T 20 match
-
ఫైనల్ పంచ్ ఎవరిదబ్బా ..?
-
హైదరాబాద్ లో టీ ట్వంటీ ఫీవర్
-
వయసు పెరిగినా పదును మాత్రం తగ్గలేదు
రాయ్‌పూర్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమి లేదు. సమకాలీ క్రికెట్లో బ్యాటింగ్ లెజెండ్‌గా ముద్రించుకున్న సచిన్ అంతర్జాతీయ కెరీర్లో బ్యాటింగ్‌లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. 463 వన్డేల్లో 18426 పరుగులు.. 200 టెస్టుల్లో 15921 పరుగులు.. వన్డే, టెస్టులు కలిపి వంద సెంచరీలు( వన్డేల్లో 49, టెస్టుల్లో 51).. ఇంకా అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా సచిన్ ఇండియన్ లెజెండ్స్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఆ జట్టులో సెహ్వాగ్, యువరాజ్, కైఫ్, ఇర్ఫన్ పఠాన్, ఓజా తదితర ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తన మార్క్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. సెహ్వాగ్ మాస్ ఇన్నింగ్స్ దాటికి సచిన్ ఇన్నింగ్స్ పక్కన పెట్టాల్సి వచ్చింది కానీ.. సచిన్ ఇన్నింగ్స్‌లో కొన్ని క్లాసిక్ షాట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సచిన్ చేసింది 33 పరుగులే అయినా.. అతను కొట్టిన 5 బౌండరీలు ఒక్కో కళాత్మక షాట్‌గా పరిగణించవచ్చు. బ్యాటింగ్ టెక్నిక్‌లో అదే స్టైల్ మెయింటేన్ చేయడం సచిన్‌కు మాత్రమే సాధ్యమైంది. వయసు పెరిగినా బ్యాటింగ్‌లో పదును మాత్రం తగ్గలేదని నిరూపించాడు. అంతేగాక ఓపెనింగ్ జోడిలో సచిన్, సెహ్వాగ్ తామెంత బెస్ట్ అనేది మరోసారి నిజం చేశాఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాట్స్మెన్లలో నిజాముద్దీన్ 49 మినహా ఎవరు ఇండియా లెజెండ్స్ బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు. ఇక ఇండియన్ లెజెండ్స్ బౌలింగ్‌లో వినయ్ కుమార్, ప్రగ్యాన్ ఓజా, యువరాజ్లు తలా 2 వికెట్లు తీయగా..మన్‌ప్రీత్ గోని, యూసఫ్ పఠాన్ చెరొక వికెట్ తీశారు. 110 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ సెహ్వాగ్ మెరుపులతో 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. చదవండి: వీరు విధ్వంసం.. 35 బంతుల్లో 80 పరుగులు -
జోరు కొనసాగాలి...
మైదానం ఎలాంటిదైనా, బౌండరీలు ఎంత చిన్నవైనా టి20ల్లో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువు కాదు. అయితే భారత జట్టు దానిని అలవోకగా చేసి చూపించింది. సొంత మైదానంలో ప్రత్యర్థి ముందు భారీ స్కోరు చేశామనే ఆనందం కివీస్‌కు తొలి మ్యాచ్‌లో మిగల్లేదు. ఛేజింగ్‌లో కోహ్లి సేన సత్తా ఏమిటో అందరికీ అర్థమైంది. బ్యాటింగ్‌లో భారత్, న్యూజిలాండ్ సమ ఉజ్జీలుగా కనిపించినా మన పదునైన బౌలింగ్ ఇరు జట్ల మధ్య ప్రధాన తేడాగా కనిపించింది. ఇప్పుడు అదే బలంతో టీమిండియా మరో విజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది. అదే ఈడెన్ పార్క్ గ్రౌండ్లో రెండో మ్యాచ్‌లోనైనా కివీస్ పోటీనిస్తుందా చూడాలి. ఆక్లాండ్: భారత జట్టు ఇటీవల ఫామ్ న్యూజిలాండ్ పర్యటనలో తొలి టి20లో కనిపించింది. ఎంతటి భారీ స్కోరునైనా ఛేదించగలమని నిరూపిస్తూ మన జట్టు విజయంతో సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ జరిగిన మైదానంలో భారత్, న్యూజిలాండ్ నేడు రెండో టి20లో తలపడనున్నాయి. మళ్లీ మ్యా చ్ గెలిస్తే సిరీస్‌లో టీమిండియాకు తిరుగుండకపోవచ్చు. ఒక మార్పుతో... అద్భుత విజయం అందుకున్న తుది జట్టులో తుది సాధారణంగా మార్పులు చేయడానికి కెపె్టన్ కోహ్లి ఇష్ట పడడు. అయితే గత మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్ శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా నవదీప్ సైనీకి అవకాశం దక్కవచ్చు. ఇది మినహా మరో మార్పు లేకుండా జట్టు బరిలోకి దిగనుంది. తొలి టి20లో రోహిత్ విఫలమైనా అతని స్థాయి ఇన్నింగ్స్ ఆడేందుకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. రాహుల్ గురించి ఇటీవల ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ క్రికెట్లో అతని నిలకడైన ప్రదర్శన భారత్ విజయాల్లో కీలకంగా మారింది. ఎప్పటిలాగే కోహ్లి కూడా తనదైన శైలిలో చెలరేగిపోగలడు. అయితే తొలి టి20లో చెప్పుకోదగ్గ అంశం శ్రేయస్ అయ్యర్ దూకుడైన బ్యాటింగ్. ఇప్పుడిప్పుడే టీమ్‌లో కుదురుకుంటున్న అతను చక్కటి ఇన్నింగ్స్‌తో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. అదే జోరు అతను మళ్లీ కొనసాగించాల్సి ఉంది. శివమ్ దూబే ఆల్‌రౌండర్‌గా తన విలువ చూపించగా, జడేజా కూడా ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ దూసుకుపోతున్న సమయంలో నేనున్నానంటూ చివరి రెండు ఓవర్లలో అతను కివీస్‌ను కట్టడి చేసిన తీరు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసింది. సీనియర్ షమీ తన బౌలింగ్‌పై మరింత నియంత్రణ ఉంచాల్సి ఉంది. మొత్తంగా చూస్తే మరోసారి భారత్‌దే ఆధిపత్యం కనిపిస్తోంది. కివీస్ కోలుకునేనా... తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన తర్వాత కూడా ఓడిపోవడం న్యూజిలాండ్‌ను నిరాశపర్చింది. అయితే ఈ పరాజయానికి జట్టులో ఏ ఒక్కరూ బాధ్యులు కాదు కాబట్టి మార్పుల్లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోసారి ఓపెనర్లు మన్రో, గప్టిల్లనుంచి కివీస్ శుభారంభం ఆశిస్తోంది. అయితే ఈడెన్ పార్క్ బౌండరీ పరిమితుల దృష్ట్యా వీరిద్దరు దాదాపు 200 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తే గానీ సరిపోయేలా లేదు. విలియమ్సన్ మాత్రం అదే స్థాయిలో బ్యాటింగ్ ప్రదర్శనతో తన సత్తా చూపించాడు.తొలి మ్యాచ్‌లో విఫలమైన గ్రాండ్హోమ్నుంచి టీమ్ మెరుగైన ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన టేలర్‌పై మళ్లీ కీలక బాధ్యత ఉంది. గాయాల కారణంగా సీనియర్లు సిరీస్‌కు దూరం కావడంతో శుక్రవారం కివీస్ బౌలింగ్ గత మ్యాచ్‌లో బాగా బలహీనంగా కనిపించింది. బెన్నెట్, టిక్నర్ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. అనుభవజు్ఞడైన సౌతీ, సాన్‌ట్నర్ రాణించడం కూడా కీలకం. -
టెస్టుల సంగతి తర్వాత చూద్దాం!
ఢాకా: పూర్తి స్థాయి పర్యటన కోసం రావాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యర్థనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సున్నితంగా తిరస్కరించింది. ముందు మూడు టి20లు ఆడేందుకు అంగీకరించిన బంగ్లా... టెస్టులు ఆడే విషయమై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ముందు అయితే పొట్టి మ్యాచ్‌లు ఆడిన తర్వాతే టెస్టుల సంగతి చూద్దామని చెప్పింది. ‘పాకిస్తాన్ తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. అయితే మేం మాత్రం మా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది సూచనల ప్రకారం నడుచుకుంటాం. మా జట్టు మేనేజ్మెంట్లో చాలా మంది విదేశీయులున్నారు. కాబట్టి ఇక్కడ వారి అభిప్రాయాలను పరిశీలించాల్సిందే’ అని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ నిజాముద్దీన్ చౌదరి చెప్పారు. మా ప్రాథమిక ప్రతిపాదన మేరకు ముందు టి20లు ఆడతాం. పరిస్థితుల్ని బట్టి టెస్టులపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇటీవల శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించి రెండు టెస్టుల సిరీస్‌లో ఆడింది. దీంతో పదేళ్ల తర్వాత పాక్‌గడ్డపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. -
టెస్టుల్లో నా ముద్ర చూపించాలనుకున్నా!
ముంబై: టి20 స్పెషలిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత వన్డేల్లోనూ జస్ప్రీత్ బుమ్రా భారత కీలక బౌలర్‌గా ఎదిగాడు. అయితే టెస్టుల్లో అతను రాణించడంపై అందరికీ సందేహాలు ఉండేవి. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తొలిసారి ఎంపిక చేసినప్పుడు కూడా వెంటనే తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చని చాలా మంది భావించారు. కానీ కేప్‌టౌన్ టెస్టుతో అరంగేట్రం చేసిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు దేశాల్లో కూడా ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న బుమ్రా తన కెరీర్ ఆరంభంలో టెస్టులే తొలి ప్రాధాన్యతగా భావించేవాడినని చెప్పాడు. ‘కేవలం టి20లు, వన్డేలు మాత్రమే ఆడిన క్రికెటర్‌గా నేను మిగిలిపోదల్చుకోలేదు. నా దృష్టిలో టెస్టులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. టెస్టులు ఆడటం మాత్రమే కాదు, నాదైన ముద్ర చూపించాలని బలంగా భావించేవాడిని. నా ఫస్ట్‌క్లాస్ స్థాయి ప్రదర్శనను టెస్టుల్లో కూడా చూపగలనని నాపై నాకు నమ్మకముండేది. రెండేళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత సఫారీ గడ్డపై తొలి టెస్టు ఆడినప్పుడు నా కల నిజమైనట్లు అనిపించింది’ అని బుమ్రా చెప్పాడు. ఇప్పటి వరకు 12 టెస్టులే ఆడిన బుమ్రా 62 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి జరిగే టెస్టు సిరీస్‌తో బుమ్రా తొలిసారి సొంతగడ్డపై బరిలోకి దిగబోతున్నాడు. ‘భారత్‌లో టెస్టులు ఆడటం ఒక కొత్త సవాల్‌వంటిది. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. సుదీర్ఘ కాలం రంజీ ట్రోఫీతో పాటు ఇతర టోరీ్నల్లో ఎర్రబంతితో క్రికెట్ ఆడాను కాబట్టి నాకు పిచ్‌లు, పరిస్థితులు కొత్త కాదు’ అని బుమ్రా విశ్లేషించాడు. ప్రముఖ మద్యం ఉత్పత్తి సంస్థ ‘రాయల్ స్టాగ్’కు బుమ్రా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. -
టి20లో కివీస్‌దే గెలుపు
ఆక్లాండ్: శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. డగ్ బ్రేస్‌వెల్ (26 బంతుల్లో 44; ఫోర్, 5 సిక్స్‌లు), స్కాట్ కుగ్లెజిన్ (15 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. తిసారా పెరీరా (24 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ (3/21), ఇష్ సోధి (3/30) మూడేసి వికెట్లు పడగొట్టారు. -
బాదలేకపోయారు
...టీమిండియా బోల్తా పడింది! బౌలింగ్‌లో నియంత్రణ లేక... ఫీల్డింగ్‌లో బంతిని పట్టలేక... బ్యాటింగ్‌లో హిట్టింగూ చేయలేక... ఆస్ట్రేలియా గడ్డపై పెద్ద మైదానాల్లో టి20 మ్యాచ్ సంక్లిష్టతలను అధిగమించలేక... ఓటమి పాలైంది. వీటన్నిటిని సరిగ్గా చేసిన కంగారూ జట్టు విజయాన్నందుకుంది. స్వయంకృతానికి తోడు వర్షం కూడా విరాట్ కోహ్లి సేనను కొంత దెబ్బతీసింది. ఆడిన ఓవర్ల మేరకు ప్రత్యర్థి కంటే ఎక్కువ స్కోరే చేసినా, డక్‌వర్త్ లూయీస్ నిబంధన ముందు నెగ్గడానికి అది సరిపోలేదు. ఫలితం... ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత్‌కు ఆసీస్ చేతిలో అనూహ్య పరాజయం. బ్రిస్బేన్: 6 బంతుల్లో 13 పరుగులు. చివరి ఓవర్లో టీమిండియా విజయ సమీకరణం ఇది. క్రీజులో ‘నిదహాస్ ట్రోఫీ’ ఫైనల్ ఆఖరి బంతి సిక్స్ వీరుడు దినేశ్ కార్తీక్ (13 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్)... ‘ఐపీఎల్ హిట్టర్’ కృనాల్ పాండ్యా (4 బంతుల్లో 2)... మీడియం పేసర్ మార్కస్ స్టొయినిస్ బౌలింగ్. సాధారణంగా ఇవే పరిస్థితులు భారత్‌లో ఉంటే మన జట్టు గెలుపు నల్లేరుపై నడకే. కానీ, ఆస్ట్రేలియాలో ఈ పప్పులుడకలేదు. కార్తీక్, కృనాల్ షాట్లకు బంతి స్టాండ్స్‌లోకి కాకుండా ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కోహ్లి సేన లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1–0తో ముందంజ వేసింది. రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (24 బంతుల్లో 46; 4 సిక్స్‌లు), స్టొయినిస్ (19 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్); క్రిస్ లిన్ (20 బంతుల్లో 37; ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కుల్దీప్ యాదవ్ (2/24) రెండు వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా గంట సమయం కోల్పోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను, మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. అనంతరం డక్‌వర్త్ లూయీ స్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 174 పరుగులుగా నిర్దేశించారు. ఓపెనర్ ధావన్ (42 బంతుల్లో 76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా... దినేశ్ కార్తీక్, పంత్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) దూకుడు చూపినా... ఫినిషింగ్ లోపంతో టీమిం డియా మ్యాచ్‌ను చేజార్చుకుంది. స్పిన్నర్ ఆడమ్ జంపా (2/22)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రెండో టి20 శుక్రవారం మెల్బోర్న్లో జరుగనుంది. ఆ ముగ్గురు... తొలి ఐదు ఓవర్లు సాధారణంగా, తర్వాతి ఐదు ఓవర్లు కొంత వేగంగా, ఆట సాగిన మిగతా ఓవర్లు రాకెట్లా దూసుకెళ్లింది ఆసీస్ స్కోరు. ఓపెనర్లలో షార్ట్ (7)ను బౌలింగ్‌కు దిగుతూనే ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. కోహ్లి క్యాచ్ వదిలేయడంతో లైఫ్ దక్కిన కెప్టెన్ ఫించ్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు)... లిన్‌తో కలిసి స్కోరును నడిపించాడు. ఖలీల్ బౌలింగ్‌లో విజృంభించిన లిన్ మూడు సిక్స్‌లు కొట్టాడు. అయితే, కుల్దీప్ వీరిద్దరినీ వరుస ఓవర్లలో పెవిలియన్ పంపి ఊరటనిచ్చాడు. జట్టు స్కోరు 75/3తో ఉన్న దశలో జత కలిసిన మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ పరిస్థితిని మార్చేశారు. ఖలీల్, కృనాల్‌లను లక్ష్యంగా చేసుకుని చెలరేగారు. మ్యాక్స్‌వెల్ హ్యాట్రిక్ సిక్స్‌లతో కృనాల్‌కు చుక్కలు చూపాడు. వీరి ధాటికి అతడు రెండు ఓవర్లలోనే 40 పరుగులిచ్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 16.1 ఓవర్ వద్ద ఉండగా వర్షం మొదలైంది. విరామం తర్వాత తొలి బంతికే మ్యాక్స్‌వెల్‌ను బుమ్రా ఔట్ చేశాడు. మిగిలిన నాలుగు బంతుల్లో ప్రత్యర్థి ఐదు పరుగులు చేసింది. ఈ ముగ్గురు... ఓవర్‌కు పదికి పైగా రన్‌రేట్‌తో ఛేదనకు దిగిన భారత్‌కు బౌండరీల మీద బౌండరీలు బాదుతూ ధావన్ శుభారంభం ఇచ్చాడు. మరోవైపు స్వేచ్ఛగా ఆడలేక రోహిత్ శర్మ (8 బంతుల్లో 7) వికెట్ ఇచ్చేశాడు. అయినా, జోరు తగ్గించని ధావన్ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తూ 28 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. అవతలి ఎండ్‌లో పదేపదే జంపాపై ఆధిపత్యానికి యత్నించిన కేఎల్ రాహుల్ (12 బంతుల్లో 13; ఫోర్) స్టంపౌటయ్యాడు. జంపా... కోహ్లి (8 బంతుల్లో 4)ని సైతం పరీక్షకు గురిచేశాడు. రన్‌రేట్ పెరిగిపోతుండటంతో ముందుకొచ్చి ఆడబోయిన కెప్టెన్ షాట్ గురితప్పి క్యాచ్ ఇచ్చాడు. స్టాన్లేక్ వేసిన బౌన్సర్‌ను అద్భుత రీతిలో థర్డ్‌మ్యాన్ దిశగా పంపిన ధావన్... బౌండరీ లైన్ ముందు దొరికిపోవడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది. రిషభ్ పంత్, కార్తీక్ జత కలిసే సమయానికి లక్ష్యం 32 బంతుల్లో 68. ఆండ్రూ టై ఓవర్లో చెరో ఫోర్, సిక్స్ బాది 25 పరుగులు పిండుకుని ఈ సవాల్‌ను వారు అధిగమిం చేలానే కనిపించారు. అయితే, 10 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన స్థితిలో పంత్ స్కూప్ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. చివరి ఓవర్లో భారత్ 13 పరుగులు చేయలేక పోయింది. టి20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ధావన్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది ధావన్ 16 మ్యాచ్‌ల్లో 646 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి (2016లో 15 మ్యాచ్‌ల్లో 641 పరుగులు) పేరిట ఉన్న రికార్డును ధావన్ అధిగమించాడు. ‘మ్యాక్సీ’మమ్... ఆసీస్ బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్ ఆటే హైలైట్. తన సిక్స్‌లు పాత మ్యాక్స్‌వెల్‌ను గుర్తుకు తెచ్చాయి. అంతేగాక, 16వ ఓవర్లో అతడు కొట్టిన షాట్ మైదానంలో తిరిగే స్పైడర్ కెమెరాను తాకడం విశేషం. కార్తీక్ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద పట్టుకునేందుకు మ్యాక్స్‌వెల్ చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. అయ్యో కృనాల్... ►ఐపీఎల్లో ముంబై తరఫున కీలక ఇన్నింగ్స్‌లతో ఆల్‌రౌండర్‌గా టీమిండియాలోకి వచ్చిన కృనాల్ పాండ్యాకు ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకమే. బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ ధాటికి ఆరు సిక్స్‌లు సహా ఏకంగా 55 పరుగులిచ్చిన అత డు... జట్టును గెలిపించాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చి ఏమీ చేయలేకపోయాడు. దీంతోపాటు టి20ల్లో చహల్ (64), జోగిందర్ శర్మ (57) తర్వాత అత్యధిక పరుగులిచ్చిన భారత బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ పొరపాట్లే ఓడించాయి... ► బ్రిస్బేన్ మ్యాచ్‌లో టీమిండియాను పలు పొరపాట్లు పరాజయం పాలు చేశాయి. అవేం టంటే... ఆఖరి ఓవర్ తొలి బంతికి కృనాల్ 2 పరుగులు తీయకుండా సింగిల్‌తో సరిపెట్టుకుంటే దినేశ్ కార్తీక్‌కు స్ట్రయికింగ్ వచ్చేది. ఊపులో ఉన్న కార్తీక్ ముగించగలిగేవాడు. ► గెలుపు అవకాశాలు సమంగా ఉన్న దశలో పంత్... స్కూప్ షాట్‌కు యత్నించి వికెట్ పారేసుకున్నాడు. అతడు ఉండుంటే స్టొయినిస్ ఓవర్‌ను ఎదుర్కొనడం సులువయ్యేది. ► డెత్ ఓవర్లను చాలా పొదుపుగా వేసే బుమ్రా, భువీ చివరి కోటాకు దిగాల్సి ఉండగా వర్షం మొదలైంది. అంతకుముందు కృనాల్, ఖలీల్ ఓవర్లలో ఆసీస్ చేసిన పరుగులే వారి స్కోరును పైకి తీసుకెళ్లాయి. ► ఫించ్ ఆరు పరుగుల వద్ద ఉండగా ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కోహ్లి జారవిడిచాడు. ఖలీల్ బౌలింగ్‌లో కోహ్లి మిస్ ఫీల్డింగ్ కారణంగా ప్రత్యర్థికి 3 పరుగులు వచ్చాయి. ► 17వ ఓవర్ తొలి బంతికి స్టొయినిస్ క్యాచ్‌ను థర్డ్‌మ్యాన్‌లో ఖలీల్ వదిలేశాడు. ఆ వెంటనే వర్షం మొదలైంది. అప్పటికి స్టొయినిస్ ఔటై ఉంటే ‘డక్‌వర్త్’ సమీకరణం కొంతైనా మారేది. -
తొలి టి20లో ఇండియా ఘన విజయం
-
రీఎంట్రీపై అఫ్రిది స్పందన
-
రీఎంట్రీపై అఫ్రిది ఏమన్నాడంటే ?
లార్డ్స్ : అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసే ఉద్దేశమే లేదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పష్టం చేశాడు. గురువారం ఐసీసీ నిర్వహించిన చారిటీ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుకు అఫ్రిది సారథ్యం వహించాడు. కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో హడావిడి చేసిన కామెంటేటర్ నాసర్ హుస్సెన్ అఫ్రిదిని ‘అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసే ఆలోచనలో ఉన్నారా?’ అని ప్రశ్నించాడు. దీనికి అఫ్రిదీ ‘అలాంటిదేం లేదు, నా పరిస్థితి చూడు గాయాలతో ఎలా ఉన్నానో అని నవ్వుతూ బదులిచ్చాడు’. మరిచిపోలేని ఘటన.. ఈ మ్యాచ్‌తో అఫ్రిదికి జీవితంలో మరిచిపోలేని ఘటన ఎదురైంది. ఆటగాళ్ల నుంచి సముచిత గౌరవం లభించింది. మ్యాచ్ ప్రారంభం ముందు వరల్డ్ ఎలెవన్ ఆటగాళ్లు చప్పట్లతో అఫ్రిదికి స్వాగతం పలికారు. దీనిపై ఈ 38 ఏళ్ల ఆటగాడు సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇది చాలా ప్రత్యేకం. నా జీవితంలో మరిచిపోలేను. క్రికెట్ కుటుంబంలో జరిగింది. అద్భుతం. సాయం చేయడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు. అఫ్రిది 20,000 యూఎస్ డాలర్లను హరికేన్ రిలీఫ్ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించాడు. ఇక ఆటగాళ్లంతా తమ ఫీజును డొనేట్ చేశారు. లార్డ్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుపై 72 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. చదవండి : 72 పరుగులతో వెస్టిండీస్ భారీ విజయం! -
72 పరుగులతో వెస్టిండీస్ భారీ విజయం!
లండన్ : ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుపై 72 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. హరికేన్ కారణంగా దెబ్బతిన్న మైదానాల పునరుద్ధరణకు నిధులు సేకరించే నిమిత్తం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఈ చారిటీ టీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేశారు. చెలరేగి ఆడిన ఎవిన్ లెవిస్ 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు. షాహిద్ ఆఫ్రిదీ నేతృత్వంలో బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టు.. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలపడింది. ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. థిసరా పేరారా ఒక్కడే రాణించి 61 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో 127 పరుగులకు వరల్డ్ ఎలెవన్ చాప చుట్టేసింది. దీంతో టీ-20 చాంపియన్స్ వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. అద్భుతంగా రాణించిన ఎవిన్ లెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. -
జోరు మనదే
154 స్కోరుకు, 159 స్కోరుకు మధ్య తేడా ఐదు పరుగులే! కానీ వికెట్ల పతనం డబుల్ అయింది. ఈ డబుల్ ధమాకా భువనేశ్వర్‌ది. మొదటి స్కోరు వద్ద నాలుగు వికెట్లతో ఉన్న సఫారీ జట్టు రెండో స్కోరుకల్లా మరో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. అంతలా... భువీ దెబ్బతీశాడు. కాదు కాదు... దెబ్బ మీద దెబ్బ తీశాడు. వన్డేల్లో ఆధిపత్యాన్ని కొనసాగించిన కోహ్లి సేన... తాజాగా టి20ల్లోనూ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జొహన్నెస్‌బర్గ్: ధావన్ ధనాధన్ పరుగులు, భువనేశ్వర్ ఫటాఫట్ వికెట్లు సఫారీని కుదిపేశాయి. శిఖర్ ఇన్నింగ్స్ భారీ స్కోరుకు బాట వేస్తే, భువీ బౌలింగ్ ప్రత్యర్థిని ఉన్నపళంగా కూల్చేసింది. పటిష్టస్థితి నుంచి పరాజయానికి పడేసింది. దీంతో తొలి టి20లో భారత్ 28 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీస్కోరు చేసింది. ధావన్ (39 బంతుల్లో 72; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్డ్రిక్స్ (50 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (5/24) నిప్పులు చెరిగాడు. రెండో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. మోకాలి గాయంతో దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ ఈ సిరీస్‌కు దూరం కాగా... చేతి వేలి గాయంతో ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఆడలేదు. సిక్స్‌లతో మొదలైంది... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌కు సిక్సర్లతో శ్రీకారం చుట్టాడు రోహిత్ శర్మ. ప్యాటర్సన్ వేసిన తొలి ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అయితే ఇదెంతో సేపు సాగలేదు. మరుసటి ఓవర్లోనే రోహిత్ (9 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు ముగిశాయి. డాలా బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఏడాది తర్వాత బరిలోకి దిగిన రైనా (7 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలోనే నిష్క్రమించాడు. ఈ దశలో ధావన్, కోహ్లి జోరు కొనసాగించారు. షమ్సీ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ తొలిబంతికి లాంగాన్‌లో బెహర్దీన్ క్యాచ్ చేజార్చడంతో బతికిపోయిన కోహ్లి (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)... ఆ ఓవర్లో ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. అయితే షమ్సీ వేసిన మరుసటి ఓవర్లో భారత కెప్టెన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం మనీశ్ పాండే, ధోని, పాండ్యా రాణించడంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. రాణించిన హెన్డ్రిక్స్... కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ఓపెనర్ హెన్డ్రిక్స్ వెన్నెముకగా నిలిచాడు. టాపార్డర్ విఫలమైనా... బెహర్దీన్ (27 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి హెన్డ్రిక్స్ గట్టెక్కించే ప్రయత్నం చేసినా భువనేశ్వర్ దెబ్బకు సాధ్యపడలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) డాలా 21; ధావన్ (సి) క్లాసెన్ (బి) ఫెలుక్వాయో 72; రైనా (సి అండ్ బి) డాలా 15; కోహ్లి ఎల్బీడబ్ల్యూ (బి) షమ్సీ 26; పాండే (నాటౌట్) 29; ధోని (బి) మోరిస్ 16; పాండ్యా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–23, 2–49, 3–108, 4–155, 5–183. బౌలింగ్: ప్యాటర్సన్ 4–0–48–0, డాలా 4–0–47–2, మోరిస్ 4–0–39–1, షమ్సీ 4–0–37–1, స్మట్స్ 2–0–14–0, ఫెలుక్వాయో 2–0–16–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: స్మట్స్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 14; హెన్డ్రిక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 70; డుమిని (సి) రైనా (బి) భువనేశ్వర్ 3; మిల్లర్ (సి) ధావన్ (బి) పాండ్యా 9; బెహర్దీన్ (సి) పాండే (బి) చహల్ 39; క్లాసెన్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 16; ఫెలుక్వాయో (సి) చహల్ (బి) ఉనాద్కట్ 13; మోరిస్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 0; ప్యాటర్సన్ (రనౌట్) 1; డాలా (నాటౌట్) 2; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–29, 2–38, 3–48, 4–129, 5–154, 6–158, 7–158, 8–159, 9–175. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–24–5, ఉనాద్కట్ 4–0–33–1, బుమ్రా 4–0–32–0, హార్దిక్ పాండ్యా 4–0–45–1, యజువేంద్ర చహల్ 4–0–39–1. 5 భారత్ తరఫున టి20ల్లో 5 వికెట్లు తీసిన తొలి పేసర్ భువనేశ్వర్. 78 పవర్‌ప్లేలో టీమిండియా చేసిన పరుగులు. భారత్‌కిదే అత్యధికం. 203 దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన అత్యధిక స్కోరు. 1 కేవలం 8.2 ఓవర్లలోనే భారత్ 100 కొట్టడం ఇదే తొలిసారి. 12 పుష్కర కాలం క్రితం భారత్ తొలి అంతర్జాతీయ టి20 ఆడింది ఇక్కడే. అప్పటి జట్టులో ఆడినవారిలో ధోని, రైనా ఇప్పుడు ఆడారు. -
చెలరేగిన ‘కివీస్’
అనంతపురం సప్తగిరి సర్కిల్: న్యూజిలాండ్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో వివేకానంద క్రికెట్ అకాడమీ(వీసీఏ) బెంగుళూరు, న్యూజిలాండ్ హట్‌హాక్స్ జట్లు తలపడ్డాయి. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్‌మెన్ బొనర్ 58 బంతుల్లో 13 ఫోర్లతో 85 పరుగులు సాధించి జట్టు విజయానికి కారకుడయ్యారు. న్యూజిలాండ్ జట్టులో అనంత క్రీడాకారులు ప్రశాంత్, లోహిత్‌సాయి, ప్రదీప్, దీపక్ రాణించారు. మ్యాచ్ వివరాలు ఇలా.. తొలి టీ–20 మ్యాచ్‌లో వీసీఏ, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. జట్టులో బొనార్ 85 పరుగులు చేసాడు. గ్రీన్వుడ్ 30, హార్డింగ్ 25 పరుగులు సాధించారు. వీసీఏ బౌలర్లలో పరుల్, రోనిత్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బరిలోకి దిగిన వీసీఏ జట్టు క్రీడాకారులు న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తాళలేక నిర్ణీత 20 ఓవర్లలో 73 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. జట్టులో అరవింద్ 15 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో హార్డింగ్ 3, ప్రదీప్. రోహిత్ చెరో వికెట్ సాధించారు. కాగా, నేడు ఆర్డీటీ సీబీఆర్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. -
టి 20 ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్
పాకిస్థాన్‌కు చెందిన హషీమ్ అఖ్తర్ అనే ఓ టీనేజి క్రికెటర్ ఇంగ్లండ్‌లో టి 20 క్రికెట్ మ్యాచ్ ఆట మధ్యలో కుప్పకూలిపోయాడు. అతడికి బ్రెయిన్ హెమరేజ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆట కొనసాగుతుండగా మధ్యలో అఖ్తర్ కనిపించకపోవడంతో జట్టు సభ్యులు అతడి కోసం వెతకగా, టాయిలెట్లో కుప్పకూలి కనిపించాడు. అతడి మెదడులో రక్తం గడ్డకట్టడంతో దాన్ని తొలగించడానికి అత్యవసరంగా ఓ ఆపరేషన్ చేశారు. అయినా ఇంకా అతడి పరిస్థితి విషమంగానే ఉందని రాయల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతడిని వైద్యులు బలవంతంగా కోమాలోకి పంపి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్లీ బ్రిడ్జ్ సీసీ జట్టు తరఫున అతడు బ్రాడ్షా సీసీ జట్టుపై క్రికెట్ ఆడుతున్నాడు. తమ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రేక్ అనంతరం అందరూ కలిసి గ్రౌండ్ లోకి వెళ్దామనుకుంటే అతడు కనిపించలేదని జట్టు సభ్యులు తెలిపారు. తీరా చూస్తే టాయిలెట్లో పడిపోయాడని, అదృష్టవశాత్తు అవతలి జట్టు సభ్యులలో ఒకరి తండ్రి వైద్యుడు కావడంతో వెంటనే అతడిని చూసి, ఆస్పత్రికి తరలించాలని చెప్పారని అన్నారు. గతంలో అఖ్తర్‌కు మైగ్రేన్ ఉండేది. 13 ఏళ్ల వయసు నుంచి ఆస్ట్టీ బ్రిడ్జ్ జట్టు తరఫున అతడు ఆల్‌రౌండర్‌గా ఆడుతున్నాడు. అతడిని అప్పుడే కోమాలోంచి బయటకు తేలేమని వైద్యులు చెప్పారని అఖ్తర్ తల్లి చెప్పారు.