డేవిడ్ వార్నర్‌తో బాబర్ ఆజం (PC: ICC)
‘‘ఒక్క క్యాచ్ జారవిడిచినందుకు మరీ ఇంత ఘోరంగా శిక్షించడం నేనిదే తొలిసారి చూస్తున్నా. చాలా మంది చాలా సార్లు క్యాచ్‌లు డ్రాప్ చేస్తారు. కానీ.. అలా ఫీల్డర్ తప్పిదం కారణంగా దొరికిన లైఫ్ ద్వారా 150- 160 పరుగులు స్కోరు చేయడమంటే మాటలు కాదు.
పాకిస్తాన్‌కు ఇదొక మేలుకొలుపు లాంటిది. క్యాచ్‌లు మిస్ చేసినంత కాలం ఇలాంటి పనిష్మెంట్లు పునరావృతమవుతూనే ఉంటాయి. ఒక్కసారి లయ తప్పితే తిరిగి కోలుకోవడం కష్టం’’ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా బాబర్ ఆజం బృందానికి చురకలు అంటించాడు.
నెలరోజుల క్రితం వరకు వరల్డ్‌క్లాస్ బౌలింగ్ దళం కలిగి ఉన్న జట్టుగా నీరజనాలు అందుకున్న టీమ్ ఏకంగా 365 పరుగులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకోకపోతే ఇంతకంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించాడు.
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ చిత్తైన విషయం తెలిసిందే. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121)ల అద్భుత ప్రదర్శనతో ఆసీస్ భారీ స్కోరు చేసి గెలుపొందగా.. పాక్‌కు పరాభవం తప్పలేదు.
నిజానికి ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే వార్నర్‌ను అవుట్ చేసే సువర్ణావకాశాన్ని పాక్ చేజార్చుకుంది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను ఉసామా మిర్ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
ఆ తర్వాత మరోసారి ఇదే తరహాలో లైఫ్ పొందిన వార్నర్ ఏకంగా 163 పరుగులు స్కోరు చేశాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఒక తప్పునకు వార్నర్ ఇంతలా పనిష్ చేస్తాడని ఇకనైనా లోపాలు సరిచేసుకోవాలని హితవు పలికాడు. ఇక తదుపరి మ్యాచ్‌లో పాక్ అఫ్గన్‌తో తలపడనున్న నేపథ్యంలో.. ‘‘చెన్నైలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ అంత ఈజీ కాదు. పాకిస్తాన్ బ్యాటర్లు స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కోలేరు. ఏం జరుగుతుందో చూడాలి’’ అని మాజీ బ్యాటర్ రమీజ్ రాజా నిట్టూర్చాడు.
చదవండి: WC 2023: సన్‌రైజర్స్‌కు ఆడినపుడు చాలా నేర్చుకున్నా: వార్నర్
Comments
Please login to add a commentAdd a comment