వీసీఏ, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ (ఇన్‌సెట్) బొనార్
అనంతపురం సప్తగిరి సర్కిల్: న్యూజిలాండ్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో వివేకానంద క్రికెట్ అకాడమీ(వీసీఏ) బెంగుళూరు, న్యూజిలాండ్ హట్‌హాక్స్ జట్లు తలపడ్డాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్‌మెన్ బొనర్ 58 బంతుల్లో 13 ఫోర్లతో 85 పరుగులు సాధించి జట్టు విజయానికి కారకుడయ్యారు. న్యూజిలాండ్ జట్టులో అనంత క్రీడాకారులు ప్రశాంత్, లోహిత్‌సాయి, ప్రదీప్, దీపక్ రాణించారు.
మ్యాచ్ వివరాలు ఇలా..
తొలి టీ–20 మ్యాచ్‌లో వీసీఏ, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. జట్టులో బొనార్ 85 పరుగులు చేసాడు. గ్రీన్‌వుడ్ 30, హార్డింగ్ 25 పరుగులు సాధించారు. వీసీఏ బౌలర్లలో పరుల్, రోనిత్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బరిలోకి దిగిన వీసీఏ జట్టు క్రీడాకారులు న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత 20 ఓవర్లలో 73 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. జట్టులో అరవింద్ 15 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో హార్డింగ్ 3, ప్రదీప్. రోహిత్ చెరో వికెట్ సాధించారు. కాగా, నేడు ఆర్డీటీ సీబీఆర్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment