టి20లో కివీస్‌దే గెలుపు | New Zealand beat Sri Lanka by 35 runs | Sakshi
Sakshi News home page

టి20లో కివీస్‌దే గెలుపు

Published Sat, Jan 12 2019 2:15 AM | Last Updated on Sat, Jan 12 2019 2:15 AM

New Zealand beat Sri Lanka by 35 runs - Sakshi

ఆక్లాండ్‌: శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. డగ్‌ బ్రేస్‌వెల్‌ (26 బంతుల్లో 44; ఫోర్, 5 సిక్స్‌లు), స్కాట్‌ కుగ్లెజిన్‌ (15 బంతుల్లో 35 నాటౌట్‌; ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. తిసారా పెరీరా (24 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ (3/21), ఇష్‌ సోధి (3/30) మూడేసి వికెట్లు పడగొట్టారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement