Pakistan Cricket Board (PCB)
-
అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. బాబర్ ఆజం (Babar Azam) నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల్లో అద్వితీయ విజయాలు అందుకున్న రిజ్వాన్.. సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు.న్యూజిలాండ్- సౌతాఫ్రికాలతో వన్డే త్రైపాక్షిక సిరీస్‌తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడికి గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. టీ20 జట్టు కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తొలగించి.. సల్మాన్ ఆఘాకు ఆ బాధ్యతలు అప్పగించింది.ఇదిలా ఉంటే.. రిజ్వాన్ తాజాగా పీసీబీ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆడకుండా అతడు.. పెషావర్‌లో ఓ స్థానిక క్లబ్‌కు ఆడినట్లు తెలుస్తోంది. ఇలా నేషనల్ టీ20 కప్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ బక్త్ తప్పుబట్టాడు.పీసీబీని అవమానించాడు.. ఈ విషయంలో రిజ్వాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీకి సూచించాడు. ‘‘నెలకు రూ. 60 లక్షలు తీసుకుంటున్నాడు. మరి జాతీయ జట్టు ఆటగాళ్లు పీసీబీ నిర్వహించే దేశీ మ్యాచ్‌లలో ఎందుకు ఆడరు? దేశవాళీ క్రికెట్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిజ్వాన్ పీసీబీని దారుణంగా అవమానించాడు.సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండిమొహ్సిన్ నక్వీ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తెలుసు. అయితే, ఈసారి మాత్రం ఆయన తన వైఖరి మార్చుకోవాలి. ఇలాంటి వాళ్లపై కొరడా ఝులిపించాల్సిందే. పీసీబీని పట్టించుకోని ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు చేసే దిశగా ఆలోచన చేయాలి’’ అని సికందర్ బక్త్ పేర్కొన్నాడు.బ్యాటర్‌గానూ విఫలంకాగా కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డ మీద వన్డే సిరీస్ గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా రిజ్వాన్ ప్రశంసలు అందుకున్నాడు. కానీ.. ఆ తర్వాత వరుస పరాజయాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అతడి సారథ్యంలో పాకిస్తాన్.. గ్రూప్ దశలో న్యూ జిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయింది.ఇక ఆఖరిదైన మూడో మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దు కావడంతో గెలుపున్నదే లేకుండా ఈ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో రిజ్వాన్ కివీస్‌తో మ్యాచ్‌లో 3, భారత్‌తో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు. రోహిత్ సేనతో పోరులో రిజ్వాన్ స్లో ఇన్నింగ్స్ వల్ల పాకిస్తాన్‌కు చేదు అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించడం గమనార్హం. కాగా పాక్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది.చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే! -
వెంటిలేటర్‌పై పాక్ క్రికెట్
అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికి దిగజారుతుంది. ఓ సారి వన్డే వరల్డ్‌కప్ (1996), ఓ సారి టీ20 వరల్డ్‌కప్ (2009), ఓ సారి ఛాంపియన్స్ ట్రోఫీ (2017) గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం పసికూనలపై గెలిచేందుకు కూడా నానా తంటాలు పడుతుంది. గడిచిన రెండేళ్లలో పాక్ క్రికెట్ జట్టు అదఃపాతాళానికి పడిపోయింది. ఆ జట్టు పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న రోగిలా తయారైంది. యూఎస్ఏ, జింబాబ్వే, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు సైతం పాక్‌ను మట్టికరిపిస్తున్నాయి. స్వదేశంలో కూడా ఆ జట్టు మ్యాచ్‌లు గెలవలేకపోతుంది. సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై సిరీస్‌లోనూ పరాజయంపాలైంది. తాజాగా పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న ఆ జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ప్రక్షాళన పేరుతో సీనియర్లను పక్కన పెట్టిన పాక్ సెలెక్టర్లు ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక ఏం చేసినా తమ జట్టు పరిస్థితి బాగుపడదని అనుకుంటున్నారు. భారత్‌లో గల్లీ క్రికెట్ ఆడే జట్లు సైతం పాక్‌ను ఓడించే పరిస్థితులు ఉన్నాయి. న్యూజిలాండ్ పర్యటనకు ముందు పూర్వవైభవం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన పీసీబీ.. ప్రస్తుతం వస్తున్న ఫలితాలతో నోరు మెదపకుండా ఉంది. సీనియర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అన్నా ఉంటే కనీసం ఈ ఘోర పరాజయాల గోస తప్పేదని అనుకుంటున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో పాక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడింది. తొలి మ్యాచ్‌లో కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయిన పాక్ బ్యాటర్లు.. ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ముక్కీ మూలిగి 135 పరుగులు చేశారు. అయినా న్యూజిలాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించి పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశారు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు గల్లీ బౌలర్లను తలపించారు. వరల్డ్ క్లాస్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఓ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది పక్కకు కూర్చోబెట్టాడు. మరో పేసర్ మొహమ్మద్ ఆలీని ఫిన్ అలెన్ వాయించాడు. ఆలీ వేసిన ఓ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వాస్తవానికి ఈ సిరీస్ కోసం క్రికెట్ న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన సీనియర్లు ఐపీఎల్ కోసం భారత్‌కు పయనమయ్యారు. 'ఏ' జట్టుతోనే పాక్ పరిస్థితి ఇలా ఉంటే, సీనియర్లు ఉన్న జట్టు ఎదురైనప్పుడు పాక్ పరిస్థితి తలచుకుంటే జాలేస్తుంది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో పాక్ క్రికెట్‌ను ఆదుకునే ఆపద్భాంధవుడెవరో చూడాలి.2023 నుంచి పాక్ క్రికెట్ జట్టు పరిస్థితిఆఫ్ఘనిస్తాన్ చేతిలో టీ20 సిరీస్ ఓటమివన్డే ప్రపంచ కప్-2023లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాజయం2023 వన్డే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమణస్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమిఐర్లాండ్ చేతిలో టీ20 మ్యాచ్‌లో షాకింగ్ ఓటమి2024 టీ20 ప్రపంచ కప్‌లో యూఎస్ఏ చేతిలో ఊహించని పరాభవం2024 టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమణజింబాబ్వే చేతిలో వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో ఓటమి2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే నిష్క్రమణగత 16 టీ20ల్లో పాక్ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. అది కూడా జింబాబ్వే, ఐర్లాండ్, కెనడాపై -
ఛాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో భారీ కోత
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వడం వల్ల పీసీబీకి రూ. 869 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పెట్టిన పెట్టుబడిలో 85 శాతం నష్టాలు వచ్చినట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన భారీ నష్టాలను.. ఆటగాళ్లపై ఆర్దిక అంక్షల ద్వారా పూడ్చుకోవాలని పీసీబీ భావిస్తుంది. ఇందులో భాగంగా తొలుత దేశవాలీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో కోత విధించిన పీసీబీ.. తాజాగా జాతీయ ఆటగాళ్లపై కాస్ట్ కట్టింగ్ కొరడా ఝులిపించింది. పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో సగానికిపైగా కోత విధించినట్లు తెలుస్తుంది. అలాగే పాక్ ఆటగాళ్లు ఫైవ్ స్టార్ హోటల్లలో బస చేయడంపై కూడా నిషేధం విధించినట్లు సమాచారం.ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం పాక్ క్రికెట్ బోర్డు దాదాపు రూ. 1000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో వేదికల ఆధునీకరణ (కరాచీ, లాహోర్, రావల్పిండి) కోసమే సగానికి పైగా నిధులు ఖర్చు చేసినట్లు సమాచారం. స్టేడియాల మరమ్మత్తుల కోసం ముందుగా అంచనా వేసిన వ్యయం కంటే 50 శాతం అధిక మొత్తం ఖర్చైనట్లు పాక్ మీడియా వెల్లడించింది. బదులుగా స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం గోరంత కూడా లేదని పేర్కొంది.భారీ అంచనాల మధ్య స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన పాక్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో పాక్.. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో వరుసగా ఓడింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా బంతి కూడా పడకుండానే రద్దైంది. భారత్‌తో మ్యాచ్‌ను దుబాయ్‌లో ఆడిన పాక్.. కోట్లు ఖర్చు చేసి స్వదేశంలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగలిగింది. అందులోనూ న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తినింది. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అయినా గెలుద్దాం అనుకుంటే వరుణుడు కరుణించలేదు. ఈ టోర్నీలో భారత్ చివరి వరకు అజేయంగా నిలిచి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాక్‌కు టోర్నీ నిర్వహణ వల్ల వచ్చిన నష్టాల కంటే తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో భారత్ గెలవడం వల్ల కలిగే బాధ ఎక్కువగా ఉంది. కాగా, పాక్ ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడిన విషయం తెలిసిందే. భద్రతాపరమైన సమస్యల కారణంగా బీసీసీఐ టీమిండియాను పాక్‌లో ఆడేందుకు అనుమతించలేదు. -
మళ్లీ అదే కథ.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఘోర ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో కూడా అదే తీరును కనబరుస్తోంది. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ ఘోర ఓటమితో ప్రారంభించింది.ఆదివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో 9 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. కివీస్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగారు.ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే పాకిస్తాన్ వికెట్ల పతనం మొదలైంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. కైల్ జేమిసన్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సీఫర్ట్ విధ్వంసం..అనంతరం 92 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఒక్క వికెట్ కోల్పోయి కేవలం 10.1 ఓవర్లలో ఊదిపడేసింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(29),రాబిన్సన్(18) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. పాక్ బౌలర్లలో అర్బర్ ఆహ్మద్ ఒక్క వికెట్ పడగొట్టాడు.టీమ్ మారినా..ఇక కివీస్‌తో టీ20 సిరీస్‌కు దాదాపుగా కొత్త టీమ్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలక్టర్లు ఎంపిక చేశారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్ వంటి స్టార్ ఆటగాళ్లపై పీసీబీ వేటు వేసింది. వారి స్ధానంలో హసన్ నవాజ్, ఇర్ఫాన్ ఖాన్, అబ్దుల్ సమద్ వంటి యువ ఆటగాళ్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు.కానీ వీరివ్వరూ కూడా తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చకోలేకపోయారు. దీంతో పాకిస్తాన్ సెలకర్టపై మరోసారి విమర్శల వర్షం కురిపిస్తుంది. బాబర్, రిజ్వాన్‌ను తప్పించాల్సిన అవసరం ఏముంది అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.చదవండి: WPL 2025: ఫైనల్లో ఓటమి.. బోరున ఏడ్చేసిన ఢిల్లీ ప్లేయర్! వీడియో వైరల్ -
పాక్ ప్లేయర్లకు జరిమానా
గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ మధ్య కాలంలో ఏం చేసినా ఆ జట్టుకు కలిసి రావట్లేదు. తాజాగా స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా, గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పాక్‌కు ఇది పెద్ద అవమానం. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ పాక్‌కు పరాభవం ఎదురైంది. న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొన్న ఈ టోర్నీలోనూ పాక్ ఓటమిపాలైంది. ఇన్ని ఘెర అవమానాల తర్వాత పాక్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌కు బయల్దేరనుంది. ఈ పర్యటనలో పాక్ న్యూజిలాండ్‌తో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మార్చి 16న తొలి టీ20 జరుగనుంది. ఆతర్వాత మార్చి 18, 21, 23, 26 తేదీల్లో మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం మార్చి 29న వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లో మ్యాచ్‌లు మార్చి 29, ఏప్రిల్ 2, ఏప్రిల్ 5 తేదీల్లో జరుగనున్నాయి.పాక్ ఆటగాళ్లకు జరిమానాఇదిలా ఉంటే, ఆటగాళ్ల ప్రదర్శనను పెంపొందించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠినమైన క్రమశిక్షణా చర్యలు అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించిన పలువురు పాక్ ఆటగాళ్లపై పీసీబీ కొరడా ఝులిపించినట్లు సమాచారం. గతేడాది చివర్లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ మొదలుకుని తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రూల్స్ అతిక్రమించిన పాక్ ఆటగాళ్లకు జరిమానా విధించారని తెలుస్తుంది. జరిమానాల రూపంలో పాక్ క్రికెట్ బోర్డు దాదాపు 3.3 మిలియన్ రూపాయలు వసూలు చేసిందని సమాచారం. జరిమానా పడిన ఆటగాళ్లలో సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, అమీర్ జమాల్, సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిది ఉన్నట్లు సమాచారం.ఓ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా క్యాప్‌పై 804 అంకెను ముద్రించుకున్నందుకు అమీర్ జమాల్‌కు 1.4 మిలియన్ రూపాయలు..గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో హోటల్ రూమ్‌కు లేట్‌గా వచ్చినందుకు సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్‌కు 5 లక్షల రూపాయలు..సౌతాఫ్రికా పర్యటనలో హోటల్‌కు లేట్‌గా వచ్చినందుకు సుఫీయాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదికి 200 డాలర్ల జరిమానాను విధించినట్లు పలు క్రికెట్ వెబ్సైట్లు వెల్లడించాయి.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం పాక్ జట్టు: ఒమెయిర్ యూసఫ్, అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, జహన్దాద్ ఖాన్, మొహమ్మద్ హరీస్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముఖీమ్, మొహమ్మద్ అలీన్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఖుష్దిల్ షా, బాబర్ ఆజమ్, తయ్యబ్ తాహిర్, ఇర్ఫాన్ ఖాన్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, మహ్మద్ రిజ్వాన్, అబ్రార్ అహ్మద్, అకీఫ్ జావిద్, మొహమ్మద్ ఆలీ, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, సూఫియాన్ ముఖీమ్పాకిస్తాన్తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధిన్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్) -
రూ. లక్ష నుంచి పది వేలకు.. ఆటగాళ్లకు షాకిచ్చిన పాక్ బోర్డు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెటర్లకు ఊహించని షాకిచ్చింది. దేశీ మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో వరుస పరాజయాలతో పాక్ సీనియర్ జట్టు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని విమర్శల పాలైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయిన రిజ్వాన్ బృందం.. వర్షం వల్ల బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దవడం వల్ల నిరాశగా వెనుదిరిగింది.ఈ నేపథ్యంలో రిజ్వాన్ బృందంపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చాంపియన్స్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పీసీబీ.. స్టేడియాల మరమత్తుల కోసం భారీగానే ఖర్చు చేసింది. అయితే, ఆతిథ్య జట్టుగా దిగి దారుణంగా విఫలం కావడంతో సెలక్షన్ కమిటీపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ మొహమ్మద్ యూసుఫ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడం గమనార్హం. తదుపరి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. కివీస్‌తో జరిగే 5 టి20లు, 3 వన్డేల సిరీస్ కోసమే అతడిని పీసీబీ ఎంపిక చేయగా... అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే తన కూతురు అనారోగ్యం కారణంగా టూర్‌నుంచి అతను తప్పుకొన్నట్లు యూసుఫ్ వెల్లడించగా.. అతడి స్థానంలో పీసీబీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇక చాంపియన్స్ ట్రోఫీ వైఫల్యం తర్వాత కివీస్‌తో ఎంపిక చేసిన టీ20 జట్టులో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజంకు పీసీబీ చోటివ్వలేదు. లక్ష నుంచి పది వేలకు.. తాజాగా.. దేశవాళీ క్రికెట్లో మార్పులకు శ్రీకారం చుడుతూ.. ఆటగాళ్లపై దెబ్బ వేసింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా పాక్ దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది. ఆ బోర్డు ఆర్థిక స్థితికి ఇది నిదర్శనం!కాగా జాతీయ టీ20 చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు ఒక లక్ష పాకిస్తానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 31 వేలు) ఫీజుగా ఇస్తుండగా.. ఇప్పుడు దానిని ఏకంగా 10 వేల రూపాయలకు (రూ.3,100) తగ్గించారు. ఈ 90 శాతం కోతతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన హోటల్స్‌లో వసతి, తక్కువ సార్లు మాత్రమే విమానాల్లో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నారు. పాక్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ సారథిగా బ్రేస్‌వెల్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌ను న్యూజిలాండ్ టీ20 కెప్టెన్‌గా నియమించారు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనే కివీస్ జట్టును మంగళవారం ప్రకటించారు. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భుజం గాయానికి గురైన హెన్రీకి మొదటి 3 మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చి ఆఖరి 4, 5వ మ్యాచ్‌లకు ఎంపిక చేయగా, జేమీసన్ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనున్నాడు.దుబాయ్‌లో ఆదివారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో తలపడిన ఏడుగురు ఆటగాళ్లు ఐపీఎల్, పీఎస్ఎల్ (పాక్) కాంట్రాక్టుల వల్ల జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. రెగ్యులర్ కెప్టెన్ సాంట్నర్ సహా కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, ఫెర్గూసన్ ఐపీఎల్ ఆడనుండగా, కేన్ విలియమ్సన్ పాక్ సూపర్ లీగ్ ఆడేందుకు వెళ్లనున్నాడు.కివీస్ జట్టు మార్చి 16, 18, 21, 23, 26 తేదీల్లో పాక్‌తో ఐదు టీ20లు ఆడుతుంది. అనంతరం ఇరుజట్ల మధ్య మార్చి 29, ఏప్రిల్ 2, 5వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ కూడా జరుగనుంది. ఈ జట్టును తర్వాత ఎంపిక చేస్తారు. న్యూజిలాండ్ టీ20 జట్టు: బ్రేస్‌వెల్ (కెప్టెన్), అలెన్, చాప్మన్, ఫౌల్కెస్, మిచెల్ హే, హెన్రీ, జేమీసన్, మిచెల్, నీషమ్, రూర్కే, రాబిన్సన్, బెన్ సీర్స్, సీఫెర్ట్, జేకబ్ డఫీ, ఇష్ సోధి. తస్కీన్ ఒక్కడికే బంగ్లా ‘ఎ’ప్లస్ కాంట్రాక్టు బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ తస్కీన్ అహ్మద్ ఒక్కడికే బోర్డు కాంట్రాక్టుల్లో అగ్ర తాంబూలం దక్కింది. బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న క్రికెటర్ల జాబితాను ప్రకటించింది. కొన్నేళ్లుగా బీసీబీ ఫార్మాట్ల ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇస్తూ వచ్చింది. అయితే దీనికి మంగళం పాడిన బోర్డు మళ్లీ పాత పద్ధతిలోనే గ్రేడ్లవారీగా కాంట్రాక్టులు ఇచ్చింది. ఇందులో భాగంగా ‘ఎ’ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఒకే ఒక్కడు తస్కీన్‌కు నెలకు బంగ్లా కరెన్సీలో ఒక మిలియన్ టాకాలు (రూ.7.15 లక్షలు) చెల్లిస్తారు.కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ సహా మెహదీ హసన్ మిరాజ్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్‌లకు ‘ఎ’గ్రేడ్ కాంట్రాక్టు దక్కింది. ఇందులో భాగంగా వీరికి నెలకు 8 లక్షల టాకాలు (రూ.5.75 లక్షలు) లభిస్తాయి. చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాని ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు బీసీబీ కాంట్రాక్టు లభించలేదు. 2022 తర్వాత సౌమ్య సర్కార్, షాద్మన్ ఇస్లామ్‌లకు సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. ‘సి’ గ్రేడ్‌లో ఉన్న వీరికి నెలకు 4 లక్షల టాకాలు (రూ.2.87 లక్షలు) జీతంగా చెల్లిస్తారు. ‘బి’ గ్రేడ్ ప్లేయర్లకు 6 లక్షల టాకాలు (రూ.4.27 లక్షలు) చెల్లిస్తారు. -
మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తా: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్(Rashid Latif) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొంభైవ దశకంలో జరిగిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ దారుణాలను తాను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నాడు. తాను రాస్తున్న పుస్తకంలో ప్రతి విషయాన్ని విడమరిచి చెబుతానంటూ 90s ఆటగాళ్లు బెంబేలెత్తిపోయేలా చేశాడు.‘‘నేను ఒక పుస్తకం రాయడటం మొదలుపెట్టాను. ఇందులో 90వ దశకంలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గురించి రాయబోతున్నాను. అప్పట్లో ఇది తారస్థాయిలో ఉండేది. ఎవ్వరి గురించి దాచేదిలేదు. అన్ని విషయాలను పూర్తిగా బయటపెట్టేస్తాను.మ్యాచ్ ఫిక్సింగ్.. అన్నీ చెప్పేస్తాఅందులో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది కూడా చెప్తాను. ఏ మాజీ కెప్టెన్ అయితే.. అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం ఎదురుచూశాడో.. అతడి గురించి కూడా పూర్తి వివరాలు అందిస్తా’’ అని రషీద్ లతీఫ్ ‘ది కరెంట్ పీకే’కు వెల్లడించాడు.అంతకు ముందు జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. తొంభైవ దశకంలో ఆడిన వాళ్లు పాకిస్తాన్ జట్టుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ దారుణ ప్రదర్శన నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ అంటే 90s ఆటగాళ్లకు నచ్చదు. వారి వల్లే వరల్డ్‌కప్ గెలవడం ఆలస్యమైంది.దయచేసి వీరందిని పాక్ క్రికెట్‌కు దూరంగా ఉంచండి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందవచ్చు. పాక్ క్రికెట్‌కు సేవ చేసీ చేసీ వాళ్లు అలసిపోయారు. కాబట్టి ఇకనైనా వారికి విశ్రాంతినివ్వండి’’ అని రషీద్ లతీఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.చాలా వరకు స్క్రిప్టెడ్ఇక క్రిక్ఇన్ఫోకు రాసిన కాలమ్‌లోనూ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు తెలిసి.. క్రికెట్ మ్యాచ్‌లలో చాలా వరకు స్క్రిప్టెడ్. సినిమాలు, నాటకాల మాదిరే క్రికెట్ కూడా!.. టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు రాబట్టాలి. ఎన్ని ఓవర్లు వేయాలి.. ఇలాంటివన్నీ ముందే చెప్తారు.ప్రతి ఒక్క ఆటగాడు తన భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. దీర్ఘకాలంపాటు జట్టులో కొనసాగలేమని అందరికీ తెలుసు. అందుకే డబ్బులు వచ్చే మార్గం కనిపించినపుడు ఇలా అడ్డదారులు తొక్కడం సహజమే. ఏదేమైనా ఒక ఆటగాడు స్వార్థపరుడైతే అతడు కచ్చితంగా అక్రమార్కుల వలలో చిక్కుకుంటాడు.తొలి ఐదేళ్లలో ఇది జరుగుతుంది. నా దృష్టిలో ప్రతిభలేని ఆటగాడి కంటే.. టాప్ ప్లేయర్ మరింత స్వార్థంగా ఉంటాడు’’ అని రషీద్ లతీఫ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా 1990లో పాక్ క్రికెట్‌ను ఫిక్సింగ్ ఉదంతం కుదిపేసింది. జస్టిస్ మాలిక్ మొహమద్ ఖయ్యూం నేతృత్వంలో ఏర్పాటైన దర్యాప్తు కమిటీ.. సుదీర్ఘ విచారణ అనంతరం మాజీ కెప్టెన్ సలీం మాలిక్, పేసర్ అటా ఉర్ రెహ్మాన్‌లను దోషులుగా తేల్చింది. దీంతో వారిపై జీవితకాల నిషేధం పడింది. ఘోర అవమానం ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్య దేశంగా వ్యవహరించిన పాకిస్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకిదిగిన మెన్ ఇన్ గ్రీన్.. కనీసం ఒక్క మ్యాచ్ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖర్లో బంగ్లాదేశ్‌పైనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించింది. అయితే, వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దు కావడంతో విజయమన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. మరోవైపు.. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడిన టీమిండియా చాంపియన్‌గా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్ -
ENG Vs AFG: ఇదేమి సెక్యూరిటీరా బాబు.. మరోసారి మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరోసారి భద్రతా లోపం తలెత్తింది. గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. ఎంతమంది ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా అభిమానులు మాత్రం వారు కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొస్తున్నారు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం లహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించింది.ఈ క్రమంలో అఫ్గాన్ టీమ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా.. ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో నుంచి ఓ వ్యక్తి మైదానంలో పరిగెత్తుకుంటూ వచ్చి అఫ్గాన్ ఆటగాళ్లను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే మైదానంలోకి వచ్చి ఆ వ్యక్తిని బయటకు బలవంతంగా తీసుకుళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇదేమి తొలిసారి కాదు..కాగా ఈ మెగా టోర్నీలో ఓ వ్యక్తి మైదానంలో దూసుకు రావడం ఇదేమి తొలిసారి కాదు. రావల్పిండి వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని ఓ ఉగ్రవాద సంస్థ మద్దతుదారుడు పిచ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి కివీ స్టార్ రచిన్ రవీంద్రను హత్తుకునే ప్రయత్నం చేశాడు.ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీసుకుళ్లారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాకిస్తాన్‌లోని ఏ క్రికెట్ వేదికలోకి అతడికి ప్రవేశం లేకుండా నిషేధించారు. కాగా ఈ ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! View this post on Instagram A post shared by ICC (@icc) -
టీమిండియాతో మ్యాచ్.. పాక్ జట్టుకు ‘స్పెషల్ కోచ్’
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధిలు భారత్-పాకిస్తాన్(IND-PAK) జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. పాక్‌పై కూడా గెలిచి సెమీస్‌కు ఆర్హత సాధించాలని పట్టుదలతో ఉంది.కానీ పాకిస్తాన్‌కు మాత్రం ఇది డూర్ ఆర్ డై మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌పై ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలో టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.కేవలం ఒక్క మ్యాచ్ కోసం తమ జట్టు స్పెషల్ కోచ్‌గా మాజీ క్రికెటర్ ముదాసర్ నాజర్‌ను పీసీబీ నియమించింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్‌తో కలిసి ముదాసర్ పనిచేయనున్నాడు. రెండు రోజుల కిందటే జట్టుతో కలిసిన ముదాసర్.. ప్రాక్టీస్ సెషన్లో తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచుకున్నాడు.కాగా ముదాసర్ దుబాయ్ పిచ్ కండీషన్స్‌పై విస్తృతమైన అవగాహన ఉంది. అతడు గత కొంతకాలంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ముదాసర్ను పాక్ క్రికెట్ బోర్డు తమ జట్టు కోచింగ్ స్టాప్‌లోకి తీసుకుంది. కాగా ముదాసర్కు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. గతంలో పాకిస్తాన్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్‌గా అతడు పనిచేశాడు. అంతేకాకుండా లాహోర్‌లోని పీసీబీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ డైరకర్ట్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముదాసర్ పాకిస్తాన్ తరఫున 76 టెస్ట్‌లు ఆడి 4114 పరుగులు, 122 వన్డేల్లో 2653 పరుగులు చేశాడు.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: Champions Trophy: కళ్లు చెదిరే క్యాచ్.. సూపర్‌మేన్‌లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్ -
పాకిస్తాన్‌కు పరీక్షా సమయం
1996 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 16న పాకిస్తాన్లో తొలి లీగ్ మ్యాచ్ జరిగింది. దాదాపు నెల రోజుల తర్వాత మార్చి 17న లాహోర్‌లో ఫైనల్‌తో టోర్నీ ముగిసింది. అనంతరం మరో నెల రోజులు ఆ దేశం క్రికెట్ సంబరాల్లో మునిగింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్‌కు కూడా చేరకపోయినా... ఆతిథ్య దేశంగా అభిమానులకు ఆనందం పంచింది. సరిగ్గా 29 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 19న తొలి మ్యాచ్‌తో ఆ దేశం మరో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల వ్యవధిలో పాకిస్తాన్ ఎన్నో సంక్షోభాలను దాటి ఒక మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమైంది. ఈసారీ డిఫెండింగ్ చాంపియన్‌గా పాక్ బరిలోకి దిగుతోంది. అయితే ఇప్పుడు అక్కడిఅభిమానుల దృష్టిలో టైటిల్ గెలవడంకంటే కూడా టోర్నీ జరగడమే పెద్ద విశేషం. –సాక్షి క్రీడా విభాగందాదాపు మూడు దశాబ్దాల ఈ సమయాన్ని పాకిస్తాన్ క్రికెట్లో 2009కి ముందు... దానికి తర్వాతగా విభజించవచ్చు. లాహోర్‌లో టెస్టు సిరీస్ సమయంలో శ్రీలంక జట్టు క్రికెటర్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఆ దేశ క్రికెట్‌ను మసకబార్చింది. ఆరేళ్ల పాటు ఏ జట్టు కూడా ఆ దేశం వైపు కన్నెత్తి చూడలేదు. అంత సాహసం ఏ దేశం కూడా చేయలేకపోయింది. ఐసీసీ కూడా టోర్నీ నిర్వహణల విషయంలో పూర్తిగా వెనక్కి తగ్గింది. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత 2015లో జింబాబ్వేను పిలిచి పరిస్థితులు చక్కబడ్డాయనే సందేశంతో పాక్ బోర్డు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలు పెట్టింది. అయితే 2021లో ఒక ప్రధాన జట్టు ఆ్రస్టేలియా వచ్చిన తర్వాత గానీ అక్కడ అసలు క్రికెట్ రాలేదు. ఈ నాలుగేళ్లలో భారత్ మినహా మిగతా అన్ని జట్లూ అక్కడ పర్యటించడం ఊరటనిచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఐసీసీ టోర్నీ అవకాశం రాగా... దీన్ని సమర్థంగా నిర్వహించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీపీ)కు పెద్ద సవాల్. దీనిపైనే ఆ జట్టు, బోర్డు భవి ష్యత్తు ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు. కళ వచ్చింది... సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్ లేక సహజంగానే అక్కడి మైదానాలు వెలవెలబోయాయి. నిర్వహణ సరిగా లేక పాడుబడినట్లు తయారయ్యాయి. ఆర్థికంగా బలమైన బోర్డు కాకపోవడం, రాజకీయ కారణాలతో కేవలం దేశవాళీ టోరీ్నల కోసం స్టేడియాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దే ధైర్యం చేయలేకపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) జరుగుతున్నా... ఆ మ్యాచ్‌లను కూడా ఏదో మమ అన్నట్లుగా ముగించేస్తూ వచ్చారు. ఇలాంటి స్థితిలో చాంపియన్స్ ట్రోఫీ అవకాశం వచ్చింది. స్టేడియాల ఆధునీకరణ కోసం ఐసీసీ ఇచ్చిన సొమ్మును వాడుకుంది. మూడు వేదికలు లాహోర్, కరాచీ, రావల్పిండిలపైనే పూర్తిగా దృష్టి పెట్టి సౌకర్యాలను మెరుగుపర్చింది. ఇందులో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో చాలా భాగాన్ని పడగొట్టి దాదాపు కొత్తదే అన్నట్లు తీర్చిదిద్దగా, మిగతా రెండింటిని ఆధునీకరించారు. సరిగ్గా చెప్పాలంటే పాక్‌లోని మైదానాలు ఎప్పుడో పాతకాలం కట్టడాల తరహాల్లో ఉన్నాయి. ఈతరం అవసరాలు, మారిన క్రికెట్‌కు అనుగుణంగా ఏవీ లేవు. ఇప్పుడు ఐసీసీ టోర్నీ పుణ్యమాని స్టేడియాలకు కొత్త కళ వచ్చింది. అభిమానులు కూడా అంతే ఉత్సాహంతో ఒక పెద్ద ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని నగరాల్లో టోర్నీ పోస్టర్లు, బ్యానర్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. సహజంగానే స్థానిక మార్కెట్లలో టీమ్ జెర్సీలు, ఇతర జ్ఞాపికలు వంటి ‘క్రికెట్ వ్యాపారం’ జోరుగా సాగుతోంది కూడా. ‘క్రికెట్‌ను తాము ఎంతగా అభిమానిస్తామో చూపించేందుకు పాకిస్తానీయులకు ఇది చక్కటి అవకాశం. వచ్చే కొన్ని రోజులు అంతా పండగ వాతావరణమే’ అని మాజీ కెపె్టన్ మియాందాద్ చెప్పిన మాటలో అతిశయోక్తి లేదు. భారత జట్టు లేకపోయినా... పాక్ బోర్డు 2026 టి20 వరల్డ్ కప్, 2031 వన్డే వరల్డ్ కప్ కోసం కూడా బిడ్లు వేసి భంగపడింది. ఈ నేపథ్యంలో గతంలోనే ఖరారైన చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే వారికి మిగిలింది. దాంతో తమ నిర్వహణా సామర్థ్యం, ఆతిథ్యం గురించి ప్రపంచ క్రికెట్‌కు చూపించాలని ఆశించింది. ఇందులో భాగంగానే రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండి, సాధ్యం కాదని తెలిసి కూడా ఎలాగైనా భారత్‌ను చాంపియన్స్ ట్రోఫీలో ఆడించేలా పీసీబీ చివరి వరకు అన్ని ప్రయత్నాలు, డిమాండ్లు చేసింది. కానీ చివరకు వెనక్కి తగ్గక తప్పలేదు. 2009 ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్‌లో ద్వైపాక్షిక సిరీస్ కాకుండా ఒకేఒక్క చెప్పుకోదగ్గ టోర్నీ 2023లో (ఆసియా కప్) జరిగింది. భారత్ మాత్రం తమ మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడింది. భారత్ ఫైనల్ చేరితే పేరుకే ఆతిథ్య జట్టు తప్ప ఫైనల్ నిర్వహించే అవకాశం కూడా లేదు. అయితే భారత్ లేకపోయినా ఇతర అన్ని పెద్ద జట్లు ఆడుతుండటం సానుకూలాంశం. అందుకే పీసీబీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారమే లాహోర్ ఫోర్ట్‌లో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నింటికి మించి కట్టుదిట్టమైన భద్రత కీలకాంశంగా మారింది. ఒక్క చిన్న పొరపాటు జరిగినా పాక్‌లో క్రికెట్ ముగిసిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పరుగులు, ఫలితాలతోపాటు టోర్నీ ఎలా సాగుతుందనేది ఆసక్తికరం. -
CT 2025: అతడిని ఎలా ఎంపిక చేశారు?: వసీం అక్రం
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై బౌలింగ్ దిగ్గజం వసీం అక్రం(Wasim Akram) పెదవి విరిచాడు. ఒకే ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్‌కు మాత్రమే చోటివ్వడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బౌలింగ్ ఆల్‌రౌండర్ షాహీం ఆష్రఫ్(Faheem Ashraf)ను ఈ మెగా టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదంటూ విమర్శించాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఆతిథ్య జట్టు హోదాలో ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్లతో తలపడనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఈవెంట్ మొదలుకానుండగా.. ఇటీవలే పీసీబీ తమ జట్టును ప్రకటించింది.అతడిని ఎలా ఎంపిక చేశారు?ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం స్పందిస్తూ.. ‘‘జట్టును ప్రకటించేశారు. కొద్ది మంది పేర్లను గమనించాను. ఫాహీం అష్రఫ్ ఈ జట్టులో ఉన్నాడు. అతడికి ఆల్ ది బెస్ట్. ప్రతిభావంతుడైన క్రికెటరే.కానీ గత 20 మ్యాచ్‌లలో అతడి బౌలింగ్ సగటు 100.. బ్యాటింగ్ సగటు 9. అయినా.. సరే అష్రఫ్‌ను ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదు. ఇక ఖుష్దిల్ షా ఎంపిక కూడా అనూహ్యం. అయినా.. ఈసారి మనం ఒకే ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం.అదే టీమిండియా.. ముగ్గురు, నలుగురు స్పిన్నర్లతో సిద్ధమైంది. అందుకు కారణాలు ఏమైనా గానీ.. మనం మాత్రం ఒకే స్పిన్నర్‌ను ఎంపిక చేయడమేంటి?.. ఇక ఆతిథ్య జట్టుగా మనపై ఎలాగూ ఒత్తిడి ఉంటుంది. అన్ని ప్రతికూలతలు అధిగమించి సెమీ ఫైనల్ వరకైనా చేరాలని ఆశిస్తున్నా’’ అని వసీం అక్రం స్పోర్ట్స్ యారీతో పేర్కొన్నాడు.ఇదైతే బాగుందిఅయితే, చాంపియన్స్ ట్రోఫీ కోసం ఫఖర్ జమాన్‌ను పిలిపించి మంచి పనిచేశారంటూ పాక్ సెలక్టర్ల నిర్ణయాన్ని వసీం అక్రం సమర్థించాడు. ‘‘మనకు ఓపెనింగ్ జోడీతో సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రెగ్యులర్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను జట్టులోకి తీసుకోవడం సానుకూలాంశం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు.ఏదేమైనా బాబర్ ఆజంను ఓపెనర్‌గా పంపాలి. అతడి బ్యాటింగ్ టెక్నిక్ గొప్పగా ఉంటుంది. యాభై ఓవర్లపాటు అతడు క్రీజులోనే ఉంటే.. కచ్చితంగా 125 పరుగులైనా చేస్తాడు. ఇక రిజ్వాన్‌ను మిడిలార్డర్లో పంపాలి. జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. నసీం షా వచ్చేశాడు. ఇప్పటికే షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ ఉన్నారు. వీళ్లకు తోడుగా హస్నైన్ కూడా ఉన్నాడు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.ఆ ఆల్‌రౌండర్‌కు జట్టులో చోటివ్వాల్సిందిఅయితే, ఆల్‌రౌండర్ల జాబితాలో ఆమిర్ జమాల్‌కు చోటు దక్కకపోవడం తనను నిరాశపరిచిందని వసీం అక్రం ఈ సందర్భంగా పేర్కొన్నాడు. దీర్ఘకాలం పాటు జట్టుకు ఉపయోగపడగల ఆమిర్‌ను సెలక్టర్లు పట్టించుకోకపోవడం సరికాదన్నాడు. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ మరోసారి విజేతగా నిలిస్తే చూడాలని ఉందని.. అయితే, మిగతా జట్లు కూడా వరల్డ్‌క్లాస్ ఆటతో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాడు. అందరితోపాటు తాను కూడా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ అర్హత సాధించగా.. వరల్డ్‌కప్‌లో సెమీస్ కూడా చేరని పాక్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలోకి దూసుకువచ్చింది. ఇక భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌కు వెళ్లలేని టీమిండియా.. దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన భారత్- పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది.చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆ ఈవెంట్ రద్దు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభానికి మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. అయితే టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండటంతో భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి.ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. టీమిండియా ఒకవేళ సెమీస్, ఫైనల్‌కు చేరినా ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. దీంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్‌గా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అయితే ఈ టోర్నీకి ముందు పీసీబీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఐసీసీ ఈవెంట్‌కు ముందు జరిగే కెప్టెన్స్ ఫోటో షూట్‌ను పీసీబీ రద్దు చేసింది. గత కొన్నేళ్లుగా టోర్నీ ఆరంభానికి ముందు కెప్టెన్స్ మీట్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ సీజన్ జోరుగా సాగడం వల్లే ఈ ప్రిటోర్నీ ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చిందని పాక్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఓపెనింగ్ సెర్మనీ మాత్రం ఫిబ్రవరి 16న లహోర్‌లో నిర్వహించనున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.దీంతో టీమిండియా సారథి రోహిత్ శర్మ కరాచీలో జరగాల్సిన కెప్టెన్స్ మీట్ కోసం వెళ్లడం లేదని తేలిపోయింది. అయితే ఈ కెప్టెన్ల ఫోటో షూట్ కోసం రోహిత్ పాక్‌కు వెళ్లనున్నాడని తొలుత వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఏకంగా ఆ ఈవెంటే రద్దు కావడంతో పాక్‌కు రోహిత్ వెళ్లే అవకాశం లేకపోయింది.బిజీ బిజీ షెడ్యూల్..కాగా భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిశాక టీమిండియా ఫిబ్రవరి 15న ఈ టోర్నీ కోసం దుబాయ్‌లో అడుగుపెట్టే అవకాశముంది. మరోవైపు శ్రీలంక పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు నేరుగా అక్కడ నుంచి ఫిబ్రవరి 14న పాకిస్తాన్‌కు పయనం కానుంది. అదేవిధంగా ఇంగ్లీష్ జట్టు ఫిబ్రవరి 12న భారత్‌తో వన్డే సిరీస్ ముగిశాక నాలుగైదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనుంది. ఆ తర్వాతే పాక్ గడ్డపై బట్లర్ సేన అడుగుపెట్టనుంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తమ వామాప్ మ్యాచ్‌లను కూడా రద్దు చేసుకున్నాయి.ఇక అఫ్గానిస్తాన్ ఫిబ్రవరి 12న రానుండగా.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా అంతకుముందే ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు పాకిస్తాన్‌తో ట్రై సిరీస్ కోసం ముందే వెళ్తున్నాయి. కాగా ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి! -
పాకిస్తాన్ భయపడుతోందా?.. అతడి వల్లే జట్టు ప్రకటన ఆలస్యం!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంత వరకు తమ జట్టును ప్రకటించలేదు. ప్రాథమిక జట్ల ప్రకటనకు సంబంధించి జనవరి 12నే డెడ్‌లైన్ ముగిసినా పీసీబీ మాత్రం ఇంకా ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రకటన విషయంలో పీసీబీ జాప్యం చేయడానికి గల కారణాలను విశ్లేషించాడు.పాకిస్తాన్ భయపడుతోందా?ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘జట్టును ప్రకటించేందుకు పాకిస్తాన్ భయపడుతోందా?.. కానే కాదు.. అయితే, ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్న విషయాలపై మాత్రం పీసీబీకి ఇంకా స్పష్టత రానట్టుంది.అతడి వల్లే జట్టు ప్రకటన ఆలస్యం!ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే.. సయీమ్ ఆయుబ్. అతడు ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా అన్నది ఇంకా తేలలేదు. అందుకే ఈ ఆలస్యం’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు. కాగా ఇటీవలికాలంలో అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపుతూ.. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్(Saim Ayub) గాయపడిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడాడు. ఇప్పటి దాకా అతడు పూర్తిగా కోలుకోలేదని సమాచారం.ప్రస్తుతం పాకిస్తాన్ వన్డే జట్టులో సయీమ్ ఆయుబ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. పాక్ తరఫున 2023లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 22 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 2024లో వన్డే, టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.మూడు శతకాలుఇప్పటి వరకు 27 టీ20లలో 498 పరుగులు చేసిన ఆయుబ్.. ఏడు టెస్టుల్లో 364 రన్స్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు. ఇక వన్డే ఫార్మాట్లో మాత్రం ఇటీవల అతడు అదరగొట్టాడు. తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 515 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండ్ బ్యాటర్ ఖాతాలో ఇప్పటికే మూడు శతకాలు ఉండటం విశేషం. ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకోవడంతో పాటు... సౌతాఫ్రికాలో ఏకంగా రెండు సెంచరీలు చేయడం అతడి సూపర్ ఫామ్‌కు నిదర్శనం.అలాంటి ఆటగాడు గనుక జట్టుకు దూరమైతే పాకిస్తాన్‌కు తిప్పలు తప్పవు. అందుకే.. ఆయుబ్ ఫిట్‌నెస్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే జట్టును ప్రకటించాలని పీసీబీ భావిస్తున్నట్లు బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించింది.ఇక వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ మెగా ఈవెంట్‌కు క్వాలిఫై అయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉండగా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఆడనున్నాయి. ఇక పాకిస్తాన్ తప్ప ఇప్పటికే మిగిలిన ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. అయితే, జట్లలో మార్పులకు ఫిబ్రవరి 11 వరకు సమయం ఉంది.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19న చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా మొదలుకానుండగా.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తమ మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనే ఆడనుంది.చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు -
హైబ్రిడ్ పద్ధతే ఖరారు
దుబాయ్: భారత్‌ను ఎలాగైనా ఈసారి తమ దేశంలో ఆడించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెరవేరలేదు. హైబ్రిడ్ పద్ధతి కుదరదని మొండికేసిన పీసీబీకి అనుకున్నట్లే చుక్కెదురైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లే టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం అధికారికంగా వెల్లడించింది. వేదిక ఫలానా అని స్పష్టంగా చెప్పకపోయినా యూఏఈలోని దుబాయ్‌నే ఖరారు చేయనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పైగా ముందు నుంచీ కూడా దుబాయ్‌లో అయితేనే చాంపియన్స్ ట్రోఫీ ఆడతామని లేదంటే లేదని బీసీసీఐ ఇది వరకే పలుమార్లు స్పష్టం చేసింది. దీంతో దుబాయ్ దాదాపు ఖాయం కానుంది! టీమిండియా లీగ్ మ్యాచ్‌లు సహా నాకౌట్ చేరినా కూడా అక్కడే ఇతర దేశాలు వచ్చి ఆడి వెళతాయి. ‘2024–2027 సైకిల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్‌లు ఆడే అన్నీ మ్యాచ్‌లు తటస్థ వేదికల్లో నిర్వహించుకునేందుకు ఐసీసీ బోర్డు ఆమోదించింది’ అని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం మీద ఇన్నాళ్లు భారత్‌లో ఆడేందుకు వచ్చిన పాక్ ఇకపై అలా రాదు. ఈ విషయంలో పాక్‌కు తమ మాట నెగ్గించుకున్న తృప్తి మిగిలింది. ఇక్కడితోనే అయిపోలేదు! భారత బోర్డు అనుకున్నది అయితే సాధించింది. కానీ ఇక మీదట భారత్‌లో పాక్ కూడా ఆడదు. గతేడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో పాల్గొన్న పాకిస్తాన్ జట్టు ఇకపై తమ మ్యాచ్‌ల్ని హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడేందుకు ఐసీసీ వద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2027–2028 సీజన్ వరకు భారత్‌లో జరిగే పురుషుల, మహిళల ఐసీసీ మెగా ఈవెంట్లలో పోటీ పడేందుకు పాక్ జట్లు రావు. పీసీబీ కోరిన తటస్థ వేదికలు... యూఏఈ లేదంటే శ్రీలంక దేశాల్లో పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతాయి. వచ్చే ఏడాది భారత్‌లో మహిళల వన్డే ప్రపంచకప్, 2026లో భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించే పురుషుల టి20 ప్రపంచకప్ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం పాక్‌లో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు యూఏఈ (దుబాయ్)లో... భారత్‌లో పాక్ ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. -
ముచ్చటగా మూడో క్రికెటర్.. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్
పాకిస్తాన్ క్రికెట్లో రిటైర్మెంట్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. తన సహచరులు ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటలలోపే ఇర్ఫాన్ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. దీంతో 36 గంటల వ్యవధిలో రిటైరైన మూడో పాకిస్తాన్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇర్ఫాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించాడు. "అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన నా సహచరులకు, కోచ్‌లకు ధన్యవాదాలు. పాకిస్తాన్ క్రికెట్‌తో నాకు ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను" అని ఇర్ఫాన్ ఎక్స్లోరాసుకొచ్చాడు. ఇర్ఫాన్ 2010లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.4 టెస్టులు, 60 వన్డేలు, 22 టీ20ల్లో పాక్ జట్టుకు ఇర్ఫాన్ ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 86 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 4.91 ఎకానమీ రేటుతో 83 వికెట్లు తీసుకున్నాడు. ఇర్ఫాన్ చివరగా 2019లో పాక్ తరుపున ఆడాడు.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ
బీసీసీఐ డిమాండ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు తలొగ్గింది. ఛాంపియన్స్ ట్రోఫీ- 2025ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడనుంది.టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పీసీబీ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో చర్చించినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ రిపోర్ట్స్ ప్రకారం.. గురువారం(డిసెంబర్ 5) సాయంత్రం బోర్డు మీటింగ్ అనంతరం ఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.ఐసీసీ కొత్త చైర్మెన్‌గా ఎన్నికైన జైషా అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లోఎ మొత్తం 15 దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు పాల్గోనున్నారు. కాగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినప్పటికి బీసీసీఐకి కొన్ని షరతులు విధించింది.రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరింది. కానీ బీసీసీఐ మాత్రం అందుకు సున్నితంగా తిరష్కరించింది.అదేవిధంగా హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోతే టోర్నీని వేరే చోటకు తరలిస్తామని పీసీబీకి ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
‘హైబ్రిడ్’ మోడల్‌కు అంగీకరించాల్సిందే!
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ‘హైబ్రిడ్ మోడల్’కు అంగీకరించబోమని మంకు పట్టు ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరిక జారీ చేసింది. వెంటనే ఈ ప్రతిపాదనకు అంగీకరించాలని... లేదంటే టోర్నీని పూర్తిగా పాకిస్తాన్ నుంచి తరలిస్తామని స్పష్టం చేసింది. దీంతో పాటు పాకిస్తాన్ జట్టు కూడా ఆడకుండా టోర్నీని జరుపుతామని కూడా తేల్చేసింది. చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి శుక్రవారం వర్చువల్‌గా జరిగిన సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది! ఇందులో ఎలాంటి ఫలితం రాకపోయినా, తాము చెప్పినట్లు చేస్తేనే శనివారం సమావేశం కొనసాగుతుందని కూడా ఐసీసీ పాక్‌కు చెప్పేసింది. దుబాయ్‌లోనే ఉన్న పీసీబీ అధ్యక్షుడు మొహసిన్ నక్వీ ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనగా, మిగతా దేశాల బోర్డు సభ్యులంతా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే గైర్హాజరు కావడంతో డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. భారత్ మ్యాచ్‌లను మరో దేశంలో నిర్వహిస్తూ ఇతర మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరిపేలా ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్’ మోడల్‌ను పీసీబీ ఇక్కడా తిరస్కరించింది. దీనికి ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. పాక్ పరిస్థితిపై వివిధ దేశాలకు సానుభూతి ఉన్నా... ప్రస్తుత స్థితిలో ‘హైబ్రిడ్’ మోడల్‌కు మించి మరో ప్రత్యామ్నాయం లేదని అందరూ అంగీకరించారు. దీనిని అమలు చేస్తే భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ యూఏఈలో జరుగుతాయి. ‘భారత జట్టు టోర్నీ లో లేకపోతే ఏ ప్రసారకర్త అయినా ఐసీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. ఈ విషయం పాక్‌కూ తెలుసు. కాబట్టి వెంటనే అంగీకరిస్తే శనివారం తుది నిర్ణయం వెలువడవచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న సభ్యుడొకరు వెల్లడించారు. టోర్నీ పాక్ దాటి వెళితే ఆతిథ్య హక్కుల కోసం ఐసీసీ ఇచ్చే 6 మిలియన్ డాలర్లతోపాటు టోర్నీ ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సి ఉంది. -
పాకిస్తాన్ సెలెక్షన్ కమిటీలోకి మాజీ అంపైర్
ముల్తాన్ టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం ఎదురైన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసక్తికర నిర్ణయం తీసుకుంది. పీసీబీ ఆ దేశ సెలెక్షన్ కమిటీలో పలు మార్పులు చేసింది. ఓ మాజీ అంపైర్ సహా మరో ఇద్దరిని కొత్తగా చేర్చింది. ఇటీవలే అంపైరింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అలీం దార్, మాజీ ఆటగాళ్లు ఆకిబ్ జావెద్, అజర్ అలీ కొత్తగా సెలెక్షన్ కమిటీలో చేరారు. ఈ ముగ్గురికి పీసీబీ ఓటింగ్ హక్కు కల్పించింది. వీరితో పాటు ఇదివరకే సెలెక్షన్ కమిటీలో ఉన్న హసన్ చీమాకు కూడా పీసీబీ ఓటింగ్ హక్కు కల్పించింది. కాగా, పది రోజుల కిందటే మొహమ్మద్ యూసఫ్ సెలెక్షన్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేశాడు. ఇంతలోనే పీసీబీ కొత్తగా మరో ముగ్గురిని సెలెక్షన్ కమిటీలోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోనని పాక్ క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ముల్తాన్ టెస్ట్‌లో పాక్ పర్యాటక ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. చదవండి: డీఎస్పీగా నియామక పత్రాన్ని అందుకున్న క్రికెటర్ సిరాజ్ -
'మేము ఓడిపోయినందుకు చాలా హ్యాపీ'.. పాక్ క్రికెటర్‌పై ట్రోల్స్ వర్షం
పాకిస్తాన్ క్రికెటర్లందరూ ప్రస్తుతం ఛాంపియన్స్ వన్డే కప్‌లో బీజీబీజీగా ఉన్నారు. కెప్టెన్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిది వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ టోర్నమెంట్లో భాగమయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జాతీయ జట్టును పటిష్టం చేసేందుకు చాంపియన్స్ వన్డే కప్‌తో పాటు చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ పేరిట మూడు టోర్నీలు నిర్వహించాలని నిర్ణయించుకుంది.అందులో భాగంగానే తొలుత ఛాంపియన్స్ వన్డే కప్‌ను పీసీబీ నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో మార్ఖోర్స్, స్టాలియన్స్, పాంథర్స్, డాల్ఫిన్స్, లయన్స్ పేరిట ఐదు జట్లు పాల్గోంటున్నాయి. మార్ఖోర్స్కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహిస్తుండగా.. స్టాలియన్స్‌కు మహ్మద్ హ్యారిస్, పాథర్స్కు షాదాబ్ ఖాన్, డాల్ఫిన్స్‌కు సౌద్ షకీల్, లయన్స్‌కు షాహీన్ షా అఫ్రిది కెప్టెన్లుగా ఉన్నారు.హ్యారిస్‌పై ట్రోల్స్ వర్షం..కాగా టోర్నీలో భాగంగా సోమవారం మార్కోర్స్తో స్టాలియన్స్ జట్టు తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో స్టాలియన్స్ 105 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ అనంతరం స్టాలియన్స్ కెప్టెన్ మహ్మద్ హారిస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోయినందుకు సంతోషంగా ఉందని చెప్పడంతో హ్యారీస్‌ను అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.మేము ఈ మ్యాచ్‌లో ఎటువంటి తప్పిదాలు చేయలేం. మా జట్టు బలాలు, బలహీనతలను పరీక్షించుకున్నాము. గత మ్యాచ్‌లో మేము టాస్ గెలిచి తొలుత మా బ్యాటింగ్ బలాన్ని చెక్ చేశాము. ఆ మ్యాచ్‌లో కూడా ఓడి పోయాము. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మా బౌలింగ్ యూనిట్ బలాన్ని పరీక్షించుకోవాలి అనుకున్నాము. కానీ ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి చూశాం. మా బలాలు, బలహీనతలు ఎంటో తెలుసుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి అంటూ హ్యారీస్ పేర్కొన్నాడు. దీంతో హ్యారీస్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.చదవండి: SL vs NZ: కివీస్‌తో తొలి టెస్టు.. శ్రీలంక తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కోచ్‌గా ఆసీస్ మాజీ కోచ్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ టిమ్ నీల్సన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్ పేరును పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్ కలిసి గతంలో సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీలో పని చేశారు. ఈ పరిచయంతోనే గిలెస్పీ నీల్సన్ పేరును ప్రతిపాదించాడు. గిలెస్పీ, నీల్సన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌తో బాధ్యతలు చేపడతారు.ఈనెల 21 నుంచి బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లాదేశ్, పాక్‌లు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ ఆగస్ట్ 21 నుంచి 25 వరకు రావల్పిండి వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలో జరుగనుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును ప్రకటించగా.. బంగ్లాదేశ్ జట్టును ప్రకటించాల్సి ఉంది.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..షాన్ మసూద్ (కెప్టెన్), సైమ్ అయూబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, అబ్రార్ అహ్మద్, ఖుర్రమ్ షెహజాద్, షాహీన్ అఫ్రిది -
బాబర్, రిజ్వాన్, అఫ్రిది వద్దు.. అతడే పాక్ కెప్టెన్ కావాలి: సల్మాన్ బట్
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తమ జట్టు చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై వేటు వేసిన పీసీబీ.. కెప్టెన్సీ మార్పుపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.టీ20 వరల్డ్‌కప్ ముందు పాక్ జట్టు పగ్గాలను తిరిగి చేపట్టిన బాబర్ ఆజం.. మరోసారి ఐసీసీ టోర్నీల్లో జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో బాబర్‌ను పాక్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి.ఈ జాబితాలోకి తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ చేరాడు. పరిమిత ఓవర్లలో పాక్ కెప్టెన్సీని స్టార్ బ్యాటర్ షాన్ మసూద్‌కు అప్పగించాలని బట్ పీసీబీని సూచించాడు. కాగా మసూద్ ప్రస్తుతం టెస్టుల్లో పాక్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు."ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో కాస్త గందరగోళం నెలకొంది. జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటకి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. బాబర్‌కు కెప్టెన్సీ స్కిల్స్ పెద్దగా లేవు.ఫీల్డ్‌లో వ్యూహాలు రచించడంలో విఫలమవుతున్నాడు. పాకిస్తాన్ తిరిగి విన్నింగ్ ట్రాక్‌లో రావాలంటే ఒక్కటే మార్గం. షాన్ మసూద్ అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ అప్పగించాలని"ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భట్ పేర్కొన్నాడు.చదవండి: లంకతో సిరీస్‌తో రీఎంట్రీ!.. ఖరీదైన ఫ్లాట్ కొన్న టీమిండియా స్టార్ -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ కూడా అయిన అజహర్.. పాక్ త్వరలో న్యూజిలాండ్‌తో ఆడబోయే టీ20 సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అజహర్‌ను ప్రస్తుతం ఈ సిరీస్‌కు మాత్రమే కోచ్‌గా ఎంపిక చేశారు. న్యూజిలాండ్ సిరీస్‌కు టీమ్ మేనేజర్‌గా పాక్ మాజీ బౌలర్ వహాబ్ రియాజ్ నియమించబడ్డాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు మహ్మద్ యూసుఫ్, సయీద్ అజ్మల్ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు పాక్‌లో పర్యటింనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 18, 20, 21, 25, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు రావల్పిండి వేదిక కానుండగా.. ఆఖరి రెండు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదివరకే ప్రకటించబడగా.. పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత కొంతకాలంగా ఫుల్‌టైమ్ హెడ్ కోచ్ కోసం అన్వేషిస్తుంది. ఈ పదవిని భర్తీ చేయడం కోసం పీసీబీ పెద్ద కసరత్తే చేసింది. ఒకానొక సమయంలో పాక్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. వాట్సన్ పీసీబీ ప్రతిపాదనను తోసిపుచ్చడంతో అజహర్ పాక్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. గ్రాంట్ బ్రాడ్‌బర్న్ నిష్క్రమణ తర్వాత పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి హెడ్ కోచ్ లేడు. ఇదిలా ఉంటే, 49 ఏళ్ల అజహర్ మహమూద్‌కు గతంలోనూ కోచింగ్ అనుభవం ఉంది. అతను 2017 నుంచి 2019 వరకు పాక్ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. అజహర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పాక్ తరఫున 21 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడిన అజహర్.. 162 వికెట్లు తీసి 2400 పైచిలుకు పరుగులు సాధించాడు. అజహర్ టెస్ట్‌ల్లో 3 సెంచరీలు కూడా చేశాడు. 2012-2015 మధ్యలో ఐపీఎల్లో పాల్గొన్న అజహర్.. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ తరఫున ఆడాడు. ఐపీఎల్లో 23 మ్యాచ్‌లు ఆడిన అజహర్ 29 వికెట్లు తీసి 388 పరుగులు చేశాడు. అజహర్ ఐపీఎల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. -
రోడ్డు ప్రమాదానికి గురైన పాక్ స్టార్ క్రికెటర్లు..
స్వదేశంలో వెస్టిండీస్‌తో వైట్ బాల్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్ మహిళ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్, లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమాలు కారు ప్రమాదానికి గురయ్యారు. కరాచీలోని పీసీబీ ట్రైనింగ్ క్యాంప్‌నకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో వారిద్దరి స్వల్ప గాయాయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించామని, తదుపరి చికిత్స నిమిత్తం వారిని బోర్డు వైద్య బృందం సంరక్షణలో ఉంచామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలను పీసీబీ వెల్లడించలేదు. కాగా ఏప్రిల్ 18న వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన పాక్ ప్రిలిమనరీ జట్టులో బిస్మా మరూఫ్, గులాం ఫాతిమా భాగంగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పీసీబీ ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌లో చెమటోడ్చుతున్నారు. అయితే సరిగ్గా సిరీస్ ప్రారంభానికి రెండు వారాల ముందు స్టార్ క్రికెటర్లు గాయపడటం నిజంగా పాకిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. ఈ వైట్‌బాల్ సిరీస్‌లలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు విండీస్‌తో పాక్ ఆడనుంది. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. BAD NEWS 🚨 Pakistan batter Bismah Maroof and leg spinner Ghulam Fatima suffered minor injuries after being involved in a car accident. They are currently under the care of the PCB medical team.#CricketTwitter pic.twitter.com/rZVlaCteu7 — Female Cricket (@imfemalecricket) April 6, 2024 -
Official: షాహిన్‌పై వేటు.. పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజం
PCB Announces Babar Azam appointed as white-ball captain: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పునర్నియమితుడయ్యాడు. వన్డే, టీ20 జట్ల సారథిగా మరోసారి పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం మేరకు బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది. సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. బాబర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు సూచించారు. అప్పటి పీసీబీ పెద్దలు సైతం బాబర్ ఆజంకు మద్దతుగా నిలవకపోవడంతో అతడు కెప్టెన్‌గా తప్పుకొన్నాడు. అతడి స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్లను సారథులుగా ఎంపిక చేశారు. ఘోర పరాజయాలు ఈ క్రమంలో షాన్ మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్.. కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అదే విధంగా షాహిన్ సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో 4-1తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో పీసీబీ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ఆఫ్రిదిపై వేటు.. మసూద్ కొనసాగింపు! ఇక షాహిన్ ఆఫ్రిది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో పీసీబీ చీఫ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు బాబర్ ఆజంను వన్డే, టీ20ల కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. అయితే, టెస్టులకు మాత్రం షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ జట్టు తదుపరి ఏప్రిల్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో బాబర్ ఆజం నాయకుడిగా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలుపెట్టనున్నాడు. చదవండి: #Mayank Yadav: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఎవరీ మయాంక్ యాదవ్? Babar Azam appointed as white-ball captain Following unanimous recommendation from the PCB’s selection committee, Chairman PCB Mohsin Naqvi has appointed Babar Azam as white-ball (ODI and T20I) captain of the Pakistan men's cricket team. pic.twitter.com/ad4KLJYRMK — Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024 -
పాకిస్తాన్ కెప్టెన్సీకి షాహీన్ షా ఆఫ్రిది గుడ్ బై..? కొత్త సారథి ఎవరంటే?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్సీ నుంచి షాహీన్ షా ఆఫ్రిది తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీలో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత బాధ్యత వహిస్తూ అఫ్రిది తన పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అఫ్రిదికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ,జాతీయ సెలెక్టర్ల మధ్య పెద్దగా కమ్యూనికేషన్ కూడా లేనిట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పీసీబీ తీరు పట్ల అఫ్రిది ఆంసృప్తితో ఉన్నట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి సాధారణ ఆటగాడిగా కొనసాగాలని షాహీన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజాం పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. వచ్చేనెల 18నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బాబర్ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో జట్టు దారుణ వైఫల్యం తర్వాత మూడు ఫార్మాట్లలో ఆజమ్ కెప్టెన్సీపై వేటు పడింది. ఆ తర్వాత టీ20 కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిది, టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్‌ను పీసీబీ నియమించింది. కానీ వీరిద్దరూ తమ మార్క్ చూపిచండంలో విఫలమయ్యారు. మసూద్ సారధ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను పాక్ కోల్పోగా.. షాహీన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ 4-1 సిరీస్ ఓటమిని చవిచూసింది. -
పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్!.. అల్లుడికి అండగా షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. బోర్డు పెద్దలు మారినప్పుడల్లా వారికి అనుగుణంగా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయని.. తమ క్రికెట్ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొన్నాడు. కాగా పీసీబీ యాజమాన్యం తరచూ మారుతున్న విషయం తెలిసిందే. ప్రధాని షాబాజ్ జోక్యం నేపథ్యంలో రమీజ్ రాజాను అధ్యక్షుడిగా తప్పించి.. నజమ్ సేథీని తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. అనంతరం నజమ్ సేథీ కూడా వైదొలగడంతో.. అతడి స్థానంలో జకా అష్రాఫ్ బాధ్యతలు చేపట్టాడు. అతడు కూడా రాజీనామా చేయడంతో సుప్రీం కోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన పీసీబీ ఎన్నికలు ముగిసే వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. అనంతరం ఎలక్షన్లో గెలిచిన మొహ్సిన్ నఖ్వీ పీసీబీ బాస్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరుకుండా పాకిస్తాన్ నిష్క్రమించడంతో కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేశారు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్‌గా షాహిన్ ఆఫ్రిదిని నియమించారు. అయితే, వీరిద్దరి సారథ్యంలో తొలి సిరీస్‌లలోనే పాకిస్తాన్ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీ బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్ చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీ20లకు షాహిన్ ఆఫ్రిదిని తప్పించి బాబర్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై స్పందించిన షాహిద్ ఆఫ్రిది.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదికి అండగా నిలిచాడు. ‘‘ఒకరిని కెప్టెన్‌గా నియమించినపుడు తనను తాను నిరూపించుకునేందుకు కొంత సమయం కూడా ఇవ్వాలి. అంతేగానీ కొత్త వాళ్లు రాగానే మళ్లీ మార్పులు చేస్తాం అంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఒక ఆటగాడిని సారథిని చేసి వెంటనే తొలగించాలనుకుంటున్నారంటే ఆ నిర్ణయం తప్పుడైది ఉండాలి. లేదంటే మళ్లీ మార్చాలనుకున్న నిర్ణయమైన సరైంది కాకపోయి ఉండాలి’’ అని పీసీబీ తీరును విమర్శించాడు. తన అల్లుడు షాహిన్‌కు మరికొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. -
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ దిగ్గజం.. !?
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రోంచి బాధ్యతలు చేపటనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రోంచి కూడా పీసీబీ ఆఫర్‌పై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోంచి ప్రస్తుతం న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఒకవేళ పీసీబీ ఆఫర్‌ను అతడు అంగీకరిస్తే న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు. కాగా వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజం పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ సైతం తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో గత డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల కోసం మహమ్మద్ హఫీజ్ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు తమ జట్టు హెడ్‌కోచ్ పదవిని భర్తీ చేసే పనిలో పీసీబీ పడింది. ఇప్పటికే ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్, విండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామిని హెడ్‌కోచ్ పదవి కోసం పీసీబీ సంప్రదించింది. కానీ పీసీబీ ఆఫర్‌ను వారిద్దరూ రిజక్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ల్యూక్ రోంచితో పీసీబీ చర్చలు జరపుతోంది. Luke Ronchi in talks with PCB for Pakistan's head coach position.#PakistanCricket pic.twitter.com/nelmZvVm2b — Nawaz 🇵🇰🇦🇪 (@Rab_Nawaz31888) March 26, 2024 -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కన్నుమూత
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. డాషింగ్ బ్యాటర్‌గా పేరున్న అహ్మద్ పాక్ తరఫున 41 టెస్ట్‌లు ఆడి ఐదు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన అహ్మద్ పాక్ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు. 1958లో వెస్టిండీస్‌తో జరిగిన బ్రిడ్జ్‌టౌన్ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన అహ్మద్.. తన స్వల్ప కెరీర్లో మూడు మ్యాచ్‌ల్లో పాక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అహ్మద్ క్రికెట్ కెరీర్‌కు 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే పుల్ స్టాప్ పడింది. 1972-73 ఆస్ట్రేలియా టూర్లో అహ్మద్ తన చివరి టెస్ట్ మ్యాచ్ (మెల్బోర్న్) ఆడాడు. ఫిట్నెస్ విషయంలో క్రికెట్ బోర్డుకు తప్పుడు సమాచారం అందించాడన్న కారణంగా అతని కెరీర్‌కు అర్దంతంగా ఎండ్ కార్డ్ పడింది. పాక్ దిగ్గజం హనీఫ్ ముహమ్మద్ విండీస్‌పై చారిత్రక ట్రిపుల్ సెంచరీ (337) సాధించిన ఇన్నింగ్స్‌లో అహ్మద్ అతని భాగస్వామిగా ఉన్నాడు. ఆ ఇన్నింగ్స్‌లో అహ్మద్ 65 పరుగులు చేశాడు. అహ్మద్ పాక్ జాతీయ జట్టుకు ఆరో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అహ్మద్ సారధ్యం వహించిన మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి. సయీద్ అహ్మద్ మరణవార్తను ప్రస్తుత పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వ్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేశారు. సయీద్ అహ్మద్ సోదరుడు యూనుస్ అహ్మద్ కూడా పాక్ టెస్ట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. యూనుస్ పాక్ తరఫున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 1987లో భారత్‌లో పర్యటించిన పాక్ జట్టులో యూనస్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ పర్యటనలో పాక్‌కు ఇమ్రాన్ ఖాన్ సారథ్యం వహించాడు. -
పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మళ్లీ కెప్టెన్‌గా బాబర్ ఆజం!?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మెన్‌గా మొహ్సిన్ నఖ్వీ ఎంపికైన సంగతి తెలిసిందే. గత నెలలో పీసీబీ ఛీప్ పదవి నుంచి తప్పుకున్న జకా అష్రఫ్ స్ధానాన్ని మొహ్సిన్ నఖ్వీ భర్తీ చేశాడు. అతడు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. అయితే పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నఖ్వీ.. ఓ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ జట్టు పగ్గాలని తిరిగి స్టార్ ఆటగాడు బాబర్‌కు అప్పజెప్పాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఈ క్రమంలో అప్పటి పీసీబీ ప్రెసిడెంట్ జకా అష్రఫ్.. పాక్ టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదిని నియమించాడు. అయితే కెప్టెన్సీలో మార్పులు చోటుచేసుకున్నాక పాకిస్తాన్ జట్టు పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కొత్త కెప్టెన్లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు వెళ్లిన పాకిస్తాన్.. అక్కడ ఘోర ప్రదర్శన కనబరిచింది. మసూద్ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్(3 టెస్టులు) అవ్వగా, అఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయింది. దీంతో పాక్ క్రికెట్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ బాబర్‌కే అప్పజెప్పాలని నఖ్వీ ఆలోచిస్తున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 17 నుంచి జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ అనంతరం పాక్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే బాబర్ తిరిగి పాక్ నాయకత్వ బాధ్యతలు చేపడతాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. బాబర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. -
పాక్ క్రికెట్లో కీలక పరిణామం.. చైర్మెన్‌గా సుప్రీంకోర్టు న్యాయవాది
పాకిస్తాన్ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలిక చైర్మన్‌గా ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. షా ఖవార్ పీసీబీ ఎన్నికల కమీషనర్‌గా కూడా పనిచేస్తున్నారు. కాగా ఈ నెల 20న పీసీబీ చైర్మెన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పదవి చేపట్టి ఏడాది కాకముందే పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ నుంచి అష్రఫ్ వైదొలిగాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని షా ఖవార్ భర్తీ చేయనున్నాడు. ఈ మెరకు పాక్ తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కాకర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెలలలో జరగనున్న పీసీబీ ఎన్నికల వరకు షా ఖవార్ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా పీసీబీ కొత్త అధ్యక్షుడి రేసులో పంజాబ్ ప్రావిన్స్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ ముందంజలో ఉన్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టు విషయానికి వస్తే.. గత కొన్ని రోజులగా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే వరల్డ్‌కప్-2023 నుంచి పాకిస్తాన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. వరల్డ్‌కప్ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో ఘోర ఓటములను చవిచూసింది. చదవండి: #Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఒకేసారి తప్పుకున్న ముగ్గురు కీలక వ్యక్తులు
పాకిస్తాన్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. ఆ జట్టుకు సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు తమతమ పదవులకు రాజీనామా చేశారు. పాక్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ ఒకేసారి విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పీసీబీతో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఈ ముగ్గురు వెల్లడించారు. తమ రాజీనామాలను పాక్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించిందని వారు తెలిపారు. మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుటిక్ ఆయా హోదాల్లో గతేడాదే నియమితులయ్యారు. అంతకుముందు కూడా వీరికి పాక్ జట్టుతో అనుబంధం ఉండింది. అయితే వన్డే వరల్డ్‌కప్‌కు ముందు పీసీబీ వీరి పదవులను మార్చింది. మిక్కీ ఆర్థర్.. గతంలో పాక్ జట్టు హెడ్ కోచ్‌గా.. బ్రాడ్‌బర్న్ ఎన్సీఏ హై పెర్ఫార్మింగ్ కోచ్‌గా పని చేశారు. ఈ ఇద్దరు ఆయా పదవుల్లో అద్భుతంగా రాణించి, పాక్ జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపారు. అయితే కొత్త పదవుల్లోనే మాత్రం వీరు సత్తా చాటలేకపోయారు. ఆర్థర్ డైరెక్టర్‌గా, బ్రాడ్‌బర్న్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక పాక్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం, ఆ తర్వాత ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ పరాభవం.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి.. ఇలా వరుస సిరీస్‌ల్లో పాక్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డే వీరిని తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌ను మార్చిన పాక్.. తాజాగా ప్రధాన నాన్ ప్లేయింగ్ స్టాఫ్‌ను మార్చడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో ఓటమి నేపథ్యంలో బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో పీసీబీ మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాలో 0-3తో సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాక్ టీ20 జట్టు న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో (మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే) కోల్పోయింది. పాక్ ఇవాళ (జనవరి 19) న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో తలపడనుంది. -
పాక్ సెలక్టర్‌గా ‘మ్యాచ్ ఫిక్సర్’
ఫిక్సింగ్ ఉదంతంలో నిషేధానికి గురి కావడంతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన మాజీ ఆటగాడు సల్మాన్ బట్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జాతీయ జట్టు సెలక్టర్‌గా ఎంపిక చేసింది. అతనితో పాటు మరో ఇద్దరు మాజీలు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అంజుమ్ కూడా సెలక్టర్లుగా ఎంపికయ్యారు. చీఫ్ కోచ్ వహాబ్ రియాజ్‌తో కలిసి వీరిద్దరు పని చేస్తారు. సల్మాన్ బట్ పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టులో కెప్టెన్‌గా ఉన్న బట్ సహచరులు ఆసిఫ్, ఆమిర్‌లతో నోబాల్స్ వేయించి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ నిషేధంతో పాటు బట్కు 30 నెలల జైలు శిక్ష కూడా పడింది. అయితే 7 నెలలకే విడుదలైన బట్ 2016లో తిరిగి క్రికెట్లోకి అడుగు పెట్టాడు. దేశవాళీలో మంచి ప్రదర్శన కనబర్చినా...పాక్ జట్టు కోసం అతని పేరును మళ్లీ పరిశీలించలేదు. అయితే ఇప్పుడు సెలక్టర్‌గా అతను అధికారిక పదవిలోకి వచ్చాడు. -
నో ఛాన్స్! అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
Imad Wasim announces retirement: పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. చాలా కాలంగా ఈ విషయంపై సమాలోచనలు చేస్తున్నానని.. అయితే రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపాడు. దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం కల్పించినందుకు పాక్ క్రికెట్ బోర్డు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. తనకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటానని ఇమాద్ వసీం ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాడు. అందరికీ థాంక్స్ అంతర్జాతీయ క్రికెటర్‌గా తన ఎదుగుదలలో తన కుటుంబానిది కీలక పాత్ర అన్న ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. వారి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఇకపై ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా కనిపించకపోయినా.. ఆటను మాత్రం కొనసాగిస్తానని ఇమాద్ వసీం స్పష్టం చేశాడు. అదే విధంగా.. కొత్త కోచ్‌లు, కొత్త నాయకుల రాకతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మరింత పటిష్టంగా మారుతుందని ఇమాద్ ధీమా వ్యక్తం చేశాడు. పాక్ జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. కాగా 34 ఏళ్ల ఇమాద్ వసీం.. పాకిస్తాన్ తరఫున 55 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. 50 ఓవర్ల క్రికెట్లో 986, పొట్టి క్రికెట్లో 486 పరుగులు సాధించిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 44, 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇమాద్ వసీం.. జట్టులో కీలక సభ్యుడిగా పేరొందాడు. చాంపియన్స్ ట్రోఫీ-2017 గెలిచిన పాక్ జట్టులో అతడు సభ్యుడు. అదే విధంగా టీ20 వరల్డ్‌కప్-2016, వరల్డ్‌కప్-2019, టీ20 వరల్డ్‌కప్-2021 ఈవెంట్లలో కూడా పాల్గొన్నాడు. pic.twitter.com/RdEesK9qsl — Imad Wasim (@simadwasim) November 24, 2023 కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో అతడి పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుగ్గా ఆడిన ఇమాద్.. స్పిన్ విభాగంలో చోటు దక్కించుకుంటాడని అంతా భావించారు. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో దక్కని చోటు అయితే... అప్పటి చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం.. ఇమాద్ చాలా కాలంగా వన్డేలు ఆడటం లేదు కాబట్టి అతడిని ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తేనే ఎవరికైనా ఛాన్స్ ఇస్తామని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ఇమాద్ వసీం ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. అతడు చివరగా ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో టీ20 సందర్భంగా పాక్ తరఫున మైదానంలో దిగాడు. చదవండి: ఆరు స్వర్ణాలు గెలిచిన బ్లేడ్ రన్నర్.. గర్ల్‌ఫ్రెండ్‌ను హత్యచేసి.. ఇలా.. -
వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం.. పాక్ బోర్డు మరో కీలక నిర్ణయం
CWC 2023- Pakistan Team- PCB: వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం తప్పుకోగా.. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 సారథిగా ప్రకటించింది. అదే విధంగా టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించింది. ఇక కెప్టెన్సీ మార్పులతో పాటు పాలనా విభాగం, శిక్షనా సిబ్బందిలోనూ కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా.. మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించిన పీసీబీ.. వహాబ్ రియాజ్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. బౌలింగ్ కోచ్‌లుగా ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ తాజాగా.. పీసీబీ తమ కోచింగ్ స్టాఫ్‌లో మరో ఇద్దరు మాజీ క్రికెటర్లను చేర్చుకుంది. ఉమర్ గుల్, సయీద్ అజ్మల్లకు బౌలింగ్ కోచ్‌లుగా అవకాశం ఇచ్చింది. గుల్ ఫాస్ట్‌బౌలింగ్ విభాగానికి కోచ్‌గా సేవలు అందించనుండగా.. అజ్మల్ స్పిన్ దళానికి మార్గదర్శనం చేయనున్నాడు. వీరిద్దరు డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మంగళవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా ఉమర్ గుల్ ఇప్పటికే పాకిస్తాన్ జట్టుతో ప్రయాణం ఆరంభించాడు. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా కోచ్‌గా వ్యవహరించాడు. మోర్నీ మోర్కెల్ గుడ్‌బై కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్లో పాకిస్తాన్ దారుణ వైఫల్యంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బాబర్ బృందం వరుస ఓటముల కారణంగా.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ముఖ్యంగా వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అఫ్గనిస్తాన్ చేతిలో చిత్తై పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ తన విధుల నుంచి వైదొలిగాడు. ఉమర్ గుల్.. సయీద్ అజ్మల్ కెరీర్ వివరాలు పాకిస్తాన్ తరఫున 2003లో ఎంట్రీ ఇచ్చిన 2016లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక తన కెరీర్లో ఈ రైటార్మ్ పేసర్ 47 టెస్టులాడి 163, 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు. అజ్మల్ విషయానికొస్తే.. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్ మొదలుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. 2015లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. తన కెరీర్లో 35 టెస్టులు, 113 వన్డేలు, 64 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 178, 184, 85 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 WC: ‘వరల్డ్‌కప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మనే! కోహ్లి కూడా..’ -
CWC 2023: పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్
పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హాక్ తన పదవికి రాజీనామా చేశాడు. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణల (క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంజమామ్ వెల్లడించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సైతం ధృవీకరించింది. వరల్డ్‌కప్-2023లో వరుస వైఫల్యాలతో (6 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్ జట్టుకు ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కాగా, పాక్ లోకల్ న్యూస్ ఛానల్ "జియో న్యూస్" కథనం మేరకు పీసీబీలో ప్లేయర్స్ మేనేజ్మెంట్ కోసం రిజిస్టర్ చేయబడిన కంపెనీలో ఇంజమామ్ భాగస్వామి అని తెలుస్తుంది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో అవినీతి జరిగి ఉంటుందని పాక్ ప్రజలు సోషల్‌మీడియా వేదికగా ఇంజమామ్‌పై ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ తన పదవికి రాజీనామా చేస్త్నన్నట్లు ఇవాళ ప్రకటించాడు. రాజీనామా విషయాన్ని వెల్లడిస్తున్న సందర్భంగా ఇంజమామ్ ఇలా అన్నాడు. ప్రజలు పరిశోధన లేకుండా మాట్లాడతారు. నాపై ప్రశ్నలు లేవనెత్తారు కాబట్టి నేను రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. -
భారత ప్రేక్షకులపై పీసీబీ ఫిర్యాదు.. బాబర్, రిజ్వాన్‌లను వేధించారని ఆరోపణలు
ఈ నెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా పలువురు భారత అభిమానులు తమ జట్టును వేధింపులకు గురి చేశారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. టాస్ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్రాడ్‌కాస్టర్ రవిశాస్త్రితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైదానంలోని ప్రేక్షకులు బిగ్గరగా అరుస్తూ, తమ జట్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారని పీసీబీ ఆరోపించింది. మహ్మద్ రిజ్వాన్ ఔటై డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా పలువురు అభిమానులు 'జై శ్రీరాం' నినాదాలు చేసి అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తమ జర్నలిస్టులకు వీసాల జాప్యం, భారత్‌లో ప్రవేశించకుండా (వరల్డ్‌కప్ మ్యాచ్‌లు చూసేందుకు) తమ అభిమానులపై అంక్షలు వంటి పలు అంశాలను కూడా పీసీబీ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది. ఈ విషయాలను పీసీబీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. కాగా, పీసీబీ కొద్దిరోజుల కిందట కూడా ఇదే అంశాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. The Pakistan Cricket Board (PCB) has lodged another formal protest with the ICC over delays in visas for Pakistani journalists and the absence of a visa policy for Pakistan fans for the ongoing World Cup 2023. The PCB has also filed a complaint regarding inappropriate conduct… — PCB Media (@TheRealPCBMedia) October 17, 2023 ఇదిలా ఉంటే, వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను 191 పరుగులకు కట్టడి చేసిన భారత్.. ఆతర్వాత సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి, ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిదో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించగా.. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (86), శ్రేయస్ అయ్యర్ (53 నాటౌట్) చెలరేగారు. ప్రస్తుత ఎడిషన్‌లో భారత్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించగా.. పాక్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించింది. భారత్ రేపు (అక్టోబర్ 19) జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉండగా.. పాక్.. అక్టోబర్ 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. -
WC: దిగొచ్చిన పీసీబీ.. ఆటగాళ్లే ఆస్తులు! వాళ్లకు ఏకంగా 202 శాతం హైక్
Pakistan announces landmark central contracts: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో చారిత్రాత్మక నిర్ణయంతో కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. మెన్స్ టీమ్‌లోని క్రికెటర్లతో మూడేళ్ల ఒప్పందానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ద్వారా లభించే ఆదాయంలో మూడు శాతం మేర చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో ఆటగాళ్లకు మిలియన్ యూఎస్ డాలర్ల మేర రెవెన్యూ సమకూరనుంది. అయితే.. ఓ కండిషన్ ఇక ఈ ఏడాది జూలై 1 నుంచే ఒప్పందం అమల్లోకి వస్తుందని.. అయితే, 12 నెలలకొకసారి క్రికెటర్ ప్రదర్శనపై సమీక్ష ఆధారంగానే చెల్లింపులు ఉంటాయని పీసీబీ స్పష్టం చేసింది. ఈ చరిత్రాత్మక ఒప్పందంలో భాగమయ్యేందుకు అత్యధికంగా 25 మంది క్రికెటర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు బుధవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తొలిసారి టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెటర్ల కాంట్రాక్టును మెర్జ్ చేసినట్లు పీసీబీ తెలిపింది. సెలక్షన్ విషయంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదే విధంగా నెలవారీ ఆదాయంతో పాటు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల ఫీజును 50 శాతానికి, వన్డేలు ఆడేవాళ్ల ఫీజును 25 శాతం, టీ20లు ఆడేవాళ్లకు 12.5 ఫీజును పెంచనున్నట్లు వెల్లడించింది. మరో రెండు టీ20లీగ్‌లలో అంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పాక్ ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు మరో రెండు ఇతర టీ20 లీగ్‌లు ఆడేందుకు పీసీబీ అనుమతినిచ్చింది. పీసీబీ తమ డిమాండ్లను అంగీకరించిన నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం స్పందిస్తూ.. ఇది చారిత్రాత్మక ఒప్పందం అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మాట్లాడుతూ.. తమ ఆటగాళ్లతో చర్చలు కొలిక్కి వచ్చాయని.. ఇలాంటి డీల్ కుదరడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ నిజమైన ఆస్తులు ఆటగాళ్లేనని.. వాళ్లు ఆర్థికంగా కూడా బలంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. పీసీబీ తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం.. కేటగిరీ-ఏ: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ షా ఆఫ్రిదిలకు 202 శాతం హైక్($15,500). కేటగిరీ-బి: ఫఖర్ జమాన్, హ్యారిస్ రవూఫ్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, నసీం షా, షాదాబ్ ఖాన్లకు 144 శాతం హైక్($10,000). కేటగిరీ- సి: ఇమాద్ వసీం, అబ్దుల్లా షఫిక్‌లకు 135 శాతం హైక్$6,000) కేటగిరీ- డి: ఫాహిం ఆష్రఫ్, హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఇహసానుల్లా, మహ్మద్ హ్యారిస్, మహ్మద్ వసీం జూనియర్, సయీమ్ ఆయుబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షానవాజ్ దహాని, షాన్ మసూద్, ఉసామా మిర్, జమాన్ ఖాన్లకు 127 శాతం హైక్($1,700) హైదరాబాద్‌లో పాక్ జట్టు కాగా పీసీబీతో తాజా ఒప్పందంతో బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ వంటి టాప్ ప్లేయర్లకు నెలకు 15,600 అమెరికా డాలర్ల మేర(భారత కరెన్సీలో దాదాపు పన్నెండు లక్షల తొంభై ఏడువేలు) సాలరీ లభించనుంది. ఇదిలా ఉంటే.. పీసీబీ ప్రకటన నేపథ్యంలో బుధవారం రాత్రే పాక్ క్రికెట్ జట్టు భారత్‌కు చేరుకోవడం విశేషం. హైదరాబాద్‌లో మ్యాచ్‌ల నేపథ్యంలో ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చదవండి: WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్‌గా మార్కరమ్ A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK — Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023 Ready to roar: @RealHa55an begins the World Cup preparations 🏃☄️#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/4RWGWr4GLR — Pakistan Cricket (@TheRealPCB) September 28, 2023 -
WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్
ICC ODI WC 2023- Pakistan Squad: వన్డే ప్రపంచకప్-2023 జట్టులో చోటు ఆశించిన వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంకు భంగపాటు తప్పలేదు. భారత్ వేదికగా అక్టోబరు 5న మొదలుకానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఇమాద్.. స్పిన్ దళంలో ఒకడిగా తప్పక టీమ్‌లోకి వస్తాడని భావించివారి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ఇమాద్ వసీంను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. అలాంటి వాళ్లనే ఎంపిక చేస్తాం ‘‘చాలా రోజులుగా ఇమాద్ వన్డేలు ఆడటం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో తమను తాము నిరూపించుకోవాల్సిందే. అందుకే అతడికి చోటు లేదు డొమెస్టిక్ క్రికెట్లో ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అదే మెయిన్ క్రైటీరియా’’ అని ఇంజమామ్ ఉల్ హక్ స్పష్టం చేశాడు. కాగా వరల్డ్‌కప్‌నకు ప్రకటించిన జట్టులో నసీం షా స్థానంలో హసన్ అలీ రీఎంట్రీ ఇస్తుండగా.. మహ్మద్ వసీం జూనియర్ నాలుగో సీమర్‌గా చోటు సంపాదించాడు. అనూహ్య రీతిలో ఉస్మా మీర్‌కు కూడా స్థానం దక్కింది. ఇదిలా ఉంటే.. సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు ఆడుతున్న ఇమాద్ వసీం 10 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీయడంతో పాటు 268 పరుగులు సాధించాడు. కాగా పాక్ తరఫున ఇప్పటి వరకు 55 వన్డేలు ఆడిన 34 ఏళ్ల ఇమాద్.. 986 పరుగులు చేయడంతో పాటు.. 44 వికెట్లు పడగొట్టాడు. చివరగా 2020లో జింబాబ్వేతో సొంతగడ్డపై వన్డే ఆడాడు. చదవండి: Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే? 🚨 Our squad for the ICC World Cup 2023 🚨#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/pJjOOncm56 — Pakistan Cricket (@TheRealPCB) September 22, 2023 -
Asia Cup 2023: జనాలు లేక బోసిపోయిన పాక్ స్టేడియం.. దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్
ఆసియా కప్-2023 ఆరంభ మ్యాచ్ ఇవాళ (ఆగస్ట్ 30) పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్, నేపాల్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో జనం హాజరవుతారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంచనా వేసింది. అయితే వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది లాంటి లోకల్ స్టార్లు ఉన్నా, వారిని చూసేందుకు కూడా జనాలు స్టేడియంకు తరలిరాలేదు. ప్రేక్షకులు లేక స్టేడియం బోసిపోయింది. స్టాండ్స్ అన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. 30000 కెపాసిటీ ఉన్న స్టేడియంలో కేవలం వందల సంఖ్యలోనే ప్రేక్షకులు దర్శనమిచ్చారు. మ్యాచ్‌కు భారీగా జనాలు తరలివస్తారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పలువురు లోకల్ సెలబ్రిటీలతో ఓపెనింగ్ సెర్మనీని కూడా నిర్వహించింది. వారిని చూసేందుకు కూడా జనాలు రాలేదు. మెగా ఈవెంట్ ఆరంభ వేడుకలకు, స్థానిక జాతీయ జట్టు ఆడుతున్న మ్యాచ్ చూసేందుకు జనాలు రాకపోవడంతో టోర్నీ నిర్వహించిన పీసీబీపై క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ దేశ స్టార్ క్రికెటర్లు మ్యాచ్ ఆడుతున్నా జనాలను స్టేడియంకు రప్పించలేకపోయారని ఛీకొడుతున్నారు. A complete empty Stadium in Multan. And They wanted to host full asia Cup in Pakistan They Were Saying To boycott Asia Cup And World Cup Shame On Pani Fans #AsiaCup23 #PAKvsNEP #WorldCup2023 #dhoni #SachinTendulkar #ViratKohli𓃵 #msdhoni pic.twitter.com/fdtPjwihht — the DUGOUT ! (@teams_dream) August 30, 2023 జింబాబ్వే లాంటి చిన్న దేశంలో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ జరిగితే స్టేడియాలకు ప్రేక్షకులు తండోపతండాలుగా వచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఆసియా కప్-2023 పాకిస్తాన్ లెగ్ అట్టర్ ఫ్లాప్ అని సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పసికూనతో మ్యాచ్ కావడంతో పాక్ బ్యాటర్లు చించేస్తారని ఆ దేశ అభిమానులు ఊహించుకున్నారు. అయితే పరిస్థితి తారుమారైంది. పాక్ 25 పరుగులకే తమ ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. ఫకర్ జమాన్ 14 పరుగులు చేసి కరణ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 5 పరుగులు చేసి రనౌటయ్యాడు. కొంత సేపు బాబర్ ఆజమ్ సాయంతో మహ్మద్ రిజ్వాన్ ప్రతిఘటించినా, 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతనూ రనౌటయ్యాడు. 5 పరుగులు చేసి అఘా సల్మాన్ లామిచ్చేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 35 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 180/4గా ఉంది. బాబర్ ఆజమ్ 81, ఇఫ్తికార్ అహ్మద్ 24 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. -
Asia Cup 2023: పాకిస్తాన్‌కు వెళ్లనున్న బీసీసీఐ పెద్దలు
బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. ఆసియా కప్-2023 ప్రారంభ వేడులకు హాజరు కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపిన ఆహ్వానం మేరకు వీరిరువురు దాయాది దేశానికి పయనం కానున్నారు. పీసీబీ వీరిద్దరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షాకు కూడా ఆహ్వనం పంపినప్పటికీ.. అతను లాహోర్‌కు వెళ్లేందుకు అయిష్టత ప్రదర్శించాడు. దీంతో అక్టోబర్ 30న రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లాలు మాత్రమే పాక్‌కు వెళ్లనున్నారు. కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ టోర్నీకి పాక్ ఒక్కటే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉనప్పటికీ.. భారత క్రికెట్ జట్టు పాక్‌లో అడుగుపెట్టదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యంగా మారింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ ఈ నెల 30న జరుగనుంది. ముల్తాన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో పాక్ –నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు పల్లెకెలె మైదానం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 4 భారత్.. నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్ ముగుస్తుంది. అనంతరం భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. -
పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్ ఉల్ హాక్
పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్.. ఆ దేశ జాతీయ పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా నియమించబడ్డాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. గత వారమే పాకిస్తాన్ క్రికెట్ టెక్నికల్ కమిటీలో చేరిన ఇంజమామ్.. తాజాగా చీఫ్ సెలెక్టర్‌గానూ బాధ్యతలు చేపట్టినట్లు పీసీబీ వెల్లడించింది. ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ త్వరలో పాక్ ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, ఆసియా కప్‌కు జట్లను ప్రకటిస్తుందని పీసీబీ ప్రతినిధి తెలిపారు. సెలెక్షన్ కమిటీలో ఇంజమామ్‌తో పాటు టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్‌కోచ్ బ్రాడ్‌బర్న్ ఉంటారని, ఇంజమామ్ వీరి ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకుని జట్టును ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రతిపాదన మేరకు టీమ్ డైరెక్టర్, హెడ్ కోచ్‌లను సెలెక్షన్ ప్యానెల్లో కొనసాగించామని స్పష్టం చేశారు. ఇంజమామ్, ఆర్థర్, బ్రాడ్‌బర్న్ త్రయం.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, ఆసియా కప్‌లతో పాటు భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు కూడా జట్టును ప్రకటిస్తారని తెలిపారు. మాజీ ఆటగాడు మిస్బా ఉల్ హాక్ నేతృత్వంలోని పీసీబీ క్రికెట్ టెక్నికల్ కమిటీ ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని ప్రతిపాదించి, ఆమోదించిందని వెల్లడించారు. ఇంజమామ్ ఎంపికకు పీసీబీ చైర్మన్ జకా అష్రాఫ్ కూడా అమోద ముద్ర వేసారని అన్నారు. కాగా, ఇంజమామ్ గతంలో 2016 నుండి 2019 వరకు పాక్ నేషనల్ మెన్స్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జట్టు 2017లో సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. -
Ind Vs Pak: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్ సెప్టెంబర్ 2న!
ఉపఖండపు క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ(జూలై 19, బుధవారం) రాత్రి 7:45 గంటలకు మ్యాచ్‌లు షెడ్యూల్, వేదికల వివరాలను పీసీబీ విడుదల చేసే యోచనలో ఉంది. కాగా ఆసియా కప్‌కు ఈసారి హైబ్రీడ్ మోడ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్ ఆడే మ్యాచ్‌లు సహా మొత్తం 9 మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లకు వేదిక కానుంది. వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో ఆసియా కప్ ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్లో జరగనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 2న కాండీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్‌లోనే దాయాదులు రెండుసార్లు తలపడే అవకాశముంది(లీగ్ దశలో, సూపర్ 4లో మరోసారి). ముందుగా ఆగస్టు 31 నుంచి నిర్వహించాలనుకున్న ఆసియా కప్ ఒకరోజు ముందుగానే టోర్నీని ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) వెల్లడించింది. ఇక టోర్నీలో తొలి మ్యాచ్ పాకిస్థాన్‌లోని ముల్తాన్ లో పాకిస్థాన్, నేపాల్ మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు శ్రీలంకలోని కొలంబో ఆతిథ్యమివ్వనుంది.ఆసియా కప్ కు సంబంధించి ఏసీసీ షెడ్యూల్ ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇందులో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పాకిస్థాన్, శ్రీలంకలలో టోర్నీ జరగనుండటంతో డ్రాఫ్ట్ షెడ్యూల్లో తరచూ మార్పులు తప్పడం లేదు. మొత్తం 13 మ్యాచ్‌లు ఆసియాకప్ 2023లో భాగంగా మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఈ లెక్కన ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ సూపర్ 4లోనూ తలపడటం ఖాయం. ఈ లెక్కన ఆసియా కప్ లో కనీసం రెండుసార్లు ఈ రెండు జట్లు పోటీ పడతాయి. అదే జరిగితే ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా సెప్టెంబర్ 10న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంటుంది. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఏ1, ఏ2 మధ్య క్యాండీలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక సూపర్ 4 స్టేజ్ లో సెప్టెంబర్ 6న ఒక్క మ్యాచ్ మాత్రమే పాకిస్థాన్ లో జరుగుతుంది. ఈసారి డ్రాఫ్ట్ షెడ్యూల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. గ్రూప్ స్టేజ్ లో టీమ్స్ ఏ స్థానంలో నిలిచాయన్నదానితో సంబంధం లేకుండా వాటికి నంబర్లు కేటాయించారు. ఈ లెక్కన గ్రూప్ ఎలో పాకిస్థాన్ ఏ1 కాగా.. ఇండియా ఏ2గా ఉంది. అటు గ్రూప్ బిలో శ్రీలంక బీ1, బంగ్లాదేశ్ బీ2గా ఉంటుంది. ఒకవేళ ఈ ఇవి కాకుండా ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ సూపర్ 4కు అర్హత సాధిస్తే అవి గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టిన జట్ల స్థానాలను ఆక్రమిస్తాయి. చదవండి: యాషెస్ నాలుగో టెస్ట్‌కు వర్షం ముప్పు.. బజ్‌బాల్ డోస్ పెంచుతామన్న స్టోక్స్ SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్ బౌలర్ -
'జై షా పాకిస్తాన్ వెళ్లడమేంటి?.. దాయాదుల మ్యాచ్ అక్కడే'
ఆసియా కప్ 2023 నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. పీసీబీ చైర్మన్ జకా అష్రఫ్, బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడు జై షా.. సోమవారం భేటీ కావడం ఆసక్తి కలిగించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ హైబ్రీడ్ మోడల్‌కు తాను అంగీకరించినట్లు జకా అష్రఫ్ మీడియాకు వెల్లడించాడు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న ఆసియా కప్‌లో శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్‌లు, పాకిస్తాన్లో నాలుగు మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు. మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ శుక్రవారం విడుదలయ్యే అవకాశముంది. భారత్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు టీమిండియా త్వరలో వెళ్లనుందని.. ముందస్తుగా బీసీసీఐ సెక్రటరీ జై షా పాక్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారంటూ వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. పీటీఐతో మాట్లాడిన ఆయన.. ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు శ్రీలంకలోని డంబుల్లా స్టేడియం వేదిక కానుందని పేర్కొన్నారు. ''బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ ప్రతినిధి జాకా అష్రఫ్ సమావేశం తర్వాత ఆసియా కప్ పై స్పష్టత వచ్చింది. మా కార్యదర్శి జై షా, పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ ను కలిశారు. ఆసియా కప్ షెడ్యూల్ ఖరారైంది. పాకిస్థాన్ లో నాలుగు లీగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత 9 మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయి. అందులో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తలపడితే ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరుగుతుంది" అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఇండియన్ టీమ్ పాకిస్థాన్ రాబోతోందన్న మీడియా వార్తలను ఆయన ఖండించారు. భారత జట్టే కాదు.. చర్చల కోసం జై షా కూడా పాకిస్థాన్ వెళ్లడం లేదని అరుణ్ ధుమాల్ తేల్చి చెప్పాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ స్వదేశంలో నేపాల్ తో మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్ కాకుండా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్.. బంగ్లాదేశ్, శ్రీలంక.. శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉపఖండంలో 2016 తర్వాత జరుగుతున్న తొలి ఆసియా కప్ ఇదే. ఆ ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వగా.. తర్వాత 2018, 2022లలో యూఏఈలో జరిగింది. చదవండి: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్.. ఆసియా కప్‌కు గ్రీన్ సిగ్నల్ WCC Suggests ICC: 'వరల్డ్‌కప్ తర్వాత ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను తగ్గించండి' -
వన్డే వరల్డ్‌కప్ ఆడడంపై ఉన్నతస్థాయి కమిటీ: పీసీబీ
భారత్ గడ్డపై అక్టోబర్-నవంబర్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియాతో పాటు అన్ని జట్ల మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఇక చిరకాల ప్రత్యర్థులు పాకిస్తాన్, టీమిండియాలు వన్డే వరల్డ్‌కప్‌లో అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడబోతున్నాయని ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వన్డే వరల్డ్‌కప్ విషయంలో మరోసారి ఆసక్తికర ప్రకటన చేసింది. టోర్నీలో పాల్గొనే విషయంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) కూడా భారత్‌లో పర్యటించేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలోని ఈ కమిటీ.. ప్రపంచకప్ కోసం భారత్‌లో పాక్ పర్యటించే విషయంపై నిర్ణయం తీసుకోనుంది. భారత్-పాకిస్థాన్‌లకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ కమిటీ చర్చించి తుది నివేదికను ప్రధానికి అందించనుంది. మరోవైపు పీసీబీ తాత్కాలిక ఛైర్మన్ జకా అష్రాఫ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ తసీర్.. డర్బన్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం వెళ్లారు. భద్రతా కారణాలు చూపించి.. పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ పదే పదే విముఖత వ్యక్తం చేస్తున్న విషయాన్ని వారు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. భారత్-పాక్‌లు ఐసీసీ, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడుతున్న విషయం తెలిసిందే. చదవండి: #BANVsAFG: సెంచరీలతో చెలరేగిన ఆఫ్గన్ ఓపెనర్లు.. ప్రపంచ రికార్డు -
ఇలాంటి చెత్త పనులు చేయొద్దు: పీసీబీపై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
ICC ODI WOrld Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. అర్థంపర్ధంలేని అభ్యర్థనలతో పరువు తీయొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దయచేసి.. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే పనులు చేయకండని బోర్డు సభ్యులకు విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 జరుగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్.. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఒక్కో మ్యాచ్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మారుస్తారా ప్లీజ్! అయితే, షెడ్యూల్లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో చెన్నైలో, ఆస్ట్రేలియాతో బెంగళూరులో ఆడాల్సిన మ్యాచ్‌లను మార్చాల్సిందిగా పీసీబీ ఐసీసీని కోరినట్లు సమాచారం. పిచ్‌ల స్వభావం రిత్యా అఫ్గన్‌తో మ్యాచ్ బెంగళూరులో, ఆసీస్‌తో మ్యాచ్ చెన్నైలో ఆడేలా వేదికలు మార్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్పందించిన మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ పీసీబీ తీరును ఎండగట్టాడు. పాక్ టీవీతో మాట్లాడుతూ ‘‘వాతావరణ పరిస్థితులు, వేదికలు జట్ల విజయావకాశాలను ప్రభావితం చేయలేవు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్లో వీటి గురించి ప్రస్తావన అనవసరం. చెత్త రిక్వెస్టులు వద్దు భారత్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లను ఓడిస్తూ పోతోంది. అది వాళ్ల సత్తా. మనమేమో ఆసీస్‌తో అక్కడే ఆడతాం.. అఫ్గనిస్తాన్‌తో ఇక్కడే ఆడతామంటూ కుంటిసాకులు వెదుక్కోవడం ఎందుకు? మన దృష్టి మొత్తం కేవలం ఆట మీద మాత్రమే ఉండాలి. బోర్డు సభ్యులకు ఇదే నా విజ్ఞప్తి. దయచేసి ఇలాంటి చెత్త ప్రమాణాలతో కూడిన అభ్యర్థనలు చేయకండి. అంతర్జాతీయ క్రికెట్ విస్తృతి మరింత పెరిగింది. ఆటగాళ్లు తమ విజయాల గురించి సగర్వంగా చాటిచెప్పుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు మాత్రం మేము ఇక్కడైతేనే ఆడి గెలవగలం అంటూ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదు. ఇలాంటి వాటికి బోర్డు సభ్యులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దేశ క్రికెట్ స్థాయిని పెంచాలే గానీ తగ్గించేలా వ్యవహరించకూడదు’’ అని అక్మల్ పీసీబీని తూర్పారబట్టాడు. వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు: ►అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2 ►అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్ ►అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా ►అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్ ►అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా ►అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ ►నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ ►నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్. చదవండి: భార్యతో టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్! మరీ.. మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే.. -
క్లియరెన్స్ వస్తేనే పాల్గొనేది?.. 'ఆడకపోతే మీ కర్మ'
వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. ఒక్క టీమిండియాతో మాత్రమే అహ్మదాబాద్ వేదికగా ఆడనుంది. అయితే చెన్నై, కోల్‌కతాల్లో తాము ఆడలేమని.. ఈ రెండు వేదికలను మార్చాలని పీసీబీ ఐసీసీకి అభ్యర్థన పెట్టుకున్నప్పటికి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. తాజాగా పీసీబీకి మరో చిక్కు వచ్చి పడింది. అదేంటంటే భారత్‌లో ఏ టోర్నీ జరిగినా ప్రభుత్వం క్లియరెన్స్ తప్పనిసరి. ఇదే విషయమై పీసీబీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు మాకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. ఈ విషయమై మా ప్రభుత్వంతో చర్చలు జరిపాం. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే ఈవెంట్ నిర్వహించే ఐసీసీ సమచారం అందిస్తాం. అయితే వరల్డ్‌కప్‌కు మేము ఆడబోయే మ్యాచ్‌ల్లో రెండు వేదికలను మార్చాలని పెట్టుకున్న ప్రతిపాదనను ఐసీసీ, బీసీసీఐ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని మా ప్రభుత్వం ఎలా తీసుకుంటున్నది తెలియదు అని చెప్పుకొచ్చాడు. కాగా పాక్ ప్రభుత్వం నుంచి పీసీబీకి వరల్డ్‌కప్ ఆడేందుకు క్లియరెన్స్ రాకపోతే బోర్డు చాలా నష్టపోవాల్సి వస్తోంది. పాక్ జట్టు వరల్డ్‌కప్‌లో ఆడకుంటే కోట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పాక్ క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఇక అభిమానులు మాత్రం ఆడకపోతే ఐసీసీకి వచ్చే నష్టం ఏమి ఉండదు.. పీసీబీకే పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని కామెంట్ చేశారు. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్, వివరాలు: అక్టోబర్ 12: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2 అక్టోబర్ 15: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ భారత్ అక్టోబర్ 20: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs ఆస్ట్రేలియా అక్టోబర్ 23: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్ అక్టోబర్ 27: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా అక్టోబర్ 31: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ నవంబర్ 4: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పాకిస్థాన్ vs న్యూజిలాండ్ నవంబర్ 12: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ vs ఇంగ్లాండ్ చదవండి: ఎదురులేని లంక.. గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
పుండు మీద కారం చల్లేలా.. పీసీబీకి హైకోర్టు షాక్
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. త్వరలో పీసీబీకి చైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది.జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్టు ప్రకారం.. 2014 రాజ్యాంగ చట్టాన్ని పీసీబీ గవర్నింగ్ బాడీ ఉల్లఘించినట్లు ఆరోపణలు రావడంతో ఎన్నికలు నిలిపివేయాలని కోర్టు తెలిపింది. అయితే పీసీబీ వాదనను వినడానికి కూడా ఇష్టపడని హైకోర్టు గవర్నింగ్ బాడీలో ఉన్న ప్రతినిధులందరికి నోటీసులు జారీ చేసింది. కోర్టు నిర్వహించే తదుపరి సెషన్‌కు హాజరవ్వాలని కోరింది. అయితే పీసీబీ చైర్మన్‌గా జకా అష్రఫ్ పేరు ఖరారు అయినప్పటికి కోర్టు నుంచి క్లియరెన్స్ వస్తేనే పీసీబీ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆరోపణలు నిజమని తేలితే మాత్రం పీసీబీ గవర్నింగ్ బాడీ ప్రాసెస్‌ను మొత్తం రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి పీసీబీ గవర్నింగ్ బాడీ పది మంది పాలకవర్గంతో ఉంటుంది. ఇందులో ఇద్దరు ప్రధాని సిఫార్సు చేసిన వ్యక్తులు ఉంటే.. మిగతావారిలో నలుగురు ప్రాంతీయ ప్రతినిధులు, మరో నలుగురు సేవా ప్రతినిధులు ఉంటారు. వీరందరు కలిసి నూతన చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే పీసీబీ చైర్మన్ ఎవరనేది మాత్రం ప్రధానమంత్రి చేతుల్లో ఉంటుంది. ఎన్నికైన నూతన పీసీబీ చైర్మన్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఇక ఇవాళ విడుదలైన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌కు సంబంధించి పాకిస్తాన్ తన మ్యాచ్‌లన్నీ దక్షిణాది నగరాల్లో ఆడనుండగా.. భారత్‌తో మ్యాచ్‌ను మాత్రం అహ్మదాబాద్‌లో ఆడనుంది. అక్టోబర్ 15న జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్‌ను కూడా దక్షిణాది నగరాల్లో లేదా కోల్‌కతా, ముంబైలో నిర్వహించాలని కోరింది. కానీ అందుకు ఒప్పుకొని బీసీసీఐ అహ్మదాబాద్‌లోనే ఆడాలంటూ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి ఓటు వేసిన ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. అంతేగాక దక్షిణాదిన పాకిస్థాన్ రెండు వేదికలు (చెన్నై, బెంగళూరు) తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఐసీసీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్ టైమింగ్స్, తదితర వివరాలు -
అతడు ఏమైనా మాట్లాడొచ్చు.. కానీ: పీసీబీకి ఏసీసీ కౌంటర్.. ఇది ఫిక్స్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కాబోయే చైర్మన్‌గా ప్రచారంలో ఉన్న జకా ఆష్రఫ్ వ్యాఖ్యలకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆసియా కప్-2023 నిర్వహణ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని.. ముందుగా అనుకున్నట్లుగానే టోర్నీ నిర్వహించి తీరతామని ఏసీసీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాక్‌కు పంపేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి గతంలోనే కరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ తెర మీదకు రాగా.. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు.. శ్రీలంకలో 9 మ్యాచ్‌ల నిర్వహణకు పీసీబీ అంగీకరించింది. అయితే, నజమ్ సేథీ పీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ నిర్ణయం కాగా.. అతడి స్థానాన్ని భర్తీ చేయబోతున్న జకా ఆష్రఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ మేరకు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను హైబ్రిడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నానని తెలిపాడు. ఈ క్రమంలో జకా వ్యాఖ్యలపై స్పందించిన ఏసీసీ మెంబర్.. ‘‘ఆసియా కప్ మోడల్‌పై తుది నిర్ణయం జరిగిపోయింది. ఏసీసీ ఇందుకు అంగీకారం తెలిపింది. మా నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఆష్రఫ్ తాను ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడొచ్చు.. మాకేం సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్-2023పై మరోసారి గందరగోళం నెలకొంది. ఇక ఆగష్టు 31- సెప్టెంబరు 17 వరకు ఈ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇక ఆసియా టీ20 కప్-2022లో శ్రీలంక విజేతగా అవతరించగా.. పాక్ రన్నరప్‌గా నిలిచింది. చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! స్కాట్లాండ్ ప్లేయర్ విధ్వంసం; ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం -
'పాక్‌కు ఇది అవమానం.. హైబ్రీడ్ మోడల్‌ను వ్యతిరేకిస్తున్నా'
''ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని.. దీనిని వ్యతిరేకిస్తున్నానంటూ''.. పీసీబీకి కాబోయే చైర్మన్ జకా అష్రఫ్ బాంబు పేల్చాడు. ఇటీవలే పీసీబీ తాత్కాలిక చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న నజమ్ సేథీ ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కు ప్రతిపాదన పంపారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన ఏసీసీ పాక్ ప్రతిపాదనను ఒప్పుకొని ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడల్లో నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఆసియా కప్ షెడ్యూల్ కూడా విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరగాల్సి ఉంది. దీని ప్రకారం పాకిస్తాన్ లో నాలుగు మ్యాచ్ లు.. శ్రీలంకలో 9 మ్యాచ్ లు ఆడించేందుకు పీసీబీ అంగీకారం తెలిపింది.తాజాగా బుధవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ మాట్లాడుతూ ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను ఈ హైబ్రిడ్ మోడల్‌ను గతంలోనే వ్యతిరేకించా. ఇదో అర్థం పర్థం లేని విధానం. నేను దీనికి అంగీకరించను. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ).. ఈ ఏడాది ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహిస్తానని తెలిపింది. దాని ప్రకారం ఈ టోర్నీ ఇక్కడే జరగాలి. ఇక టోర్నీలో ప్రధాన మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్ బయటే జరగనున్నాయి. భూటాన్, నేపాల్ వంటి చిన్న జట్లు మాత్రమే ఇక్కడికి వస్తున్నాయి. ఇది పాకిస్తాన్ కు ఒకరకంగా అవమానమే. గతంలో మా బోర్డు ఏం నిర్ణయం తీసుకుందో నాకైతే అవగాహన లేదు. ఆ సమాచారం గురించి నాకు తెలియదు. కానీ క్లారిటీ మాత్రం ఉంది. ఈ తక్కువ వ్యవధిలో ఏం చేయగలనో అది చేస్తా'' అని చెప్పుకొచ్చాడు. PCB Nominated Chairman Zaka Ashraf Reject PCB hybrid Model for Asia Cup Interesting days ahead & controversy related #AsiaCup2023 #WorldCup2023 pic.twitter.com/3El1ISj0ym — Abdul Ghaffar 🇵🇰 (@GhaffarDawnNews) June 21, 2023 అష్రఫ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ఏడాది ఆసియా కప్ భవితవ్యం మళ్లీ ప్రమాదంలో పడ్డట్టే. హైబ్రిడ్ మోడల్ ను తిరస్కరించిన పాకిస్తాన్ ఇప్పుడు ఆడితే పూర్తి మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడాలి లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాలి. ఇంతకుమించి పాక్‌కు మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇదివరకే తాము పాకిస్తాన్ కు వెళ్లేది లేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ భారత్ లేకున్నా ఆసియా కప్ నిర్వహించడం అసాధ్యం. ఇక జకా అష్రఫ్ పీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో టీమిండియా, పాకిస్తాన్‌లు చివరి'సారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! #AsiaCup2023: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త బాస్ ఎవరంటే..?
త్వరలో జరుగనున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఎన్నికల బరి నుంచి తాత్కాలిక బాస్ నజమ్ సేథి వైదొలగడంతో కొత్త అభ్యర్థిగా మాజీ పీసీబీ అధ్యక్షుడు జకా అష్రాఫ్ పేరును ప్రకటించారు పాక్ ఫెడరల్ మంత్రి ఎహసాన్ మజారి. ఛైర్మన్‌గా నజమ్ సేథి పదవీకాలం రేపటితో (జూన్ 21) ముగియనుండటంతో అష్రాఫ్‌ను బరిలోకి దించింది పాక్ ప్రభుత్వం. అష్రాఫ్ 2011-13 మధ్యకాలంలో పీసీబీ ఛైర్మన్‌గా పని చేశారు. పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఆసియా కప్, భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ లొల్లి నేపథ్యంలో నజమ్ సేథి అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు అతను ట్విటర్ వేదికగా వర్తమానం పంపాడు. కాగా, గతేడాది డిసెంబర్లో పాక్ ప్రధాని షాబాజ్.. షరీఫ్ రమీజ్ రజాను పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించి, తాత్కాలిక ఛైర్మన్ నజమ్ సేథిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders. — Najam Sethi (@najamsethi) June 19, 2023 ఈ ఆరు నెలల కాలంలో నజమ్ సేథీ పీసీబీలోని 14 మందితో కూడిన కమిటీని సమర్థంగా నడిపించాడు. కొన్ని కీలక నిర్ణయాలతో తన మార్కును చూపించాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చాడు. ఏసీసీని ఒప్పించి ఆసియా కప్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు. అయితే, భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ పాల్గొనడంపై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో నజమ్ సేథి అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నాడు. -
'గొడవలు జరగడం ఇష్టం లేదు.. రేసు నుంచి తప్పుకుంటున్నా'
పీసీబీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న నజమ్ సేథీ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో పీసీబీ ఛైర్మన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికల్లో రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని నజమ్ సేథీ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపాడు. ''ఆసిఫ్ జర్దారీ, షెహబాజ్ షరీఫ్‌ల మధ్య గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. ఇంతటి అస్థిరత, అనిశ్చితి పీసీబీకి మంచిది కాద. ఈ పరిస్థితుల్లో నేను పీసీబీ చైర్మన్ అభ్యర్థి పదవికి పోటీ చేయలేను. అందుకే తప్పుకుంటున్నా. రేసులో ఉన్న మిగిలినవారికి ఆల్ ది బెస్ట్'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది డిసెంబర్లో రమీజ్ రాజాను పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించిన ప్రధాని షాబాజ్ షరీఫ్ అతని స్థానంలో నజమ్ సేథీని తాత్కాలిక ఛైర్మన్‌గా ఎంపిక చేశాడు. పీసీబీ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరిగేంతవరకు నజమ్ సేథీ తాత్కాలిక ఛైర్మన్‌గా ఉంటారని పీసీబీ పేర్కొంది. కాగా 120 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. ఆరు నెలలు దాటిపోయింది. ఈ ఆరు నెలల కాలంలో నజమ్ సేథీ పీసీబీలోని 14 మందితో కూడిన కమిటీని సమర్థంగా నడిపించాడు. కొన్ని కీలక నిర్ణయాలతో తన ఇంపాక్ట్ చూపించాడు. మికీ ఆర్థర్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా, గ్రాంట్ బ్రాడ్‌బర్న్ హెడ్‌కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్ హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించే ప్రతిపాదన నజమ్ సేథీదే. మొత్తానికి ఏసీసీని ఒప్పించి ఆసియా కప్ హైబ్రీడ్ మోడ్‌లో జరిగేలా చూడడంలో నజమ్ సేథీ సక్సెస్ అయ్యాడు. కాగా ఈ బుధవారం(జూన్ 21న)తో పీసీబీ తాత్కాలిక ఛైర్మన్ పదవీకాలం ముగియనుంది. సమర్థంగా పనిచేసిన నజమ్ సేథీ మరోసారి పీసీబీ ఛైర్మన్‌గా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ నజమ్ సేథీని ఎన్నుకోవడం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఇష్టం లేదు. మరోవైపు ప్రధాని షాబాజ్ షరీఫ్ మాత్రం నజమ్‌కు మద్దతుగా ఉన్నారు. కానీ తన వల్ల ఇద్దరి మధ్య గొడవలు రాకూడదని.. అది పీసీబీకి మంచిది కాదని పేర్కొన్న నజమ్ సేథీ తనంతట తానుగా రేసు నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా నజమ్ సేథీ రేసు నుంచి తప్పుకోగా. మిగిలిన వారిలో జకా అష్రఫ్ పీసీబీ ఛైర్మన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. Salaam everyone! I don’t want to be a bone of contention between Asif Zardari and Shehbaz Sharif. Such instability and uncertainty is not good for PCB. Under the circumstances I am not a candidate for Chairmanship of PCB. Good luck to all stakeholders. — Najam Sethi (@najamsethi) June 19, 2023 చదవండి: 'తప్పేముంది.. రెండింటికి సమన్యాయం చేశాడు' -
'వరల్డ్‌కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ నజమ్ సేథీ రోజుకో మాట మారుస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఒప్పుకున్న వెంటనే కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసిన నజమ్ సేథీ తాజాగా వన్డే వరల్డ్‌కప్ ఆడడంపై ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు అంతా సిద్దమవుతుంది. పీసీబీ ప్రతిపాదన మేరకు పాక్ జట్టు తాము ఆడాల్సిన మ్యాచ్‌ల్లో ఎక్కువ భాగం సౌత్‌లోనే ఆడాల్సి ఉండగా.. భారత్-పాక్ మ్యాచ్ మాత్రం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. అయితే తాజాగా నజమ్ సేథీ భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ ఆడుతామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమంటూ పెద్ద బాంబ్ పేల్చారు. ఆసియా కప్ విషయంలో బీసీసీఐ ఆవలంభించిన వైఖరిని ఇప్పుడు పాక్ క్రికెట్ బోర్డు చేయనున్నట్లు సమాచారం. నిన్నటి ప్రెస్మీట్లో ఏసీసీకి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ''బీసీసీఐ పరిస్థితి అర్థమైందని.. వాళ్లు మా దేశంలో ఆడాలంటే ముందు వాళ్ల ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృశ్యా భారత్ పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతించదు. అయితే మా పరిస్థితి కూడా ఇప్పుడు అదే. భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్‌కప్ ఆడాలంటే మా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. ఐసీసీకి ఇదే వివరించాం. మేము అనుకున్న వేదికల్లో అహ్మదాబాద్ లేదు. కానీ భారత్‌తో మ్యాచ్ అక్కడే జరగనుంది. అయితే అహ్మదాబాద్‌లో ఆడాలా వద్దా అనేది తర్వాత ఆలోచిస్తాం. ముందు వన్డే వరల్డ్‌కప్ ఆడేందుకు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాలి. అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. 2016లో భారత్ పాక్‌లో పర్యటించేందుకు ఆసక్తి చూపలేదు. కానీ అదే ఏడాది భారత్‌లో జరిగిన టి20 వరల్డ్‌కప్ ఆడేందుకు వెళ్లాం. అయితే ముందుగా అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిశాం. ఆయన ఆడేందుకు అనుమతించడంతో ముందు మేము ఆడే మ్యాచ్ వేదికలను పరిశీలించడానికి ఒక స్పెషల్ టీం వెళ్లింది. కాగా అప్పట్లో మేము ఆడాల్సిన ఒక మ్యాచ్ వేదికను దర్శశాల నుంచి కోల్‌కతాకు మార్పించాం. ఆ తర్వాత భారత్‌కు పయనమయ్యాం. అందుకే ముందు వరల్డ్‌కప్ ఆడడంపై క్లియరెన్స్ రానివ్వండి.. అప్పుడు మేం ఆడాల్సిన వేదికలపై చర్చించుకుంటాం'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది'
ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్ధత వీడింది. పీబీసీ ప్రతిపాదించిన హైబ్రీడ్ మోక్కు ఓకే చెప్పిన ఆసియా క్రికెటర్ కౌన్సిల్(ఏసీసీ) గురువారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇక ఆసియా కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో రానుంది. కాగా ఆసియా కప్ నిర్వహణలో పీసీబీ ప్రతిపాదనను అంగీకరించిన ఏసీసీకి.. పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాగానే నజమ్ సేథీ మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. నజమ్ సేథీ మాట్లాడుతూ.. ''ACC ఆసియా కప్ 2023 కోసం మా హైబ్రిడ్ వెర్షన్ ఆమోదించింనందుకు నేను సంతోషిస్తున్నా. ఆసియా కప్ హోస్ట్‌గా మేము ఉండడం.. భారత్ పాకిస్తాన్ రాలేని కారణంగా శ్రీలంక తటస్థ వేదికగా ఉండనుంది. అయితే గత 15 ఏళ్లలో ఆసియా కప్ ద్వారా టీమిండియా పాకిస్తాన్లో అడుగుపెడుతుందని అనుకున్నాం. కానీ బీసీసీఐ పరిస్థితి మాకు అర్థమైంది. మాలాగే బీసీసీఐకి కూడా బార్డర్ దాటి పాక్‌లో ఆసియా కప్ ఆడేందుకు వారి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్‌తో పాటు ఆమోదం కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగదని తెలుసు. కానీ మా ప్రతిపాదనను అర్థం చేసుకున్న ఏసీసీకి కృతజ్ఞతలు.'' అంటూ చెప్పుకొచ్చాడు. کرکٹ کے شائقین کے لیے بڑی خوشخبری ایشیا کپ ایک بار پھر پاکستان میں۔ پاکستان کرکٹ بورڈ کی مینجمنٹ کمیٹی کے چیئرمین نجم سیٹھی کا پیش کردہ ہائبرڈ ماڈل منظور, ایشیا کپ31 اگست سے17 ستمبر تک ہوگا۔ ابتدائی میچز پاکستان میں ہونگے جس کے بعد بقیہ میچز سری لنکا میں کھیلے جائیں گے۔ pic.twitter.com/r9jUZ8jCGX — Pakistan Cricket (@TheRealPCB) June 15, 2023 ఇక ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు... శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. ఆరు జట్లను రెండు గ్రూప్‌లుగా (మూడు జట్లు చొప్పున) విభజించారు. ఒక గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్... మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. గ్రూప్ దశ తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు ‘సూపర్ ఫోర్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ ఫోర్’ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. పాకిస్తాన్‌లోని నాలుగు మ్యాచ్‌లకు లాహోర్ వేదికగా నిలుస్తుంది. శ్రీలంకలో క్యాండీ, పల్లెకెలెలో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్నారు. అయితే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు. గత ఏడాది టి20 వరల్డ్‌కప్ జరగడంతో ఆసియా కప్ టోర్నీని టి20 ఫార్మాట్లో నిర్వహించగా... ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. చదవండి: ఎట్టకేలకు ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల -
ఆసియా కప్ 2023 విషయంలో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్..!
ఆసియా కప్ 2023 (వన్డే ఫార్మాట్) విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. వారు అనుకున్నట్లుగా హైబ్రిడ్ మోడల్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పచ్చజెండా ఊపడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లు పాకిస్తాన్లో.. భారత్ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ ఒప్పుకుందని తెలుస్తోంది. పాక్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ప్రకారం ఆసియా కప్‌లో భాగంగా జరిగే 13 మ్యాచ్‌ల్లో 4 లేదా 5 మ్యాచ్‌లు మాత్రమే వారి స్వదేశంలో జరిగే అవకాశం ఉంది. భారత్-పాక్ మ్యాచ్‌లు సహా భారత్ ఆడే మిగతా మ్యచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరుగుతాయి. టీమిండియా ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు. అలాగే ఈ టోర్నీ షెడ్యూల్లోనూ స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా సెప్టెంబర్ 1-17 మధ్యలో ఈ టోర్నీ జరిగవచ్చని సమాచారం. పాకిస్తాన్లో జరుగబోయే మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో జరుగుతాయని తెలుస్తోంది. మొత్తంగా ఆసియా కప్ 2023 విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులు తొలుత పాకిస్తాన్‌కే దక్కాయి. అయితే భారత్-పాక్ మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో బీసీసీఐ.. భారత జట్టును పాక్‌కు పంపిచేందుకు నిరాకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తామని పాక్ చెప్పింది. పాక్ ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే చెప్పినా.. మిగతా దేశాలు ఎండలకు సాకుగా చూపి నిరాకరించాయి. దీంతో మధ్యే మార్గంగా ఏసీసీ శ్రీలంక పేరును ప్రతిపాదించగా, అందుకు అన్ని దేశాలు సరే అన్నాయి. ఆసియా కప్-2023లో భారత్, పాక్‌లతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ జట్లు పాల్గొంటాయి. భారత్, పాక్, నేపాల్‌లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్-బిలో తలపడతాయి. ఆ తర్వాత సూపర్-4, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. చదవండి: గిల్ది ఔటే.. నేను క్లియర్‌గానే క్యాచ్ పట్టుకున్నా: గ్రీన్ -
పాక్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను నియమించింది. వచ్చే రెండేళ్ల పాటు బ్రాడ్‌బర్న్ పాకిస్థాన్ జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలందించనున్నాడు. ఈ విషయాన్ని పీసీబీ ఇవాళ (మే 13) అధికారికంగా ప్రకటించింది. బ్రాడ్‌బర్న్.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కన్సల్టెన్సీ ప్రాతిపదికన పాక్ ప్రధాన కోచ్‌గా పని చేశాడు. దీనికి ముందు బ్రాడ్‌బర్న్ స్కాట్లాండ్ జట్టు ప్రధాన కోచ్‌గా, 2018 నుండి 2020 వరకు పాకిస్తాన్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.హెడ్ కోచ్ పదవితో పాటు పీసీబీ మరో రెండు ఖాళీలను సైతం భర్తీ చేసింది. బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఆండ్రూ పుట్టిక్ (రెండేళ్ల పాటు)ను, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా డ్రికస్ సైమాన్ను నియమించింది. అలాగే క్లిఫ్ డీకన్‌ను ఫిజియోథెరపిస్ట్‌గా కొనసాగించింది. ఇదిలా ఉంటే, బ్రాడ్‌బర్న్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించిన పీరియడ్‌లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుని, వన్డే సిరీస్‌ను 4-1 కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో నాలుగో వన్డే అనంతరం పాక్ తొలిసారిగా వన్డేల్లో టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. చదవండి: World Cup 2023: భారత్‌లో అడుగుపెట్టేందుకు పాక్ ప్రభుత్వం ఒప్పుకోదు..! -
'కోట్లు నష్టపోతామని తెలుసు'.. మొండివైఖరి పనికిరాదేమో!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మెన్ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ను మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్ మిలియన్ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపాడు. మేము చేసిన ప్రతిపాదనకు ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అంగీకరించకుంటే ఆసియాకప్‌ను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని.. దీనివల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపాడు. ''ఆసియా కప్ విషయంలో మా వైఖరి ఏంటో ఇప్పటికే ఏసీసీకి క్లియర్‌గా చెప్పాం. హైబ్రిడ్ మోడ్‌లో టోర్నీ నిర్వహించడంపై మాకు అభ్యంతరం లేదు. హైబ్రిడ్ మోడ్‌లో భారత్ తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఆడుకోవచ్చు.. మిగతా మ్యాచ్‌లు మాత్రం(ఫైనల్‌తో పాటు) పాక్‌లో జరిగేలా చూడాలని చెప్పాం. అయితే దీనివల్ల మేము ఆతిథ్య హక్కులు కోల్పోకుండా ఉంటాం. ఒకవేళ ఆసియా కప్‌కు మరో షెడ్యూల్‌ను ప్రకటిస్తే మేము ఒప్పుకోం. ఆసియా కప్‌ను బహిస్కరిస్తాం. ఇక దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అయితే తమ దేశంలో ఆసియాకప్ ఆడడానికి భద్రతాపరమైన కారణాలు చూపిస్తున్న బీసీసీఐ ఒక విషయంలో క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మా దేశంలో భద్రత కరువయ్యిందని వారు ప్రూఫ్స్ చూపిస్తే బాగుండు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు మా దేశంలో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పనప్పుడు.. భారత్ మాత్రం ఎందుకు ఈ కారణం చూపిస్తుందో అర్థం కావడం లేదు. అయితే ఏసీసీలో 80 శాతం ఆదాయం పాకిస్తాన్, భారత్‌ల మ్యాచ్‌ల వల్లే వస్తుంది. ఒకవేళ మా ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించకపోతే వచ్చే నష్టాన్ని భరించడానికి సిద్దంగా ఉన్నాం'' అని పేర్కొన్నాడు. నజామ్ సేథీ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఇంత మొండితనం పనికిరాదేమో.. నష్టం భరిస్తామనడం మంచి పద్దతి కాదు.. బీసీసీఐతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది'' అంటూ హితబోధ చేశారు. చదవండి: ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ -
పాకిస్తాన్ క్రికెట్లో అయోమయం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో అయోమయకర పరిస్థితి నెలకొంది. పీసీబీ ఒక్కో సిరీస్‌కు ఒక్కో కోచ్‌కు మారుస్తూ గందరగోళం సృష్టిస్తుంది. ఆ జట్టు ఆడిన గత సిరీస్ (షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్) కోసమని అబ్దుల్ రెహ్మాన్‌ను హెడ్‌కోచ్‌గా నియమించిన పీసీబీ.. ఆ సిరీస్‌లో పాక్‌కు చేదు అనుభవం (1-2తో పాక్ సిరీస్ కోల్పోయింది) ఎదురుకావడంతో రోజుల వ్యవధిలో మరో కోచ్‌ను మార్చింది. స్వదేశంలో త్వరలో ప్రారంభంకానున్న న్యూజిలాండ్ సిరీస్ కోసమని పాక్ క్రికెట్ బోర్డు న్యూజిలాండ్‌కే చెందిన గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించుకుంది. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే.. పాక్ ఏ జట్టుతో అయితే సిరీస్ అడుతుందో, ఆదే దేశానికి చెందిన కోచ్‌ల సేవలను వినియోగించుకుంటుంది. గతంలో చాలా సందర్భాల్లో ఇలాగే జరిగింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో ఆడినప్పుడు ఆ దేశ మాజీ కోచ్‌ల సేవలను వినియోగించుకుంది. మిక్కీ ఆర్థర్ వైదొలిగాక చాలాకాలంగా రెగ్యులర్ కోచ్ లేని పాక్.. స్వదేశీ మాజీలు సక్లయిన్ ముస్తాక్, మిస్బా ఉల్ హాక్, అబ్దుల్ రెహ్మాన్‌లను ట్రై చేసి వదిలేసింది. కాగా, కివీస్‌తో సిరీస్ కోసమని గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను తాతాల్కిక హెడ్‌కోచ్‌గా నియమించిన పీసీబీ.. అతనికి డిప్యూటీగా తాజా మాజీ కోచ్ అబ్దుల్ రెహ్మాన్‌ను నియమించడం ఆసక్తికర అంశం. ఇలా చేయడం స్వదేశీ కోచ్ అయిన అబ్దుల్ రెహ్మాన్‌ను అవమానించడమేనని పాక్ మాజీలు అభిప్రాయపడుతున్నారు. బ్రాడ్బర్న్తో పాటు పీసీబీ ఆండ్రూ పుట్టిక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. ఆఫ్ఘనిస్తాన్్తో సిరీస్‌కు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన ఉమర్ గుల్‌ను కొనసాగించింది. -
'ఆడేది మెగాటోర్నీ.. అలా కుదరదు'; ప్లాన్ బెడిసికొట్టిందా?
ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఆసియా కప్‌కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. అయితే పాక్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ విముఖత వ్యక్తం చేసింది. తటస్థ వేదికలో అయితే మ్యాచ్‌లు ఆడేందుకు తాము సిద్ధమని.. లేదంటే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. దీంతో కొద్దిరోజుల క్రితం దుబాయ్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఆధ్వర్యంలో బీసీసీఐ, పీసీబీలతో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో ఆసియా కప్‌లో భారత్ ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని ఏసీసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది.. ఇందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును(పీసీబీ) కూడా ఒప్పించింది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే అప్పుడు ఫైనల్ కూడా తటస్థ వేదికలో నిర్వహించేందుకు అంగీకరించాలని పీసీబీని కోరింది. దీనికి పీసీబీ ఒప్పుకుంది. అయితే ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకోవడం పీసీబీకి గిట్టనట్లుంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తాము ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదిక(బంగ్లాదేశ్‌లో) నిర్వహించాలని ఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ ఏం స్పందించలేదని తెలిసింది. అయితే ఐసీసీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ''ఆసియా కప్ అనేది ఉపఖండపు టోర్నీ. అందులో నాలుగు నుంచి ఆరు దేశాలు మాత్రమే పాల్గొంటాయి. పైగా బీసీసీఐ కనుసన్నల్లోనే ఆ టోర్నీ జరుగుతుందని అందరికి తెలుసు. ఏసీసీ కౌన్సిల్లో అగ్రభాగం భారత్‌దే. కానీ ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్‌కప్ అనేది మెగా టోర్నీ. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎక్కడ ఆతిథ్యం ఇస్తే అక్కడికి వచ్చి ఆడాల్సిందే.. అంతేకానీ ఒకరి స్వార్థం కోసం వేదికలు మార్చడానికి ఆస్కారం లేదు. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తుంది. ఈ విషయాన్ని ముందే ఆయా దేశాల క్రికెట్ బోర్డుల దృష్టికి తీసుకెళ్లాం. కేవలం మీకోసం మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించలేం. వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చే దేశాలు ఒకే వేదికలో మ్యాచ్‌లు ఉంటే బాగుంటుందని అనుకుంటాయి. ఇప్పుడు ఇలా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించడం మంచి పద్దతి కాదు. పీసీబీ అడిగింది న్యాయపరమైనదే కావొచ్చు. పాక్ ఆడే మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహించాలని అడిగారు. కానీ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చే వాటిలో భారత్ ఒకటే ఉంది. బంగ్లాదేశ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై దృష్టి సారిస్తాం'' అని పేర్కొన్నారు. ఆసియా కప్‌లో టీమిండియా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడేలా ఏసీసీని ఒప్పించి తమ పంతం నెగ్గించుకుంది బీసీసీఐ. ఇది మనసులో పెట్టుకొనే ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లు బంగ్లాదేశ్‌లో ఆడుతామని లేఖ రాసిందని టీమిండియా అభిమానులు పేర్కొన్నారు. కానీ పీసీబీ ప్లాన్ బెడిసికొట్టింది. ఆసియా కప్ అనేది ఉపఖండపు టోర్నీ.. అది మీ ఇష్టం.. కానీ వన్డే వరల్డ్‌కప్ అనేది మెగా టోర్నీ.. అలా కుదరదు అని ఐసీసీ చెప్పకనే చెప్పింది. దీంతో బీసీసీఐని దెబ్బకు దెబ్బ తీయాలని భావించిన పీసీబీ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్లుగా తయారైందని అభిమానులు వ్యంగ్యంగా స్పందించారు. ఇక అక్టోబర్ 5న ప్రారంభం కానున్న వన్డే వరల్డ్‌కప్‌లో 48 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు 12 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రతీ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక టోర్నీలో అత్యంత క్రేజ్ ఉన్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చెన్నై లేదా ఢిల్లీలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. ఒక సెమీఫైనల్‌ను ముంబైలోని వాంఖడేలో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ మరొక సెమీఫైనల్ కోసం వేదికను వెతికే పనిలో ఉంది. చదవండి: Asia Cup 2023: పాక్‌లోనే ఆసియా కప్.. పంతం నెగ్గించుకున్న బీసీసీఐ! బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ! -
Asia Cup: ఓటమి భయం.. అందుకే రానంటున్నారు! అంత సీన్ లేదులే గానీ!
Asia Cup 2023- India Vs Pakistan: టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాజిర్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. ఇష్టారీతిన మాట్లాడితే సహించేదిలేదని వార్నింగ్ ఇస్తున్నారు. ముందు పాక్ జట్టు పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని, ఆత్మవిశ్వాసం ఉంటే పర్లేదని.. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్-2023 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఈ టోర్నీ ఆడేందుకు భారత జట్టు పాక్‌కు వెళ్లదని వ్యాఖ్యానించారు. దీంతో ఇరు బోర్డుల మధ్య ఈ అంశానికి సంబంధించి చర్చోపర్చలు జరిగాయి. సాకు మాత్రమే అంటూ ఈ నేపథ్యంలో ఆసియా కప్ పాక్‌లో నిర్వహించేందుకు అంగీకరించినప్పటికీ.. టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇమ్రాన్ నాజిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘భద్రతా కారణాలు అనేవి కేవలం ఓ సాకు మాత్రమే. ఆస్ట్రేలియా వంటి మేటి జట్లు కూడా పాకిస్తాన్‌కు వచ్చాయి. కానీ భారత జట్టు మాత్రం రావడానికి సాకులు వెదుకుతోంది. పాకిస్తాన్ గడ్డపై ఓడిపోతామనే భయంతోనే వాళ్లు ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడండి. అప్పుడేగా అన్నీ తెలుస్తాయి. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఆసక్తి. కానీ టీమిండియాకు ఓటమిని తట్టుకునే శక్తి ఉండదు. అందుకే ఇలా చేస్తున్నారు’’ అని నాదిర్ అలీ పాడ్‌కాస్ట్ షోలో ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఇమ్రాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ‘‘అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. గతంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ అప్పటికప్పుడు సిరీస్‌లు రద్దు చేసుకున్న విషయం గుర్తులేదా? టీమిండియా వంటి పటిష్ట జట్టు గురించి ఇలాంటి అవాకులు చెవాకులు పేలేముందు ఓసారి ఆలోచించుకుంటే మంచిది. మీ స్థాయి ఏమిటో మర్చిపోవద్దు. మీకంత సీన్ లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్-2023 పాక్‌లో జరుగనుండగా.. వన్డే వరల్డ్‌కప్-2023 భారత్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ వలలో చిక్కుకున్న బ్రిటన్ ప్రధాని! Suryakumar Yadav: ఈ మూడు మ్యాచ్‌లను మర్చిపో సూర్య.. ఐపీఎల్లో బాగా ఆడు! -
ఐపీఎల్‌కు అంత సీన్ లేదు.. పాకిస్తాన్ సూపర్ లీగే తోపు..!
ఐపీఎల్‌ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు నజమ్ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పోలిస్తే పాకిస్తాన్ సూపర్ లీగ్ సూపర్ సక్సెస్ అంటూ నిరాధారమైన కామెంట్స్ చేశాడు. పీఎస్ఎల్ 2023 సీజన్ ముగిసిన అనంతరం పీసీబీ చీఫ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్కు మెరుగైన డిజిటల్ రేటింగ్ ఉందని గొప్పలు పోయాడు. డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా పీఎస్ఎల్ 8వ ఎడిషన్‌ను 150 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారని, ఐపీఎల్-2022 సీజన్‌ను కేవలం 130 మిలియన్ల డిజిటల్ రేటింగ్ మాత్రమే దక్కిందని నిరాధారమైన లెక్కలు చెబుతూ జబ్బలు చరుచుకున్నాడు. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ ఎంతో గొప్పదో చెప్పడానికి ఇదొక్క విషయం చాలంటూ బడాయి ప్రదర్శించాడు. పాక్‌లో జరగాల్సిన 2023 ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని భారత్ కరాఖండిగా తేల్చి చెప్పిన నేపథ్యంలో సేథీ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అసహనం వ్యక్తం చేస్తుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ, ఇలాంటి నిరధారమైన వ్యాఖ్యలు చేసి అంతంతమాత్రంగా ఉన్న ప్రతిష్టను మరింత దిగజార్చుకోవద్దంటూ నెటిజన్లు పీసీబీకి చురకలంటిస్తున్నారు. ఇదిలా ఉంటే, మార్చి 18న ముగిసిన పీఎస్ఎల్ 2023 సీజన్లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచింది. షాహీన్ అఫ్రిది నేతృత్వంలో ఖలందర్స్ వరుసగా రెండో సీజన్లో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. పీఎస్ఎల్ 2022 సీజన్లో ఎదురైన ప్రత్యర్ధి ముల్తాన్ సుల్తాన్స్నే ఖలందర్స్ మళ్లీ ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. ఛేదనలో సుల్తాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. రన్నరప్‌గా నిలిచన సుల్తాన్స్‌కు మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
'#Rest In Peace.. పాకిస్తాన్ క్రికెట్'
పాకిస్తాన్ జట్టులో ప్రస్తుతం శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు బాబర్ ఆజం స్థానంలో షాదాబ్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). బాబర్ ఆజంతో పాటు పాక్ నెంబర్‌వన్ బౌలర్ షాహిన్ అఫ్రిది సహా ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, మహ్మద్ రిజ్వాన్‌లను రెస్ట్ పేరుతో పక్కనబెట్టింది. పాకిస్తాన్ జట్టును కొత్తగా తయారు చేయాలన్న ఉద్దేశంతో పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ ఆధ్వర్యంలోని బోర్డు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే పీసీబీ చేస్తున్న మార్పులపై పాక్ మాజీ క్రికెటర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పాకిస్తాన్ జట్టు ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్(#Rest In Peace) మోడ్‌లో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిది లాంటి క్రికెటర్లను పక్కనబెట్టడం నచ్చని లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''కొన్నాళ్లుగా మన ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో, అవార్డులు గెలుచుకోవడంలో ముందుంటున్నారు. అంతేకాదు బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిదిలు గతేడాది ఐసీసీ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఇది వాళ్లకు(పీసీబీ) నచ్చలేదు. అందుకే బోర్డు రూపంలో తమకు హక్కు ఉందంటూ నచ్చనివారిపై వేటు వేసేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఫామ్‌లో ఉన్న.. విశ్రాంతి అవసరం లేని ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తూ.. 70, 80 ఏళ్ల వయసులో ఉన్న బోర్డు సభ్యులు రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అజమాయిషీ చెలాయిస్తూ పాకిస్తాన్ క్రికెట్‌ను మార్చాలనుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ రెస్ట్ ఇన్ పీస్‌లో ఉందని చెప్పగలను. కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ మొత్తం జట్టునే ప్రక్షాళన చేయాలనుకోవడం మూర్కత్వం కిందకు వస్తుంది. జట్టులోకి ఎవరైతే కొత్త ఆటగాళ్లు వచ్చారో వారిని అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు ఆడనివ్వండి.. కానీ సీనియర్లతో కాంబినేషన్‌తో ఆడించడం మంచింది. ఈ విషయంలో మీడియా కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ నాశనానికి ఇదే తొలి అడుగులా కనిపిస్తుంది'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ చదవండి: పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు -
పాకిస్తాన్ క్రికెట్లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జాతీయ జట్టులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రమీజ్ రాజా నుంచి పీసీబీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, తొలిసారి జట్టు మొత్తం ప్రక్షాళణ చేపట్టిన నజమ్ సేథీ.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను, హెడ్ కోచ్‌గా అబ్దుల్ రెహ్మాన్‌ను, బ్యాటింగ్ కోచ్‌గా మహ్మద్ యూసఫ్‌ను, బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్‌ను నియమించింది. సెలెక్షన్ కమిటీ నూతన చీఫ్ హరూన్ రషీద్ అమల్లోకి తెచ్చిన కొత్త వర్క్ లోడ్ పాలసీని బూచిగా చూపుతూ తొలుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను పక్కకు పెట్టిన పీసీబీ.. తాజాగా హెడ్ కోచ్, కోచింగ్ సిబ్బంది, నాన్ కోచింగ్ సిబ్బందిపై వేటు వేసి వారి స్థానాల్లో కొత్త వారిని నియమించింది. ఈ మార్పులన్నీ తాత్కాలికమేనని పీసీబీ చెబుతున్నప్పటికీ.. ఈ స్థాయిలో ప్రక్షాళణ జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. గత కొంతకాలంగా బాబర్ ఆజమ్‌పై గుర్రుగా ఉన్న పీసీబీ పలు మార్లు అతన్ని తప్పించి సారధ్య బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే బాబర్‌కు ఉన్న బలమైన కోఠరి కారణంగా అది సాధ్యపడలేదు. తాజాగా పీసీబీ చీఫ్ ఏదైతే అదైందని తెగించి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. @TheRealPCB announces Support Personnel for Sharjah T20Is. Abdul Rehman, Head Coach; Umar Gul, Bowling Coach; M Yousuf, Batting Coach; A Majeed, Fielding Coach; Drikus Simon, Trainer; Cliffe Deacon, Physio; Talha Ijaz, Analyst; Mansoor Rana, Manager; Ahsan Nagi, Media. #PAKvAFG — Najam Sethi (@najamsethi) March 14, 2023 కాగా, షార్జా వేదికగా మార్చి 24, 26, 27 తేదీల్లో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు మాత్రమే తాజాగా జరిగిన మార్పులన్నీ (కెప్టెన్, కోచింగ్, నాన్ కోచింగ్ స్టాఫ్) వర్తిసాయని పీసీబీ ప్రకటిన విడుదల చేసినప్పటికీ, ఎక్కడో ఏదో జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాబర్ ఆజమ్‌తో పాటు సీనియర్లు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్‌లకు విశ్రాంతినిచ్చిన పీసీబీ.. సైమ్ అయూబ్, ఇహసానుల్లా లాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) స్టార్లకు జట్టులో తొలిసారి అవకాశం కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు.. షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్ -
ఇక్కడ ఆడాల్సిన అవసరం వాళ్లకేంటి? బీసీసీఐని చూసి బుద్ధి తెచ్చుకోండి: పాక్ మాజీ ప్లేయర్
BCCI- Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోని పొట్టి ఫార్మాట్ లీగ్‌లన్నింటిలోకి క్యాష్ రిచ్ లీగ్ అనడంలో సందేహం లేదు. యువ ఆటగాళ్లు ఒక్కసారి ఈ వేదికపై ప్రతిభ నిరూపించుకుంటే చాలు కోటీశ్వరుల జాబితాలో చేరిపోతారు. జాతీయ జట్టులో అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఇక వెటరన్ ప్లేయర్లు సైతం ఇక్కడ తమను తాము నిరూపించుకుంటే మరికొంత కాలం కెరీర్ పొడిగించుకోగలుగుతారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. స్టార్ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని ఐపీఎల్ ద్వారా ఇప్పటికే ఎంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు కెరీర్ పరంగా, ఆర్థికంగా నిలదొక్కుకున్న దాఖలాలు కోకొల్లలు. అయితే, అంతబాగానే ఉన్నా బీసీసీఐ తమ క్రికెటర్లను మాత్రం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వదన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐని సమర్థిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ బోర్డు సరైన పనిచేస్తోందని ప్రశంసించాడు. కాగా పాక్‌లో ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన అక్మల్‌కు.. టీమిండియా క్రికెటర్లు పీఎస్ఎల్ ఆడటానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఎదురైంది. కమ్రాన్ అక్మల్ వాళ్లకేం అవసరం? ఇందుకు స్పందిస్తూ.. ‘‘భారత క్రికెటర్లు పీఎస్ఎల్లో అస్సలు ఆడకూడదు. విదేశీ లీగ్‌లలో తమ ప్లేయర్లను ఆడించే విషయంలో ఇండియన్ బోర్డు సరైన దిశలో పయనిస్తోంది. ఐపీఎల్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వరుస అంతర్జాతీయ సిరీస్‌లు ఉంటాయి. నిజానికి ఐపీఎల్ ద్వారా ఆర్థికంగా వాళ్లు కావాల్సిన మేర పరిపుష్టం అవుతారు. పీసీబీ బీసీసీఐని చూసి నేర్చుకోవాలి అలాంటపుడు విదేశీ లీగ్‌లలో ఆడాల్సిన అవసరం వాళ్లకేం ఉంటుంది? నిజానికి మన బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఆటగాళ్ల కెరీర్‌ను పొడిగించుకునేందుకు వాళ్లు పాటిస్తున్న విధానాలు గమనించాలి. అక్కడ వంద టెస్టులాడిన వాళ్లు దాదాపు 14- 15 మంది ప్లేయర్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఒకరో.. ఇద్దరో ఉంటారు. ఇండియాలో వాళ్లు క్రికెట్‌కు, క్రికెటర్లకు విలువనిస్తారు. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లిస్తారు. నిజానికి ఐపీఎల్ ముందు బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్) దిగదిడుపే. ప్రపంచంలో ఏ లీగ్ కూడా ఐపీఎల్‌కు సాటిరాదు’’ అని మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ పేర్కొన్నాడు. బీసీసీఐని చూసైనా పీసీబీ బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించాడు. చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్ చేస్తే 99 శాతం లిఫ్ట్ చేయడు.. అలాంటిది.. BGT 2023: ‘టమ్ టమ్’ పాటకు టీమిండియా క్రికెటర్ స్టెప్పులు.. వీడియో వైరల్ -
2002లో కెప్టెన్సీ ఛాన్స్.. కానీ వద్దనుకున్నా! ఒకవేళ అదే జరిగి ఉంటే..
Shoaib Akhtar Comments: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడిగా పేరొందిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. అత్యంత వేగవంతమైన బంతిని విసిరి చరిత్ర సృష్టించాడు. గంటకు 161 కిలోమీటర్ల వేగంతో బాల్ వేసిన అక్తర్ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇక పాకిస్తాన్ తరఫున 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 178 వికెట్లు, 247 వికెట్లు, 19 వికెట్లు పడగొట్టాడు. జట్టులో కీలక సభ్యుడైన అతడు 2011లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2002లోనే ఛాన్స్.. కానీ అయితే, ఒకానొక సందర్భంలో అతడికి కూడా కెప్టెన్సీ అవకాశం వచ్చిందట. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్‌ను వదులుకున్నాడట. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ స్వయంగా వెల్లడించాడు. ‘‘2002లో నాకు కెప్టెన్సీ అవకాశం వచ్చింది. కానీ నేను సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేను. ఆ సమయంలో పూర్తి ఫిట్‌గా లేను. ఐదు మ్యాచ్‌లు ఉంటే.. కేవలం 3 మాత్రమే ఆడే పరిస్థితి. ఒకవేళ అప్పుడు నేను ప్రతీ మ్యాచ్ ఆడి ఉంటే కేవలం ఒకటిన్నర- రెండేళ్లపాటే నా కెరీర్ కొనసాగేది’’ అని అక్తర్ క్రికెట్ పాకిస్తాన్‌తో వ్యాఖ్యానించాడు. బోర్డులో అనిశ్చితి ఇక నాటి మేనేజ్మెంట్ గురించి వివరిస్తూ.. ‘‘జట్టు సభ్యులకు నేను పూర్తి మద్దతుగా నిలబడ్డాను. నిజానికి అప్పుడు బోర్డులో అనిశ్చితి నెలకొంది. మిస్మేనేజ్మెంట్ కారణంగా సమస్యలు తలెత్తాయి’’ అని 47 ఏళ్ల అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత క్రికెట్ విశ్లేషకుడిగా మారిన అక్తర్.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులకు మరింత చేరువగా ఉంటున్నాడు. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త సారధి పేరు ప్రకటన Ind Vs Aus ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ల రీఎంట్రీ -
పాక్ కెప్టెన్‌పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్‌కు ఇంగ్లీష్ అంతగా రాదని.. అందుకనే తమ దేశంలో అతను బ్రాండ్ అంబాసిడర్ కాలేకపోయాడంటూ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్తర్ మాట్లాడుతూ..''పాకిస్థాన్‌లో ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగల క్రికెటర్లు ఎవరైనా ఉన్నారంటే?.. అది నేను, షాహిద్ ఆఫ్రిది, వసీం అక్రమ్ మాత్రమే. అందుకనే మా ముగ్గురికే అన్ని వ్యాపార, వాణిజ్య ప్రకటనలు వస్తాయి. ఎందుకంటే.. మేము ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడడం అనే విషయాన్ని ఒక జాబ్‌గా భావించాం. ఇక క్రికెట్లో రాణించడం ఒక ఎత్తు అయితే.. మీడియాతో మాట్లాడడం, వాళ్ల ప్రశ్నలకు బదులివ్వడం అనేది మరొక ఎత్తు. ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న ఎవరూ పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడలేరు. అవార్డు ప్రజెంటేషన్ సమయంలో వాళ్లకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. బాబర్ ఆజం ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేటప్పుడు గమనించండి. హిందీ, ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడడం చూస్తుంటాం. బాబర్‌కు తన గురించి, తన ఆట గురించి కూడా ఇంగ్లీష్‌లో వర్ణించడం రాదు. ఒకవేళ అతను అనర్గళంగా, చక్కగా ఆంగ్లం మాట్లాడగలిగితే పాకిస్థాన్‌లో నంబర్ 1 బ్రాండ్ అంబాసిడర్ అయ్యేవాడు. అయినా ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమైన పనా?'' అని అక్తర్ ప్రశ్నించాడు. ఇక పాకిస్తాన్ క్రికెటలో తన ఆటతో అక్తర్ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 178 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టి20 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన బంతి వేసిన బౌలర్‌గా షోయబ్ అక్తర్ రికార్డు సృష్టించాడు. 2003లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అక్తర్ గంటకు 161.3. కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అక్తర్ తర్వాత ఎందరో ఫాస్ట్ బౌలర్లు వచ్చినప్పటికి అక్తర్ రికార్డు మాత్రం పదిలంగా ఉంది. Former Pakistan speedster Shoaib Akhtar says Babar Azam cannot speak and hence he is not the biggest brand in Pakistan. Modern-day cricketers in Pakistan cannot speak on media, TV or in post-match presentations. Do you agree with this statement? pic.twitter.com/xMrNwYQe1X — Farid Khan (@_FaridKhan) February 21, 2023 చదవండి: 'బజ్‌బాల్' ఎలా అడ్డుకోవాలి?.. ఫ్యాన్స్‌ను వేడుకున్న కివీస్ టాప్ వెబ్సైట్ 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు -
ఫిక్సింగ్ బారిన క్రికెటర్.. రెండేళ్ల నిషేధం
పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేం కాదు. ఫిక్సింగ్ కలంకం ఏదో ఒక రూపంలో ఆ జట్టును చుట్టుముడుతునే వచ్చింది.గతంలో మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. తాజాగా మరోసారి ఫిక్సింగ్ కలకలం రేపింది. లెప్టార్మ్ స్పిన్నర్, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఆసిఫ్ అఫ్రిది మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు రుజువు కావడంతో పీసీఈబీ రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పీసీబీ పేర్కొంది. 2022 ఏడాది సెప్టెంబర్‌లో ఆసిఫ్ అఫ్రిది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు.అక్కడ రావల్కోట్ హాక్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తమ విచారణలో ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై నిషేధం విధించింది.'' ఆర్టికల్ 2.4.10ని ఉల్లంఘించిన కారణంగా ఆసిఫ్ ఆఫ్రిదిపై రెండేళ్ల అనర్హత, దీంతో పాటు ఆర్టికల్ 2.4.4ను ఉల్లంఘించినందుకు ఆరు నెలల నిషేధం విధించాం. ఈ రెండు ఏకకాలంలో అమలు చేయబడుతాయి. 2024 సెప్టెంబర్ 12 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.'' అని పీబీసీ పేర్కొంది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా పేరు పొందిన ఆసిఫ్ అఫ్రిది 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 118 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 59 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ టి20ల్లో 63 వికెట్లు తీశాడు. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడిన ఆసిఫ్ అఫ్రిది దేశవాళీ క్రికెట్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఆసీస్‌తో సవాల్‌కు సిద్దం; బ్యాటింగ్‌లో ఏ స్థానమైనా ఓకే -
పాకిస్తాన్ క్రికెట్లో వినూత్న ప్రయోగం.. చరిత్రలో తొలిసారి..!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆన్లైన్లో కోచింగ్ తీసుకోనున్న జట్టుగా పాక్ క్రికెట్ జట్టు రికార్డుల్లోకెక్కనుంది. ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ (ఆస్ట్రేలియా).. నాలుగేళ్ల తర్వాత తిరిగి పాక్ హెడ్ కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పాక్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పీసీబీ బాస్ నజమ్ సేథీ గతవారం ఓ క్లూ వదిలాడు. ఆర్థర్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, 90 శాతం సమస్యకు పరిష్కారం దొరికిందని, పీసీబీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతుందని సేథీ గతవారం ఓ ప్రెస్మీట్లో వెల్లడించాడు. ప్రస్తుత పాక్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో నూతన హెడ్ కోచ్‌ను నియమించుకునేందుకు పీసీబీ వేగంగా పావులు కదుపుతోంది. ఆర్థర్.. పీసీబీ తొలి దశ ప్రయత్నాల్లో పాక్ కోచ్‌గా వ్యవహరించేందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఆన్లైన్ కోచింగ్ ప్రతిపాదన నచ్చి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం డెర్బీషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆర్థర్.. మెజార్టీ శాతం పాక్ పాల్గొనబోయే టోర్నీలకు ఆన్లైన్ కోచింగ్ అందించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు మాత్రం ప్రత్యక్షంగా అందుబాటులో ఉండేందుకు అంగీకరించాడని సమాచారం. కాగా, మిక్కీ ఆర్థర్ ఆథ్వర్యంలో పాకిస్తాన్ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించడంతో ఆర్థర్ తన పదవికి రాజీనామా చేసి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, పీసీబీ ఆన్లైన్ కోచ్ ప్రతిపాదనపై వారి సొంత దేశంలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. స్వదేశంలో నాణ్యమైన కోచ్‌లు లేకనా అంటూ పాక్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. -
షాహిద్ అఫ్రిదికి షాకిచ్చిన పీసీబీ.. చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తొలగింపు
Shahid Afridi: పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు తాత్కాలిక చీఫ్ సెలెక్టర్, ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది. అఫ్రిదిని సెలెక్టర్ పదవి నుంచి తొలిగిస్తున్నట్లు పీసీబీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పీసీబీ పేర్కొంది. పీసీబీ చీఫ్‌గా నజమ్ సేథీ బాధ్యతలు చేపట్టాక నాటి చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీంను తొలగించిన పీసీబీ.. ఆ పదవిలో అఫ్రిదిని తాత్కాలికంగా కూర్చోబెట్టింది. తాజాగా పీసీబీ అఫ్రిదికి కూడా ఉద్వాసన పలికి హరూన్ రషీద్‌కు బాధ్యతలు అప్పజెప్పడం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ తరఫున 23 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన హరూన్ రషీద్.. 2015 నుంచి 2016 వరకు పాక్ చీఫ్ సెలెక్టర్‌గా పని చేశాడు. రషీద్.. పీసీబీని నడుపుతున్న 14 మంది సభ్యుల క్రికెట్ మేనేజ్మెంట్ కమిటీలోనూ కీలక మెంబర్‌గా కొనసాగుతున్నాడు. కాగా, స్వదేశంలో గతకొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీకి కొత్త బాస్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
Viral: పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ న్యూడ్ వీడియో కాల్స్.. సహచరుడి గర్ల్ ఫ్రెండ్‌తో..?
Babar Azam Nude Video Calls: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సెన్సేషనల్ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో బాబర్.. తన సహచరుడి (పాక్ జట్టులో సభ్యుడు) గర్ల్ ఫ్రెండ్‌తో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇందులో ఉన్నది బాబరా లేక ఎవరైనా మార్ఫింగ్ చేసి వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. Babar Azam sexting with gf of another Pakistan cricketer and promising her that her bf won’t be out of team if she keeps sexting with him is just 👎🏿 I hope allah is watching all this . pic.twitter.com/nlKEp55dUB — Dr Nimo Yadav (@niiravmodi) January 15, 2023 నియో యాదవ్ అనే ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో, ముఖ్యంగా పాక్ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇందులో ఉన్నది పాక్ కెప్టెన్ కాదు, మార్ఫింగ్ చేశారని కొందరంటుంటే, మరికొందరేమో ఇది ముమ్మాటికి పాకిస్తాన్ కెప్టెన్ వీడియోనేనని సోషల్‌మీడియాలో వాదనలకు దిగుతున్నారు. View this post on Instagram A post shared by Eisha Babar Azam (@eish.arajpoot.1) బాబర్ న్యూడ్ వీడియోను పోస్ట్ చేసిన నెటిజన్ కధనం ప్రకారం.. ఇందులో బాబర్, తన సహచర పాకిస్తాన్ ఆటగాడి గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చాటింగ్ చేస్తున్నాడు. తనతో చాటింగ్ కొనసాగిస్తే.. సదరు అమ్మాయి ప్రియుడికి జట్టులో స్థానానికి ఢోకా ఉండదని ప్రామిస్ చేశాడు. ఈ వీడియోతో పాటు పలు అసభ్య చాట్ మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, బాబర్‌కు సంబంధించిన పర్సనల్ ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Eisha Babar Azam (@eish.arajpoot.1) ఇప్పటికే స్వదేశంలో వరుస సిరీస్‌ల్లో జట్టును గెలిపించలేక, కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో ఉన్న బాబర్‌కు తాజా ఉదంతం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టనుంది. ఈ ఉదంతంపై బాబర్ ఆజమ్ కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. View this post on Instagram A post shared by Eisha Babar Azam (@eish.arajpoot.1) -
ఏకపక్షంగా ఆసియా కప్ షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు..? జై షాను నిలదీసిన పీసీబీ చీఫ్
ఆసియా కప్ 2023-24 (వన్డే ఫార్మాట్) సంవత్సరాలకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు ఆసియా వేదికగా జరగాల్సి ఉన్న అన్ని క్రికెట్ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా నిన్న (జనవరి 5) విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్‌లో వరుసగా రెండు సంవత్సరాలు భారత్, పాక్‌లు ఒకే గ్రూప్‌లో తలపడపడాల్సి ఉంది. Thank you @JayShah for unilaterally presenting @ACCMedia1 structure & calendars 2023-24 especially relating to Asia Cup 2023 for which 🇵🇰 is the event host. While you are at it, you might as well present structure & calendar of our PSL 2023! A swift response will be appreciated. https://t.co/UdW2GekAfR — Najam Sethi (@najamsethi) January 5, 2023 అయితే ఈ క్యాలెండర్ ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజమ్ సేథీ తాజాగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. ఆతిధ్య దేశమైన తమను సంప్రదించకుండా ఏకపక్షంగా షెడ్యూల్‌ను ఎలా ప్రకటిస్తారని ట్విటర్ వేదికగా జై షాను ప్రశ్నించాడు. అలాగే ఏసీసీ చైర్మన్ హోదాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) షెడ్యూల్ కూడా ప్రకటించాలని వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. పీసీబీ చైర్మన్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కాగా, ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లో పాక్‌లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని బీసీసీఐ పెద్దలు ముక్తకంఠంతో ముందు నుంచే చెప్తూ వస్తున్నారు. తాజాగా జై షా ప్రకటించిన షెడ్యూల్లో 2023కు సంబంధించి ఆతిధ్య దేశం (పాక్) ప్రస్తావన లేకపోవడంతో పాక్‌కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే భారత్‌కు ఎలాగైనా కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో పీసీబీ చైర్మన్ ఈ ట్వీట్ చేశాడు. -
పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా అఫ్రిది మంగమ్మ శపథం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇటీవలే షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ పేసర్ ఇఫ్తికార్ అంజుమ్, హరూన్ రషీద్ లతో కూడిన సెలక్షన్ కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో షాహిద్ అఫ్రిది తాను చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికవ్వడంపై తొలిసారి పెదవి విప్పాడు. తాను పదవి నుంచి దిగిపోయేలోపు పాకిస్తాన్ క్రికెట్ లో రెండు పటిష్టమైన జట్లను తయారుచేస్తానని.. ఆ విషయంలో రాజీ పడేది లేదని చెప్పాడు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ''చీఫ్ సెలక్టర్ గా నా పదవీ కాలం ముగిసేలోపు పాక్ క్రికెట్ టీమ్ బెంచ్ ను బలోపేతం చేస్తా. నేను పాకిస్తాన్ కోసం ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండేలా రెండు జట్లను తయారుచేస్తా'' అంటూ మంగమ్మ శపథం చేశాడు . అయితే అఫ్రిది వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందించారు. ప్రధాన జట్టుకు సమాంతరంగా మరో జట్టును తయారుచేయడం పాకిస్తాన్ కు కొత్తగా అనిపిస్తున్నప్పటికీ ప్రపంచ క్రికెట్ లో అది పాత చింతకాయ పచ్చడిలానే ఉంది. ఇంగ్లండ్ (ఈసీబీ), ఇండియా (బీసీసీఐ) ఇవి కొద్దికాలంగా అమలుపరుస్తున్న విధానాలే.ఏకకాలంలో ఆ జట్లు రెండు దేశాలతో ఆడేంత సామర్థ్యం సాధించుకున్నాయి. షాహిన్ అఫ్రిది గాయంతో తప్పుకోవడంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో షాహిన్ తో పాటు ఆ జట్టు ప్రధాన పేసర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షాలు కూడా చివరి రెండు టెస్టులకు దూరమయ్యారు. దీంతో అంతగా అనుభవం లేని బౌలర్లతో పాకిస్తాన్ బరిలోకి దిగి సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. మరి ఈ ప్రయత్నంలో అఫ్రిది ఏ మేరకు విజయవంతమవుతాడనేది వేచి చూడాల్సిందే. చదవండి: పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు సత్కారం.. ఎప్పుడంటే? ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి
పీసీబీకి సంకటస్థితి ఏర్పడింది. లేక లేక పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుంటే ఆదరణ కరువయింది. అభిమానులు మైదానాలకు వచ్చి మ్యాచ్‌లు చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో స్టేడియాలన్నీ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌కు అంతో ఇంతో ఆదరణ దక్కగా.. తాజాగా కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు మాత్రం ప్రేక్షకులే కరువయ్యారు. దీనికి తోడూ పాక్ వరుస ఓటములు కూడా అభిమానులకు నిరాశకు గురి చేశాయి. కరాచీ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ ప్రేక్షకులు లేక స్టేడియం వెల వెల బోయింది. దీంతో రెండో టెస్టు నుంచి ఉచితంగా ఆడియెన్స్‌ను అనుమతించనుంది. ఈ మేరకు పీసీబీ ప్రకటన విడుదల చేసింది. "మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు ఒరిజినల్ ఐడీ కార్డు లేదా బీ ఫారం తీసుకుని స్టేడియానికి వస్తే ఉచితంగా ఎంట్రీ లభిస్తుంది. ఇమ్రాన్ ఖాన్, క్వాద్, వసీం అక్రమ్, జహీర్ అబ్బాస్ పేరిట ఉన్న ప్రీమియం లాంజ్‌లకు వెళ్లి చూసే అవకాశం కూడా ఉంది. ప్రీమియం, ఫస్ట్ క్లాస్, జనరల్ విభాగంలో ఏ ప్రదేశంలోనైనా కూర్చుని మ్యాచ్‌ను వీక్షించవచ్చు. పీసీబీ నేషనల్ బ్యాంక్ క్రికెట్ ఎరీనా, గరీబ్ నవాజ్ పార్కింగ్ ఏరియాలోనూ ప్రేక్షకులకు అనుమతి ఉంది. అంటూ పేర్కొంది. మరి ఉచిత ఎంట్రీ అయినా ప్రేక్షకులను స్టేడియాలకు రప్పిస్తుందేమో చూడాలి. ఇక కరాచీ వేదికగా జరిగిన తొలి టెస్టు పేలవ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 438 పరుగులు చేయగా.. అనంతరం న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో రాణించడంతో 612 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌ను పాక్ 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కివీస్ విజయానికి 15 ఓవర్లలో 138 పరుగులు అవసరం కాగా.. 7.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేయగా.. వెలుతురు లేకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. చదవండి: నిలకడగా రిషబ్ పంత్ ఆరోగ్యం -
ఘోర అవమానం.. బోరుమన్న రమీజ్ రాజా
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజాకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు పీసీబీ కొత్త బాస్ నజమ్ సేతీ.. రమీజ్ రాజాను ఆఫీస్‌లోకి రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రమీజ్ రాజానే స్వయంగా తన యూట్యూబ్ చానెల్లో పేర్కొంటూ బోరుమన్నాడు. ''పీసీబీ మొత్తం మారిపోయింది. నజమ్ సేతీ ఛైర్మన్‌గా అడుగుపెట్టగానే అతని రాజకీయం మొదలైంది. తన వాళ్లకు మాత్రమే పీసీబీలోకి ఎంట్రీ అన్నట్లుగా అక్కడి ప్రవర్తన ఉంది. నాకు తెలిసి ఒక్క వ్యక్తి(నజమ్ సేతీ) కోసం పీసీబీ రాజ్యాంగాన్ని కూడా మార్చేసినట్లు కనిపిస్తుంది. పీసీబీ మాజీ ఛైర్మన్‌గా ఉన్న నాకు నజమ్ సేతీ పీసీబీ ఆఫీస్‌లోనికి రానివ్వలేదు. ఎంత మాజీ అయినా వ్యక్తిగత ఫైల్స్ కొన్ని ఆఫీస్‌లోనే ఉంటాయి. వాటిని తీసుకునేందుకు వస్తే అనుమతి ఇవ్వడం లేదు. పైగా మనుషులను పెట్టి దౌర్జన్యంగా బయటికి పంపిస్తున్నారు. మూడేళ్ల కాలానికి మొదట ఒప్పందం కుదుర్చుకొని ఏడాది తిరిగేలోపే బయటికి పంపించడం ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పీసీబీని కొందరు భ్రస్టు పట్టిస్తున్నారు. ఇది క్రికెట్ బోర్డుతో పాటు సిస్టమ్‌పై, జాతీయ జట్టుపై, జట్టు కెప్టెన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. '' అంటూ తన అక్కసును వెల్లగక్కాడు. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్ సేతీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్ సేతీ. పాక్ క్రికెట్లో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ క్రికెటర్ ఇఫ్తికార్ అంజుమ్‌లు ప్యానెల్లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్ రషీద్ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. చదవండి: Shahid Afridi: షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు -
ODI WC: పాక్ ఇండియాకు వెళ్తుందా? లేదా? పీసీబీ కొత్త చీఫ్ క్లారిటీ
Asia Cup 2023- India Vs Pakistan- ODI World Cup 2023: పాకిస్తాన్ వన్డే వరల్డ్‌కప్-2023 ఆడే అంశంపై ఆ దేశ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్ నజమ్ సేతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఈ ఐసీసీ మెగా టోర్నీ కోసం భారత్‌కు వెళ్లే విషయం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఆసియా కప్-2023 నిర్వహణ విషయంలోనూ ఏసీసీతో చర్చలు జరుపుతున్నామన్న సేతీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ ఈవెంట్‌ను పాకిస్తాన్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనా విషయం తెలిసిందే. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మాత్రం ఆ టోర్నీ కోసం టీమిండియా అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికపై ఈవెంట్ నిర్వహించే అంశం గురించి గతంలో ప్రస్తావించారు. జరుగుతుందా? లేదా? ఇందుకు స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. టీమిండియా తమ దేశానికి రాకపోతే, తాము కూడా వరల్డ్‌కప్ ఆడేందుకు అక్కడికి వెళ్లమని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్లలో మాత్రమే తలపడే చిరకాల ప్రత్యర్థుల పోరు చూస్తామో లేదోనంటూ అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఇది వరకే స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ తర్వాత పీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నజమ్ సేతీ తాజాగా ఈ అంశంపై స్పందించాడు. ఎలా చెబితే అలా! కరాచీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ ఇండియాకు వెళ్లొద్దని మా ప్రభుత్వం చెబితే మేము అలాగే నడుచుకుంటాం. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాతో ఆడాలా లేదా? అక్కడికి వెళ్లాలా వద్దా? అన్న విషయాల్లో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అని క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వం చెప్పినట్లుగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నాడు. చదవండి: David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్ Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా! -
ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ ఎఫెక్ట్.. పీసీబీ చైర్మన్‌ను పీకేసిన పాక్ ప్రధాని
Ramiz Raja: స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజాపై పడింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవంతో పాటు స్వదేశంలో వరుసగా నాలుగు టెస్ట్‌ల్లో ఓటమి, అలాగే ఇంగ్లండ్ సిరీస్‌లో పిచ్‌ల తయారీపై ఆరోపణల నేపథ్యంలో రమీజ్‌కు ఉద్వాసన పలినట్లు పీసీబీ ఇవాళ (డిసెంబర్ 21) ప్రకటించింది. రమీజ్‌పై వేటును పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ కూడా సమర్ధించారని, ఇందుకు ఆయన కూడా ఆమోద ముద్ర వేశారని పీసీబీ వెల్లడించింది. రమీజ్ స్థానంలో పీసీబీ నూతన చైర్మన్‌గా నజమ్ సేథీ (78) బాధ్యతలు చేపడతారని, సేథీని స్వయంగా పాక్ ప్రధానే నామినేట్ చేశారని పీసీబీ పేర్కొంది. కాగా, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉండగా 2021 సెప్టెంబర్‌లో రమీజ్ రజా పీసీబీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. రమీజ్ హయాంలో పాక్ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు, 50 ఓవర్ల మహిళ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. రమీజ్.. తన హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలు ఉండటంతో అతని హవా కొనసాగింది. ప్రస్తుతం ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడంతో రమీజ్‌పై కూడా వేటు తప్పలేదు. పీసీబీ నిబంధనల ప్రకారం బోర్డు అధ్యక్షుడిని ప్రధాని నామినేట్ చేస్తే.. బోర్డు ఆఫ్ గవర్నర్లు అతన్ని అధికారికంగా ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే, పీసీబీ కొత్త చైర్మన్ నజమ్ సేథీ ఈ పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదు. 2018లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు సేథీ పీసీబీ అత్యున్నత పదవిలో కొనసాగారు. అయితే నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో విభేదాల కారణంగా నజమ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై కన్నెర్ర చేసిన ఐసీసీ.. 8 నెలల్లో రెండోసారి
నాసిరకం పిచ్ తయారు చేసినందుకు గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై (పీసీబీ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కన్నెర్ర చేసింది. పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌కు (డిసెంబర్ 1 నుంచి 5) వేదిక అయిన రావల్పిండి పిచ్‌ను మందకొడిగా తయారు చేసినందుకు గాను ఐసీసీ.. పీసీబీకి మొట్టికాయలు వేసింది. ఈ పిచ్‌ను బిలో యావరేజ్‌గా పేర్కొన్న ఐసీసీ.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే పిచ్‌లా లేదని అక్షింతలు వేసింది. బౌలర్లకు ఏమాత్రం సహకారం అందించిన రావల్పిండి పిచ్.. ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఐసీసీ టెక్నికల్ కమిటీ సీరియస్ అయ్యింది. చర్యల్లో భాగంగా ఓ డీ మెరిట్ పాయింట్‌ను రావల్పిండి పిచ్‌కు అలాట్ చేసింది. 8 నెలల వ్యవధిలో ఈ పిచ్‌కు డీ మెరిట్ పాయింట్ రావడం ఇది రెండో సారి. JUST IN - The verdict is in on the Rawalpindi pitch used during the first Test between Pakistan and England 👀#PAKvENG | #WTC23https://t.co/PQO7PS2cTj — ICC (@ICC) December 13, 2022 ఇదిలా ఉంటే, బ్యాటర్ల కోసం మాత్రమే రూపొందించినది చెప్పుకునే రావల్పిండి పిచ్‌పై ఇరు జట్ల క్రికెటర్లు పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 7 సెంచరీలు నమోదయ్యాయి. బౌలర్లు ఏమాత్రం సహకరించని ఈ పిచ్‌పై ఇంగ్లండ్.. తమ బజ్‌బాల్ అప్రోచ్‌ను ఇంప్లిమెంట్ చేసి 74 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్ డకెట్ (106 బంతుల్లో 101 నాటౌట్; 14 ఫోర్లు), జాక్ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్; 21 ఫోర్లు), ఓలీ పోప్ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడగా.. పాక్ ప్లేయర్స్ అబ్దుల్లా షఫీక్ (203 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హాక్ (207 బంతుల్లో 121; 15 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (168 బంతుల్లో 136; 19 ఫోర్లు, సిక్స్) శతకాలు నమోదు చేశారు. -
'2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారాయి'
2009లో పాకిస్తాన్లో పర్యటనకు వచ్చిన లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆరోజు బస్సుపై కురిసిన బులెట్ల వర్షానికి లంక జట్టులో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. వీరిలో థిల్లాన్ సమరవీర, తిలకరత్నే దిల్షాన్, అజంతా మెండిస్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, సురంగ లక్మల్, చమిందా వాస్ సహా మరికొంత మంది క్రికెటర్లు ఉన్నారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు చనిపోగా.. ఇద్దరు పౌరులు బలయ్యారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు మిగతా దేశాలు నిరాకరించాయి. అప్పటినుంచి దాదాపు 2019 వరకు అంటే పదేళ్ల పాటు ఏ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించడానికి ఇష్టపడలేదు. పాక్ ఏదైనా హోం సిరీస్ ఆడాలంటే యూఏఈకి రావాల్సిందే. దీంతో పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు జరగక అక్కడి మైదానాలన్ని వెలవెలబోయాయి. బోర్డు నుంచి సహాయం లేకపోవడంతో క్రికెట్ మైదానాలను మూసే పరిస్థితి కూడా వచ్చింది. తాజా పరిస్థితి చూస్తే పాకిస్తాన్లో కాస్త మార్పు కనిపిస్తుంది. 2019లో శ్రీలంక రెండు టెస్టులు ఆడేందుకు పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే.. పాక్‌లో ఆడేందుకు జంకిన ఇతర దేశాలు లంకతో సిరీస్‌ను పాక్ నిర్వహించిన తీరుపై నమ్మకం వచ్చి క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు కూడా పాక్ గడ్డపై పర్యటించాయి. దశాబ్దం నుంచి క్రికెట్ మ్యాచ్‌లు లేక మూగబోయిన మైదానాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ అంశంపై స్పందించాడు. ''2009లో లంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. మా దేశంలోని మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారిపోయాయి. మా మైదానాల్లో క్రికెట్ ఆడాలని మాకున్నప్పటికి పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మైదానాల్లో ప్రేక్షకులు మిస్సయ్యాం. అప్పటి బాధ వర్ణణాతీతం. ఈ పదేళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు దేశ ప్రభుత్వం క్రికెట్‌ను బతికించేందుకు చొరవ తీసుకుంది. మేము కూడా విదేశీ లీగ్‌ల్లో ఆడే సమయంలో విదేశీ ఆటగాళ్లతో మాట్లాడేవాళ్లం. వాళ్లను క్రికెట్ ఆడేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాం. పాక్‌లో మళ్లీ క్రికెట్ ఆడేందుకు పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో పాకిస్తాన్ నుంచి మిగతా దేశాలకు క్రికెట్ సురక్షితంగా ఆడుకోవచ్చు అనే భరోసా కల్పించేలా చేశాం. ఇప్పుడు ఆ ఇబ్బందికర దశ మారింది. పాకిస్తాన్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు పర్యటించాయి. రానున్న కాలంలో మరిన్ని జట్లు పర్యటనకు వస్తాయని ఆశిస్తున్నా. ఇక క్రికెట్ గ్రౌండ్స్ ప్రేక్షకులతో నిండిపోతుండడం సంతోషంగా అనిపిస్తుంది. ''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. బెన్ స్టోక్స్, సామ్ కరన్‌లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. సూపర్-12 దశలోనే ఇంటిముఖం పట్టాల్సిన పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ చేరడం.. అక్కడ కివీస్‌ను ఓడించడం.. ఆపై ఫైనల్‌కు వెళ్లింది. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన పాక్ రన్నరప్‌గా నిలిచింది. చదవండి: టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..! -
Asia Cup 2023: జై షా వ్యాఖ్యలపై పీసీబీ స్పందన.. ఏకపక్షంగా..
Asia Cup 2023- BCCI Jay Shah- PCB: ‘‘ఆసియా కప్-2023 టోర్నీ నిర్వహణను తటస్థ వేదికకు మార్చనున్నామంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు పీసీబీని ఆశ్చర్యపరిచాయి. నిరాశకు గురిచేశాయి. ఏసీసీలోని సభ్యులతో గానీ.. ఆతిథ్య దేశ బోర్డుతో గానీ చర్చించకుండానే ఇలాంటి ప్రకటనలు చేయడం దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’’ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించింది. కాగా ముంబైలో జరిగిన 91వ సర్వసభ్య సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ.. ఆసియా కప్ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తటస్థ వేదికపైనే ఆసియా కప్-2023ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాం ఈ ప్రకటనపై తాజాగా స్పందించిన పీసీబీ.. ‘‘ఏసీసీ బోర్డు, సభ్యుల సహకారంతో ఆసియా కప్ నిర్వహించేందుకు పాక్ సిద్ధమైంది. ఎంతో సంతోషించింది. కానీ.. షా మాత్రం ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. 1983, సెప్టెంబరులో రూపుదిద్దుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిబంధనల స్ఫూర్తికి ఆయన ప్రకటన విరుద్ధంగా ఉంది. ఆసియా క్రికెట్ మండలి సభ్య దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా.. ఆసియా ఖండంలో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పడింది. కానీ ఇలాంటి ప్రకటనలు ఆసియా క్రికెట్ దేశాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయి. తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో పాకిస్తాన్.. ఇండియా పర్యటన.. అదే విధంగా 2024-2031 సైకిల్‌కు సంబంధించిన ఐసీసీ ఈవెంట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏసీసీ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు సంబంధించి పీసీబీకి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ విషయంలో ఏసీసీ జోక్యం చేసుకుని.. సున్నితమైన ఈ అంశం గురించి చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఆసియా కప్-2023 పాక్‌లో నిర్వహించాల్సి ఉండగా.. వన్డే వరల్డ్‌కప్-2023కు భారత్ వేదిక కానున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఏసీసీ, ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు పోటీపడుతున్నాయి. చదవండి: Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ మాజీ కోచ్ ఘాటు వ్యాఖ్యలు.. పొట్టలు వేలాడేసుకుని, ఒళ్లు సహకరించక T20 World Cup 2022: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ సహా ఆ మ్యాచ్‌లన్నీ వర్షార్పణం -
Pak Vs Eng: ఇదేంట్రా బాబు.. ఇలా కొట్టేశావు! వీడియో వైరల్
Pakistan vs England, 6th T20I - Viral Video: ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ ఆరో టీ20 సందర్భంగా అంపైర్ అలీమ్ దర్‌కు గాయమైంది. కాసేపు నొప్పితో విలవిల్లాడిన అతడు.. తర్వాత అంపైరింగ్ కొనసాగించాడు. కాగా ఏడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పాకిస్తాన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆరో టీ20లో తొలుత ఆతిథ్య జట్టు బ్యాటింగ్ చేసింది. ఇందులో భాగంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హైదర్ అలీ.. ఆరో ఓవర్లో రిచర్డ్ గ్లీసెన్ బౌలింగ్‌లో పుల్‌షాట్ బాదాడు. ఆ సమయంలో లెగ్ అంపైర్ స్థానంలో ఉన్న అలీమ్ దర్ తొడ వెనుక భాగంలో బంతి గట్టిగా తగిలింది. అయితే, అదృష్టవశాత్తూ అతడికి పెద్దగా గాయమేమీ కాలేదు. కొన్ని క్షణాల పాటు నొప్పితో బాధపడిన అలీమ్ వెంటనే సర్దుకుని మళ్లీ తన డ్యూటీలోకి దిగాడు. ఇక బౌలర్ రిచర్డ్ అలీమ్ దగ్గరకు వెళ్లి పరామర్శించగా.. పర్లేదు అంతా బాగానే ఉంది అన్నట్లుగా అతడు సమాధానమిచ్చాడు. ఇదేంట్రా బాబు ఇలా కొట్టేశావు ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేంట్రా బాబు ఇలా కొట్టేశావు అన్నట్లుగా ఆ అంపైర్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఏదేమైనా అతడికి ప్రమాదం తప్పింది. ఫైనల్‌గా పాక్ మ్యాచ్ ఓడింది’’ అని మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర ఆట తీరుతో చెలరేగడంతో ఇంగ్లండ్.. పాక్ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని సూనాయాసంగా ఛేదించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 3-3తో సమం చేసింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిన హైదర్ అలీ.. కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అయినప్పటికీ ఈ యువ బ్యాటర్ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. చదవండి: Irani Cup 2022: కుప్పకూలిన సౌరాష్ట్ర టాపార్డర్.. 0,4,0,1,2... 98 పరుగులకే ఆలౌట్ Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ Ouch! 😬#PAKvENG | #UKSePK pic.twitter.com/DaD6EwSaVV — Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022 -
ఆఫ్రిది చెప్పింది నిజమే అయితే అంతకంటే దారుణం మరొకటి ఉండదు!
Shaheen Shah Afridi Treatment- Shahid Afridi Comments On PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. షాహిన్ షా ఆఫ్రిది విషయంలో పీసీబీ వ్యవహరించిన తీరు పట్ల మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ షాహిన్ విషయంలో పీసీబీ గురించి షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని వసీం వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే... ఆసియా కప్-2022 టోర్నీకి ముందు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది గాయపడిన విషయం తెలిసిందే. మోకాలి గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం షాహిన్‌ను లండన్‌కు పంపినట్లు పీసీబీ గతంలో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక గాయం నుంచి కోలుకుంటున్న షాహిన్.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీకి ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మాజీ సారథి, షాహిన్‌కు కాబోయే మామగారు షాహిద్ ఆఫ్రిది సామా టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌లో తన సొంత డబ్బుతో షాహిన్ చికిత్స పొందుతున్నాడని.. తానే అతడి కోసం డాక్టర్‌ను ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చాడు. సొంత డబ్బుతో చికిత్స.. నేనే! ఈ మేరకు.. ‘‘షాహిన్ ఆఫ్రిది తన సొంత డబ్బుతో ఇంగ్లండ్‌కు వెళ్లాడు. టికెట్‌కు కూడా తనే డబ్బులు చెల్లించాడు. అక్కడ సొంత ఖర్చులతో కాలం వెళ్లదీస్తున్నాడు. నేను డాక్టర్ పేరును సూచించగా.. అతడిని కలిసి చికిత్స తీసుకుంటున్నాడు. షాహిన్ విషయంలో పీసీబీ అసలు ఎలాంటి చొరవ తీసుకోలేదు. తన సొంత ఖర్చులతో అతడు లండన్‌లో ఉంటున్నాడు. పీసీబీ డైరెక్టర్ జాకిర్ ఖాన్ బహుశా ఒకటీ రెండుసార్లు తనతో మాట్లాడి ఉంటాడు అంతే’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. స్పందించిన పీసీబీ! కానీ ఈ విషయంపై స్పందించిన పీసీబీ.. ‘‘లండన్‌లో చికిత్స పొందుతున్న షాహిన్ షా ఆఫ్రిది కోలుకుంటున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ ఆరంభం నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడు. ఆటగాళ్లకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడం.. వారి పునరావాసం విషయంలో పీసీబీ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఆటగాళ్లకు ఎలాంటి అవసరాలు ఉన్నా.. వాటిని తీర్చడంలో బోర్డు ముందు ఉంటుంది’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ.. షాహిన్ చికిత్స విషయంలో ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై నేరుగా స్పందించలేదు. షాహిద్ ఆఫ్రిది చెప్పింది గనుక నిజమే అయితే! ఈ నేపథ్యంలో.. ఏఆర్వై న్యూస్‌తో మాట్లాడిన వసీం అక్రమ్.. ‘‘ఒకవేళ షాహిద్ ఆఫ్రిది చెప్పింది గనుక నిజమే అయితే.. అంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. అతడు(షాహిన్ ఆఫ్రిది) పాకిస్తాన్ మేటి ఆటగాళ్లలో ఒకడు. అలాంటి క్రికెటర్ పట్ల పీసీబీ ఇలా వ్యవహరించడం సరికాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ సర్జన్ వద్ద అతడికి చికిత్స చేయించాలి. కానీ, అతడు సొంతంగా ఖర్చులు భరిస్తున్నాడంటే.. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అని పీసీబీ తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. కాగా షాహిద్ ఆఫ్రిది కుమార్తెతో షాహిన్ వివాహం జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్.. కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన కోహ్లి, రోహిత్‌లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని.. -
పీఎస్ఎల్కే 'దిక్కు దివాణం' లేదు.. మరో లీగ్ అవసరమా!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఒక్కోసారి పాకిస్తాన్ జట్టులాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఆటగాళ్లను గందరోగోళానికి గురి చేయడం వాళ్లకు అలవాటే. చిరకాల ప్రత్యర్థిగా చెప్పుకునే టీమిండియాను నడిపించే బీసీసీఐ ఏం చేస్తే.. దానికి రివర్స్‌గా వ్యవహరిస్తుంటుంది పీసీబీ. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరున్న ఐపీఎల్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టగానే.. దానికి పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను తీసుకొచ్చింది. అయితే ఐపీఎల్ స్థాయిలో పీఎస్ఎల్లో అంతగా ఆదరణ పొందలేకపోయింది. అయినప్పటికి పీఎస్ఎల్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. పీఎస్ఎల్కే ఆదరణ అంతంతగా ఉంటే తాజాగా పాకిస్తాన్ జూనియర్ లీగ్(పీజేఎల్) పేరుతో పీసీబీ మరొక కొత్త లీగ్‌ను ప్రవేశపెట్టనుంది. అక్టోబర్ 6న లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా పీజేఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పీసీబీ భావిస్తోంది. అయితే ఈ పీజేఎల్ టోర్నీకి విదేశాలకు చెందిన వివిధ బోర్డులు, క్లబ్స్, ప్రొఫెషనల్ లీగ్స్ నుంచి దాదాపు 140 మంది విదేశీ ప్లేయర్లు లీగ్‌లో ఆడడానికి తమ పేరును దరఖాస్తూ చేశారని పీసీబీ పేర్కొంది. టోర్నమెంట్ డైరెక్టర్ నదీమ్ ఖాన్ మాట్లాడుతూ..'' పాకిస్తాన్ జూనియర్ లీగ్(పీజేఎల్)కు మద్దతు తెలిపిన పలు క్రికెట్ బోర్డులకు మా ధన్యవాదాలు. జూనియర్ క్రికెట్ నుంచే సీనియర్ స్థాయికి వెళ్లేదన్న విషయం మరవద్దు. అందుకే జూనియర్ స్థాయిలో ఆటగాళ్లకు ఫౌండేషన్ బలంగా ఉండాలనే అభిప్రాయంతో పీజేఎల్ను ఏర్పాటు చేశాము. విదేశాలకు చెందిన జూనియర్ క్రికెటర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. పాకిస్తాన్లో క్రికెట్‌కు ఎంత ఆదరణ ఉందనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్ జూనియర్ లీగ్(పీజేఎల్)కే భారత్ మినహా మిగతా ఎనిమిది టెస్టు హోదా కలిగిన దేశాల నుంచి విరివిగా నామినేషన్స్ వచ్చాయని.. వీటితో పాటు ఆస్ట్రియా, బెల్జియం, బెల్జియం, కెనడా, డెన్మార్క్, నేపాల్, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి సభ్య దేశాల నుంచి కూడా చాలా మంది ఆటగాళ్లు తమ పేర్లను పంపించినట్లు పీసీబీ తెలిపింది.కాగా 2003 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టిన ఆటగాళ్లకు మాత్రమే పాకిస్తాన్ జూనియర్ లీగ్(పీజేఎల్)లో ఆడే అవకాశమున్నట్లు పీసీబీ తెలిపింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త లీగ్‌ను ఏర్పాటు చేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విభిన్న వాదనలు వచ్చాయి. ''పీఎస్ఎల్కే దిక్కు దివానం లేదు.. మరో కొత్త లీగ్ అవసరమా.. క్రికెట్లో పెద్దన్నలా భావించే బీసీసీఐకి పోటీగా ఏ టోర్నీని ప్లాన్ చేసినా అది వ్యర్థమే అవుతుంది.'' అంటూ పేర్కొన్నారు. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ 15వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు Asia Cup 2022: అర్హత సాధించామన్న ఆనందం.. 'కాలా చష్మా'తో దుమ్మురేపారు -
పాక్‌పై నమ్మకం లేదు.. అందుకే ఇలా: ఈసీబీ
పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు నిరాకరించడానికి ప్రధాన కారణం అక్కడి అభద్రతా భావం. ఏ క్షణానా ఏం జరుగుతుందోనని భయపడే సంఘటనలు చాలానే ఉన్నాయి. 2009లో పాకిస్తాన్ లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై తీవ్రవాదులు దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ద్వారా పాక్ గడ్డపై క్రికెట్ ఆడేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. ఇక భారత్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ గడ్డపై మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక ఒప్పుకుంది. మూడు వన్డేలు.. మూడు టి20 మ్యాచ్‌లు లాహోర్ వేదికగా నిర్వహించారు. అలా పాక్‌లో మొదలైన క్రికెట్ సందడిని ఆ తర్వాత ఆస్ట్రేలియా కంటిన్యూ చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే మసీదులో బాంబు పేలడం ఆశ్చర్యపరిచినప్పటికి.. సెక్యూరిటీ భద్రత మధ్య మ్యాచ్‌లను నిర్వహించారు. ఈ విషయంలో పాకిస్తాన్ భద్రతా చర్యలను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రశంసించింది. ఇక ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టు సెప్టెంబర్-అక్టోబర్ లో పాకిస్తాన్ పర్యటనకు రానుంది. అయితే అంతకముందే ఈసీబీ పాక్‌లో భద్రతా ఏ మేరకు ఉందో తెలుసుకోవాలని ఐదుగురితో కూడిన బృందాన్ని జూలై 17న పాకిస్తాన్‌కు పంపనున్నారు. ఆటగాళ్ల కంటే ముందే వెళ్లనున్న బృందం అక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నది. ఈ మేరకు పాకిస్తాన్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి..? భద్రతా లోపాలు తలెత్తకుండా పాకిస్తాన్ ఏ చర్యలు తీసుకుంది..? టీమ్ హోటల్స్ వంటి తదితర విషయాలను ఈసీబీ బృందం పరిశీలించనుంది. జులై 17న రానున్న బృందంలో ఇద్దరు క్రికెట్ ఆపరేషన్స్ అధికారులు, ఇద్దరు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఒక అధికార ప్రతినిధి ఉంటారు. వీళ్లు కరాచీ, ముల్తాన్, రావాల్పిండి, లాహోర్ (మ్యాచుల వేదికలు) లలో ఏర్పాట్లను పరిశీలిస్తారు. దీంతో ఈసీబీ బృందం ఇచ్చే నివేదికపై పాకిస్తాన్-ఇంగ్లండ్ సిరీస్ ఆధారపడి ఉంది. ఇక దాదాపు ఏడేండ్లు(2015) తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నది. ఈ పర్యటనలో ఏడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు మూడు టెస్టులు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్ గతేడాదే పాకిస్తాన్ పర్యటనకు రావాల్సి ఉంది. కానీ గతేడాది సెప్టెంబర్ లో న్యూజిలాండ్ జట్టు రావల్పిండిలో జరగాల్సి ఉన్న వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ పర్యటనను రద్దు చేసుకుని కివీస్ కు వెళ్లిపోయింది. భద్రతా కారణాలను చూపి కివీస్ ఆ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ కూడా షాకిచ్చింది. తమ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం తమకు ముఖ్యమని చెప్పిన ఈసీబీ.. ఈ సిరీస్ ను అర్థాంతరంగా రద్దు చేసుకుంది. కానీ తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులు ఈసీబీని ఒప్పించి.. పర్యటనకు రావాలని మెప్పించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. పాకిస్తాన్ శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు లంకకు వెళ్లింది. ఆసియాకప్-2022 ముగిసిన తర్వాత పాకిస్తాన్-ఇంగ్లండ్ సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Sachin Tendulkar: అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం Ind Vs Eng: బ్యాజ్‌బాల్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు -
పాకిస్థాన్ క్రికెట్‌ను 'అతను' భ్రష్టు పట్టిస్తాడు..!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ (పాక్ తరఫున 5 టెస్ట్‌లు, 2 వన్డేలు, ఓ టీ20 ఆడాడు) షాకింగ్ కామెంట్స్ చేశాడు. పీసీబీ అధ్యక్షుడిగా రమీజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైనా చేసిందేమీ లేదని దుయ్యబట్టాడు. నాలుగు దేశాల టీ20 టోర్నీ (భారత్, పాక్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్), భారత్‌తో క్రికెట్ సంబంధాలు అంటూ హడావుడి చేస్తున్నాడే తప్ప ఈ ఏడాది కాలంలో అతను సాధించింది ఏమీ లేదని పెదవి విరిచాడు. రమీజ్ పీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేసిన ఓ మంచి పనైనా చూపించాలని సవాల్ విసిరాడు. పీసీబీ పరిస్థితి గత పాలకుల హయాంలో ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందని, రమీజ్ వచ్చి కొత్తగా పొడిచిందేమీ లేదని విరుచుకుపడ్డాడు. రమీజ్ వచ్చే ఏడాది పీసీబీ ప్రణాళికలను వివరిస్తూ ప్రెస్‌మీట్ పెట్టిన నేపథ్యంలో తన్వీర్ ఈ మేరకు స్పందించాడు. రమీజ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీబీకి తన హయాం స్వర్ణయుగంలాంటిదని, తాను బాధ్యతలు చేపట్టాక ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేపట్టానని, పాక్ క్రికెట్‌ను తాను కొత్త పుంతలు తొక్కించానని గొప్పలు పోయాడు.జట్టు సెలక్షన్ విషయంలో పీసీబీ వ్యవహరిస్తున్న తీరును ఇటీవలే డానిష్ కనేరియా కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గతంతో పోలిస్తే పాక్ ఆటతీరు రమీజ్ హయాంలో కాస్త మెరుగు పడిందనే చెప్పాలి. గతేడాది కాలంలో పాక్ ఫార్మాట్లకతీతంగా ఓ మోస్తరు విజయాలు సాధిస్తుంది. చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! -
గంగూలీ పిలిచినా వెళ్లలేదు.. ఐపీఎల్ నేపథ్యంలో పీసీబీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు చూసేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ గతంలో తనను రెండుసార్లు (2021, 2022) ఆహ్వానించాడని, అయినా తాను గంగూలీ ఆహ్వానాన్ని తిరస్కరించానని పేర్కొన్నాడు. ఐపీఎల్ మీడియా హక్కులు భారీ మొత్తంలో అమ్ముడుపోయిన అంశంపై పాక్ మీడియా అడిగిన ప్రశ్నల సందర్భంగా రమీజ్ ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా రమీజ్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు బీసీసీఐ బాస్ తనను ఆహ్వానించాడని, అయినా తాను వెళ్లలేకపోయానని అన్నాడు. గంగూలీ నుంచి ఆహ్వానం అందాక వెళ్లాలా..? వద్దా..? అని చాలా రోజుల పాటు ఆలోచించానని, ఒకవేళ ఐపీఎల్ ఫైనల్స్‌ను వీక్షించేందుకు తాను వెళ్లుంటే పాక్ అభిమానులు నన్ను ఎప్పటికీ క్షమించేవారు కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్‌ల మైత్రిపరమైన సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వెళ్లే సాహసం చేయలేకపోయానని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ను ఓ క్రీడలా చూస్తే తాను గంగూలీ ఆహ్వానం మేరకు వెళ్లాల్సిందని, అయితే దాయది దేశాల్లో ఆ పరిస్థితులు లేవని తెలిపాడు. ఇదే సందర్భంగా రమీజ్ పీసీబీ ప్రతిపాదించిన నాలుగు దేశాల (భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) టీ20 సిరీస్‌పై కూడా స్పందించాడు. పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. నాలుగు దేశాల టీ20 సిరీస్‌పై గంగూలీతో డిస్కస్ చేశానని అన్నాడు. ఈ సిరీస్ సాధ్యాసాధ్యలపై దాదా త్వరలో ఓ ప్రకటన చేస్తానని హామీ ఇచ్చాడని తెలిపాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్‌లో అలా కాదు! అయినా! -
'కోహ్లికి ధోని అండ.. పాక్‌లో పుట్టడం నా దురదృష్టం'
పాకిస్తాన్ క్రికెటర్లలో మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లలో అహ్మద్ షెహజాద్ ఒకడు. 2009లో 17 ఏళ్ల వయసులో పాక్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అహ్మద్ షెహజాద్ టాప్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చేవాడు. పాక్ తరపున షెహజాద్ 13 టెస్టులు, 81 వన్డేలు, 59 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే 2016లో టి20 ప్రపంచకప్ అనంతరం అహ్మద్ షెహజాద్‌పై వేటు పడింది. ఇక చివరిసారి 2019లో పాక్ తరపున టి20 ఆడిన అహ్మద్ షెహజాద్ అప్పటినుంచి మళ్లీ జట్టులోకి రాలేదు. 2016 టి20 ప్రపంచకప్ అనంతరం అప్పటి పాక్ కోచ్ వకార్ యూనిస పీసీబీకి రిపోర్ట్ అందజేశాడు. ఆ రిపోర్ట్‌లో షెహజాద్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్ పేర్లు జతచేర్చాడు. ఈ ఇద్దరిని జట్టు నుంచి తొలగిస్తే మంచిదని రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఈ కారణంతో అహ్మద్ షెహజాద్‌పై వేటు పడింది. ఆ తర్వాత క్రమంగా అతను జట్టుకు దూరమయ్యాడు. తాజాగా అహ్మద్ షెహజాద్ తనను జట్టు నుంచి తీసివేయడంపై స్పందించాడు. ''టీమిండియా లాగా పాకిస్తాన్ క్రికెట్లో సీనియర్ల నుంచి మద్దతు లభించదు. దీనికి ఉదాహరణ టీమిండియాలో కోహ్లి- ధోనిలు. కోహ్లి ఫామ్ కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్.. సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని కోహ్లికి అండగా నిలబడ్డాడు. వరుసగా విఫలమవుతూ వస్తున్నా కోహ్లికి అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. ఆ తర్వాత కోహ్లి సూపర్ ఫామ్ అందుకొని తిరిగి రాణించాడు. కానీ దురదృష్టం కొద్ది పాకిస్తాన్లో అలా ఉండదు. ఇక్కడ ఒక ఆటగాడు బాగా పరుగులు చేస్తున్నాడంటే సీనియర్లలో కుళ్లు, అసూయ ఎక్కువగా కనిపిస్తాయి. ఇది నిజంగా దురదృష్టకరమనే చెప్పొచ్చు. నాపై రిపోర్ట్ ఇచ్చిన కమిటీని నేను తప్పు బట్టను. ఎందుకంటే పీసీబీ అడిగింది.. కమిటీ వాళ్ల డ్యూటీ చేసింది. కానీ రిపోర్ట్ ఇచ్చేముందు ఒకసారి నేరుగా మాట్లాడి ఉంటే బాగుండేది. ఏది సరైనది.. ఏది తప్పు అనేది క్లియర్‌గా చెప్పాల్సింది. జట్టులో నేను అగ్రెసివ్‌గా ఉండడం మూలానా జట్టులో గొడవలు వస్తున్నాయని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అదే విషయాన్ని నాకు డైరెక్ట్‌గా చెప్పి ఉంటే పద్దతి మార్చుకునేవాడిని'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్‌లో అలా కాదు! -
పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..
పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్.. జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం కలిగించింది. ముల్తాన్‌కు చెందిన మహిళా క్రికెటర్‌కు జట్టులో చోటు కల్పిస్తానంటూ హామీ ఇచ్చి ఆపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు(పీసీబీ) ఫిర్యాదు అందింది దీంతో రంగింలోకి దిగిన పీసీబీ సదరు కోచ్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టింది. తప్పు తేలితే ఎవర్ని వదిలిపెట్టమని.. నదీమ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని.. ఇప్పటికే అతన్ని పోలీసులకు అప్పగించినట్లు పీసీబీ స్పష్టం చేసింది. మహిళా క్రికెటర్ ఫిర్యాదు ప్రకారం.. ''ముల్తాన్‌కు చెందిన నేను కొన్నేళ్ల క్రితం పీసీబీ ఉమెన్స్ ట్రయల్స్ కోసం వచ్చాను. అక్కడే కోచ్ నదీమ్ ఇక్బాల్ పరిచయం అయ్యాడు. పాకిస్తాన్ మహిళా జట్టులో చోటు దక్కేలా తాను చేస్తానని.. అంతేగాక ఎంప్లాయ్మెంట్ బోర్డులోనూ పేరు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత చనువు పెంచుకొని లైంగిక వేధింపులకు పాల్పడమే గాక స్నేహితులను తీసుకొచ్చి శారీరకంగా వేధించేవాడు. దీనికి సంబంధించి వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. ఇన్ని రోజులు భరించినప్పటికి ఇక నావల్ల కాలేదు.. అందుకే విషయాన్ని బయటపెట్టా'' అంటూ పేర్కొంది ఇక నదీమ్ ఇక్బాల్ గతంలో పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్‌తో కలిసి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బౌలింగ్‌ను పంచుకున్నాడు. 50 ఏళ్ల నదీమ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వకార్ యూనిస్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేసేవాడని.. ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును 20 పరుగులకే కుప్పకూల్చిన ఘనత నదీమ్‌కు ఉందని.. ఆ మ్యాచ్‌లో నదీమ్ ఏడు వికెట్లతో చెలరేగాడు. వకార్‌తో పోటీ పడి వికెట్లు తీయడంతో నదీమ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. ఆ తర్వాత అతను ఏనాడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేకపోయాడు. 2004లో ప్రొఫెషనల్ ఆటకు గుడ్‌బై చెప్పిన నదీమ్ ఇక్బాల్ 80 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 258 వికెట్లు.. 49 లిస్ట్- ఏ మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. Nadeem Iqbal has been suspended by the PCB over a pending charge of sexual harassment 👇 https://t.co/TsUCdGsHTB — ESPNcricinfo (@ESPNcricinfo) June 18, 2022 చదవండి: ఆఖరి సమరానికి సమయం.. పిచ్ ఎలా ఉందంటే! -
డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర
పాకిస్తాన్ మహిళా లెగ్ స్పిన్నర్ తుబా హసన్ టి20 క్రికెట్లో కొత్త చరిత్ర చరిత్ర సృష్టించింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే బౌలింగ్‌లో బెస్ట్ స్పెల్(4-1-8-3) నమోదు చేసిన పాకిస్తాన్ మహిళా బౌలర్‌గా అరుదైన ఫీట్ సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో తుబా హసన్ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి ఒక మెయిడెన్ సహా మూడు కీలక వికెట్లు తీసుకొని ఆకట్టుకుంది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన తుబా హసన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ట్విటర్లో షేర్ చేస్తూ.. ''ఇంత అద్బుతమైన స్పెల్ ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడలేదు.. సూపర్ బౌలింగ్ తుబా హసన్..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. మాదవి, నిలాక్షి డిసిల్వా చెరో 25 పరుగులు చేశారు. తుబా హసన్, అనమ్ అమిన్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఐమన్ అన్వర్ రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మహిళల జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. నిదా దార్ 36* పరుగులు, బిస్బా మరూఫ్ 28* పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాకిస్తాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ మే 26న జరగనుంది. చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది BAN Vs SL: బంగ్లాదేశ్ 365 ఆలౌట్ 𝟒-𝟏-𝟖-𝟑 Best bowling figures on debut for Pakistan Women in T20Is! 🙌 An incredible spell by Tuba Hassan 💫 🐦 @TheRealPCB_Live Watch Live ➡️ https://t.co/ZY1fdGNHJ6 #⃣ #BackOurGirls | #PAKWvSLW pic.twitter.com/V9G0pTBSyk — Pakistan Cricket (@TheRealPCB) May 24, 2022 -
నిబంధన తుంగలో తొక్కిన పాక్ కెప్టెన్.. పీసీబీ సీరియస్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిబంధనలను తుంగలో తొక్కాడు. లాహోర్‌లోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్ అత్యంత మౌళిక సదుపాయాలు కలిగి ఉంటుంది. ఈ సెంటర్‌కు పీసీబీ అధికారులు, అంతర్జాతీయ ఆటగాళ్లు, ఫస్ట్‌క్లాస్, జూనియర్ క్రికెటర్లు మినహా వేరెవరికి ప్రవేశం లేదు. ఇటీవలే బాబర్ ఆజం తన సోదరుడు సఫీర్ ఆజంను ప్రాక్టీస్‌కు తీసుకొచ్చాడు.కాగా సఫీర్ ఆజం ఇంతవరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడలేదు. తన సోదరుడితో నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేయించి శిక్షణలో మెళుకువలు ఇచ్చాడు. స్వయంగా తానే పరిశీలించిన బాబర్ బౌలింగ్ టెక్నిక్స్ వివరించాడు.ఈ తతంగాన్ని అంతా బాబర్ ఆజం సోదరుడు సఫీర్ ఆజం ట్విటర్లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాబర్ ఆజం చేసిన పనిపై పీసీబీ కాస్త గుర్రుగానే ఉంది. నిబంధనలను అతిక్రమించిన బాబర్‌పై పీసీబీ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. బాబర్ ఆజం మూడు నాలుగు రోజుల క్రితమే తన సోదరుడితో కలిసి క్యాంప్‌ను సందర్శించాడు. అయితే కేవలం చూడడానికి వచ్చాడనుకొని అనుమతి ఇచ్చామని.. కానీ సఫీర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడన్న విషయం తొలుత మా దృష్టికి రాలేదు. తాజాగా ఈ విషయం తెలియడం.. ఆపై ఏం చేయాలన్న దానిపై మాకు ఒక క్లారిటీ ఉంది అని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: Sourav Ganguly New House: ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు pic.twitter.com/u4eZFklQLl — safeer azam (@safeerazam10) May 14, 2022 -
SL Vs Pak: పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ రద్దు చేసుకున్న శ్రీలంక.. కారణం?
Pakistan Tour Of Sri Lanka 2022: పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఆతిథ్య శ్రీలంక విజ్ఞప్తి మేరకు తాము ఇందుకు అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కై పాకిస్తాన్ జూలై- ఆగష్టు నెలలో శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. అయితే, దేశంలో ప్రస్తుత పరిస్థితులు, శ్రీలంక ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ మార్పు నేపథ్యంలో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకోవాలని శ్రీలంక భావించింది. ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ షెడ్యూల్లో భాగం కానుందన ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పీసీబీ దృష్టికి తీసుకువెళ్లగా ఇందుకు సానుకూల స్పందన వచ్చింది. అయితే, ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మాత్రం యథావిథిగా కొనసాగనుంది. ఈ విషయాల గురించి పీసీబీ మీడియా డైరెక్టర్ సమీ ఉల్ హసన్ బర్నే క్రికెట్ పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆర్థికంగా నిలదొక్కుకునే క్రమంలో లంకన్ ప్రీమియర్ లీగ్‌ను వారం ముందే ఆరంభించాలనుకుంటున్నట్లు శ్రీలంకన్ బోర్డు చెప్పింది. కాబట్టి వన్డే సిరీస్‌ను రద్దు చేయాలని కోరింది. ఇది వరల్డ్‌కప్ సూపర్‌లీగ్‌లో భాగం కాదు కాబట్టి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. టెస్టు సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది’’ అని పేర్కొన్నారు. కాగా శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామాతో అక్కడ రాజకీయ సంక్షోభం కూడా నెలకొంది. చదవండి👉🏾Virat Kohli: కోహ్లి గోల్డెన్ డక్.. మరేం పర్లేదు.. కోచ్ అంటే ఇలా ఉండాలి! వైరల్ చదవండి👉🏾ICC POTM- April: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేత ఎవరంటే! -
T20 WC 2021: రిజ్వాన్‌కు ఆ నిషేధిత మెడిసిన్ ఇచ్చాం: పీసీబీ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు
ICC T20 World Cup 2021 Semi Final PAK Vs AUS: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో అదరగొట్టిన పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డాక్టర్ నజీబుల్లా సుమ్రొ సంచలన విషయాలు వెల్లడించాడు. వరల్డ్‌కప్ టోర్నీ సమయంలో అనారోగ్యం బారిన పడ్డ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కోలుకునేందుకు నిషేధిత పదార్థాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. కాగా యూఏఈ వేదికగా సాగిన ఐసీసీ పొట్టి ఫార్మాట్ ఈవెంట్లో పాకిస్తాన్ అజేయ రికార్డును కొనసాగిస్తూ సెమీస్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు రిజ్వాన్ తీవ్ర చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిన విషయం గుర్తుండే ఉంటుంది. ఐసీయూలో చికిత్స పొందిన అతడు అనూహ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి రావడమే కాదు.. 52 బంతుల్లోనే 67 పరుగులు సాధించాడు. PC: Shoaib Akhtar Instagram అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలగేరడంతో పాక్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన కంగారూలు.. ఆపై ఫైనల్ చేరి.. అక్కడ న్యూజిలాండ్‌ను ఓడించి తొలిసారి ట్రోఫీ గెలిచారు. ఇదిలా ఉంటే.. అనారోగ్యాన్ని సైతం లెక్కచేయక మైదానంలో దిగాడంటూ అప్పట్లో రిజ్వాన్‌పై ప్రశంసలు కురిశాయి. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అయితే రిజ్వాన్‌కు ఆట పట్ల ఉన్న అంకితభావం, దేశం కోసం ఆడాలన్న తపన చూసి గర్వపడుతున్నానంటూ పేర్కొన్నాడు. మిగతా పాక్ క్రికెటర్లు సైతం అతడిని ప్రశంసించారు. అయితే, ఈ ఘటన గురించి రిజ్వాన్‌కు చికిత్స అందించిన డాక్టర్ నజీబుల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు.. ‘‘నువ్వు అసలు శ్వాస తీసుకునే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు కోలుకోవాలంటే నీకు ఇంజెక్ట్ చేయాల్సిన మెడిసన్ గురించి ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆ మెడిసిన్ అథ్లెట్లు వాడటం నిషేధం. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకు కచ్చితంగా ఐసీసీ పర్మిషన్ తీసుకోవాలి’’ అని రిజ్వాన్‌తో ఇంటర్వ్యూలో నజీబుల్లా వ్యాఖ్యానించాడు. కాగా నజీబుల్లా వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీశాయి. చదవండి👉🏾MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని చదవండి👉🏾IPL 2022: ధోని.. బ్యాట్ కొరకడం వెనుక అసలు కథ ఇదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
జూనియర్ క్రికెట్ లీగ్‌పై సంచలన కామెంట్స్ చేసిన పాక్ వెటరన్
యువ క్రికెటర్లను గుర్తించి, వారిలోని టాలెంట్‌ను వెలికి తీసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తరహాలో పాకిస్తాన్ జూనియర్ క్రికెట్ లీగ్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ టోర్నీని ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 15 వరకూ లాహోర్ వేదికగా నిర్వహించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ క్రికెట్ లీగ్‌పై ఆ దేశ వెటరన్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ సంచలన కామెంట్స్ చేశాడు. 19 ఏళ్లు కూడా నిండని కుర్రాళ్లతో క్రికెట్ ఆడించడం చైల్డ్ లేబర్‌తో సమానమని వ్యాఖ్యానించాడు. జూనియర్ క్రికెట్ లీగ్ అనే ఐడియా పాక్‌లో క్రికెట్ వ్యవస్థని నాశనం చేస్తుందని అన్నాడు. యువ క్రికెటర్లకు ఇలాంటి వేదిక పాక్షికంగా లాభం చేకూర్చినప్పటికీ.. భవిష్యత్తులో మానసికంగా, శారీరకంగా సమస్యలు ఎదుర్కొనేలా చేస్తుందని తెలిపాడు. యుక్త వయసులో షార్ట్ క్రికెట్ ఆడటం వల్ల కుర్రాళ్లు బేసిక్స్ దగ్గరే ఆగిపోతారని, సుదీర్ఘ ఫార్మాట్ ఆడటం వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా, భారత్‌లో జరిగే ఐపీఎల్లో ఆడాలంటే కుర్రాళ్ల వయసు కనీసం 19 ఏళ్లు నిండి ఉండాలన్న నిబంధన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఒక వేళ ఆటగాడి వయసు 19 దాటకపోతే, అతనికి లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడిన అనుభవమైనా ఉండాలి. ఈ నిబంధన కారణంగా భారత అండర్ 19 వరల్డ్ కప్ 2022 హీరోలు రఘువంశీ, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడే అవకాశాన్ని కోల్పోయారు. చదవండి: టీమిండియా విండీస్ పర్యటన షెడ్యూల్ ఖరారు..! -
'ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మా దేశాన్ని ఎందుకు లాగుతారు?'
పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా షాహిద్ అఫ్రిదిపై గత వారం నుంచి వరుస ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అఫ్రిది ఒక క్యారెక్టర్‌లెస్.. అబద్దాల కోరు.. జట్టు నుంచి బహిష్కరించడానికి ప్రధాన కారణం అఫ్రిదియేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక గురువారం తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ అఫ్రిది ఒత్తిడి చేశాడంటూ.. హిందువులకు ఇక్కడ చోటు లేదంటూ అవమానపరిచాడంటూ పేర్కొన్నాడు. అయితే కనేరియా వరుస ఆరోపణలపై షాహిద్ అఫ్రిది ఎట్టకేలకు స్పందించాడు. కనేరియా కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నాడని.. శత్రు దేశానికి(భారతదేశం) చెందిన మీడియా చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చి తనను అవమానపరచాడంటూ పేర్కొన్నాడు. ''కనేరియా ఆరోపించినట్టు తాను అంత చెడ్డవాడినే అయితే అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించాడు. కేవలం తన పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడు. కనేరియా నాకు సోదరుడు లాంటివాడు. కొన్నేళ్లపాటు ఇద్దరం కలిసి పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాము. అది మరిచిపోయి పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. నన్ను అబద్దాల కోరు.. క్యారెక్టర్ లేనివాడు అనే ముందు అతడి క్యారెక్టర్ ఏంటో చూసుకుంటే బాగుంటుంది. అతడు మన శత్రు దేశం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మత చిచ్చు రగిలిస్తున్నాడు. ఇది అంత మంచి పరిణామం కాదు.'' అని ఆగ్రహం వక్తం చేశాడు. అయితే అఫ్రిది ఆరోపణలపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. ''కనేరియా నీపై ఆరోపణలు చేశాడు నిజమే.. ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మధ్యలో మా దేశాన్ని ఎందుకు లాగుతున్నారు''.. ''ఒక ఆటగాడు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఆయా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ క్రమంలో మా దేశానికి చెందిన ప్రముఖ చానెల్‌కు ఇంటర్య్వూ ఇచ్చి ఉండొచ్చు''.. ''అసలు మత చిచ్చు రగిలిస్తుంది నువ్వు(అఫ్రిది).. శత్రుదేశం అని సంభోదించినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు : పాక్ మాజీ స్పిన్నర్ -
Pak Vs WI ODI Series: విండీస్‌తో మూడు వన్డేలు.. త్వరలోనే టీ20 సిరీస్ కూడా!
ICC World Cup Super League Pakistan Vs West Indies: వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగబోయే వన్డే సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. జూన్ 8 నుంచి జూన్ 12 వరకు మూడు వన్డేలు ఆడనున్నట్లు పేర్కొంది. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి పీసీబీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రావల్పిండిలో ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్‌లీగ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జూన్ 8 నుంచి 12 మధ్య జరిగే సిరీస్‌కు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం వెస్టిండీస్ జట్టు జూన్ 5న ఇస్లామాబాద్‌కు చేరుకుంటుంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో డిసెంబరు 2021లో జరగాల్సిన ఈ సిరీస్‌ను రీ షెడ్యూల్ చేసేందుకు ఇరు వర్గాల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు అప్పుడు జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా 2023లో వీలైనంత త్వరగా ఆడటానికి విండీస్ బోర్డు అంగీకారం తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తాం’’ అని పీసీబీ వెల్లడించింది. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ వన్డే సిరీస్ రావల్పిండిలోని పిండి స్టేడియం వేదికగా మూడు తొలి వన్డే: జూన్ 8 రెండో వన్డే: జూన్ 10 మూడో వన్డే: జూన్ 12 చదవండి: IPL 2022: ఎవరీ ఆయుష్ బదోని.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్ పాండ్యా -
పాక్ పర్యటనకు వెళ్తే నీ భర్త ప్రాణాలతో తిరిగిరాడు.. ఆసీస్ ప్లేయర్ భార్యకు బెదిరింపులు
Pakistan Vs Australia: 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సిరీస్ ప్రారంభానికి ముందే బెదిరింపుల పర్వం మొదలైంది. పాక్ పర్యటనకు వెళ్తే నీ భర్త ప్రాణాలతో తిరిగిరాడంటూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ భార్యకు సోషల్‌మీడియా వేదికగా బెదిరింపు సందేశం వచ్చింది. ఈ విషయమై అగర్ భార్య మెడిలీన్ క్రికెట్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులకు ఫిర్యాదు చేయగా, ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా విచారణ చేపట్టాయి. భారత్ కేంద్రంగా ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి బెదిరింపు మెసేజ్వచ్చినట్లు ప్రాధమిక విచారణలో తేలిందని, ఈ బెదిరింపు మెసేజ్‌ను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు పేర్కొన్నాయి. కాగా, పాట్ కమిన్స్ సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు ఫిబ్రవరి 27న పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ పర్యటనలో ఆసీస్ 3 టెస్ట్‌లు, 3 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. మార్చి 4న రావల్పిండి వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. చదవండి: విండీస్ స్పిన్ దిగ్గజం కన్నుమూత -
4 Nation T20 Series: భారత్-పాక్ టీ20 సిరీస్‌పై జై షా కీలక ప్రకటన
భారత్, పాక్ జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను కలుపుకునే నాలుగు దేశాల టీ20 సిరీస్‌ను ప్లాన్ చేయాలన్న పీసీబీ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ప్రతిపాదించిన ఈ టోర్నీ వల్ల స్వల్పకాలిక వాణిజ్య ప్రయోజనాలే తప్ప, పెద్దగా ఉపయోగం ఉండదని బీసీసీఐ సెక్రెటరీ జై షా తేల్చిపారేశాడు. ఐపీఎల్, ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో స్వల్పకాలిక ప్రయోజనాలు (రమీజ్ రాజా ప్రతిపాదించిన నాలుగు దేశాల టోర్నీ) తమకు ముఖ్యం కాదని పీసీబీ ప్రతిపాదనను షా సున్నితంగా కొట్టిపారేశాడు. దీంతో భారత్-పాక్ జట్లతో కూడిన నాలుగు దేశాల టీ20 సిరీస్‌కు ఆదిలోనే బ్రేకులు పడినట్లైంది. షా వ్యాఖ్యలతో దాయాదుల పోరు మరోసారి ఐసీసీ ఈవెంట్ల వరకే పరిమితమైంది. త్వరలో భారత-పాక్‌ల మధ్య సిరీస్ ఉంటుందని ఆశించిన ఇరు దేశాల అభిమానుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. కాగా, గత నెలలో పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఐసీసీ ముందు ఈ నాలుగు దేశాల క్రికెట్ సిరీస్ ప్రతిపాదనను ఉంచాడు. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వచ్చిన టీఆర్పీలను బేస్ చేసుకుని పీసీబీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ సాధ్యపడదని తెలిసి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను కలుపుకుని తటస్థ వేదికలపై నాలుగు దేశాల టీ20 సిరీస్ నిర్వహిస్తే బావుంటందని పీసీబీ ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను బీసీసీఐ సున్నితంగా కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23న దాయాదుల సమరం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఐసీసీ సోమవారం ప్రారంభించగా, గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ సేల్ అయిపోయాయి. చదవండి: IND VS WI: రెండో వన్డేకు కేఎల్ రాహుల్ సహా కీలక ఆటగాళ్లు రెడీ.. -
నా వల్ల కాదు బాబోయ్..! పాక్ హెడ్ కోచ్ పదవికి సక్లయిన్ గుడ్‌బై
ఇస్లామాబాద్: సీనియర్ ప్లేయర్ మహ్మద్ హఫీజ్ రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు హెడ్ కోచ్(తాత్కాలిక) సక్లయిన్ ముస్తాక్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. హెడ్ కోచ్ పదవికి విదేశీయుడైతేనే కరెక్ట్ అని పీసీబీ ప్రకటన విడుదల చేసిన వెంటనే సక్లయిన్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. పీసీబీ వ్యవహారిస్తున్న తీరు నచ్చకే సక్లయిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, అతను మాత్రం వ్యక్తిగత కారణాల చేతనే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. కాగా, రమీజ్ రాజా పీసీబీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే నాటి హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లు కోచ్ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పాక్ కోచ్ పదవికి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. చదవండి: IND Vs SA 2nd Test: ఆరు టెస్ట్‌లు, ఆరుగురు వేర్వేరు కెప్టెన్లు..! -
Hasan Ali: సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్.. ఇంత దురుసుతనం పనికిరాదు!
Hasan Ali Argument With Journalist Goes Viral: పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ మరోసారి వార్తల్లో నిలిచాడు. జర్నలిస్టుతో వాదనకు దిగి దురుసుగా ప్రవర్తించాడన్న విమర్శలు మూటగట్టుకున్నాడు. అసలేం జరిగిందంటే... పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా హసన్ అలీ ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా సీజన్ ప్లేయర్స్ డ్రాఫ్ట్ లిస్టు ప్రకటన సందర్భంగా... ఓ జర్నలిస్టు పదే పదే హసన్ అలీని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడిని మాట్లాడనివ్వకుండా అడ్డుకున్న హసన్ అలీ... తర్వాతి ప్రశ్న అంటూ సమాధానం దాటవేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన సదరు జర్నలిస్టు.. ‘‘ఇది అస్సలు మంచి పద్ధతి కాదు’’ అని విసుక్కున్నాడు. హసన్ అలీ సైతం ఇందుకు ఘాటుగానే బదులిచ్చాడు. ‘‘ముందు ట్విటర్లో మంచి రాతలు రాయడం నేర్చుకోండి. ఆ తర్వాతే నేను సమాధానాలు ఇస్తాను. సరేనా? వ్యక్తిగతంగా ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం సరికాదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రశ్నలు అడగకుండా మిమ్మల్ని ఆపలేదేమో కానీ.. కనీసం మాకైనా ఆ హక్కు ఉంది కదా!’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన హసన్ అలీని ఇస్లామాబాద్ యునైటెడ్ అధికారులు సముదాయించారు. అప్పటి వివాదం.. అనాస్ సయీద్ అనే జర్నలిస్టు గతంలో హసన్ అలీని ట్విటర్ వేదికగా విమర్శించాడు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కు ధరించాలంటూ హితవు పలికాడు. సహచర ఆటగాళ్లతో హసన్ అలీ ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి... ‘‘ప్రొటోకాల్ ప్రకారం.. ప్రయాణాల్లో తప్పక మాస్కు ధరించాలి. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధిస్తారు’’ అంటూ సెటైర్లు వేశాడు. ఇందుకు స్పందనగా.. ‘‘పాత వీడియోలతో డ్రామాలు చేయవద్దు. వాస్తవాలేమిటో తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి. ఫేక్ మసాలాలు వద్దు. మీ నుంచి సత్ప్రవర్తన ఆశిస్తున్నా’’ అని హసన్ అలీ బదులిచ్చాడు. తాజా ప్రెస్ మీట్లో భాగంగా మరోసారి వీరి మధ్య వాగ్వాదం జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ఇంత దురుసు ప్రవర్తన పనికిరాదు’’ అంటూ హసన్ అలీని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అదే సమయంలో జర్నలిస్టులు కూడా నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. ఇక ప్లాటినమ్ కేటగిరీలో ఇస్లామాబాద్ యునైటెడ్ హసన్ అలీని రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మథ్యూవేడ్ క్యాచ్ జారవిడిచినందుకు హసన్ అలీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: Rohit Sharma- Virat Kohli: ఒకరి గురించి ఒకరికి తెలుసు.. కోహ్లి వల్లే ఇదంతా.. రోహిత్ ప్రశంసల జల్లు BAN vs PAK: అడ్డంగా బుక్కైన హసన్ అలీ.. అంపైర్ వార్నింగ్ What happened to Hassan Ali?! What did @anussaeed1 say to him on Twitter? pic.twitter.com/C6vCFGINv0 — Ghumman (@emclub77) December 12, 2021 Don’t create drama please with old videos. Check your facts first. No need to give fake masala, expect better from u.🙏🏼 https://t.co/Grw11Zz11P — Hassan Ali 🇵🇰 (@RealHa55an) May 31, 2021 -
17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..!
Team India Likely To Tour Pakistan After 17 Years For Asia Cup 2023: 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా కప్ 2023 నిర్వహణ హక్కులను దాయాది దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకోవడంతో టీమిండియా పాక్ పర్యటన అంశం తెరపైకి వచ్చింది. ఈనెల 15న దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పీసీబీకి ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్ నిర్వహణ బాధ్యతలను అప్పచెబుతూ కౌన్సిల్ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లోనే ఆసియా కప్‌ను పాక్‌లో నిర్వహించాల్సి ఉండింది. అయితే అప్పట్లో పాక్ పర్యటనకు బీసీసీఐ ససేమిరా అనడంతో పీసీబీ ఆ బాధ్యతలను శ్రీలంకకు కట్టబెట్టింది. కరోనా కారణంగా శ్రీలంక కూడా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని చేతులెత్తేయడంతో అప్పట్లో టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తాజాగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా, పీసీబీ నూతన చైర్మన్ రమీజ్ రాజా దృవీకరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని వారు సంయుక్తంగా ప్రకటించారు. అన్నీ సజావుగా సాగితే టోర్నీని 2023 జూన్, జులై మాసాల్లో నిర్వహించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. కాగా, టీమిండియా చివరిసారిగా 2006లో పాక్‌లో పర్యటించింది. ఆ తర్వాత భారత్-పాక్‌ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో పాక్ వెలుపల జరిగిన ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడ్డాయి. చదవండి: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్‌కు కోహ్లి వార్నింగ్..! -
టీమిండియాతో మెగా పోరుకు ముందు పాక్ జట్టుకు భారీ షాక్..
Grant Bradburn Steps Down As PCB High Performance Coach: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య అక్టోబర్ 24న జరగనున్న హై ఓల్టేజ్ పోరుకు ముందు పాక్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఒప్పందం కాలం ముగియడంతో ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించాడు. ఈ సందర్భంగా బ్రాడ్‌బర్న్ పీసీబీ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశాడు. పాక్ క్రికెట్ జట్టుతో కలిసి పని చేయడం గర్వించదగ్గ విషయమని, ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు పీసీబీ థ్యాంక్స్ అని తెలిపాడు. 2018 సెప్టెంబర్ నుంచి 2020 జూన్ వరకు పాక్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రాడ్‌బర్న్.. ఆ తర్వాత పాక్ హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్‌గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే, పీసీబీ ఛైర్మన్‌గా రమీజ్ రాజా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ విరమణ చేసిన ఐదో కీలక వ్యక్తి బ్రాడ్‌బర్న్ కావడం విశేషం. ఇతని కంటే ముందు పాక్ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్, సీఈఓ వసీం ఖాన్‌లతో పాటు మార్కెటింగ్ హెడ్ బాబర్ హమీద్ రాజీనామా చేశారు. వీళ్లంతా రమీజ్ రాజా ఒత్తిడి తట్టుకోలేక పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన బ్రాడ్‌బర్న్ 1990 నుంచి 2001 వరకు న్యూజిలాండ్ తరఫున 7 టెస్ట్‌లు, 11 వన్డేలు ఆడాడు. చదవండి: IPL 2021 Final: పలు అరుదైన రికార్డులపై కన్నేసిన సీఎస్కే ఆటగాళ్లు -
సోహైబ్ మక్సుద్ ఔట్.. పాక్ జట్టులోకి సీనియర్ క్రికెటర్
Shoaib Malik Replaced By Sohaib Maqsood... టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ జట్టుకు షాక్ తగిలింది. వెన్ను నొప్పితో బాధపడుతున్న బ్యాటర్ సోహైబ్ మక్సూద్ జట్టు నుంచి వైదొలిగాడు. కాగా మక్సూద్ స్థానంలో షోయబ్ మాలిక్‌ను ఎంపిక చేసినట్లు పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.నేషనల్ టి20 కప్‌లో ఆడుతున్న మక్సూద్ అక్టోబర్ 6న మ్యాచ్ ఆడుతుండగా వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డాడు. మ్యాచ్ అనంతరం వైద్యులు అతన్ని పరీక్షలకు పంపారు. తాజాగా వచ్చిన ఎమ్ఆర్ఐ స్కాన్ రిపోర్ట్‌లో మక్సూద్ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలిందని.. కొన్నివారాల పాటు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇక మక్సూద్ స్థానంలో జట్టులోకి వచ్చిన షోయబ్ మాలిక్ 2007 టి20 ఆరంభ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్ చేర్చాడు. అనంతరం 2009 టి20 ప్రపంచకప్ విజేత పాకిస్తన్ జట్టులో సభ్యుడిగా ఉన్న షోయబ్ ఆ తర్వాత 2012, 2014, 2016లో టి20 ప్రపంచకప్‌లు ఆడాడు. సీనియర్ ఆల్‌రౌండర్‌గా పేరుపొందిన షోయబ్ మాలిక్ పాక్ తరపున 35 టెస్టులు, 287 వన్డేలు, 116 టి20లు ఆడాడు. చదవండి: T20 World Cup: ఓపెనర్‌గా సెలక్ట్ అయ్యానని విరాట్ భాయ్ చెప్పాడు! దీంతో పీసీబీ అతన్ని టి20 ప్రపంచకప్ జట్టు ప్రాబబుల్స్ నుంచి తప్పించినట్లు పేర్కొంది. కాగా సోహైబ్ మక్సూద్ పాకిస్తాన్ తరపున 29 వన్డేల్లో 781 పరుగులు.. 26 టి20ల్లో 273 పరుగులు సాధించాడు. కాగా టి20 ప్రపంచకప్‌కు సంబంధించి శుక్రవారం పీసీబీ సెలెక్టర్లు పాకిస్తాన్ జట్టులో మూడు మార్పులు చేశారు. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు హైదర్ అలీ, ఫఖర్ జమాన్‌లు 15 మంది ప్రాబబుల్‌సలో చోటు దక్కించుకున్నారు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. చదవండి: T20 World Cup 2021: పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు టి20 ప్రపంచకప్: పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్ మాలిక్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ -
పాక్ జట్టుకు బంపర్ ఆఫర్.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడిస్తే..?
Update: ఇక భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సరిగ్గా 16 రోజుల కిత్రం పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా తమ జట్టు గెలవాలని ఆకాక్షించగా ఆయన కల నెరవేరింది. దాయాది జట్ల పోరులో పాక్‌నే విజయం వరించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ను 10 వికెట్లతో చిత్తు చేసి వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో పాక్ జట్టు గెలుపొందింది. PCB To Get Blank Cheque If Pakistan Beat Team India: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టులో మనోస్థైర్యాన్ని నింపేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఓ సంచలన ప్రకటన చేశాడు. మెగా ఈవెంట్లో భారత్‌ను మట్టికరిపిస్తే పాక్ జట్టుకు బ్లాంక్ చెక్ ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలాగే తమ దేశ పర్యటనను అర్దాంతరంగా రద్దు చేసుకున్న న్యూజిలాండ్ జట్టును కూడా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన బీసీసీఐని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీకి 90 శాతం నిధులు సమకూరుస్తుంది బీసీసీఐయేనని, భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి నిధులు మళ్లించడం మానుకుంటే పీసీబీ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా, భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న పొట్టి ప్రపంచకప్‌లో దాయాదులు మరోసారి ఎదురెదురుపడనున్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్ జట్టు ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ మెగా ఈవెంట్లో ఇరు జట్లు 5 సార్లు తలపడగా.. 5 మ్యాచ్‌ల్లో టీమిండియానే గెలుపొందింది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. లీగ్ దశలో టీమిండియా తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే... -
పాక్ కోచ్‌గా చచ్చినా చేయను: వసీం అక్రమ్
వసీం అక్రమ్.. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్రమ్.. 1999 వన్డే వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా పాకిస్తాన్‌ను ఫైనల్ చేర్చాడు. దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అక్రమ్.. గతంలో వ్యాఖ్యాతగానూ పని చేశాడు. అయితే ఇంత అనుభవం ఉన్న అక్రమ్ ఏనాడు పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ముందుకు రాలేదు. దీనిపై చాలా మందికి సందేహం ఉండగా.. తాజాగా ఈ యార్కర్ దిగ్గజం క్లారిటీ ఇచ్చాడు. పాకిస్తాన్ కోచ్ పదవి చేపట్టకపోవడంపై అక్రమ్ ఒక ఇంటర్య్వూలో పెదవి విప్పాడు. క్రికెట్ కార్నర్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు. ''పాకిస్తాన్‌కు కోచ్‌గా ఎంపికైతే ఫ్యామిలీకీ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేగాక సంవత్సరంలో 200 నుంచి 250 రోజులు పాకిస్తాన్ క్రికెట్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇక పాక్ జట్టు ఓడిపోతే అభిమానులు చేసే అల్లరి నాకు అస్సలు ఇష్టం ఉండదు. వారి ప్రవర్తన నన్ను పాకిస్తాన్ క్రికెట్ కోచ్ పదవికి దూరంగా ఉండేలా చేసింది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అఫ్కోర్స్.. ఈ వ్యాఖ్యలు చేయడానికి నేనేం ఫూల్‌ను కాదు. పాకిస్తాన్ ఏ సిరీస్‌లో ఓడిపోయినా సోషల్ మీడియా వేదికగా కోచ్‌ను, సీనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వాళ్లు పెట్టే కామెంట్స్ చిరాకు కలిగిస్తాయి. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ మ్యాచ్‌లో కోచ్ ఆడడు.. ప్లేయర్స్ మాత్రమే ఆడుతారు. కోచ్ అనేవాడు ఆటగాళ్లకు సలహాలు మాత్రమే ఇస్తాడు. ఈ విషయం తెలుసుకోకుండా అనవసరంగా కోచ్‌ల మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తారు. మా దేశంలో జట్టు ఓడిపోవడం కంటే కోచ్‌లపై కక్షసాధింపు చర్యలే ఎక్కువ ఉంటాయి. అందుకే పాకిస్తాన్ జట్టుకు కోచ్ పదవిలో ఎక్కువకాలం ఎవరూ ఉండరు. ఇలాంటివి బయటిదేశాలలో ఎక్కువగా కనిపించవు. నా దృష్టిలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నేను తట్టుకోలేను. క్రికెట్‌ను ఎంజాయ్ చేసేవాళ్లను.. ఇష్టంతో చూసేవాళ్లను ఎంత ప్రేమిస్తానో.. నాతో తప్పుగా ప్రవర్తించేవారిపై అంత కోపంతో ఉంటాను. అందుకే పాకిస్తాన్ క్రికెట్లో కోచ్ పదవిని ఎప్పుడు ఆశించలేదు.. ఆశించబోను కూడా'' అని చెప్పుకొచ్చారు. చదవండి: T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్ చేస్తాడు: ఫించ్ వసీం అక్రమ్ తన 19 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో పాక్ తరపున 104 టెస్టుల్లో 414 వికెట్లు, 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. ఇక క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ కేకేఆర్ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఇటీవలే పాకిస్తాన్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిస్బాఉల్ హక్ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి వకార్ యూనిస్ కూడా వైదొలిగాడు. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పాక్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్.. మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా పీసీబీ ఎంపిక చేసింది. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న టీమిండియాతో ఆడనుంది. చదవండి: అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
‘కివీస్ జట్టుకు బెదిరింపులు భారత్ కుట్రే’.. పాక్ మంత్రి సంచలన ఆరోపణ
Threat To New Zealand Cricketers Came From India: భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాక్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన నేపథ్యంలో పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి సంచలన ఆరోపణలు చేశాడు. కివీస్ టూర్ రద్దుకు భారత్ కుట్ర చేసిందంటూ పసలేని వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ జట్టుకు బెదిరింపు ఈమెయిల్(కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ భార్యకు వచ్చింది) సింగపూర్ ఐపీ అడ్రస్ చూపించే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్(వీపీఎన్) ఉపయోగించి భారత్‌లోని అనుబంధ పరికరం నుండి పంపబడిందంటూ బుధవారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించాడు. అయితే, ఈ విషయమై భారత విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తొలి వన్డే(సెప్టెంబర్ 17)కు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సైతం తాము పాక్‌లో పర్యటించడం లేదంటూ వెల్లడించింది. ఈ రెండు జట్లు పాక్ టూర్‌ను రద్దు చేసుకోవడంతో పాక్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ప్రభావం పడింది. భవిష్యత్తులో విదేశీ జట్లు పాక్‌లో పర్యటించడం ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ జట్టు పాక్ టూర్‌ను రద్దు చేసుకోవాలని తమ ప్రభుత్వం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కు ఎలాంటి సూచన చేయలేదని పాక్‌లో యూకే హైకమిషనర్ క్రిస్టియన్ టర్నర్ పేర్కొనడం కొసమెరుపు. చదవండి: "పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది.." -
కివీస్ సిరీస్ రద్దు.. కావాలనే మాపై కుట్రలు పన్నారు
Pakistan Interior Minister Says International Conspiracy.. పాకిస్తాన్లో సరైన భద్రత లేదంటూ న్యూజిలాండ్ జట్టు చివరి నిమిషంలో సిరీస్‌ను రద్దు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మరికొద్ది నిమిషాల్లో తొలి మ్యాచ్ మొదలవుతుందనగా కివీస్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడం సగటు అభిమానిని షాక్‌కు గురిచేసింది. ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ కూడా ఉలిక్కిపడింది. చాలా సంవత్సరాల తర్వత ఒక విదేశీ జట్టు మా గడ్డపై అడుగుపెట్టిందన్న ఆనందం పీసీబీకి మిగల్లేదు. ఒక్కసారిగా అయోమయంలో పడింది... ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చదవండి: పాకిస్తాన్లో భద్రత లేదంటూ... కివీస్ పర్యటన రద్దు! పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కూడా కివీస్ సిరీస్ రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. '' మాపై కావాలనే కుట్రలు పన్నుతున్నారు. కొన్ని అతీత శక్తులు మా దేశంలో క్రికెట్ జరగకుండా అడ్డుపడుతున్నాయి. అఫ్గానిస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం మా దేశంపై పనిగట్టుకొని బురద జల్లుతున్నారు. ఉన్న పళంతగా కివీస్ సిరీస్ రద్దు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్లు భద్రతా కారణాల రిత్యా అనే సాకు చూపుతున్నారు.. కానీ భద్రత విషయంలో పీసీబీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కివీస్ బోర్డుకు ఎటువంటి నష్టం కలగకుండా ఆటగాళ్లను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చింది. అయినప్పటికీ భద్రత అనే అంశాన్ని లేవనెత్తి మమ్మల్ని కించపరిచారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. NZ just killed Pakistan cricket 😡😡 — Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021 Following points for New Zealand to remember: ° 9 Pakistanis were killed in the Christchurch attack. ° Pakistan stood strong with New Zealand. ° Pakistan toured New Zealand in the worst of Covid circumstances regardless of the crude treatment by NZ authorities on that tour. — Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021 కాగా న్యూజిలాండ్ జట్టు సిరీస్‌ను అర్థంతరంగా రద్దు చేసుకోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కివీస్ సిరీస్ రద్దు చేసుకోవడంపై ట్విటర్లో ఘాటుగా స్పందించాడు. ''న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది.అర్థంతరంగా సిరీస్ రద్దు చేసుకున్న కివీస్ ముందు నేను కొన్ని ప్రశ్నలు ఉంచుతున్నా. క్రైస్ట్‌చర్చిలో జరిగిన పేలుడులో 9 మంది పాకిస్తానీలు చనిపోయారు. మరి అప్పుడు మీకు భద్రత గుర్తుకురాలేదా..? అంతేగాక ఈ విషయంలో అప్పట్లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌కు మద్దతుగా నిలిచింది. కరోనా సంక్షోభం జోరుగా ఉన్న సమయంలో మేం మీ దేశంలో పర్యటించాం. అప్పడు మా ఆటగాళ్లకు మీ అధికారులు ఇచ్చిన భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..'' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా కివీస్ పాక్ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్ ఆడాల్సింది. చదవండి: ENG TOUR OF PAK IN DOUBT: గంటల వ్యవధిలో పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ? -
పాకిస్తాన్లో భద్రత లేదంటూ... కివీస్ పర్యటన రద్దు!
రావల్పిండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ పెద్ద జట్టు మా దేశ పర్యటనకు వచి్చందన్న ఆనందం ఆవిరైంది. న్యూజిలాండ్ ఇంకాసేపట్లో తొలి వన్డే కోసం బరిలోకి దిగాల్సివుండగా... మ్యాచ్‌నే కాదు ఏకంగా సిరీస్‌నే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ ఉలిక్కిపడింది. ఒక్కసారిగా అయోమయంలో పడింది. ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది. అసలేం జరిగింది? శుక్రవారం మ్యాచ్ కోసం ఇరు జట్లు బస చేసిన హోటల్ నుంచి స్టేడియానికి చేరాల్సివుంది. ఆటగాళ్లేమో గదుల నుంచి బయటికి రావడం లేదు. వారి కోసం బస్సులు ఎదురుచూస్తున్నాయి. న్యూజిలాండ్ వర్గాల నుంచి ఒక ప్రకటన మాత్రం బయటికి వచి్చంది. ‘ఈ పర్యటన ఇక ఏమాత్రం ముందుకు సాగదు. మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆడటం సాధ్యపడదు. ఈ నిర్ణయం పీసీబీకి మింగుడుపడదని మాకు తెలుసు. ఘనమైన ఆతిథ్య ఏర్పాట్లు ఎన్నో చేశారు. అయితే మా ఆటగాళ్ల భద్రత దృష్ట్యానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ డేవిడ్ వైట్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో పీసీబీ వర్గాలకు ఊపిరి ఆగినంత పనైంది. వెంటనే దిగ్గజ కెపె్టన్ అయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. కివీస్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఫోన్ చేశారు. ఆటగాళ్ల భద్రతకు హామీ ఇచ్చారు. కానీ ఆమె ఆటగాళ్లను పాక్‌లో ఉంచేందుకు ససేమిరా అని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత కివీస్ మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్ కోసం పాక్ పర్యటనకు ఈ నెల 11న ఇక్కడికి వచి్చంది. ఆతిథ్య, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వెలిబుచ్చింది. ఇంతలోనే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మూడు రోజుల క్రితమే పీసీబీ చీఫ్ పదవి చేపట్టిన రమీజ్ రాజా న్యూజిలాండ్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఐసీసీ పేషీలోనే తేల్చుకుంటామని ట్విట్టర్లో ప్రకటించారు. మేమూ సమీక్షిస్తాం: ఈసీబీ వచ్చే నెల పాక్ పర్యటనకు వెళ్లాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని చెప్పింది. ‘ఒకట్రెండు రోజుల్లో చర్చించుకొని టూర్ ప్రణాళికను వెల్లడిస్తాం’ అని ఈసీబీ తెలిపింది. వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇంగ్లండ్ రావలి్పండి వేదికగా రెండు టి20లు ఆడేందుకు వెళ్లాల్సివుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో ఆసీస్ కూడా పాక్‌లో పర్యటించాల్సివుంది. కానీ అనిశి్చత పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. -
ఎంతైనా కాబోయే అల్లుడు.. అందుకే ఒప్పుకున్నాడు
కరాచీ: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది జెర్సీ నెంబర్ 10 అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు దశాబ్దాలు పాటు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అఫ్రిది మంచి ఆల్‌రౌండర్‌గా.. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా.. పవర్ హిట్టర్‌గా పేరు పొందాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు అఫ్రిది గుడ్‌బై చెప్పాడు. తాజాగా అఫ్రిది ధరించిన జెర్సీ నెంబర్‌ను ఇకపై తాను ధరించనున్నట్లు పాక్ యువ ఆటగాడు షాహిన్ అఫ్రిది ట్విటర్ ద్వారా ప్రకటించాడు. పాక్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న షాహిన్ అఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లు కలిపి 77 మ్యాచ్‌లాడిన షాహిన్ మొత్తంగా 177 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా షాహిన్ తన ట్విటర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ''10వ నెంబర్ జెర్సీ' అనేది నాకు ఒక నెంబర్ కన్నా ఎక్కువ. ఆ జెర్సీ నెంబర్ నిజాయితీ, సమగ్రతో పాటు పాక్ క్రికెట్‌పై ప్రేమను కలిగేలా చేసింది. మామ షర్ట్‌తో ఇకపై మ్యాచ్‌లు ఆడనున్నాను.. అది దేశం తరపున'' అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: ‘పాకిస్తాన్‌తో తలపడే నా జట్టు ఇదే’.. అతడికి చోటివ్వని గౌతీ! కాగా షాహిన్ ట్వీట్‌పై షాహిద్ అఫ్రిది స్పందించాడు. '' నేను ఈ జెర్సీని ఎంతో గౌరవంగా చూసుకున్నా. 10వ నెంబర్ నా జీవితంలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ఆ జెర్సీ నీ చేతికి వచ్చింది. నా నమ్మకాన్ని నిలబెడతావని అనుకుంటున్నా. నీ కెరీర్ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ తెలిపాడు. అయితే అభిమానులు మాత్రం వినూత్న రీతిలో స్పందించారు. ''ఒకరి జెర్సీ నెంబర్ మరొకరికి ఇవ్వాలంటే కుదరకపోవచ్చు.. కానీ ఎంతైనా కాబోయే అల్లుడు కదా.. అందుకే ఒప్పుకున్నాడు'' అంటూ కామెంట్లు పెట్టారు. కాగా షాహిద్ అఫ్రిది కూతురు, షాహిన్ అఫ్రిదికి వివాహం జరగనుందని కొద్ది కాలం కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయని.. త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం. ఇక పాకిస్తాన్ జట్టు త్వరలోనే న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడనుంది. టి20 ప్రపంచకప్‌కు ముందు మూడు వన్డేలు.. మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టి20 ల సిరీస్ జరగనుంది. చదవండి: T20 World Cup 2021: షోయబ్ మాలిక్, సర్ఫరాజ్‌లకు నో చాన్స్; పాక్ టీ20 జట్టు ఇదే This is more than a shirt number. It represents honesty, integrity and immense love for Pakistan. I am humbled and honored that I will be now representing Pakistan in shirt # 10 of Lala @SAfridiOfficial . Nothing but Pakistan. #Legacy #TheEagle #PakistanZindabad pic.twitter.com/m8OrKr4wiZ — Shaheen Shah Afridi (@iShaheenAfridi) September 16, 2021 I wore this shirt with great honour and pride, I'm delighted that the #10 shirt will now be worn by Shaheen.who is a truly worthy successor! Shaheen I wish you the very best, continue to rise and wear 🇵🇰 colours with the greatest pride. https://t.co/A6CdfcG467 — Shahid Afridi (@SAfridiOfficial) September 16, 2021 -
‘భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్.. ఇప్పట్లో సాధ్యం కాదు’
లాహోర్: మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సోమవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవీకాలంలో ఉంటారు. ఎహ్సాన్ మని గత నెలలో పీసీబీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకున్నారు. బోర్డు బాధ్యతలు రమీజ్‌కు కొత్తకాదు. 1992 వన్డే వరల్డ్‌కప్ విజేత పాక్ జట్టు సభ్యుడైన ఆయన 2003–2004 వరకు పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 59 ఏళ్ల రమీజ్ ఎన్నికైన వెంటనే భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‌పైనే స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సిరీస్ సాధ్యం కాదని తెలిపారు. చదవండి: Sourav Ganguly: ఆఖరి టెస్టుగానే ఆడదాం.. మరో సిరీస్‌గా అనుమతించం -
ఆ సిరీస్‌లో రివ్యూ కోరే అవకాశం లేదు..
కరాచీ: ఆధునిక క్రికెట్లో డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) లేకుండా మ్యాచ్‌లు జరగడం దాదాపుగా అసాధ్యం. ఐసీసీ సభ్య దేశాలన్నీ తమ తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్వయంగా డీఆర్ఎస్(ఐసీసీ ఆమోదించిన డీఆర్ఎస్ సర్వీస్ ప్రొవైడర్లతోనే) సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ సదుపాయాన్ని కల్పించుకోలేకపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ బోర్డు ప్రతినిధులే వెల్లడించారు. సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లకు డీఆర్ఎస్ సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పీసీబీ ప్రతనిధి వివరణ ఇచ్చాడు. ఇదే అంశానికి సంబంధించి మరో అధికారి మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లకు సంబంధించి పీసీబీ మీడియా ప్రసార హక్కులను ఆలస్యంగా విక్రయించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. అయితే, వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో డీఆర్ఎస్ విధానం అమలు చేస్తామని వారు వెల్లడించారు. చదవండి: రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్ -
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా
ఇస్లామాబాద్: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. హెడ్ కోచ్ మిస్సా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. పాక్ ప్రపంచకప్ జట్టును ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేయడం పాక్ క్రికెట్లో పెను దుమారం రేపుతోంది. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలు కోవిడ్ ప్రోటోకాల్స్‌ను, ఆరోగ్య సమస్యలను బూచిగా చూపించి తప్పుకోవడం విశేషం. త్వరలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌లకు వీరి స్థానాల్లో తాత్కాలిక కోచ్‌లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్‌లను నియమించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 1 గంట సమయంలో 15 మంది సభ్యుల పాక్ బృందాన్ని పీసీబీ ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలు రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కలేదు. కాగా, ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ల సమరం అక్టోబర్ 24న జరగనున్న సంగతి తెలిసిందే. పాక్ టీ20 ప్రపంచకప్ జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..? -
షోయబ్ మాలిక్, సర్ఫరాజ్‌లకు నో చాన్స్; పాక్ టీ20 జట్టు ఇదే
Pakistan T20 World Cup Squad 2021.. అక్టోబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సోమవారం ప్రకటించింది. బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్‌రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. కాగా ఫఖర్ జమన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించారు. ఊహించనట్టుగానే యువ ఆటగాడు అజమ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ఆసిఫ్ అలీ, కుష్దిల్ షాలాంటి కొత్త మొహాలు జట్టులో ఉన్నారు. ఇక పాక్ సీనియర్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, మరో సీనియర్ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్‌లకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక ఆల్‌రౌండర్ షార్జీల్ ఖాన్‌కు కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కలేదు. చదవండి: CPL 2021: వార్నీ.. కోపాన్నంత హెల్మెట్‌పై చూపించాడు ఇక టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్, భారత్ ఒకే గ్రూఫ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గ్రూఫ్ 2లో భాగంగా భారత్,పాకిస్తాన్,న్యూజిలాండ్,అఫ్గానిస్తాన్,బి1 క్వాలిఫయర్, ఏ2 క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. కాగా పాకిస్తాన్ టీమిండియాతో అక్టోబర్ 24న తొలి మ్యాచ్ ఆడనుంది. 15 మందితో పాక్ టీ20 ప్రాబబుల్స్: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్ చదవండి: 'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది' Asif and Khushdil return for ICC Men's T20 World Cup 2021 More details ➡️ https://t.co/vStLml8yKw#PAKvNZ | #PAKvENG | #T20WorldCup pic.twitter.com/9samGbJgDJ — PCB Media (@TheRealPCBMedia) September 6, 2021 -
పీసీబీ అధ్యక్ష పదవి రేసులో రమీజ్ రజా!
కరాచీ: మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఎహ్సాన్ మనిని కొనసాగించరాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ స్థానంలో తన మాజీ సహచరుడు ఉండాలని ఇమ్రాన్ కోరుకుంటుండటంతో రమీజ్ అవకాశాలు మెరుగయ్యాడు. ఈ ఓపెనర్ పాక్ జట్టు తరఫున 1984 నుంచి 1997 మధ్య కాలంలో 57 టెస్టుల్లో 2833 పరుగులు.. 198 వన్డేల్లో 5851 పరుగులు చేశాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో రమీజ్ సభ్యుడిగా ఉన్నాడు. -
ఇమ్రాన్ ఖాన్ యార్కర్లు.. పాక్ క్రికెట్ క్లీన్‌బౌల్డ్!
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహార శైలి.. గురివింద గింజకు ఏమాత్రం తీసిపోదు. ఈ భూమ్మీద ఏ టాపిక్ మీద మాట్లాడినా.. అటు ఇటు తిరిగి చివరికి భారత్ మీద విమర్శలకు దిగుతుంటాడు. ఈమధ్య లాక్డౌన్-భారత ఆర్థిక వ్యవస్థపై కామెంట్లు చేసిన ఇమ్రాన్ ఖాన్.. కరోనా కట్టడిలో విఫలం కావడంపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నాడు.పైగా ప్రధాని అయ్యాక బయటి నుంచి బిలియన్ డాలర్ల రుణాల్ని తెచ్చి.. పాక్‌ను అప్పుల ఊబిలోకి ముంచేత్తాడనే విమర్శ ఉండనే ఉంది. ఇదిలా ఉంటే ఒకప్పుడు స్టార్ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్.. పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తున్నాడనేది తాజా విమర్శ. పీసీబీని పటిష్టపర్చడం మాట పక్కనపెడితే.. కనీస అవసరాల కోసం నిధుల కేటాయింపు జరపట్లేదని ప్రధాని ఇమ్రాన్‌ను తిట్టిపోస్తున్నారు. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పాక్ మాజీ క్రికెటర్ ఇంజుమామ్ ఉల్ హక్ పరోక్షంగా పాక్ ప్రభుత్వాన్ని విమర్శించాడు కూడా. ఇక 2009 శ్రీలంక టూర్ సందర్భంగా జరిగిన ఉగ్రవాద దాడి ఘటన తర్వాత అప్పటి పాక్ ప్రభుత్వం.. పూర్తిగా క్రికెట్‌ను విస్మరించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, ఇమ్రాన్ అధికారంలోకి వచ్చాక క్రికెట్ బాగుపడుతుందనుకుంటే.. పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ తరుణంలో కరోనా దెబ్బతో.. పాక్ క్రికెట్ మరింత ఆగం అవుతోంది. ఆటగాళ్లకు సరైన ప్రోత్సహాకాలు అందకపోగా.. వర్థమాన క్రికెటర్ల కోసం ప్రకటించిన 40 కోట్ల రూపీలను జారీ చేయలేదు. ఇక ప్రస్తుతం దేశంలో లాహోర్, కరాచీలో మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిస్తున్నారు. ముల్తాన్, ఫైసలాబాద్ స్టేడియాలను డొమెస్టిక్ మ్యాచ్‌ల కోసం ఉపయోగిస్తున్నారు. ఇక చాలావరకు స్టేడియంలు మూసుకుపోయాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖానేవాల్ క్రికెట్ స్టేడియం ఫొటోలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. కోట్లు ఖర్చు పెట్టిన ఈ స్టేడియాన్ని రైతులు స్వాధీనం చేసుకున్నారు. మిరప, గుమ్మడి మొక్కల్ని సాగు చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు క్రికెట్ ద్వారా పాక్‌లో హీరోగా వెలుగొందిన ఇమ్రాన్ ఖాన్.. ఆ ఆటనే విస్మరిస్తూ క్రీడాభిమానుల దృష్టిలో ప్రధాని హోదాలో విలన్ అవుతున్నాడు. Where are authorities???? Look how they are destroying 🏏 stadium, how they are playing with future of 🇵🇰, this is KHANEWAL’s Cricket Stadium’ Sad story.... کاش کسی کو پاکستان کے مستقبل کی فکر ہو تو یہ مرچیں کھلاڑیوں کے زخموں پر نہ لگیں pic.twitter.com/r3A8K2UfWt — Shoaib Jatt (@Shoaib_Jatt) August 16, 2021 క్లిక్ చేయండి: వారెవ్వా.. క్రికెటర్ కాకున్నా స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు -
బీసీసీఐ బెట్టు.. ఆ టోర్నీపై నీలి నీడలు?
కశ్మీర్ ప్రీమియర్ లీగ్ టోర్నీ నిర్వహణపై నెమ్మదిగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కేపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. భారత్-పాక్ ‘కశ్మీర్’ వివాదాల నడుమ తలదూర్చడం తనకు ఇష్టం లేదని పనేసర్ ఓ ట్వీట్ కూడా చేశాడు. దీంతో పనేసర్ దారిలో మరికొందరు ఆటగాళ్లు పయనించే అవకాశం ఉందని, టోర్నీ జరగడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఓ భారత మీడియా హౌజ్‌తో మాట్లాడిన పనేసర్.. బీసీసీఐ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. రాజకీయాలు-ఆటలు ఒక్కటి కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు. ‘ఆడడం ఆడకపోవడం ఆటగాళ్ల ఇష్టం. నాకు ఈసీబీ(ఇంగ్లండ్ బోర్డు) నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి. అయితే ఆడితే తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటారో ఆ ఆటగాళ్లకు తెలుసు’ అంటూ పనేసర్ వ్యాఖ్యలు చేశాడు. I have decided not to participate in the KPL because of the political tensions between India and Pakistan over kashmir issues. I don't want to be in the middle of this , it would make me feel uncomfortable. #KPL2021 #Kashmir #india #Cricket #Pakistan #ENGvIND #TheHundred — Monty Panesar (@MontyPanesar) August 1, 2021 ఇక దాయాది దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్న టైంలో.. పీవోకేలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ లీగ్‌ను నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు గుర్తింపు ఇవ్వొద్దని, జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఐసీసీకు నిన్న ఒక లేఖ రాసింది కూడా. దీంతో పాక్ ప్లేయర్లు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో బీసీసీఐపై మండిపడ్డారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ ఆగదని స్పష్టం చేసింది. మరోవైపు పీవోకే లీగ్‌లో ఆడబోయే ఆటగాళ్లపై బీసీసీఐ బెదిరింపులకు పాల్పడుతోందనే, ఈ మేరకు భవిష్యత్తులో జరగబోయే టోర్నీల్లో నిషేధం విధిస్తామని ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షల్ గిబ్స్ బీసీసీఐని తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించాడు. కేపీఎల్ ఆడితే.. ఇక తనను ఏ టోర్నీలకు తీసుకోమని బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించింది. కాగా ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్ టోర్నీలో ఓవర్సీస్ వారియర్స్, ముజఫర్బాద్ టైగర్స్, రావల్కోట్ హాక్స్, బాగ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లీ లయన్స్ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాహిద్ అఫ్రిది, షాబాద్ ఖాన్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక ఈ టోర్నీ నిర్వహణకు మరో నాలుగు రోజుల టైం ఉండగా.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులోనే ఉంది. -
ఆసీస్ మ్యాచ్ ముఖ్యమా.. పాక్‌ను డీగ్రేడ్ చేయడమే ఇది!
Pakistan Tour Of West Indies 2021: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ మండిపడ్డాడు. వెస్టిండీస్ బోర్డు ప్రతిపాదనలకు అంగీకరించి, మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను నాలుగు మ్యాచ్‌లకు కుదించడం పాకిస్తాన్ క్రికెట్ జట్టును తక్కువ చేసి చూపడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా పాకిస్తాన్ జట్టు టీ20 సిరీస్ నిమిత్తం వెస్టిండీస్‌లో పర్యటించాల్సి ఉంది. మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను రద్దు చేసి... బుధవారం నుంచి రీషెడ్యూల్ చేశారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన వెస్టిండీస్- ఆస్ట్రేలియా(విండీస్ టూర్) వన్డే మ్యాచ్‌ను నిర్వహించడానికే విండీస్ బోర్డు ఈ మేరకు పీసీబీ వద్ద ప్రతిపాదనలు చేసింది. ఇందుకు పాక్ బోర్డు అంగీకరించడంతో పాకిస్తాన్‌తో ఆడాల్సిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4 మ్యాచ్‌లకు పరిమితం చేసింది. ఈ విషయంపై స్పందించిన ఇంజమామ్.. ‘‘అసలు పీసీబీ ఇలాంటి ఒక ప్రపోజల్‌కు ఎందుకు అంగీకరించిందో అర్థం కావడం లేదు. కరోనా కేసు వెలుగు చూసిన కారణంగా విండీస్- ఆసీస్ మ్యాచ్ రీషెడ్యూల్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే... దీనితో పాక్ టీ20 సిరీస్‌కు ఏం సంబంధం? నిజానికి టీ20 సిరీస్‌కు, ఆగష్టు 12న ప్రారంభం కావాలిస్న టెస్టు సిరీస్‌కు మధ్య మధ్య తొమ్మిది రోజుల వ్యవధి ఉంది. కావాలంటే ఈ గ్యాప్‌లో మరో మ్యాచ్ నిర్వహించవచ్చు. కానీ, ఆస్ట్రేలియా కోసం విండీస్ పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని భావించింది. ఇది నిజంగా పాక్ జట్టును డీగ్రేడ్ చేయడమే. పీసీబీ ఎందుకు సానుకూలంగా స్పందించిందో నాకింకా షాకింగ్‌గానే ఉంది. ఈసారి ఈ జట్టుతో లేదంటే ఆ జట్టుతో అని పదేపదే జట్లు మార్చడానికి.. ఇవేమీ క్లబ్ మ్యాచ్‌లు కాదు కదా. అంతర్జాతీయ మ్యాచ్‌లు’’ అని తన యూట్యూబ్ చానెల్ వేదికగా పీసీబీ, విండీస్ బోర్డు తీరును విమర్శించాడు. కాగా టాస్ వేసిన తర్వాత వెస్టిండీస్ జట్టు సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడినట్లు తెలియడంతో విండీస్- ఆసీస్ మధ్య జరగాల్సిన రెండో వన్డేను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. A battle to end the #WIvAUS tour on a high note.🏆 pic.twitter.com/V5kWV28wwy — Windies Cricket (@windiescricket) July 26, 2021 Hosein finds the 1st wicket! #WIvAUS #MenInMaroon pic.twitter.com/WG1nsnopqv — Windies Cricket (@windiescricket) July 26, 2021 -
చెప్పకుండానే నిర్ణయాలు.. రాజీనామా చేసిన యూనిస్‌ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ముసలం మొదలైనట్లు కనబడుతోంది. జట్టు ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ జట్టు ప్రధాన బ్యాటింగ్ కోచ్ పదవికి దిగ్గజ ఆటగాడు యూనిస్ ఖాన్ రాజీనామా చేశాడు. అయితే, కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించేందుకు ఆయన అయిష్టత వ్యక్తం చేశాడు. పాక్ జట్టు త్వరలో ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో పర్యటించనున్న నేపథ్యంలో యూనిస్ ఖాన్ కోచ్ పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాక్ జట్టు ఇంగ్లండ్, విండీస్ టూర్లకు వెళ్లనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు యూనిస్ లాంటి దిగ్గజ ఆటగాడి సేవలను కోల్పోవడం పాక్‌కు పెద్ద లోటేనని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్ ఖాన్ వెల్లడించారు. కాగా, యూనిస్ ఖాన్ పాక్ తరఫున 118 టెస్ట్‌లు, 265 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి 41 సెంచరీలు, 81 అర్ధసెంచరీల సాయంతో దాదాపు 18000 పరుగులను సాధించాడు. యూనిస్ ఖాన్ ఖాతాలో ఓ ట్రిపుల్ హండ్రెడ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే, పాక్ జట్టు.. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. జూలై 20 వరకు సాగే ఈ పర్యటనలో పాక్, ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం పాక్ అక్కడి నంచే నేరుగా వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరుతుంది. జూలై 21 నుంచి ఆగస్టు 24 వరకు సాగే ఈ పర్యటనలో పాక్ 5 టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: WTC ఫైనల్: విరాట్ కోహ్లి డ్యాన్స్ అదిరిందిగా! -
పీఎస్ఎల్ నుంచి అఫ్రిది ఔట్.. కారణం అదే
కరాచీ: కరోనా కారణంగా వాయిదా పడిన పాకిస్తాన్ సూపర్ లీగ్ వచ్చే నెలలో అబుదాబి వేదికగా జరగనుంది. కాగా లీగ్‌లో జరగనున్న మిగిలన మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా అఫ్రిది లీగ్ నుంచి తప్పుకున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే నెలలో అబుదాబిలో పీఎస్ఎల్ తిరిగి ప్రారంభంకానుంది. గత మార్చిలో 20 మ్యాచ్‌లు జరిగిన తర్వాత వాయిదా పడింది. ఆరు ఫ్రాంచైజీలలోని చాలా మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారినపడటంతో లీగ్‌ను అర్ధంతరంగా వాయిదా వేశారు. అఫ్రిది ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తీవ్రమైన నడుము నొప్పి కారణంగా డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు షాహిద్ తెలిపాడు. ఇక దిగ్గజ ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందిన షాహిద్ అఫ్రిది పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ముందు కరాచీ కింగ్స్, పెషావర్ జల్మీకి ప్రాతినిధ్యం వహించాడు. 50 మ్యాచ్‌ల్లో 44 వికెట్లతో పాటు 465 పరుగులు సాధించాడు. అంతర్జాతీయంగా చూసుకుంటే పాక్ తరపున అఫ్రిది 27 టెస్టుల్లో 1716 పరుగులు.. 48వికెట్లు , 398 వన్డేల్లో 8064 పరుగులు.. 395 వికెట్లు , 99 టీ20ల్లో 1416 పరుగులు.. 98 వికెట్లు తీశాడు. చదవండి: ఆ క్రికెటర్‌తోనే నా కూతురు పెళ్లి: పాక్ మాజీ క్రికెటర్ 'నేను జోక్ చేశా.. అక్తర్ సీరియస్ అయ్యాడు' While training for the remainder of @thePSLt20, I felt lower back pain & had to consult a doctor. Unfortunately I have been advised to rest and can no longer accompany my team @MultanSultans. I am heartbroken 💔 as I was practicing and training really hard. pic.twitter.com/OjaHD1w9cg — Shahid Afridi (@SAfridiOfficial) May 24, 2021 -
పీసీబీని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పాక్ క్రికెట్ బోర్డు పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించాడు.అంతర్జాతీయ క్రికెట్‌కి గత ఏడాది గుడ్‌బై చెప్పిన అతను ఐపీఎల్లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా అమీర్ వ్యవహారంపై కనేరియా స్పందిస్తూ.. '' ప్రతి ఒక్కరూ వాళ్ల అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇక్కడ మహ్మద్ అమీర్‌ని నేనేమీ తప్పుబట్టడం లేదు. కానీ.. అతను తన స్టేట్మెంట్స్ ద్వారా ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ని తీసుకుని ఐపీఎల్లో ఆడతానని చెప్తున్నాడు. దీనిబట్టి అతని ఆలోచన తీరుని అర్థం చేసుకోవచ్చు'' అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్‌లు ఆడాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ ఫిక్సింగ్‌కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు గడిపాడు. నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకి మించి రాణించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. గత ఏడాది పీసీబీ తనని మెంటల్ టార్చర్‌కి గురిచేస్తోందని వాపోయిన అమీర్.. ఎవరూ ఊహించని రీతిలో 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. కాగా పాక్ తరపున అమీర్ 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: ‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’ టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
మరోసారి చిక్కుల్లో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్
కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అతడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని గతంలో హమీజా ముఖ్తార్ అనే మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆజంతో పాటు పలువురు వ్యక్తులు తనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు ఆ మహిళ మరో కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపిన లాహోర్‌లోని సెషన్స్ కోర్టు.. బాబర్ అజమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)కి చెందిన సైబర్ క్రైమ్ సర్కిల్‌ను ఆదేశించింది. తనకు బెదిరింపులు వస్తున్నట్లు హమ్జా ఫిర్యాదు చేసిన తర్వాత తాము ఫిర్యాదు చేశామని, ఆ ఫోన్ నంబర్లలో ఒకటి బాబర్ ఆజంపై పేరుపై ఉన్నదని ఎఫ్ఐఏ కోర్టుకు తెలిపింది. మరో రెండు నంబర్లు ఇద్దరు మహిళలకు చెందినవిగా గుర్తించారు. దీనిపై బాబర్ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ఎఫ్ఐఏ కొంతకాలం ఆగాలని అతని తరఫున హాజరైన సోదరుడు ఫైజల్ ఆజం కోరాడని, అయితే ఇప్పటి వరకూ బాబర్ మాత్రం రాలేని తన రిపోర్ట్‌లో ఎఫ్ఐఏ వెల్లడించింది. దీంతో బాబర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. గతంలో హమీజా ముఖ్తార్ ఫిర్యాదుపై బాబర్‌పై కేసు నమోదు చేయాలన్న సెషన్స్ కోర్టు ఆదేశాలను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. అయితే తాజాగా బెదిరింపుల అంశంలో మరోసారి బాబర్‌పై కేసు నమోదు చేయాలని సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా బాబర్ అజమ్ పాక్ తరపున 31 టెస్టుల్లో 2167 పరుగులు, 77 వన్డేల్లో 3580 పరుగులు, 47 టీ20ల్లో 1730 పరుగులు సాధించాడు. ప్రస్తుతం బాబర్ అజమ్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: 'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు' 'రూ. 45 లక్షలిస్తే కేసు ఉపసంహరించుకుంటా' -
పీఎస్ఎల్లో కరోనా కలకలం
కరాచీ: పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్)లో మరోసారి కరోనా కలకలం రేపింది. పీఎస్ఎల్లో పాల్గొంటున్న ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ అని తేలినా.. పీఎస్ఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని పీసీబీ తెలిపింది. ఇదే విషయమై పీసీబీ డైరెక్టర్ ఆఫ్ మీడియా సామి బుర్నీ స్పందించాడు. 'లీగ్‌లో పాల్గొంటున్న ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వచ్చిన వార్తలు నిజమే. మొత్తం అన్ని ఫ్రాంచైజీల్లో మొత్తం 242 పీసీఆర్ టెస్టులు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒకరు ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి చెందినవాడు కాగా.. మరో ఇద్దరు మిగతా ఫ్రాంచైజీల్లో ఉన్నారు. ఇంకా ఒక టీమ్‌కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కాగా పరిస్థితి అదుపులోనే ఉందని.. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే బయో సెక్యూర్ బబూల్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికే కొత్త నిబంధనలకు సంబంధించి వివరాలను ఆయా ఫ్రాంచైజీలకు పంపించాం' అని తెలిపాడు. కాగా ఇస్లామాబాద్ యునైటెడ్ ఆటగాడు ఫాహిద్ అహ్మద్ సోమవారం కరోనా బారీన పడడంతో క్వెటా గ్లాడియేటర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. చదవండి: 'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్ సూపర్' టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్న ఆసీస్ కోచ్ 'అందుకే ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నా' -
పాక్ అభిమానులకు వీసాలు కావాలట..
న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం వీసాల మంజూరు విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన ప్రతిపాదనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వీసాల మంజూరు విషయంలో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ప్రతిపాదించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. క్రీడాకారుల వీసాలకు సంబంధించి ఎటువంటి అంక్షలూ ఉండవని భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. పాక్ అభిమానులకు, జర్నలిస్టులకు సైతం వీసాలు మంజూరు చేయాలని పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి కోరటాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. వీసాల మంజూరు విషయంపై మార్చి నెలాఖరులోగా తమ నిర్ణయం చెప్పాలని షరతులు విధించడం పాక్ కండకావరంగా పేర్కొంది. తమ డిమాండ్లను తీర్చని పక్షంలో వేదికను యూఏఈకి మార్చాలని ఐసీసీకి లేఖ రాస్తామని బెదిరించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పీసీబీ చేసిన ప్రతిపాదనలు అపరిపక్వతతో కూడినవిగా కొట్టిపారేసింది. టోర్నీ నుంచి నిష్క్రమించే ఉద్ధేశంతోనే పీసీబీ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో పీసీబీ ఇలాంటి ప్రతిపాదనలు తెరపైకి తేవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇరు జట్ల మధ్య చివరి సారిగా 2007లో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. 2012లో పాక్ జట్టు మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. ఆ తరువాత దాయాదుల పోరు ఐసీసీ టోర్నీలకు ఆసియా కప్‌కు మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పీసీబీ తాజా ప్రతిపాదనలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత జటిలంగా మార్చేశాయి. కాగా, ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనున్న విషయం తెలిసిందే. -
పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు ఊరట
కరాచీ: పాకిస్తాన్ సీనియర్ ఆటగాడు ఉమర్ అక్మల్‌కు ఊరట లభించింది. పీసీబీ అతనిపై విధించిన బ్యాన్‌ను కోర్ట్ ఆప్ ఆర్బిర్టేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్) 12 నెలలకు తగ్గించడంతో పాటు రూ. 42 లక్షల జరిమానా విధించింది. అయితే పీసీబీ యాంటీ కరప్షన్ కోడ్ నిర్వహించే రీహాబిటేషన్ సెషన్లో పాల్గొన్న తర్వాతే ఉమర్ అక్మల్‌ను క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇస్తామని పీసీబీ తెలిపింది. తాజాగా విధించిన 12 నెలల నిషేధం ఉమర్ అక్మల్ ఇప్పటికే పూర్తి చేసి ఉండడంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. కాగా ఉమర్ అక్మల్ 2019 అక్టోబర్‌లో పాక్ తరపున చివరి వన్డే ఆడాడు. ఇప్పటివరకు పాక్ తరపున అక్మల్ 121 వన్డేల్లో 3194 పరుగులు, 84 టీ20ల్లో 1690 పరుగులు సాధించాడు. అక్మల్ ప్రస్తుతం 30ఏళ్ల వయసులో ఉన్న అక్మల్ తిరిగి జట్టులో స్థానం సంపాదిస్తే మరో 5నుంచి 6ఏళ్ల పాటు ఆడే అవకాశం ఉంది. 2019లో పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా బుకీల గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు తెలపకపోవడంతో పాటు, పీసీబీ అవినీతి నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ అక్మల్‌పై ఏప్రిల్‌లో మూడేళ్ల సస్పెన్షన్ విధించారు. తన తప్పును అంగీకరించిన అక్మల్ తనను క్షమించాలంటూ జూలై 2020లో సీఏఎస్కు అప్పీల్ చేయగా.. అప్పట్లో కోర్టు 18 నెలలకు కుదించింది. తాజాగా అక్మల్ అభ్యర్థనను మరోసారి పరిగణలోకి తీసుకొన్న సీఏఎస్ నిషేధాన్ని 12 నెలలకు తగ్గించడంతో పాటు జరిమానా విధించింది. చదవండి: పాస్‌పోర్టు గల్లంతు: కీలక టోర్నికి కెప్టెన్ దూరం? స్వదేశం.. విదేశం.. రెండింట్లో కోహ్లినే టాప్ -
'డబ్బు కోసమే బాబర్‌ను బ్లాక్మెయిల్ చేస్తుంది'
కరాచీ : నాలుగు వారాల క్రితం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ తనను లైంగికంగా వేధించాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ హమీజా ముక్తర్ అనే మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె బాబర్ అజమ్‌పై సంచలను ఆరోపణలు చేసింది. ఇదే విషయమై ఆమె బాబర్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బాబర్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటే రూ.45 లక్షలు భరణంగా ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగింది. ఇదే విషయమై బాబర్ తనకు భరణం చెల్లించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హమీజా పిటిషన్‌పై గురువారం సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. బాబర్ తరపు లాయర్ మాట్లాడుతూ.. హమీజ్.. బాబర్‌పై అనవసర ఆరోపణలు చేస్తుంది.. కేవలం డబ్బు కోసమే ఈ నాటకమాడుతుందని, ఒక్కపైసా కూడా చెల్లించేది లేదని కోర్టుకు తెలిపారు. బాబర్ అజమ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడంపై తమవద్ద ఆధారాలు ఉన్నాయని హమీజా తరపు లాయర్ కోర్టుకు స్పష్టం చేశాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు అన్ని అంశాలు పరిశీలిస్తామని తెలిపి కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది. ('బాబర్ అజమ్ నన్ను నమ్మించి మోసం చేశాడు') కాగా హమీజా గతంలో చేసిన వ్యాఖ్యలు పాక్ మీడియాలో సంచలనంగా మారాయి. 'బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని పేర్కొంది. బాబర్ అజబ్ ఇటీవలే పాకిస్తాన్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పాక్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే వేలి గాయంతో బాబర్ అజబ్ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా డిసెంబర్ 26 నుంచి పాక్, న్యూజిలాండ్‌ల మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. అయితే బాబర్ గాయం తీవ్రత అలాగే ఉండడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ పాక్ జట్టకు నాయకత్వం వహించనున్నాడు. కాగా మూడు టీ20ల సిరీస్‌ను కివీస్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసకుంది. -
పీసీబీ వేధింపులే కారణమన్న పేసర్
కరాచీ: పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు 29 ఏళ్ల బౌలర్ ఓ వీడియో మెసేజ్‌లో వెల్లడించాడు. ‘ఇప్పుడున్న పీసీబీ మేనేజ్మెంట్ వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఆడలేను. నేను తప్పు (స్పాట్ ఫిక్సింగ్) చేశాను. దానికి శిక్ష కూడా అనుభవించాను. అయినా సరే బోర్డు నన్ను గత అనుభవాలతోనే చిన్నచూపు చూస్తోంది. నిషేధం అనంతరం తిరిగి క్రికెట్ ఆడేందుకు మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది, మాజీ పీసీబీ చీఫ్ నజమ్ సేథీ నాకు వెన్నుదన్నుగా నిలిచారు. వాళ్ల అండదండలతోనే నేను మళ్లీ ఆడగలిగాను’ అని ఆ వీడియోలో వివరించాడు. అతని వీడియో సందేశం వైరల్ కావడంతో పీసీబీ స్పందించింది. ఆమిర్ నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని, అలాగే అతని ఆరోపణలపై తక్షణం స్పందించడం తగదని ఒక ప్రకటనలో తెలిపింది. ‘స్పాట్’ చిచ్చు నాణ్యమైన పేసర్‌గా కెరీర్ తొలినాళ్లలోనే కితాబు అందుకున్న ఈ క్రికెటర్ ప్రతిభాపాఠవాలను ‘స్పాట్ ఫిక్సింగ్’ మసకబార్చింది. 2010లో ఇంగ్లండ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడటంతో ఐదేళ్ల నిషేధానికి (2010–2015)కు గురయ్యాడు. అంతర్జాతీయ కెరీర్లో 36 టెస్టులాడి 119 వికెట్లు తీశాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లను పడగొట్టాడు. 2009లో టి20 ప్రపంచకప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టు సభ్యుడు. నిషేధం తర్వాత 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ ఆమిర్ కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై పాక్ గెలిచింది. -
మెంటల్ టార్చర్.. అందుకే ఇలా: క్రికెటర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. జట్టు యాజమాన్యం తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. ‘‘ఇకపై ఇంటర్నేనషనల్ క్రికెట్ ఆడటం నాకు ఇష్టం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు నేను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నాను. కానీ మేనేజ్మెంట్ నన్ను మానసిక వేధింపులకు గురిచేసింది. అది అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని 28 ఏళ్ల ఆమిర్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. (చదవండి: ‘కోహ్లికి కాదు.. మా బ్యాట్స్‌మన్‌కే కష్టం’) ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆమిర్ రిటైర్మెంట్ను ధ్రువీకరించింది. ఈ మేరకు... ‘‘ఈరోజు మధ్యాహ్నం పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ ఆమిర్‌తో మాట్లాడారు. తనకు ఇకపై ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఉద్దేశం లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఇకపై సెలక్షన్ సమయంలో తనను పరిగణనలోకి తీసుకోం. రిటైర్మెంట్ అనేది ఆమిర్ పూర్తి వ్యక్తిగత నిర్ణయం. దానిని మేం గౌరవిస్తాం’’ అని పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ తరఫున 147 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆమిర్.. మొత్తంగా 259 వికెట్లు తీశాడు. 2009 టీ20 వరల్డ్ కప్, 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఆది నుంచి వివాదాస్పదమే 2010లో వెలుగులోకి వచ్చిన మహ్మద్ ఆమిర్ లెఫ్టార్మ్ పేసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి బౌలింగ్ శైలికి ఫిదా అయిన పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రం.. తాను చూసిన అత్యంత ప్రతిభావంతమైన ఫాస్ట్‌బౌలర్ అతడేనంటూ కొనియాడాడు. అలా ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఐదేళ్లపాటు సాఫీగా సాగిపోయిన ఆమిర్ ప్రయాణానికి స్పాట్ ఫిక్సింగ్ కేసు బ్రేక్ వేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ సల్మాన్‌బట్, మహ్మద్ ఆసిఫ్‌తో కలిసి ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడి నిషేధం ఎదుర్కొన్నాడు. అనేక పరిణామాల అనంతరం 2016లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో తిరిగి అడుగుపెట్టిన ఆమిర్.. చాంపియన్స్ ట్రోఫీ(2017)లో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా గతేడాది వన్డే ప్రపంచకప్‌లో మొత్తంగా 17 వికెట్లు తీసి పాక్ జట్టు బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఇక సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం.. లీగ్ క్రికెట్ ద్వారా డబ్బు సంపాదించేందుకే ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ పాక్ జట్టు బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అతడిని విమర్శించాడు. అయితే తన శరీరం, ఆరోగ్య పరిస్థితి గురించి తనకు మాత్రమే తెలుసునని, తన నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో జట్టు యాజమన్యంతో అతడికి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో అతడికి చోటు లభించలేదు. అదే విధంగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఆమిర్‌ను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో తాను ఆట నుంచి వైదొలుగుతున్నట్లు అతడు ప్రకటించడం గమనార్హం. -
'పాక్ కెప్టెన్ నన్ను నమ్మించి మోసం చేశాడు'
కరాచీ : పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక మహిళ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బాబర్ తనను మోసం చేయడమేగాక లైంగికంగా కూడా వేధించాడని తెలిపింది.శనివారం మీడియా సమావేశంలో సదరు మహిళ బాబర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి : రానున్న రోజుల్లో స్మిత్‌తో టీమిండియాకు కష్టమే) 'బాబర్, నేను స్కూల్ దశ నుంచి మంచి స్నేహితులం. అతను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నాను. బాబర్‌కు ఆర్థికంగా కూడా సాయం చేశాను. కాగా 2010లో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి బాబర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను దానికి అంగీకరించాను. ఆ తర్వాతి ఏడాదే తాము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. శారీరకంగా కూడా దగ్గరయ్యాం. కానీ 2012లో అండర్-19 వరల్డ్ కప్‌లో పాక్ టీమ్‌కు బాబర్ నేతృత్వం వహించాడు. దీంతో అతనికి చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే బాబర్ తన మనసు మార్చుకున్నాడు. అప్పటినుంచి నన్ను కావాలనే దూరం పెడుతున్నాడు. ఇదే విషయమై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చంపుతానని నాపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాక నన్ను కొట్టి.. శారీరకంగా హింసకు గురిచేశాడు. ఇందుకు సంబంధించి అప్పట్లో బాబర్‌పై పీసీబీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు' అని మహిళ పేర్కొంది. So this lady has made accusations against Babar Azam "he promised to marry me, he got me pregnant, he beat me up, he threatened me and he used me" Video courtesy 24NewsHD pic.twitter.com/PTkvdM4WW2 — Saj Sadiq (@Saj_PakPassion) November 28, 2020 అయితే మహిళ చేసిన ఆరోపణలపై బాబార్ అజమ్ స్పందించలేదు.మహిళ చెప్పినదాంట్లో నిజమెంత అనేది పక్కనబడితే.. బాబర్‌పై చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పేరు సంపాదించడానికి ఇలాంటి పనికిరాని ఆరోపణలు చేస్తుందని బాబర్ అభిమానులు మండిపడుతున్నారు. మహిళ చేసిన ఆరోపణలపై పాక్ క్రికెట్ బోర్టు ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. (చదవండి : తప్పు నాదే.. క్షమించండి : గిల్‌క్రిస్ట్) కాగా కొద్ది రోజుల క్రితమే బాబర్ అన్ని ఫార్మట్లలో పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం పాక్ జట్టుతో కలిసి బాబర్ న్యూజిలాండ్‌లో ఉన్నాడు. వచ్చే నెలలో కివీస్‌తో జరిగే టీ20, టెస్టు సిరీస్ కోసం పాక్ జట్టు అక్కడికి చేరుకుంది. కరోనా నేపథ్యంలో వారు ప్రస్తుతం 14 రోజుల ఐసోలేషన్‌లో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న కివీస్, పాక్‌ల మధ్య మ్యాచ్‌లు ప్రారంభం కానుంది. అయితే తాజాగా పాక్ టీమ్‌లో ఏడుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో మిగతా ఆటగాళ్లు హోటల్ రూమ్స్‌కే పరిమితం అయ్యారు. -
పరువు పోతుంది; పాక్ క్రికెటర్లకు వార్నింగ్
ఇస్లామాబాద్/వెల్లింగ్టన్: ‘‘బాయ్స్.. నేను న్యూజిలాండ్ ప్రభుత్వంతో మాట్లాడాను. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాము కఠిన వైఖరిని అవలంబిస్తామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే మీరు మూడుసార్లు నిబంధనలు ఉల్లంఘించారు. మనకు మరొక్క అవకాశం మాత్రమే ఉంది. ఇంకోసారి రూల్స్ అతిక్రమిస్తే వారు మనల్ని ఇంటికి పంపించేస్తారు. ఇది మనదేశ ప్రతిష్టతో ముడిపడిన అంశం. ఈ విషయంలో న్యూజిలాండ్ ప్రభుత్వం ఇప్పటికే మనకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది కష్టకాలమని తెలుసు. కానీ కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా దేశం నుంచి పంపిచేస్తారు. క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకుంటారు. ఇది పాకిస్తాన్ పరువుకు సంబంధించిన అంశం. అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నా. ఇదే ఆఖరి వార్నింగ్’’ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీంఖాన్ తమ జట్టు ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేశాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని, ఈ విషయంలో కివీస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడానికి కూడా అవకాశం లేదని స్పష్టం చేశాడు. కాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా పాక్ క్రికెట్ జట్టు ఈనెల 24న అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: టీమిండియాతో తొలి వన్డే: ఓపెనర్ వార్నర్ ఔట్) ఈ క్రమంలో వారికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు న్యూజిలాండ్ క్రికెట్(ఎన్‌జెడ్‌సీ) గురువారం వెల్లడించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఐసోలేషన్‌లో భాగంగా పాక్ జట్టు ఆటగాళ్లలో కొంతమంది నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం. దీంతో అసహనానికి లోనైన ప్రభుత్వం.. తమ టూరిస్టులకు రూల్స్ గురించి సవివరంగా తెలియజేస్తామని, వారు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఉన్నట్లు మరో ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించి పీసీబీ సీఈఓ వసీంఖాన్..‘‘ క్వారంటైన్లో ఉండటం కాస్త కష్టంతో కూడుకున్న పనే. మేం అర్థం చేసుకోగలం. అయితే ఇది పాక్ గౌరవానికి సంబంధించిన విషయం. 14 రోజులు ఓపిక పడితే, ఆ తర్వాత రెస్టారెంట్లకు వెళ్లడం సహా స్వేచ్ఛగా విహరించే అవకాశం దక్కుతుంది. ఇంకొక్కసారి రూల్స్ బ్రేక్ చేస్తే మనల్ని ఇంటికి పంపేస్తామని స్పష్టం చేశారు. దయచేసి అర్థం చేసుకోండి’’ అని పాక్ క్రికెటర్లకు విజ్ఞప్తి చేశాడు. కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ సిరీస్ డిసెంబర్ 10 నుంచి మొదలు కానుంది. డిసెంబర్ 18న తొలి టీ20, 26 నుంచి జనవరి 7 వరకూ రెండు టెస్టుల సిరీస్ జరుగుతుంది. -
‘చీఫ్ సెలెక్టర్’ పదవికి మిస్బా గుడ్‌బై
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ బుధవారం ప్రకటించాడు. నవంబర్ 30 వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగుతానని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కూడా సమాచారమిచ్చానని వెల్లడించాడు. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా పూర్తిగా సేవలందించేందుకే సెలెక్టర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపాడు. ‘రానున్న జింబాబ్వే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడంతో సెలెక్టర్‌గా నా పని ముగుస్తుంది. ఆ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతలపై పూర్తిగా దృష్టి సారిస్తా. నా నిర్ణయంలో బోర్డు ప్రమేయం లేదు. ఒకేసారి రెండు అత్యున్నత పదవుల్లో కొనసాగడం అనుకున్నంత సులువుకాదని తెలిసింది. అందుకే కోచ్‌గా ఉండేందుకు నిర్ణయించుకున్నా’ అని మిస్బా వివరించాడు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ జట్టు సెలెక్టర్‌గా, హెడ్ కోచ్‌గా మిస్బా నియమితుడయ్యాడు. -
ఐసీసీలోనూ భారత్–పాక్ గొడవ
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌ను ఎంపిక చేసే విషయంపై సోమవారం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీనికి ప్రధాన కారణం భారత్, పాకిస్తాన్ బోర్డుల మధ్య సయోధ్య లేకపోవడమేనని తెలిసింది. ఓటు హక్కు ఉన్న సభ్య దేశాల్లో మూడింట రెండొంతల మెజార్టీ ప్రకారం చైర్మన్‌ను ఎన్నుకోవాలని పాకిస్తాన్, దానికి మద్దతిస్తున్న దేశాలు చెబుతుండగా... ఎన్నికలు నిర్వహించాలని, సాధారణ మెజార్టీ ప్రకారమే ఎంపిక జరగాలని భారత్ వాదిస్తోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్‌కు మద్దతునిస్తున్నాయి. ప్రస్తుతం ఐసీసీలో 17 సభ్య దేశాలకు ఓట్లు ఉన్నాయి. పాక్ చెబుతున్నదాని ప్రకారం కనీసం 12 దేశాలు కొత్త చైర్మన్ కోసం మద్దతివ్వాల్సి ఉంటుంది. అదే ఎన్నిక జరిగితే గెలుపు కోసం 9 ఓట్లు చాలు. దురదృష్టవశాత్తూ ఏ పద్ధతి అనుసరించాలనేదానిపై ఐసీసీలోనే స్పష్టత లేకపోవడమే సమస్యగా మారింది. ‘ప్రస్తుతం ఇది భారత్, పాక్ మధ్య పోరుగా మారింది. దీనిపై ఏదో ఒక తీర్మానం చేసి త్వరలోనే పరిష్కారం కనుగొనాల్సి ఉంది’ అని ఐసీసీ ప్రతినిధి ఒకరు అభిప్రాయ పడ్డారు. ఈ అంశంపై మున్ముందు ఐసీసీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం. -
పీసీబీపై కనేరియా మరోసారి ఆగ్రహం
కరాచీ : పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు విధించిన మూడేళ్ల నిషేదాన్ని 3 సంవత్సరాల నుంచి 18 నెలలకు తగ్గించడం పట్ల పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. అక్మల్ విషయంలో కనికరించిన పీసీబీ నా విషయంలో మాత్రం ఏం పట్టింపులేనట్లు వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ' జీరో-టాలరెన్స్ విధానం నాపై మాత్రమే వర్తిస్తుందని, పాకిస్తాన్‌లోని ఇతర ఆటగాళ్లకు మాత్రం వర్తించదు. కేవలం మతం కారణంగా నేను వివక్షకు గురయ్యా. మ్యాచ్ ఫిక్సింగ్ విధానాన్ని నివేదించడంలో విఫలమైనందుకు ఉమర్ అక్మల్‌కు క్రికెట్ నుంచి మూడేళ్ల నిషేధం 18 నెలలకు తగ్గించబడింది.. అంటే అతను వచ్చే ఏడాది ఆగస్టులో తిరిగి ఆటలోకి తిరిగి వస్తాడు. నాకు జీవిత నిషేధం విధించడానికి గల కారణాన్ని ఎవరైనా సమాధానం చెప్పగలరా.నా రంగు, మతం, బ్యాక్ గ్రౌండ్ కారణంగా నాకు ఈ విధానాలు వరిస్తాయి. అయితే నేను హిందువును అందుకు నేను గర్వంగా ఉన్నాను' అని డానిష్ కనేరియా తెలిపాడు.('ఆ మ్యచ్ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా') 2012లో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడుతుండగా.. డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నేరాన్ని అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుట్లో పెద్ద దుమారమే రేపింది. -
పీసీబీకి నిరాశ
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై కరోనా తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. తప్పనిసరి పరిస్థితుల్లో పీసీబీ తక్కువ ధరకే లోగో హక్కుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. స్వల్ప మొత్తానికే ట్రాన్స్ మీడియా కంపెనీ ఏడాదిపాటు పాక్ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. పీసీబీకి పాక్ కరెన్సీలో 20 కోట్లు ట్రాన్స్‌మీడియా ఇవ్వనుంది. పెప్సీతో పీసీబీ కుదుర్చుకున్న మూడేళ్ల ఒప్పందం ఇటీవల ముగిసింది. మూడేళ్ల కాలానికి పీసీబీకి పెప్సీ రూ. 91 కోట్లు చెల్లించింది. -
పీసీబీకి షాక్.. ఆసియాకప్ వాయిదా
ఢిల్లీ : ఆసియాకప్ నిర్వహిద్దామనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) గట్టి షాక్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహణ సాధ్యం కాదంటూ జూన్ 2021కి వాయిదా వేస్తున్నట్లు గురువారం నిర్వహించిన సమావేశం అనంతరం ఏసీసీ ప్రకటించింది. 2021లో నిర్వహించనున్న ఆసియాకప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. కాగా ఏసీసీ సమావేశానికి ఒకరోజు ముందే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒక మీడియా చానెల్‌తో మాట్లాడుతూ కరోనా దృష్యా ఆసియా కప్ రద్దు కానుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. గంగూలీ చేసిన వాఖ్యలను నిజం చేస్తూ ఆసియా కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. (చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ) కాగా అంతకముందు గంగూలీ వ్యాఖ్యలను ఖండిస్తూ పీసీబీ మీడియా డైరెక్టర్ శామ్యూల్ హసన్ ఘాటుగా స్పందించారు. గంగూలీ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అని తెలిపారు. అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఆసియా కప్‌ను పాక్ నిర్వహించాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్ వాయిదా నేపథ్యంలో పీసీబీ సెప్టెంబర్‌లో టోర్నీని నిర్వహించాలనుకుంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే శ్రీలంకలో ఆసియా కప్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, శ్రీలంకలో సాధ్యం కాకపోతే యూఏఈలో టోర్నీని నిర్వహిస్తామని గతంలో పీసీబీ ఛైర్మన్ వసీం ఖాన్ స్పష్టం చేశారు. అయితే జూన్ 2021లో నిర్వహించనున్న ఆసియాకప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఏసీసీ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా ఏసీసీ తాజా ప్రకటనతో పీసీబీకి పెద్దదెబ్బే తగిలిందని చెప్పొచ్చు. తాజాగా టోర్నీని వాయిదా వేయాలని ఏసీసీ నిర్ణయం తీసుకోవడంతో ఐపీఎల్ నిర్వహణకు మార్గం మరింత సుగమమయింది. (ఆసియాకప్ 2020 వాయిదా : గంగూలీ) -
యూనిస్ సరదాగా చేశాడు
కరాచీ: యూనిస్‌ఖాన్ తన పీకపై కత్తి పెట్టాడంటూ పాకిస్తాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరాకరించింది. అయితే ఫ్లవర్ ఆరోపించినట్లుగా యూనిస్‌ఖాన్ కోపంతో అతని గొంతుపై కత్తి పెట్టలేదని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘గ్రాంట్ ప్రచారం చేస్తున్నట్లుగా అతన్ని గాయపరచడం యూనిస్‌ఖాన్ ఉద్దేశం కాదు. అందులో నిజం లేదు. యూనిస్ అల్పాహారం తీసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. అతను బ్రేక్‌ఫాస్ట్ చేస్తోన్న సమయంలో గ్రాంట్ ఏదో చెప్పబోతుండగా... యూనిస్ సరదాగా బటర్ తీసుకునే కత్తితో అతన్ని ఆపాడు. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌పై ఆట గురించిన సలహాలు ఎందుకు? నన్ను ముందు ప్రశాంతంగా తిననివ్వండంటూ గ్రాంట్‌తో యూనిస్ అన్నాడు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గ్రాంట్ ఆరోపణలపై స్పందించేందుకు యూనిస్‌ఖాన్ సుముఖంగా లేడని అన్నారు. -
ఆ ఆరుగురికి నెగెటివ్
లాహోర్: పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్‌తో సహా మొత్తం ఆరుగురు పాకిస్తాన్ క్రికెటర్లకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం ప్రకటించింది. దాంతో హఫీజ్, ఫఖర్ జమాన్, వహాబ్ రియాజ్, మొహమ్మద్ హస్నైన్, మొహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్లకు ఇంగ్లండ్ వెళ్లేందుకు పీసీబీ పచ్చ జెండా ఊపింది. త్వరలోనే వీరంతా ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన మిగతా పాక్ జట్టుతో కలుస్తారని పీసీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే స్పిన్నర్ కాశిఫ్ భట్టి, పేసర్లు హరీస్ రవూఫ్, ఇమ్రాన్ ఖాన్‌లతో పాటు బ్యాట్స్‌మన్ హైదర్ అలీకి మరోసారి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని స్వీయ నిర్బంధంలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు పీసీబీ పేర్కొంది. -
'అల్లా దయ.. నాకు కరోనా సోకలేదు'
లాహోర్ : పాక్ జట్టులో 10 మంది ఆటగాళ్లకు కరోనా సోకినట్లు పీసీబీ మంగళవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ పది మందిలో పాక్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ కూడా ఉన్నట్లు పాక్ క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ విషయంపై పీసీబీ ప్రకటించి ఒక్కరోజు గడవకుండానే హఫీజ్ స్పందించాడు. తనకు కరోనా సోకలేదంటూ హఫీజ్ ట్విటర్ ద్వారా తాను పర్సనల్‌గా చేయించుకున్న కరోనా పరీక్ష రిపోర్టును షేర్ చేసుకున్నాడు. 'రిపోర్ట్స్‌లో నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని పీసీబీ బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. అయితే ఈ విషయాన్ని మరోసారి దృవీకరించుకోవాలని కుటుంబసభ్యులతో కలిసి నేను మళ్లీ కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నా. కాగా రిపోర్ట్స్‌లో నాతో పాటు కుటుంబసభ్యులకు కూడా నెగెటివ్ వచ్చింది. అల్లానే మా కుటుంబాన్ని కాపాడాడు.. ఆయనే మా అందరిని సురక్షితంగా ఉంచుతాడు' అని క్యాప్షన్ జత చేశాడు. ('ఆసియా కప్ కచ్చితంగా జరుగుతుంది') After Tested positive COVID-19 acc to PCB testing Report yesterday,as 2nd opinion & for satisfaction I personally went to Test it again along with my family and here I along with my all family members are reported Negetive Alham du Lillah. May Allah keep us all safe 🤲🏼 pic.twitter.com/qy0QgUvte0 — Mohammad Hafeez (@MHafeez22) June 24, 2020 కాగా ఇంగ్లండ్ పర్యటన కోసమని ఎంపిక చేసిన 29 మంది క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో భాగంగానే సోమవారం ముగ్గురు పాక్ క్రికెటర్లు కరోనా బారిన పడగా, మిగతా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వారిలోషాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్లు ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగే 3 టెస్టులు, 3 టి20ల కోసం పాక్ జట్టు ఆడాల్సి ఉండగా.. ఇప్పుడు దాదాపు మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. అయినా సరే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ బయల్దేరుతుందని పీసీబీ ప్రకటించడం విశేషం. అయితే ప్రస్తుతం హఫీజ్‌కు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో ఇంగ్లండ్ పర్యటనరు వెళ్లే అవకాశం ఉంది. కాగా కరోనా పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లకు జూన్ 25న మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తేలింది. (నేనైతే ఆమెతో డేట్‌కు వెళతా: దాదా) 'పాజిటివ్‌గా తేలినవారిలో ఒక్క వికెట్ కీపర్ రిజ్వాన్ మాత్రమే టెస్టు స్పెషలిస్ట్. అతనికి మాత్రమే తుది జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా వారికి టి20ల కోసం కోలుకునేందుకు తగినంత సమయం ఉందని బోర్డు భావిస్తోంది. రిజ్వాన్ గైర్హాజరులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌కు అవకాశం దక్కవచ్చు. ముందు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు బిలాల్ ఆసిఫ్, ఇమ్రాన్ బట్, మూసా ఖాన్, మొహమ్మన్ నవాజ్‌లను ఎంపిక చేశాము. పీసీబీ వారిని కూడా కరోనా టెస్టుల కోసం పంపించింది.' అంటూ పీసీబీ సీఈవో వసీం ఖాన్ పేర్కొన్నాడు. -
'ఆసియా కప్ కచ్చితంగా జరుగుతుంది'
ఇస్లామాబాద్ : ఈ ఏడాది ఆసియా కప్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో శ్రీలంక లేదా యూఏఈలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో వసీం ఖాన్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో ఆ స్థానంలో తాము ఆసియాకప్‌ను నిర్వహించాలని అనుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాడు. ఇదే సమయంలో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ ప్రతిపాధన గురించి అడిగిన ప్రశ్నకు వసీం తన సమాధానం దాటవేశాడు.(భజ్జీ పోస్ట్: దాదా అదిరిపోయే రిప్లై) వసీం ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. ' ఈ ఏడాది ఆసియా కప్ కచ్చితంగా జరుగుతుంది. మా పాక్ జట్టు సెప్టెంబర్ 2న ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని స్వదేశానికి రానుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహించాలనుకుంటున్నాం. ఇందుకోసం కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న శ్రీలంకలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఒకవేళ శ్రీలంక బోర్డు అందుకు ఒప్పుకోకుంటే టోర్నీని యూఏఈలో నిర్వహించడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశాలు లేకుంటే ఆ సమయంలో పాక్ జట్టు ఇతర దేశాలతో సిరీస్‌లు ఆడే విధంగా ప్రణాళిక నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే సెస్టెంబర్, అక్టోబర్‌లో ఆసియా కప్, డిసెంబర్లో న్యూజిలాండ్‌తో హోం సిరీస్, తర్వత దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, టీ20లు ఆడేలా ప్రణాళిక రూపొందించాం. నవంబర్ నెలలో మాత్రం కరోనాతో అర్థంతరంగా ఆగిపోయిన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయనున్నాం.' అంటూ తెలిపారు. (డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్) కాగా వారం కిందట ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం తాము ఆసియాకప్‌ను వదులుకోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందే ప్రకటించిన ఆసియాకప్ షెడ్యూల్ కూడా సెప్టెంబర్‌లోనే ఉండడంతో పీసీబీ ఐపీఎల్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐపీఎల్ కోసం తమ టోర్నీని ఎలా వాయిదా వేసుకుంటామని ప్రశ్నించింది. 'షెడ్యూల్ ప్రకారం కాకుండా ఆసియాకప్ జరిగేలా చర్చలు సాగుతున్నాయని విన్నాను. కానీ అది సాధ్యం కాదు. కేవలం ఒక్క దేశం కోసం ఈ టోర్నీని ముందుకు జరపడం సరికాదు. అందుకే ఐపీఎల్ కోసం మేం వెనక్కితగ్గడమంటూ ఉండదు. అయినా ప్రేక్షకులు లేకుండా టీ20 ప్రపంచకప్ కూడా జరిగే అవకాశం ఉంది. లేకపోతే ప్రతీ జట్టు 15 నుంచి 20 మిలియన్ డాలర్లు నష్టపోతుంది' అని ఇంతకముందు ప్రకటనలో వసీం ఖాన్ స్పష్టం చేశాడు. -
పాక్ జట్టులో 10 మందికి కరోనా పాజిటివ్
లాహోర్ : ఎప్పుడు వివాదాలతో సతమతమయ్యే పాక్ క్రికెట్ జట్టుకు కరోనా సెగ తగిలింది. జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే జట్టులోని ముగ్గరు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సోమవారం పాక్ యువ ఆటగాడు హైదర్ అలీతో పాటు షాదాబ్ ఖాన్, హారిస్ రవూఫ్‌లు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, వహాబ్ రియాజ్‌లు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా సంక్షోభంతో భారీ విరామం తర్వాత మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటన కోసం బయలుదేరాల్సిన పాక్ క్రికెట్ జట్టుకు పెద్దదెబ్బే తగిలింది. ఈ సిరీస్ కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు.(టెన్నిస్ స్టార్ జొకోవిచ్‌కు కరోనా పాజిటివ్) కాగా పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌తో పాటు పాక్ జట్టు ప్రధాన కోచ్ వకార్ యూనిస్, ఫిజియోథెరపిస్ట్ క్లిఫ్ డెకాన్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. దీంతో పీసీబీలో ఆందోళన నెలకొంది. ఇంగ్లండ్ పర్యటన కోసమే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం నుంచి రావల్పిండిలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఒక్కొక్కరిగా 10 మందికి కరోనా సోకడంతో క్రికెటర్లంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వీరిని పీసీబీ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.('కోచ్ పదవి నాకు సవాల్‌గా కనిపిస్తుంది') -
పీసీబీ పర్మిషన్.. భారత్‌కు షోయబ్!
ఇస్లామాబాద్: కరోనా లాక్డౌన్ కారణంగా కుటుంబానికి దూరమైన షోయబ్ మాలిక్ విన్నపాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన్నించింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన భార్య, పిల్లలతో గడిపేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. మానవతా కోణంలోనే ఈ వెసులుబాటు కల్పించినట్టు పీసీబీ చైర్మన్ వసీం ఖాన్ పేర్కొన్నారు. కాగా, ఐదు నెలల క్రితం భారత్‌కు వచ్చిన సానియా మీర్జా లాక్డౌన్ విధించడంతో ఇక్కడే చిక్కుకుపోయారు. ఎప్పుడూ బిజీబిజీగా గడిపే తాము లాక్డౌన్ వేళలో కూడా ఒకే దగ్గర ఉండలేక పోయినందుకు ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (చదవండి: అప్పుడే నా మనసు ఆనందంగా ఉంటుంది: సానియా) బయో సెక్యూర్‌గా మ్యాచ్‌లు ఆగస్టు-సెప్టెంబర్‌లో ఇంగ్లండ్-పాక్ మధ్య మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌లతో సిరీస్‌లు జరుగనున్నాయి. ఇందుకోసం 28 మంది ఆటగాళ్లతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ జూన్ 28న ఇంగ్లండ్ బయల్దేరనుంది. కోవిడ్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లన్నీ బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పీసీబీ తెలిపింది. పాక్ ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న తర్వాత మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక జూలై 24న షోయబ్ జట్టుతో కలుస్తాడని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, 38 ఏళ్ల షోయబ్ టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. టీ20లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. (చదవండి: వీడియో షేర్ చేసిన హర్భజన్.. షాకిస్తున్న ఫ్యాన్స్!) -
కరోనా నుంచి కోలుకున్న పాక్ మాజీ క్రికెటర్ తౌఫిక్
కరాచీ: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్ ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. రెండు వారాల క్రితం వైరస్ బారిన పడిన తాను ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకున్నానని 38 ఏళ్ల తౌఫీక్ శుక్రవారం తెలిపాడు. కోవిడ్–19 మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని, రోగ నిరోధక శక్తికి పెంపొందించుకునే మార్గాలపై శ్రద్ధ వహించాలని అతను ప్రజలకు సూచించాడు. ‘ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం పాటించండి. పాజిటివ్‌గా తేలాక రెండు వారాల పాటు నేను ఒక గదికే పరిమితమయ్యా. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి దూరంగా ఉన్నా. ఒకవేళ ఎవరైనా కరోనా పాజిటివ్‌గా తేలితే కంగారు పడకుండా రోగనిరోధకత పెంచుకోవడంపై దృష్టి పెట్టండి’ అని ఉమర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జూనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడైన ఉమర్.. 44 టెస్టులు, 22 వన్డేల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
ప్రపంచకప్ వాయిదా.. పాక్‌కు కడుపు మంట
ఇస్లామాబాద్: అందరూ భావించినట్లే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ వాయిదా పడనుంది. గురువారం అన్ని దేశాల బోర్డు సభ్యులతో నిర్వహించనున్న టెలీ కాన్ఫరెన్స్ అనంతరం ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రపంచకప్ వాయిదా పడనుండటంతో అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించుకోవడానికి మార్గం సుగుమం అయినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ వాయిదా పడినదానికంటే ఐపీఎల్ జరిగే అవకాశం ఉండటాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జీర్ణించుకోలేకపోతుంది. (వాయిదా వైపే అడుగులు) ‘టీ20 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉంది. ఇది మే నెలనే ఇంకా కనీసం రెండు నెలలైన వేచిచూడాలి. రెండు నెలల తర్వాత కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటుగా ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే క్రికెట్ క్యాలెండర్ ప్రకారం పాక్, విండీస్ జట్లు ఇంగ్లండ్‌లో సిరీస్ ఆడే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ అనేది ఓ దేశీయ టోర్నీ. దానిని బీసీసీఐ నిర్వహిస్తోంది ఐసీసీ కాదు. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయిస్తామంటే మేం వ్యతిరేకిస్తాం. ఐసీసీ ఈవెంట్స్, ద్వైపాక్షిక సిరీస్‌లకు మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తాము. వాటి స్థానాల్లో దేశీయ టోర్నీలకు మేం మద్దతివ్వం’ అంటూ పీసీబీకి చెందిని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇక పీసీబీకి ప్రపంచకప్ వాయిదా పడుతుందనే బాధ లేదని ఐపీఎల్ నిర్వహిస్తారనే కడుపు మంట ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (ధోని రిటైర్మెంట్పై సాక్షి ట్వీట్.. డిలీట్) -
కాంట్రాక్టు లేదు... వాట్సాప్ గ్రూప్‌లో ఉండేది లేదు
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి కాంట్రాక్టు దక్కని క్రికెటర్లు ఆమిర్, హసన్ అలీ చీఫ్ సెలక్టర్ కమ్ కోచ్ మిస్బా ఉల్ హక్ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలిగారు. లాక్డౌన్ పరిస్థితుల్లో ఆటగాళ్లకు ఫిట్నెస్, శిక్షణ తదితర తాజా సమాచారాన్ని చేరవేసేందుకు, క్రికెటర్లతో టచ్‌లో ఉండేందుకు ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్ట్ దక్కలేదనే అసంతృప్తితోనే వాళ్లిద్దరు గ్రూప్ నుంచి నిష్క్రమించినట్లు సమాచారం. ఇటీవల పీసీబీ 18 మంది క్రికెటర్లకు కాంట్రాక్టు ఇచ్చింది. అయితే కాంట్రాక్టు జాబితాలో లేని ఆటగాళ్లను కూడా టీమ్ సెలక్షన్‌కు పరిగణిస్తామని చీఫ్ సెలక్టర్ మిస్బా వివరణ ఇచ్చాడు. -
నిషేధంపై ఉమర్ అక్మల్ అప్పీల్
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తనపై విధించిన మూడేళ్ల నిషేధాన్ని సవాలు చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ మంగళవారం అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేశాడు. దాంతో పీసీబీ ఈ అంశాన్ని విచారించడానికి స్వతంత్ర హోదా కలిగిన ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ సభ్యులు మరోసారి ఉమర్æ వాదనలను వింటారు. ఈ ఏడాది జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ సందర్భంగా తనను సంప్రదించిన బుకీల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో ఆగ్రహించిన పీసీబీ ఉమర్‌పై మూడేళ్ల నిషేధాన్ని విధించింది. పాక్ తరఫున గత ఏడాది అక్టోబర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ఉమర్ అక్మల్... ఇప్పటి వరకు 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20ల్లో తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. -
నా ముందు.. నా తర్వాత ఎందరో ఫిక్సర్లు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్ ఆసిఫ్ తమ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పు చేసిన వారందరికీ రెండో అవకాశమిచ్చే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిం చిందని అన్నాడు. తన కన్నా ముందు ఎందరో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, తన తర్వాత కూడా మరెందరో ఈ మార్గంలో నడిచారని అన్నాడు. అయితే పీసీబీ మాత్రం తనకే కఠిన శిక్ష విధించిందని చెప్పాడు. 2010లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆసిఫ్‌పై పీసీబీ ఏడేళ్ల నిషేధాన్ని విధించింది. ‘అందరూ తప్పులు చేస్తారు. కానీ పీసీబీ నాపై వివక్ష చూపింది. నేను ఏ స్థాయి బౌలర్‌ని అని చూడకుండా శిక్షించింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. కానీ ఒకప్పడు నా బౌలింగ్‌తో ప్రపంచాన్ని వణికించా. ఇన్నేళ్లు గడిచాక కూడా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ నా బౌలింగ్ గురించి మాట్లాడటం గర్వంగా ఉంటుంది. పీటర్సన్, డివిలియర్స్, ఆమ్లా నా గురించి గొప్పగా చెప్పడం ఆనందాన్ని కలిగించింది’ అని 37 ఏళ్ల ఆసిఫ్ పేర్కొన్నాడు. -
తమ్ముడూ... సచిన్, ధోని, కోహ్లిలను చూసి నేర్చుకో
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలను చూసి తన తమ్ముడు ఉమర్ అక్మల్ బుద్ధి తెచ్చుకోవాలని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. వారిని చూసైనా మైదానంలోనూ, బయట ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలంటూ ఉమర్ అక్మల్‌కు సూచించాడు. ఉమర్‌పై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల పాటు నిషేధం విధించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సందర్భంగా బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని రహస్యంగా ఉంచినందుకుగానూ పీసీబీ ఈ శిక్ష విధించింది. నిషేధ కాలంలో ఏ స్థాయి క్రికెట్ ఆడకూడదంటూ హెచ్చరించింది. ఈ సందర్భంగా కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ ‘ఉమర్ ఇంకా యువకుడు. అతను తప్పు చేసి ఉంటే ఇతరులను చూసి నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో విరాట్, సచిన్, ధోని జీవితాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వివాదాలకు దూరంగా సచిన్ నీతిగా క్రికెట్ ఆడాడు. విరాట్, ధోని, బాబర్ ఆజమ్‌ల నుంచి ఉమర్ ఇంకా చాలా నేర్చుకోవాలి’ అని కమ్రాన్ అన్నాడు. -
పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై నిషేధం
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల నిషేధం విధించింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం అతనిపై రెండు నెలలుగా విచారించింది. చివరకు సోమవారం శిక్ష ఖరారు చేసింది. అయితే ఉమర్‌పై నిషేధం విధించడానికి గల స్పష్టమైన కారణాలను పీసీబీ వెల్లడించలేదు. కానీ బోర్డు నియమావళిలోని ఆర్టికల్ 2.4.4ను అతిక్రమించినట్లు దర్యాప్తులో తేలడంతో వేటు వేశామని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఫిబ్రవరిలో ఉమర్ అక్మల్ రెండు అనుచిత, అసందర్భ ఘటనలకు బాధ్యుడయినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే మూడేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పాక్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో అతని సందేహాస్పద ప్రవర్తనే నిషేధానికి కారణం కావొచ్చని తెలిసింది. 29 ఏళ్ల ఉమర్ అక్మల్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కమ్రాన్ అక్మల్‌కు సొంత తమ్ముడు. ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు కూడా వరుసకు సోదరుడవుతాడు. ఉమర్ అంతర్జాతీయ కెరీర్లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టి20లు ఆడాడు. -
అక్తర్ కెరీర్ దాల్మియా చలవే!
కరాచీ: భారత దివంగత క్రికెట్ పాలకుడు జగ్మోహన్ దాల్మియా ఇచ్చిన సహకారంతోనే పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ కెరీర్ కొనసాగిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ అధ్యక్షుడు తౌకీర్ జియా వ్యాఖ్యానించారు. దాల్మియా 1997 నుంచి 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో అక్తర్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని విమర్శలు రావడంతో ఐసీసీ కన్నేసింది. ‘ఐసీసీ సభ్యులంతా అక్తర్ బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినా... దాల్మియా మాకు మద్దతుగా నిలిచారు. ఐసీసీలో అయనకున్న పలుకుబడి దృష్ట్యా మిగతా సభ్యుల అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. జన్మతః వచ్చిన సమస్య వల్లే అలాంటి యాక్షన్‌తో అక్తర్ బౌలింగ్ చేస్తున్నట్లు నమ్మబలకడంతో ఆ వివాదం అంతటితో ముగిసింది’ అని జియా తెలిపారు. రూ. 690 కోట్ల నష్టం... గత ఐదేళ్ల కాలంలో భారత్‌తో సిరీస్ ఆడకపోవ డంతో పీసీబీ కు వచ్చిన అక్షరాలా రూ.690 కోట్ల నష్టం వచ్చింది. భారత్‌తో ఆడితేనే పూర్తి మొత్తం ఇస్తామని లేదంటే కోత తప్పదని ప్రసారకర్తలతో జరిగిన ఒప్పందంలో స్పష్టంగా వుంది. -
‘ఇదేం పద్ధతి.. నాకైతే అర్థం కావట్లేదు’
ఇస్లామాబాద్: కోచింగ్‌లో కనీసం క్లబ్ లెవల్లో కూడా అనుభవం లేని మిస్బావుల్ హక్‌ను పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా కొనసాగించడం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చర్యలను తప్పుపడుతూ ఎగతాళిగా మాట్లాడాడు. ఆటలో నైపుణ్యం, కెప్టెన్సీలో నిజాయితీ, కోచ్‌గా అనుభవం లేనటువంటి మిస్బావుల్‌ను పాక్ హెడ్ కోచ్‌గా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ప్రామాణికంగా అతడిని కోచ్‌గా కొనసాగిస్తున్నారో చెప్పాలని పీసీబీని యూసఫ్ ప్రశ్నించారు. ‘కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస అనుభవం ఉండాలనే షరతును పీసీబీ పెట్టింది. కానీ కనీసం క్లబ్ లెవల్లో కూడా కోచింగ్ అనుభవం లేని మిస్బావుల్‌ను ఎంపిక చేసింది. కోచ్ ఎంపిక విషయంలో పీసీబీ అవలంభించిన ద్వంద్వ వైఖరేంటో అర్థం కావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆటగాళ్లు, సారథి నిజాయితీగా, నిస్వార్థంగా ఉండాలని మిస్బా పేర్కొన్నాడు. కానీ అతడు సారథిగా ఉన్నప్పుడు అజహర్ అలీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పగలడా? అజహర్ అలీ మంచి బ్యాట్స్‌మన్. అయితే అతడు క్రీజులో సెటిల్ అవ్వడానికి కాస్త సమయం తీసుకుంటాడు. మిస్బా కూడా అంతే. అతడి ఆటలో ఎలాంటి ప్రత్యేక నైపుణ్యం లేదు. ఒకే రీతిలో రక్షణాత్మకంగా ఆడతాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగేవరకు వేచి చూసి ఆ తర్వాత పరుగులు రాబట్టేవాడు’అని యూసఫ్ వ్యాఖ్యానించాడు. మిస్బావుల్ పాక్ తరుపున 90 టెస్టులు, 288 వన్డేలు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా మంచి రికార్డు ఉండటంతో పాటు వివాదరహితుడుగా పేరుగాంచిన మిస్బాను పాక్ జట్టు ప్రధానకోచ్, చీఫ్ సెలక్టర్‌గా పీసీబీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసోలేషన్ క్రికెట్ కప్.. ఐసీసీ ట్వీట్ ఇలాంటి దిగ్గజం.. తరానికి ఒక్కరు -
కరోనా.. పాక్ క్రికెట్ టీమ్ విరాళం
కరాచీ : కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించడానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఆ దేశ ప్రభుత్వానికి రూ. 5 మిలియన్లు విరాళంగా ఇచ్చింది. జాతీయ అత్యవసర నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి ప్రకటించారు. కరోనాపై పోరాటానికి సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లు రూ. 5 మిలియన్లు విరాళం ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే బోర్డులోని కిందిస్థాయి నుంచి సీనియర్ మేనేజర్ వరకు ఉన్న ఉద్యోగులు అంతా తమ ఒక్క రోజు జీతాన్ని జాతీయ అత్యవసర నిధికి అందజేయనున్నట్టు మణి వెల్లడించారు. జనరల్ మేనేజర్ ఆపై స్థాయి అధికారులు రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు చెప్పారు. పీసీబీ ఎప్పుడూ కష్ట సమయాల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరోనా వైరస్ క్రికెట్‌కు అంతరాయం కలిగించవచ్చు కానీ, దేశం మొత్తం ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం అవసరమైన అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాకిస్తాన్లో కూడా విజృంభిస్తోంది. పాక్‌లో ఇప్పటివరకు 1,000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చదవండి : చెప్పినా వినలేదు.. గాంధీ ఆస్పతికి తరలింపు ‘చైనీస్’ వైరస్ వార్తలపై ఘాటుగా స్పందించిన రోంగ్ -
టెస్టుల సంగతి తర్వాత చూద్దాం!
ఢాకా: పూర్తి స్థాయి పర్యటన కోసం రావాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యర్థనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సున్నితంగా తిరస్కరించింది. ముందు మూడు టి20లు ఆడేందుకు అంగీకరించిన బంగ్లా... టెస్టులు ఆడే విషయమై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ముందు అయితే పొట్టి మ్యాచ్‌లు ఆడిన తర్వాతే టెస్టుల సంగతి చూద్దామని చెప్పింది. ‘పాకిస్తాన్ తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. అయితే మేం మాత్రం మా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది సూచనల ప్రకారం నడుచుకుంటాం. మా జట్టు మేనేజ్మెంట్లో చాలా మంది విదేశీయులున్నారు. కాబట్టి ఇక్కడ వారి అభిప్రాయాలను పరిశీలించాల్సిందే’ అని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ నిజాముద్దీన్ చౌదరి చెప్పారు. మా ప్రాథమిక ప్రతిపాదన మేరకు ముందు టి20లు ఆడతాం. పరిస్థితుల్ని బట్టి టెస్టులపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇటీవల శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించి రెండు టెస్టుల సిరీస్‌లో ఆడింది. దీంతో పదేళ్ల తర్వాత పాక్‌గడ్డపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. -
పాకిస్తాన్‌కు ఝలక్ ఇచ్చిన బంగ్లా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు బంగ్లాదేశ్ చిన్న ఝలక్ ఇచ్చింది. జనవరిలో రెండు టెస్టులు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాక్‌లో పర్యాటించాల్సివుంది. దీనికోసం పీసీబీ అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే పాక్‌లో కేవలం టీ20లు మాత్రమే ఆడతామని, టెస్టులు తటస్థ వేదికపై ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తేల్చిచెప్పింది. పాక్‌లో ఎక్కువ రోజులు ఉండటానికి బంగ్లా క్రికెటర్లు విముఖత వ్యక్తం చేయడంతోనే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయంతో కంగుతిన్న పాక్ క్రికెట్ బోర్డు బీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో పాక్ కెప్టెన్ అజహర్ అలీ, హెడ్‌కోచ్ మిస్బావుల్ హక్‌లు కూడా బీసీబీ తీరును తప్పుపడుతున్నారు. ‘కేవలం టీ20లే ఆడతాం, టెస్టులు ఆడం అనడం అనైతికం. ప్రస్తుతం పాక్‌లో క్రికెట్ పునరజ్జీవం పోసుకోవాలంటే అది టెస్టులతోనే సాధ్యం. వీలైనన్ని ఎక్కువ టెస్టు సిరీస్‌లు నిర్వహించడంతో పాక్‌లో క్రికెట్ బతుకుతుంది. దీని కోసమే పీసీబీ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలో టెస్టులు ఆడమని, కేవలం టీ20లో అడతామనడం సరైనదికాదు. ఈ విషయంలో బీసీబీని ఉపేక్షించేదిలేదు. టెస్టులు ఆడకపోతే బంగ్లాపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు కోరినట్లు కేవలం టీ20లు మాత్రమే ఆడే అవకాశం ఇస్తే మిగతా దేశాలు కూడా అదే దారిలో వెళతాయి. దీంతో పాక్‌లో టెస్టు క్రికెట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే శ్రీలంక టెస్టు సిరీస్ దిగ్విజయంగా ముగిసింది. లంక దారిలోనే మరిన్ని జట్లు పాక్‌లో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నాం’అంటూ మిస్బావుల్, అజహర్లు పేర్కొన్నారు. ఇక బీసీబీ నిర్ణయంతో పాకిస్తాన్‌కు మింగుడుపడటంలేదు. ఈ విషయంపై పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి కూడా స్పందించారు. బీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పాక్‌లో బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందని, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించబోమని మరోసారి స్పష్టం చేశారు. భద్రతాపరమైన ఎలాంటి చిక్కులు లేవని శ్రీలంక సిరీస్‌తో ప్రపంచానికి తెలిసిపోయిందని.. ఈ క్రమంలో పాక్‌లో పర్యటిచడానికి వారి సమస్యేంటో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో నయం’
హైదరాబాద్: స్వదేశంలో దశాబ్దం తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు సిరీస్ విజయవంతం కావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ ఎహ్సాన్ మణి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. భద్రతా పరంగా భారత్ కంటే పాకిస్తాన్ ఎంతో సురక్షితమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాకిస్తాన్ సురక్షిత దేశమని నిరూపించాం. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి(పాక్) రండి మా భద్రతా ఎలా ఉందో చూపిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా పొరుగు దేశమైన భారత్ కంటే పాక్ ఎంతో సురక్షితమైన దేశం. మరి భారత్‌కు వెళ్లి క్రికెట్ ఆడటానికి లేని భయం పాక్ రావడానికి ఎందుకు? ఇక శ్రీలంక టెస్టు సిరీస్‌తో పాక్‌లో క్రికెట్ పునర్వైభవం సంతరించుకుంటదనే నమ్మకం ఉంది. శ్రీలంకను చూసి మిగతా దేశాలు కూడా పాక్ గడ్డపై క్రికెట్ ఆడటానికి రావాలి. ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరిస్ కోసం ఆ దేశ బోర్డుతో చర్చలు జరుపుతున్నాం. కేవలం బంగ్లాదేశ్‌తోనే కాదు అన్ని క్రికెట్ దేశాలు ఒక్కటి చెప్పదల్చుకున్నాం. ఇక నుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడబోం. ఎవరైనా మాతో సిరీస్ ఆడాలనుకుంటే పాక్ గడ్డపై అడుగుపెట్టాల్సిందే. ఇక శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ సక్సెస్ కావడానికి కృషి చేసిన అధికారులకు, క్రికెటర్లకు, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు’అంటూ ఎహ్సాన్ మణి పేర్కొన్నాడు. ఇక భారత్‌పై మణి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ సొంత డప్పు నువ్వు కొట్టుకోక పక్కనోడిపై పడి ఏడుస్తావెందుకు’అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాకుండా భారత్ అంతరంగిక విషయాల్లో పాక్ వేలు పెట్టాలని చూస్తే తాట తీస్తాం అని మరికొంత మంది ధ్వజమెత్తుతున్నారు. ఇక 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశ క్రికెట్ జట్టు కూడా పాక్ గడ్డపై అడుపెట్టని విషయం తెలిసిందే. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ శ్రీలంక జట్టుతోనే పాక్‌లో టెస్టు క్రికెట్ పునఃప్రారంభమైంది. కాగా ఈ సిరీస్‌ను పాక్ 1-0తో కైవసం చేసుకుంది. చదవండి: స్వదేశంలో గెలిచి...మురిసిన పాక్ ‘మేం ఎక్కడికీ రాం.. మీరే ఇక్కడికి రావాలి’