Ramiz Raja
-
‘బాబర్ స్థానంలో కెప్టెన్‌గా రమీజ్ రాజా.. ఇప్పటికీ ఫిట్‌గానే’
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో చెత్త ప్రదర్శనతో ఇంటా.. బయటా విమర్శలు మూటగట్టుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఓవైపు దాయాది టీమిండియా వరుస విజయాలతో సూపర్-8లో సగర్వంగా అడుగుపెట్టగా.. పాక్ మాత్రం లీగ్ దశలోనే నిష్క్రమించింది.పసికూనగా భావించే ఆతిథ్య అమెరికా జట్టు చేతిలో ఓటమితో ఈ ఐసీసీ ఈవెంట్‌ను ఆరంభించిన బాబర్ బృందం.. తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. అమెరికా కెనడా, పాక్‌లపై గెలిచి సూపర్-8 మార్గాలను సుగమం చేసుకోగా.. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అదృష్టం కూడా కలిసి వచ్చింది.ఈ క్రమంలో పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి అమెరికా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా ఫలితం లేకుండా పోయినా.. గెలుపుతో ఈ ఈవెంట్‌ను ముగించగలిగింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఆట తీరు, కెప్టెన్ బాబర్ ఆజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ స్థానాన్ని మాజీ క్రికెటర్ రమీజ్ రాజాతో భర్తీ చేయాలంటూ సరదాగా పీసీబీకి సూచించాడు.బాబర్ ఆజం బదులు రమీజ్ రాజా అయితే‘‘వాళ్లు(పాక్ జట్టు) ఎప్పుడు కష్టాల్లో ఉన్నా రమీజ్ రాజా కాపాడేవాడు. ఈసారి కూడా జట్టుకు సీఈఓవో అవుతాడేమో ఎవరికి తెలుసు?!..రమీజ్ రాజా ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. బాబర్ ఆజంకు బదులు రమీజ్ రాజాను కెప్టెన్‌గా నియమించాలి’’ అని మంజ్రేకర్ సరదాగా వ్యాఖ్యానించాడు.కాగా మాజీ బ్యాటర్, 61 ఏళ్ల రమీజ్ రాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్(2021-2022)గా పనిచేసిన విషయం తెలిసిందే. అతడి హయాంలో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు..2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరింది. అదే విధంగా 2022లో ఫైనల్ చేరి.. రన్నరప్‌గా నిలిచింది. చదవండి: అవును నిజమే.. నేను కూడా!: రోహిత్ శర్మతో గిల్.. పోస్ట్ వైరల్ -
‘జట్టును సర్వనాశనం చేశారు.. వాళ్లను విడదీశారు’
టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన రెండింటిలో బట్లర్ బృందం చేతిలో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.కాగా వన్డే ప్రపంచకప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరకుండానే పాకిస్తాన్ నిష్క్రమించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కెప్టెన్ బాబర్ ఆజం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు.ఫలితంగా అతడి స్థానంలో టీ20లకు పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్‌ను కెప్టెన్లుగా నియమించింది అప్పటి పాక్ క్రికెట్ బోర్డు. అయితే, వీరిద్దరి సారథ్యంలో పాక్ ఆస్ట్రేలియా(టెస్టు), న్యూజిలాండ్(టీ20) వైట్‌వాష్‌కు గురైంది.తిరిగి కెప్టెన్గామరోవైపు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వన్డే, టీ20లకు బాబర్ ఆజం తిరిగి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్-2024లోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు.అయితే, అంతకంటే మందు మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్ చేతిలో పాక్ ఇలా పరాభావానికి గురైంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా మేనేజ్మెంట్ తీరుపై మండిపడ్డాడు. ప్రయోగాలకు పోయి జట్టును సర్వనాశనం చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు.ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు‘‘ఇప్పటికైనా ప్రయోగాలు ఆపండి. సరైన కూర్పుతో జట్టును బరిలోకి దించండి. స్ట్రైక్‌రేటు అనే ఫోబియా నుంచి బయటపడండి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అంతగా దంచికొట్టే ఆటగాళ్లు లేరు.ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు. అత్యుత్తమ ఓపెనింగ్ జోడీ(బాబర్ ఆజం- మహ్మద్ రిజ్వాన్)ను విడదీశారు. మిడిలార్డర్లో ఎవరిని ఆడించాలో మీకే స్పష్టత లేదు.ఇద్దరు వికెట్ కీపర్లు ఎందుకు?ఆల్‌రౌండర్లందరినీ తెచ్చి మిడిలార్డర్లో కుక్కేశారు. ఇద్దరు వికెట్ కీపర్లు తుదిజట్టులో ఆడుతున్నారు. ఫాస్ట్ బౌలర్లను తరచూ మారుస్తున్నారు. మీ స్పిన్నర్లు బంతిని ఏమాత్రం స్పిన్ చేయడం లేదు.వాళ్లలో అసలు ఆత్మవిశ్వాసం కనబడటం లేదు. తుదిజట్టు నుంచి ఇమాద్ వసీం(స్పిన్నర్)ను ఎందుకు తప్పించారు?.. మిగతా వాళ్ల స్థానాల విషయంలోనూ క్లారిటీ లేదు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌కు ముందు జట్టును మొత్తం భ్రష్టుపట్టించారు’’ అని మాజీ బ్యాటర్ రమీజ్ రాజా పాక్ బోర్డు తీరును తూర్పారబట్టాడు.కాగా కివీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా సయీమ్ ఆయుబ్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసిన పీసీబీ.. బాబర్‌ను వన్‌డౌన్‌లో ఆడించింది. 21 ఏళ్ల ఆయుబ్ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. కాగా టీ20లలో పాక్ అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా బాబర్- రిజ్వాన్ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్-2022లో 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జూన్ 6న యూఎస్ఏతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి టీమిండియాను జూన్ 9న ఢీకొట్టనుంది.చదవండి: రోహిత్, విరాట్ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ -
ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్.. పాకిస్తాన్ గెలవడం కష్టమే! ఒక వేళ అది జరిగితే
వన్డే ప్రపంచకప్-2203లో వరుసగా రెండు ఓటములు చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు మరో ఆసియా జట్టుతో తలపడేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 23న చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో పాక్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వాలని బాబర్ సేన భావిస్తోంది. మరోవైపు ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కే షాకిచ్చిన ఆఫ్గాన్.. పాకిస్తాన్‌ను కూడా మట్టి కరిపించాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ కంటే ఆఫ్గానిస్తాన్ కాస్త ఫేవరెట్‌గా కన్పిస్తోంది అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. "పాకిస్తాన్ తిరిగి కోలుకోవడం చాలా కష్టం. చెన్నైలో ఆఫ్గానిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఎదైనా జరగవచ్చు. ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్లను మా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి. ఒక వేళ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే పాకిస్తాన్‌పై ఆఫ్గాన్ కచ్చితంగా పై చేయి సాధిస్తుంది. అదే వికెట్‌పై ఇంగ్లండ్‌పై ఆఫ్గాన్ ఏమి చేసిందే మనం చూశామని" తన యూట్యూబ్ ఛానల్లో రమీజ్ రజా పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ వన్డేల్లో పాకిస్తాన్‌పై ఆఫ్గానిస్తాన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. ఇరు జట్లు ముఖాముఖి 7 సార్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ పాకిస్తానే విజయం సాధించింది. అయితే చాలాసార్లు మాత్రం పాకిస్తాన్‌కు ఆఫ్గాన్ గట్టిపోటీ ఇచ్చింది. చదవండి: IND vs NZ WC 2023: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్! -
ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మా వాళ్లకు అఫ్గన్తోనూ కష్టమే: పాక్ మాజీ క్రికెటర్
‘‘ఒక్క క్యాచ్ జారవిడిచినందుకు మరీ ఇంత ఘోరంగా శిక్షించడం నేనిదే తొలిసారి చూస్తున్నా. చాలా మంది చాలా సార్లు క్యాచ్‌లు డ్రాప్ చేస్తారు. కానీ.. అలా ఫీల్డర్ తప్పిదం కారణంగా దొరికిన లైఫ్ ద్వారా 150- 160 పరుగులు స్కోరు చేయడమంటే మాటలు కాదు. పాకిస్తాన్‌కు ఇదొక మేలుకొలుపు లాంటిది. క్యాచ్‌లు మిస్ చేసినంత కాలం ఇలాంటి పనిష్మెంట్లు పునరావృతమవుతూనే ఉంటాయి. ఒక్కసారి లయ తప్పితే తిరిగి కోలుకోవడం కష్టం’’ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా బాబర్ ఆజం బృందానికి చురకలు అంటించాడు. నెలరోజుల క్రితం వరకు వరల్డ్‌క్లాస్ బౌలింగ్ దళం కలిగి ఉన్న జట్టుగా నీరజనాలు అందుకున్న టీమ్ ఏకంగా 365 పరుగులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకోకపోతే ఇంతకంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ చిత్తైన విషయం తెలిసిందే. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121)ల అద్భుత ప్రదర్శనతో ఆసీస్ భారీ స్కోరు చేసి గెలుపొందగా.. పాక్‌కు పరాభవం తప్పలేదు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే వార్నర్‌ను అవుట్ చేసే సువర్ణావకాశాన్ని పాక్ చేజార్చుకుంది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను ఉసామా మిర్ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత మరోసారి ఇదే తరహాలో లైఫ్ పొందిన వార్నర్ ఏకంగా 163 పరుగులు స్కోరు చేశాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక తప్పునకు వార్నర్ ఇంతలా పనిష్ చేస్తాడని ఇకనైనా లోపాలు సరిచేసుకోవాలని హితవు పలికాడు. ఇక తదుపరి మ్యాచ్‌లో పాక్ అఫ్గన్‌తో తలపడనున్న నేపథ్యంలో.. ‘‘చెన్నైలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ అంత ఈజీ కాదు. పాకిస్తాన్ బ్యాటర్లు స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కోలేరు. ఏం జరుగుతుందో చూడాలి’’ అని మాజీ బ్యాటర్ రమీజ్ రాజా నిట్టూర్చాడు. చదవండి: WC 2023: సన్‌రైజర్స్‌కు ఆడినపుడు చాలా నేర్చుకున్నా: వార్నర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
బాబర్ అంటే ప్రేమ.. అతడిని పెళ్లి చేసుకోవాలని కోరిక: రమీజ్ రాజా
Ramiz Raja bizarre comment on Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా బాబర్ ఆజంను ఉద్దేశించి వింత వ్యాఖ్యలు చేశాడు. బాబర్ బ్యాటింగ్ మెరుపుల నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ కాస్త అతిగా స్పందించాడు. కాగా లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో స్ట్రయికర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం. యూనివర్సల్ బాస్ తర్వాత గాలే టైటాన్స్‌తో సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా సుడిగాలి శతకం బాది రికార్డులకెక్కాడు. 59 బంతుల్లో 104 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో భాగంగా 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి.. టీ20 ఫార్మాట్లో మొత్తంగా 10 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అతడంటే ప్రేమ.. పెళ్లి చేసుకోవాలని ఉంది ఈ క్రమంలో బాబర్ ఆజం తుపాన్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూ.. ‘‘అద్బుతం.. క్లాస్.. క్వాలిటీ ఫిఫ్టీ. జట్టును ఆదుకునే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అతడంటే నాకు పిచ్చి ప్రేమ. అతడి పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో ఉండిపోయింది’’ అంటూ కామెంటేటర్ రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు బాబర్‌ను ఉద్దేశించి ఈ మాజీ బ్యాటర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు ‘గే’ అంటూ విపరీతపు కామెంట్లతో రమీజ్ రాజాను ట్రోల్ చేస్తున్నారు. అయితే, పాకిస్తాన్ అభిమానులు మాత్రం.. తన శిష్యుడిపై ప్రేమతో ఇలా స్పందించాడే తప్ప.. ఇందులోనూ విపరీతార్థాలు వెదకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంతోషంగా ఉంది ఇదిలా ఉంటే.. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడటం సంతోషంగా ఉందన్న బాబర్ ఆజం.. లీగ్ మ్యాచ్‌లతో పాటు రానున్న ప్రతి సిరీస్ రానున్న ఐసీసీ ఈవెంట్లకు తమకు సన్నాహకంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశాడు. అయితే, ప్రస్తుతం తన దృష్టి మొత్తం లంక ప్రీమియర్ లీగ్ మీదే ఉందని చెప్పుకొచ్చాడు. చదవండి: టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం.. 'I absolutely love him, want to marry him' - Former PCB chairman Ramiz Raja re Babar Azam ♥️#LPL2023 #LPLT20 pic.twitter.com/4uQwXVz4vR — Farid Khan (@_FaridKhan) August 8, 2023 -
BGT 2023: ఆ ఇద్దరు సూపర్.. టీమిండియాను ఓడించడమా!: పాక్ మాజీ ప్లేయర్
India vs Australia- Test Series- BGT 2023: ‘‘పెర్త్ లేదంటే బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా ఉపఖండ జట్లతో ఎలా మ్యాచ్‌లు ముగిస్తుందో ఇప్పుడు వారి పరిస్థితి కూడా అలాగే తయారైంది. వరుస ఓటములు చూస్తుంటే వారి సన్నద్ధత ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఇండియాకు వచ్చే ముందు వాళ్లు అస్సలు ప్రిపేర్ అవ్వలేదని స్పష్టంగా తెలుస్తోంది. భారత గడ్డపై టీమిండియాను ఓడించడం అసాధ్యం. స్పిన్నర్లను ఆడటంలో ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఒకే సెషన్లో తొమ్మిది వికెట్లు పడ్డాయంటే వాళ్ల బ్యాటింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నాడు. వాళ్లిద్దరు సూపర్ బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ప్రదర్శనపై పెదవి విరిచిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. టీమిండియా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లపై ప్రశంసలు కురిపించాడు. జడ్డూ బంతితో మాయ చేస్తే.. అక్షర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా.. ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ రెండు టెస్టుల్లో టీమిండియా గెలుపొందడంలో ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్ కీలక పాత్ర పోషించారు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జడ్డూ రెండు మ్యాచ్‌లలోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి సత్తా చాటాడు. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను రెండున్నర రోజుల్లోనే ముగించి 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. చెత్త బ్యాటింగ్ ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అక్షర్ పటేల్ బ్యాటింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆస్ట్రేలియా ఆధిక్యం కోసం ప్రయత్నిస్తున్న వేళ అశ్విన్‌తో కలిసి అతడు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. 60- 70 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా మానసికంగా బలహీనపడిపోయింది. టెక్నికల్‌గానూ వారి ఆటలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆసీస్ బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఎలా ఆడారో చూశాం కదా! షాట్ల ఎంపికలో పొరపాట్లు స్పష్టంగా కనిపించాయి. స్వీప్ షాట్లు కొంపముంచాయి. చెత్త బ్యాటింగ్‌తో భారీ మూల్యం చెల్లించారు’’ అని పాక్ మాజీ ఆటగాడు రమీజ్ అభిప్రాయపడ్డాడు. చదవండి: టీమిండియాలో గుజరాతీ క్రికెటర్ల హవా.. ఒకప్పటి కర్ణాటకలా..! KL Rahul: వైస్ కెప్టెన్ హోదా తొలగింపు.. అతడికి లైన్ క్లియర్.. ఇక దేశవాళీ క్రికెట్ ఆడితేనే.. In his 1️⃣0️⃣0️⃣th Test, @cheteshwar1 finishes off the chase in style 🙌🏻#TeamIndia secure a 6️⃣-wicket victory in the second #INDvAUS Test here in Delhi 👏🏻👏🏻 Scorecard ▶️ https://t.co/hQpFkyZGW8@mastercardindia pic.twitter.com/Ebpi7zbPD0 — BCCI (@BCCI) February 19, 2023 -
సూర్య ఇండియన్ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్లో ఉంటే పరిస్థితి!
Suryakumar Yadav: ‘‘అతడు 30వ ఏట అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడని నేనెక్కడో చదివాను. అతడి ఫిట్నెస్, బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది’’ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అన్నాడు. తను గనుక పాకిస్తాన్లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు. టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. సూర్య గ్రేట్ ఇన్నింగ్స్ శ్రీలంకతో నిర్ణయాత్మక ఆఖరి టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. రాజ్‌కోచ్ మ్యాచ్‌లో ‘పవర్ ప్లే’ ఆఖరి బంతికి క్రీజులోకి వచ్చాడు సూర్య. 6 ఓవర్ల పవర్ల ప్లేనే అయిపోయింది. కానీ.. మిగతా 14 ఓవర్ల పవర్ స్ట్రోక్స్ ఎలావుంటాయో ‘స్కై’ చూపెట్టాడు. కవర్ డ్రైవ్, ర్యాంప్ షాట్లతో టచ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ స్కోరు బోర్డును ఆద్యంతం పరుగు పెట్టించాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ స్పిన్, పేస్, గూగ్లీ ఇలా ఏ బంతి వేసిన తన శైలి షాట్లతో చెలరేగిపోయాడు. పేస్‌తో ముఖం మీదికి వచ్చే బంతుల్ని విడిచి పెట్టలేదు. అదే పనిగా ర్యాంప్ షాట్లతో సిక్స్‌లు, ఫోర్లుగా దంచేస్తూ 26 బంతుల్లోనే ఫిఫ్టీని అవలీలగా పూర్తి చేసుకున్నాడు. అతని షాట్లకు ఆకాశమే హద్దయ్యింది. ఫుట్ టాస్ బంతుల్ని, యార్కర్ డెలివరీల్ని మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలకు తరలించాడు. ఎలా వేసినా దంచేశాడు. అతని ధాటికి లంక బౌలర్ మదుషంక 13వ ఓవర్లో 18 పరుగులు రాగా... తీక్షణ మరుసటి ఓవర్లో 2, 4, 6, 6, 1లతో సూర్య వేగం ఇంకాస్త పెంచాడు. ఆఖరి బంతిని ఆడిన గిల్ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. కేవలం ఈ రెండు ఓవర్లలోనే భారత్ 113/2 నుంచి 154/2కు చేరింది. హసరంగ 15వ ఓవర్లో గిల్ క్లీన్‌బౌల్డయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4), దీపక్ హుడా (4) స్వల్ప వ్యవధిలోనే నిష్క్రమించినా... సూర్య బాదుడుకు అదేమంతా ప్రభావమే చూపలేదు. మూడో సెంచరీ ఆఖర్లో జతయిన అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) చకచకా బౌండరీలు బాదాడు. 18వ ఓవర్ చివరి బంతికి భారత్ స్కోరు 200కు చేరగా, 19వ ఓవర్ తొలి బంతికి సూర్యకుమార్ (45 బంతుల్లో; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ పూర్తయ్యింది. పొట్టి ఫార్మాట్లో అతనికిది మూడో సెంచరీ కావడం విశేషం. ఇక సూర్య తుపాన్ ఇన్నింగ్స్ ధాటికి 228 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా 91 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోండగా... పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. సూర్యను కొనియాడుతూనే తమ బోర్డు గత విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కుదరదని సర్ఫరాజ్ అహ్మద్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. యూట్యూబ్‌లో ప్రస్తావించిన సల్మాన్.. సూర్య పాకిస్తాన్లో ఉండి ఉంటే అసలు అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేవాడే కాదన్నాడు. సల్మాన్ భట్ ఇండియన్ కావడం తన అదృష్టం ‘‘తను భారతీయుడు కాబట్టి 30 ఏళ్ల వయసులో అరంగేట్రం చేయగలిగాడు. కొంతమంది జట్టులోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఆడకపోయినా ఏదో నెట్టుకొస్తారు. మరి కొంతమందికి అసలు అవకాశాలే రావు. కానీ సూర్యకుమార్ విషయం విభిన్నం. 30లలో అతడు జట్టులోకి రావడం గొప్ప విషయం. నిజానికి ఇండియన్ కావడం తన అదృష్టం. ఒకవేళ తనే గనుక పాకిస్తాన్లో ఉండి ఉంటేనా.. 30 ఏళ్లు పైబడిన బాధితుల జాబితాలో ఉండిపోయేవాడు. బ్యాటింగ్‌లో సూర్య పరిణతి చూస్తుంటే.. ఏ బౌలర్ ఎలాంటి బాల్ వేస్తాడో తనకు ముందుగానే తెలిసినట్లు అనిపించింది’’ అని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. కాగా 2021లో తనకు 30 ఏళ్ల వయసున్నపుడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో మ్యాచ్‌తో సూర్య అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. చదవండి: IND vs SL: డివిలియర్స్, క్రిస్ గేల్‌తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు శ్రీలంకతో వన్డే సిరీస్.. టీమిండియాలో ఎవరెవరు ఉన్నారంటే..? -
నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు కదా! రమీజ్ రాజాకు సర్ఫరాజ్ కౌంటర్!
Pakistan vs New Zealand, 2nd Test: ‘‘షాహిద్ భాయ్ చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టగానే నన్ను పిలిచి.. నువ్వు ఈ మ్యాచ్ ఆడుబోతున్నావు అని చెప్పాడు. ప్రాక్టీసు చేస్తున్న సమయంలో బాబర్ ఆజం కూడా ఇదే మాట అన్నాడు. నేను షాహిద్ భాయ్‌తో గతంలో ఆడాను.. తనకు నా గురించి తెలుసు’’ అని పాకిస్తాన్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేశాడు సర్ఫరాజ్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా రమీజ్ రాజా స్థానంలో నజీమ్ సేతీ నియామకంతో పాటు చీఫ్ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన తర్వాత జరిగిన తొలి సిరీస్ ఇది. నిరూపించుకున్నాడు ఈ క్రమంలో వైస్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై వేటు వేసి 35 ఏళ్ల సర్ఫరాజ్‌కు ఆడే అవకాశం ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సర్ఫరాజ్ మాత్రం తనకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు (86, 53) బాదిన ఈ వికెట్ కీపర్.. రెండో మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో(78, 118) మెరిశాడు. ఈ రెండు మ్యాచ్‌లలో పాక్‌ను గట్టెక్కించి ఓటమి నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలపై సర్ఫరాజ్‌కు ప్రశ్న ఎదురైంది. కివీస్‌తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో.. ‘‘ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయిందని రమీజ్ రాజా అన్నాడు. అయితే, వచ్చీ రాగానే.. డేరింగ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిది నీకు ఛాన్స్ ఇచ్చాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సర్ఫరాజ్’’ అని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. రమీజ్ రాజా పేరు ప్రస్తావించకుండానే.. ‘‘దేశవాళీ క్రికెట్లో రాణించాను. సరైన వ్యక్తుల మార్గదర్శనం, మీడియా ప్రోత్సాహం.. నా కుటుంబం, శ్రేయోభిలాషుల మద్దతుతో ఇక్కడి దాకా వచ్చాను’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. రమీజ్ రాజా తన గురించి మాట్లాడిన మాటలకు ఆటతోనే సమాధానం చెప్పానని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. షాహిద్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆఖరి వరకు ఉత్కంఠ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ఉత్కంఠభరిత మలుపులు తిరిగి చివరకు ‘డ్రా’గా ముగిసింది. ఒక దశలో పాక్ ఓటమి ఖాయమనిపించి, ఆపై గెలుపు అవకాశం చిక్కినా వాడుకోలేకపోగా... పేలవ బౌలింగ్‌తో చివరకు కివీస్ ‘డ్రా’తో సంతృప్తి పడాల్సి వచ్చింది. 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 0/2తో ఆట కొనసాగించిన పాక్ శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (176 బంతుల్లో 118; 9 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ సాధించగా...షాన్ మసూద్ (35), సౌద్ షకీల్ (32), ఆగా సల్మాన్ (30) అండగా నిలిచారు. ఒక దశలో 80 పరుగుల వద్దే పాక్ 5 వికెట్లు కోల్పోయింది. అయితే సర్ఫరాజ్, షకీల్ ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. సల్మాన్‌తో కూడా సర్ఫరాజ్ వేగంగా 70 పరుగులు జత చేశాడు. చివరి 15 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సి ఉండగా... తక్కువ వ్యవధిలో 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంపై గురి పెట్టింది. అయితే 32 పరుగులు చేయాల్సిన స్థితిలో సర్ఫరాజ్ 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి వికెట్ తీస్తే కివీస్ గెలుపు అందుకునే అవకాశం ఉండగా...చివరి జోడి నసీమ్ షా (15 నాటౌట్), అబ్రార్ (7 నాటౌట్) వికెట్ పడకుండా 21 బంతులు జాగ్రత్తగా ఆడారు. మిగిలిన 3 ఓవర్లలో పాక్‌కు 15 పరుగులు అవసరం కాగా... వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో రెండు టెస్టుల సిరీస్ 0–0తో డ్రాగా ముగిసింది. చదవండి: ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. డబుల్ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! Sarfaraz Ahmed’s press conference following the drawn Test in Karachi.#PAKvNZ | #TayyariKiwiHai https://t.co/oSRFkM3L2k — Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023 -
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా పాక్ దిగ్గజ పేసర్లు వసీం అక్రం, వకార్ యూనిస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకే గనక అధికారం ఉంటే అక్రమ్ తో పాటు వకార్ లను శాశ్వతంగా నిషేధించేవాడినని చెప్పుకొచ్చాడు. వసీం అక్రమ్ తో పాటు వకార్ లు 1993-94లలో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఇద్దరితో పాటు సలీమ్ మాలిక్ పైనా ఆరోపణలు రావడంతో దీనిపై జస్టిస్ ఖయ్యూం కమిటీ విచారణ జరిపి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో అక్రమ్, వకార్ల పేర్లు ఉన్నాయి. తాజాగా రమీజ్ రాజా ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ''వాళ్లెవరికీ తిరిగి జట్టుతో అవకాశమే ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఇందులో ఆరోపణలు ఎదుర్కున్న ఎవరికీ జట్టులోకి వచ్చే అవకాశమే ఉండకూడదని అనుకున్నా. వాళ్ల (అక్రమ్, వకార్)ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో నా చేతిలో పవర్ లేదు. ఒకవేళ నేనే నిర్ణయాధికారంలో గనక ఉంటే తప్పకుండా వారిపై జీవిత కాలం నిషేధం విధించేవాడిని. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నాకు తెలిసి ఈ ఫిక్సింగ్ కేసులో చాలా మంది ఉన్నారని నా అనుమానం. వారిని ఎందుకు వదిలేశారో నాకైతే తెలియదు..’ అని అన్నాడు. 2010లో మహ్మద్ అమీర్, మహ్మద్ అసిఫ్, సల్మాన్ భట్ ల మీద కూడా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. వీరిమీద విచారణ జరిపిన పీసీబీ.. భట్, అమీర్, అసిఫ్ లపై నిషేధం విధించింది. అమిర్ 2016లో తిరిగి పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ రమీజ్ రాజా పీసీబీ చైర్మెన్ అయ్యాక వీళ్లెవరినీ సెలక్షన్స్ సమయంలో పరిగణించలేదు. అయితే ఈ విషయంపై రమీజ్ తనదైన రీతిలో వ్యాఖ్యానించాడు. ''నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇలాంటి తప్పులు చేసిన వారు ఎంతటి స్థాయి వ్యక్తులైనా తప్పించుకోకూడదు'' అని అన్నాడు. . చదవండి: లేక లేక మ్యాచ్‌లు.. పీసీబీకి సంకటస్థితి -
ఘోర అవమానం.. బోరుమన్న రమీజ్ రాజా
పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజాకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు పీసీబీ కొత్త బాస్ నజమ్ సేతీ.. రమీజ్ రాజాను ఆఫీస్‌లోకి రాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రమీజ్ రాజానే స్వయంగా తన యూట్యూబ్ చానెల్లో పేర్కొంటూ బోరుమన్నాడు. ''పీసీబీ మొత్తం మారిపోయింది. నజమ్ సేతీ ఛైర్మన్‌గా అడుగుపెట్టగానే అతని రాజకీయం మొదలైంది. తన వాళ్లకు మాత్రమే పీసీబీలోకి ఎంట్రీ అన్నట్లుగా అక్కడి ప్రవర్తన ఉంది. నాకు తెలిసి ఒక్క వ్యక్తి(నజమ్ సేతీ) కోసం పీసీబీ రాజ్యాంగాన్ని కూడా మార్చేసినట్లు కనిపిస్తుంది. పీసీబీ మాజీ ఛైర్మన్‌గా ఉన్న నాకు నజమ్ సేతీ పీసీబీ ఆఫీస్‌లోనికి రానివ్వలేదు. ఎంత మాజీ అయినా వ్యక్తిగత ఫైల్స్ కొన్ని ఆఫీస్‌లోనే ఉంటాయి. వాటిని తీసుకునేందుకు వస్తే అనుమతి ఇవ్వడం లేదు. పైగా మనుషులను పెట్టి దౌర్జన్యంగా బయటికి పంపిస్తున్నారు. మూడేళ్ల కాలానికి మొదట ఒప్పందం కుదుర్చుకొని ఏడాది తిరిగేలోపే బయటికి పంపించడం ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పీసీబీని కొందరు భ్రస్టు పట్టిస్తున్నారు. ఇది క్రికెట్ బోర్డుతో పాటు సిస్టమ్‌పై, జాతీయ జట్టుపై, జట్టు కెప్టెన్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. '' అంటూ తన అక్కసును వెల్లగక్కాడు. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్ అయిన పాకిస్తాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్ సేతీ కొత్త ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్ సేతీ. పాక్ క్రికెట్లో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ క్రికెటర్ ఇఫ్తికార్ అంజుమ్‌లు ప్యానెల్లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్ రషీద్ కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. చదవండి: Shahid Afridi: షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు -
ODI WC: పాక్ ఇండియాకు వెళ్తుందా? లేదా? పీసీబీ కొత్త చీఫ్ క్లారిటీ
Asia Cup 2023- India Vs Pakistan- ODI World Cup 2023: పాకిస్తాన్ వన్డే వరల్డ్‌కప్-2023 ఆడే అంశంపై ఆ దేశ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్ నజమ్ సేతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఈ ఐసీసీ మెగా టోర్నీ కోసం భారత్‌కు వెళ్లే విషయం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఆసియా కప్-2023 నిర్వహణ విషయంలోనూ ఏసీసీతో చర్చలు జరుపుతున్నామన్న సేతీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ ఈవెంట్‌ను పాకిస్తాన్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైనా విషయం తెలిసిందే. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మాత్రం ఆ టోర్నీ కోసం టీమిండియా అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికపై ఈవెంట్ నిర్వహించే అంశం గురించి గతంలో ప్రస్తావించారు. జరుగుతుందా? లేదా? ఇందుకు స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. టీమిండియా తమ దేశానికి రాకపోతే, తాము కూడా వరల్డ్‌కప్ ఆడేందుకు అక్కడికి వెళ్లమని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్లలో మాత్రమే తలపడే చిరకాల ప్రత్యర్థుల పోరు చూస్తామో లేదోనంటూ అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఇది వరకే స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ తర్వాత పీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నజమ్ సేతీ తాజాగా ఈ అంశంపై స్పందించాడు. ఎలా చెబితే అలా! కరాచీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ ఇండియాకు వెళ్లొద్దని మా ప్రభుత్వం చెబితే మేము అలాగే నడుచుకుంటాం. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాతో ఆడాలా లేదా? అక్కడికి వెళ్లాలా వద్దా? అన్న విషయాల్లో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అని క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వం చెప్పినట్లుగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నాడు. చదవండి: David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్ Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా! -
ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ ఎఫెక్ట్.. పీసీబీ చైర్మన్‌ను పీకేసిన పాక్ ప్రధాని
Ramiz Raja: స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఎఫెక్ట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రజాపై పడింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవంతో పాటు స్వదేశంలో వరుసగా నాలుగు టెస్ట్‌ల్లో ఓటమి, అలాగే ఇంగ్లండ్ సిరీస్‌లో పిచ్‌ల తయారీపై ఆరోపణల నేపథ్యంలో రమీజ్‌కు ఉద్వాసన పలినట్లు పీసీబీ ఇవాళ (డిసెంబర్ 21) ప్రకటించింది. రమీజ్‌పై వేటును పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షెరీఫ్ కూడా సమర్ధించారని, ఇందుకు ఆయన కూడా ఆమోద ముద్ర వేశారని పీసీబీ వెల్లడించింది. రమీజ్ స్థానంలో పీసీబీ నూతన చైర్మన్‌గా నజమ్ సేథీ (78) బాధ్యతలు చేపడతారని, సేథీని స్వయంగా పాక్ ప్రధానే నామినేట్ చేశారని పీసీబీ పేర్కొంది. కాగా, ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉండగా 2021 సెప్టెంబర్‌లో రమీజ్ రజా పీసీబీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. రమీజ్ హయాంలో పాక్ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు, 50 ఓవర్ల మహిళ వన్డే ప్రపంచకప్‌లో పాల్గొంది. రమీజ్.. తన హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అండదండలు ఉండటంతో అతని హవా కొనసాగింది. ప్రస్తుతం ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడంతో రమీజ్‌పై కూడా వేటు తప్పలేదు. పీసీబీ నిబంధనల ప్రకారం బోర్డు అధ్యక్షుడిని ప్రధాని నామినేట్ చేస్తే.. బోర్డు ఆఫ్ గవర్నర్లు అతన్ని అధికారికంగా ఎన్నుకుంటారు. ఇదిలా ఉంటే, పీసీబీ కొత్త చైర్మన్ నజమ్ సేథీ ఈ పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదు. 2018లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకు సేథీ పీసీబీ అత్యున్నత పదవిలో కొనసాగారు. అయితే నాటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో విభేదాల కారణంగా నజమ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. -
ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! ప్రతి వాడూ..
Pakistan vs England, 3rd Test- Babar Azam: ‘‘ప్రతీ ఫార్మాట్ కోసం ఒక కచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. తమ వ్యూహాలకు అనుగుణంగా ఎవరైనా ఎలాగైనా ఆడవచ్చు. అయితే, ఒక్కరోజు లేదంటే ఒక్క వారంలో మార్పు సాధ్యం కాదు. ఆటతీరు మార్చుకోవడానికి, ఆటగాళ్ల మైండ్‌సైట్ మారాలంటే కాస్త సమయం పడుతుంది. అంతేగానీ వెంట వెంటనే ఏదీ జరిగిపోదు. ఒకవేళ మేము డిఫెన్స్ ఆడితే.. దూకుడుగా ఎందుకు ఆడటం లేదని ప్రశ్నిస్తారు. అదే దూకుడుగా ఆడితే.. ఇంకోలా ఆడొచ్చు కదా అంటారు. మనం ఎలా ఆడినా ఇలాంటి పెదవి విరుపులు, ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అందరికి సంతృప్తి కలిగేలా ఆడటం ఎవరికీ సాధ్యం కాదు’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. ఇంగ్లండ్‌లా ‘బజ్‌బాల్’ విధానాన్ని అవలంబించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాకు పరక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శనం, కెప్టెన్ బెన్ స్టోక్స్ నేతృత్వంలో ఇంగ్లండ్ టెస్టుల్లోనూ దూకుడైన ఆట తీరు కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు తమ తమ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లండ్ ఆడిన 10 టెస్టుల్లో తొమ్మిదింట విజయం సాధించడంతో.. బజ్‌బాల్ విధానంపై క్రీడా ప్రపంచంలో చర్చ నడుస్తోంది. బాబర్‌కు చెప్పాను.. ఈ నేపథ్యంలో పర్యాటక ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్రై క్రికెట్ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ మాదిరిగానే.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడాలని బాబర్‌కు సూచించాను. ఇందుకోసం జట్టులో ఎక్కువ మంది టీ20 ప్లేయర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పాను. పాకిస్తాన్ ఇలాంటి ఆటతీరు కచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే. భవిష్యత్ తరం ఇంగ్లండ్ మాదిరిగానే సంప్రదాయ క్రికెట్లోనూ టీ20ల మాదిరి ఆడాలని బలంగా కోరుకుంటున్నా’’ అని రమీజ్ రాజా పేర్కొన్నాడు. మ్యాచ్ ఓడితే ఇంతే! ఈ విషయం గురించి మూడో టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన బాబర్ ఆజంకు ప్రశ్న ఎదురైంది. ఈ నేపథ్యంలో పాక్ సారథి ఈ మేరకు పైవిధంగా స్పందించాడు. మ్యాచ్ ఫలితాన్ని బట్టే ఎదుటి వాళ్ల ప్రవర్తన ఉంటుందన్న బాబర్... ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే విమర్శలు వినిపిస్తాయి అని పేర్కొన్నాడు. ప్రతి ఫార్మాట్‌కు ఒక విధానమంటూ ఉంటుందని.. ఒక్కరోజులోనే మార్పు సాధ్యం కాదంటూ రమీజ్ రాజాకు చురకలు అంటించాడు. కాగా ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల మ్యాచ్‌లో పాక్ వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. దీంతో బాబర్ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: Ben Stokes: పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్.. అరుదైన జాబితాలో చోటు Lionel Messi: వరల్డ్‌కప్‌ను పక్కలో పెట్టుకుని పడుకున్న మెస్సీ.. వైరల్ ఫోటో -
‘టీమిండియాను ఓడించిన పాక్ లేకుండా.. అసలు ఆ టోర్నీ ఎవరు చూస్తారు?’ అంటూ..
ODI World Cup 2023- India Vs Pakistan- Ramiz Raja: ‘‘ఒకవేళ వాళ్లు ఇక్కడికి వస్తేనే మేము వరల్డ్‌కప్ టోర్నీ ఆడటానికి అక్కడికి వెళ్తాం. భారత జట్టు ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ లేకుండానే మెగా టోర్నీ ఆడుకోమనండి. భారత్‌లో వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పాల్గొనపోతే.. ఆ ఈవెంట్‌లోని మ్యాచ్‌లను అసలు ఎవరు చూస్తారు?’’ అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా ప్రగల్భాలు పలికాడు. తమ జట్టు దూకుడైన ఆట తీరుకు మారుపేరుగా మారిందని.. ప్రపంచంలోని సంపన్న బోర్డుకు చెందిన జట్టును కూడా మట్టికరిపించిందంటూ గొప్పలకు పోయాడు. కాగా ఆసియా కప్-2023 టోర్నీ పాకిస్తాన్ వేదికగా నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. అక్కడ ఆసియా కప్.. ఇక్కడ వరల్డ్‌కప్ అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా.. భారత జట్టు పాక్‌కు వెళ్లే ప్రసక్తి లేదని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీబీ తమతో చర్చించకుండా.. తమకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా మాట్లాడతారంటూ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందిస్తూ.. భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించాలా వద్దా అన్న అంశం ప్రభుత్వ పరిధిలోనిది అని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నారు. వాళ్లను ఓడించాం కదా ఈ విషయం గురించి తాజాగా ఉర్దూ న్యూస్‌తో మాట్లాడిన పీసీబీ చీఫ్ రమీజ్ రాజా.. తమ విషయంలో బీసీసీఐ ప్రవర్తించే తీరుపైనే వరల్డ్‌కప్ ఆడాలా వద్దా అన్న నిర్ణయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ మార్కెట్‌కు చెందిన జట్టును మేము ఓడించాం. మా ఆట తీరు మెరుగుపరుచుకుని.. అత్యుత్తమంగా ఆడుతుంటేనే పాక్ క్రికెట్ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని నేను నమ్ముతాను. అందుకు తగ్గట్లుగానే టీ20 ప్రపంచకప్-2021లో మేము రాణించాం. టీమిండియాను ఓడించాం. తర్వాత ఆసియా కప్ టోర్నీలోనూ వాళ్లని మట్టికరిపించాం.బిలియన్ డాలర్ ఎకానమీ ఉన్న బోర్డుకు చెందిన జట్టును మేము రెండుసార్లు ఓడించాం. అంతేకాదు టీ20 వరల్డ్‌కప్-2022 ఫైనల్‌కు కూడా చేరుకున్నాం. రమీజ్ రాజా వాళ్లు ఇక్కడికి రాలేమని చెబితే.. మేమూ అక్కడికి వెళ్లం. పాక్లేని వరల్డ్‌కప్ టోర్నీని ఎవరు చూస్తారు?’’ అంటూ తమ జట్టును ప్రశంసిస్తూ.. టీమిండియాను తక్కువ చేసే విధంగా మాట్లాడాడు రమీజ్ రాజా. అతడి వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కాగా.. తాజా వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఆత్మవిశ్వాసం మంచిదేనని.. అయితే అతి విశ్వాసం ప్రదర్శిస్తే బొక్కబోర్లా పడకతప్పదంటూ రమీజ్ రాజాను ట్రోల్ చేస్తున్నారు. భారత జట్టును ఓడిస్తేనే మీది గొప్ప జట్టుగా మారిందన్న నీ వ్యాఖ్యలు మాత్రం నిజమని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఆడకపోతే పాకిస్తాన్‌కు నష్టమని చురకలు అంటిస్తున్నారు. కాగా విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రపంచకప్-2022 టోర్నీలో పాక్ భారత్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. చదవండి: Umran Malik: ఉమ్రాన్ బౌలింగ్‌లో వైవిధ్యం లేదు.... ఇక వన్డేల్లోనే! అర్ష్‌దీప్ భేష్.. Ravindra Jadeja: వివాదాస్పదంగా జడేజా తీరు.. గాయం పేరు చెప్పి టూర్‌కు దూరం; కట్‌చేస్తే ఎన్నికల ప్రచారంలో -
Ind Vs NZ: కివీస్ గడ్డపై శ్రేయస్ అరుదైన రికార్డు.. భారత తొలి బ్యాటర్‌గా..
New Zealand vs India, 1st ODI- Shreyas Iyer: టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. గత ఎనిమిది మ్యాచ్‌లలో అతడి నిలకడైన ఆట తీరే ఇందుకు నిదర్శనం. ఇక తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మొదటి వన్డేలో అర్ధ శతకంతో మెరిశాడు అయ్యర్. తద్వారా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏ టీమిండియా క్రికెటర్‌కు సాధ్యం కాని రీతిలో కివీస్ గడ్డ మీద వన్డేల్లో వరుసగా నాలుగు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు యాభైకి పైగా పరుగులు సాధించిన రెండో విదేశీ క్రికెటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ఈ జాబితాలో అయ్యర్ కంటే ముందు వరుసలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. గత ఎనిమిది వన్డేల్లో భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ 5 అర్ధ శతకాలు, ఒక శతకం సాధించడం విశేషం. కివీస్ గడ్డపై శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత: న్యూజిలాండ్‌లో వన్డేల్లో అయ్యర్ నమోదు చేసిన స్కోర్లు 103(107), 52(57), 62(63), 51*(57). ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం! ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 80, 54, 63, 44, 50, 113 నాటౌట్, 28 నాటౌట్, 80. ఈ నేపథ్యంలో రానున్న వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో భారత జట్టులో అయ్యర్‌కు చోటు దక్కడం ఖాయమంటూ అతడి అభిమానులు సంబరపడిపోతున్నారు. Shreyas Iyer in last 8 innings in ODI format: 80(111) 54(57) 63(71) 44(34) 50(37) 113*(111) 28*(23) 80(76) This is ridiculous consistency. pic.twitter.com/MjTn6XP99I — Johns. (@CricCrazyJohns) November 25, 2022 ఇదే తరహాలో నిలకడగా ఆడుతూ ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని ఈ ముంబై బ్యాటర్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ‘‘ ఏయ్ బిడ్డా.. ఓడీఐ నా అడ్డా’’ అంటూ అయ్యర్ ఆటను కీర్తిస్తూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ గురూ.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కివీస్‌తో ఆక్లాండ్‌లోని మొదటి వన్డేలో శ్రేయస్ అయ్యర్ 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. View this post on Instagram A post shared by ItzzMeKaran (@itzzmekaran) చదవండి: IND vs NZ: శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన FIFA WC 2022: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
ఫైనల్ చేరగానే కొమ్ములొచ్చాయా?.. విషం చిమ్మిన రమీజ్ రాజా
టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఫైనల్‌కు వెళ్లిందనగానే పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు కొమ్ములొచ్చాయి. టీమిండియాపై మరోసారి తన అక్కసును వెళ్లగకక్కాడు. పాకిస్తాన్ జట్టు ఫైనల్ వెళ్లినందుకు ప్రశంసలు కురిపించడం తప్పులేదు.. కానీ అదే సమయంలో పని గట్టుకొని టీమిండియాపై విషం చిమ్మడం ఎందుకంటూ క్రికెట్ అభిమానులు విమర్శలు చేశారు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకొని టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో పాక్ కథ ముగిసిందనుకున్నారు. కానీ అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో అదృష్టం కలిసి వచ్చి పాకిస్తాన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే సెమీస్‌లో కివీస్‌పై మంచి ప్రదర్శన కనబరిచి మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. దీనిని అవకాశంగా తీసుకున్న పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా టీమిండియా, బీసీసీఐను హేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్‌పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ ఇండస్ట్రీ టీమ్(టీమిండియా) ఇంటికెళ్లిపోయిందంటూ పేర్కొన్నాడు. "మా టీమ్‌పై మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి వరల్డ్ క్రికెట్ ఎంత వెనుకబడిపోయిందో పాకిస్థాన్ క్రికెట్ ఎంత ముందుకెళ్లిపోయిందో. ఈ వరల్డ్‌కప్‌లో అది తెలిపి వచ్చింది. టీమిండియా లాంటి బిలియన్ డాలర్ టీమ్స్ వెనుకబడిపోతే మా టీమ్ పైకెళ్లిపోయింది. అంటే కొన్ని విషయాలను మేము సరి చేస్తున్నామనే కదా అర్థం. గత నెలలోనే ముగ్గురు ప్లేయర్స్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచారు. ఇది చాలు మేమేంటో చెప్పడానికి" అంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అయితే రమీజ్ రాజా వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానుల ధీటుగా బదులిచ్చారు. టీమిండియాపై విషం చిమ్మడం ఆపండి.. సందు దొరికితే చాలు టీమిండియాపై పడిపోతావు.. నీకు వేరే పని లేదనుకుంటా.. ఫైనల్‌కు వెళ్లగానే కాదు.. ఇంగ్లండ్ చేతిలో పాక్‌కు మూడింది.. పాక్‌ను చావుకొట్టడం ఖాయం అంటూ రమీజ్ రాజాకు చురకలంటించారు. ఇక టి20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆదివారం (నవంబర్ 13న) మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మెల్బోర్న్లో 95 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా సెమీఫైనల్‌కు,ఫైనల్‌కు రిజర్వ్‌డేను ఐసీసీ కేటాయించింది. కాబట్టి ఒక వేళ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి, ఆదివారం ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్ నిలిచిపోయిన దగ్గరి నుంచి రిజర్వ్ డే(సోమవారం)లో కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. -
రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్
పీసీబీ చైర్మన్.. మాజీ క్రికెటర్ రమీజ్ రాజాకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. టీమిండియా, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగి చాలా కాలమైపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరుజట్లు తలపడుతూ వస్తున్నాయి. కాగా ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో టీమిండియాకు పాక్‌పై మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను పాక్ ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. అయితే గతేడాది టి20 ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఒక్క విజయాన్ని దృష్టిలో పెట్టుకొని రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ''ఐసీసీ టోర్నీల్లో ఇండియాతో మ్యాచ్ అంటే ఎప్పుడూ పాకిస్తాన్ అండర్ డాగ్‌గానే ఉండేది. ప్రెషర్ తీసుకుని ఇండియాతో మ్యాచుల్లో ఓడిపోతూ వచ్చేవాళ్లం. కొన్నాళ్లకు ఐసీసీ టోర్నీల్లో ఇండియాని ఓడించగలమా? అనే అనుమానం కూడా మాలో మొదలైంది...టీమిండియాని ఓడించలేం... అని చాలామంది ఫిక్స్ అయిపోయారు కూడా. అయితే గత వరల్డ్ కప్‌లో దాన్ని సాధించాం. టీమిండియాని ఓడించి అద్భుతం క్రియేట్ చేశాం. అది అనుకోకుండా వచ్చిన విజయమే కావచ్చు కానీ అందులో మాకు క్రెడిట్ దక్కాల్సిందే... ఎందుకంటే టీమిండియా బిలియన్ డాలర్ టీమ్ క్రికెట్ ఇండస్ట్రీ'' అంటూ పేర్కొన్నాడు. కాగా రమీజ్ వ్యాఖ్యలపై స్పందించిన అశ్విన్.. ''రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యా.ఈ విషయాన్ని డీల్ చేసే విధానం ఇదేనా. క్రికెట్ గేమ్‌లో గెలుపు ఓటమలు సహజం. పొలిటికల్ టెన్షన్స్ కారణం కావచ్చు, మరేదైనా కారణం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ రేంజ్ వేరుగా ఉంటుంది...రెండు జట్ల మధ్య మ్యాచ్‌లా కాకుండా రెండు దేశాల మధ్య పోరాటం చూస్తారు చాలా మంది. అయితే ఓ క్రికెటర్‌గా ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి కూడా అంతే అనే విషయం నాకు బాగా తెలుసు. అందులోనూ టీ20ల్లో ఎవరు ఎప్పుడు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. క్రెడిట్, గౌరవం అనేవి అడిగి తీసుకుంటే వచ్చేవి కాదు. గెలుపు ఓటములతో గౌరవం దక్కదు. ప్రత్యర్థితో మనం ఎలా ఉంటున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం.. అనేదాన్ని బట్టి గౌరవం దక్కుతుంది. ఒక క్రికెటర్‌గా, నా ప్రత్యర్థి జట్టును నేను గౌరవిస్తా. అది పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కావచ్చు... అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంది'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే టీమిండియా ఆస్ట్రేలియా చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. సూర్యకుమార్ తన ఫామ్‌ను కంటిన్యూ చేయగా.. రోహిత్ శర్మ విఫలమయ్యాడు. ఇక పాకిస్తాన్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో ట్రై సిరీస్ ఆడేందుకు కివీస్ గడ్డపై అడుగుపెట్టింది. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 23న(ఆదివారం) జరగనుంది. -
ఇండియా నుంచి వచ్చారా? హ్యాపీగా ఉన్నారనుకుంటా: రమీజ్ రాజా దురుసు ప్రవర్తన
Asia Cup 2022 Final SL Vs Pak- Winner Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రజా అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఓటమి బాధను జీర్ణించుకోలేక తన అసహనాన్ని ఓ జర్నలిస్టుపై ప్రదర్శించాడు. తన దురుసు ప్రవర్తన కారణంగా విమర్శల పాలయ్యాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్లో శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 23 పరుగులతో లంక.. పాక్‌ను చిత్తు చేసి విజేతగా అవతరించింది. ఆరవసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ బాధలో మునిగిపోయిన తమ దేశ ప్రజల మోములు నవ్వులతో వికసించేలా చేసింది దసున్ షనక బృందం. ఇదిలా ఉంటే.. తుది మెట్టుపై బోర్లా పడ్డ పాకిస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వీక్షించిన రమీజ్ రజాను.. పాక్ ఓటమి అనంతరం విలేకరులు పలకరించారు. ఈ సందర్భంగా.. రోహిత్ జుల్గన్ అనే జర్నలిస్టు.. ‘‘ఈ ఓటమి కారణంగా పాకిస్తాన్ అభిమానులు నిరాశచెంది ఉంటారు కదా’’ అని ప్రశ్నించారు. మీరు ఇండియా నుంచి వచ్చారా? ఇందుకు స్పందించిన రమీజ్ రాజా.. ‘‘బహుశా మీరు భారత్‌కు చెందిన వారు అనుకుంటా? మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు కదా?’’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. అంతటితో ఆగకుండా.. జర్నలిస్టు మీదమీదకు వస్తూ.. ఆయన ఫోన్ లాక్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను రోహిత్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ‘‘నేను అడిగిన ప్రశ్నలో తప్పేముంది? పాకిస్తాన్ ఫ్యాన్స్ ఈ ఓటమితో బాధకు లోనై ఉంటారు కదా అన్నాను. కానీ మీరిలా నా ఫోన్ తీసుకోవడం సరైంది కాదు మిస్టర్ చైర్మన్’’ అని రమీజ్ రాజాను ట్యాగ్ చేశారు. ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు రమీజ్ రాజా తీరును ఏకిపారేస్తున్నారు. ‘‘ఆయన అంత స్పష్టంగా చెబుతున్నా.. మీరు సంతోషంగా ఉన్నారని మీ ముఖమే చెబుతోందంటూ అసహనం ప్రదర్శించడం సరికాదు. బోర్డు చైర్మన్‌వి.. అందునా ఆటగాడివి.. క్రీడాస్ఫూర్తి తెలియదా? ఓటమిని హుందాగా అంగీకరించే మనస్తత్వం లేనపుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇలాంటి దురుసు ప్రవర్తన కారణంగా ఓటమి కంటే ఎక్కువ విమర్శలు మూటగట్టుకుంటారు’’ అంటూ పాక్, భారత నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ.. SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! क्या मेरा सवाल ग़लत था - क्या पाकिस्तान के फ़ैन नाखुश नहीं है - ये बहुत ग़लत था एक बोर्ड के चेयरमैन के रूप में - आपको मेरा फ़ोन नहीं छीनना चाहिये था - that’s not right Mr Chairman Taking my phone was not right @TheRealPCB @iramizraja #PAKvSL #SLvsPAK pic.twitter.com/tzio5cJvbG — रोहित जुगलान Rohit Juglan (@rohitjuglan) September 11, 2022 Full enjoy 🥰 pic.twitter.com/ha3IvZY77Y — Salman (@salman_dant) September 11, 2022 -
పాకిస్థాన్ క్రికెట్‌ను 'అతను' భ్రష్టు పట్టిస్తాడు..!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాపై ఆ జట్టు మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ (పాక్ తరఫున 5 టెస్ట్‌లు, 2 వన్డేలు, ఓ టీ20 ఆడాడు) షాకింగ్ కామెంట్స్ చేశాడు. పీసీబీ అధ్యక్షుడిగా రమీజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైనా చేసిందేమీ లేదని దుయ్యబట్టాడు. నాలుగు దేశాల టీ20 టోర్నీ (భారత్, పాక్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్), భారత్‌తో క్రికెట్ సంబంధాలు అంటూ హడావుడి చేస్తున్నాడే తప్ప ఈ ఏడాది కాలంలో అతను సాధించింది ఏమీ లేదని పెదవి విరిచాడు. రమీజ్ పీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేసిన ఓ మంచి పనైనా చూపించాలని సవాల్ విసిరాడు. పీసీబీ పరిస్థితి గత పాలకుల హయాంలో ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందని, రమీజ్ వచ్చి కొత్తగా పొడిచిందేమీ లేదని విరుచుకుపడ్డాడు. రమీజ్ వచ్చే ఏడాది పీసీబీ ప్రణాళికలను వివరిస్తూ ప్రెస్‌మీట్ పెట్టిన నేపథ్యంలో తన్వీర్ ఈ మేరకు స్పందించాడు. రమీజ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీబీకి తన హయాం స్వర్ణయుగంలాంటిదని, తాను బాధ్యతలు చేపట్టాక ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేపట్టానని, పాక్ క్రికెట్‌ను తాను కొత్త పుంతలు తొక్కించానని గొప్పలు పోయాడు.జట్టు సెలక్షన్ విషయంలో పీసీబీ వ్యవహరిస్తున్న తీరును ఇటీవలే డానిష్ కనేరియా కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గతంతో పోలిస్తే పాక్ ఆటతీరు రమీజ్ హయాంలో కాస్త మెరుగు పడిందనే చెప్పాలి. గతేడాది కాలంలో పాక్ ఫార్మాట్లకతీతంగా ఓ మోస్తరు విజయాలు సాధిస్తుంది. చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! -
గంగూలీ పిలిచినా వెళ్లలేదు.. ఐపీఎల్ నేపథ్యంలో పీసీబీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లు చూసేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ గతంలో తనను రెండుసార్లు (2021, 2022) ఆహ్వానించాడని, అయినా తాను గంగూలీ ఆహ్వానాన్ని తిరస్కరించానని పేర్కొన్నాడు. ఐపీఎల్ మీడియా హక్కులు భారీ మొత్తంలో అమ్ముడుపోయిన అంశంపై పాక్ మీడియా అడిగిన ప్రశ్నల సందర్భంగా రమీజ్ ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా రమీజ్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు బీసీసీఐ బాస్ తనను ఆహ్వానించాడని, అయినా తాను వెళ్లలేకపోయానని అన్నాడు. గంగూలీ నుంచి ఆహ్వానం అందాక వెళ్లాలా..? వద్దా..? అని చాలా రోజుల పాటు ఆలోచించానని, ఒకవేళ ఐపీఎల్ ఫైనల్స్‌ను వీక్షించేందుకు తాను వెళ్లుంటే పాక్ అభిమానులు నన్ను ఎప్పటికీ క్షమించేవారు కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్-పాక్‌ల మైత్రిపరమైన సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వెళ్లే సాహసం చేయలేకపోయానని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ను ఓ క్రీడలా చూస్తే తాను గంగూలీ ఆహ్వానం మేరకు వెళ్లాల్సిందని, అయితే దాయది దేశాల్లో ఆ పరిస్థితులు లేవని తెలిపాడు. ఇదే సందర్భంగా రమీజ్ పీసీబీ ప్రతిపాదించిన నాలుగు దేశాల (భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) టీ20 సిరీస్‌పై కూడా స్పందించాడు. పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించడాన్ని ఆయన తప్పుబట్టాడు. నాలుగు దేశాల టీ20 సిరీస్‌పై గంగూలీతో డిస్కస్ చేశానని అన్నాడు. ఈ సిరీస్ సాధ్యాసాధ్యలపై దాదా త్వరలో ఓ ప్రకటన చేస్తానని హామీ ఇచ్చాడని తెలిపాడు. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లు అదృష్టవంతులు.. కానీ పాక్‌లో అలా కాదు! అయినా! -
పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ రీ ఎంట్రీ!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్.. మళ్లీ జాతీయ జట్టు తరుపున ఆడేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత.. అమీర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పీసీబీ కొత్త చైర్మన్‌గా రమీజ్ రాజా స్థానంలో నజం సేథీ రావచ్చని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అవిశ్వాస తీర్మానంలో ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఓడిపోవడంతో తన పదవిని కోల్పోయారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్ స్థానంలో నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20ల్లో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: IPL 2022: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన చాహల్.. వీడియో వైరల్! -
IPL 2022: మీకంత సీన్ లేదు.. 16 కోట్లు పెట్టి ఆటగాడిని కొనేవాళ్లు ఉన్నారా?
IPL- PSL: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాకు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ప్రపంచంలోని ఏ ఇతర లీగ్‌లు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పోటీ ఇవ్వలేని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో డ్రాఫ్ట్ మోడల్ కాకుండా వేలం నిర్వహించాలన్న రమీజ్ రాజా.. అలా అయితే ఐపీఎల్ సత్తా ఏమిటో తెలుస్తుందని ప్రగల్బాలు పలికాడు. ఈ మేరకు అతడు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఆర్థికంగా మనం(పాకిస్తాన్ క్రికెట్) మరింత స్వతంత్రంగా మారాలంటే కొత్త ఆస్తులు కూడగట్టుకోవాలి. ప్రస్తుతం మనకు పీఎస్ఎల్, ఐసీసీ నిధులు తప్ప మరే ఇతర ఆదాయ మార్గాలు లేవు. వచ్చే ఏడాది నుంచి మనం ఆక్షన్ మోడల్(వేలం)అనుసరించాలి. మన ఎకానమీ పెరిగితే గౌరవం కూడా పెరుగుతుంది. అప్పుడు పీఎస్ఎల్ను కాదని ఐపీఎల్ ఎవరు ఆడతారో చూద్దాం’’ అని వ్యాఖ్యానించాడు. ఇందుకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. రమీజ్ రాజాకు చురకలు అంటించాడు. ‘‘ఒకవేళ మీరు డ్రాఫ్ట్ సిస్టమ్ కాదని వేలానికి వెళ్లినా మీరు చెప్పింది జరుగదు. పీఎస్ఎల్లో 16 కోట్లకు అమ్ముడు పోయే ఆటగాడిని మనం చూడలేము. మీరు అన్న మార్కెట్ శక్తులే దీనిని ఆమోదించవు. పీఎస్ఎల్, బీబీఎల్, ది హండ్రెడ్, సీపీఎల్ ఏదీ కూడా ఐపీఎల్‌కు పోటీ ఇవ్వలేదు. ఈ పోలికలు అనవసరం’’ అని కౌంటర్ వేశాడు. కాగా పీఎస్ఎల్లో డ్రాఫ్ట్ సిస్టమ్‌లో భాగంగా ఒక్కో ఫ్రాంఛైజీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటుంది. వీటిలో ప్లాటినమ్, డైమండ్, గోల్డ్, సిల్వర్, ఎమర్జింగ్, సప్లిమెంటరీ అనే కేటగిరీలు ఉంటాయి. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్‌ను 16.5 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యధిర ధరకు కొనుగోలు చేసింది. చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్; సీన్ రిపీట్ -
Pak Vs Aus: పాక్ ఫ్యాన్స్‌కు ద్రోహం చేశాడు.. ఈ వయసులో నువ్వు కూడా!
Pakistan Vs Australia 1st Test: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాపై మండిపడ్డాడు. పనికిమాలిన పిచ్ తయారు చేయించిందే గాక.. ఇంకా సమర్థించుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా సుదీర్ఘ కాలం తర్వాత మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా మార్చి 4-8 మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. పేలవమైన ఈ పిచ్ ఒక్కసారి కూడా బౌలింగ్‌కు అనుకూలించకపోవడం గమనార్హం. ఫలితంగా బ్యాటర్లు చెలరేగారు. పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు చేయగా.. అజర్ అలీ, అబ్దుల్లా షఫిక్(136 నాటౌట్) చెరో శతకం బాదారు. ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్ ఖావాజా 97, లబుషేన్ 90 పరుగులు చేశారు. ఈ క్రమంలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో పిచ్ రూపొందించిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై స్పందించిన పీసీబీ చీఫ్ రమీజ్ రాజా.. మ్యాచ్ పేలవ డ్రాగా ముగియడాన్ని తాను స్వాగతించడం లేదని, నాణ్యమైన పిచ్‌లను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఇందుకు సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు. PCB Chairman reflects on the Rawalpindi Test and reiterates his plans on pitches for domestic and international matches in the country#PAKvAUS l #BoysReadyHain pic.twitter.com/OuD7wDvJw1 — Pakistan Cricket (@TheRealPCB) March 9, 2022 ఈ నేపథ్యంలో కనేరియా తన యూట్యూబ్ చానెల్ వేదికగా రమీజ్ రాజా తీరుపై దుమ్మెత్తిపోశాడు. ‘‘రమీజ్ రాజా పాక్ అభిమానులకు ద్రోహం చేశాడు. వెన్నుపోటు పొడిచాడు. ఆయన తన కుమారుడి పెళ్లి పనులతో బిజీగా ఉన్నాడేమో! పర్లేదు! ఇప్పుడు మాత్రం ఈ జీవం లేని వికెట్ గురించి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది. కానీ.. మీరు.. ఇలంటి పిచ్ రూపొందించారు. బౌలర్లు రాణిస్తే చూడటం ఇష్టం లేదా? మీ కెప్టెన్ ఒక అసమర్థుడు. దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతున్నాడు. ఇది ఎలాంటి పిచ్ అంటే రమీజ్ రాజా ఈ వయసులో కూడా అక్కడ పరుగుల వరద పారించగలడు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ ఆసీస్‌తో తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని డ్రాగా ముగించింది. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు స్కోర్లు: ఆస్ట్రేలియా- 459 ఆలౌట్ పాకిస్తాన్ 476/4 డిక్లేర్డ్ & 252/0 చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
4 Nation T20 Series: భారత్-పాక్ టీ20 సిరీస్‌పై జై షా కీలక ప్రకటన
భారత్, పాక్ జట్లతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను కలుపుకునే నాలుగు దేశాల టీ20 సిరీస్‌ను ప్లాన్ చేయాలన్న పీసీబీ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ప్రతిపాదించిన ఈ టోర్నీ వల్ల స్వల్పకాలిక వాణిజ్య ప్రయోజనాలే తప్ప, పెద్దగా ఉపయోగం ఉండదని బీసీసీఐ సెక్రెటరీ జై షా తేల్చిపారేశాడు. ఐపీఎల్, ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో స్వల్పకాలిక ప్రయోజనాలు (రమీజ్ రాజా ప్రతిపాదించిన నాలుగు దేశాల టోర్నీ) తమకు ముఖ్యం కాదని పీసీబీ ప్రతిపాదనను షా సున్నితంగా కొట్టిపారేశాడు. దీంతో భారత్-పాక్ జట్లతో కూడిన నాలుగు దేశాల టీ20 సిరీస్‌కు ఆదిలోనే బ్రేకులు పడినట్లైంది. షా వ్యాఖ్యలతో దాయాదుల పోరు మరోసారి ఐసీసీ ఈవెంట్ల వరకే పరిమితమైంది. త్వరలో భారత-పాక్‌ల మధ్య సిరీస్ ఉంటుందని ఆశించిన ఇరు దేశాల అభిమానుల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. కాగా, గత నెలలో పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఐసీసీ ముందు ఈ నాలుగు దేశాల క్రికెట్ సిరీస్ ప్రతిపాదనను ఉంచాడు. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వచ్చిన టీఆర్పీలను బేస్ చేసుకుని పీసీబీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్ సాధ్యపడదని తెలిసి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను కలుపుకుని తటస్థ వేదికలపై నాలుగు దేశాల టీ20 సిరీస్ నిర్వహిస్తే బావుంటందని పీసీబీ ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను బీసీసీఐ సున్నితంగా కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 23న దాయాదుల సమరం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఐసీసీ సోమవారం ప్రారంభించగా, గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ సేల్ అయిపోయాయి. చదవండి: IND VS WI: రెండో వన్డేకు కేఎల్ రాహుల్ సహా కీలక ఆటగాళ్లు రెడీ.. -
'పాకిస్తాన్లో పర్యటించనున్న న్యూజిలాండ్.. ఇప్పుడు భయం పోయిందా'
భద్రతా కారణాల దృష్ట్యా ఆర్ధంతరంగా పాకిస్తాన్ పర్యటను రద్దు చేసుకున్న న్యూజిలాండ్ మళ్లీ పాకిస్తాన్లో పర్యటించనుంది. వచ్చే ఏడాదిలో పాకిస్తాన్లో తమ జట్టు పర్యటించనుందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటన చేసింది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లతో పాటు రెండు టెస్ట్‌లు కూడా కివీస్ ఆడనుంది. నవంబర్‌లో దుబాయ్‌లో ఇరు జట్ల క్రికెట్ బోర్డులు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన రెండు క్రికెట్ బోర్డుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ అన్నారు. "మా బోర్డు చైర్మన్ మార్టిన్ స్నెడెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఇద్దరూ దుబాయ్‌లో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో మా జట్టు వచ్చే ఏడాది ఆ దేశ పర్యటనకు వెళ్లనుంది. దీంతో రెండు దేశాల బంధం మరింత బలపడతుంది" అని డేవిడ్ వైట్ పేర్నొన్నారు. ఇక ఈ విషయంపై రమీజ్ రాజా మాట్లడూతూ.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో పర్యటించడానికి ఒప్పుకున్నందుకు చైర్మన్ మార్టిన్ స్నెడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2022-23 ఏడాదికి గాను రెండు సార్లు పాక్ పర్యటనకు కివీస్ రానుందని అతను చెప్పారు. ఈ పర్యటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రమీజ్ రాజా పేర్కొన్నారు. చదవండి: SA Vs IND: భారత పర్యటన.. ఆ మ్యాచ్‌లను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు! -
రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలో బాబర్‌కి నేనే చెప్పా...
I told Babar Azam how to get Rohit Sharma out: టీ20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చింది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో సెమిస్కు దూసుకొచ్చిన పాకిస్తాన్.. సెమిఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో అనుహ్యంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమి చెంది ఘోర పరభవాన్ని మూట కట్టుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది అద్బుతమైన స్పెల్‌తో భారత్‌ను దెబ్బతీశాడు. కాగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను అద్భుతమైన డెలివరీతో ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. అయితే రోహిత్ శర్మ ఔట్ పై బీబీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ రమీజ్ రాజా ప్రస్తుతం స్పందించాడు. రోహిత్ శర్మ వికెట్ పొందడానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కి విలువైన సూచనలు చేసినట్లు అతడు తెలిపాడు. “ప్రపంచ కప్ కోసం యూఏఈ బయలుదేరే ముందు బాబర్ ఆజం, చీఫ్ సెలెక్టర్‌తో వచ్చి నన్ను కలిశారు. టీమిండియాకు వ్యతిరేకంగా మీ ప్రణాళికలు ఏమిటి అని అడిగాను. దానికి బదులుగా మేము వాళ్ల ఆట తీరుపై విశ్లేషణ చేసుకున్నాము, పక్క ప్రణాళికలో మేము వెళ్లుతున్నాము అని బాబర్ సమాధానం చెప్పాడు. కానీ భారత్ కూడా మనల్ని ఓడించడానికి పక్క ప్రణాళికలు రచిస్తోందని నేను హెచ్చరించాను" అని రమీజ్ రాజా తెలిపాడు. “రోహిత్ శర్మను ఎలా ఔట్ చేయాలో అప్పుడే బాబర్‌కు నేను చెప్పాను. షాహీన్ అఫ్రిదిని షార్ట్ లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టి బౌలింగ్ చేయమని అని నేను చెప్పాను. కేవలం స్లో మీడియంలో ఇన్‌స్వింగింగ్ యార్కర్‌ని బౌల్ చేయమన్నాను. ఆ ఓవర్లో అతడికి ఒక్క సింగిల్ కూడా ఇవ్వవద్దు. అతడిని ఓవర్ మొత్తం స్ట్రైక్లోనే ఉంచితే, మీరు రోహిత్‌ను సులభంగా ఔట్ చేయవచ్చు" అని చెప్పినట్లు అతడు పేర్కొన్నాడు. చదవండి: IND Vs NZ: ఔటైన కోపంలో కోహ్లి ఏం చేశాడంటే.. వీడియో వైరల్ -
T20 WC 2021: జట్టు ఏదైనా సరే.. పాక్‌ను ఓడించడం అసాధ్యం..!
Impossible To Beat Pakistan Says PCB Cheif Ramiz Raja: టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకొచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ రమీజ్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. మెగా టోర్నీలో భాగంగా ఇవాళ(నవంబర్ 11) ఆసీస్‌తో కీలక సమరానికి ముందు జట్టు సభ్యులను ఉత్తేజపరుస్తూ ఓ వీడియా సందేశాన్ని రూపొందించి పీసీబీ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశాడు. పాక్ జట్టు ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే.. ప్రపంచంలో ఏ జట్టునైనా మట్టికరిపించగలదని ధీమా వ్యక్తం చేశాడు. Play with pride and passion! PCB chairman Ramiz Raja has a special message for Babar Azam's team. #WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/fS0rghZ4nG — Pakistan Cricket (@TheRealPCB) November 10, 2021 జట్టు సభ్యులందరూ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా కలిసి కట్టుగా ఆడుతున్నారని, నాయకుడు బాబర్ ఆజమ్ జట్టును అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నాడని కొనియాడాడు. తాను కూడా మూడు ప్రపంచకప్‌లు ఆడానని, ఓ ఆటగాడికి ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఆడే అనుభవం వేరుగా ఉంటుందని అన్నాడు. పాక్ జట్టు ఇప్పటివరకు అద్భుతంగా రాణించిందని, మూడు ప్రపంచకప్‌లు ఆడిన అనుభవంతో చెబుతున్నాను.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్ధి ఎవరైనా పాక్‌ను ఓడించడం అసాధ్యమంటూ బాబర్ సేనను ఆకాశానికెత్తాడు. కాగా, రమీజ్.. పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం పాక్ ప్రపంచకప్ జట్టులో కీలక మార్పులు చేసిన విజయంతమైన సంగతి తెలిసిందే. చదవండి: పాక్ కెప్టెన్‌ను ఆకాశానికెత్తిన గవాస్కర్.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన -
Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా.. టీమిండియా మాజీ కోచ్!
This Former Cricketer To Replace Misbah-ul-Haq: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు అదరగొడుతోంది. టీమిండియా, న్యూజిలాండ్ వంటి మేటి జట్లపై వరుస విజయాలు సాధించి సెమీస్‌కు చేరువవుతోంది. తద్వారా క్రీడా విశ్లేషకులు ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఈ ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ సహా బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సందిగ్దంలో పడింది. సక్లెయిన్ ముస్తాక్‌ను తాత్కాలిక హెడ్‌కోచ్‌గా నియమించింది. అయితే... విదేశీ కోచ్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పాలని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, టీమిండియాకు హెడ్ కోచ్‌గా సేవలు అందించిన గ్యారీ కిర్‌స్టన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిస్బా స్థానాన్ని కిర్‌స్టన్‌తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అతడితో పాటు సైమన్ కటిచ్(ఆస్ట్రేలియా), పీటర్ మూర్స్(ఇంగ్లండ్) పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. మూడేళ్లపాటు గ్యారీ కిర్‌స్టన్ 2008-2011 మధ్య కాలంలో టీమిండియా ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు. అతడి నిర్దేశనంలో.. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత జగజ్జేతగా నిలిచింది. ఇక కిర్‌స్టన్ కోచ్‌గా ఉన్నపుడే టీమిండియా టెస్టు ఫార్మాట్లోనూ నంబర్ 1 ర్యాంకుకు చేరుకుంది. క్రికెటర్‌గా కిర్‌స్టన్ గణాంకాలు దక్షిణాఫ్రికా తరఫున గ్యారీ కిర్‌స్టన్.. 185 వన్డేలు, 101 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 7289, వన్డేల్లో 6798 పరుగులు చేశాడు. 2004లో ప్రొటిస్ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. చదవండి: T20 World Cup 2021: నెట్స్‌లో శ్రమిస్తున్న పాండ్యా.. శార్దూల్, భువీతో కలిసి బౌలింగ్ చేస్తూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే.. -
T20 WC: రంగంలోకి ఇమ్రాన్.. వాళ్లను తప్పించి.. షోయబ్, ఫఖార్ జమాన్ సహా..
PM Imran Khan On T20 World Cup Squad: వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించిన జట్టుపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ వంటి సీనియర్లకు చోటు దక్కకపోవడం.. ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాదిర్, షెహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా 15 మంది సభ్యులతో కూడిన టీ20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటించగానే హెడ్‌కోచ్ మిస్బా ఉల్ హక్, వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్ బాబర్ ఆజం సైతం జట్టు పట్ల సంతోషంగా లేడనే వార్తలు వినిపించగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అలాంటివేమీ లేదని కొట్టిపడేసింది. అయితే మాజీ ఆటగాళ్లు మాత్రం పీసీబీ తీరుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కనీసం రెండు, మూడు మార్పులతో బరిలో దిగితేనే సత్ఫలితాలు వస్తాయంటున్నారు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్, మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఇప్పటికే... జట్టు ఎంపికపై పెదవి విరిచారు. అప్పటివరకు అవకాశం.. కానీ అక్టోబరు 10 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో... ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా.. న్యూజిలాండ్, ఇంగ్లండ్ అకస్మాత్తుగా పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్న నేపథ్యంలో.. ఐసీసీ ఈవెంట్లో ఆ జట్లపై ఆటతో ప్రతీకారం తీర్చుకోవాలంటే మార్పులు తప్పనిసరి అని చెబుతున్నారు. రమీజ్.. మరోసారి ఆలోచించు! ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పీసీబీ నూతన చైర్మన్ రమీజ్ రాజాతో ఈ విషయం గురించి చర్చించిన ఇమ్రాన్.. స్క్వాడ్‌ను పునః పరిశీలించాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆజం ఖాన్, మహ్మద్ హస్నైన్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్‌ను జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయంటూ స్థానిక మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి స్థానంలో ఫఖార్ జమాన్, షర్జీల్ ఖాన్, షోయబ్ మాలిక్, షెహనవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్‌లను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కివీస్, ఇంగ్లండ్ టూర్లు రద్దు చేసుకున్న నేపథ్యంలో పాక్ ఆటగాళ్లంతా నేషనల్ టీ20 కప్ ఆడటంలో బిజీగా ఉన్నారు. ఇక ఈ టోర్నీలో మహ్మద్ హస్నైన్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. అదే సయంలో పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఆకట్టుకున్న దహానీ... ఈ టోర్నీలోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేషనల్ టీ20 కప్‌లో ప్రదర్శన ఆధారంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా అక్టోబరు 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్.. టీమిండియాతో మ్యాచ్ ఆడనుంది. 15 మందితో పాకిస్తాన్ టీ20 ప్రాబబుల్స్: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. రిజర్వ్ ప్లేయర్లు: ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాదిర్, షెహనవాజ్ దహాని Asif and Khushdil return for ICC Men's T20 World Cup 2021 More details ➡️ https://t.co/vStLml8yKw#PAKvNZ | #PAKvENG | #T20WorldCup pic.twitter.com/9samGbJgDJ — PCB Media (@TheRealPCBMedia) September 6, 2021 -
‘పాకిస్తాన్‌తో వన్డే సిరీస్’.. అఫ్గన్ బోర్డు కీలక నిర్ణయం
Afghanistan Cricket Board Cheif Azizullah Fazli: అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మన్ అజీజుల్లా ఫజ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. బోర్డు కార్యకలాపాలను గాడిలో పెట్టి... మెరుగైన భవిష్యత్తు కోసం వివిధ దేశాలతో వరుస సిరీస్‌లు నిర్వహించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపాడు. ఇందులో భాగంగా తొలుత పాకిస్తాన్‌ను సందర్శిస్తానని.. ఆ తర్వాత భారత్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాజమాన్యాలతో చర్చలు జరుపనున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్ రమీజ్ రాజాతో ఈ నెలలో సమావేశమవుతాను. శ్రీలంకలో ఆడాల్సిన వన్డే సిరీస్ కోసం మా దేశం రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. సెప్టెంబరు 25న పాకిస్తాన్ పర్యటన తర్వాత భారత్, బంగ్లాదేశ్, యూఏఈ క్రికెట్ బోర్డు అధికారులతో భేటీ అవుతాను. అఫ్గనిస్తాన్ క్రికెట్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నాం. ఇతర దేశాల సహకారంతోనే ఇది జరుగుతుందని నేను భావిస్తున్నా’’ అని ఫజ్లీ పేర్కొన్నట్లుగా వార్తా సంస్థ ఏఎఫ్‌పీ కథనం ప్రచురించింది. కాగా చివరిసారిగా వన్డే వరల్డ్‌కప్-2019లో అఫ్గన్- పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ క్రమంలో వరల్డ్ కప్ సూపర్ లీగ్ సిరీస్ నిర్వహణలో భాగంగా ఈ ఏడాది శ్రీలంకలో ఇరు జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ కోవిడ్ కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అఫ్గన్‌లో సదరు మ్యాచ్ నిర్వహించే దిశగా పాక్ బోర్డుతో చర్చలు జరిపేందుకు ఏసీబీ చైర్మన్ అజీజుల్లా ఫజ్లీ నిర్ణయించాడు. ఇదిలా ఉండగా.. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో సాధారణ ప్రజలు సహా ఎంతో మంది సెలబ్రిటీలు దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల్లో లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్న అఫ్గన్ క్రికెటర్లు సైతం తమ కుటుంబ సభ్యుల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో పర్యటించాల్సిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ తమ టూర్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గన్.. పాక్‌ను తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా కోరడం గమనార్హం. ఇక మెగా ఈవెంట్ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబరు 29న అఫ్గనిస్తాన్- పాకిస్తాన్ ముఖాముఖి తలపడనున్నాయి. చదవండి: Shoaib Akhtar: ‘ముందు టీమిండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్.. వదిలిపెట్టొద్దు’ Ramiz Raja: భరించాం, సహించాం.. మంచి గుణపాఠం చెప్పారు.. కానీ.. -
భరించాం.. సహించాం.. ఇదొక మంచి గుణపాఠం.. కానీ: రమీజ్ రాజా
Ramiz Raja Comments On England and New Zealand Boards: ‘‘ఇంగ్లండ్ పాకిస్తాన్ టూర్‌ను రద్దు చేసుకోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే.. ఇది ముందే ఊహించాం. పాశ్చాత్య దేశాలు ఒకరికొకరు మద్దతుగా నిలిచే క్రమంలో ఇలా చేశాయి’’ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. నిజంగా ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా పర్యటన రద్దు చేసుకుంటే పర్లేదన్న అతడు.. అయితే, అసలు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నారో చెప్పకుండా కివీస్ నిర్ణయం తీసుకోవడం తమ ఆగ్రహానికి కారణమని పేర్కొన్నాడు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పర్యటనకు అంగీకరించిన న్యూజిలాండ్.. తొలి వన్డే(సెప్టెంబరు 17) ప్రారంభానికి కొద్ది గంటల ముందు టూర్ రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరులో పాకిస్తాన్ పర్యటనకు రావాల్సిన తమ పురుష, మహిళా క్రికెట్ జట్లను పంపబోమని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. ఈ విషయంపై స్పందించిన రమీజ్ రాజా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా అనుకున్నట్లుగానే జరిగింది. వాళ్లు పర్యటనకు వస్తామని చెప్పినపుడు అన్ని ఏర్పాట్లు చేశాం. వాళ్ల విజ్ఞప్తి మేరకు అన్ని సౌకర్యాలు అమర్చాం. నిజానికి మేం అక్కడికి వెళ్లినపుడు వాళ్లు పెట్టిన కఠినమైన నిబంధనలు పాటించాం. తక్కువ చేసే విధంగా మాట్లాడినా భరించాం.. సహించాం. అయితే, ఇప్పుడు మాకు మంచి గుణపాఠం చెప్పారు. ఇకపై మేం కూడా మాకు ఆసక్తి ఉంటేనే టూర్లకు వెళ్తాం’’ అని కివీస్, ఇంగ్లండ్ తీరును విమర్శించాడు. కాగా గతేడాది పాకిస్తాన్ కివీస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ పర్యటించిన పాక్ ఆటగాళ్లు క్వారంటైన్ రూల్స్ అతిక్రమించడం వల్ల కోవిడ్ బారిన పడ్డారు. దీంతో.. న్యూజిలాండ్ గట్టిగానే పీసీబీని హెచ్చరించింది. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన రమీజ్ రాజా కివీస్ వ్యవహారశైలి ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని విమర్శలు చేశాడు. అన్నీ అంతే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి? ‘‘మొన్న న్యూజిలాండ్.. ఇప్పుడు ఇంగ్లండ్.. ఆ తర్వాత వెస్టిండీస్, ఆస్ట్రేలియా కూడా ఇదే బాటలో నడుస్తాయేమో.. ఇవన్నీ ఒకే బ్లాక్‌కు చెందినవి. ఎవరికని మేం ఫిర్యాదు చేయగలం? వాళ్లను మా వాళ్లుగా మేం అంగీకరించాం. కానీ వాళ్లు అలా చేయడం లేదు’’ అని రమీజ్ అన్నాడు. అక్కడే చూసుకుంటాం.. ‘‘మా క్రికెట్ బోర్డు ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలని మేం పలు సిరీస్‌లు ఆడాం. కానీ మా ఆటగాళ్ల గౌరవానికి భంగం కలగనివ్వం కదా. ఇతర దేశాలు మా పట్ల ఎందుకో విచిత్ర వైఖరి ప్రదర్శిస్తున్నాయి. ఏదేమైనా ఇదో గుణపాఠం. టీ20 వరల్డ్‌కప్‌లో మా టార్గెట్ ఒక్కటే.. ముందు మా పొరుగుదేశం(టీమిండియా), ఈ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గెలుపు మాదే. మీరు మాకు చేసిన నష్టానికి మైదానంలో బదులు తీర్చుకుంటాం’’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. చదవండి: PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్‌గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ -
‘భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్.. ఇప్పట్లో సాధ్యం కాదు’
లాహోర్: మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సోమవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవీకాలంలో ఉంటారు. ఎహ్సాన్ మని గత నెలలో పీసీబీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకున్నారు. బోర్డు బాధ్యతలు రమీజ్‌కు కొత్తకాదు. 1992 వన్డే వరల్డ్‌కప్ విజేత పాక్ జట్టు సభ్యుడైన ఆయన 2003–2004 వరకు పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 59 ఏళ్ల రమీజ్ ఎన్నికైన వెంటనే భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‌పైనే స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సిరీస్ సాధ్యం కాదని తెలిపారు. చదవండి: Sourav Ganguly: ఆఖరి టెస్టుగానే ఆడదాం.. మరో సిరీస్‌గా అనుమతించం -
పీసీబీ అధ్యక్ష పదవి రేసులో రమీజ్ రజా!
కరాచీ: మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఎహ్సాన్ మనిని కొనసాగించరాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ స్థానంలో తన మాజీ సహచరుడు ఉండాలని ఇమ్రాన్ కోరుకుంటుండటంతో రమీజ్ అవకాశాలు మెరుగయ్యాడు. ఈ ఓపెనర్ పాక్ జట్టు తరఫున 1984 నుంచి 1997 మధ్య కాలంలో 57 టెస్టుల్లో 2833 పరుగులు.. 198 వన్డేల్లో 5851 పరుగులు చేశాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో రమీజ్ సభ్యుడిగా ఉన్నాడు. -
ద్రవిడ్‌కు ఆ విషయాల గురించి పట్టింపు లేదు.. అందుకే
ఇస్లామాబాద్: ‘‘సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ.. నామమాత్రపు మ్యాచ్‌లో కూడా చాలా వరకు జట్లు తమ రెగ్యులర్ ఆటగాళ్లనే ఎంపిక చేసుకుంటాయి. మ్యాచ్ ఓడిపోతామనే భయంతో తుదిజట్టులో కొత్త వాళ్లకు అస్సలు చోటు ఇవ్వరు. వారిని ప్రోత్సహించేందుకు వెనకాడతారు. అయితే, మరి రాహుల్ ద్రవిడ్ వంటి వ్యక్తులు ఉన్నపుడు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది కదా’’ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా టీమిండియా మాజీ ఆటగాడు, ద్వితీయ శ్రేణి జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఒకే మ్యాచ్‌లో ఐదుగురు యువ క్రికెటర్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని కితాబిచ్చాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా శుక్రవారం నాటి చివరిదైన మూడో వన్డేలో ధావన్ సేన ఐదు మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. సంజూ శాంసన్, నితీశ్ రాణా, రాహుల్ చహర్, చేతన్ సకారియా, క్రిష్ణప్ప గౌతం ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టారు. 1980 నాటి ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేయడం తొలిసారి. ఇక నిన్నటి మ్యాచ్‌లో సంజూ 46 పరుగులతో రాణించగా, సకారియా 2, రాహుల్ చహర్ 3, గౌతం 1 వికెట్ తీసి ఆకట్టుకున్నారు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ యాజమాన్యం నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రమీజ్ రజా మాట్లాడుతూ... ‘‘ఒకే మ్యాచ్‌లో ఐదురుగు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా మంచి విషయం. మేనేజ్మెంట్ గొప్ప నిర్ణయం తీసుకుంది. సిరీస్ గెలిచినప్పటికీ మిగతా ఆసియా జట్ల మెంటాలిటీ ఇలా ఉండదు. ఓటమి భయాలతో వెనకడుగు వేస్తారు. కానీ, టీమిండియా అలా ఆలోచించలేదు. ఎందుకంటే ద్రవిడ్‌ది ఒక భిన్నశైలి. గెలుపోటముల గురించి తను లెక్కచేయడు. బెంచ్‌ను మరింత దృఢపరచడమే తనకు తెలిసింది. తన నిర్ణయాలతో భవిష్యత్తులో భారత్‌కు మరింత మంది మెరికల్లాంటి ఆటగాళ్లు దొరకడం ఖాయం’’ అని ద్రవిడ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించాడు. కాగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో భారత్ కైవసం చేసుకుంది. Five players are making their ODI debut for India today – Sanju Samson, Nitish Rana, Rahul Chahar, Chetan Sakariya and K Gowtham 👏#SLvINDpic.twitter.com/q6NYWV4W9N — ICC (@ICC) July 23, 2021 -
WTC: ‘రసవత్తరంగా ఉండాలంటే ప్రత్యేక విండో ఉండాలి’
ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్యూటీసీ) ఈవెంట్ నిర్వహించడానికి ప్రత్యేక విండో ఏర్పాటు చేస్తే బాగుండేదని మాజీ పాకిస్తాన్ క్రికెటర్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డారు. ప్రేక్షకాదరణ పెరగాలంటే నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఆగస్టు, 2019 లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ తర్వాత డబ్యూటీసీ తొలిఎడిషన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ జూన్ 18 నుంచి సౌతాంప్టన్‌లోని అగాస్ బౌల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగనుంది. కాగా, టెస్టు ఫార్మాట్లో మరింత ఆదరణ పెంచడానికి ప్రవేశపెట్టిన డబ్యూటీసీకి మరింత వన్నెతేవాలంటే ప్రత్యేక విండో ఉండాల్సిందేనన్నాడు. భవిష్యత్తులోనైనా ఈ టోర్నమెంట్ కోసం ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని ఐసీసీ పెద్దలకు విన్నవించాడు. "ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పూర్తిగా భిన్నమైన విండోలో నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ, ఆసక్తి పెరగాలంటే సరికొత్త రీతిలో దీన్ని నిర్వహించడం అవసరమని రాజా ఇండియా న్యూస్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ తన అభిప్రాయాన్నివ్యక్తం చేశాడు. టీమిండియా ఫైనల్‌కు చేరినందువల్లే డబ్యూటీసీ ముగింపు రసవత్తరంగా మారిందన్నారు. కాగా, బుధవారం రాత్రి ముంబై నుంచి ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు.. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టు, ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకుని స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌లో ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టింది. చదవండి: గంగూలీ 25 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్.. -
‘హార్దిక్, పొలార్డ్‌ల ఆటలు సాగవు’
కరాచీ: యూఏఈ వేదికగా జరుగనున్న ఈ సీజన్ ఐపీఎల్లో స్పిన్నర్లదే కీలక పాత్ర అని పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మన్, కామెంటేటర్ రమీజ్ రాజా జోస్యం చెప్పాడు. యూఏఈలో బ్యాటింగ్ కంటే స్పిన్‌కే ఎక్కువ అనుకూలమన్నాడు. దాంతో హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ వంటి హార్డ్ హిట్టర్లకు కష్టాలు తప్పవన్నాడు. వీరిద్దరూ ముంబై ఇండియన్స్ ఘనవిజయాల్లో ఇప్పటివరకూ ముఖ్యపాత్ర పోషిస్తూ వస్తున్నప్పటికీ ఈసారి మాత్రం స్పిన్ ఉచ్చులో చిక్కుకుంటారన్నాడు. ‘ ఈ సీజన్లో ఎవరితై స్పిన్ విభాగంలో బలంగా ఉంటారో ఆయా జట్లకే విజయావకాశాలు ఎక్కువ. (చదవండి: పొలార్డ్ గ్యాంగ్‌పై షారుక్ ప్రశంసలు) ఇక్కడ బిగ్ హిట్టర్లకు కష్టలు తప్పవు. పాండ్యా స్పిన్ బాగా ఆడతాడు. పొలార్డ్ కూడా స్పిన్‌ను సమర్థవంతంగా ఆడే ఆటగాడే.. కానీ వీరు స్పిన్ బౌలింగ్‌కు తేలిపోతారు. ఈ ఐపీఎల్ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఫాస్ట్ బౌలింగ్‌కు కూడా పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇక్కడ మనం భిన్నమైన ఆటను చూడటం ఖాయం’ అని రమీజ్ రాజా క్రిక్ కాస్ట్ నిర్వహించిన యూట్యూబ్ షోలో తెలిపాడు. ఇక ప్రేక్షకులు లేకుండా క్లోజ్డ్ డోర్స్‌లో లేకుండా ఆడటం పెద్ద జట్లకు సవాల్‌గా మారనుందన్నాడు. కేకేఆర్, ఆర్సీబీలో తన హోమ్ గ్రౌండ్లో అశేషమైన ప్రేక్షక్షుల మద్దతుతో గత సీజన్లో ఆడినా, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆడాల్సి ఉందన్నాడు. ఇదొక భిన్నమై టాస్క్ అని, తటస్థమైన వేదికల్లో ఎలా ఆడతారనేది ఆసక్తికరమన్నాడు. ఈనెల 19వ తేదీ నుంచి ఐపీఎల్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది.(చదవండి: ‘ఆ గన్ ప్లేయర్‌తో రైనా స్థానాన్ని పూడుస్తాం’) -
నువ్వు కోహ్లి కంటే గొప్ప క్రికెటర్ కావాలంటే..
కరాచీ: టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లి తరహాలో లెజెండ్ బ్యాట్స్‌మన్ అనిపించుకోవాలని ఉందంటూ గతంలో పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ తన మనసులో మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. కోహ్లిలా కావాలని ఉందని, ఆ స్థాయికి చేరాలంటే ఇంకా గేమ్‌పై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందన్నాడు. విరాట్‌కు స్థాయికి చేరువగా వెళ్లాలంటే మిక్కిలి శ్రమించాల్సిందేనని బాబర్ తెలిపాడు. దీనిపై పాక్ దిగ్గజ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యత రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘ కోహ్లిని అధిగమించే అన్ని లక్షణాలు అజామ్‌లో ఉన్నాయి. కోహ్లి కంటే గొప్ప ఆటగాడిగా అయ్యే సామర్థ్యం అజామ్‌లో ఉంది. అయితే కోహ్లిని దాటాలంటే అజామ్ గేమ్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి. పరుగులు చేస్తూ జట్టుకు విజయాలు అందించాలి. ఇక అజామ్ బ్యాటింగ్‌కు దిగిన ప్రతీ సందర్భంలోనూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతే కాకుండా సానుకూల ధోరణి అలవరుచుకోవాలి. అలసత్వాన్ని ఎప్పుడు దరిచేరనీయకూడదు. అటువంటప్పుడే ఒక గొప్ప క్రికెటర్‌గా రూపాంతరం చెందుతావు. (16 ఏళ్లయినా ఆ రికార్డును కొట్టలేకపోయారు) సుదీర్ఘకాలం ఆటను శాసించాలంటే నువ్వు(అజామ్) చాలా ఓర్పుతో గేమ్‌పై ఇంకా ఫోకస్ చేయాలి. అజామ్ పూర్తి స్థాయి ప్రదర్శన బయటకు రావాలంటే ఆకర్షణీయంగా ఉండే వాతావారణం అవసరం. అప్పటివరకూ అజామ్లోని పూర్తిస్థాయి బ్యాటింగ్ బయటకు వస్తుందని నేను అనుకోవడం లేదు. తనను కోహ్లితో పోలికపై ఒకానొక సందర్భంలో అజామ్ మాట్లాడుతూ.. ఒక లెజెండ్ హోదాను సాధించాలని ఉందన్నాడు. కోహ్లి తరహాలో గ్రేట్ బ్యాట్స్‌మన్‌గా ఎదగాలని ఉందన్నాడు. కాగా, కోహ్లితో ఇప్పుడే పోలిక సరికాదన్నాడు. ఇప్పటికే దేశం కోసం కోహ్లి ఎంతో సాధించాడని, అతనితో అప్పుడే పోలిక వద్దన్నాడు. (కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!) -
కోహ్లి పేరుతో పిలవొద్దు: యువ క్రికెటర్
న్యూఢిల్లీ: తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చవద్దని పాకిస్తాన్ యువ బ్యాట్స్‌మన్ హైదర్ అలీ కోరాడు. అభిమానులు తనను పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ పేరుతో పిలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అండర్-19 జట్టు ఓపెనర్ అయిన హైదర్ అలీ పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తాజా సీజన్లో రాణించడంతో అతడిపై మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. హైదర్ అలీలో కోహ్లి, బాబర్ అజామ్‌ల తరహా టాలెంట్ ఉందని.. ఏదొక రోజు అతడు ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడని పొగిడాడు. (కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!) ఈ నేపథ్యంలో హైదర్ అలీ స్పందిస్తూ... ‘తన రోల్ మోడల్స్‌లా అవ్వాలని ఏ బ్యాట్స్‌మన్ అనుకోడు. కానీ తనకు తానుగా మెరుగవుతూ వారిలా షాట్స్ ఆడేందుకు ప్రయత్నించాలి. నాను నేనుగా మెరుగవ్వాలని అనుకుంటున్నాను. కోహ్లి పేరుతో కాకుండా బాబర్ అజామ్ పేరుతో నన్ను పిలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాబర్ మంచి షాట్లు ఆడతాడు. విరాట్ కోహ్లిలా ఉండాలని అనుకోవడం లేదు. కానీ ప్రాక్టీస్ చేసి అతడిలా షాట్లు కొట్టేందుకు మాత్రం ప్రయత్నిస్తాను. నేను హైదర్ అలీని. నేను నాలాగే ఉండేందుకు ఇష్టపడతాను. ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ సందర్భంగా ఒకసారి బాబర్ అజామ్‌ను కలిశాను. బ్యాటింగ్ గురించి కొన్ని మెళకువలు నాకు చెప్పాడు. లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడి నుంచి చాలా నేర్చుకున్నా. పీఎస్ఎల్లోనూ నన్ను అతడు ఎక్కువగా ప్రోత్సహించాడు. పరుగులు సాధించడంపైనే దృష్టి పెట్టు. మిగతా విషయాలు దేవుడికి వదిలేయాలని బాబర్ సూచించాడు’ అని వెల్లడించాడు. (దొంగ నిల్వలు పెట్టుకోవద్దు: అక్తర్) -
కోహ్లిని తలపించే మొనగాడు వచ్చాడు..!
కరాచీ: టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లితో ఎక్కువగా పోల్చిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజామ్. తమకు కోహ్లి లాంటి ఆటగాడు ఉన్నాడంటూ పాకిస్తాన్ క్రికెట్ పెద్దలు, మాజీలు పదే పదే అజామ్‌ను చూసుకుని మురిసిపోవడం మనకు అలవాటే. కానీ ఈ విషయంలో అజామ్ మాత్రం తాను ఎప్పుడూ కోహ్లితో పోల్చుకోలేదు సరికదా.. ఆ పోలిక తేవద్దని చాలాసార్లు విన్నవించాడు. కాకపోతే తాను ఎక్కువగా బ్యాటింగ్‌ను ఆస్వాదించే క్రికెటర్లలో కోహ్లి కూడా ఒకడని అజామ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కాగా, ఇప్పుడు కోహ్లి, అజామ్‌లను తలపించే మొనగాడు వచ్చాడని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రమీజ్ రాజా. ఇప్పటివరకూ అంతర్జాతీయ అరంగేట్రం చేయని 19 ఏళ్ల హైదర్ అలీలో కోహ్లి, అజామ్‌లకు ఏమాత్రం తీసిపోని బ్యాటింగ్ నైపుణ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. (ధోని భవితవ్యంపై గావస్కర్ స్పందన..) పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తాజా సీజన్లో అండర్-19 జట్టు ఓపెనర్ అయిన హైదర్ అలీ రాణించడంతో అతన్ని ఆకాశానికెత్తేశాడు రమీజ్ రాజా. కరోనా వైరస్ విజృంభణ కారణంగా వాయిదా పడ్డ ఈ లీగ్‌లో ఇప్పటివరకూ హైదర్ అలీ 9 మ్యాచ్‌లు ఆడి 239 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రమీజ్ రాజా తన యూట్యూబ్ చానల్లో మాట్లాడుతూ.. హైదర్ అలీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ప్రధానంగా తన కెరీర్లో తొలి పీఎస్ఎల్ ఆడుతున్న హైదర్ అలీలో విశేషమైన టాలెంట్ ఉందంటూ కొనియాడాడు. ఏదొక రోజు వరల్డ్‌లో అందర్నీ హైదర్ వెనక్కినెట్టడం ఖాయమంటూ జోస్యం చెప్పాడు. ‘హైదర్ అలీలో కోహ్లి, బాబర్ అజామ్‌ల తరహా టాలెంట్ ఉంది. అచ్చమైన టెక్నిక్, క్వాలిటీ షాట్లు హైదర్ సొంతం. అతను బ్యాటింగ్‌లో ఎటువంటి లోపాలు లేవు. ఇక పవర్ హిట్టింగ్‌లో హైదర్ చాలా స్ట్రాంగ్. కాకపోతే మ్యాచ్‌పై అవగాహన అవసరం. అదే సమయంలో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడాలి అనే దానిపై దృష్టి సారించాలి. ఈ రెండు తప్పితే హైదర్ అలీలో బ్యాటింగ్‌కు సంబంధించి మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు. కోహ్లి. అజామ్‌ల బ్యాటింగ్‌లో ఎంత సాంకేతికతో ఉందో అంతే సాంకేతికత హైదర్ అలీ బ్యాటింగ్‌లో కూడా ఉంది. కచ్చితంగా ఏదొక రోజు హైదర్ అలీ ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా ఎదుగుతాడు’ అని రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. పీఎస్ఎల్ లీగ్ దశను ముగించుకుని నాకౌట్ దశకు చేరుకున్న తర్వాత వాయిదా పడిన సంగతి తెలిసిందే. -
అలెక్స్ హేల్స్‌కు కరోనా సోకిందా?
లాహోర్ : ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ రమీజ్రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఆడేందుకు వచ్చిన హేల్స్ అతను వెళ్లే ముందు కరోనా లక్షణాలు ఉన్నట్లుగా అనుమానమొచ్చిందని పేర్కొన్నాడు. లాహోర్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్న రమీజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా మంగళవారం జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు పీసీబీ తెలిపింది. 'అలెక్స్ హేల్స్ కు కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో స్పష్టంగా తెలీదు.. కానీ అతను పరీక్షలు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం.మేము కూడా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో పీఎస్ఎల్ను వాయిదా వేసి పీసీబీ మంచి పని చేసింది. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం వ్యర్థమైన పని.. ఇలాగే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించి ఉంటే లీగ్ అట్టర్ఫ్లాఫ్ అయ్యేది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. ఈ సమయంలో లీగ్‌ను వాయిదా వేయడం తప్ప ఇంకో అవకాశం తీసుకోదలచుకోలేదు ' అని రమీజ్ పేర్కొన్నాడు. (కరోనా సోకి యువ కోచ్ మృతి) కాగా పీఎస్ఎల్లో అలెక్స్ హేల్స్ కరాచీ కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు లీగ్ మధ్యలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. లీగ్ నిర్వాహకులు వారందరికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి వారి స్వదేశానికి పంపించింది. ఇదే విషయమై.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీమ్ ఖాన్ మాట్లాడుతూ.. ' లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లలో కొందరు కరోనా బారీన పడ్డారేమోనని మాకు అనుమానంగా ఉంది. కానీ వారి పేర్లు వెల్లడించడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లతో పాటు నిర్వాహకులకు, బ్రాడ్కాస్టర్లకు కోవిడ్ టెస్టులు చేయించామని' తెలిపాడు. కాగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారీన పడి 7వేలకు పైగా మృతి చెందగా, ప్రపంచవ్యాప్తంగా 1, 82,611 కరోనా కేసులు నమోదయ్యాయి. క్వారంటైన్లో నువ్వు.. బయట నేను! -
‘జీవితకాల నిషేధం విధించండి’
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్లో మళ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యత రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు అవినీతికి పాల్పడ్డ పాక్ క్రికెటర్లపై జీవితకాలం నిషేధం విధించేలా పార్లమెంట్లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు విజ్ఞప్తి చేశాడు. గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఫిక్సింగ్ చేయమని తనను కొంతమంది సంప్రదించిన విషయాన్ని పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ దాచి పెట్టాడు. ఇది తాజా విచారణలో తేలడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక నియమావళిలోని ఆర్టికల్ 4.7.1 కింద అతన్ని సస్పెండ్ చేసింది. దీనిపై పూర్తి విచారణ జరిగే వరకూ అక్మల్‌పై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. దీంతో పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ ముగిసే వరకు అక్మల్ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదు. ఈ క్రమంలోనే తాజా పీఎస్ఎల్ను అక్మల్ మిస్సయ్యాడు. (ఇక్కడ చదవండి: అబ్దుల్ రజాక్‌ను ‘అమ్మ’ను చేసేశాడు..!) అయితే ఈ తరహా క్రికెటర్లను అసలు క్రికెట్ ఆడకుండా జీవితకాలం నిషేధం విధించాలని రమీజ్ రాజా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు పార్లమెంట్లో చట్టం చేయాలని ప్రధాని ఇమ్రాన్‌ను కోరాడు. ‘ షార్జిల్, ఖలీద్‌ల ఫిక్సింగ్ వ్యవహారం నిన్ననో-మొన్ననో జరిగినట్లు ఉంది. అది ఇంకా కళ్లు ముందు ఉండగానే మరొక ఫిక్సింగ్ కలకలం. పాకిస్తాన్ క్రికెట్లో ఇలా జరగుతూ ఉండటం నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. మరొకవైపు అసహ్యం కూడా వేస్తోంది. ఇక నుంచి ఫిక్సింగ్ చేసేవాళ్లు జీవిత కాలం నిషేధం విధించేలా చట్టం అవసరముంది. న్యూజిలాండ్ తరహా దేశాల్లో ఫిక్సింగ్ చేస్తే చాలా కాలం వరకూ వారికి అవకాశమే ఉండదు. ఫిక్సింగ్‌లో దోషి అని తేలితే జీవితం కాలం వేటే సరైనది’ రమీజ్రాజా పేర్కొన్నాడు. -
'ద్రవిడ్‌లాంటి కోచ్ అవసరం'
కరాచీ: తమ జూనియర్ స్థాయి జట్లకు భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ తరహా కోచ్‌ల పర్యవేక్షణ చాలా ఉందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా అభిప్రాయపడ్డాడు. ఇక్కడ అండర్-19 క్రికెట్ జట్టు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రమీజ్ సూచించాడు. ఈ విధానాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సైతం అనుసరిస్తే జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లు వస్తారన్నాడు. 'రాహుల్ పర్యవేక్షణలో భారత జూనియర్ క్రికెట్ జట్లు రాటుదేలుతున్నాయి. ఇక్కడ బీసీసీఐని పీసీబీ ఫాలో కావాలి. మంచి అనుభవం కల్గిన ఒక మాజీ టెస్టు ప్లేయర్‌ను పాకిస్తాన్ అండర్-19 కోచ్‌గా నియమించండి. జాతీయ జూనియర్ జట్ల విషయంలో గెలుపు అనేది ముఖ్యం కాదు. అక్కడ వారి వ్యక్తిగత ప్రదర్శనల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా భారత క్రికెట్ జట్టు చాలా లబ్ది పొందిందనే విషయం పీసీబీ గ్రహించాలి. యువ క్రికెటర్లలో ఉన్న టాలెంట్‌ను ద్రవిడ్ బయటకు తీస్తున్నాడు. దాంతో టీమిండియా పటిష్టంగా తయారైంది. మన క్రికెట్ బోర్డు కూడా ద్రవిడ్‌లాంటి కోచ్‌ను అండర్-19 జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరముంది' అన్ని రమీజ్ రాజీ విజ్ఞప్తి చేశాడు. -
అతనొక 'రోగ్' క్రికెటర్!
కరాచీ: మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి సుదీర్ఘ కాలం శిక్షను ఎదుర్కొని జాతీయ జట్టులో పునరాగమనం కోసం చేస్తున్నపాకిస్తాన్ క్రికెటర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రమీజ్ రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రధానంగా సల్మాన్ భట్ తిరిగి పాకిస్తాన్ జాతీయ జట్టులో తిరిగి ఆడటానికి పచ్చజెండా ఊపడాన్ని రమీజ్ నిలదీశాడు. అసలు అతనికి మళ్లీ ఆడే అవకాశాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎందుకు కల్పించాల్సి వచ్చిందంటూ ప్రశ్నించాడు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన వారికి సైతం ఎంతో దయార్ద్ర హృదయంతో శిక్షలు వేస్తున్నారని రమీజ్ చమత్కరించాడు. 'పాకిస్తాన్ క్రికెట్ లో ఫిక్సింగ్ అనేది భాగంగా మారిపోయింది. అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు లేవనే నేను అనుకుంటున్నా. పీఎస్ఎల్ లో ఫిక్సింగ్ కు పాల్పడిన వారిపై సైతం కఠిన చర్యలు లేవు. సల్మాన్ భట్ కు మళ్లీ జాతీయ జట్టులో ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇచ్చినట్లు. అతనొక 'రోగ్' క్రికెటర్. అతని మళ్లీ అవకాశం కల్పించడంతో పీసీబీ ఏమీ చెప్పదలుచుకుంది' అని రమీజ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ గతేడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన భట్, ఆసిఫ్, ఆమిర్ త్రయం జైలు కెళ్లడంతో పాటు ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వీరిలో ఇప్పటికే అమిర్ పాక్ జట్టులో పునరాగమనం చేయగా, ఆసిఫ్ తిరిగి ఆడటానికి కొన్ని నెలల క్రితం పీసీబీ అనుమతినిచ్చింది. -
ధోనికి 'ఏ' గ్రేడ్ ఎందుకు?
లాహోర్: భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 'ఏ' గ్రేడ్ ఎలా కేటాయించారని బీసీసీఐని పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ప్రశ్నించాడు. ధోని లాంగెస్ట్ ఫార్మట్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించనపుడు ఏ గ్రేడ్ లో ఉంచడం సరికాదని అభిప్రాయ పడ్డాడు. పాక్ బోర్డు సైతం షాహిద్ ఆఫ్రిదీకి ఏ గ్రేడ్ ను కట్టబెట్టిందని ఇది టెస్టు ఫార్మట్ కే ముప్పు అన్నాడు. ఆసియా క్రికెట్ బోర్డులు టెస్టు ఫార్మట్ ప్లేయర్లకు గౌరవం ఇవ్వాలని రమీజ్ రాజా సూచించాడు. టీ20లనుంచి టెస్టు ఫార్మట్ ను కాపాడాలన్నాడు. టెస్టుల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఇద్దరి మాజీ కెప్టెన్లకు ఏ గ్రేడ్ ఇవ్వడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వాపోయాడు. ఆసియా బోర్డులు టెస్టు మ్యాచ్ లు నిర్వహించేలా చోరవ తీసుకోవాలన్నాడు. బోర్డులపై ఒత్తిడి ఉండటం సహజమే కానీ టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించాలని సూచించాడు. క్యాష్ రిచ్ టీ20 లీగ్ లతో టెస్టులకు ముప్పు వాటిల్లిందని రాజా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మాజీ సీవోఏ అభ్యర్ది రామచంద్ర గుహా సైతం ధోనికి ఏ గ్రేడ్ కేటాయించడాన్ని తప్పు బట్టిన విషయం తెలిసిందే. -
'అది నిజంగానే అవమానకరం'
కరాచీ:గత కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో భాగంగా రోజర్ ఫెడరర్-రఫెల్ నాదల్ మధ్య జరిగిన ఫైనల్ పోరును పాకిస్తాన్ లో ప్రసారం చేయకపోవడంపై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ రమీజ్ రాజా మండిపడ్డాడు. తమ దేశ కేబుల్ నెట్ వర్క్ ఏ ఛానల్లో కూడా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్ రాకపోవడాన్ని రమీజ్ తీవ్రంగా తప్పుబట్టాడు. 'ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. రోజర్ ఫెడరర్-నాదల్ లైవ్ మ్యాచ్ పాక్ లో రాకపోవడం బాధాకరం. ఆ క్రీడ మనకు స్నేహ పూర్వక క్రీడ కాకపోవచ్చు. కానీ ఒక క్రీడా దేశంగా ఉన్న మనం మరొక క్రీడను కనీసం ఛానెల్ ద్వారా కూడా ప్రమోట్ చేయకపోవడం అవమానకరం' అని రమీజ్ రాజా ధ్వజమెత్తాడు. రమీజ్ కు మరికొంతమంది పాక్ అభిమానులు మద్దతుగా నిలిచారు. పదే పదే సిరీస్‌లను కోల్పోయిన మ్యాచ్‌లను ప్రసారం చేసే పీటీవీ..టెన్నిస్ ను మాత్రం అసలు పట్టించుకోదని హుస్సేన్ అనే ఒక నెటిజన్ విమర్శించాడు. ఇక్కడ మన సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నమనం ఎదుగుదలను కనీసం కోరుకోవడం లేదని హాసన్ అనే మరో నెటిజన్ ఎద్దేవా చేశాడు. హోరాహోరాగా సాగిన ఆ ఫైనల్ పోరులో నాదల్ ను ఫెడరర్ ఓడించి టైటిల్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
వకార్ బహిరంగ క్షమాపణ; సీనియర్ల ఫైర్
కరాచీ: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరాజయానికి బాధ్యత వహిస్తూ కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పడంపై మాజీ కెప్టెన్లు భిన్నంగా స్పందించారు. క్షమాపణ చిన్న విషయమని, ఇప్పటికే ఆలస్యం చేశారని మాజీ కెప్టెన్లు రమీజ్ రాజా, మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు వకార్ క్షమాపణ చెప్పడం బాధ కలిగించిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వకార్ గొప్ప బౌలర్ అని, అతడు క్షమాపణ చెప్పే పరిస్థితి రావడం బాధాకమని పేర్కొన్నాడు. జట్టు ఓటమికి ఒక్కరే బాధ్యులు కారని, పాక్ క్రికెట్ టీమ్ లో చాలా అంశాలు మెరుగుపరచాల్సిన అవసరముందన్నాడు. బోర్డు ఇచ్చిన స్వేచ్ఛను వకార్ ఉపయోగించుకోలేకపోయారని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రమీజ్ రాజా అన్నాడు. మూడేళ్ల నుంచి జట్టు ఆటతీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. కోచ్ గా వకార్ విఫలమయ్యారని విమర్శించారు. జట్టుకు నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా వకార్ క్షమాపణ చెప్పారని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ ధ్వజమెత్తారు. రాహుల్ ద్రావిడ్ ను భారత జూనియర్ టీమ్ కు కోచ్ గా నియమించినట్టుగానే.. పాక్ జూనియర్ టీమ్ కు వకార్ ను కోచ్ నియమించాల్సిందని సూచించారు. పాకిస్థాన్ జట్టును సంస్కరించేందుకు విప్లవాత్మక, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. -
మాజీ క్రికెటర్ల తిట్ల పురాణం!
కరాచీ: సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య నిర్వహించే చర్చా వేదికలే ఎక్కువగా గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుంటాయి. తమ ఆధిపత్య పోరును నిలుపుకునేందుకు వారు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అయితే క్రికెట్ విశ్లేషణ సందర్భంగా ఆటగాళ్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్న ఘటనలు చాలా అరుదు. ఈ తరహా ఘటన తాజాగా పాకిస్తాన్ క్రికెట్ లో కలకలం రేపింది. ఇద్దరు ప్రముఖ మాజీ క్రికెటర్ల మధ్య నిర్వహించిన టెలివిజన్ డిబేట్ కాస్తా వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. ఇందుకు మహ్మద్ యూసఫ్, రమీజ్ రాజాలు వేదికగా నిలిచారు. ఎవరైతే గడ్డం పెంచుకుంటారో వారు అబద్ధాలు దూరంగా ఉండాలంటూ వ్యంగ్యంగా మాట్లాడి తొలుత వివాదానికి తెరలేపాడు రమీజ్ రాజా. దీనిపై తీవ్రంగా స్పందించిన యూసఫ్.. 'సిగ్గుమాలిన పనులు చేసేవారే నీలా అర్థంలేకుండా మట్లాడతారు. నీకు క్రికెట్ ఆడే సామర్థ్యమే లేదు. నువ్వు ఒక మాటకారివి. మరోసారి అదే మాటలతో మాయ చేస్తున్నావు. గడ్డాన్ని పెంచుకోవడానికి నువ్వు అర్హుడవే కావు. నువ్వు పాకిస్తాన్ క్రికెట్ లో ఉద్ధరించిందేమీ లేదు. 57 టెస్టుల్లో రెండు సెంచరీలు మాత్రమే చేశావు. అసలు ప్రముఖ క్రికెటర్ ఎలా అయ్యావో అనేది మరోసారి చూడాలనుకుంటున్నా. నీలాంటి వాళ్లు క్రికెట్ గురించి మాట్లాడకూడదు. నువ్వొక ఇంగ్లిష్ టీచర్‌వి మాత్రమే. అంతకుమించి నీకు తెల్సిందేమీ లేదు' అని యూసఫ్ విమర్శలకు దిగాడు. 'నువ్వు ఏమీ మాట్లాడినా ఫర్వాలేదు.. కానీ నువ్వు క్రికెట్ లో చీడ పురుగు మాదిరి తయారయ్యావు 'అని రమీజ్ బదులిచ్చాడు. అవును నాకు క్రికెటే సర్వస్వం. నాకు అది తప్ప ఇంకోటి తెలీదు. ఆ పని నీ వల్ల కాదు ' అని యూసఫ్ మరోసారి ఎదురుదాడి చేశాడు. వీరి వ్యక్తిగత దూషణల పర్వం తారాస్థాయికి చేరడంతో యాంకర్ కల్పించుకుని సర్దిచెప్పే యత్నం చేసి వారిద్దరి పంపించి వేశాడు. దీంతో ఆ డిబేట్ అర్థాంతరంగా ముగియక తప్పలేదు. -
ఐసీసీ ఆంతర్యమేమిటో?
కరాచీ: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో్ భాగంగా చివరి రెండు వన్డేలకు పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్కి పిలవడంపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ రమీజ్ రాజా ఆశ్యర్యం వ్యక్తం చేశాడు. అసలు అలీమ్ దార్ ను ఎందుకు తప్పించారో తనకు తెలియడం లేదన్నాడు. ఒకవేళ భద్రతాపరమైన కారణాలు ఉంటే భారత్ క్రికెట్ బోర్డును అదనపు సెక్యూరిటీ అడిగితే సరిపోయేదని రమీజ్ తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆంతర్యం ఏమిటన్నది గందరగోళంగానే ఉందన్నాడు. గత సోమవారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ముట్టడించిన నేపథ్యంలో ఆ దేశ అంపైర్ అలీమ్ దార్ ను ఐసీసీ వెనక్క పిలిచిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా అంపైర్ అలీమ్ ను తప్పించడం.. ఆపై వసీం అక్రమ్ , షోయబ్ అక్తర్ లు కూడా ఇంటిముఖం పట్టారు. దీనిలో భాగంగా అలీమ్ దార్ స్థానంలో భారత్ కు చెందిన సుందరన్ రవిని చివరి రెండు వన్డేలకు అంపైర్ గా నియమించారు.