. ఈ సమయంలోనే ముగ్గురు విద్యార్థులు ఆర్యన్, దినకర్, రియా.. సరదాగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు. మరో విద్యార్థి వీడియో తీస్తున్నా పట్టించుకోకుండా అలాగే నినాదాలు చేశారు. దీంతో కేసులో ఇరుక్కుని ఇబ్బందులపాలయ్యారు. వీరి వయసు 17-18 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్.. -
IBSF World Billiards Championship: పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్
కౌలాలంపూర్: క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్లలో వివిధ ఫార్మాట్లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో శనివారం జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆద్యంతం పూర్తి ఏకాగ్రతతో ఆడిన పంకజ్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఫ్రేమ్‌లో బ్రేక్ లేకుండా 149 పాయింట్లు స్కోరు చేసిన పంకజ్ ఆ తర్వాతి ఫ్రేమ్‌లలోనూ అదే జోరు కొనసాగించాడు. మ్యాచ్ మొత్తంలో కొఠారి కేవలం 72 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ 604 పాయింట్లు సాధించడం అతని ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం. ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఆ ఏడాది కూడా పంకజ్‌కే టైటిల్ దక్కింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని నిర్వహించలేదు. ‘వరుసగా ఐదేళ్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కలలాంటిదే. ఈ ఏడాది ప్రతి టోర్నీలో నా ఆటతీరుపట్ల సంతృప్తి చెందాను. ప్రపంచస్థాయిలో భారత్‌కు మరో టైటిల్ అందించినందుకు ఆనందంగా ఉంది’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. 8: పాయింట్ల ఫార్మాట్లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022). 8: లాంగ్ ఫార్మాట్లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018). 8: స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (2019). 1: పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014). -
భారీ వర్షాలకు బెంగళూరు జలమయం.. వాగుల్లా మారిన రోడ్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వీధులు వాగులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బెల్లందూర్, సర్జాపుర రోడ్డు, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎంఎల్ లేఅవుట్ ప్రాంతాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మారథహళ్లిలోని స్పైక్ గార్డెన్లో ద్విచక్ర వాహనాలు వరదనీటిలో పడవల్లా కొట్టుకుపోయాయి. మారథహళ్లి సిల్క్ బోర్డు జంక్షన్లో వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని సహాయ బృందాలు రక్షించాయి. #bangalorerain #bangaloretraffic #Bangalore Scene at 5:55am outside Village Super Market, Spice Garden, Marathahalli. 2-wheelers floating. Road from Spice Garden to Whitefield completely blocked pic.twitter.com/x4oWokLP4P — Ishkaran Talwar (@Ishkaran) September 5, 2022 #bangalorerain #rohan #Waterfall #societywaterfall #flood #Bangalore Bangalore rains has reached its heights. Even premium societies are facing flooding for the first time. @CMofKarnataka : Please help us. pic.twitter.com/ydxkge0Eem — ansu jain (@ansujain) September 4, 2022 #WATCH | Karnataka: A man was rescued by local security guards after he was stuck on a waterlogged road near Marathahalli-Silk Board junction road in Bengaluru pic.twitter.com/gFnZtzk6mu — ANI (@ANI) September 5, 2022 నీటమునిగిన ప్రాంతాల్లో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సహాయక బృందాలను రంగంలోకి దించి జలదిగ్భంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే వరదలకు సంబంధించిన ఫోటోలను నగరవాసులు సామాజిక వేదికగా షేర్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు చరిత్రోలనే తొలిసారి ప్రీమియం సొసైటీల్లో కూడా వరద నీరు చేరిందని పేర్కొన్నారు. సాయం అందించాలని సీఎం బసవరాజ్ బొమ్మైని విజ్ఞప్తి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Karnataka | Several parts of Bengaluru remain inundated due to severe waterlogging after heavy rainfall. Visuals from Eco space area on Marathahalli - Silk Board junction road pic.twitter.com/kfcsAVn7U7 — ANI (@ANI) September 5, 2022 మరికొందరు నెటిజన్లు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 10 నిమిషాలు వర్షం పడితే బెంగళూరులో పరిస్థితి ఇలా ఉంటుందా? అని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక పన్నులు కడుతున్న తమకు సరైన మౌళిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేరా? అని ప్రశ్నించారు. భారీ వర్షాల ధాటికి ఐటీ పార్కులను అనుసంధానించే ఔటర్ రింగ్ రోడ్డుపై వరద నీటితో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు సెప్టెంబర్ 9 వరకు బెంగళారులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కొడగు, శివమొగ్గ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి, చికమగళూరు జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. చదవండి: భళా.. బాలకా.. 15 ఏళ్లకే చెన్నై నుంచి లేహ్‌కు సైకిల్ యాత్ర -
ఎస్ఐ పోస్టుల స్కాం: పరీక్ష టైంలో ఫోన్లో మాట్లాడారా?
బనశంకరి(కర్ణాటక): రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎస్ఐ పోస్టుల కుంభకోణం మరిన్ని ఉద్యోగ నియమాకాలపై అనుమానాలను పెంచుతోంది. బ్లూ టూత్ సహాయంతో ఈసారి, గతంలోనూ ఎంతమంది పరీక్షల్లో అక్రమాలకు పాల్ప డ్డారోనని సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఎవరికీ కనబడకుండా చెవి లోపల చిన్న బ్లూటూత్ పరికరం పెట్టుకుని బయటి నుంచి అక్రమార్కులు సరైన సమాధానం చెబుతుంటే విని రాసి ఉద్యోగాలు వెలగబెడుతున్న వారికి ఇప్పుడు వణుకు మొదలైంది. ఇటీవల ఎస్ఐ పరీక్ష రాసిన అభ్యర్థుల మొబైల్ కాల్స్ లిస్టులను అధికారులు పరిశీలిస్తున్నారు. పరీక్ష రాసిన సమయంలో అభ్యర్థుల మొబైల్ఫోన్లకు ఎవరైనా కాల్ చేశారా, ఎంతసేపు మాట్లాడారు తదితర అంశాలను మొబైల్ టవర్ డంప్ తదితర సాంకేతికతల సహాయంతో వెలికితీయనున్నారు. సాధారణంగా పరీక్ష సమయంలో అభ్యర్థులు ఫోన్‌ను స్విచాఫ్ చేసి బయట సిబ్బందికి ఇచ్చేయాలి. లేదా స్నేహితులకు, ఇంట్లోనూ ఇచ్చి రావచ్చు. ఆ సమయంలో కాల్ వచ్చి ఎక్కువసేపు మాట్లాడి ఉంటే చిక్కుల్లో పడినట్లే. అభ్యర్థులకు ఎన్ని మొబైల్ఫోన్లు, సిమ్‌కార్డులు ఉన్నాయో కూడా వివరాలు రాబడుతున్నారు. ఈ విచారణలో అక్రమార్కులు దొరికిపోవడం ఖాయం అని సీఐడీ అధికారులు తెలిపారు. కోవిడ్ మృతుని సెల్ నుంచి దందా ఎస్ఐ కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి పేరుతో ఉన్న మొబైల్‌ఫోన్‌ను వినియోగించి నిందితుడు రుద్రేగౌడ పాటిల్ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. పాటిల్ వద్ద సోన్న గ్రామానికి చెందిన లక్ష్మీపుత్ర అనే వ్యక్తి సూపర్వైజర్గా పనిచేసేవాడు. లక్ష్మీపుత్ర కోవిడ్‌తో మృతిచెందగా, అతనికి చెందిన ఒక మొబైల్‌ను పాటిల్ తీసుకున్నాడు. అదే మొబైల్‌తో ఎస్ఐ పోస్టుల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో తెలిసింది. నేరం బయటపడినా తప్పించుకోవడానికి ఈ ఉపాయాన్ని ఆలోచించాడు. రెండు రోజుల క్రితం రుద్రేగౌడ, స్నేహితుడు మంజునాథ్‌ను అరెస్ట్‌చేసిన సీఐడీ అధికారులు 13 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇతర పరీక్షల్లోనూ ప్రమేయం: ఎస్ఐ పోస్టులే కాకుండా ఎఫ్‌డీఏ, ఎస్డీఏ, ఏఈ పోస్టులతో పాటు వివిధ నియామక పరీక్షల్లో రుద్రేగౌడ పాటిల్ ముఠా అక్రమాలకు పాల్పడి ఉండొచ్చని సీఐడీ విచారణ చేస్తోంది. రుద్రేగౌడను, స్నేహితుడు మల్లికార్జున పాటిల్‌ను సీఐడీ విచారిస్తోంది. రుద్రేగౌడ నివాసంలో లభించిన హాల్‌టికెట్లు, పీఎస్ఐ పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు కొన్ని ఆధారాలు లభించాయని సమాచారం. ఇతని సహకారంతో పెద్దసంఖ్యలో నిరుద్యోగులు పలు కేపీఎస్సీ పరీక్షల్లో బ్లూటూత్‌లో సమాధానాలు పొంది ఎంపికైనట్లు తెలిసింది. ఈ వార్త కూడా చదవండి: వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు -
గీత రాత మారేనా?
చిత్రకళ అనాది కళ. చరిత్రకు పూర్వయుగంలోనే మానవాళికి పట్టుబడిన ఆదిమ కళ. మాటలెరుగని తొలి మానవులు ఎరిగిన ఏకైక భావప్రకటన సాధనం చిత్రకళ. గీతల నుంచి పరిణామం చెందిన తర్వాతే రాతలు రాయడం మొదలైంది. గీతలతో చుట్టూ కనిపించే జంతుజాలాన్ని, పరిసరాలను చిత్రించే దశ నుంచి చిత్రలిపి ‘క్యూనిఫామ్’ దశకు చేరుకోవడానికి దశాబ్దాలో శతాబ్దాలో కాదు, ఏకంగా సహస్రాబ్దాల కాలం పట్టింది. ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 30 వేల ఏళ్ల నాడే మొదలైతే, క్రీస్తుపూర్వం 3,400 ఏళ్ల నాటికి గాని తొలినాటి లిపి రూపుదిద్దుకోలేదు. దాదాపు అప్పటి నుంచే భాషల పుట్టుక మొదలైంది. నానా భాషలూ, వాటికి రకరకాల లిపులూ వచ్చాయి. మనిషి మాటలూ రాతలూ నేర్చిన నాటి నుంచి నాగరికత పరిణామ క్రమంలో వేగం పెరిగింది. ముందొచ్చిన గీతల కంటే వెనకొచ్చిన రాతలే వాడి అనేంతగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నాగరికతల వికాసం మొదలైన నాటి నుంచి పారిశ్రామిక విప్లవ కాలం వరకు, ఆ తర్వాత నేటి అత్యాధునిక కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా చిత్రకళలో అనేకానేక మార్పులు వచ్చాయి. మన దేశంలో ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 5,500 ఏళ్ల నాడే మొదలైంది. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బేట్కా గుహల్లోని చిత్రాలే ఇందుకు నిదర్శనం. సింధులోయ నాగరికత నాటి శిథిలాల్లో నైరూప్య చిత్రకళ ఆనవాళ్లూ ఉన్నాయి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఒకటో శతాబ్ది కాలానికి చెందిన అజంతా గుహల్లోని చిత్రకళ ఆనాటి బౌద్ధ ప్రాభవానికి అద్దంపడుతుంది. మొఘల్ పరిపాలన కాలం వరకు దేశం నలు చెరగులా మధ్యయుగాల చిత్రకళ వివిధ రీతుల్లో అభివృద్ధి చెందింది. మొఘల్ పాలన అంతమయ్యాక డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కంపెనీలు దేశంలోకి అడుగుపెట్టాక మన దేశంలో ఆధునిక చిత్రకళ మొదలైంది. బ్రిటిష్ హయాంలోనే మన దేశంలో చిత్రకళా అధ్యయన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో శాస్త్ర సాంకేతిక అధ్యయన కేంద్రాల అభివృద్ధితో పోల్చుకుంటే, కళా అధ్యయన కేంద్రాల అభివృద్ధి నామమాత్రమే! ఇక చిత్రకళపై తెలుగులో వచ్చిన పుస్తకాల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు ‘చిత్రలేఖనము’ పేరిట 1918లో రాసిన పుస్తకమే బహుశ తెలుగులో వచ్చిన తొలి ఆధునిక చిత్రకళా గ్రంథం. స్వాతంత్య్రా నికి ముందు కళాభిరుచి గల కొందరు బ్రిటిష్ దొరలు ఎందరో భారతీయ చిత్రకారులను ప్రోత్సహించారు. ఆనాటి సంస్థానాలు సైతం చిత్రకళకు ఊతమిచ్చాయి. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడైన రాజా రవివర్మ ట్రావెన్కోర్ సంస్థానాధీశుని ప్రోత్సాహంతో రాణించాడు. ఇద్దరు తెలుగు గురువుల వద్ద, బ్రిటిష్ చిత్రకారుడు థియోడార్ జెన్సన్ వద్ద రవివర్మ తైలవర్ణ చిత్రకళను నేర్చుకున్నాడు. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో రవివర్మ అగ్రగణ్యుడే గానీ, ఆద్యుడు కాదు. ఇప్పటి వరకు దొరుకుతున్న ఆధారాల ప్రకారం తెలుగువాడైన బ్రహ్మస్వామిని తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడిగా చెప్పుకోవచ్చు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన బ్రహ్మయ్య గీసిన చిత్రాలు ఫ్రాన్స్ జాతీయ గ్రంథాలయం వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆధునిక కాలానికి చెందిన మన తెలుగు చిత్రకారుల గురించి చెప్పుకుంటే కూల్డ్రే దొర ప్రోత్సాహంతోనే తొలితరం ఆధునిక చిత్రకారుల్లో ఒకరైన దామెర్ల రామారావు రాణించారు. దామెర్ల మిత్రుడు వరదా వెంకటరత్నం కూడా కూల్డ్రే ప్రోత్సాహంతోనే చిత్రకళలో రాణించారు. మశూచి బారినపడి దామెర్ల పిన్నవయసులోనే మరణించ డంతో రాజమండ్రిలో ‘రామారావు ఆర్ట్ గ్యాలరీ’ని ఏర్పాటు చేసినది వరదా వెంకటరత్నమే! గడచిన శతాబ్దిలో పలువురు తెలుగు చిత్రకారులు భారతీయ చిత్రకళను సుసంపన్నం చేశారు. అప్పట్లో ‘భారతి’ వంటి పత్రికలు చిత్రకళకు కూడా సముచిత ప్రాధాన్యమిచ్చేవి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చిత్రకళాకారులు తెలుగునాట చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నా, వారి నైపుణ్యాన్ని, ప్రత్యేకతను బేరీజువేసి పాఠకులకు విశదీకరించగల కళావిమర్శకులే మనకు అరుదైపోయారు. తెలుగునాట వివిధ విశ్వవిద్యాలయాల్లో బీఎఫ్ఏ, ఎంఎఫ్ఏ కోర్సులు నిర్వహి స్తున్నా, ఏటా ఈ డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చేవారిలో కనీసం ఒకరిద్దరయినా చిత్రకళా విమర్శ కులుగా తయారు కాలేకపోవడం విచారకరం. ప్రపంచంలోని ఉత్తమ చిత్రకళా విద్యాల యాల్లో తొలి ముప్పయి స్థానాల్లోనైనా మన దేశానికి చెందిన ఏ చిత్రకళా విద్యాలయానికీ చోటులేక పోవడం మరో విషాదం. చిత్రకళపై మనదేశంలో ఇంగ్లిష్ మ్యాగజైన్లు కొద్ది సంఖ్యలో వస్తున్నాయి. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో పూర్తిగా చిత్రకళకు పత్రికలేవీ లేవు. ఒకవేళ వచ్చినా, అవి మనుగడ సాగించగల పరిస్థితులూ లేవు. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటా ‘చిత్రసంతె’ జరుగుతుంది. ‘కరోనా’ వల్ల దీనికి రెండేళ్లు అంతరాయం కలిగినా, ఈసారి యథావిధిగా జరిగింది. వారం కిందట జరిగిన ‘చిత్రసంతె’లో దేశం నలుమూలల నుంచి వచ్చిన చిత్రకారులు పాల్గొన్నారు. కర్ణాటక చిత్రకళా పరిషత్ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలూ నిర్వహిస్తే బాగుంటుంది. ఏటా దేశంలోని వివిధ నగరాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లే, ‘చిత్రసంతె’ వంటి కార్యక్రమాన్ని కనీసం దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహించేటట్లయితే వర్ధమాన చిత్రకారులకు కొంతైనా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గీత రాత మారుతుంది. -
ఏమైందో ఏమో.. కన్నతల్లే కాలయముడు అయింది.. ఆపై
కర్ణాటక: ఎంత కష్టం వచ్చినా కాపాడాల్సిన తల్లి క్షణికావేశంలో హంతకిగా మారింది. ఇద్దరు పిల్లలను చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. క్రిష్ణగిరి మత్తూరు సమీపంలోని నడుపనట్టి గ్రామానికి చెందిన వెంకటేషన్ (39). ఇతనికి తొమ్మిదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన గాయత్రి (32)తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కనిష్కా (7), శరవణ్ (4) అనే పిల్లలున్నారు. వెంకటేష్ తిరుపతిలో టోపీల వ్యాపారం చేస్తున్నాడు. అక్కడే నెలల తరబడి ఉండేవాడు. దీంతో వారి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గాయత్రి తన ఇద్దరు పిల్లలను ఉరికి వేలాడదీసి హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొంది. అత్త ఉదయలక్ష్మి చూసి మత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఊత్తంగేరి డీఎస్పీ అలెగ్జాండర్ కేసు విచారణ చేపట్టారు. -
డీబార్ చేశారని మనస్థాపం.. హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్య
బెంగళూరు: పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిన ఆరోపణలతో కాలేజీ నుంచి డీబార్ చేయడంతో విద్యార్థిని హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు జీవనబీమా నగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ విద్యార్థిని ముళబాగిలు కు చెందిన భవ్య (19). ప్రైవేటు పీజీ హాస్టల్లో ఉంటూ కోరమంగల జ్యోతినివాస్ కాలేజీలో పస్ట్ ఇయర్ బీకాం చదువుతోంది. పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడిందని శుక్రవారం కాలేజీ నుంచి డీబార్ చేశారు. దీంతో తీవ్రంగా బాధపడిన భవ్య సాయంత్రం తన సోదరికి ఫోన్ చేసి తనను కాలేజీ నుంచి డీబార్ చేశారని, నేను ఇక బతకలేను అని చెప్పింది. తల్లిదండ్రులు భయపడి తిరిగి ఫోన్ చేయగా భవ్య స్పందించలేదు. దీంతో వారు బెంగళూరుకు బయల్దేరారు. కొంతసేపటికే ఆమె హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి దూకడంతో మృత్యువాత పడింది. కుమార్తె మృతికి కాలేజీ పాలకమండలి కారణమని భవ్య తల్లిదండ్రులు జీవనబీమానగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
Crime News: ఏడేళ్ల కిందట దారుణ హత్య.. తీగ లాగితే డొంక కదిలింది!
బెంగళూరు: ఏడేళ్ల కిందటి హత్య కేసులో దంపతులను కామాక్షి పాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ గౌస్, హీనా కౌసర్ కాగా, హతుడు వజీర్‌బాషా. ఈ దంపతులు ఏపీ నుంచి వచ్చి బెంగళూరులోని హగ్గనహళ్ళిలో ఉండేవారు. గౌస్ టైలర్‌గా పని చేసేవాడు. హీనా కౌసర్.. వజీర్ అనే వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పు తీసుకుంది. చదవండి: కన్నతల్లి నిద్రపోతుండగా ప్రియుడితో కలిసి.. ఆ సమయంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భర్త గౌస్ అతన్ని అంతమొందించాలని పథకం వేశాడు. ఒకరోజు భార్య ద్వారా అతన్ని పిలిపించి ఇద్దరూ కలిసి ప్రాణాలు తీశారు. శవాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి వజీర్ తీసుకొచ్చిన వాహనం ద్వారానే హిందూపురం సమీపంలో పడేసి అనంతపురం జిల్లాలో తలదాచుకున్నారు. ఇటీవల హీనా కౌసర్ తాత చనిపోగా అంత్యక్రియల కోసం దంపతులు వచ్చారు. హతుని భార్య ఆయేషా ఆ దంపతులపై ఫిర్యాదు చేయగా కామాక్షి పాళ్య పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలో అరెస్టు చేసి విచారించగా నేరం తామే చేశామని అంగీకరించారు. -
కన్న తండ్రి కామాంధుడు.. తెలిసినవాడు మోసగాడు
మైసూరు: కుమార్తెపై కన్నతండ్రి కామాంధుడై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ అభాగ్యురాలికి ప్రభుత్వం రూ. 5 లక్షల సహాయాన్ని అందజేస్తే ఒక మోసగాడు ఆ డబ్బును కొట్టేశాడు. ఇలా బాలిక ఇంటా బయటా దగా అయ్యింది. ఈ దారుణం హుణసూరు తాలూకాలోని బల్లెనహళ్ళి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ మోసగాడు మాజీ గ్రామ పంచాయతీ సభ్యుని కొడుకైన చాంద్‌పాషా. 2019లో గ్రామంలో ఒక వ్యక్తి సొంత కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2020లో సంక్షేమ శాఖ ఆ బాలికకు రూ.5 లక్షల పరిహారాన్ని అందజేసింది. నిరక్షరాస్యత ఆసరాగా బాలికకు, తల్లి కి చదువు రాకపోవడంతో చాంద్‌పాషా వారి డబ్బును కొట్టేయాలని కుట్ర పన్నాడు. వారితో బ్యాంకు ఖాతాను తెరిపించి ఆ డబ్బులను అందులో జమ చేయించాడు. ఆ సమయంలో ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలన్నీ తెలుసుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో బాలిక ఖాతాలో నుంచి రూ.2.50 లక్షలను తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. డెబిట్ కార్డు ద్వారా మిగతా డబ్బును స్వాహా చేశాడు. ఇటీవల తల్లీకూతురు డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లగా ఖాతా ఖాళీ అయ్యిందని చెప్పడంతో కంగుతిన్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మోసగాడు చాంద్‌పాషాను అరెస్టు చేశారు. డబ్బునంత తాను వాడుకున్నట్లు చెప్పాడు. -
వజ్రాల గాజు మిస్సింగ్.. వెలకట్టలేని నిజాయతీ
బెంగళూరు: రోడ్డుపై వంద రూపాయలు దొరికితే జేబులో వేసుకునేవారు కొందరైతే, ఎవరో పడేసుకున్నారని వెతికి సొంతదారుకు ఇచ్చేవారు మరికొందరు. వజ్రాలు పొదిగిన చేతి గాజు దొరికితే ఒక కార్మికుడు ఎంతో నిజాయతీగా యజమానికి ఇచ్చేసిన సంఘటన మంగళూరు ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విమానంలో మంగళూరుకు బంధువుల ఇంటికి వచ్చిన మహిళ ఒక చేతికున్న వజ్రాల గాజును పోగొట్టుకుంది. అష్రఫ్ మొయిద్దీన్ అనే ట్రాలీ కూలీకి దొరకడంతో దానిని అధికారులకు ఇచ్చాడు. కొంతసేపటికి బాధిత మహిళ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి గాజు పోయిన విషయం చెప్పింది. వెంటనే ఆమెను పిలిపించి అష్రఫ్ చేతనే గాజును అందజేశారు. -
Pro Kabaddi League 2021: కబడ్డీ కూతకు వేళాయె...
Pro Kabaddi 2021 Schedule And Venue: కూత పెట్టేందుకు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ముస్తాబైంది. నేటి నుంచి ఎనిమిదో సీజన్ జరగనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ మ్యాచ్‌లన్నీ బెంగళూరు వేదికపైనే జరుగనున్నాయి. కోవిడ్ మహమ్మారి వల్ల గతేడాది టోర్నీ రద్దు కావడంతో ఈ సీజన్‌ను పకడ్బందీగా బయో బబుల్‌లో నిర్వహిస్తున్నారు. మొత్తం 12 జట్లు ఇది వరకే బయో బబుల్‌లో ఉన్నాయి. మాజీ చాంపియన్లు యు ముంబా, బెంగళూరు బుల్స్ల మధ్య బుధవారం జరిగే తొలి మ్యాచ్‌తో పీకేఎల్–8 మొదలవుతుంది. ఈ మ్యాచ్ ముగియగానే తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. అనంతరం మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ తలపడుతుంది. ఈ సీజన్లో తొలి నాలుగు రోజులు మూడు మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం కూడా మూడేసి మ్యాచ్‌లుంటాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–6లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఫైనల్‌తో ఎనిమిదో సీజన్ ముగుస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు వరుసగా రాత్రి గం. 7:30 నుంచి... గం. 8:30 నుంచి మొదలవుతాయి. మూడో మ్యాచ్‌లను రాత్రి గం. 9:30 నుంచి నిర్వహిస్తారు. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతాయి. పీకేఎల్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు ఐదు పాయింట్లు లభిస్తాయి. ‘టై’ అయితే రెండు జట్ల ఖాతాలో మూడు పాయింట్లు చొప్పున చేరుతాయి. ఏడు లేదా అంతకంటే తక్కువ పాయింట్ల తేడాతో ఓడిన జట్టుకు ఒక పాయింట్ ఇస్తారు. ఏడు పాయింట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిన జట్టుకు పాయింట్లేమీ రావు. పీకేఎల్ బరిలో ఉన్న జట్లు బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్, యూపీ యోధ. -
కోర్టు విచారణ సమయంలో అర్థనగ్నంగా దర్శనం..
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్ కారణంగా పలు కోర్టుల్లో వాదనలు వర్చువల్‌గా కొనసాగుతున్నాయి. హైకోర్టులో వర్చువల్‌గా వాదనలు జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసుకు సంబంధించిన వ్యక్తి అర్ధనగ్నంగా వర్చువల్ వాదనలకు హాజరయ్యాడు. ఈ ఘటన కర్ణాటక హైకోర్టులో చోటుచేసుకుంది. సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ హైకోర్టులో వర్చువల్ వాదనలు జరుపుతున్న సమయంలో సదరు వ్యక్తి అర్ధ నగ్నంగా కనిపించడంతో ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేశారు. చదవండి: Omicron Variant: కొత్త వేరియంట్ కట్టడి ఎలా?.. ప్రస్తుతానికి నో లాక్డౌన్: ఆరోగ్యమంత్రి ‘వాదనలు వినిపిస్తున్న సమయంలో సుమారు 20 నిమిషాల పాటు ఆ వ్యక్తి అర్ధనగ్నంగా స్క్రీన్‌పై కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తిపై అధికారికంగా కోర్టు ధిక్కరణ, లైంగిక వేధింపుల కింద ఫిర్యాదు చేశాను. ఇది కచ్చితంగా వాదనలను అడ్డుకునే ప్రయత్నం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. అయితే న్యాయవాది ఇందిరా జైసింగ్ ఫిర్యాదు మేరకు కర్ణాటక హైకోర్టు ఆ వ్యక్తికి నోటిసులు జారీ చేసింది. I confirm that a semi naked man was visible on the screen for a full 20 minutes despite my objection . I am making an official complaint for contempt of court snd sexual harassment. It’s extremely disturbing in the middle of an argument in court https://t.co/q9DAgoHze7 — Indira Jaising (@IJaising) November 30, 2021 -
రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
సాక్షి, బెంగళూరు: కన్నూర్-బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎక్స్‌పప్రెస్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు పట్టాలపై బండరాళ్లు పడంటతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 3.50 సమయంలో కదులుతున్న రైలు తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో తోప్పూరు-శివాడి ఘాట్ వద్ద బండ రాళ్లను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. చదవండి: దాడులతో నన్ను భయపెట్టలేరు: మాలిక్ రైలులో ఉన్న 2,348 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్ఓ వెల్లడించారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన చోటుకి వైద్య బృందాన్ని, డివిజినల్ అధికారుల బృందాన్ని పంపించామని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం తొప్పూరులో మొత్తం 15 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. -
తండ్రిని చూసి కన్నీటిపర్యంతమైన ధృతి
-
కంటతడి పెట్టిన బాలయ్య
-
లెహెంగాల ఫాల్స్‌లో డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్‌ను తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పెడ్లర్లు కొత్తకొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా కొరియర్ ద్వారా ఆస్ట్రేలియాకు రవాణా చేసేందుకు లెహెంగాల్లోని ఫాల్స్‌లో కోట్లు విలువ చేసే డ్రగ్స్ పెట్టి కుట్టేశారు. ఈ లెహెంగాలను కార్గోలో పంపేందుకు యత్నించి బెంగళూరు నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులకు చిక్కింది ఓ ముఠా. మూడు లెహెంగాల్లోని ఫాల్స్‌లో 3 కేజీల మిథిలీన్ డైఆక్సీ మిథాంఫిటమిన్ (ఎండీఎంఏ) డ్రగ్ పెట్టి చెన్నైకి చెందిన పెడ్లర్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీ ద్వారా కన్సైన్మెంట్ బుక్ చేశాడు. ఎన్సీబీకి సమాచారం అందడంతో ఆ పార్శిల్‌ను ట్రాక్ చేశారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో గురువారం స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్‌ను తెరిచి చూడగా మూడు లెహెంగాల్లో్ల ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. ఏపీలోని నర్సాపురంలో ఓ తప్పుడు చిరునామా ఉపయోగించి చెన్నైకి చెందిన ఓ పెడ్లర్ దీన్ని బుక్ చేసినట్లు గుర్తించారు. అనంతరం చెన్నైలోని నిందితుడి అసలు అడ్రస్ గుర్తించి, ఎన్సీబీ అధికారులు శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. పార్శిల్‌ను పంపేందుకు ఈ పెడ్లర్ నకిలీ డాక్యుమెంట్లు వినియోగించినట్లు విచారణలో తేలినట్లు అధికారులు చెప్పారు. మరో కేసులో నలుగురు అరెస్టు మరో కేసులో భాగంగా బెంగళూర్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఎన్సీబీ చేధించింది. శనివారం బెంగళూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారును ఎన్సీబీ దేవనహల్లి చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేయగా, హై గ్రేడ్ గంజాయితో పాటు ఎండీఎంఏ పిల్స్, మిథాంఫిటమిన్, మెథక్వలోన్ లభ్యమైనట్లు ఎన్సీబీ బెంగళూర్ జోనల్ డైరెక్టర్ అమిత్ గౌవాటే తెలిపారు. కారులో ఉన్న నలుగురి అరెస్టు చేసి విచారించగా, వారిలో ఒకరు విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా, మిగిలిన ముగ్గురు హైదరాబాద్‌లో నివసిస్తున్న బిహార్‌కు చెందిన వారని గుర్తించినట్లు వెల్లడించారు. డ్రగ్స్‌ను వీకెండ్ పార్టీలకు సరఫరా చేసేందుకు వెళ్తున్నారని, హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లోకి ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు చెప్పారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా బెంగళూరులో కొంత గంజాయితో పాటు ఎండీఎంఏ, ఇతర డ్రగ్స్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలు లభ్యమైనట్లు తెలిపారు. హాట్ స్పాట్లుగా.. విదేశాలకు డ్రగ్స్ రవాణా చేయడంలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూర్ నగరాలు హాట్ స్పాట్లుగా మారుతున్నట్లు ఎన్సీబీ పేర్కొంటోంది. ఎవరెవరో వ్యక్తులు హైదరాబాద్, ముంబై ద్వారా ఆస్ట్రేలియాకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం ఆందోళన కల్గిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాల్లో విదేశాలకు చెందిన మాఫియా లోకల్ గ్యాంగ్‌లతో పెట్టుబడి పెట్టిస్తోందని, ఆ డ్రగ్స్‌ను ఇలా కొరియర్ల రూపంలో మళ్లీ అక్కడికే తెప్పించుకుంటోందని తేలింది. అయితే ఈ నాలుగు ప్రాంతాల్లో ఉన్న పెడ్లర్లపై దృష్టి పెడితే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్!
విద్యుత్తు వాహనాలతో లాభాలు బోలెడు! ప్రయాణం ఖర్చు తక్కువ.. కాలుష్యం ఉండదు.. అయినా సరే.. రోడ్లపై ‘ఈవీ’లు ఎక్కువగా కనిపించవు. ఎందుకు? ఎక్కువ దూరం వెళ్లలేకపోవడం ఒక కారణమైతే.. బ్యాటరీ రీచార్జ్‌కు గంటల సమయం పట్టడం ఇంకొకటి. మొదటి సమస్య మాటెలా ఉన్నా.. రెండో దాన్ని బెంగళూరు స్టార్టప్ ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ పరిష్కరించింది. మరికొన్ని నెలల్లోనే ఈ కంపెనీ అభివృద్ధి చేసిన బ్యాటరీ ప్యాక్, స్మార్ట్ చార్జర్లు దశల వారీగా దేశం మొత్తమ్మీద ఏర్పాటు కానున్నాయి! 15 నిమిషాల్లోనే బ్యాటరీని నింపేస్తామంటోంది ఆ కంపెనీ! అదెలాగో చూసేయండి మరి! సాక్షి, హైదరాబాద్: 2030 నాటికి దేశంలో అమ్ముడుపోయే కొత్త వాహనాల్లో 30 శాతం విద్యుత్తుతో నడిచేవి ఉండేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే చాలా కంపెనీలు విద్యుత్తు వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. అయితే వీటన్నింటితో ఉన్న ప్రధాన సమస్య చార్జింగ్ సమయం. ఉదాహరణకు ఓ ప్రముఖ కంపెనీ ఈవీలో 30.2 కిలోవాట్ల బ్యాటరీలు ఉన్నాయి. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని ఆ కంపెనీ చెబుతోంది. స్పీడ్ చార్జింగ్ ద్వారా 80 శాతం బ్యాటరీ నింపేందుకు గంట సమయం.. ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటే పూర్తిగా నిండేందుకు పది గంటల వరకు సమయం పడుతుందని అంచనా. అంటే ఈ రకమైన విద్యుత్ వాహనాలు తక్కువ దూరం మాత్రమే ప్రయాణించేందుకు పనికొస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి దూరాభారం వెళ్లాలంటే అసాధ్యమే. సాధారణంగా విద్యుత్తు వాహనాల బ్యాటరీలు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు 4 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఒక్కో బ్యాటరీని వెయ్యి నుంచి 2 వేల సార్లు చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బ్యాటరీలు మార్చుకోవాలి. వేగంగా చార్జ్ చేయాలంటే లిథియం టైటనేట్ ఆక్సైడ్ (ఎల్‌టీవో) లేదా సూపర్ కెపాసిటర్లను వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరీదైన వ్యవహారాలు. పైగా చార్జింగ్ వేగం ఎక్కువైతే.. బ్యాటరీల సామర్థ్యం కూడా అంతే వేగంగా తగ్గిపోతుంది. కాఫీ తాగొచ్చేలోపు.. ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ అభివృద్ధి చేసిన బ్యాటరీతో ఈవీని తయారు చేశారని అనుకుందాం. ‘ఈ–పంప్’తో ఇంటి దగ్గర 15 నిమిషాల్లో చార్జ్ చేసుకుంటే.. 312 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్లో బ్యాటరీని చార్జ్ చేసేందుకు ఉంచి.. ఓ కాఫీ తాగొస్తే సరి.. మళ్లీ 312 కి.మీలు వెళ్లేందుకు కారు సిద్ధంగా ఉంటుంది. ఈ–ప్యాక్‌ను ఏకంగా 3 వేల సార్లు చార్జింగ్, డిస్ చార్జింగ్ చేసినా దాని సామర్థ్యంలో వచ్చే నష్టం తక్కువగానే ఉంటుందని అరుణ్ వినాయక్ తెలిపారు. అనుమతులు పొందిన తర్వాత ఈ ఏడాది చివరికల్లా బెంగళూరు, ఢిల్లీలో వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడతామని పేర్కొన్నారు. కాగా, ఈ–ప్యాక్, ఈ–పంప్‌లను నడిపించేందుకు ప్రత్యేకమైన బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా వీరు సిద్ధం చేశారు. బ్యాటరీ ప్యాక్‌లోని ఒక్కో సెల్లో విద్యుత్తు మోతాదు ఎంత ఉందన్నది గమనించి అందుకు తగ్గట్టుగా ఈ–పంప్ ద్వారా జరిగే విద్యుత్తు ప్రవాహాన్ని ఈ మేనేజ్మెంట్ వ్యవస్థ నియంత్రిస్తుంది. ఎక్స్‌పొనెంట్ ప్రత్యేకతలు.. అరుణ్ వినాయక్, సంజయ్ బైలా కలసి బెంగళూరు కేంద్రంగా ఎక్స్‌పొనెంట్ ఎనర్జీ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. విద్యుత్తు వాహనాల బ్యాటరీలను 15 నిమిషాల్లోనే చార్జ్ చేసేందుకు ప్రత్యేకమైన చార్జర్ ‘ఈ–పంప్’ను, అవసరానికి తగ్గట్టు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయేందుకు అవకాశం కల్పించే బ్యాటరీ ప్యాకేజీ ‘ఈ–ప్యాక్’ను ఈ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ రెండింటినీ కలిపి వాడితే 15 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్‌గా చార్జ్ చేయడం సాధ్యమవుతుందని కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అరుణ్ వినాయక్ ‘సాక్షి’తో చెప్పారు. బ్యాటరీ పరిస్థితిని బట్టి చార్జర్ విద్యుత్తు ప్రసారాన్ని నియంత్రిస్తూ ఉంటుందని, ఫలితంగా బ్యాటరీకి జరిగే నష్టాలను నివారిస్తూనే తక్కువ సమయంలో ఎక్కువ విద్యుత్‌ను నింపేందుకు అవకాశం ఏర్పడిందని వివరించారు. -
వంగిపోయిన మరో భవనం.. కూల్చివేసిన అధికారులు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో మరో భవనాన్ని బుధవారం అధికారులు కూల్చివేశారు. గత రాత్రి మూడంతస్తుల అపార్టుమెంట్ భవనం కూలిపోయేటట్టు పాక్షికంగా ఒరిగి ఉండటం స్థానికులు గుర్తించారు. భవనం పరిస్థితిని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పశ్చిమ బెంగళూరులోని కమలానగర్ ఉన్న భవనాన్ని అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమక్షంలో పోలీసుల జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఈ భవనానికి సమీప ఇళ్లలోని వారిని మరోచోటుకి తరలించారు. ఆ కుటుంబాలకు ఆహారవసతి కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే భవనం కూలిపోయే స్థితికి రావడాని భారీ వర్షాలు కారణమని అధికారులు తెలిపారు. తాము కూల్చివేయాలని అనుకుంటున్న 26 భవనాల్లో ఇది ఒకటని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. గత గురువారం కూడా కస్తూరి నగర్లో ఓ మూడు అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. #WATCH | Karnataka: Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) demolished building in Vrushabhavathi ward near Shankar Nag bus stand in Bengaluru, earlier today. pic.twitter.com/bTk8dRKuli — ANI (@ANI) October 13, 2021 -
IT Raids: యడియూరప్ప సన్నిహితుడి ఇంట్లో ఐటీ తనిఖీలు
సాక్షి, బెంగళూరు: పన్ను ఎగవేత ఆరోపణలపై ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారుల బెంగళూరులో గురువారం సోదాలు చేపట్టారు. 50కిపైగా ప్రాంతాల్లో అధికారులు రైడ్ చేశారు. యడియూరప్ప సన్నిహితుడు ఉమేష్ నివాసంలో ఐటీ తనిఖీలు జరిగాయి. పలువురు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల నివాసాల్లో సోదాలు జరిపారు. 120కి పైగా కార్లను సీజ్ చేశారు. -
Covid: ఒకే స్కూల్లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
బెంగళూరు: దేశం వ్యాప్తంగా కరోనా రోజువారీ కొత్త కేసుల నమోదు తగ్గుతోంది. వరసుగా రెండో రోజు దేశంలో రోజువారీ కేసులు 20 వేల కంటే దిగవకు నమోదు కావటం గమనార్హం. అయితే మరోవైపు కర్ణాటకలోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ ఏకంగా 60 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. 60 విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, అందులో ఇద్దరికి మాత్రమే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని జిల్లా అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజు రాష్ట్రంలో ప్రాథమిక పాఠళాలలు ప్రారంభించాలనుకున్న ప్రభుత్వాని ఈ కేసులు ఆందోళనకరంగా మారాయి. బెంగుళూరు అర్బన్ జిల్లా కమిషనర్ జే. మంజునాథ్ దీనిపై స్పందిస్తూ.. 480 మందికి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా 60 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని తెలిపారు. వారంతా 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులని పేర్కొన్నారు. -
బెంగుళూరులో భారీ పేలుడు .. ముగ్గురు దుర్మరణం
-
బెంగళూరులో 106 భాషల ప్రజలు
బనశంకరి: సిలికాన్ సిటీ బెంగళూరులో ఎన్ని భాషలు మాట్లాడేవారు నివసిస్తుండవచ్చు? దీనికి సమాధానం 20 లేదా 30 అనుకుంటున్నారా.. కాదు.. 106..! అని ఒక సర్వే తేల్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిల్లీకి చెందిన ఓ నిపుణుడు నిర్వహించిన పరిశోధనలో ఇది వెల్లడైంది. బెంగళూరులో 22 అధికార, 84 ఇతరత్రా భాషలు మాట్లాడే ప్రజలు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇందులో 44.5% మంది కన్నడ మాట్లాడేవారు కాగా, 15% తమిళం, 14% తెలుగు, 12% ఉర్దూ, 3% మలయాళీలు, 6% మంది ఇతర భాషలు మాట్లాడే ప్రజలున్నారు. చదవండి: ఐఫోన్‌తో కేక్ కట్ చేసి.. ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుకలు: వైరల్ -
ప్రేమ పేరుతో మోసం.. యువతిని ఇంట్లోనే నిర్బంధించి..
సాక్షి, పశ్చిమ గోదావరి: తనను ప్రేమించి వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావని ప్రియుడిని నిలదీయాలని ఓ యువతి బెంగళూరు నుంచి పశ్చిమగోదవరికి వచ్చింది. ప్రియుడి ఇంటికి వెళ్లిన ఆ యువతిని సదరు యువకుడు ఇంట్లో నిర్బంధిచాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన రమేశ్ అనే యువకుడు బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అనంతరం కొన్ని రోజులకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న ప్రియురాలు బెంగుళూరు నుంచి ప్రియుడి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ప్రియుడు రమేష్, అతని తల్లిదండ్రులు ఆ యువతిని ఇంట్లోనే నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న వీరవాసరం పోలీసులు నిర్బంధంలో ఉన్న అమ్మాయిని విడిపించారు. ఆమె ప్రియుడు రమేష్, అతని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రియుడు రమేష్, మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్వాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
శభాష్ వలంటీర్: బెంగళూరు వెళ్లి బీమా..
కురబలకోట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు. కురబలకోట మండలం భద్రయ్యగారిపల్లె గ్రామ వలంటీర్ వేపలపల్లె దయ్యాల కిరణ్ కుమార్‌రెడ్డి తన పరిధిలోని వారు కొందరు బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. గురువారం వారి వద్దకు వెళ్లి.. బీమా ఈకేవైసీ చేశాడు. తమ కోసం గ్రామ వలంటీర్ బెంగళూరు వచ్చి వైఎస్సార్ బీమా నమోదు చేయడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం దాటిన వలంటీర్ల సేవలు ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పింఛన్‌దారులకు మూడు నెలల నగదు అందజేత చీరాల టౌన్: అభాగ్యుల పాలిట వలంటీర్ వ్యవస్థ ఆశా దీపంగా మారుతున్నది. వరుసగా మూడో నెలకూడా పింఛన్ తీసుకోకపోతే కార్డు రద్దయ్యే ప్రమాదం ఉండడంతో వార్డు వలంటీర్లు చొరవ చూపిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వలంటీర్లు షేక్.నాగూర్‌బాబు, కె.గోపి మూడు నెలల పింఛన్‌ను ఒకేసారి చెల్లించడంతో సంబంధిత వ్యక్తులు హర్షం వ్యక్తం చేశారు. చీరాల బోస్ నగర్‌కు చెందిన కె.అంజలీకుమారి ఊపిరితిత్తుల వ్యాధితో చెన్నై పెరంబూర్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో మూడు నెలల నుంచి చికిత్స పొందుతోంది. పెరంబూర్ వైద్యశాలలో అంజలీకుమారికి పింఛన్ అందిస్తున్న వలంటీర్ కె.గోపి గురువారం రాత్రి గోపి రైలులో పెరంబూర్ వెళ్లి మూడు నెలల వైఎస్సార్ పింఛన్ ఒకేసారి అందజేశాడు. అలానే బోస్‌నగర్‌కు చెందిన గుంటి రామచంద్రరావు క్యాన్సర్ వ్యాధికి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ మూడు నెలలుగా పింఛన్ తీసుకోవడంలేదు. దీంతో వలంటీర్ షేక్.నాగూర్‌బాబు శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకుని మొత్తం నగదు అందజేశాడు. 95.4 శాతం మందికి పింఛన్ల పంపిణీ ► నేడు కూడా వలంటీర్ల ద్వారా కొనసాగనున్న పంపిణీ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు శుక్రవారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి వరకు మొత్తం 58,16,064 (95.4 శాతం) మందికి రూ.1,405.74 కోట్ల పింఛను డబ్బు పంపిణీ చేశారు. శనివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తెలిపారు. -
వెరైటీ: అయితే ఎరుపు లేదంటే తెలుపు
ప్రతి వ్యక్తికి తనకిష్టమైన రంగు ఒకటుంటుంది. జీవితం ‘చీకటి–వెలుగుల రంగేళీ..’ అన్నారు. కానీ, ఎరుపు– తెలుపులతోనే సహజీవనం అంటోంది బెంగళూరులోని సేవన్రాజ్ కుటుంబం. వారు వేసుకునే దుస్తులు దగ్గర నుంచి ఇంట్లో ప్రతీది ఎరుపు–తెలుపు రంగులోనే దర్శనమిస్తుంది. ఈ ఎరుపు–తెలుపు కథ ఈ నాటిది కాదు. సేవన్రాజ్ వయసు 58 ఏళ్లు. పద్దెనిమిదేళ్ల వయసు నుంచి ఎరుపు–తెలుపు... ఈ రెండు రంగులతోనే దోస్తీ చేశాడు. చిన్ననాటి నుంచి నలుగురిలో భిన్నంగా కనిపించాలని అనుకునేవాడు సేవన్రాజ్. తను జీవించినంతకాలం ఎరుపు–తెలుపు రంగులనే ఆస్వాదించాలని 18 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నట్టు చెబుతాడు సేవన్రాజ్. ప్రత్యేకమైన జీవనశైలితో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాలనే ఆలోచన కూడా సేవన్రాజ్లో ఉంది. ఇంట్లో ఫర్నిచర్, కర్టెన్లు, మొబైల్స్, గోడలు, కార్లు, కార్యాలయాలు, అద్దాలు, షూస్, సాక్స్, టాయ్‌లెట్స్, టూత్ బ్రష్‌లు ... ఇలా ప్రతీది ఎరుపు– తెలుపు రంగులలోనే ఉంటాయి. సేవన్రాజ్ భార్య పుష్ప కూడా తన ఇంటికి ఈ రెండు రంగుల వస్తువులనే కొంటుంది. వీరి కొడుకు భరత్‌రాజ్, కూతురు మనీషా కూడా ఎరుపు–తెలుపు రంగులనే ధరిస్తారు. ఈ కుటుంబం లో అందరూ ఒకేసారి ఎక్కడైనా కనబడితే చాలు సెల్ఫీల కోసం పోటీపడతారు అభిమానులు. ‘చాలా మంది తెలుపు రంగును ఇష్టపడతారు. నేను దానికి ఎరుపును జోడించాను’ అంటాడు సేవన్రాజ్. ఈ రెండు రంగులతో దేశ విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందారు ఈ రంగు పిపాసి. ‘నాకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, నేను చనిపోయే వరకు ఈ రెండు రంగులతోనే జీవిస్తానని ప్రమాణం చేశాను. మొదట్లో నా చుట్టూ ఉన్నవారు నాకున్న ఈ అభిరుచికి నవ్వేవారు. కానీ, ఇప్పుడు వాళ్లూ ప్రత్యేకంగా చూస్తున్నారు’ అంటాడు సేవన్రాజ్. 7వ సంఖ్య ఎరుపు–తెలుపులోనే కాదు ‘7’ అంకె తన లక్కీ నంబర్‌గా చెబుతాడు సేవన్రాజ్. తల్లిదండ్రులకు తను ఏడవ సంతానం. అతని కారు నంబర్ 7. ఏడు భాషలు మాట్లాడతాడు. ఇంట్లో అందరి దుస్తులకు 7 గుండీలు, 7 జేబులూ ఉంటాయి! -
ఫ్లైట్ దిగారు.. పత్తా లేరు
సాక్షి, బనశంకరి: బ్రిటన్‌లో కొత్త రకం కరోనా గుబులు నెలకొన్న తరుణంలో ఆ దేశంతో పాటు విదేశాల నుంచి బెంగళూరుకు చేరుకున్నవారిలో చాలా మంది అడ్రస్ లేరు. కరోనా పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన 1,614 మందిలో 26 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైందని వైద్య ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. ఆయన సోమవారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారికి నిమ్హాన్స్లో ఆరోగ్య పరీక్షలను నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపించామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నామని, వీరిలో కరోనా స్ట్రెయిన్ తరహా కొత్తరకం లక్షణాలు కనబడలేదని, ఎవరూ హోం క్వారంటైన్లో లేరని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలామంది ఆచూకీ లభించలేదని, అందులో బ్రిటన్ నుంచి వచ్చినవారు ఉన్నారని, చాలామంది మొబైల్ స్విచ్చాఫ్ చేసుకున్నారని, వారి ఆచూకీ కనిపెడుతున్నామని తెలిపారు. పోలీసుల సహాయంతో వారి జాడను కనిపెట్టడానికి హోంమంత్రి బొమ్మైతో చర్చించామని, రెండురోజుల్లోగా వారి ఆచూకీ కనిపెడతామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను ఐసీఎంఆర్ పరీక్షించి వైరస్ రకంపై ప్రకటన చేస్తుందన్నారు. కొత్త ఏడాదిని నిరాడంబరంగా ఆచరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళూరు వచ్చిన కేరళ విద్యార్థులకు కోవిడ్ తీర నగరంలో కోవిడ్ కలకలం చెలరేగింది. కేరళ నుంచి మంగళూరుకు వచ్చిన 15 నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. జనవరి 1 నుంచి మంగళూరులో కాలేజీలు ప్రారంభం అవుతుండడంతో కేరళ నుంచి వచ్చిన 613 విద్యార్థులు మంగళూరు సిటి నర్సింగ్, రుక్మిణి శెట్టి నర్సింగ్ కాలేజీలకు చేరుకున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది టెస్టులు చేయగా వీరిలో 15 మందికి పాజిటివ్ అని తెలిసింది. 613 మందిలో 200 మందికి మాత్రమే కరోనా టెస్ట్‌లు చేశారు. మిగతావారికీ కూడా జరిపితే మరిన్ని పాజిటివ్‌లు వచ్చే అవకాశముందని భయపడుతున్నారు. 15 మంది బాధితులకు హాస్టల్లో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. వీరికి వచ్చింది మామూలు కోవిడా, లేక స్ట్రెయిన్ రకమా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించలేదని ఈ రెండు నర్సింగ్ కాలేజీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్‌లు జారీచేసింది. -
శభాష్ షంషేర్.. నీ సేవలు అద్భుతం..
శోకం నుంచి శ్లోకం పుట్టిందట. షంషేర్ ఆవేదన, ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్ క్విట్‌పఫ్. పదమూడు సంవత్సరాల వయసు నుంచే అద్భుతాలు చేస్తున్న నిఖియ షంషేర్ పరిచయం... స్కూల్ప్రాజెక్ట్లో భాగంగా క్యాన్సర్ హాస్పిటల్‌కు వెళ్లింది పద్నాలుగు సంవత్సరాల నిఖియ షంషేర్. అక్కడ ఒక వార్డ్‌లో నోటిక్యాన్సర్ పేషెంట్‌ను చూసింది. అతడి దవడ సగం తీసేశారు. మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను బతకడం కష్టమట...ఈ దృశ్యం షంషేర్‌ను కదిలించింది, చాలాకాలం వెంటాడింది. నోటి క్యాన్సర్ గురించి అధ్యయనం మొదలుపెట్టింది. కొత్త కొత్త విషయాలు తెలిశాయి. పేద,మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దేశాల్లో నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంది. మన దేశంలో నోటి క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. పొగాకు వినియోగం, మద్యం సేవించడం, వక్క నమలడం....మొదలైనవి ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి మాత్రమే కాదు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి వారిని సమస్యల వలయంలో నెడుతున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం కోసం రొటిన్ చెకప్‌లకు వెళ్లే అలవాటు మనలో చాలామందికి లేదు. ప్రారంభదశలో గుర్తించగలిగితే వ్యాధిని సమర్థవంతంగా నయం చేయవచ్చు అంటున్నాయి పరిశోధనలు. ప్రమాదఘంటికలు మోగుతున్న దశలోనే జాగ్రత్తపడే సాధనాన్ని కనిపెడితే? అలా షంషేర్ పరిశోధనల్లో నుంచి పుట్టుకు వచ్చిన సాధనమే ‘క్విట్‌పఫ్’ అనే ఎర్లీ రిస్క్ వోరల్ క్యాన్సర్ డిటెక్టర్. రిస్క్‌లో ఉన్నామా? ఉంటే ఈ ఏ దశలో ఉన్నాం? అనేది ఈ ‘క్విట్‌పఫ్’ కనిపెడుతుంది. దీనివల్ల మిడిల్ నుంచి హైరిస్క్ ఉన్నవాళ్లు వెంటనే వైద్యుడిని సంప్రదించడానికి వీలవుతుంది. ‘క్విట్‌పఫ్ లక్ష్యం పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరించడం మాత్రమే కాదు అలవాట్లలో మార్పు తీసుకురావడం కూడా’ అని చెబుతోంది బెంగళూరులోని ‘గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్’ విద్యార్థి అయిన షంషేర్. అయితే ఈ ‘క్విట్‌పఫ్’ ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు. ఎన్నోసార్లు ప్రయోగం విఫలం అయింది. ఒక దశలో నిరాశ కమ్మేసేది. మళ్లీ ఉత్సాహం కొని తెచ్చుకొని ప్రయోగాల్లో మునిగిపోయేది షంషేర్. మొత్తానికైతే సాధించింది! ప్రయోగదశలో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. షంషేర్ మాటలు విని తేలిగ్గా తీసుకునేవాళ్లే. అనుమతి ఇచ్చే వాళ్లు కాదు. ఆమె చిన్నవయసులో ఉండడం దీనికి కారణం. ఎట్టకేలకు బెంగళూరులోని ‘విక్టోరియా హాస్పిటల్’లో అనుమతి దొరికింది. 500 మందికి పైగా క్రానిక్ స్మోకర్లు, నాన్స్మోకర్లపై పరీక్షలు నిర్వహించింది. ‘క్విట్‌పఫ్’ అనుకున్న ఫలితాలను ఇస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండబోతుంది. ఈలోపు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది. ఒక వైపు చదువు, మరోవైపు ‘క్విట్‌పఫ్’ ప్రాజెక్ట్‌పై పనిచేయడానికి షంషేర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. రిసెర్చ్గ్రాంట్, తనకు వచ్చిన అవార్డ్ సొమ్మును ప్రాజెక్ట్ కోసం ఉపయోగించింది. ఒక క్లాసులో 50 మంది విద్యార్థులు ఒకే పాఠ్యపుస్తకాన్ని షేర్ చేసుకోవడం, చెప్పులు లేకుండా స్కూలుకు వచ్చే విద్యార్థులు, స్కూలు బ్యాగు కొనలేని పేద విద్యార్థులను చూసింది షంషేర్. ప్రయోగసహితంగా పాఠ్యబోధన జరిగితే వచ్చే ఫలితం బాగుంటుందనేది నమ్మకం కాదు శాస్త్రీయ నిజం. దురదృష్టవశాత్తు చాలా స్కూళ్లల్లో ‘పాఠ్యబోధన’ అనేది ఏకధాటి ఉపన్యాసం అవుతుంది. క్లాసుల్లో ఒక్క ప్రయోగం కూడా జరగలేదు. దీంతో చాలామంది విద్యార్థులు పరీక్ష తప్పారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. చివరికి చదువుకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. దీని నుంచి మార్పు తీసుకురావడానికి పదమూడు సంవత్సరాల వయసులోనే ఫిలోంత్రపిక్ ప్రాజెక్ట్ ‘యెర్న్ టు లెర్న్’ చేపట్టింది. తల్లిదండ్రులు, స్నేహితులు, స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో స్కూళ్లలో సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కృషి చేసింది. దీనివల్ల ఎంతోమంది విద్యార్థుల చదువు మెరుగుపడింది. తన ఇ–కామర్స్ వైబ్‌సైట్ ‘క్నిక్నాక్స్’ ద్వారా వచ్చిన ఆదాయంలో వందశాతం సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తుంది. టీనేజర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే గ్లోబల్ సైన్స్ కాంపిటీషన్ ‘జూనియర్ ఛాలేంజ్’లో టాప్‌స్కోరర్‌గా నిలిచింది. తన ఫేస్బుక్ పేజీలో ‘స్పేస్‌టైమ్ అండ్ గ్రావిటీ’పై చేసిన వీడియో పోస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తాను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ‘డయానా లెగసీ అవార్డ్’ ‘ఔట్‌స్టాండింగ్ యూత్ ఎకనామిక్ సిటిజన్‌షిప్’ (జర్మనీ) అవార్డ్...మొదలైన ప్రతిష్ఠాత్మకమైన అవార్డులతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకున్న షంషేర్‌కు అభినందనలు తెలియజేద్దాం. -
శశికళ ముందస్తు విడుదల లేదు
కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లు శశికళ ముందుగానే విడుదల కాబోరని తేలిపోయింది. నాలుగేళ్లు పూర్తిచేసుకున్న తరువాతనే వచ్చే ఏడాది జనవరిలో జైలు నుంచి విముక్తి లభిస్తుందని కర్ణాటక జైళ్లశాఖ స్పష్టం చేసింది. సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయి కోర్టులో దోషులుగా రుజువైంది. చెరో రూ.10 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ ప్రకారం 2017 ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ లెక్కన వచ్చే ఏడాది నాలుగేళ్లు పూర్తయి జనవరి లేదా ఫిబ్రవరి నాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే సత్ప్రవర్తన కింద ముందస్తుగానే ఈ ఏడాది ఆఖరులో చిన్నమ్మ విడుదలయ్యే అవకాశం ఉందని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ దశలో శశికళ విడుదలపై బెంగళూరుకు చెందిన టీ నరశింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద కర్ణాటక జైళ్లశాఖకు ఉత్తరం రాశారు. చదవండి: (రియాకు రిమాండ్ పొడిగింపు) వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ విడుదలయ్యే అవకాశం ఉందని జైళ్లశాఖ అతడికి బదులిచ్చింది. శశికళకు చెందాల్సిన సెలవు రోజులను పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరులో లేదా వచ్చేనెలలో విడుదలవుతారని ఆమె అనుచరులు ఇంకా ఆశాభావం వ్యక్తంచేస్తూ తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు çసమీపిస్తున్న తరుణంలో శశికళ ముందస్తు విడుదల ఈ విషయం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మరో సమాచారం బయటకు వచ్చింది. చదవండి: (తెరపైకి దియా, నమ్రత!) ఈ పరిస్థితిలో సామాజిక కార్యకర్త టీ నరశింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద జైళ్లశాఖపై మరో ఉత్తరాన్ని సంధించారు. ఖైదీలకు ఇచ్చే సెలవు దినాలు, ఇలాంటి సెలవులు ఏఏ కేటగిరి ఖైదీలకు వర్తిస్తాయి, ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు వర్తిస్తుందా అని అందులో ప్రశ్నించారు. ఇందుకు జైళ్లశాఖ బధులిస్తూ...జీవితాంతం జైలుశిక్ష పడిన ఖైదీలకు మాత్రమే సెలవు దినాలు వర్తిస్తాయని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష అనుభవించేవారికి వర్తించదని స్పష్టం చేసింది. చిన్నమ్మ కోసం సైకిల్ యాత్ర నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలో మాంగుటైపాళయంకు చెందిన వడివేల్ (50) అనే వ్యక్తి అమ్మమక ఎంజీఆర్ మన్రం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకెళ్లి శశికళను కలుసుకునేందుకు ఈనెల 18న సైకిల్ యాత్రను ప్రారంభించాడు. రోజుకు 45 కి.మీ పయనిస్తూ సోమవారం రాత్రి హోసూరుకు చేరుకున్నాడు. శశికళతో ములాఖత్ కోసం జైలు అధికారులకు వినతపత్రం ఇస్తానని.. అనుమతి లభించిన పక్షంలో..‘మీరు వస్తేనే పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడగలరు, ప్రజలు మీకోసం ఎదురుచూస్తున్నారు’ అని చెబుతానని మీడియాతో అన్నారు. -
డాలీతో చీర కట్టించుకోవాలంటే రూ.35 వేలు ఫీజు
వినడానికి వింతగా ఉన్నా... ఇది నిజం. డాలీ చేత చీర కట్టించుకోవాలంటే కనీసం 35 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పైగా చెల్లించుకోవాల్సిందే. 15 ఏళ్ల క్రితం చీర కట్టుకోవడాన్ని కష్టంగా మొదలుపెట్టి దానినే అభిరుచిగా మార్చుకొని ఇప్పుడు రికార్డులు కొట్టేస్తున్న బెంగళూరు మహిళ డాలీ జైన్ గురించి తెలుసుకోవాల్సిందే! నేటి తరం అమ్మాయిలకు చీర కట్టుకోవడం అంటే పెద్ద కష్టం. నిన్నటి తరం అమ్మలు సౌకర్యం కోసం ఎప్పుడో కుర్తాలోకి మారిపోయారు. బెంగళూరుకు చెందిన డాలీ అనే మహిళ మాత్రం 15 ఏళ్లుగా వందల రకాల సై్టల్స్లో చీర కట్టడం అనే కాన్సెప్ట్‌ను సాధన చేస్తూనే ఉంది. ఆ కాన్సెప్ట్‌తోనే సక్సెస్‌నూ సాధిస్తోంది. బాలీవుడ్ తారలకు డాలీ కట్టు సందర్భానికి తగ్గట్టు రకరకాల స్టైల్లో చీరలు ధరించడం కూడా ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యమే ప్రత్యేకతగా కలిగిన డాలీ జైన్ బాలీవుడ్ నటిమణులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తల సతీమణులకూ ఇష్టమైన సై్టలిస్ట్‌గా మారిపోయింది. డాలీ జైన్ ఖాతాదారులలో నీతా అంబానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, సోనమ్ కపూర్లు, ప్రియాంకాచోప్రా, కరిష్మా కపూర్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణులకు కూడా డాలీ చీర కట్టింది. సబ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్రా వంటి ప్రసిద్ధ డిజైనర్ల ఖాతాదారులకు డాలీ చీరలు కడుతుంది. అత్తమామల ఒత్తిడి పెళ్లికి ముందు డాలీ జీన్స్, టాప్స్ ధరించేది. పెళ్లయిన తర్వాత అత్తారింట్లో చీరకట్టుకోవాల్సిందే అన్నారు. ఆ నిర్బంధంలో డాలీ చీర కట్టుకోవడం నేర్చుకుంది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ – ‘మొదట్లో మా ఇంట్లో వాళ్ల మీద చాలా కోపంగా ఉండేది. కానీ, చీర కట్టుకోవడం నేర్చుకున్నాక దానిని స్టైల్‌గా మార్చుకోవాలనుకున్నాను. అప్పుడు విభిన్న రకాల చీరకట్టు పద్ధతులు నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఈ క్రెడిట్ అంతా మా అత్తమామలకే. పెళ్లి తర్వాత వాళ్లు జీన్స్, టాప్స్ వేసుకోవడం ఒప్పుకునుంటే ఎప్పటికీ చీరకట్టులో నైపుణ్యం సాధించేదాన్ని కాదు’ అని నవ్వుతూ చెబుతుంది డాలీ. రికార్డుల డ్రేపింగ్ ఒక చీరను 80 విధాలుగా కట్టిన నైపుణ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో డాలీ పేరు నమోదయ్యింది. రెండవసారి ఒక చీరను 325 విధాలుగా కట్టి తన రికార్డును తనే బద్దలు కొట్టింది. అంతేకాదు, ఒకటిన్నర సెకన్లలో చీరను కట్టి రికార్డు సృష్టించింది. 2015లో ‘స్ట్రాంగ్ వుమన్ ఆఫ్ ఆనర్‘ను కూడా అందుకుంది. మనలోని చిన్న ప్రతిభ కూడా విజయ తీరాలను చేరుస్తుంది. కష్టపడటం, అంకితభావంతో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అనే పెట్టుబడి మాత్రమే మనం పెట్టాల్సింది అని డాలీ నిరూపిస్తోంది. -
బెంగళూరులో అన్‌లాక్ 2
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఆర్థిక కార్యకలాపాలు జరగాల్సి ఉంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ లాక్డౌన్ విస్తరణ అనేది సాధ్యం కాని పని, మళ్లీ పొడిగించడం ఉండబోదని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టంచేశారు. బుధవారం నుంచి లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు, అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని తెలిపారు. కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం మరిచిపోవద్దని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రజలు వస్తుండడంతో కర్ణాటకలో కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ రాత్రి 9 నుంచి 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. అదే విధంగా ఆదివారాల్లో లాక్డౌన్ ఉంటుందని పేర్కొన్నారు. అన్‌లాక్ 2.0 నిబంధనలు జూలై 22 ఉదయం 5 గంటల నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. (తగ్గిన మరణాల రేటు) 80 శాతం రోగులకు లక్షణాల్లేవు ప్రతి కోవిడ్ రోగితో సంప్రదింపులు జరిపిన కనీసం 45 మందికి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకముందు కేవలం 24 గంటల్లో కరోనా పరీక్షల ఫలితాలు వచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం మంది రోగులకు ఎలాంటి లక్షణాలే కనిపించడం లేదని, ఇలాంటి సందర్భంలో కోవిడ్ కేర్ సెంటర్లో మాత్రమే కాకుండా హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. బెంగళూరులో 11,230 పడకలను కరోనా చికిత్స కోసం సిద్ధం చేసినట్లు, అంబులెన్సుల కొరత లేదని తెలిపారు. రోగులు అధైర్యపడొద్దని కోరారు. ప్రతి 100 మందిలో 98 మంది కరోనా రోగులు సంపూర్ణంగా కోలుకుంటున్నారని ఎవరూ భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. -
వందేళ్ల కిందటే రక్కసి
బనశంకరి: ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి లక్షణాలతో కూడిన జబ్బు సుమారు వంద సంవత్సరాల కిందటే బెంగళూరు నగరాన్ని వణికించిది. ఇన్ప్లూయెంజా నూమోనియా అనే వైరస్ జబ్బు 1918లోను, ఆ తరువాత మరో పదేళ్లకు వ్యాపించింది. అప్పటి బెంగళూరు సిటీ మునిసిపల్ కౌన్సిల్ ఆరోగ్య విభాగం అధికారి జేవీ. మస్కరెన్హాస్ 1928 మార్చి 03 తేదీన విడుదల చేసిన నోటీస్‌లో జబ్బు లక్షణాలను, ఔషధ చికిత్సను వివరించారు. ఆ పురాతన ప్రతులు ఇప్పుడు విడుదల కావడంతో వాట్సప్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అవుతున్నాయి. 1918లో వెలుగు చూసిన ఇన్ప్లూయెంజా సోకిన ప్రజలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడినట్లు తెలుస్తోంది. వ్యాధి ముదిరితే న్యూమోనియాగా మారే ప్రమాదం ఉంది. అప్పట్లో ఇన్ఫ్లుయెంజా నుంచి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం అధికారి మస్కరెన్హాస్ అప్పటి నోటీసుల్లో కొన్ని నిబంధనలు పేర్కొన్నారు. అవి ఇప్పటి కోవిడ్ నిబంధనల మాదిరిగానే ఉండడం విశేషం. నోటీస్ 1 ప్రజలు గుంపులుగా చేరే స్థలాలు అంటే సినిమా, నాటకాలు, సమావేశాలకు దూరంగా ఉండాలి జలుబు చేసిన వారికి దూరంగా ఉండాలి రాత్రి పగలు స్వచ్ఛమైన గాలి వీచే స్ధలంలో ఉండాలి దేహానికి, మనసుకు అలసట కాకుండా పనులు చేయరాదు ప్రతిరోజు మరుగుదొడ్డికి వెళ్లాలి ఇన్ఫ్లుయెంజా బారిన పడితే ఇలా చేయాలని నోటీసు 2 జ్వరంతో కూడిన జలుబు వస్తే తక్షణం విశ్రాంత తీసుకోవాలి. రోగంతో భాదపడే వారు గది కిటికీ తలుపులు గాలి వచ్చేవిధంగా చూసుకోవాలి. స్వచ్ఛమైన గాలి వెలుతురుతో వైరస్ తగ్గుతుంది. సమీపంలో ఆసుపత్రికి వెళ్లి ఔషధాలను తీసుకోవాలి. ఔషధ అంగళ్లలో అమ్మే సిన్ అమ్మోనేటెడ్ క్వినైన్ అనే ఔషధం సేవించాలి. లవంగం, మిరపకాయ, ఎండిన అల్లం, వెల్లుల్లి మిశ్రమాన్ని అర తులం, దానికి రెండు వెల్లుల్లి ముక్కలు కలిపి కాషాయం చేసి తీసుకోవాలి. -
కరోనా: ఆస్పత్రికి రాని వైద్యులు
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వైరస్ సోకిన వారికి వైద్యం అందించే సిబ్బంది, వైద్యుల కొరత అధికమవుతోంది. కర్ణాటకలోని శివాజినగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 20 మంది నర్స్‌లు, 44 మంది డాక్టర్లు ఉన్నారు. అయితే కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో వైద్యులు ఆస్పత్రికి రావటం మానేశారు. దీంతో కేవలం ఐదుగురు వైద్యులు, 12 మంది నర్స్‌లు మాత్రమే ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ తహా మతీన్ స్పందిస్తూ.. ఆస్పత్రికి రావటం మానేసిన వైద్యులు, నర్స్‌లు తిరిగి విధుల్లో చేరాలని ఓ వీడియో సందేశాన్ని ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐసీయూలో ఉన్న పేషెంట్లకు వైద్యం అందిచడానికి వైద్యులు లేకపోవటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఒకరు లేదా ఇద్దరు స్టాఫ్‌తో కరోనా బాధితులకు వైద్యం అందించటం కష్టంగా మారిందని పేర్కొన్నారు. (కరోనా: ప్రపంచంలో మూడో స్థానంలో భారత్) ఆస్పత్రిలో రెండు రోజుల నుంచి ఎనిమిది మంది కరోనా నిర్ధారణ పరీక్షలను పూర్తి చేసుకొని ఫలితాల కోసం ఎదురు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా ఆరుగురు కరోనా బాధితులు ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో 80 బెడ్లు ఉన్నాయని కానీ, కేవలం ఐదు మంది డాక్టర్లు మాత్రమే పని చేయటం వల్ల ఎక్కువ మందిని చేర్చుకోవటం లేదని తెలిపారు. విధులకు హాజరుకాని వైద్యులు పలు కారణాలు చెబుతున్నారని, కొంతమంది జ్వరం, తలనొప్పితో బాధపడుతునన్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో డాక్టర్లు మానవత్వంతో వ్యవహరించాలని తెలిపారు. వైద్యుల కొరతపై డిప్యూటీ సీఎం డాక్టర్ ఆర్ రవీంద్ర స్పందిస్తూ.. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని సమీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. -
ఆన్లైన్ ఉద్యోగాల పేరిట మోసం
సాక్షి, బెంగళూరు(బనశంకరి): లాక్డౌన్ నేపథ్యంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిని అవకాశంగా తీసుకున్న వంచకులు బెంగళూరులోని సిలికాన్‌సిటీలో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఇళ్లనుంచే పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పి డబ్బు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇద్దరు నిరుద్యోగులు వంచక ముఠా చేతికి చిక్కి నగదు కోల్పోయారు. లాక్డౌన్ తొలగించే వరకు ఉద్యోగం ఉండాలనే కారణంతో చాలామంది ఆన్లైన్ ఉద్యోగాలకోసం జాజ్ సెర్చ్పోర్టర్లను ఆశ్రయిస్తున్నారు. నగరానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఉద్యోగం వేటలో ఉన్నారు. ఈక్రమంలో అతనికి జాబ్ సర్చ్ కంపెనీతో పోలిన కంపెనీ మెయిల్ ఐడీ నుంచి ఆఫర్ వచ్చింది. రిజిస్ట్రేషన్ పీజు చెల్లించాలని సూచించారు. దీనిని నమ్మిన శేఖర్ తన క్రెడిట్‌కార్డు ద్వారా రూ.6,899 చెల్లించాడు. అంతటితో ఆగని వంచకులు కంపెనీ ఫీజుతో పాటు ఇతర అవసరాలంటూ మరింత నగదు డిమాండ్ చేశారు. కానీ ఇతనికి ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు. చెల్లించిన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడగ్గా ముఖం చాటేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా 21 ఏళ్ల యువతి ఉద్యోగం కోసం ఆన్లైన్ పోర్టల్‌లో తన బయోడేటా వివరాలు ఉంచింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని హెచ్ఆర్.గోకుల్, కే ఎస్.కుమార్ అనే వ్యక్తులు మెయిల్ పంపారు. అప్లికేషన్ ఫీజు కోసం రూ.1599 చెల్లించాలని సూచించారు. వారు చెప్పిన ప్రకారం ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. అనంతరం క్లియర్ చార్జ్ చెల్లించాలని రూ.2వేలు లాగేశారు. అనంతరం మరింత నగదు ఇవ్వాలని కోరగా అనుమానం వచ్చిన ఆ యువతి తాను చెల్లించిన నగదు వెనక్కు ఇవ్వాలని కోరింది. దీంతో వంచకులు డబ్బు ఇవ్వకుండా వంచనకు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కాగా ఉద్యోగం వేటలో ఉన్న వారు ఉద్యోగాల ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా నగదు చెల్లించరాదని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. -
రూ.10వేలకే ఆక్సిజన్ యంత్రం!
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్ అరుణ్‌రావు, కె.భాస్కర్‌తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు. మనం పీల్చే గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 78 శాతం నైట్రోజన్ ఉంటే 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మిగిలిన ఒక శాతంలో కొన్ని ఇతర వాయువులు ఉంటాయి. ఈ గాలి ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యంత్రంలోకి ప్రవేశించినప్పుడు అవి జియోలైట్ అనే పదార్థం గుండా ప్రయాణిస్తాయి. చౌకగా లభించే ఈ జియోలైట్ గాల్లోని నైట్రోజన్‌ను పీల్చుకునే లక్షణం కలది. అంటే.. యంత్రం నుంచి బయటకు వచ్చే గాలిలో ఆక్సిజన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యంత్రాన్ని తయారు చేసిన తరువాత మార్కెట్లో లభించే వాటర్ ఫిల్టర్లను ఉపయోగించి దాన్ని జియోలైట్‌తో నింపారు. ప్రస్తుతం ఈ యంత్రం ద్వారా 70 శాతం స్వచ్ఛతతో కూడిన ఆక్సిజన్ వెలువడుతుండగా.. దీన్ని 90 శాతానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రం నిర్వహణకు తాము అర్డినో కంప్యూటర్ బోర్డులను వాడామని ప్రొఫెసర్ రామమూర్తి తెలిపారు. -
మళ్లీ పట్టాల పైకి గోల్డెన్ చారియెట్
న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన కేటరింగ్, ఆన్లైన్ సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో మరో లగ్జరీ రైలు పట్టాలెక్కబోతోంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత గోల్డెన్ చారియట్ రైలు మార్చి 22 నుంచి సేవలు అందిస్తుందని ఐఆర్సీటీసీ అధికారులు వెల్లడించారు. కర్ణాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేఎస్టీడీసీ) 2008లో ఈ రైలుని ప్రారంభించింది. నిర్వహణ భారంతో 2018 మార్చిలో దాని సేవల్ని నిలిపివేశారు. తాజాగా ఐఆర్సీటీసీ ఈ రైలు నిర్వహణ, మార్కెటింగ్ వ్యవహారాలను తీసుకుంటూ కేఎస్‌టీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మార్చి 22 నుంచి ఈ కొత్త రైలుని నడపనుంది. మొత్తం ఆరు రాత్రులు/ఏడు పగళ్లు ప్యాకేజీతో యశ్వంతపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు బందీపూర్ నేషనల్ పార్క్, మైసూర్, హలైబీడు, చిక్మంగళూరు, హంపి, బాదామి, గోవాలకు వెళ్లి తిరిగి బెంగళూరుకు చేరుకుంటుంది. -
జస్టిస్ జయచంద్రారెడ్డి కన్నుమూత
రాయచోటి/అమరావతి: న్యాయకోవిదుడు, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి (90) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. బెంగళూరులోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితాన్ని అక్కడే గడుపుతున్నారు. కుమారుడు చనిపోవడంతో కోడలు, మనవళ్లతో బెంగళూరులో విశ్రాంత జీవితం గడుపుతున్న జస్టిస్ జయచంద్రరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం బెంగళూరులోనే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదనపల్లె, రాయచోటి ప్రాంతాల్లో ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన ఆయన మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను అందుకున్నారు. తర్వాత మద్రాసు హైకోర్టులో క్రిమినల్ న్యాయవాదిగా వృత్తిని చేపట్టి అంచలంచెలుగా ఎదిగారు. కడప జిల్లా కుగ్రామంలో జననం వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం తిమ్మసముద్రం గ్రామం వండ్లపల్లెకు చెందిన కామిరెడ్డి క్రిష్ణారెడ్డి, చెన్నమ్మ దంపతులకు జయచంద్రారెడ్డి 1929లో జన్మించారు. ఈయనకు భార్య సరోజని, కుమారుడు, కుమార్తె ఉన్నారు. న్యాయవ్యవస్థలో మార్పులకు శ్రీకారం దేశంలోని పలువురు న్యాయకోవిదులతో కలిసి జయచంద్రారెడ్డి అనేక మార్పులకు నాంది పలికారు. ముఖ్యమైన కేసుల విషయంలో ప్రభుత్వాలకు, న్యాయాధిపతులకు ఆయన సలహాలు, సూచనలను అందించేవారు. ఉమ్మడి ఏపీ స్టేట్ లీగల్ బోర్డు చైర్మన్‌గా, అడ్వయిజర్‌గా సేవలందించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, లా కమిషన్ చైర్మన్‌గా, లా కమిషన్ ఇండియన్ కౌన్సెలర్‌గా.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో యుగోస్లోవియా, రువాండ దేశాలతో జరిపిన న్యాయపరమైన కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, జస్టిస్ పీఎన్ భగవతిల నుంచి అవార్డులను అందుకున్నారు. ప్రస్థానం ఇలా.. - 1951లో మద్రాసు లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాను పొందారు. - 1952లో మద్రాసు హైకోర్టులో సీనియర్ న్యాయవాది బసిరెడ్డి దగ్గర క్రిమినల్ లాయర్‌గా ఆయన న్యాయవాద ప్రస్థానాన్ని ప్రారంభించారు. - 1956లో ఆంధ్ర రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదుకు మకాం మార్చి హైకోర్టు న్యాయవాదిగా కొనసాగారు. - 1956లోనే హైకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) పనిచేశారు. - 1965–70లలో హైకోర్టు ప్రిన్సిపల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కొనసాగారు. - 1975లో అడిషనల్ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన ఆయన అనేక హోదాలలో పనిచేస్తూ 1976లో పర్మినెంట్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. - 1979–80లలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికై అనేక హోదాల్లో పనిచేశారు. - 1995–97 14వ లా కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. - 2001–2005 వరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఆయన సేవలను అందించారు. -
ధర అదిరే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల వృద్ధిలో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. మన దేశం నుంచి టాప్–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం భాగ్యనగరమే. గతేడాది జూలై –సెప్టెంబర్ (క్యూ3) మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9% వృద్ధి చెందాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సర్వే నిర్వహించగా..హంగేరీలోని బుడాపెస్ట్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ధరల వృద్ధి 24%గా ఉంది. ఆ తర్వాత చైనాలోని జియాన్, యూహాన్ నగరాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా 15.9%, 14.9% ధరల వృద్ధి ఉంది. ఇండియాలో ఏకైక నగరం హైదరాబాదే టాప్–20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం మనదే. జూలై – సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ధరలు వృద్ధిలో ఉంటే..మిగిలిన అన్ని మెట్రో నగరాల్లో గృహాల ధరలు క్షీణించాయి. ధరల వృద్ధిలో హైదరాబాద్ తర్వాత 73వ స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఇక్కడ 3.2 % ధరల వృద్ధి ఉంది. 2% రేట్ల అప్రిసియేషన్‌తో బెంగళూరు 94వ స్థానంలో, 1.1% వృద్ధితో అహ్మదాబాద్ 108వ స్థానంలో నిలిచింది. 2% క్షీణతతో కోల్‌కతా 130వ స్థానంలో, 3% క్షీణతతో 135వ స్థానంలో ముంబై, 3% క్షీణతతో 136వ స్థానంలో చెన్నై, 3.5% క్షీణతతో 138వ స్థానంలో పుణే నగరాలు నిలిచాయి. హైదరాబాద్‌లోనే వృద్ధి ఎందుకంటే? ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో సగటున 3.2% ధరలు పెరిగాయి. 2015 రెండో త్రైమాసికం నుంచి ఇదే అత్యంత బలహీనం. ఇండియాలోని నగరాల్లో గృహాల ధరల వృద్ధి అనేది రిటైల్ ద్రవ్యోల్బణం కన్నా దిగువలోనే ఉంది. ఈ అంతరం 2016 హెచ్1 నుంచి పెరుగుతూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం రిటైల్ ద్రవ్యోల్బణం స్థాయిని మించి గృహాల ధరల వృద్ధి ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. పైగా ఇక్కడ కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు తగ్గిపోవటంతో కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధం గా ఉన్న ఇళ్లను, ఇన్వెంటరీ గృహాలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇదే డెవలపర్లకు లాభసాటిగా మారిందని పేర్కొన్నారు. -
దశ దిశలా నిరసన
‘నా కూతురు ఈ సమాజంలో భద్రంగా ఉందా?’ ‘మన పిల్లలను మనం కాపాడుకోగలమా?’ ‘సినిమాల్లో బూతును నిరోధించండి’ ‘ప్రతి మూడు నిమిషాలకు ఒక అత్యాచారం. ఇదా మన దేశం’ ‘విచారణలో కాలహరణం... న్యాయహరణమే’ ‘బాధితురాలి పేరు బయటకు చెప్పకండి’ ‘అంగీకారం లేని శృంగారం వద్దు’ ‘ఇంకా ఎంతమంది నిర్భయలు బలి కావాలి?’ ‘ఆడపిల్లలు ఆటవస్తువులు కారు’ ‘నీకు జన్మనిచ్చిన స్త్రీనే అగౌరపరుస్తావా?’ ‘మా దుస్తులు మీకు ఆహ్వానం కాదు’ ‘రేపిస్ట్‌లను ఉరి తీయండి’ ‘మేము రిపబ్లిక్లో ఉన్నాం. రేప్–పబ్లిక్‌లో కాదు’ ‘అందరి లక్ష్యం ఒక్కటే– అత్యాచార రహిత భారతదేశం’ ఇవీ నేటి స్లోగన్లు... ప్లకార్డులపై కనిపిస్తున్న నినాదాలు అన్నిచోట్లా నినాదాలు. దిక్కులు పిక్కటిల్లే ప్రతిధ్వనులు. ‘దిశ’ ఘటనకు దేశవ్యాప్త ప్రతిస్పందనలు ఇవి. విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, పౌర సంఘాలు, ప్రజలు... ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా కూడి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నారు. దోషులను శిక్షించాలని కోరుతున్నారు. తమ పిల్లలకు భద్రత ఇవ్వండి అని నిలదీస్తున్నారు. ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు. అమృత్సర్ కాని దిశ ఆత్మకు శాంతి చేకూరాలంటే నిజంగా జరగవలసిన పని ఏమిటి? వీధివీధినా, వాడవాడనా స్త్రీలపట్ల గౌరవం కలిగించే చైతన్య కార్యక్రమాలను విరివిగా నిర్వహించడం. పాఠశాలల్లో బాల్యం నుంచే విద్యార్థులకు జెండర్ అవగాహన కలిగించడం. అబ్బాయిలకు ఆడపిల్లలను సమస్థాయిలో చూసే సంస్కారం కలిగించడం. వారి ప్రవర్తనా దోషాలను మొగ్గలోనే తుంచేయడం. అందరం వ్యవహార శైలిలో, మాటలో, తిట్లలో స్త్రీలను కించపరిచే ధోరణిని పరిహరించడం. ఇళ్లల్లో భర్తలు భార్యలను గౌరవించడం. ఢిల్లీ పిల్లల ముందు పలుచన చేయకుండా ఉండటం. ఆడపిల్లలను మగపిల్లల కంటే తక్కువగా చూడకుండా ఉండటం. స్త్రీలను ఒక జోక్‌గా చేసి మాట్లాడకపోవడం. అశ్లీలతను మాధ్యమాలలో ప్రోత్సహించకపోవడం. బహిరంగ ప్రదేశాలలో స్త్రీలకు ప్రతి పౌరుడు ఒక కాపలాదారుగా మారగలగడం. వికృత ఆలోచనలు వెంటాడుతున్నవారు తమను తాము మార్చుకోవడానికి కౌన్సెలింగ్ సెంటర్లు తెరవడం. మానసిక జాడ్యాలను చెక్ చేసుకొనేందుకు ఉచిత మెంటల్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేయడం. బెంగళూరు వాటికి వెళ్లేలా ప్రోత్సహించడం. స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఎటువంటి శిక్షలు పడతాయో విరివిగా ప్రచారం చేయడం. అన్నింటికి మించి ప్రభుత్వాలు ఈ విషయంలో గట్టిగా, చిత్తశుద్ధిగా పని చేయడం, చర్యలు తీసుకోవడం. అప్పుడే ‘దిశ’ ఆత్మకు శాంతి. అప్పటి వరకూ ఈ ప్రదర్శనలు కొనసాగుతాయి. ఈ నిరసన ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. -
బంగారుపాలెంలో బెంగుళూరు పిల్లలు
సాక్షి, బంగారుపాళెం(చిత్తూరు) : చదువు ఒత్తిడి కారణంగా బెంగళూరుకు చెందిన నలుగురు విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. దాదాపు వారం రోజుల తరువాత బంగారుపాళెం పోలీసులు తమ కంటబడిన వీరిని ఆదివారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నగరం అరికిరిలో నివాసం ఉంటున్న శంకర్ కుమారుడు నిఖిల్(14) తొమ్మిదో తరగతి, ధన్సింగ్ కుమారుడు అర్జున్‌సింగ్(13) ఏడో తరగతి, భాస్కర్‌రెడ్డి కుమారుడు సందీప్(15) పదో తరగతి, నిషార్‌సోయబ్ కుమారుడు మహమ్మద్ సోయబ్(14) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పాఠశాల, ట్యూషన్లో చదువు ఒత్తిడి కారణంగా ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి నలుగురు విద్యార్థులు కలసి బెంగళూరులో రైలు ఎక్కి కోలార్ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి ఆదివారం చిత్తూరు చేరుకున్నారు. మండలంలోని నలగాంపల్లె వద్ద నడచుకుంటూ వస్తున్న నలుగురిని రాత్రి బంగారుపాళెం హైవే పోలీసులు గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. చదువు ఒత్తిడి కారణంగా ఇంటి నుంచి పారిపోయినట్లు వారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారం ఇవ్వడంతో వారు బంగారుపాళెం చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు కనిపించకపోవడంతో బెంగళూరులో మూడు పోలీస్స్టేషన్లలో వారి తల్లిదండ్రులు కిడ్నాప్ కేసులు పెట్టినట్లు చెప్పారు. పిల్లలను తమకు అప్పగించడంతో టెన్షన్ తీరిందని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బంగారుపాళెం పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. -
భారత్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
బెంగుళూరు: మూడో టీ20లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోసుకోవాలనుకున్న టీమిండియాకు సఫారీలు షాకిచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36, రిషభ్ పంత్ 19, రవీంద్ర జడేజా 19 టాప్ స్కోరర్లు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా కేవలం వికెట్ (రీజా హెన్రిక్స్ 28) మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ క్వింటన్ డీకాక్ 79 (6 బౌండరీలు, 5 సిక్సర్లు) తో విరుచుకుపడ్డాడు. అతనికి తోడు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బావుమా (27) చెలరేగడంతో పర్యాటక జట్టు మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా) తీసిన బ్యూరెన్ హెన్రిక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. క్వింటన్ డీకాక్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. -
రండి..పేకాట ఆడుకోండి!
కోరుట్ల(జగిత్యాల జిల్లా): ‘రండి మా దగ్గర నిశ్చింతగా పేకాట ఆడుకోండి. విమాన చార్జీలు మేమే ఇస్తాం. హైక్లాస్ భోజన వసతి కల్పిస్తాం. 3 రోజుల పాటు మా దగ్గర హాయిగా పేకాట ఆడుకుంటూ ఉండొచ్చు. కేవలం రూ. 25–50 వేలు తెచ్చుకోండి’.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పేకాట రాయుళ్లకు పొరుగు రాష్ట్రాల క్లబ్‌లు ఇస్తున్న బంపర్ ఆఫర్. ఈ ప్రాంతం నుంచి పేకాటరాయుళ్లను పొరుగు రాష్ట్రాలకు తరలించేందుకు ఏకంగా కమీషన్ ఏజెంట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సాగని ఆటలు! ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 3 జిల్లాల్లో పోలీసులు నిత్యం పదుల సంఖ్యలో పేకాటరాయుళ్లను అరెస్ట్ చేస్తున్నారు. లక్షల్లో నగదు స్వాధీనం చేసుకుంటూ 10 నుంచి 20కి మించి కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో స్థానికంగా పేకాట ఆడేందుకు పేకాటరాయుళ్లు సుతరామూ ఇష్టపడటం లేదు. మూడు ముక్కలాటకు అలవాటుపడ్డ కొందరు తమ అడ్డాలను గ్రామశివారుల్లోని అటవీ ప్రాంతాలు, మామిడి తోటలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆ స్థావరాలనూ కనిపెట్టి దాడులు చేస్తుండటంతో స్థానికంగా పేకాట ఆడి కేసులు పాలుకావడం కన్నా.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లడానికి పేకాటరాయుళ్లు మొగ్గుచూపుతున్నారు. కమీషన్ ఏజెంట్ల హవా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు మహారాష్ట్రలోని పేకాట క్లబ్‌ల కన్నా కర్ణాటకలోని క్లబ్‌లకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న క్లబ్‌లకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి నిత్యం 350–500 మంది పేకాట ఆడేందుకు వెళ్తున్న ట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాలోని కీలక పట్టణాల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన క్లబ్‌ల నిర్వాహకులు కమీషన్లు ఇస్తూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పేకాట ఆడేందుకు ఒకరిని బెంగళూరుకు తీసుకెళ్తే రూ.1000 నుంచి రూ.2,500 కమీషన్ ఇస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే వారిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్లడానికి కొందరు అద్దెకార్ల డ్రైవర్లు ఉండటం.. వీరికి ఎంతో కొంత కమీషన్ ముట్టడం విశేషం. ఆట తప్ప అంతా ఫ్రీ పేకాటరాయుళ్లను బెంగళూరుకు తరలించే కమీషన్ ఏజెంట్లు పేకాటరాయుళ్లను హైదరాబాద్ వరకు కార్లలో ఫ్రీగా తరలిస్తున్నారు. అక్కడి నుంచి విమాన టికెట్లు బుక్‌చేసి బెంగళూరుకు పంపుతున్నారు. కొందరు ఏజెంట్లు పేకాటరాయుళ్లతోపాటే ఉండి బెంగళూరులోని పేకాట క్లబ్‌లకు తీసుకెళ్తున్నారు. పేకాటరాయుళ్లకు బెంగళూరులోని హైక్లాస్ లాడ్జీల్లో వసతి, ఖరీదైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి క్లబ్‌లలో ఉన్న హాలులో పది నుంచి పన్నెండు టేబుళ్లు ఏర్పాటు చేసి రమ్మీ, త్రీ కార్డ్స్ (మూడు ముక్కలు) ఆడిస్తున్నారు. ఒక్కో ఆటకు రూ.3,000–రూ.5,000 వరకు డబ్బులు పెట్టి ఆడాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్ నుంచి క్లబ్ నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.5 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు అక్కడే ఉండి పేకాట ఆడుతున్న వ్యసనపరులు కొందరు జేబులు గుల్లచేసుకుని వస్తుండటం గమనార్హం. మొత్తంమీద పేకాట వ్యసనం ఇతర రాష్ట్రాల్లోని క్లబ్‌లకు లాభాల పంట పండిస్తోంది. -
గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం గాలిలో అదే పనిగా చక్కర్లు కొడుతూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయి.. గాలిలోకి ఎగిరిన తర్వాత విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు.. విమానాన్ని కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి
బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యెలహంకలోని కొగిలు క్రాస్ వద్ద కారు, అంబులెన్స్ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపక్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. చెన్నైలో ఉంటున్న వీరు తమ బంధువులను కలిసేందుకు బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొగిలు క్రాసింగ్ వద్ద దీపక్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దీపక్, సంజయ్, అదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : బెంగళూరులో అంబులెన్స్ ఢీకొన్న కారు -
బెంగళూరులో అంబులెన్స్ ఢీకొన్న కారు
-
దేశంలోనే బెంగళూరు ఐఐఎస్సీ టాప్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)ను దేశంలో ఉత్తమ విద్యా సంస్థగా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఆ సంస్థ 2019 సంవత్సరానికి గానూ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లను ప్రకటించింది. అందులో ఐఐఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఇండోర్ ఐఐటీ నిలిచింది. బోధన, ప్రమాణాలు, పరిశోధన, అంతర్జాతీయ స్థాయి తదితర 8 అంశాల్లో సర్వే చేసి ఆ సంస్థ ర్యాంకులను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1,258 సంస్థలకు ర్యాంకులను కేటాయించింది. అందులో మొదటి ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు లభించగా, రెండో ర్యాంకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి లభించింది. అంతర్జాతీయ స్థాయిలో బెంగళూరు ఐఐఎస్సీకి 251–300 ర్యాంకు లభించింది. 351–400 ర్యాంకు ఇండోర్ ఐఐటీకి లభించగా, 401–500 ర్యాంకు బాంబే, రూర్కీ ఐఐటీలకు లభించాయి. రాష్ట్రంలోని ఐఐటీ హైదరాబాద్‌కు 601–800 ర్యాంకు లభించింది. ఉస్మానియా యూనివర్సిటీకి 801–1000 ర్యాంకు లభించింది. వీటితోపాటు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా 49 విద్యా సంస్థలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకులను ప్రకటించింది. వరల్డ్ ర్యాంకులు ఇవీ.. - 251–300 ర్యాంకులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - 351–400 ర్యాంకులో ఇండోర్ ఐఐటీ - 401–500 ఐఐటీ బాంబే, ఐఐటీ రూర్కీ - 501–600 ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, సావిత్రిబాయి పూలే పూణె యూనివర్సిటీ - 601–800 ఐఐటీ హైదరాబాద్, అమృత విశ్వ విద్యా పీఠం, బెనారస్ హిందూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐఎస్సీ పూణె, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ గౌహతి, ఐఐటీ మద్రాసు, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, ఎన్ఐటీ రూర్కెలా, పంజాబ్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ - 801–1000 ఉస్మానియా యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, ఐఐటీ ధన్‌బాద్, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా, ఎన్ఐటీ తిరుచురాపల్లి, పాండిచ్చేరి యూనివర్సిటీ. -
‘కరాచీ’ హైదరాబాద్‌దే!
సాక్షి, హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారత్ అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. ఈ దాడి ముమ్మాటికి దాయదీ పాకిస్తాన్ జరిపిందేనని ఆ దేశంపై భారత ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచం ముందు ఒంటరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సెగ హైదరాబాద్ ఫేమస్ కరాచీ బేకరీకి తగిలింది. పాకిస్తాన్‌లోని నగరం పేరిట ఉన్న ఈ బేకరీపై ఆందోళనకారులు బెంగళూరులో దాడి చేశారు. తమది పాక్‌కు సంబంధించిన కంపెనీ కాదని మొత్తుకున్నా ఆందోళనకారులు వినలేదు. దీంతో కరాచీ బేకరీ తమది హైదరాబాద్ కంపెనీ అని స్పష్టం చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘దేశ భక్తులందరికీ మనవి.. కరాచీ బేకరీ విషయంలో మేం ఓ విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నాం. కరాచీ బేకరి వ్యవస్థాపకులు ఖాన్చంద్ రమ్నానీ. దేశ విభజన సమయంలో ఆయన హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఈ కరాచీ బ్రాండ్‌ను 1953లో హైదరాబాద్‌లో ప్రారంభించడం జరిగింది. ఇది పూర్తిగా భారత్‌కు చెందిన తెలంగాణ కంపెనీ. మా ప్రొడక్టులకు వచ్చిన ఆదరణకు అనుగుణంగా మేం మా బ్రాంచ్‌లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. కరాచీ బేకరీ ఎప్పుడూ భారత్‌దే. తమ సంస్థపై వచ్చే తప్పుడు ప్రచారన్ని ఒక సారి సమీక్షించుకోండి’ అని వివరణ ఇస్తూ విజ్ఞప్తి చేసింది. తొలి బ్రాంచ్ ఇక్కడే.. 1953లో హైదరాబాద్‌లోని మొజంజాహి మార్కెట్లో కరాచీ బేకరి తొలి బ్రాంచ్ ప్రారంభమైంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా శాఖలను విస్తరించారు. బిస్కెట్లకు కరాచీ బేకరీ ఎంతో ప్రసిద్ధి పొందినది. -
కరాచీ బేకరీపై పుల్వామా దాడి ఎఫెక్ట్
బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్రవాదన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై యావత్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్.. దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకున్న భారత ప్రభుత్వం.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత సినీ ఇండస్ట్రీ కూడా పాక్ కళాకారులపై నిషేధం విధించింది. చివరికి నదీ జలాలను కూడా ఆపేశారు. ఇక పాక్ వ్యక్తులను, పేర్లను, అనుకూలమైన వారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (బుద్ధి చూపించుకున్న పాక్) తాజాగా పుల్వామా దాడి ప్రభావం కరాచీ బేకరీపై పడింది. బేకరీ పేరులో పాకిస్తాన్‌కు చెందిన పట్టణం ‘కరాచీ’ ఉందంటూ ఆ బేకరీ ముందు పలువురు ఆందోళనలు చేశారు. ఈ సంఘటన బెంగళూర్‌లో జరిగింది. ఈ క్రమంలో తాము పాకిస్తాన్‌కు చెందిన వాళ్లం కాదని భారతీయలమే అంటే బేకరీ యాజమాన్యం ఆందోళనాకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఎంత చెప్పిన వినకపోవడంతో బేకరీ పేరులోని కరాచీ కనపడకుండా క్లాత్‌తో కప్పివేశారు. అంతేకాకుండా బేకరీపై మువ్వన్నెల జెండా కూడా ఎగిరేశారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. (పాక్‌ను తప్పించడం సాధ్యం కాదు) 1953లో హైదరాబాద్ వేదికగా కరాచీ బేకరీ దేశ విభజన సమయంలో ఖాన్ చంద్ రమణి అనే వ్యక్తి భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 1953లో ఆయన హైదరాబాద్ వేదికగా కరాచీ బేకరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా శాఖలను విస్తరించారు. బిస్కెట్లకు కరాచీ బేకరీ ఎంతో ప్రసిద్ధిపొందినది. ఇక ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న కరాచీ బేకరీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కరాచీ పేరుని పాకిస్తాన్‌తో లింక్ చేయడం పట్ల వ్యాపారులు విస్మయం చెందుతున్నారు. కరాచీ పేరుకి పాకిస్తాన్‌కు ఎలాంటి సంబందం లేదని వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. (పాక్‌తో భారత్ ఆడకుంటే నష్టమేనా?) -
జీవించా..
మీలో చాలామంది నటి జయంతిని చూసి ఉండకపోవచ్చు. ఈ ఇంటర్వ్యూ చదివితే జయంతి మాత్రమే కాదు, చిన్ననాటి జయంతి గురించి కూడా మీకు తెలుస్తుంది!లైఫ్‌ని ఊరికే లాగించేస్తుంటారు మనుషులు.కానీ జయంతి, జీవితంలోని ప్రతి దశలోనూ జీవించారు!నటనలో జీవించడం నటులు చేసే పనే. జీవితంలో నటించకుండా ఉండటమే లైఫ్ అంటే.ఆ లైఫ్‌నే ‘జీవించా..’ అంటున్నారు జయంతి. నేడు ఆమె బర్త్ డే. ఆ సందర్భంగా.. సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు.. బర్త్‌డే (జనవరి 6) గురించి నాలుగు మాటలు? జయంతి: ధన్యవాదాలు. ‘సాక్షి’ని కలవడం నాకూ ఆనందంగా ఉంది. ఆ మధ్య నేను అనారోగ్యానికి గురయ్యానని వార్త వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. బెంగళూరులో ఉన్న నాకు ఇలాంటి అభిమానం దక్కడం మరచిపోలేను. నాకు బర్త్‌డేలంటే భలే ఇష్టం. నేను నటిగా ఉన్నప్పుడు గ్రాండ్‌గా చేసేవాళ్లు. మెల్లిగా ఎందుకిదంతా అనిపించింది. ఆ తర్వాత చాముండేశ్వరీ మాత దేవాలయానికి వెళ్లి ఇంటికి వచ్చేదాన్ని. ఇంట్లో అందరం కలసి భోజనం చేసేవాళ్లం. బర్త్‌డే నాడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలుస్తాం. ఈసారి బయటకు ఎక్కడికీ వెళ్లడంలేదు. ఇంట్లోనే. ఈ సందర్భంగా ఒక్కసారి మీ బాల్యంలోకి వెళదాం. ఎక్కడ పుట్టారు. ఎక్కడ పెరిగారు? బళ్లారిలో పుట్టాను. ఎక్కువ సంవత్సరాలు అక్కడే పెరిగాను. నాన్న బాలసుబ్రహ్మణ్యంగారు సెంట్ జోసెఫ్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఉండేవారు. అమ్మగారు సంతాన లక్ష్మీ. నేను పెద్ద అమ్మాయి. నాకు ఇద్దరు తమ్ముళ్లు యోగేశ్బాబు, హరికృష్ణ. ఇది మా ఫ్యామిలీ. మేం బెంగళూరులో ఉండేవాళ్లం. అమ్మానాన్న ప్రేమగా ఉంటూనే స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్లు. స్కూల్ డేస్‌లో చురుకుగా ఉండేవారా? చాలా. స్కూల్ ఫంక్షన్స్‌లో స్టేజ్ మీద డ్యాన్స్ చేయాల్సిందే. ఓ ప్రోగ్రామ్ చూసి, మా అమ్మగారైతే ‘నా కూతురు పెద్ద డ్యాన్సర్ అయిపోతుంది’ అని మురిసిపోయి, నాన్నని ఒప్పించి మద్రాస్ తీసుకెళ్లి చంద్రకళ అనే డ్యాన్స్ మాస్టర్ దగ్గర చేర్పించారు. ఈవిడ డ్యాన్స్ స్కూల్ నడుపుతూ సినిమాల్లో డ్యాన్స్ చేసేవారు. ఆవిడ దగ్గర చేరినప్పుడు నటి మనోరమ నాకు సీనియర్. తనేం డ్యాన్స్ చేస్తుంది. చేయి ఊపుతుందా? నడుము ఊపుతుందా? అని సీనియర్స్ అంతా నన్ను ఏడిపించేవాళ్లు. నాకు బాగా ఏడుపొస్తే గోడకు కొట్టుకునేదాన్ని. ఓసారి అలా చేసినప్పుడు మనోరమ చూశారు. ‘కమలా.. ఎందుకలా చేస్తున్నావు?’ అని అడిగితే, ‘వీళ్లంతా నన్ను ఏడిపిస్తున్నారు. వచ్చింది కూడా నేర్చుకోలేకపోతున్నాను’ అన్నాను. ‘కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయాలి. సారీ చెప్పండి’ అని వాళ్లను దులిపేశారామె. మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు? ఆ రోజు మా టీచర్‌కి షూటింగ్ ఉంది. మేం కూడా వస్తామని వెళ్లాం. ఆ సమయంలో కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి ఒక కన్నడ సినిమా తీస్తున్నారు. అందులో ముగ్గురు హీరోయిన్స్ పండరీ బాయి, చంద్రకళ. ఈ చంద్రకళ మా డ్యాన్స్ టీచర్ కాదు. ఆవిడ నటి. మూడో హీరోయిన్గా ఒక చిన్నమ్మాయి కోసం వెతుకుతున్నారు. నేను ఆయన కళ్లలో పడ్డాను. ‘నీ పేరేంటి’ అని అడిగితే, కమలా అని వినపడీ వినపడనట్టు చెప్పాను. మా సినిమాలో యాక్ట్ చేస్తావా? అని అడిగారు. టీచర్ వైపు చూస్తే, ‘ఆ అమ్మాయికి తెలియదండీ.. వాళ్లింటికి తీసుకెళ్తాను’ అన్నారు. మరుసటిరోజు వచ్చారు. ‘మాకు సినిమాలంటే ఇష్టం లేదు’ అని మా అమ్మగారు అన్నారు. సినిమా అన్నా సినిమావాళ్లన్నా తక్కువ భావన ఉండేదట. మా అమ్మ వద్దని చెప్పి, పంపించేశారు. పాపం మూడుసార్లు వచ్చారు. ‘మీ అమ్మాయి అయితే బాగుంటుంది. నా బిడ్డలాగా చూసుకుంటాను. నా భార్యా పిల్లలు షూటింగ్‌కి వస్తారు. వాళ్ల పక్కనే కూర్చుంటుంది’ అని అమ్మని కన్విన్స్ చేశారు. ఓకే.. షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెబుతారా? అంతా చిత్రాతిచిత్రంగా అనిపించింది. మేకప్ పూస్తున్నారు.. పూస్తున్నారు.. పూస్తూనే ఉన్నారు. ఏంటి ఇదంతా పూస్తేనే బావుంటారా? అనుకున్నాను. ఆ తర్వాత ఒకతను తల దువ్వాడు. ఇంకొకతను బట్టలు తీసుకొచ్చారు. కొంపతీసి ఈ అబ్బాయి బట్టలు కడతాడా? అనుకున్నాను. బట్టలు కట్టరమ్మా ఇచ్చి వెళ్తారమ్మా అని చెప్పాడు. రెడీ అయ్యాక నన్ను కెమెరా ముందు నిలబెట్టారు. చుట్టూ జనం. నాకేం చేయాలో తెలియలేదు. దర్శకుడు వచ్చి, ‘చుట్టూ జనం ఉన్నారని మర్చిపో. నేను చెప్పింది చేస్తే చాలు’ అన్నారు. అలానే చేశా. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఆ సినిమా పేరు ‘జేను గూడు’ (‘తేనె తుట్టి’ అని అర్థం). ఆ తర్వాత మీ లైఫ్ తేనెలాగానే సాగిందా? హహ్హహ్హ... ఇంత తియ్యగా ఎవరూ ఈ మాట ఇప్పటివరకూ అనలేదు. (నవ్వుతూ). నిజంగానే దాదాపు తియ్యగానే సాగింది. ‘జేను గూడు’ డైరెక్టర్ వై.ఆర్. స్వామిగారు నాకు ‘గినిమరీ’ అని పేరు పెట్టారు. అంటే.. చిలక పిల్ల అని అర్థం. ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. పేరు చిన్నదిగా ఉంటే బాగుంటుందని స్వామిగారు అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురి పేర్లు కలిసొచ్చేట్లు ‘జయంతి’ అని పేరు పెట్టారు. ఒకసారి సావిత్రిగారు షూటింగ్ లొకేషన్లో మీపై ఆగ్రహం వ్యక్తపరిచారట. నిజమా? కొత్త భాషలు నేర్చుకోవాలనే పట్టుదల కలగడానికి సావిత్రిగారే కారణం. ఆ సినిమా పేరు గుర్తు లేదు. సావిత్రిగారి కాంబినేషన్లో ఓ సీన్ తీస్తున్నప్పుడు నేను డైలాగ్ చెప్పడానికి తడబడ్డాను. ఆవిడకు కోపం వచ్చి, భాష రానివాళ్లను తీసుకొచ్చి విసిగిస్తారా? ముందు సరిగ్గా నేర్పించండి అన్నారు. నిజానికి నాకు తమిళ్ రాదని, ఆ సినిమా చేయనంటే మేనేజ్ చేసుకుంటామని ప్రొడ్యూసర్ ఒప్పించారు. అందరి ముందు సావిత్రిగారు అనేసరికి దుఃఖం వచ్చేసింది. కో–డైరెక్టర్ సముదాయించడానికి ట్రై చేసినా ఇలా ఇన్సల్ట్ చేస్తే నా వల్ల కాదు, నా కోసం ఖర్చు పెట్టినదంతా తిరిగి ఇచ్చేస్తానని ఇంటికి వచ్చేశాను. సావిత్రిగారంటే నాకు ఇష్టం. ఆవిడతో నటించే చాన్స్ మిస్ అయిందని ఓ వైపు బాధ. మా అమ్మ విషయం తెలుసుకుని మంచి తమిళ ట్యూషన్ మాస్టారుని పెట్టించారు. నేనే వేరేవాళ్లకు డబ్బింగ్ చెప్పేంతగా నాకు తమిళ్ నేర్పించారు. ఆ తర్వాత ఓ కన్నడ పిక్చర్లో సావిత్రిగారు నాకు అత్తగారిగా చేశారు. షూటింగ్లో నేను ఆవిడ కాళ్లు పట్టుకున్నాను. ‘జయంతీ.. ఏంటమ్మా ఇది. కన్నడంలో నంబర్ వన్ హీరోయిన్‌వి. నా కాళ్ల మీద పడుతున్నావు?’ అనగానే ‘నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం మీరు. భాష నేర్చుకునేలా చేశారు’ అన్నాను. కెరీర్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో మీ నడక మగరాయుడిలా ఉండేదట.. ఎలా మార్చుకున్నారు? దానికి కారణం రామారావుగారు. డ్యాన్స్ నేర్చుకోవడానికి మద్రాస్ వెళ్లినప్పుడు రామారావుగారిని చూడ్డానికి ఆయన ఇంటికి వెళ్లాం. అప్పుడాయన ‘నాతో యాక్ట్ చేస్తావా?’ అని నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని అడిగితే, మా అమ్మను చూశాను. ‘ఏం తాగుతారు? మజ్జిగా? మంచినీళ్లా? వీరు మా హీరోయిన్’ అన్నారు రామారావుగారు. నిజంగానే ఆయన సరసన ఆ తర్వాత ‘జగదేకవీరుని కథ’లో నటించాను. ఆ షూటింగ్ అప్పుడు ‘షాట్ రెడీ’ అని నన్ను పిలిస్తే, విసావిసా నడుచుకుంటూ వెళ్లాను. అప్పుడు రామారావుగారు ‘మీరు అబ్బాయా? అమ్మాయా?’ అనడిగారు. నాకేం అర్థం కాలేదు. అమ్మాయి అయితే ఇలా అబ్బాయిలా నడుచుకుంటూ వస్తారా? అంటూ ఆయనే ఒక కాలు వంకరగా పెట్టి నిల్చోమన్నారు. ఎలా నడవాలో చూపించారు. అప్పటివరకూ నా నడక మగపిల్లల్లానే ఉండేది. అప్పటివరకూ ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌లో కనిపించిన మీరు ‘మిస్ లీలావతి’లో స్విమ్ సూట్ ధరించడం, కన్నడ స్క్రీన్‌కి మోడ్రన్ డ్రెస్సులు పరిచయం చేసిన తారగా పేరు తెచ్చుకోవడం, ‘గ్లామర్ దివా’ బిరుదు దక్కించుకోవడం గురించి? నాకు ఈ సినిమా రావడమే విచిత్రంగా జరిగింది. ఆ పాత్రకు షావుకారు జానకిగారిని, ఆమె స్నేహితురాలి పాత్రకు నన్ను సెలక్ట్ చేశారు. ఆ చిత్రదర్శకుడు యంఆర్. విఠల్ ‘అమ్మా.. ఇందులో మీరు స్విమ్మింగ్ షాట్స్ చేయాలి. స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి, సినిమాకు కీలక సన్నివేశాల్లో వస్తుంది’ అని జానకిగారితో అన్నారు. ‘ఆ సీన్స్ లేవంటే చేస్తాను’ అన్నారు. దాంతో నాకు ఆ పాత్ర గురించి చెప్పారు. స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి కదా. అందుకే నేను యస్ అన్నాను. అప్పటికి కన్నడ సినిమా లంగా, వోణీల వరకే ఆగింది. ఈ సినిమాతోనే స్కర్ట్స్, టీ షర్ట్స్, స్విమ్ సూట్ స్క్రీన్‌కి వచ్చాయి. తర్వాత ఇలాంటి కాస్ట్యూమ్స్ మామూలు అయిపోయింది. రాజ్‌కుమార్‌గారితో ఎక్కువ చిత్రాలు చేసిన రికార్డ్ మీదేనట? అవును. మేమిద్దరం చాలా సినిమాలు చేశాం. మాకు ‘రాజా జోడీ’ అనే పేరు కూడా ఉంది. మా కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో ‘బహదూర్ గండూ’ ది బెస్ట్. మేం ఇద్దరం నువ్వా నేనా అన్నట్టు యాక్ట్ చేశాం. అందులో నేను రాజ్‌కుమార్‌ని, ఆయన కామన్ మ్యాన్. పిక్చర్ సూపర్ హిట్. ఇంగ్లీష్ మ్యాగజీన్స్ ‘జయంతి స్టీల్స్ ది షో’ అని రాశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ కాబట్టి ఆ కామెంట్‌కి రాజ్‌కుమార్‌గారికి కోపం వచ్చిందా? కోపమా? ఆయనతో నాకదే లాస్ట్ పిక్చర్ (నవ్వేస్తూ). ఆ తర్వాత మేమిద్దరం చేయలేదు. మరి వ్యక్తిగతంగా కూడా మీ రిలేషన్ చెడిపోయిందా? (జయంతి తనయుడు కృష్ణ అందుకుంటూ) సినిమాలు చేయకపోయినా ఆయన ఉన్నంత వరకూ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉన్నారు. ‘రాజ్’ అని పేరు పెట్టి కర్ణాటకలో రాజ్‌కుమార్‌గారిని పిలిచేంత చనువు అమ్మకే ఉంది. (జయంతి అందుకుంటూ) ఆ సంగతలా ఉంచితే.. రాజ్‌తో యాక్ట్ చేసిన ఓ సినిమాలో నా పాత్ర చనిపోతుంది. మంచం మీద అలా నిద్రపోయినట్టు ఉండమన్నారు. ఆయనకేమో భారీ డైలాగ్ ఇచ్చారు. ఆయనేమో ఒక పట్టాన సీన్‌ని వదలరు. ఆ ఎమోషన్లో నా కాళ్ల మీద దబ్బ్మని పడ్డారు. అంతే.. పోయాం అనుకున్నాను (నవ్వుతూ). ఫైనల్లీ.. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ‘సాక్షి’ కోరుకుంటోంది. థ్యాంక్యూ. మీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎస్వీ రంగారావుగారు ‘చిన్న రంగారావు’ అని పిలిచేవారట? రామారావుగారు, యస్వీ రంగారావుగారు, భానుమతిగారు.. వీళ్లతో ఒక్క సీన్లో అయినా యాక్ట్ చేయాలని ఉండేది. ఆ అదృష్టం నాకు దక్కింది. రామారావుగారితో చేశాను. రంగారావుగారి గురించి చెప్పాలంటే.. ఆయన ఎందుకో నాకు చిన్నపిల్లాడిలా అనిపించేవారు. అందుకే రంగా రంగా అని పిలిస్తే నవ్వుకునేవారు. ‘ఏంటీ ఈ అమ్మాయి అలా యాక్ట్ చేస్తోంది’ అని డైరెక్టర్ అంటే ‘ఆ అమ్మాయి చేసింది కరెక్టే. బాగా యాక్ట్ చేస్తోంది’ అని రంగారావుగారు అనేవారు. ఆయన నన్ను ‘చిన్న రంగారావు’ అని పిలిచేవారు. భానుమతిగారితో నాకో మరచిపోలేని ఇన్సిడెంట్ ఉంది. ఆవిడ ఏం ఆర్టిస్ట్ అండీ. ఆవిడ పాద ధూళికి కూడా సరిపోను. ఒక సినిమాలో మా ఇద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ పెట్టారు. నేను స్పెషల్ డ్రెస్ తెప్పించుకొని రెడీ అయ్యాను. భానుమతిగారు ఆవిడ స్టైల్లో రెడీ అయి వచ్చారు. నా పక్కన కూర్చుని నన్ను కిందకీ పైకీ చూస్తుండిపోయారు. నా పోర్షన్ రేపు షూట్ చేద్దాం అని వెళ్లిపోయారు. నేనెలా అయితే రెడీ అయ్యానో మరుసటి రోజు అదేలా రెడీ అయ్యి వచ్చారు. మా టైలర్ దగ్గర కనుక్కుని, ఆ హెయిర్ స్టైల్ నుంచి అన్నీ సేమ్ టు సేమ్ నాలానే రెడీ అయ్యారు. అంతే.. నేను ఖుష్ అయిపోయాను.జయంతికి ఒకే ఒక్క కుమారుడు. పేరు కృష్ణ. గతేడాది మార్చిలో జయంతి అస్వస్థతకు గురైనప్పుడు ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వార్త ప్రచారమైంది. అప్పుడు ‘సాక్షి’ కృష్ణను సంప్రదించగా, ‘అమ్మ బాగానే ఉన్నారు. ఆ వార్త నిజం కాదు’ అన్నారు. ఇప్పుడు బర్త్‌డే సందర్భంగా జయంతిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో కృష్ణతో గతేడాది మార్చి గురించి మాట్లాడితే ఆవిడ ఆరోగ్యం గురించి చెప్పారు. ‘జయంతి ఇక లేరు’ అనే వార్త ప్రచారమైనది తెలుసుకుని మీ అమ్మ ఎలా ఫీలయ్యారు? కృష్ణ: తన వరకూ ఆ వార్తను వెళ్లనివ్వలేదు. ఎందుకంటే హెల్త్ బాగా లేనప్పుడు అలాంటివి వింటే తనేదో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానని అమ్మ భయపడుతుందని చెప్పలేదు. అసలు అప్పుడు ఏం జరిగింది? అమ్మకు ఆస్థమా అటాక్ అయింది. దానివల్ల ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్ వచ్చింది. హాస్పిటల్లో ఉంచి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం. ఆమె కోలుకునే నెలవరకూ కూడా జరిగిన రాంగ్ పబ్లిసిటీ గురించి అమ్మకు తెలియదు. ఆరోగ్యంగా ఇంటికి వచ్చాక అమ్మతో ‘అమ్మా.. మన దేశం మొత్తం నువ్వు అభిమానులను సంపాదించుకున్నావు. నీ గురించి ఎంతమంది ఫోన్లు చేశారో’ అన్నాను. అమ్మ ఆనందపడింది. నిజంగా అమ్మ అచీవ్మెంట్ అదే అనుకుంటాను. మార్చి నెల మొత్తం రాత్రీ పగలూ తేడా లేకుండా నా దగ్గరున్న మూడు ఫోన్లు రింగ్ అవుతానే ఉన్నాయి. మీ అమ్మగారు ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని అప్పుడే తెలిసిందా? అభిమానులు ఉన్న విషయం తెలియక కాదు. అయితే ఇంతమంది అభిమానం చూపిస్తారని ఊహించలేదు. ఒక సినిమా స్టార్‌కి ఉన్న గొప్ప అదృష్టం అది. మీరెందుకు సినిమాల్లోకి రాలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి అమ్మ ఆరోగ్యం సహకరిస్తుందా?ఓ.. (జయంతి) నూటికి నూట పది శాతం సపోర్ట్ చేస్తుంది. (నవ్వుతూ) -
హీరోయిన్ సంజనకు సర్జరీ
సాక్షి, బెంగళూరు : 'బుజ్జిగాడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కన్నడ నటి సంజనా గల్రానీకి సర్జరీ జరిగింది. తన అండాశయంలో పెరిగిన 550 ఎమ్ఎల్ డెర్మాయిడ్‌ని సర్జరీ చేసి తీసివేశారని సంజన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్టు తెలిపారు. అందుకే దాదాపు ఒక నెల నుంచి ఎక్కువగా బయటకు రావడం లేదని పేర్కొన్నారు. ప్రతి మహిళ కనీసం ఆరునెలలకొకసారి అయినా మమ్మోగ్రామ్ చేపించుకోవాలని, అండాశయం, గర్భాశయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేపించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు వివరించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 45 సినిమాల్లో సంజనా నటించారు. సంజనా ప్రస్తుతం తెలుగులోని ఓ ప్రముఖ టీవీ చానెల్లో ప్రసారమవుతున్న ‘స్వర్ణఖడ్గం’ సీరియల్లో నటిస్తున్నారు. -
మహిళపై క్యాబ్ డ్రైవర్ అనుచిత ప్రవర్తన
సాక్షి బెంగళూరు: మహిళా ప్రయాణికురాలిపై అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్‌ను ‘ఓలా క్యాబ్స్’ బ్లాక్‌లిస్టులో పెట్టింది. ముంబైకి చెందిన ఒక కంపెనీ సీఈవో ఆకాంక్ష పూజారి ఈ నెల 10న అర్ధరాత్రి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు నగరానికి ఓలా క్యాబ్ ద్వారా బయలుదేరారు. ఈ సమయంలో గూగుల్ మ్యాప్ సూచించిన రూట్లో కాకుండా వేరే దారిలో వెళ్లడాన్ని గమనించిన ఆకాంక్ష.. మ్యాప్ప్రకారమే వెళ్లాలని డ్రైవర్‌కు సూచించింది. అయితే ఆమె సూచనలను డ్రైవర్ బేఖాతరు చేస్తూ క్యాబ్‌ను మధ్యలోనే నిలిపేసి ‘వస్తే రండి... లేకపోతే దిగిపోండి’ అంటూ పరుషంగా మాట్లాడాడు. డ్రైవర్ ప్రవర్తనతో విస్తుపోయిన ఆకాంక్ష వెంటనే ఓలా సహాయవాణి బటన్‌ను నొక్కింది. ఆ వెంటనే ఓలా సహాయవాణి నుంచి ఫోన్ వచ్చింది. ఆకాంక్షతో మాట్లాడి ఆమె ఫిర్యాదును సహాయవాణి తీసుకుంది. అనంతరం హెల్ప్‌లైన సిబ్బంది ఒకరు డ్రైవర్‌తో మాట్లాడి మహిళకు కూడా ధైర్యం చెప్పారు. మిమ్మల్ని సురక్షితంగా తమ డ్రైవర్ గమ్యస్దానానికి చేరుస్తారని, కారు సంచరించే మార్గాన్ని కూడా ట్రాక్ చేస్తామని, ఒకవేళ రూట్ మారిస్తే మిమ్మల్ని మళ్లీ సంప్రదిస్తామని ఆకాంక్షకు సహాయవాణి సిబ్బంది ఒకరు తెలిపారు. వారి హామీతో సదరు మహిళ ప్రయాణం కొనసాగించింది. అయితే మరోసారి డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతూ కారు నడుపుతుండడంపై ఆకాంక్ష అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో మరోసారి హెల్ప్‌లైన్ సెంటర్ ప్రతినిధి డ్రైవర్‌కు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి ప్రయాణికురాలు గమ్యం చేరే వరకు కాల్ కట్ చేయకుండా డ్రైవర్‌కు సూచనలు చేశారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు సైతం ఆకాంక్ష ఫోన్ చేసి కారు నంబర్ తెలియజేసింది. ఈ విషయానంతా సదరు ప్రయాణికురాలు ట్వీటర్లో తెలిపారు. ప్రయాణికుల భద్రతే ముఖ్యం.. డ్రైవర్ ప్రవర్తనతో ప్రయాణికురాలు పడిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు ఓలా ప్రతినిధి తెలిపారు. ఆమె ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వెంటనే డ్రైవర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు వెల్లడించారు. తమకు తమ ప్రయాణికుల భద్రతే తొలి ప్రాధాన్యమని తెలిపారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైన పరిష్కరించేందుకు అన్నివేళల తమ అత్యవసర సేవా సిబ్బంది సిద్ధంగా ఉంటారని చెప్పారు. ఎలాంటి ఇబ్బంది కలిగిన ఓలా యాప్‌లో అత్యవసర బటన్ నొక్కగానే తమ సిబ్బంది స్పందిస్తారని తెలిపారు. -
అధిక వేతనాలు బెంగళూరులోనే!
హైదరాబాద్: దేశంలో అన్ని నగరాల్లో కంటే బెంగళూరులోనే వేతనాలు ఎక్కువ అని లింక్డ్ఇన్ తాజా శాలరీ సర్వే వెల్లడించింది. అందరూ అనుకున్నట్లు అధిక వేతనాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు దక్కడం లేదని పేర్కొంది. అధిక వేతనాలను హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ ఉద్యోగులు ఎగరేసుకు పోతున్నారని వెల్లడించింది. లింక్డ్ఇన్కు భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. అమెరికా తర్వాత లింక్డ్ఇన్కు అధిక యూజర్లు ఉన్నది మన దేశంలోనే. తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న డేటా ఆధారంగా లింక్డ్ఇన్ సంస్థ రూపొందించిన ఈ సాలరీ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలివీ... ♦ భారత్‌లో అధిక వేతనాలు బెంగళూరులోనే ఉన్నాయి. సగటు వేతనం ఏడాదికి రూ.12 లక్షలుగా ఉంది. రూ.9 లక్షల సగటు వేతనంతో ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లు రెండో స్థానంలో ఉన్నాయి. రూ.8.5 లక్షల సగటు వేతనంతో హైదరాబాద్ మూడో స్థానంలో, రూ.6.3 లక్షల వేతనంలో చెన్నై నాలుగో స్థానంలో నిలిచాయి. ♦ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ ఉద్యోగులు ఏడాదికి రూ.15 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు రూ.12 లక్షల వరకూ, వినియోగ రంగంలోని ఉద్యోగులు రూ.9 లక్షల వరకూ వేతనం పొందుతున్నారు. ♦ హార్డ్‌వేర్ జాబ్స్ అంటే సంప్రదాయ హార్డ్‌వేర్ ఉద్యోగాలు కాదు. చిప్ డిజైన్, కొత్త తరం నెట్వర్కింగ్ ఉద్యోగాలు. వందలాది, వేలాది ట్రాన్సిస్టర్ల, డివైజ్‌ల సమ్మేళనంతో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను(ఐసీ) తయారు చేసే ఈ రంగంలోని ఉద్యోగుల వేతనాలు రెండేళ్ల క్రితం వారి అనుభవానికి 3 రెట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వారి అనుభవానికి 4–5 రెట్ల వేతనాలు లభిస్తున్నాయి. ♦ భారీ స్థాయిలో డేటా వస్తుండటంతో వినియోగదారులకు భద్రత, తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి నెట్వర్కింగ్ రంగంలో నవకల్పనలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా నెట్వర్కింగ్ రంగంలో ఉద్యోగాలు, నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోంది. ♦ సాఫ్ట్‌వేర్‌లో డిజిటల్ టెక్నాలజీల కారణంగా వేతనాలు పెరుగుతున్నాయి. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌లలో వేతనాలు ఎగబాకుతున్నాయి. ప్రోగ్రామింగ్ బాగా వచ్చి, ఇతర (బిజినెస్, ఫైనాన్స్, మెడికల్) రంగాల్లో విస్తృత పరిజ్ఞానం ఉన్నవారికీ మంచి వేతనాలు లభిస్తున్నాయి. ♦ ఇంజినీరింగ్ డైరెక్టర్లు అధిక వేతనం పొందుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్(సేల్స్), సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్లు ఉన్నారు. -
కళ్లు తిప్పుకోలేక పోతున్నాం.. దిష్టి చుక్క పెట్టండి
అసమానం, అవాస్తవం, కానీ ఇది వాస్తవం దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ మిమ్మల్ని చూసి కళ్లుతిప్పుకోలేకపోతున్నాం.. ఎవరైనా వారికి దిష్ట చుక్క పెట్టండి అంటూ ట్వీట్ చేశారు నటి శిల్పాశెట్టి. ఈ నెల 14, 15 తేదీల్లో ఇటలీలో కొంకణీ, సింధీ సంప్రదాయాల్లో వివాహమాడిన ఈ జంట మంగళవారం బెంగళూరు చేరుకుంది. బుధవారం రాత్రి బెంగళూరులో రిసెప్షన్‌ని ఏర్పాటు చేశారు దీప్‌వీర్‌లు. స్థానిక లీలా ప్యాలేస్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు దీప్‌వీర్ బంధుమిత్రులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కలిసి దాదాపు 1000 మంది అతిథులు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) on Nov 21, 2018 at 6:04am PST ఈ సందర్భంగా తీసిన ఫోటోలను దీప్‌వీర్‌లు తమ అభిమానులతో పంచుకున్నారు. బంగారు వర్ణపు పట్టు చీరలో దీపికా అపరంజి బొమ్మలా మెరిసిపోతుండగా.. నలుపు రంగు షేర్వాణీ ధరించిన రణ్వీర్ కపూర్‌లో రాజసం ఉట్టిపడుతుంది. ఈ ఫోటోలు అభిమానులనే కాకా బాలీవుడ్ జనాలను కూడా ఫిదా చేశాయి. వేదిక మీదకు వచ్చే సమయంలో రణ్వీర్ తన భార్య చీర కొంగును సరి చేస్తూ ఉండగా తీసిన ఫోటో హైలెట్‌గా నిలిచింది. రణ్వీర్ మీరు పర్ఫేక్ట్ హస్బెండ్‌కి ఉదాహరణగా నిలిచారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram Look at the way he is making his lady love @deepikapadukone feel comfortable and look even more pretty❤️👩❤️💋👩 . . #deepikapadukone #ranveersingh #couplegoals💑 #randeep #hiswife #justmarried❤️ #deepveer #deepveerkishaadi #love #happy A post shared by #DeepVeerWaale👰🤵💑 (@deepikapadukoneesingh) on Nov 21, 2018 at 6:40am PST -
రూ.100 ఫైన్ కట్టమంటే.. కత్తి తీసి..
సాక్షి, బెంగళూరు : వాహన తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న ఓ వ్యక్తిని అడ్డగించిన సిబ్బంది అతనికి రూ.100 ఫైన్ వేశారు. ఈ క్రమంలో అతను చెప్పిన సమాధానం విని నోరెళ్ల బెట్టారు. ‘త్వరగా వెళ్లాలి సార్. మా ఫ్రెండ్‌ను కత్తితో పొడిచా. పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడానికి వెళ్తున్నా. నన్ను విడిచిపెట్టండి’ అని 26 ఏళ్ల సందీప్ శెట్టి చెప్పడంతో ట్రాఫిక్ సిబ్బందికి నమ్మబుద్ధి కాలేదు. ‘నిజం సార్. కావాలంటే చూడండి. ఇదే కత్తితో పొడిచా’ అని సందీప్ రక్తం మరకలతో ఉన్న కత్తి చూపించాడు. దీంతో కంగుతిన్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. వివరాలు..చిక్కబళ్లపురకు చెందిన సందీప్ శెట్టి, దేవరాజ్ స్నేహితులు. దేవరాజ్ స్థానికంగా కుకింగ్ ఆయిల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెడదామని చెప్పిన దేవరాజ్.. కొంతకాలం క్రితం సందీప్ శెట్టి నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడు. కానీ, దేవరాజ్ ఆ సొమ్మును ఎక్కడా పెట్టుబడి పెట్టలేదు. దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని సందీప్.. దేవరాజ్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సందీప్ దేవరాజ్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయేందుకు బైక్‌పై వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. కాగా, బాధితుడి పొట్ట, వీపుపై కత్తి పోట్లున్నాయనీ, అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
పెళ్లి వేడుకలో మహిళకు చేదు అనుభవం
బెంగళూరు : వివాహ వేడుకకు హాజరైన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. కళ్యాణ మంటపం దగ్గర నిల్చున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు ఓ దుండగుడు. మహిళ వెనకే నిల్చున్న ఆ వ్యక్తి అదును చూసి మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన మహిళను పక్కకు తోసి బయటకు పారిపోయాడు. ఈ అనూహ్య సంఘటనతో షాక్‌కు గురయిన మహిళ తేరుకుని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఈ లోపే నిందుతుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
బెంగళూరు : పోలీసులు బందోబస్తు విధుల్లో తలమునకలై ఉండగా.. దొంగలు తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఒకే రోజు వేర్వేరు చోట్ల చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వివరాలు... దివంగత బీజేపీ క్రేంద మంత్రి అనంథ్ కుమార్ అంత్యక్రియల నిమిత్తం బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు మంగళవారం ఆయన నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహణలో మునిగిపోయారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బెంగళూరు వెస్ట్ డివిజన్లోని రాజరాజేశ్వరినగర్, గిరినగర్ ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెల్లారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రతిఘటించిన మహిళలను నెట్టివేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దొంగలందరూ బైక్‌ల మీద వచ్చారని.. మొహం కనిపించకుండా కవర్ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసలు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చైన్ స్నాచర్స్‌ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. -
క్వార్టర్స్‌లో సాకేత్
బెంగళూరు: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి... డబుల్స్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 6–1, 3–6, 6–1తో క్వాలిఫయర్ యూసుఫ్ హసమ్ (ఈజిప్ట్)పై గెలుపొందాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–అర్జున్ ఖడే (భారత్) జంట 6–3, 7–6 (7/5)తో ప్రజ్వల్ దేవ్–నికీ పునాచా (భారత్) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సుమీత్ 6–3, 7–6 (7/4)తో జేమ్స్ వార్డ్ (బ్రిటన్)పై, ప్రజ్నేశ్ 4–6, 6–4, 7–5తో సెబాస్టియన్ (జర్మనీ)పై గెలి చారు. శశికుమార్‌తో మ్యాచ్‌లో స్కోరు 6–7 (2/7), 1–3 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా బ్లాజ్ కావిచ్ (స్లొవేనియా) వైదొలిగాడు. డబుల్స్ క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–7 (3/7), 3–6తో పర్సెల్–సావిల్లె (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది. -
బెంగళూరు ఓపెన్ డబుల్స్ క్వార్టర్స్‌లో సాకేత్ జంట
టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు సాధించిన సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) జంట బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్ అర్జున్ ద్వయం 6–3, 3–6, 11–9తో ‘సూపర్ టైబ్రేక్’లో సంచాయ్–సొంచాట్ రటివటానా (థాయ్‌లాండ్) జోడీపై గెలుపొందింది. నిర్ణాయక టైబ్రేక్‌లో ఒకదశలో సాకేత్ జంట 1–6తో వెనుకబడింది. కానీ వెంటనే తేరుకున్న ఈ భారత జంట స్కోరును 9–9తో సమం చేసింది. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
దీపిక ఇంట.. పెళ్లి సంబరాలు షురూ!
బెంగళూరు: బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపిక పదుకొనె-రణ్వీర్ సింగ్ త్వరలోనే వివాహ బంధంతో ఓ ఇంటివాళ్లు కాబోతున్నారు. వారిద్దరి వివాహ వేడుక నవంబర్ 14,15 తేదీల్లో ఇటలీలో జరగనుండడం తెలిసిందే. పెళ్లికి పది రోజుల ముందే బెంగుళూరులోని దీపిక పదుకొనె ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. దీపిక ప్రీవెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో తమ కుటుంబీకులతో దీపిక ఎంజాయ్ చేస్తోంది. శుక్రవారం దీపిక ఇంట్లో సాంప్రదాయకంగా పూజను నిర్వహించారు. దీనితో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయని దీపిక సన్నిహితులు పేర్కొన్నారు. ఇటలీలో జరిగే దీపిక వివాహ వేడుకకు 200 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారు. నవంబర్ 13న సంగీత్, 14న సౌత్ ఇండియన్ స్టైల్లో వివాహం, 15న నార్త్ ఇండియన్ స్టైల్లో వివాహం, డిసెంబర్ 11న ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
కాచిగూడ –యశ్వంత్‌పుర్ రైల్లో దోపిడీ
హైదరాబాద్: బెంగళూరు నుంచి కాచిగూడకు వస్తున్న యశ్వంత్‌పుర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రయాణీకుల వద్ద నుంచి 28.4 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు, సెల్ఫోన్లను గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పి జి.అశోక్‌కుమార్ కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దివిటిపల్లి వద్ద కొంతమంది దుండగులు రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపరింగ్ చేసి ప్రయాణీకుల వద్దనుంచి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను దొంగలించారని తెలిపారు. బెంగళూరుకు చెందిన నిమ్మి గీత (27) మెడలోంచి 8.5 తులాల బంగారు ఆభరణాలు, బ్యాగులో ఉన్న 3 సెల్ఫోన్లు, రూ.10వేల నగదు, మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన కె.జయశ్రీ (57) వద్ద నుంచి 9తులాల బంగారు ఆభరణాలు, శ్రీకాకుళం, రాజం ప్రాంతానికి చెందిన బలివాడ లక్ష్మి (65) నుంచి 2.4 గ్రాముల బంగారు ఆభరణాలు, కర్నాటకలోని బాగేపల్లి ప్రాంతానికి చెందిన లాల్యం లలిత (40) నుంచి 8.5 తులాల బంగారు ఆభరణాలు, హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ ఫీరా (54) నుంచి ఒక సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. ఉదయం 4గంటల సమయంలో రైల్లో కిటికీలు తెరిచి ఉంచిన ప్రయాణీకుల వద్ద ఈ ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను దొంగిలించారు. ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎం.రమేశ్ కేసు నమోదు చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్‌నగర్ రైల్వే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. -
కిడ్నీల మార్పిడిలో భార్యల గొప్ప మనసు
సాక్షి బెంగళూరు: సాధారణంగా బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను రోగులకు అమర్చుతారు. ఇక్కడ మాత్రం ఇద్దరు రోగుల భార్యల మూత్రపిండాలను మార్చి అమర్చారు. వివరాలు... బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో సంతోష్, మరో ఆస్పత్రిలో క్రిష్ణ అనే మూత్రపిండాల రోగులు చికిత్స పొందుతున్నారు. వీరికి మూత్రపిండాల మార్పిడి చేయడమే పరిష్కారమని వైద్యులు తేల్చారు. కిడ్నీలను దానం చేసేందుకు వారి భార్యలు ముందుకొచ్చినప్పటికీ జత కాలేదు. అయితే సంతోష్‌కు క్రిష్ణ భార్య మూత్రపిండం, క్రిష్ణకు సంతోష్ భార్య మూత్రపిండం సరిపోతాయని వైద్యుల పరీక్షల్లో తేలింది. దీంతో నలుగురికీ అవగాహన కల్పించి అవయవ మార్పిడికి సిద్ధం చేశారు. ఇరువురు మహిళల నుంచి కిడ్నీలను సేకరించి సంతోష్, క్రిష్ణలకు అమర్చారు. ఇలా ఇచ్చిపుచ్చుకునే స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ కారిడార్‌ను ఏర్పరచి రెండు ఆస్పత్రుల నుంచి 15–20 నిమిషాల్లో మూత్రపిండాలను తరలించారు. రోగులకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. -
గాంధీ అరెస్ట్
మే–17 ఇయక్కం కన్వీనర్ తిరుమురుగన్ గాంధీ అరెస్టు అయ్యారు. విమానాశ్రయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఇక్కడకు తీసుకొచ్చేందుకు చెన్నై పోలీసులు బెంగళూరు బయలు దేరి వెళ్లారు. సాక్షి, చెన్నై : తమిళాభిమాన సంఘంగా మే–17 ఇయక్కం కార్యకలాపాలు రాష్ట్రంలో సాగుతున్నాయి. దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న తిరుమురుగన్ గాంధీని ఇటీవల పోలీసులు టార్గెట్ చేశారు. గత ఏడాది ఆయన్ను గూండా చట్టం కింద సైతం అరెస్టుచేసి కొంతకాలం కటకటాల్లో పెట్టారు. ఎట్టకేలకు కోర్టు జోక్యంతో ఆ కేసు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆయన మీద పోలీసులు పలు రకాల కేసుల్ని నమోదు చేసి ఉండడం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా తూత్తుకుడి అల్లర్ల కేసులో తిరుమురుగన్ పేరును చేర్చారు. అలాగే, గ్రీన్ హైవేకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఉన్నట్టుగా పేర్కొంటూ పలు కేసుల్ని నమోదు చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా లుక్ అవుట్ నోటీసు సైతం జారీచేశారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశం నిమిత్తం ఇక్కడి నుంచి జెనీవాకు వెళ్లారు. అక్కడ తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ గురించి , గ్రీన్ హైవే ప్రాజెక్ట్ గురించి, తమిళనాట ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎత్తి చూపుతూ ప్రసంగించారు. ఈ ప్రసంగాల్లోనూ వివాదాల్ని పసిగట్టిన పోలీసులు తిరుమురుగన్ గాం«ధీని టార్గెట్ చేశారు. బెంగళూరులో అరెస్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ సమావేశాన్ని ముగించుకుని బుధవారం బెంగళూరుకు వచ్చారు. విమానాశ్రయంలో అడుగు పెట్టగానే, లుక్ అవుట్ నోటీసును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తిరుమురుగన్ గాంధీని అరెస్టు చేయడానికి తగ్గట్టు విమానాశ్రయ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బెంగళూరు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీదున్న కేసుల్ని పరిగణించి అరెస్టుచేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సమాచారంతో చెన్నై పోలీసులు అక్కడికి బయలుదేరి వెళ్లారు. తిరుమురుగన్ గాంధీని తమ కస్టడికి తీసుకుని చెన్నైకి అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయం తిరుగు పయనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, తిరుమురుగన్ గాంధీని బెంగళూరులో అరెస్టు చేయడాన్ని తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆయన్ను విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంనేత దినకరన్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ఈ అరెస్టును ఖండించారు. -
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..
రమేష్– రాగిణి పెద్ద కంపెనీలో ఉద్యోగం. దండిగా వేతనం. సొంత ఫ్లాటు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. కానీ కడుపు పంట కలగానే మిగిలింది. ఇరు కుటుంబాల నుంచి ఎంతో నిరీక్షణ. ఇక లాభం లేదని వైద్యనిపుణులను కలిస్తే... సమస్యను గుర్తించి చికిత్స ప్రారంభించారు. కానీ దంపతులు ఆశించిన ఫలితం కనపడడం లేదు. నగరంలో ఈ తరహా దంపతులకు కొదవ లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరిగా జీవితంలో సకల సౌకర్యాలూ సమకూరినా అమ్మా నాన్నా అనే పిలుపునకు నోచుకోలేని దంపతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బొమ్మనహళ్లి: బతుకు పోరాటంలో అలసిపోతున్న నగరవాసులు సంతానలేమికి దూరమవుతున్నారు. ఒత్తిడితో కూడిన జీవనం దంపతుల్లో వంధ్యత్వానికి దారి తీస్తోంది. దశాబ్దం కిందటి వరకు నగర దంపతుల్లో పది శాతం మంది సంతానలేమితో బాధ పడేవారు. ఇప్పుడది 15 శాతానికి పెరిగింది. దీనికి కారణాలను విశ్లేషిస్తే, పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్, పెరుగుతున్న పని గంటలతో పాటు దంపతులు ఎదుర్కొంటున్న పలురకాల ఇబ్బందులని తేలింది. దీనికి తోడు దంపతుల ఆకాంక్షలు కూడా వారిని సంతాన ప్రాప్తికి దూరం చేస్తున్నాయి. సంతానానికి ముందే జీవితంలో బాగా స్థిరపడాలనేది నేటి యువ జంటల సంకల్పం. అయితే 30 సంవత్సరాలు దాటితే సంతాన యోగానికి క్రమంగా దూరమవుతామని వారు గ్రహించలేక పోతున్నారు. జీవనశైలి జబ్బులతో తంటా జీవనశైలిలో వస్తున్న మార్పులు కూడా దంపతులకు ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం లాంటివి సంతానలేమికి సర్వ సాధారణ కారణాలని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ కామినీరావు తెలిపారు. గత దశాబ్దంలో సంతానలేమి కేసులు 50 శాతం దాకా పెరగడం కాస్త ఆందోళన కలిగించే విషయమేనని ఆమె పేర్కొన్నారు. సంతానలేమితో వారానికి 25 నుంచి 30 కొత్త కేసులు తన వద్దకే వస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతా ల్లో సంతాన లేమికి చికిత్సకు స్త్రీలను మాత్రమే పంపిస్తున్నారని, అయితే నగరాల్లో దంపతు లిద్దరూ సంతానలేమికి కారణాలను కనుక్కోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తించారని తెలిపారు. సామర్థ్యలేమి, ప్లాస్టిక్ బెడద భౌతిక సామర్థ్యం లోపించడం, అనాసక్తి లాంటి అంశాలు కూడా సంతాన లేమికి దోహదపడుతున్నాయని ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ షఫాలికా తెలిపారు. ఫ్రిడ్జిలలో దాచి ఉంచిన, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు కూడా కారణమవుతున్నాయని చెప్పారు. హార్మోన్లను విచ్ఛిన్నం చేసే ప్లాస్టిక్ సామాగ్రిని మితిమీరి వినియోగించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. దీనికి తోడు ట్రాఫిక్ రద్దీ కారణంగా గంటల తరబడి రోడ్ల మీద ఉండడం వల్ల కాలుష్యం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని ఆమె విశ్లేషించారు. ఆశలు, ఆశయాలు కూడా కారణమే ⇔ తమ ఆశయాలు, ఆకాంక్షల వల్ల కొత్త దంపతులు ఇప్పుడే పిల్లలు వద్దని వాయిదా వేసుకుంటున్నారని, కొంతమందైతే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని మరో వైద్యురాలు డాక్టర్ చిత్రా రామమూర్తి చెప్పారు. సంతానలేమికి ఇవన్నీ కారణాలవుతున్నాయని చెప్పారు. ⇔ పురుషులు, స్త్రీలలో వంధ్యత్వం అనేది ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు. ⇔ గతంలో 20–30 ఏళ్ల వయసున్న దంపతులు సంతానలేమితో చికిత్స కోసం వచ్చే వారని, ఇప్పుడు వస్తున్న వారంతా 35–40 ఏళ్ల వయసున్న వారని వివరించారు. ⇔ గతంలో సంతాన లేమికి ప్రధానంగా మహిళల్లోనే లోపాలున్నాయని అనుకునే వారని, ఇప్పుడు పురుషులు కూడా పరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు. ⇔ గత దశాబ్దంలో వంధ్యత్వం 50 శాతం దాకా పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. ⇔ సంతానలేమికి 40 శాతం చొప్పున స్త్రీ, పురుషులిద్దరూ కారకులు కావచ్చని, పది శాతం కేసుల్లో ఉభయుల్లోనూ లోపాలుంటాయని, పది శాతం కేసుల్లో కారణాలు తెలియడం లేదన్నారు. బహుశా దీనికి జీవన శైలిలో మార్పులు, చేర్పులు కారణమై ఉండవచ్చన్నారు. ⇔ మద్యం, ధూమపానం లాంటి దురలవాట్ల వల్ల రెండు నుంచి మూడు శాతం మంది సంతానానికి దూరమవుతున్నారని ఆమె చెప్పారు. మంచి అలవాట్లు, మంచి ఆహారం ⇔ ఇవి రెండూ ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు కూరగాయలను పుష్కలంగా తీసుకోవాలి. ⇔ కనీసం వారానికి అయిదు రోజులు చొప్పున, రోజుకు 40 నిముషాల పాటు వాకింగ్, జాగింగ్ వంటి కసరత్తులు చేయాలి. ⇔ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజుకు 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ⇔ జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ప్రత్యేక ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ⇔ ప్లాస్టిక్‌కు హార్మోన్లను దెబ్బతీసే స్వభావం ఉన్నందున, వాటిల్లో ఆహార పదార్థాలను నిల్వ ఉంచరాదు. ⇔ వీలైనంత వరకు ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవాలి. కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. ⇔ నిర్లిప్తతతో కూడిన జీవనశైలిని వదిలేసి చురుకుగా ఉండాలి. -
దేశంలోనే అత్యధిక పబ్‌లతో ఐటీ సిటీ..
యువత ఏమాత్రం సమయం దొరికినా పబ్‌లలో వాలిపోతోంది. బీర్లు–మద్యం, మ్యూజిక్, డ్యాన్స్‌తో అక్కడ మజా చేస్తోంది. భారీ రేట్లతో జేబుకు భారమే అయినా సంపన్న యువత, అధిక ఆదాయ వర్గాలవారు పబ్‌లకు పరుగులు తీస్తుంటే బెంగళూరులో వాటి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఒక రకంగా దేశంలోనే అత్యధిక పబ్‌లతో బెంగళూరు వెలిగిపోతోంది. సాక్షి బెంగళూరు: సిలికాన్ సిటీగా, గార్డెన్ సిటీగా ప్రసిద్ధిగాంచిన బెంగళూరు దేశంలోనే పబ్ సిటీగాను మారింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సంస్థ వెల్లడించిన నివేదికల ప్రకారం దేశంలో అన్ని నగరాల కంటే ఎక్కువగా ఒక్క బెంగళూరులోనే 409 పబ్‌లు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు నమోదైన ప్రకారం కర్ణాటక ప్రధాన నగరాల్లో మొత్తం 459 పబ్‌లు ఉండగా బెంగళూరులోనే 409 ఉన్నాయి. 26 పబ్‌లతో మంగళూరు రెండోస్థానంలో, 19 పబ్‌లతో మైసూరు మూడో స్థానంలో ఉన్నాయి. 4 ఏళ్లలో ఇబ్బడిముబ్బడి గత 2014లో బెంగళూరులో 269 పబ్‌లు ఉండేవి. అయితే ఈ నాలుగేళ్లలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తిపర కోర్సులు, ఉద్యోగాన్వేషణ కోసం దేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో బెంగళూరుకు వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు పాశ్చాత్య దేశాల తరహాలో వారాంతపు రోజుల్లో వినోదాలు పబ్బులకు క్యూ కట్టడంతో ఎక్కడ స్థలం దొరికినా పబ్ వెలుస్తోంది. యువత తదితరుల కోసం బీరు, రకరకాల మద్యం కాక్టెయిల్స్, ఇక మ్యూజిక్, డ్యాన్స్ ఉండనే ఉంటాయి. ఆకర్షణలు అనేకం బీబీఎంపీలో చేరిన నగర శివారు ప్రాంతాల బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు కూడా పబ్బులుగా మార్చుకోవడంతో సంఖ్య పెరుగుతోంది. ఇలా ఈ నాలుగేళ్లల్లో 50 శాతం పబ్‌లు పెరిగినట్లు ఎన్ఆర్ఏఐ బెంగళూరు విభాగ ముఖ్యస్థుడు మంజు చంద్ర తెలిపారు. నాలుగేళ్లలో పబ్బుల్లో అందించే ట్యాప్, టవర్, కెగ్ బీర్లకు యువత నుంచి ఆదరణ గణనీయంగా పెరగడం కూడా పబ్బుల సంఖ్య పెరగడానికి కారణంగా భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రతి నెలా 17 కెగ్ (ఒక కెగ్= 50 లీటర్ల బీర్లు)లు బీర్ల అమ్మడువుతుండగా ప్రస్తుతం ఈ సంఖ్య 32 కెగ్‌లకు చేరుకుందని బార్ యజమాని తెలిపారు. కెగ్ బీర్ల విక్రయాల్లో లాభాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం, ప్రస్తుతం యువత సాధారణ బార్ అండ్ రెస్టారెంట్ల కంటే పబ్‌లకు వెళ్లడానికే మక్కువ చూపుతుండటంతో వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అక్రమ పబ్లూ అధికమే అయితే పబ్ అని బోర్డు ఉన్నదల్లా నిజంగా ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. అనేక పబ్‌లకు సరైన అనుమతులు లేవు, మరికొన్నింటిలో నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. చాలా పబ్‌లు సాధారణ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్‌పైనే నిర్వహిస్తున్నారు. చార్జీలు మాత్రం కళ్లు చెదిరేలా ఉంటున్నాయని ఫిర్యాదులున్నాయి. ఇక అక్రమంగా లైవ్‌డ్యాన్స్‌లకూ కొదవలేదు. ఇటీవల ఇందిరానగర్‌లో 30 పబ్‌లలో అక్రమంగా లైవ్‌బ్యాండ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంచి పబ్ కావాలనుకునేవారు నాలుగైదు పబ్‌లను సందర్శించి ఎంచుకోవడం ఉత్తమం. -
ఐటీ సిటీలో అర్ధరాత్రి కలకలం
మంగళవారం అర్ధరాత్రి... బెంగళూరు రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధి, ముందు కారులో రౌడీలు, వెనుక జీప్‌లో పోలీసుల చేజింగ్. ఎస్ఐ గురిపెట్టి తుపాకీ పేల్చాడు, కారు టైర్ పేలిపోయి ఆగిపోయింది. రౌడీలు– పోలీసుల మధ్య బాహాబాహీ. కత్తుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు. ఎస్ఐ మళ్లీ తుపాకీకి పనిచెప్పాడు. దుండగులకు తీవ్ర గాయాలు. సినీఫక్కీలో చేజింగ్– గోలీబార్ ఘటన అలా ముగిసింది. సాక్షి, యశవంతపుర: ఇంటి ముందు నిలిపిన వాహనాల అద్దాలను ధ్వంసం చేసిన కేసులో నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన మహలక్ష్మి లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పాత నేరస్తులు రఫిక్, సుధాకర్‌ను అరెస్టు చేశారు. కురబరహళ్లి, మహలక్ష్మి లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల ఇంటీ ముందు నిలిపిన వాహనాల అద్దాలను ధ్వంసంచేసి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఇందులో పాత నిందితులు రఫిక్, సుధాకర్‌లు ఉన్నట్లు గుర్తించారు. దుండగుల అరెస్టుకు కార్యాచరణ నిందితులను అరెస్టు చేయాలని ఉత్తర విభాగం డీసీపీ పలువురు ఎస్ఐలతో ఒక బృందాన్ని నియమించారు. మంగళవారం అర్ధరాత్రి నిందితులు రఫిక్, సుధాకర్‌ను మారుతి జెన్ కారులో తిరుగుతుండగా అనుమానం వచ్చి ఆపారు. వారు తప్పించుకోవటానికి కారును వేగంగా నడుపుతూ దూసుకెళ్లారు. దీనితో ఎస్ఐలు లోహిత్, మహేంద్రకుమార్, నిరంజన్ కుమార్‌లు సిబ్బందితో వెంబడించారు. వారు కారును ఆపకపోవడంతో రాజగోపాలనగర పోలీసు స్టేషన్ సరిహద్దులోని కరీంసాబ్ లేఔట్ వద్ద ఎస్ఐ లోహిత్ రివాల్వర్‌తో కాల్చగా నిందితుల కారు టైర్ పేలిపోయి వాహనం అక్కడే నిలిచిపోయింది. నిందితులు కారు దిగి పారిపోతుంటే పోలీసు సిబ్బంది పట్టుకోవడానికి యత్నించారు. దీంతో దుండగులు కత్తులతో దాడి చేయగా కానిస్టేబుల్ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ హనుమంతరాజు గాయపడ్డారు. ఎస్ఐ లోహిత్ అత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరపగా నిందితుల ఇద్దరి కాళ్లకు గాయాలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దీనితో రఫిక్, సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఘరానా నేరగాళ్లే ఈ ఇద్దరూ జూన్ 17న రాత్రి ఇళ్ల ముందు నిలిపిన 14 వాహనాలు కారళ్లాటోల అద్దాలను ధ్వంసం చేసి మహిళలను నోటికొచ్చినట్లు తిట్టి పారిపోయారు. అదే రాత్రి రాజాజీ నగరలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి సెల్‌ఫోన్, బైక్‌ను లాక్కెళ్లిన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. గతంలో కూడా జేసీ నగరలో 17 వాహనాల అద్దాలను ధ్వంసం చేసినట్లు విచారణలో తెలింది. పాత నిందితుడు సుధాకర్ 2016లో శ్రీరామపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. అప్పటినుంచి పోలీసులకు కళ్లకప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. వీటితో పాటు మొత్తం 18 కేసులు ఇతనిపై ఉన్నాయి. కమలనగరకు చెందిన రౌడీ రఫీక్‌పై బసవేశ్వరనగర పోలీసుస్టేషన్లో మూడు హత్య కేసులు, రెండు దోపిడీ, ఒక దాడికేసు, కామాక్షిపాళ్య పోలీసుస్టేషన్లో ఒక దొపిడీ, తావరెకెరె పోలీసుస్టేషన్ పరిధిలో హత్యకేసు, తమిళనాడులో అపహరణ కేసులున్నాయి. -
సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకోండి
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను, వైఫల్యాలను ఎండగట్టాలని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన ‘వైఎస్సార్ కుటుంబం’ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి పాలన సాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమని, ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి ఓటు వేసి వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని కోరారు. వైఎస్ జగన్ ప్రకటించిన ‘నవరత్నాల’ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, నేతలు ఎంవిఎస్ నాగిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రాజారాం, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘గబ్బర్’కు స్వీట్ షాక్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఐపీఎల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న ధావన్‌ను ఓ అభిమాని ఆశ్చర్యానికి గురిచేశాడు. బెంగుళూరుకు చెందిన శంకర్ అనే వ్యక్తి ధావన్‌కు పెద్ద అభిమాని. తన అభిమాన క్రికెటర్‌ను కలవడానికి శంకర్ ఆదివారం ఏకంగా కుటుంబ సమేతంగా బెంగుళూరు నుంచి వచ్చాడు. శంకర్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రావడంతో ‘గబ్బర్’ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతడిని నిరుత్సాహపరచకుండా అభిమాని కుటుంబంతో కలిసి ధావన్, అతడి భార్య ఆయేష ఫొటో దిగారు. ఈ ఫొటోను ధావన్ తన ట్విటర్ పేజీలో పోస్టు చేశాడు. ‘నా వీరాభిమాని శంకర్‌ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కలవడానికి శంకర్ కుటుంబ సమేతంగా ఏకంగా బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నాకు మద్దతుగా నిలుస్తు, నన్ను అభిమానిస్తున్న శంకర్‌కు అలానే నా అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటు ధావన్ ట్వీట్ చేశాడు. ఢిల్లీకి చెందిన ఈ ఓపెనర్ ఈ ఐపీఎల్లో 8 మ్యాచ్‌లలో ఆడి 30.83 సగటుతో 185 పరుగులు సాధించాడు. వీటిలో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. పోయిన వారమే బీసీసీఐ శిఖర్ ధావన్‌ను ఈ ఏడాదికి గాను అర్జున అవార్డుకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. నిలకడగా రాణిస్తున్న అతడిని సీ గ్రేడ్ నుంచి ఏ+ గ్రేడ్‌కు బీసీసీఐ ప్రమోట్ చేసింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 విజయాలు, 2 ఓటములతో ఐపీఎల్ పాయింట్స్ పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. -
నీడా కనిపించట్లేదు..!
చెన్నై,టీనగర్: సాధారణంగా మిట్ట మధ్యాహ్నం ఎండలో మనుషుల నీడ నేలపై కనిపించడం సర్వసాధారణం. అయితే మంగళవారం మధ్యాహ్నం 12.17 గంటలకు నీడ అసలు కనిపించలేదు. దీన్ని చెన్నై, బెంగళూరు వాసులు గుర్తించి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏడాదికి రెండు సార్లు ఈ విధంగా నీడ పడకుండా సూర్యుడు నడినెత్తి పైన ఉంటాడని చెన్నై వాతావరణ పరిశోధకులు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 18న ఈ అరుదైన ఘటన జరిగిందని, ప్రస్తుతం మరోసారి జరిగిందని వివరించారు. -
బుల్లితెర నటుడి అరెస్టు..!
సాక్షి, బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మోడల్‌ను మోసం చేసిన కేసులో బుల్లితెర నటుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలివి.. బుల్లితెర నటుడు కిరణ్ రాజ్, ముంబైకి చెందిన మోడల్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ ఐదేళ్లుగా రాజరాజేశ్వరి నగర్లో సహ జీవనం చేశారు. పెళ్లి విషయం మాట్లాడినప్పటి నుంచి కిరణ్ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో తను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ముంబై వెళ్లిపోయింది. అయితే మార్చి 24న ముంబైలో ఉన్న తన ప్రేయసిని కిరణ్ రాజ్ ఫోన్ చేసి బెంగళూరు రావాలని కోరాడు. దీంతో బెంగళూరు వచ్చిన ఆమెను ఓ ప్రాంతంలో నిర్భంధించి చిత్ర హింసలకు గురిచేశాడు. అక్కడి నుంచి తప్పించుకుని ఆమె ముంబై పారిపోయింది. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, సంఘటన జరిగిన ప్రాంతం బెంగళూరు కావడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు. దీంతో బాధితురాలు రాజ రాజేశ్వరి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
యువకుని వేధింపులు తాళలేక..
సాక్షి, బెంగళూరు : ప్రేమించాలంటూ యువకుని వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఆదివారం శివమొగ్గ పట్టణంలో చోటు చేసుకుంది. శివమొగ్గలోని వెంకటేశ్నగర్కు చెందిన చేతన (19) అక్కడే ఓ బీపీఓ సంస్థలో పనిచేస్తోంది. చేతన పనిచేస్తున్న కార్యాలయం వద్ద మొబైల్ దుకాణ యజమాని శ్రీనివాస్ ప్రేమించాలంటూ చేతనను వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని ఆమె పలుమార్లు స్పష్టంచేసింది. అయినా వెంటాడుతూ బెదిరింపులకు పాల్పడడంతో అమ్మాయి తీవ్ర ఆవేదనకు లోనైంది. తన బాధను ఇంట్లో చెప్పుకోలేక, జీవితంపై విరక్తి చెందింది. చేతన ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న జయనగర పోలీసులు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. -
ద్రవిడ్, సైనా నెహ్వాల్‌కు టోకరా!
సాక్షి, బెంగుళూరు: అతిగా ఆశ పడితే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు. అసాధ్యమైన హామీలిచ్చి దాదాపు 800 మంది నుంచి రూ.300 కోట్ల వరకు పెట్టుబడుల పేరుతో రాబట్టిన విక్రం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మోసపోయిన వారిలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, ప్రకాశ్ పదుకొనె వంటి వారున్నట్టు సమాచారం. పెట్టుబడులపై 40 శాతం వరకు లాభాలు ఆర్జించి పెడతామని నమ్మబలికిన సదరు సంస్థ అందరికీ శఠగోపం పెట్టింది. మోసానికి పాల్పడిన విక్రం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ చాలా తెలివిగా పేరు మోసిన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకుంది. వారిలో బెంగుళూరులోని ప్రముఖ క్రీడా పాత్రికేయుడు సుత్రం సురేష్ ఒకరు. ఈయన క్రీడా ప్రముఖుల నుంచి పెట్టుబడలను ఆకర్షించడంలో కీలకంగా పనిచేసినట్టు తెలుస్తోంది. పలుకుబడి గల ఏజెంట్లతో సినిమా, క్రీడా, రాజయకీయ, వ్యాపార రంగాల్లోని ప్రముఖులను ఈ సంస్థ బురిడీ కొట్టించింది. సంస్థ యజమాని రాఘవేంద్ర శ్రీనాథ్, ఏజెంట్లు సురేష్, నరసింహమూర్తి, కేసీ నాగరాజ్, ప్రహ్లాద్‌లను పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల కస్టడీకి తరలించారు. నిందితులు తెలిపిన వివరాల ప్రకారం సదరు సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని పోలీసులు చెప్పారు. దీనిపై పత్రికల వాళ్లతో మాట్లాడేందుకు ప్రకాశ్ పదుకొనే సహాయకుడు నిరాకరించారు. -
కదంబ రాజ్యంపై మరిన్ని ఆధారాలు..!
సాక్షి, బెంగుళూరు: కన్నడ మాతృ భాషగా వర్థిల్లిన కదంబ రాజ్యానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభించనున్నాయి. కర్ణాటకలో ప్రధాన పట్టణమైన శివమొగ్గకు 80 కి.మీ దూరంలోని తాలగుండ ప్రాంతంలో కదంబ విలసిల్లింది. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలను వెలికితీసేందుకు నమూనా తవ్వకాలను చేపడతామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. తవ్వకాలు జరిపే ప్రదేశంలోనే ప్రసిద్ధ ప్రణవేశ్వర స్వామి ఆలయం ఉంది. ఏడున్నర ఎకరాల్లో తవ్వకాలు జరపనున్నట్లు బెంగుళూరు ఏఎస్ఐ సూపరింటెండెంట్ కె.మూర్తేశ్వరి తెలిపారు. తవ్వకాలకు సంబంధించిన క్లియరెన్స్‌లు మరో పదిరోజుల్లో వస్తాయని అన్నారు. కీ.శ.350లో మయూర శర్మన్ కదంబ రాజ్యాన్ని స్థాపించాడని చరిత్ర చెబుతోంది. సుమారు 200 ఏళ్లపాటు ఈ రాజ్యం ఉనికిలో ఉంది. రాజ్యంలో కదంబ చెట్లు అధికంగా ఉండడంతో రాజ్యానికి ఆ పేరు వచ్చిందని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. ‘ప్రణవేశ్వర ఆలయాన్ని పునఃనిర్మించే క్రమంలో బంగారు, వెండి నాణేలు లభించడంతో మా నమ్మకాలు మరింత బలపడ్డాయి’ అని రిటైర్డ్ ఏఎస్ఐ సూపరింటెండెంట్ టీఎం కేశవ అన్నారు. కీ.శ.450 కి చెందిన రాగి శాసనం హాసన్ జిల్లా హాల్మిడి ప్రాతంలో బయటపడిందన్నారు. ఇదే కన్నడ భాషలో లిఖించబడ్డ అతి పురాతన శాసనమని తెలిపారు. -
మృత్యు శకటమైన అద్దె కారు..
వాయు వేగం ముగ్గురు భావి విద్యార్థినులను బలితీసుకుంది. బెంగళూరు హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఎంబీఏ విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు జార్ఖండ్, కేరళకు చెందిన వారుగా గుర్తించారు. సాక్షి, బనశంకరి: ఉన్నత చదువుల కోసం సుదూర ప్రాంతాల నుంచి నగరానికి చేరిన విద్యార్థినులను మృత్యువు కబళించింది. అతివేగం వల్ల వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యు శకటమై ముగ్గురు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ముగ్గురు తల్లులకు కడుపు కోత మిగిల్చిన ఈ ఘోర ఉదంతం హుళిమావు ట్రాపిక్పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు...జార్ఘండ్, కేరళలకు చెందిన శ్రీవాత్సవ్(23), హర్షితకుమార్(24), శృతి(24)లు ఎలక్ట్రానిక్‌సిటీ అలెయన్స్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు. ఇదే కళాశాలలో చదువుతున్న పవిత్, ప్రవీణ్‌లతో కలిసి బన్నేరుఘట్టలో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు.వీరంతా శుక్రవారం ఉదయం 7.30 గంటల సమయంలో అద్దె కారు తీసుకొని కళాశాలకు బయల్దేరారు. ప్రవీణ్ కారు డ్రైవింగ్ చేస్తూ బన్నేరుఘట్ట రోడ్డు నైస్‌రోడ్డులో అతివేగంతో వాహనాన్ని కుడివైపు టర్న్ చేసి అదే వేగంతో ఎడమవైపునకు తిప్పాడు. దీంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడి వంతెనను ఢీకొని ఆగిపోయింది. ప్రమాదంలో శ్రీవాత్సవ్, హర్షితాకుమార్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శృతి, స్వల్పంగా గాయపడిన ప్రవీణ్, పవిత్లను విజయశ్రీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శృతి మృతి చెందింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుజునుజ్జు కావడంతో శ్రీవాత్సవ్, హర్షితాకుమార్ మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. హుళిమావు ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కట్టర్‌తో వాహనాన్ని కోసి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
చెయ్యేస్తే.. ఆస్తి రాసేయాలి
మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, హత్యలు.. తరచూ ఇవే వార్తలే. ఆడపిల్ల కనిపిస్తే రెచ్చిపోయే కామాంధులకు షాకిచ్చేలా అసెంబ్లీ స్థాయీసమితి నివేదిక రూపొందించింది. కామాంధుల ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు పంపిణీ చేయడం, ఇతరత్రా కఠిన చర్యలే ఉపయుక్తమని పేర్కొంది. సాక్షి, బనశంకరి: మహిళలు, అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడే నేరగాళ్లకు ప్రభుత్వ సౌలభ్యాలను తొలగించి ఓటుహక్కును రద్దుచేయాలి. ఆస్తిని స్వాధీనం చేసుకుని బాధితులకు పరిహారం అందించాలి, ఈ మేరకు చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని శాసనసభ అత్యాచారాల నియంత్రణ అధ్యయన స్థాయీ సమితి నిర్ణయించింది. కొంతకాలంగా రాష్ట్రంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు మితిమీరడంతో బెంగళూరు ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2014లో మహిళలు, బాలికలపై దౌర్జన్యాలు, అత్యాచారాలను నియంత్రించడమెలా అనే అంశంపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్పను దీనికి అధ్యక్షునికిగా నియమించారు. బుధవారం నివేదిక సిద్ధం చేసింది. 100 సిఫార్సులు ఉగ్రప్ప మాట్లాడుతూ 1500 పేజీలతో కూడిన సమగ్ర నివేదికను పూర్తి చేశామన్నారు. ప్రభుత్వానికి కనీసం 100 సిఫార్సులు చేశామని, నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. గతంలో ఈ సమితికి నాణయ్య అధ్యక్షునిగా ఉండగా 39 సమావేశాలు, తాను అధ్యక్షుడైన తరువాత 134 సమావేశాలు నిర్వహించి సమగ్ర నివేదికను రూపొందించామని తెలిపారు. దేవదాసీలు, ఎయిడ్స్ బాధితులు, హిజ్రాల సంరక్షణ చర్యలనూ నివేదికలో చేర్చామని ఉగ్రప్ప చెప్పారు. స్థాయీ సమితి చేసిన ముఖ్య సిఫార్సులు కొన్ని.. లైంగిక నేరగాళ్ల ఆస్తిని స్వాధీనం చేసుకుని బాధితులకు పరిహారం అందించాలి. దోషులకు ప్రభుత్వ సౌలభ్యాలు, ఓటుహక్కు ను రద్దుచేయాలి. కేసు నమోదైన 24 గంటల్లోగా బాధితులకు వైద్య పరిహారం అందించడం. కేసుల తీవ్రతను బట్టి పరిహారాన్ని నిర్ధారించాలి. కేసుల విచారణ పూర్తికి స్పష్టమైన గడువును నిర్ధారించాలి. కేసుల్లో జాప్యాన్ని తప్పించడానికి జాతీయచట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. శిక్షల తీవ్రతను పెంచితే అకృత్యాలు తగ్గుతాయి. ఈ విషయంలో ఎస్పీ, స్పెషల్ ప్రాసిక్యూటర్లకు బాధ్యతలు అప్పగించాలి. పరిహారం వస్తుంది కదా అని అబద్ధపు కేసులు పెట్టేవారి నుంచి వడ్డీ సమేతంగా పరిహారం వెనక్కి తీసుకునేలా చట్టం ఉండాలి. -
తెల్లారిన బతుకులు
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. ఇంట్లో పెద్దలు చిందీలను సఫాయి చేయాలి.. ఆడబిడ్డలు నైటీలు, లంగాలు, జుబ్బాలు, నైట్ ప్యాంట్లో.. ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటిని కుట్టి తీరాలి. మగవారు ర్యాగ్స్ కటింగ్‌తో దుస్తుల తయారీకి సహకరించాలి. ఇలా కుటుంబసభ్యులందరూ శ్రమిస్తే తప్ప పూట గడవని దుర్భర జీవితాలు. కాసింత నాలుగు పైసలు కళ్లతో చూడాలనుకుంటే ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించాలి. బతుకు పోరులో అలుపెరగని శ్రమజీవులపై విధి వింత పాచిక విసిరింది. పొరుగున ఉన్న రాష్ట్రంలో దుస్తులు విక్రయించేందుకు వెళుతున్న వారి బతుకులు చీకట్లు వీడకముందే రోడ్డు ప్రమాదంతో తెల్లారిపోయాయి. పామిడికి చెందిన ముగ్గురు వ్యాపారులు దుర్మరణం చెందారు. డిసెంబర్లో జరిగిన పోలీస్ బ్రదర్స్ మరణం నుంచి కోలుకోకముందే మరో విషాదం పామిడి వాసులను విషాదంలో ముంచెత్తింది. పామిడి: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిందీ వ్యాపారులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని రామనగర్‌లో జరుగుతున్న ఇజ్తెమాలో జుబ్బాలు, నైట్ ప్యాంట్లు విక్రయించడం కోసం పామిడికి చెందిన 11మంది ముస్లిం వ్యాపారులు శనివారం రాత్రి పదిన్నర గంటలకు అనంతపురానికి చెందిన మహీంద్రా బొలెరో వాహనంలో బయల్దేరారు. ఆదివారం వేకువజామున 3.30 గంటలకు చిక్‌బళ్లాపూర్ దాటి పది కిలోమీటర్లు వెళ్లగానే వెనుకచక్రం బరెస్ట్ కావడంతో బొలెరో వాహనం పల్టీలు కొట్టింది. ట్రాలీలో కూర్చున్న నెహ్రూకాలనీ వాసి ఎన్.ఖాదర్‌వలి (38), బొడ్రాయి వీధికి చెందిన అనుంపల్లి ఖాజాహుసేన్ (42)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన షేక్ ఇబ్రహీం (48)ను హుటాహుటీన బెంగుళూరులోని ప్రో లైఫ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఇబ్రహీం మృతి చెందాడు.ఇదే ప్రమాదంలో షెక్షావలి, రసూల్, శింగనమల మహమ్మద్, తరిమెల హాజీవలి, దేవరపల్లి బాషా గాయాలపాలయ్యారు. క్యాబిన్లో కూర్చున్న డీఎం బాషా, షేక్ జాఫర్, హన్నూ సురక్షితంగా బయటపడ్డారు. ♦ మృతుడు ఖాదర్‌వలికి భార్య యాస్మిన్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అనుంపల్లి ఖాజాహుసేన్‌కు భార్య ఫకృన్నీ, ఇద్దరు కుమారులు, షేక్ ఇబ్రహీమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ♦ ఆదివారం సాయంత్రం పామిడికి చేరుకున్న ఎన్.ఖాదర్‌వలి, ఖాజాహుసేన్ల మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. షేక్ ఇబ్రహీం మృతదేహం ఆదివారం రాత్రికి వచ్చింది. సోమవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కూతురు వద్దన్నా వెళ్లి.. ఇజ్తెమాకు వెళుతున్న ఖాదర్‌వలిని మూడేళ్ల కూతురు వెళ్లొద్దంటూ అడ్డుపడింది. పాపను సముదాయించి బయల్దేరిన ఖాదర్‌వలి రోడ్డుప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే నూరేళ్లు నిండినా అంటూ తల్లి, భార్య, సోదరులు రోదించడం చూపరుల హృదయాలను కలచివేసింది. వెంటాడిన మృత్యువు.. ఖాజాహుసేన్ గత రంజాన్ మాసంలో చిందీ వ్యాపారం కోసం బళ్లారికి ద్విచక్రవాహనంలో వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరిగింది. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో శనివారం రాత్రి బెంగళూరుకు వెళుతుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మరణవార్త తెలియగానే తల్లి జహీరాబీ, భార్య ఫకృన్నీ గుండెలవిసేలా రోదించారు. తనయుడి ఎదుటే తండ్రి మరణం షేక్ ఇబ్రహీంకు తనయుడు షేక్ జాఫర్ వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేవాడు. బెంగళూరుకు తండ్రితోపాటు బయల్దేరాడు. రోడ్డు ప్రమాదంలో తనయుడి కళ్లెదుటే ఇబ్రహీమ్ ప్రాణాలు విడిచాడు. ఆ బాధ నుంచి జాఫర్ కోలుకోలేదు. కుటుంబ యజమాని మృతితో తామెట్ల బతికేదంటూ ఇబ్రహీం భార్య గుల్జార్ విలపించింది. -
అన్నదమ్ముల సవాల్ తప్పదా?
బొమ్మనహళ్లి: వచ్చే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో వివిధ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రముఖ సినిమా నటులతో ప్రచారం చేయించి ఓట్లు దండుకో వాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమకు మద్దతుగా తెలుగు హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారని మీడియాకు ఇదివరకే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు సైతం తెలుగు మెగాస్టార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరంజీవితో ప్రచారం చేయించాలని పథకాలు వేస్తోంది. సీఎం సిద్ధరామయ్య ఈ బాధ్యతలను మాజీ మంత్రి, కన్నడ రెబల్‌స్టార్ అంబరీష్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. తాను చిరంజీవిని తీసుకుని వచ్చి ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తానని సీఎంకి అంబి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హంగూ ఆర్భాటం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ రెండు పార్టీలకు మద్దతుగా ప్రచారం చేస్తే ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత నెలకొంది. ఈ ఇద్దరికి కర్ణాటకలో బెంగళూరుతో పాటు కోలారు, చిక్కబళ్ళాపురం, రాయచూరు, హైదరాబాద్ కర్ణాటక లాంటి ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారు. వీరి ప్రచారం వల ఓట్లు పడినా పడకపోయినా తమ ప్రచారానికి హంగు ఆర్భాటం వస్తుందని కూడా పార్టీలు ఉత్సాహంగా ఉన్నాయి. 2013 శాసనసభ ఎన్నికల్లో చిరంజీవి బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం తెలిసిందే. -
ప్రాణం మీదకు తెచ్చిన సెరిలాక్
రామనగర (దొడ్డబళ్లాపురం): గొంతులో సెరిలాక్ ఇరుక్కుపోవడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన బెంగళూరు సమీపంలోని మాగడి పట్టణంలో బుధవారం జరిగింది. హోసపాళ్యలో నివసిస్తున్న మంజునాథ్, ధనలక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమార్తె సంతానం. వీరు చిన్నారికి 15 రోజులు కిందట సెరిలాక్ తినిపించడం ఆరంభించారు. బుధవారం ఉదయం చిన్నారికి సెరిలాక్ కలిపి తల్లి తినిపిస్తుండగా..అది గొంతులో ఇరుక్కోవడంతో శిశువు ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బందిపడింది. తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పపత్రికి తీసుకెళ్లగా గొంతులో సెరిలాక్ ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
‘వైశ్య రత్న’ రామమూర్తి కన్నుమూత
పెనుగొండ: అఖిల భారత వాసవీ పెనుగొండ ట్రస్ట్ గౌరవాధ్యక్షుడు ఎస్.శ్రీరామమూర్తి(87) మంగళవారం బెంగళూరులో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమా ర్తెలు, కుమారుడు ఉన్నారు. రూ.666తో చిన్న వయసు లోనే ఫ్లైవుడ్ వ్యాపారం ప్రారంభించిన శ్రీరామమూర్తి.. అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఏర్పాటు చేసిన ‘మూర్తి గ్లాస్ అండ్ ఫ్లైవుడ్’ సంస్థ దేశంలోనే ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఒకటిగా నిలిచింది. పలు ఆలయ నిర్మాణాలకు సహకారం అందించిన శ్రీరామమూర్తి.. ఆ తర్వాత సుబ్రం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరి జన్మస్థలమైన పెనుగొండను ప్రముఖ క్షేత్రంగా తీర్చిదిద్దాలని భావించారు. అఖిల భారత వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాసవీ థాంలో అన్నదాన భవనం, అష్టభుజి పుష్కరిణి, వాసవీ మందిర్, సువర్ణ అద్దాల మండపం నిర్మించారు. పేద విద్యార్థులకు సాయం చేయడమే కాక.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించారు. -
బెంగళూరు..స్టార్టప్ రాజధాని
సాక్షి, బెంగళూరు: దేశంలో స్టార్టప్‌లకు అనువైన ప్రాంతంగా బెంగళూరు పేరుగాంచింది. అందరం కలిసి దేశానికి స్టార్టప్ రాజధానిగా బెంగళూరును మార్చాలి’ అని రాష్ట్ర ఐటీ బీటీ,పర్యాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే పిలుపునిచ్చారు. ప్యాలెస్ మైదానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన సేంద్రియ, చిరుధాన్యాల అంతర్జాతీయ వాణిజ్య మేళా–2018 ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో మంత్రి ప్రియాంక్ ఖర్గే, వ్యవసాయ మంత్రి క్రిష్ణబైరే తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఖర్గే మాట్లాడుతూ అగ్రి బిజినెస్ స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. క్రిష్ణబైరే మాట్లాడుతూ వ్యవసాయ స్టార్టప్‌ల కోసం ఇకపై రూ. 10 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. దీనిద్వారా రై తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. ఐటీ స్టార్టప్ల్‌తో పాటు అగ్రి స్టార్టప్‌లకు బెంగళూరును కేంద్రంగా మలచాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొన్ని అగ్రిబిజినెస్ స్టార్టప్‌లకు నిధులను అందజేశారు. సుమారు 44 స్టార్టప్ కంపెనీలు నిధులను అందుకున్నాయి. 2.10 లక్షల మంది సందర్శకులు సుమారు 2.10 లక్షల మంది మేళాను సందర్శించారు. ఈ వాణిజ్య మేళా ద్వారా రైతులు, దేశీయ, విదేశీ వ్యాపారులు, వినియోగదారులు ఒకే వేదికపైకి రాగలిగారు. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో చిరుధాన్యాల ప్రదర్శన జరిగింది. 357 స్టాళ్లు ఇందులో తమ ప్రదర్శనలను సందర్శకులు, వినియోగదారుల నిమిత్తం ప్రదర్శనకు ఉంచాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 14 రైతు సంఘాల సమాఖ్యలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. మేళా ద్వారా సుమారు రూ. 107 కోట్ల వ్యాపారం జరిగింది. -
మూఢాచారాలకు ముకుతాడు
ఛూ మంతర్‌కాళీ, నీ కష్టాల గుట్టు తెలిసింది, చిటికెలో వాటిని కడతేరుస్తాను అని మాయమాటలతో అమాయక జనాలను రకరకాలుగా దోచుకునే మోసగాళ్లకు కొదవ లేదు. మూఢ నమ్మకాలకూ అంతులేదు. వాటికి ఏదో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రాజ్‌భవన్ ఆమోదించింది. సాక్షి, బెంగళూరు: డిజిటల్ యుగంలో కూడా మూఢనమ్మకాలు పాతుకుపోయాయి. నిరక్షరాస్యత, వెనుకబాటు వల్ల మూఢనమ్మకాలతో నకిలీ స్వాములు, బాబాలు మాయలు మంత్రాలు, క్షుద్రపూజలంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల నియంత్రణ బిల్లును గత ఏడాది బెళగావి సువర్ణసౌధలో జరిగిన శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు తాజాగా రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ఆమోదముద్ర వేయడంతో ఇక చట్టం సాకారమైంది. ఆ చట్టం ప్రకారం మూఢ నమ్మకాల కారణంగా వ్యక్తి మృతి చెందినా లేదా గాయపడినా భారతీయ శిక్షా స్మతి ప్రకారం హత్య (302), హత్యాయత్నం(307) కేసుల్ని బాధ్యులపై నమోదు చేస్తారు. మాయలు, మంత్రాలు, చేతబడి, బాణామతి, మడె స్నానం తదితరాలను మూఢనమ్మకాల నియంత్రణ చట్టం ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. నేరం రుజువైతే ఒక సంవత్సరం నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించవచ్చు. భిన్న వాదనలపై స్పష్టత మూఢ నమ్మకాల నియంత్రణ చట్టానికి సంబంధించి మొదటి నుంచి సానుకూల, వ్యతిరేకతలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ చట్టం అస్పష్టంగా ఉందని దీనివల్ల దేవాలయాలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాల్లో నిర్వహించే పూజలు, హోమాలు సైతం మూఢనమ్మకాలుగా పరిగణించే అవకాశం ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఏవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయో, ఏవి రావో నిర్ధారించడానికి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పరచింది. పూర్తి వివరాలతో కూడిన జాబితాను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం, పోలీసుల సహాయంతో అనుమానిత స్థలాలపై ఆ అధికారి తనిఖీలు చేపట్టడానికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చట్టం పరిధిలోకి వచ్చేవి... 1. బాణామతి, నగ్నంగా ఊరేగించడం, వ్యక్తి లేదా సమూహంపై నిషేధం, బహిష్కారం 2. అతీంద్రియ శక్తులు ఆవహిస్తాయంటూ ప్రచారం 3. దయ్యాలు, భూతాలు విడిపిస్తామంటూ హింసించడం, కొక్కెలకు వేలాడదీయడం, బహిరంగంగా లైంగిక చర్యకు ప్రేరేపించడం లేదా ఒత్తిడి చేయడం, నోటిలో మల, మూత్రాలు వేయడం 4. వ్యక్తులను సాతాను, దయ్యం, భూతమంటూ సంబోధించడం 5. దయ్యాలను ఆహ్వానించడం, అఘోర, చేతబడి చర్యలకు ప్రోత్సహించడం 6. వేళ్లతో తాకుతూ శస్త్రచికిత్సలు చేయడం 7. తమను తాము అవాతరపురుషుడిగా ప్రకటించుకోవడం, గత జన్మలో మనమిద్దరం భార్యభర్తలమనీ లేదా ప్రేమికులమంటూ మహిళలు, యువతులను ప్రలోభ పెట్టి లైంగిక చర్యలకు ప్రేరేపించడం 8. పిల్లలను ముళ్లు, నిప్పులపై నడిపించడం 9. రుతుక్రమంలోనున్న స్త్రీలను, గర్భిణీలను ప్రత్యేకంగా ఉంచడం 10. మడిస్నానం, నోటికి శూలాలు, తాళాలు వేయడం తదితరాలు. -
చెలరేగిన ‘కివీస్’
అనంతపురం సప్తగిరి సర్కిల్: న్యూజిలాండ్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో వివేకానంద క్రికెట్ అకాడమీ(వీసీఏ) బెంగుళూరు, న్యూజిలాండ్ హట్‌హాక్స్ జట్లు తలపడ్డాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్‌మెన్ బొనర్ 58 బంతుల్లో 13 ఫోర్లతో 85 పరుగులు సాధించి జట్టు విజయానికి కారకుడయ్యారు. న్యూజిలాండ్ జట్టులో అనంత క్రీడాకారులు ప్రశాంత్, లోహిత్‌సాయి, ప్రదీప్, దీపక్ రాణించారు. మ్యాచ్ వివరాలు ఇలా.. తొలి టీ–20 మ్యాచ్‌లో వీసీఏ, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. జట్టులో బొనార్ 85 పరుగులు చేసాడు. గ్రీన్వుడ్ 30, హార్డింగ్ 25 పరుగులు సాధించారు. వీసీఏ బౌలర్లలో పరుల్, రోనిత్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బరిలోకి దిగిన వీసీఏ జట్టు క్రీడాకారులు న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత 20 ఓవర్లలో 73 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. జట్టులో అరవింద్ 15 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో హార్డింగ్ 3, ప్రదీప్. రోహిత్ చెరో వికెట్ సాధించారు. కాగా, నేడు ఆర్డీటీ సీబీఆర్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. -
బర్డ్ ఫ్లూ భయం
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం మాంస ప్రియులను భయపెడుతోంది. యలహంక పరిధిలోని దాసరహళ్లిలో బర్డ్ ఫ్లూను అధికారులు గుర్తించిన నేపథ్యంలో నగరంలో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. మూడు రోజుల ముందుతో పోలిస్తే శుక్రవారం నాటికి నగర వ్యాప్తంగా చికెన్, గుడ్ల అమ్మకాలు దాదాపు 25 శాతం పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. కాగా, బర్డ్ ఫ్లూ కనిపించిన దాసరహళ్లి ప్రాంతంలో మరో 15 రోజుల పాటు మాంసం దుకాణాలను మూసివేయనున్నారు. నగరంలోని దాసరహళ్లి ప్రాంతంలో మంగళవారం రోజున అధికారులు బర్డ్ ఫ్లూను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూను గుర్తించిన ఫారమ్‌లో ఉన్న 900కు పైగా కోళ్లను అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చంపేశారు. ఇక ఇదే సందర్భంలో ఈ వ్యాధి మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. 25 శాతం తగ్గిన అమ్మకాలు... బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో నగరంలో ఈ మూడు రోజుల్లోనే చికెన్, గుడ్ల అమ్మకాలు దాదాపు 25 శాతం పడిపోయాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై కర్ణాటక పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ బ్రీడర్స్ అసోషియేషన్ (కేపీఎఫ్‌బీఏ) ప్రతినిధి డాక్టర్ బి.జి.పుట్టణ్ణ మాట్లాడుతూ... ‘బెంగళూరులో సాధారణంగా ప్రతి రోజూ 4 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే బుధవారంతో పోలిస్తే శుక్రవారం నాటికి అమ్మకాలు 25 శాతం మేరకు పడిపోయాయి. ముఖ్యంగా నగరంలోని ప్రముఖ మార్కెట్లలో ఒకటైన రసల్ మార్కెట్లో చికెన్, గుడ్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. కొనుగోలు దారులు తమ ఆరోగ్య రక్షణపై ఆందోళనతో చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయినా ప్రస్తుతం బర్డ్ ఫ్లూకు గురైంది నాటుకోళ్లు మాత్రమే, బాయిలర్ కోళ్లలో ఈ లక్షణాలు కనిపించలేదు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. 15 రోజుల పాటు దుకాణాల మూసివేత... కాగా, బర్డ్ ఫ్లూను గుర్తించిన దాసరహళ్లి ప్రాంతానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసం దుకాణాలను అధికారులు పూర్తిగా మూసేశారు. ఈ విషయంపై రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్‌కుమార్ ఖత్రి మాట్లాడుతూ...‘బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను అమృతహళ్లి, థనిసంద్ర, కాడుగోనహళ్లి ప్రాంతాల్లోని ప్రాధమిక వైద్య శిబిరాల్లోని సిబ్బందితో పాటు అంగన్వాడీ, ఆశాకార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఈ విషయంపై అవగాహన కల్పించనున్నారు. దాసరహళ్లి ప్రాంతంలో కోళ్లను చంపే ప్రక్రియను కేంద్రం నుండి వచ్చిన వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ప్రజలు బర్డ్ ఫ్లూకు సంబంధించిన ఏదైనా సమస్యలపై సహాయం కోసం సహాయవాణి కేంద్రాలకు 1800–425–0012 లేదా 080–23417100 నంబర్లలో సంప్రదించవచ్చు’ అని తెలిపారు. కాగా, మాంసప్రియులు ఈ విషయం పైఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ‘చికెన్, గుడ్లను 70 డిగ్రీల సెల్సియస్‌కు పైన ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఎదురవ్వదు. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత వద్ద బర్డ్ ఫ్లూను కలిగించే వైరస్ పూర్తిగా చనిపోతుంది. సరిగ్గా ఉండికించకుండా చికెన్‌ను తిన్న సందర్భాల్లోనే వైరస్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి’ అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆనిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బైరేగౌడ వెల్లడించారు. -
ప్రియుడు లేని లోకంలో ఉండలేనని..
మంగళూరు (సాక్షి, బెంగళూరు): మనసంతా అతని తలపులే నిండిపోయాయి. కానీ అతను అర్ధంతరంగా తనువు చాలించాడు, అతని తలపుల నుండి బయటికి రాలేక తనూ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. ఈ ఘటన మంగళూరులోని ఉల్లాళ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు....మంగళూరులోని ఉల్లాళ ప్రాంతానికి చెందిన రుబేనా(17), అఫ్రాజ్(18) స్థానికంగా కాలేజీలో కలిసి చదువుకుంటున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే గత ఏడాది నవంబర్ 24న అఫ్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు, అప్పటి నుంచి ఆమె అతన్ని తలచుకుంటూ మథనపడుతూనే ఉంది. ఈ ఆవేదనతో రుబేనా సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. -
హీరోయిన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు..
సాక్షి, బొమ్మనహళ్లి: సినిమాలో నటించిన హీరోతో నీకు సంబంధం ఉందంటూ అసభ్యకర మెసేజ్‌లతో వేధిస్తున్న సహాయ నటుడిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన బొమ్మనహళ్లి నగరంలో చోటుచేసుకుంది. వివరాలు...నటుడు రాజశేఖర్ ఐస్ మహల్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో నటించిన ఓ హీరో యిన్‌ను రాజశేఖర్ అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడు. దీంతో ఆమె అతని వేధింపులు భరించలేక మాగడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. -
వీల్‌చైర్ నుంచే విజయ బావుటా..
ఊహ తెలియని వయసులో వైకల్యం కాటేసింది. ఒక్క కాలితోనే పాఠశాలకు వెళ్లేది. అందరూ ఉత్సాహంగా ఆటలు ఆడుతుంటే సంతోషంగా చూసేది. క్రమంగా తాను వారికంటే మేటిగా ఆడాలని కలలు కంది, సాధనతో ఆ స్వప్నాల్ని సాకారం చేసుకుంది. చక్రాల కుర్చీ క్రీడాకారిణి ప్రతిమారావు తనవంటివారికి ఆదర్శంగా నిలిచారు. సాక్షి, శివాజీనగర(బెంగళూరు): దేవుడు ఒక ద్వారం మూసేస్తే మరో ద్వారం ఎక్కడో తెరిచే ఉంటాడు అని ప్రతిమారావు తన బాల్యంలో విన్న మాటలు. చేయాల్సిందల్లా ఆ మార్గాన్ని వెతుక్కో వడమే అంటారు బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల వీల్‌చైర్ టెన్నిస్ క్రీడాకారిణి ప్రతిమారావు. ఆమెకు మూడేళ్ల వయసులో పోలియో ఇంజెక్షన్ వేసినప్పుడు అది రియాక్షన్ కావడంతో కుడి కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. ఆమె క్రమంగా క్రీడాకారిణిగా మారి నేడు వీల్‌చైర్ టెన్నిస్‌లో ఏఐటీఏ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచారు. ఉడుపి జిల్లా వద్ద సాలిగ్రామానికి చెందిన ప్రతిమా కంప్యూటర్ డిప్లొమా చేసి జీవీకే ఇఎమ్ఆర్ఐ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి సాధారణ పాన్ వ్యాపారి. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘నన్ను ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచారు. పాఠశాలలో నేను ఆటలకు దూరంగా ఉండేదాన్ని. టీచర్ పక్కన కూర్చొని ఇతరుల ఆటలను చూస్తూ ఉండేదాన్ని. అయితే బెంగళూరుకు వచ్చిన తరువాత నాకు టెన్నిస్‌లో ఆసక్తి పెరిగింది. వీల్‌చైర్‌లో టెన్నిస్ ఆడటాన్ని చూసి నాకూ ఉత్సాహం కలిగింది.’ అని అనుభవాలను పంచుకున్నారు. సాధించాలనే తపనే ఇక్కడ నిలిపింది పోలియో ఇంజక్షన్‌ను సరిగా వేయకపోవడంతో తన కుడి కాలును కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ, నాన్నకు తాను కష్టపడటం ఇష్టం లేదు, వారితో సంతోషంగా ఉండాలనే ఆశ ఉండేది అన్నారు. ‘అయితే నాకు ఏదైనా సాధించాలని ఆత్మ విశ్వాసం ఉంది. చక్రాల కుర్చీ ఉపయోగించకుండా నేను నడవగలను. దూరంగా నడవాలంటే మాత్రం క్యాలిఫర్ ఉపయోగిస్తా. అయితే టెన్నిస్ ఆడాలనే ఆసక్తితో తొలిసారిగా చక్రాలకుర్చీని ఉపయోగించడం నేర్చుకున్నా. 2012లో కర్ణాటక వీల్‌చైర్ టెన్నిస్ అసోసియేషన్ (కేడబ్ల్యూటీ)ద్వారా అడేందుకు ఆవకాశం దక్కింది. దీనిద్వారా కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ సంస్థ (కేఎస్ఎట్టీఎ) మైదానంలో ప్రతి వారాంతం సాధన చేసేదాన్ని. గూగుల్, యూట్యూబ్‌లో చూసి టెన్నిస్ శిక్షణ గూగుల్, యూ ట్యూబ్‌లో వీడియోలు చూస్తూ టెన్నిస్ ఆడటాన్ని నేర్చుకున్నా. 2013లో జాతీయ వీల్‌చైర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్ చేరుకున్నాను’ అని ప్రతిమారావు తెలిపారు. ‘ఆ తరువాత కోచ్ నిరంజన్ రమేశ్ ద్వారా శిక్షణ లభించింది. ఆయనే నా గురువు. సమయ పాలనతో పాటు వృత్తి జీవిత పలు క్రమశిక్షణలను నేర్పించారు. ఆ తరువాత ఏఐటీఏ ర్యాంకింగ్‌లో ఆగ్రస్థానం లభించింది. ఐటీఎఫ్ ర్యాంకింగ్‌లో ప్రస్తుతానికి ఏ స్థానం లభించలేదు. అందులో ర్యాంకింగ్ సాధించడమే నా ఏకైక లక్ష్యం’ అని చెప్పారు. ప్రతిమారావు సాధనలు.. ప్రతిమారావు కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ సంస్థ ఇటీవల జరిపిన టిబెబుయియా ఓపెన్ వీల్‌చైర్ టెన్నిస్ టోర్నీలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు. 2015లో మలేషియా ఓపెన్ టోర్నీలో సెమిఫైనల్ వరకూ వెళ్లారు. 2016లో ఆర్వైటీహెచ్ఎమ్ 4వ జాతీయ వీల్‌చైర్ చాంపియన్‌షిప్‌లో సింగిల్, డబుల్స్‌లో రన్నరప్. 2016 కేడబ్ల్యూటీఏ రాష్ట్రస్థాయి టెన్నిస్‌లో సింగిల్స్, డబుల్స్‌లో చాంపియన్. 2016 టెబెబుయియా ఓపెన్ టోర్నీలో సింగిల్స్, డబుల్స్‌లో విజేత. 2017 మరినా ఓపెన్ టోర్నీలో సింగిల్స్ ట్రోఫీ. -
ఆర్థిక ఇబ్బందితో క్యాబ్ డ్రైవర్‌గా మారిన నటుడు..!
-
పబ్‌లు, బార్లలో జర జాగ్రత్త..!
సాక్షి, బెంగళూరు: ముంబైలోని కమల మిల్స్ భవనంపై ఉన్న పబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో నగర అగ్నిమాపక శాఖ విభాగం అప్రమత్తమైంది. ముంబై ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు ముఖ్యంగా ఇటువంటి భవనాల్లో ఉన్న పబ్‌లు, బార్లు, రెస్టోరెంట్లలో తనిఖీని ముమ్మరం చేసింది. ముఖ్యంగా న్యూ ఇయర్ సంబరాలకు ఎక్కువ మంది పబ్‌లు, బార్లలలో నిర్వహించుకోవడానికి యువత ఇష్టపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే నగరంలోని చాలా పబ్‌లు, బార్లు అగ్నిమాపశాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను పొందకుండానే వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. నెటిజన్లు ట్వీట్లతో సమాచారం.. ఈ నేపథ్యంలో అనేకమంది నెటిజన్లు నగరంలోని ఏఏ రెస్టారెంట్లలో ఎటువంటి పరిస్థితి ఉందన్న విషయమై రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ ఎం.ఎన్ రెడ్డికి ట్వీట్లతో సమాచారం అందించారు. ముఖ్యంగా వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రముఖ మాల్లోని రెస్టారెంట్‌తో పాటు రూఫ్ టాప్ పబ్‌లకు అనుమతి లేదని తెలిపారు. మరోవైపు ఇందిరానగరలోని అనేక పబ్‌లు ఇళ్లకు అనుమతులు పొంది అందులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎం.ఎన్ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు ఎం.జీరోడ్, బ్రిగేడ్‌రోడ్, ఇందిరానగర్‌లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయంపై ఎం.ఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను బహుళ అంతస్తుల భవనాలుగా పరిగణిస్తారు. ఇందులో ప్రమాదం జరిగినప్పుడు త్వరగా కిందికి రావడానికి వీలుగా అత్యవసర మెట్లు ఉండాలి. అంతేకాక అటువంటి భవనాల ముందు అగ్నిమాపక వాహనాల నిలుపుదలకు వీలుగా విశాలమైన స్థలం ఉండాలి. ప్రతి అంతస్తులో అగ్నినిరోదక వస్తువులు తప్పక ఉండాలి. ఈ ఏర్పాట్లు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. అధికారులు ప్రజలకు చెబుతున్న జాగ్రత్తలు .. ∙పబ్‌లు, బార్లలో కిచెన్‌కు దగ్గరగా సిటింగ్ టేబుల్‌పై కూర్చొకపోవడమే ఉత్తమం. ∙మద్యానికి దగ్గరగా సిగరెట్ వంటి వస్తువులు ఉండకుండా చూడాలి. ∙పబ్‌కు, రెస్టారెంట్‌కు వెళ్లే సమయంలోనే అత్యవసర ద్వారాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి ∙అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్‌ను ఉపయోగించకపోవడమే మేలు -
మెట్రోలో లేడీస్ స్పెషల్
సాక్షి, బెంగళూరు: ట్రాఫిక్ పద్మవ్యూహంతో కూడిన బెంగళూరు నగరంలో మెట్రో రైల్ నిత్యం వేల మంది ప్రజలను సకాలంలో గమ్యం చేరుస్తోంది. మూడు బోగీలు మాత్రమే ఉన్న మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా బోగీలు లేకపోవడంతో కిక్కిరిసిన బోగీల్లో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మెట్రో రైళ్లల్లో మహిళల కోసం ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలంటూ గతకొద్ది కాలంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న మెట్రో సంస్థ బీఎంఆర్సీఎల్ ఒక్కో మెట్రో రైలుకు మహిళల కోసం అదనంగా ఒక బోగీని అమర్చాలని నిర్ణయించింది. అదనపు బోగీల్లో ఒకటి కేటాయింపు కొత్త మెట్రో బోగీల నిర్మాణం, అనుసంధాన ప్రక్రియను బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించింది. ప్రస్తుతం మూడు బోగీల నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా ప్రయోగాత్మకంగా ఒక రైలుకు అమర్చి పరీక్షించనున్నారు. వీటిì పనితీరు, మహిళల స్పందన పరిశీలించిన అనంతరం ఈ ప్రయోగం విజయవంతమైతే జూన్ నెల నుంచి అన్ని రైళ్లకు అదనంగా మూడు బోగీలను అమర్చడానికి బీఎంఆర్సీఎల్ నిర్ణయించుకుంది. అందులో ఒక బోగీ మహిళలకే ప్రత్యేకంగా కేటాయిస్తారు. రెండు రోజులు క్రితం బీఎంఆర్సీఎల్ ఎండీ మహేంద్ర జైన్ బీహెచ్ఈఎల్ సంస్థకు వెళ్లి ప్రస్తుతం తుది దశలోనున్న మెట్రో బోగీలను పరిశీలించారు. విమానాశ్రయ మార్గంలో వినూత్న వసతులు నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా మెట్రో రైలు మార్గాన్ని కెంపేగౌడ అంర్జాతీయ విమానాశ్రయం వరకూ నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రో ద్వారా ఎయిర్‌పోర్టు చేరుకునే ప్రయాణికులకు నమ్మ మెట్రో అనేక ప్రయోజనాలు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు ఎయిర్పోర్ట్ నిర్వాహకుల నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి మెట్రోలోనే చెక్ ఇన్ సదుపాయం కల్పించనున్నారు. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. ఇక విమానాల రాకపోకల సమయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే డిజిటల్ డిస్ప్లే కూడా అందుబాటులోకి రానుంది. అదనపు లగేజీని రవాణాకు ప్రత్యేక బోగి ఏర్పాటు చేసే ఆలోచన కూడా నమ్మమెట్రో వద్ద ఉంది. దీని వల్ల విమానయానం చేయాలనుకునే వారు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తారని తద్వారా సంస్థకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరమని అధికారులు భావిస్తున్నారు. జనవరి చివర్లో బోగీలు వస్తాయి ‘జనవరి నెలాఖరునాటికి బోగీలను అందించనున్నట్లు బీహెచ్ఈఎల్ సంస్థ తెలిపింది. బోగీలు అందిన వెంటనే మెట్రోరైలుకు అమర్చి రెండు నెలల పాటు బోగీల పనితీరు, మహిళల నుంచి స్పందన పరిశీలిస్తాం. తరువాత వీలైనంత త్వరగా మిగిలిన అన్ని రైళ్లకు అదనపు బోగీలను అమర్చుతాం’ –మహేంద్ర జైన్, బీఎంఆర్సీఎల్ ఎండీ -
కోర్టుకు వెళ్లిన ‘సన్నీ నైట్స్’ నిర్వాహకులు
సాక్షి,బెంగళూరు: డిసెంబర్ 31న సన్నీలియోన్ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించా రు. కార్యక్రమానికి రూ. లక్షలు ఖర్చు చేశామని, అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. వీరి పిటిషన్ మరో రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
ఫొటో తీయండి.. పోస్ట్ చేయండి
బనశంకరి: బెంగళూరు పాలికె పరిధిలో సమస్యలు ఉంటే.. ఆ ఫొటో తీసి పాలికె యాప్‌లో అప్లోడ్ చేస్తేచాలు, పరిష్కారం బాధ్యత పాలికెదే. సోమవారం పాలికె కేంద్రకార్యాలయంలో మేయర్ సంపత్‌రాజ్, పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ ‘మా వీధులను సరిచేయండి’ అనే యాప్‌ను విడుదల చేశారు. మేయర్ మాట్లాడుతూ పాలికె పరిధిలోని రోడ్లు, చెత్త తదితర ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించుకోవడానికి ఈ యాప్ ఎంతో అనుకూలమవుతుందని చెప్పారు. ఎలా పనిచేస్తుందంటే.. bbmpfixmystreet యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రోడ్డుపై గుంత, చెత్త, మురుగు సమస్య ఉన్నట్టయితే, ఒక ఫొటో తీసియాప్‌లో అప్లోడ్ చేయాలి. దానిపై అధికారులు స్పందిస్తారు. డ్యాష్‌బోర్డు ద్వారా సమస్యల పరిష్కారానికి అదికారుల నుంచి చర్యలు తీసుకుంటామని సంపత్‌రాజ్ తెలిపారు. ఇప్పటివరకు నగరంలో ఇబ్బందులపై ప్రజలు బీబీఎంపీ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేయాల్సివచ్చేది. అక్కడి నుంచి వార్డుకు, అధికారులకు సమాచారం అందించి అప్రమత్తం చేయడానికి సమయం పట్టేది. ప్రస్తుతం విడుదల చేసిన యాప్ ద్వారా నేరుగా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని మేయర్ చెప్పారు. ఏ సమస్యకు ఎంత సమయం? చెత్త సమస్య ఉంటే ఒక్కరోజులోగా పరిష్కరించాలని అధికారులకు మేయర్ సూచించారు. వీధి దీపాల సమస్యను రెండురోజులు, రోడ్లు గుంతల సమస్యలను ఒక వారంలోగా పరిష్కరించాలని చెప్పారు. బెస్కాం, ఆరోగ్య శాఖ, బీడీఏ, ఉద్యానవనశాఖ తో పాటు వివిద శాఖలు యాప్ సమాచారాన్ని అందుకుంటాయి. ప్రతి అధికారి, కార్పొరేటర్లకు సమాచారం వెళ్తుందని మేయర్ తెలిపారు. సమస్య పరిష్కారం అయిన వెంటనే ఆ ఫోటోను అప్లోడ్ కోరారు. నగరమంతటా ఎల్ఈడీ బల్బులు అనంతరం పాలికె కమిషనర్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ... యాప్‌లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఆలస్యమైతే అధికారులు అందుకు కారణాన్ని ఫిర్యాదిదారుకు తెలియజేయాలి. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో పాత విద్యుత్దీపాలను తొలగించి ఎల్ఇడి బల్ప్‌లను ఏర్పాటు చేయడానికి నివేదికను సిద్ధం చేశామని, మూడునాలుగు నెలల్లోగా టెండర్లు ఆహ్వానించి 8 నెలల్లోగా నగరంలోని అన్ని వీదులకు విద్యుత్దీపాలను ఎల్‌ఇడీగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ పద్మావతి నరసింహమూర్తి, పాలికె పాలనా విభాగం నేత రిజ్వాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ కోసం వచ్చి.. కెమెరాకు చిక్కి..!
సాక్షి, బొమ్మనహళ్లి: అత్యంత ఖరీదైన సైకిల్‌ను చోరీ చేసేందుకు వచ్చిన దొంగను స్థానికులు సీసీ కెమెరా ద్వారా పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బెంగళూరులోని సుబ్రమణ్య నగర్లో ఈ నెల 3న చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఓ దొంగ సుబ్రమణ్య నగర్లో చోరీ కోసం రెక్కీ నిర్వహించాడు. వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఖరీదైన సైకిల్‌పై అతని కన్ను పడింది. ఆ రోజు సాయంత్రం కట్టర్ సహాయంతో తాళం తొలగించి సైకిల్‌ను చోరీ చేస్తుండగా యజమాని సీసీ కెమెరా ద్వారా గుర్తించి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. భయందోళనకు గురైన ఆ దుండగుడు అక్కడే ఉన్న కారు కింద దాక్కున్నాడు. అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తి పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందుతుడు తన పేరు కల్లెష్ అని ఒక్కసారి మల్లేష్అని మరోసారి చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జీరో సైజ్ మోజు భార్య.. కోర్టుకెక్కిన భర్త..!
సాక్షి, బెంగళూరు: జీరోసైజ్, స్లిమ్ ఫిట్‌లపై వ్యామోహం కొత్త దంపతుల మధ్య విడాకులకు దారి తీసిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఆ భర్త అర్జీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నగరంలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న వ్యక్తికి నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఆమె కొద్దిగా లావుగా ఉండడంతో మొదట యువకుడు వివాహానికి అంగీకరించలేదు. అయితే అతని తల్లి ఒత్తిడితో కాదనలేక సుమారు నెలకిందట ఆ యువతికి మూడుముళ్లు వేశాడు. లావుగా ఉన్న తాను నాజూగ్గా మారాలనే తాపత్రయంతో చాలాకాలంగా డైట్ చేస్తున్న యువతి అత్తవారింట్లోనూ అనుసరించేది. కేవలం ఆకు కూరలు, పచ్చి కూరగాయలు మాత్రమే తీసుకునేది. తనతో పాటు భర్తకు, అత్తకు కూడా వాటినే ఆహారంగా తీసుకోవాలంటూ కొత్త కోడలు ఒత్తిడి చేసేది. ఇవి తమకు పడవని తమ కోసం ప్రత్యేకంగా వంట చేయాలంటూ భర్త చెప్పేవాడు. యువతి మాత్రం ఇవే తినాలంటూ ఇరువురిని బలవంతపెట్టేది, వినకపోతే భర్త, అత్తను ఇష్టమొచ్చినట్లు కొట్టేది. ఇదే క్రమంలో ఒకసారి అత్తపై దాడికి పాల్పడగా ఆమె చెయ్యి కూడా విరిగింది. ఇంట్లో ప్రతి చిన్న విషయానికీ భర్తతో గొడవ పడుతుండేవారు. వేరు కాపురం పెట్టాలని పోరుపెట్టేది, దీనికి భర్త ససేమిరా అనేవాడు. తట్టుకోలేనంటూ.. కోర్టుకెక్కిన భర్త భార్య వేధింపులు శృతి మించాయంటూ ఆ భర్త విడాకులు కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమయ్యాడు. అందులో భాగంగా న్యాయవాది చేతన్ పటేల్‌ను కలిసి విషయాన్ని తెలిపారు. అయితే వివాహం జరిగి నెల రోజులు మాత్రమే కావడంతో విడాకులకు నిబంధనలు ఒప్పుకోవని న్యాయవాది తేల్చిచెప్పారు. అయితే తన ఇష్టానికి వ్యతిరేకంగా తల్లి బలవంతం మేర వివాహం చేసుకోవాల్సి వచ్చిందని, మరుసటి రోజు నుంచే భార్య వేధింపులు మొదలయ్యాని భర్త ఆ వకీల్కు మొరపెట్టుకున్నాడు. ఆ అంశాల ప్రకారం భార్య, భర్తకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టులో అర్జీ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు భార్య అభిప్రాయాన్ని కోరగా తమకు కూడా ఈ వివాహం ఇష్టం లేదని తల్లితండ్రులు బలవంతం మేరకే వివాహానికి అంగీకరించినట్లు తెలిపారు.దీంతో ఇరువురి సమ్మతం మేరకు కుటుంబ న్యాయస్థానం కలహాల దంపతులకు విడాకులు మంజూరు చేసింది. -
ఇదీ.. స్మార్ట్ సిటీ
ఐటీ రాజధానిగా కీర్తి సంపాదించినా, అవే గుంతల రోడ్లు, డ్రైనేజీలు. ట్రాఫిక్ పద్మవ్యూహం, పార్కింగ్ సమస్య. ఇంకా చెప్పుకుంటూపోతే పెద్ద జాబితానే అవుతుంది. ఈ తలరాతను స్మార్ట్ సిటీ పథకమైనా తీరుస్తుందని నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. కాగితాల మీద అనుకున్నట్లుగా ఆచరణలోనూ సాగితే సిటీ సౌందర్యమే మారిపోతుంది. సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌సిటీ మూడో జాబితాలో బెంగళూరుకు స్థానం దక్కడం తెలిసిందే. స్మార్ట్స్‌సిటీ రూపురేఖలు ఏ విధంగా ఉండాలన్నదానిపై నేడు (శుక్రవారం) 15 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం బెంగళూరులో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. నగర పాలికె ప్రత్యేక కమిషనర్ ఆర్. విజయ్‌శంకర్ ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. స్మార్ట్ పథకంతో ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.2,219 వేల కోట్లతో బెంగళూరుకు అత్యాధునిక వసతులు లభించబోతున్నాయి. ఈ నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలా రూ.500 కోట్లను, మిగిలిన మొత్తాన్ని బీబీఎంపీ, బీఎంటీసీ, బీఎంఆర్‌సీఎల్‌తో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా భరించనున్నాయి. ఏడు ఉప ప్రాజెక్టులుగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టును విభజించి ఆ మేరకు పనులను చేపడతారు. స్మార్ట్ రహదారులు, ఈ–వాహనాలు ♦ స్మార్ట్ సిటీ లో రూ.1,166 కోట్ల భారీ నిధులతో టెండర్‌షూర్ రోడ్లు, ఈ–బస్సులు, ఈ–ఆటో రిక్షాలు, స్మార్ట్ బస్‌షెల్టర్స్, స్మార్ట్ డస్ట్‌బిన్స్, పర్యావరణ సెన్సార్స్ తదితరాలను ఏర్పాటు చేశారు. సమగ్ర రవాణా వ్యవస్థ ఇందు కోసం రూ.233.13 కోట్లను ఖర్చు చేస్తారు. రస్సెల్ మార్కెట్, శివాజీనగర బస్టాండును కలిపి మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌గా మారుస్తారు. ఈ వాహనాలకు చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ మార్కెట్లు... మినీ కంపోస్ట్ ఎరువుల తయరీ కేంద్రాలు చారిత్రక నేపథ్యం కలిగిన కే.ఆర్ మార్కెట్, మల్లేశ్వరం మార్కెట్లను రూ.130 కోట్లతో బహుళ అంతస్తుల ఆటోమేటిక్ పార్కింగ్ సదుపాయాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు కానున్నాయి. 24 గంటలూ పనిచేసే సీసీ కెమెరాలు, స్మార్ట్, మినీ కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నారు. చెరువుల వద్ద సోలార్ ట్రీ హలసూరు, స్యాంకీట్యాంక్ చెరువులకు కొత్త కళ. వీటిలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చేరే నీటిని ఎక్కడికక్కడ శుద్దిచేసి చేస్తారు. ఈ చెరువుల వద్ద బైస్కిల్‌షేర్ పాయింట్లు, సోలార్ ట్రీ ఉంటాయి. సోలార్ ట్రీ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. కబ్బన్‌పార్క్‌కు హంగులు కబ్బన్‌పార్క్‌లో పర్యాటకానికి సంబంధించిన కియోస్కులు, మ్యూజిక్ ఫౌంటెన్లు, ఈ– టాయిలెట్లు, తాగునీరు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు ఏర్పడతాయి. స్లమ్స్ టు స్మార్ట్ గాంధీనగరలోని స్వతంత్రపాళ్యలో భూగర్భ, స్మార్ట్ డ్రైనేజ్ సిస్టం అందుబాటులోకి వస్తుంది. ఇందులో సెన్సార్స్ ఉండటం వల్ల పూడిక ఏర్పాడితే వెంటనే సంబంధిత అధికారుల ఫోన్లకు సమాచారం అందుతుంది. ఇక స్మార్ట్ వీధి లైట్లు, కమ్యూనిటీ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. కే.సీ జనరల్ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణం, అత్యాధునిక వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. -
అన్నతో గొడవ..వదినను నరికేశాడు
సాక్షి, కృష్ణరాజపురం: ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి తన అన్న భార్యను కొడవలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి బెంగుళూరులోని కె.ఆర్. పురం చిక్కదేవసంద్రలో చోటుచేసుకుంది. వివరాలివి.. చిత్తూరు జిల్లాకు చెందిన మనోహర్ రెడ్డి, సుమతి(30) దంపతులు కొద్ది కాలం క్రితం చిక్కదేవసంద్రకు చేరుకొని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతంలో మనోహర్ రెడ్డి సోదరుడు వినాయకరెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇదే విషయమై అన్నదమ్ముల మధ్య గొడవ చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత మనోహర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో వినాయకరెడ్డి వదిన సుమతితో గొడవ పడ్డాడు. ఓ దశలో కోపంతో కొడవలి తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా నరికి ఉడాయించాడు. తీవ్ర గాయాలతో సుమతి అక్కడిక్కడే మృతి చెందింది. కె.ఆర్.పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
శివ శివా.. శివలింగంపై కాళ్లా!
సాక్షి, బెంగళూరు: శివలింగంపై ఒక స్వామీజీ పాదాలు మోపి పూజలు చేయించుకున్న ఘటన కర్ణాటకలో సంచలనమైంది. ఆయన తీరుపై శైవ భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 5న బెంగళూరు శివారు రంగనబెట్ట సమీపంలో శాంతలింగేశ్వర మఠానికి చెందిన మరో శాఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా శివలింగానికి ప్రాణప్రతిష్ట చేసే సమయంలో మఠానికి చెందిన శాంతలింగేశ్వర స్వామి తన పాదాలను ఆ శివలింగంపై పెట్టగా, ఆయన శిష్యులు పూజలు చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాదిలో ఉగాది రోజు మాత్రమే మాట్లాడే శాంతలింగేశ్వర స్వామీజీ ఈ విషయమై తన శిష్యుల ద్వారా మీడియాకు వివరణ ఇప్పించారు. వీరశైవ విధానం ప్రకారమే పూజలు జరిగాయని చెప్పారు. -
బండరాయిపై సెల్ఫీలు.. అంతలోనే !
దొడ్డబళ్లాపురం: సెల్ఫీ పిచ్చిలో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్ని జరిగినా ఎవరిలో మార్పు రావడం లేదు. ప్రకృతి అందాలు తిలకించేందుకు వచ్చి సెల్ఫీ తీసుకుంటున్న ఓ యువకుడు నీటి గుంతలో మృతిచెందాడు. ఈ సంఘటన బెంగళూరు సమీపంలోని చిక్కళ్లాపుర వద్దనున్న నందికొండలో చోటుచేసుకుంది. వివరాలివి.. బెంగళూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు యువకులు మూడు బైక్‌లపై బుధవారం ఉదయం నందికొండకు వచ్చారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో దేవనహళ్లి తాలూకా మాళిగేనహళ్లి వద్దకు చేరుకున్నారు. అక్కడ నీటి గుంత పక్కనే ఉన్న ఎత్తైన బండరాయిని చూసి సెల్ఫీల కోసం ఆగారు. ఆరుగురు బండరాయిపై సెల్ఫీలు దిగుతుండగా బెంగళూరు లగ్గెరెకు చెందిన హర్షణ్(19) నీటి గుంతలో ఈతకొడుతూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. గుంత లోతుగా ఉండడంతో అతను నీట మునిగి ఉక్కిరిబిక్కిరై మరణించాడు. సెల్ఫీ ఆనందంలో ఉన్న మిగతా స్నేహితులు హర్షణ్ను గమనించలేదు. విషయం గ్రహించసరికి అతడు విగతజీవుడయ్యాడు. మృతదేహాన్ని దేవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న విశ్వనాథపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఇటీవల సెల్ఫీల మోజులో ప్రమాదాలకు గురై దాదాపుగా ఏడుగురు మరణించారు. -
చెన్నై బుల్లెట్ రైలుకు చైనా బ్రేక్ వేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారతంలో తొలి బుల్లెట్ రైలు (హైస్పీడ్ రైలు) కల కలగానే ఉండిపోనుందా.. చెన్నై నుంచి బెంగళూరుకు హైస్పీడ్ రైలు మార్గం పనులు దాదాపు పడకేసినట్లేనా అంటూ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం అవుననుకోక తప్పదేమో. ఎందుకంటే చైనా సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్ సిద్ధం కాగా.. గత ఏడాది కిందటే సర్వే పూర్తి చేసిన చైనా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదని అధికారులు చెబుతున్నారు. భారత్, చైనాకు మధ్య డోక్లామ్ వివాదం నెలకొన్ని నేపథ్యంలోనే చైనా ఈ ప్రాజెక్టు విషయంలో మిన్నకుండా పోయినట్లు సమాచారం. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య మొత్తం 492 కిలో మీటర్ల హైస్పీడ్ రైలు సర్వీసును ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రాజెక్టు అధ్యయనం 2014లో ప్రారంభించగా 2016లో దానికి సంబంధించిన నివేదికను కూడా ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయం కూడా చైనానే భరించనున్నట్లు తెలిపింది. అయితే, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన చైనా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదంట. దీంతో ఈ ప్రాజెక్టుకు ముందుకు వెళుతుందో లేదో.. అసలు మొదలవుతుందో ఆగిపోతుందో తెలియడం లేదని అధికారులు అంటున్నారు. -
బెంగళూరులో మహిళకు భయానక అనుభవం
-
బెంగళూరులో షాకింగ్ సంఘటన.. చావు అంచుకు..
బెంగళూరు : విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైనే పోటెత్తుతున్న వరదలు బెంగళూరు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం నాటి వర్షం కారణంగా ఐదుగురు ప్రాణాలుకోల్పోగా పలువురు దాని ప్రభావాన్ని స్వయంగా ఎదర్కొంటున్నారు. ముఖ్యంగా ఓ మహిళ దాదాపు చావు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చింది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా పరిమళించిన మానవత్వం ఆమె ప్రాణాలు నిలబెట్టింది. వరదల్లో ఆమె కారు కొట్టుకుపోతుండగా ధైర్యంగా కొంతమంది వ్యక్తులు తెగించి ఆమెను కారులో నుంచి బయటకు తీసి రక్షించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం బెంగళూరులోని నయందహళ్లి అనే చౌరస్తాలో అనుకోకుండా ఓ మహిళ రోడ్డుపై నిలిచిన వరదలో చిక్కుపోయింది. కారును సైతం ఆ వరద నీరు నెట్టేస్తుంది. ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు.. అలాగని వెనక్కి రాలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ కార్లోనే రోధిస్తుండగా అది చూసిన కొంతమంది వ్యక్తులు, ట్రాఫిక్ పోలీసులు తాడుసాయంతో తమ ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించారు. -
పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు
శృంగవరపుకోట రూరల్: ప్రేమించి... పెళ్లి చేసుకుని ఆనక ముఖం చాటేసి... మరో వివాహానికి సిద్ధపడుతున్నాడంటూ విజయనగరం జిల్లా కొట్టాం గ్రామానికి చెందిన బొడబళ్ల సతీష్ ఇంటి ఎదుట బెంగళూరుకు చెందిన కుమారి అనాంబ బుధవారం ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన తాను హైదరాబాద్‌లో ఓ ఎన్జీవో సంస్థలో ఉద్యోగం చేస్తూ మెహదీపట్నంలో ఉండేదాన్నని తెలిపారు. మూడున్నరేళ్ల క్రితం ఏపీఎస్పీ హెడ్‌కానిస్టేబుల్ బొడబళ్ల సతీష్ తనను పరిచయం చేసుకుని ప్రేమించి హైదరాబాద్‌లోని శివాజీ ఆలయంలో 2015 సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన పెళ్లాడినట్టు తెలిపింది. తరువాత తనను వదిలేసి తప్పించుకు తిరుగుతున్నాడని, మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుండటంతో నిలదీసేందుకే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. సతీష్ కారణంగా తాను రెండుసార్లు గర్భం దాల్చగా అబార్షన్లు చేయించాడని వాపోయింది. తాను సతీష్ భార్యగానే ఓటరు ఐడెంటిటీ కార్డు కూడా ఉందనీ, హైదరాబాద్ నుంచి సతీష్ నాలుగు నెలల కిందట కాకినాడ బెటాలియన్‌కు బదిలీ చేసుకుని వచ్చి, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధపడుతున్నాడని ఆరోపించింది. తనను చంపేసినా సరే కదిలేది లేదని ఆ ఇంటిముందు దీక్షకు దిగింది. కాగా తన కుమారుడినుంచి డబ్బు గుంజేందుకు ఈమె నాటకం ఆడుతోందని సతష్ తల్లి బొడబళ్ల రామాయమ్మ ఆరోపిస్తున్నారు. కాగా సతీష్‌ను ఫోన్లో సంప్రదించగా కుమారి అనాంబతో తనకు హైదరాబాద్‌లో పరిచయం ఉందనీ, అనాథ అని తెలిసి పెళ్లి చేసుకుందామనుకున్నాననీ, కానీ ఆమెకు ఇదివరకే వివాహం అయినట్టు తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నానని తెలిపారు. -
ఆ సిటీలో ఇంకా అంధ విశ్వాసాలు..
సాక్షి, బెంగళూరు: ఇది డిజిటల్ యుగం. అంతరిక్షంలో సుదూర తీరాలకు రాకెట్లను పంపి రహస్యాలను ఛేదించే దిశగా నేటి మానవుడు సాగుతున్నాడు. వైద్య రంగంలో అద్భుతాలనుసృష్టిస్తున్నాడు. ఇక ఐటీ సిటీ బెంగళూరు కూడా అంతర్జాతీయ స్థాయి ఐటీ–బీటీ హబ్‌గా, టెక్నాలజీ రాజధానిగా వెలుగొందుతోంది. ఇలాంటి నగరంలో కూడా క్షుద్ర ప్రయోగాలు, చేతబడులను నమ్మేవారున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎంతో విద్యావంతులు కూడా ఇలాంటి వాటిని నమ్ముతున్నారన్న విషయం నగరంలోని పీపుల్స్ ట్రీ మార్గ్ అనే మానసికవైద్యాలయం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మంగళవారం అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిటీలో ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో ఏం చెప్పారు? సర్వే కోసం నగరంలో దాదాపు 500 మంది నుంచి సమాచారం రాబట్టారు. క్షుద్రపూజలు, చేతబడుల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మీరు నమ్ముతున్నారా? అనే ప్రశ్నను అడిగారు. దాదాపు 40 శాతం మంది తాము నమ్ముతున్నామని సమాధానమిచ్చారు. క్షుద్రపూజలు, చేతబడుల వంటి కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతామని నమ్ముతున్నట్లు చెప్పారు. అందుకే తాము తరచుగా ఆలయాలకు వెళ్లడం ద్వారా ఇలాంటి వాటి ప్రభావం తమపై పడకుండా చూసుకుంటూ ఉంటామని సమాధానమిచ్చారు. మరో 30 శాతం మంది ఈ విషయంపై తమకు ఏమాత్రం అవగాహన లేదని, అందువల్ల సమాధానం చెప్పలేమని అన్నారు. మరో 30 శాతం మంది మానసిక సమస్యలనేవి ఒత్తిడి కారణంగా మనిషిలో తలెత్తే సమస్యలు మాత్రమేనని పేర్కొన్నారు. వంశపారంపర్యంగా కూడా కొన్ని మానసిక సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలా ఆలోచించడం దురదృష్టకరం - డాక్టర్ సతీష్ రామయ్య కాగా, ఈ సర్వేపై సీనియర్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ సతీష్ రామయ్య మాట్లాడుతూ.....‘ఈ సర్వే ద్వారా ఇప్పటికీ విద్యావంతులైన వారు కూడా ఇలాంటి మూఢాచారాలను నమ్ముతున్నారని తెలిసింది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి నమ్మకాలున్నాయంటే నిరక్షరాస్యత, పేదరికం కారణంగా అని అనుకోవచ్చు. కానీ, బెంగళూరు లాంటి మెట్రో నగరంలోని ప్రజల ఆలోచనా తీరు కూడా అలానే ఉందంటే దీనిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. ప్రజల్లో పాతుకుపోయిన ఇలాంటి భావాలను తొలగించేందుకు స్వచ్ఛంద సంస్థలే కాదు ప్రభుత్వం కూడా శ్రమించాలి’ అని తెలిపారు.