
కరాచీ: మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఎహ్‌సాన్ మనిని కొనసాగించరాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ స్థానంలో తన మాజీ సహచరుడు ఉండాలని ఇమ్రాన్ కోరుకుంటుండటంతో రమీజ్ అవకాశాలు మెరుగయ్యాడు.
ఈ ఓపెనర్ పాక్ జట్టు తరఫున 1984 నుంచి 1997 మధ్య కాలంలో 57 టెస్టుల్లో 2833 పరుగులు.. 198 వన్డేల్లో 5851 పరుగులు చేశాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో రమీజ్ సభ్యుడిగా ఉన్నాడు.