ఢాకా: పూర్తి స్థాయి పర్యటన కోసం రావాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యర్థనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సున్నితంగా తిరస్కరించింది. ముందు మూడు టి20లు ఆడేందుకు అంగీకరించిన బంగ్లా... టెస్టులు ఆడే విషయమై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ముందు అయితే పొట్టి మ్యాచ్‌లు ఆడిన తర్వాతే టెస్టుల సంగతి చూద్దామని చెప్పింది. ‘పాకిస్తాన్ తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. అయితే మేం మాత్రం మా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది సూచనల ప్రకారం నడుచుకుంటాం. మా జట్టు మేనేజ్‌మెంట్‌లో చాలా మంది విదేశీయులున్నారు. కాబట్టి ఇక్కడ వారి అభిప్రాయాలను పరిశీలించాల్సిందే’ అని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ నిజాముద్దీన్ చౌదరి చెప్పారు. మా ప్రాథమిక ప్రతిపాదన మేరకు ముందు టి20లు ఆడతాం. పరిస్థితుల్ని బట్టి టెస్టులపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇటీవల శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించి రెండు టెస్టుల సిరీస్‌లో ఆడింది. దీంతో పదేళ్ల తర్వాత పాక్‌గడ్డపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment