Shaheen Afridi
-
'బాబర్, అఫ్రిది కాదు.. వారిద్దరితోనే టీమిండియాకు డేంజర్'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19న మొదలు కానున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ టోర్నీలో అందరి దృష్టి మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది.ఫిబ్రవరి 23న దుబాయ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటివరకు పాకిస్తాన్‌పై భారత్ పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. కానీ 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం టీమిండియాను పాక్ కంగుతిన్పించింది. 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి పాక్ ఛాంపియన్‌గా నిలిచింది.దీంతో ఈసారి పాక్‌ను చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ మ్యాచ్‌లో పాక్‌కు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ నసీమ్ షా ఎక్స్ఫ్యాక్టర్గా మారనున్నారని అమీర్ జోస్యం చెప్పాడు.భారత్-పాక్ మ్యాచ్ కోసం నేను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాకు మహ్మద్ రిజ్వాన్ నుంచి ముప్పు పొంచి ఉంది. అతడు మరోసారి పాక్‌కు కీలకంగా మారనున్నాడు. ఈ ఐసీసీ ఈవెంట్లలో భారత్‌పై అతడికి మంచి రికార్డు ఉంది. అదేవిధంగా నసీమ్ షా కూడా పాక్‌కు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారుతాడని నేను భావిస్తున్నాను. నసీమ్ ఇటీవల కాలంలో అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. అతడిని ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడవచ్చు. గతేడాది వరకు షాహీన్ అఫ్రిది నుంచి భారత జట్టుకు గట్టి సవాలు ఎదరయ్యేది. పాక్ జట్టులో బెస్ట్ బౌలర్ అంటే నేను కూడా అఫ్రిది పేరునే చెప్పేవాడిని. అతడు 145 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసే వాడు. బంతిని కూడా అద్భుతంగా స్వింగ్ చేసేవాడు. కానీ మోకాలి గాయం తర్వాత అతడు తన పేస్‌ను కోల్పోయాడు. 135 కి.మీ మించి బౌలింగ్ చేయలేకపోతున్నాడు. బంతి కూడా స్వింగ్ కావడం లేదు అని టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ పేర్కొన్నాడు.కాగా పాక్ స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది పేర్లను అమీర్ చెప్పకపోవడం గమనార్హం. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా పాక్ నిలివడంలో అమీర్‌ది కీలక పాత్ర. ఫైనల్లో అమీర్ 3 కీలక వికెట్లు పడగొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. -
సౌతాఫ్రికా ప్లేయర్ల పట్ల పాక్ ఆటగాళ్ల దురుసు ప్రవర్తన.. మొట్టికాయలు వేసిన ఐసీసీ
స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారు. సౌతాఫ్రికాతో నిన్న (ఫిబ్రవరి 12) జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది (Shaheen Afridi), సౌద్ షకీల్ (Saud Shakeel), కమ్రాన్ గులామ్ (Kamran Ghulam) తమ పరిధులు దాటి ప్రవర్తించారు. ఫలితంగా ఐసీసీ (ICC) ఈ ముగ్గురికి మొట్టికాయలు వేసింది. అఫ్రిది మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం.. షకీల్, గులామ్ మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించింది. అలాగే ఈ ముగ్గురికి తలో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 28వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించిన సౌతాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కీను షాహీన్ అఫ్రిది ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అఫ్రిది.. బ్రీట్జ్కీను కొట్టేస్తా అన్నట్లు చూశాడు. అతని మీదిమీదికి వెళ్లాడు. అఫ్రిది ఓవరాక్షన్‌ను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ ఆర్టికల్ 2.12 ఉల్లంఘణ కింద చర్యలు తీసుకుంది.ఆ మరుసటి ఓవర్లోనే (29వ ఓవర్) సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను రనౌట్ చేసిన ఆనందంలో సౌద్ షకీల్, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కమ్రాన్ గులామ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఔటైన బాధలో వెళ్తున్న బవుమా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గెటౌట్ అన్నట్లు రియాక్షన్ ఇచ్చారు. షకీల్, గులామ్‌ల ఓవరాక్షన్‌ను ఫీల్డ్ అంపైర్లే తప్పుబట్టారు. ఈ విషయమై వారి కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్‌కు కంప్లైంట్ చేశారు. ఐసీసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని షకీల్, గులామ్‌కు అక్షింతలు వేసింది.కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఊదేసింది. పాక్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బవుమా (82), బ్రీట్జ్కీ (83), క్లాసెన్ (87) అర్ద సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 352 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. మొహమ్మద్ రిజ్వాన్ (122 నాటౌట్), సల్మాన్ అఘా (134) సెంచరీలతో కదంతొక్కడంతో 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో పాక్ ముక్కోణపు సిరీస్‌లో ఫైనల్‌కు చేరింది. రేపు (ఫిబ్రవరి 14) జరుగబోయే ఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. -
పాక్ బౌలర్లకు చుక్కలు.. ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీ! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాలను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీకి ముందు న్యూజిలాండ్-పాకిస్తాన్-దక్షిణాఫ్రికా జట్లు ట్రైసిరీస్‌లో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా లహోర్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు జూలు విధిల్చారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫిలిప్స్.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదినైతే ఫిలిప్స్ ఓ ఆట ఆడేసికున్నాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో ఈ కీవీ స్టార్.. రెండు సిక్స్‌లు, రెండు ఫోర్ల సాయం(Wd Wd 4 6 6 2 4 1) సాయంతో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే తొలి వన్డే సెంచరీని ఫిలిప్స్ అందుకున్నాడు. ఆఖరి వరకు అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్‌గా 74 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్.. 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డార్లీ మిచెల్(81), కేన్ విలియమ్సన్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ సాధించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్ రెండు, రౌఫ్ ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లుపాకిస్తాన్: ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ఖుష్దిల్ షా, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, బెన్ సియర్స్, విలియం ఒరోర్కేచదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధానిGLENN PHILIPS SHOW AT LAHORE....!!- Philips smashed Hundred from just 72 balls against Pakistan in Pakistan 🔥⚡ pic.twitter.com/YnGqsULtsL— Johns. (@CricCrazyJohns) February 8, 2025 -
షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు..
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 11 పరుగుల తేడాతో పాకిస్తాన్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినప్పటకి ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ పీటర్‌ను ఔట్ చేయడంతో అఫ్రిది వందో టీ20 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఈ పాకిస్తానీ స్పీడ్ స్టార్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆల్ ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో ప్లేయర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. అఫ్రిది ఇప్పటివరకు టెస్టుల్లో 116 వికెట్లు పడగొట్టగా.. వన్డేల్లో 112, టీ20ల్లో 100 వికెట్లు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ అగ్రస్ధానంలో ఉన్నాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ కూడా అఫ్రిదినే కావడం గమనార్హం.👉మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌలర్లు వీరేబౌలర్టెస్టు వికెట్లువన్డే వికెట్లుటీ20 వికెట్లుటిమ్ సౌథీ(న్యూజిలాండ్)389221164షకీబ్ అల్హసన్(బంగ్లాదేశ్)246317149లసిత్ మలింగ(శ్రీలంక)101338107షాహీన్ అఫ్రిది(పాక్)116112100 -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది రీ ఎంట్రీ
సౌతాఫ్రికాలో పాకిస్తాన్ పర్యటన ఇవాల్టి (డిసెంబర్ 10) నుంచి మొదలవుతుంది. డర్బన్ వేదికగా ఇరు జట్లు ఇవాళ తొలి టీ20లో తలపడతాయి. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును కాసేపటి కిందే ప్రకటించారు. జింబాబ్వే టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు.జింబాబ్వే టీ20 సిరీస్ పాక్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు. గత కొన్ని సిరీస్‌లుగా అఘా దారుణంగా విఫలమవుతున్నాడు. జింబాబ్వే పర్యటనలో రాణించిన తయ్యబ్ తాహిర్ మిడిలార్డర్లో కీలకపాత్ర పోషించనున్నాడు. మిడిలార్డర్లో ఉస్మాన్ ఖాన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు.సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది సందిగ్దంగా మారింది. జింబాబ్వే పర్యటనలో సత్తా చాటిన సైమ్ అయూబ్‌ను ఓపెనర్‌గా పంపిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తూ ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు.అబ్బాస్ అఫ్రిదితో పాటు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ పేస్ విభాగంలో ఉంటారు. స్పిన్నర్లు సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగనున్నారు. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. సౌతాఫ్రికాతో తొలి టీ20కి పాక్ తుది జట్టు..మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్‌కీపర్), బాబర్ ఆజమ్, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్, తయ్యబ్ తాహిర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మొహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, సూఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ -
సౌతాఫ్రికా టూర్‌కు పాక్ జట్టు ప్రకటన: బాబర్ రీ ఎంట్రీ! అతడికి నో ఛాన్స్
సౌతాఫ్రికా పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు టీమ్‌లలోనూ చోటు దక్కించుకోగా.. టెస్టు జట్టులో ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిది పేరు మాత్రం లేదు.కాగా మూడు వన్డే, మూడు టీ20, రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. డిసెంబరు 10న తొలి టీ20తో ఈ టూర్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో పీసీబీ బుధవారం ఈ సిరీస్‌లకు సంబంధించి మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది.టెస్టులలో బాబర్ పునరాగమనం.. అతడికి మాత్రం చోటు లేదుటెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు మహ్మద్ రిజ్వాన్ సారథ్యం వహించనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మూడు జట్లలో స్థానం సంపాదించాడు. కాగా ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై తొలి టెస్టులో విఫలమైన తర్వాత.. మిగిలిన రెండు టెస్టులు ఆడకుండా బాబర్‌పై వేటు పడింది. అతడితో పాటు షాహిన్నూ తప్పించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. యువ పేసర్ నసీం షా కేవలం టెస్టు, వన్డేలు మాత్రమే ఆడనున్నాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది టీ20, వన్డేలు మాత్రమే ఆడి.. టెస్టులకు దూరంగా ఉండనున్నాడు.తప్పించారా? రెస్ట్ ఇచ్చారా?వచ్చే ఏడాది సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో షాహిన్‌కు పీసీబీ ఈ మేర పనిభారం తగ్గించి.. విశ్రాంతినివ్వాలని నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల క్వైద్-ఇ-ఆజం ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో 31 వికెట్లతో సత్తా చాటిన రైటార్మ్ సీమర్ మహ్మద్ అబ్బాస్ దాదాపు మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు.తొలిసారి వన్డే జట్టుకు సూఫియాన్ ఎంపికఅదే విధంగా.. ఖుర్రం షెహజాద్, మీర్ హంజా కూడా టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. షాజిద్ ఖాన్ మాత్రం మిస్సయ్యాడు. అతడి స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌గా నొమన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక లెగ్ స్పిన్నర్ సూఫియాన్ మోకీం తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య డిసెంబరు 10, 13, 14 తేదీల్లో టీ20... డిసెంబరు 17, 19, 22 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. అదే విధంగా.. డిసెంబరు 26 నుంచి జనవరి 7 వరకు టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది.సౌతాఫ్రికాతో టెస్టులకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, నొమన్ అలీ, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.సౌతాఫ్రికాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సుఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).సౌతాఫ్రికాతో టీ20లకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, హరీస్ రవూఫ్, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, షాహిన్ షా ఆఫ్రిది, సూఫియాన్ మోకీం, తయ్యబ్ తాహిర్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి -
అగ్రస్థానాల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అఫ్రిది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అఫ్రిది 12.62 సగటున ఎనిమిది వికెట్లు తీశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిది మూడు స్థానాలు ఎగబాకగా.. టాప్ ప్లేస్‌లో ఉండిన కేశవ్ మహారాజ్ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిదితో పాటు అతని సహచరుడు హరీస్ రౌఫ్ కూడా భారీగా లబ్ది పొందాడు. ఆసీస్‌పై సంచలన ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు) అనంతరం రౌఫ్ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్తానానికి ఎగబకాడు. అలాగే మరో పాక్ బౌలర్ నసీం షా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. నసీం 14 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ (4), జస్ప్రీత్ బుమ్రా (6), మొహమ్మద్ సిరాజ్ (7) టాప్-10లో ఉన్నారు.బ్యాటింగ్ విషయానికొస్తే.. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్ 80 పరుగులు చేసి రెండు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్ అఫ్రిది టాప్ ప్లేస్‌కు చేరడంతో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పాక్ ఆటగాళ్లే అగ్రస్థానాలను ఆక్రమించినట్లైంది. తాజా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాక్ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 11 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 98 పరుగులు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 44వ స్థానానికి చేరాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచారు.ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ నబీ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. జింబాబ్వే సికందర్ రజా రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహిది హసన్ మీరాజ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్ నుంచి రవీంద్ర జడేజా 14వ స్థానంలో ఉన్నాడు. -
నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పాక్ బౌలర్ల దాటికి 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. షాహీన్ షా అఫ్రిది, నసీం షా తలా మూడు వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించగా, హారిస్ రౌఫ్ రెండు, హస్నన్ ఒక వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ సీన్ అబాట్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు రెగ్యూలర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్ అందుబాటులో లేరు. వీరిందరూ భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి ఈ ఆఖరి వన్డేకు దూరమయ్యారు. కాగా ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే సిరీస్ వారి వశమవుతుంది.చదవండి: CK Nayudu Trophy: ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో Congratulations to pakistan winning series against australia.All World class field. Most hyped team Australia in the world 😁 #PAKvsAUSpic.twitter.com/AiwacybfvT— JassPreet (@JassPreet96) November 10, 2024 -
PAK VS AUS: భారీ రికార్డుపై కన్నేసిన షాహీన్ అఫ్రిది
ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో అఫ్రిది మరో 12 వికెట్లు తీస్తే.. పాకిస్తాన్ ఆల్‌టైమ్ గేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొడతాడు. వకార్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) ఆస్ట్రేలియాపై 59 వికెట్లు పడగొట్టగా.. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో 48 వికెట్లు ఉన్నాయి. ఆసీస్‌పై వకార్ ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. షాహీన్ కూడా ఓ సారి ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ ఇవాళ తొలి వన్డే ఆడింది. ఈ పర్యటనలో పాక్ మరో రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లో షాహీన్ మరో 12 వికెట్లు పడగొట్టే అవకాశాలు లేకపోలేదు. ఈ పర్యటనలోనే షాహీన్ వకార్ యూనిస్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.షాహీన్ ఆల్‌రౌండ్ షోమెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (నవంబర్ 4) జరిగిన తొలి వన్డేలో షాహీన్ అఫ్రిది ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో షాహీన్ బ్యాట్‌తో, బంతితో రాణించినా పాక్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది.నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్, జంపా, అబాట్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (32 నాటౌట్) ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. -
Aus vs Pak: ఆసీస్‌తో వన్డే.. దంచికొట్టిన షాహిన్ ఆఫ్రిది, నసీం షా.. కానీ..
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. కంగారూ పేసర్ల విజృంభణ ముందు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో టెయిలెండర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా దంచికొట్టడంతో పర్యాటక జట్టు రెండు వందల మార్కును దాటగలిగింది.ఆస్ట్రేలియా పర్యటనలోకాగా వరుస ఓటముల అనంతరం పాక్ జట్టు ఇటీవలే ఫామ్‌లోకి వచ్చింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచి పునరుత్తేజం పొందింది. అనంతరం.. మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఇక ఈ టూర్‌తో మహ్మద్ రిజ్వాన్ పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు.ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య సోమవారం నాటి తొలి వన్డేకు మెల్బోర్న్ వేదికైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ పాక్ ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(1), అబ్దుల్ షఫీక్(12)లను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపాడు.బాబర్, రిజ్వాన్ నామమాత్రంగానే..అయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(37).. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(44)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, బాబర్‌ను అవుట్ చేసి ఆడం జంపా ఈ జోడీని విడదీయగా.. రిజ్వాన్ వికెట్‌ను మార్నస్ లబుషేన్ దక్కించుకున్నాడు.మిగతా వాళ్లలో కమ్రాన్ గులామ్(5), ఆఘా సల్మాన్(12) పూర్తిగా విఫలం కాగా.. ఇర్ఫాన్ ఖాన్ 22 పరుగులు చేయగలిగాడు. ఇలా స్పెషలిస్టు బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా బ్యాట్ ఝులిపించారు.షాహిన్ ధనాధన్.. నసీం సూపర్గాషాహిన్ 19 బంతుల్లోనే 24 రన్స్(3 ఫోర్లు, ఒక సిక్సర్) చేయగా.. నసీం షా ఆడిన కాసేపు సిక్సర్లతో అలరించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 40 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లు ఉండటం విశేషం. ఈ క్రమంలో పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 203 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్లు స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ కమిన్స్ రెండు, సీన్ అబాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. స్పిన్నర్లు ఆడం జంపా రెండు, లబుషేన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Starc gets the ball rolling! #AUSvPAK pic.twitter.com/CYXcVECkj1— cricket.com.au (@cricketcomau) November 4, 2024 ఇదిలా ఉంటే.. నసీం షా ఇన్నింగ్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై ఇలాంటి షాట్లు బాదడం మామూలు విషయం కాదంటూ కొనియాడుతున్నారు. ఇక పాక్ జట్టు ఫ్యాన్స్ అయితే.. నసీం కాబోయే సూపర్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. బాబర్ ఆజం, రిజ్వాన్ వంటి వాళ్లు నసీంను చూసి నేర్చుకోవాలంటూ వీరిద్దరి వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. Babar and Rizwan should learn something from Naseem Shah. #PAKvsAUS pic.twitter.com/Hd7BhgtAMa— Humza Sheikh (@Sheikhhumza49) November 4, 2024 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ తొలి వన్డే- మెల్బోర్న్తుదిజట్లుఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అవుట్.. జట్టులో నో ఛాన్స్! అయినా..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యవహారశైలి పట్ల ఆ దేశ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించారని.. తనకు మాత్రమే నిబంధనలు వర్తింపజేస్తూ వేటు వేశారని బోర్డు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనను ఎంతగా అణగదొక్కాలని చూసినా ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తి మాత్రం లేదని అతడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా 2024–25 ఏడాది కోసం పీసీబీ ఆదివారం వార్షిక కాంట్రాక్టు వివరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని ‘ఎ’ కేటగిరి నుంచి తొలగించి ‘బి’ కేటగిరీలో వేయడం సహా.. సీనియర్ ప్లేయర్లు ఫఖర్ జమాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, ఒసామా మీర్‌లను ఈ జాబితా నుంచి తొలగించింది. ఇక పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ‘బి’ కేటగిరీలోనే కొనసాగించింది. అంతేకాదు.. గత ఏడాది 27 మందికి వార్షిక కాంట్రాక్టు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్యను 25కు కుదించింది. ఇందులో ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి అవకాశం దక్కింది. కొత్త కెప్టెన్ రిజ్వాన్, మాజీ సారథి బాబర్ ఆజమ్‌లు ‘ఎ’ కేటగిరీలో ఉండగా... షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, షాన్ మసూద్‌లకు ‘బి’ కేటగిరీలో చోటు ఇచ్చింది. ఇక ‘సి’ కేటగిరీలో 9 మంది, ‘డి’ కేటగిరీలో 11 మంది ఉన్నారు. కేటగిరీలను బట్టి ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు అందనున్నాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న జట్టులోనూ ఫఖర్ జమాన్‌కు చోటు దక్కలేదు. బాబర్ ఆజం విషయంలో బోర్డును నిందించడం సహా ఫిట్నెస్ లేమి కారణంగా అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ ఆదివారం వెల్లడించాడు.ఈ పరిణామాల నేపథ్యంలో ఫఖర్ జమాన్ తీవ్ర నిరాశకు లోనైనట్లు అతడి సన్నిహిత వర్గాలు పాక్ మీడియాకు తెలిపాయి. ‘‘అతడు చాలా బాధపడుతున్నాడు. ఫిట్నెస్ టెస్టుల విషయంలో తన పట్ల వివక్ష చూపారని వాపోయాడు. క్లియరెన్స్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్ పాటించారన్నాడు. రెండు కిలోమీటర్ల పరుగు విషయంలో తనతో పాటు సరైన సమయంలో పూర్తి చేయనివాళ్లకు జట్టులో చోటిచ్చి.. తనను మాత్రం విస్మరించారని ఆవేదన చెందాడు.అసలు తన పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని సెలక్టర్లను కోరినా ఫలితం లేకుండా పోయింది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలి టెస్టు అనంతరం బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేసిన పీసీబీ.. రెండు, మూడో టెస్టు నుంచి వారిని తప్పించింది.ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఫఖర్ జమాన్ స్పందిస్తూ పీసీబీ తీరును సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని బోర్డు అతడిపై కన్నెర్రజేసింది. ఈ క్రమంలోనే అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడం సహా.. ఆసీస్ టూర్‌కు దూరం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పాక్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ ఫఖర్ జమాన్. ఇప్పటి వరకు 82 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3492 పరుగులు చేశాడు. ఇందులో పదకొండు శతకాలు ఉన్నాయి.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్‌కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్‌పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్‌లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్‌లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిదిపై వేటు
ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండు, మూడు టెస్ట్‌ల కోసం పాకిస్తాన్ జట్టును ఇవాళ (అక్టోబర్ 13) ప్రకటించారు. ఈ జట్టు నుంచి సీనియర్లు బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. విశ్రాంతి పేరుతో వీరందరిని పక్కకు పెట్టారు. డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్ అహ్మద్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గులామ్, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ పాక్ జట్టుకు ఎంపికయ్యారు. తొలి టెస్ట్ కోసం తొలుత ఎంపికై, ఆతర్వాత రిలీజ్ చేయబడిన నౌమన్ అలీ, జహిద్ మెహమూద్ మరోసారి ఎంపికయ్యారు. 16 మంది సభ్యుల ఈ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సౌద్ షకీల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. పాక్ సెలెక్షన్ ప్యానెల్లోకి కొత్తగా అలీమ్ దార్, ఆకిబ్ జావిద్, అజహార్ అలీ చేరిన విషయం తెలిసిందే. వీరి బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్లపై వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా , జాహిద్ మెహమూద్.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. జో రూట్ డబుల్ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్ (823/7 డిక్లేర్) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్ (63), ఆమెర్ జమాల్ (55 నాటౌట్) పాక్ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.చదవండి: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ -
Pak Vs Eng: పాక్ తుదిజట్టు ఇదే.. సూపర్ స్టార్ రీఎంట్రీ
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తమ తుదిజట్టును ప్రకటించింది. ముల్తాన్ మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లను ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు దూరమైన స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు షాహిన్ ఆఫ్రిది ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. అమీర్ జమాల్ సైతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆమీర్బంగ్లాదేశ్తో ఇటీవలి టెస్టులకు ఎంపికైనప్పటికీ ఆమీర్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు ఫిట్‌గా ఉండటం సానుకూలాంశంగా మారనుంది. కాగా దాదాపు ఏడాది క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా ఆమీర్ జమాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఆ సిరీస్‌లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు.ఆ ముగ్గురూ అవుట్అంతేకాదు.. సిడ్నీ టెస్టులో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి 82 పరుగులు కూడా సాధించాడు. ఇక పేస్ దళంలో షాహిన్, ఆమీర్‌తో పాటు నసీం షా కూడా చోటు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భాగమైన ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ, మీర్ హంజాలను ఈసారి యాజమాన్యం పక్కనపెట్టింది.వారి విషయంలో ఎలాంటి మార్పులు లేవుఇక యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కూడా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తుదిజట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడిన టాప్-7 బ్యాటర్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సైతం ఇప్పటికే పాక్‌తో తొలి టెస్టుకు తమ తుదిజట్టును ప్రకటించిది. కెప్టెన్ బెన్ స్టోక్స్ తొడకండరాల నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య అక్టోబరు 7ను ముల్తాన్ వేదికగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. రెండో టెస్టుకు కూడా ముల్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఆఖరి మ్యాచ్ రావల్పిండిలో జరుగనుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎనిమిది, ఇంగ్లండ్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి. టాప్‌లో టీమిండియా కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా రెండు, శ్రీలంక మూడో స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుపాకిస్తాన్సయీమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా, అమీర్ జమాల్, షాహిన్ షా అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్.చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
బాబర్ రాజీనామాకు కారణం అతడే!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి బాబర్ ఆజం రాజీనామా వెనుక హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. తన పట్ల కోచ్ వ్యవహరించిన తీరుకు నొచ్చుకున్న అతడు.. బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. జట్టు వైఫల్యాలకు తనొక్కడినే బాధ్యుడిని చేస్తూ.. తప్పంతా తన మీదకు వచ్చేలా కిర్‌స్టన్ నివేదిక రూపొందించడం పట్ల అతడు మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.కాగా పాక్ క్రికెట్ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజం వైదొలిగిన విషయం తెలిసిందే. తాను సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి, టీమ్ మేనేజ్మెంట్కు గతంలోనే సమాచారం అందించినట్లు బాబర్ చెప్పాడు.ఈ రాజీనామా తర్వాత‘పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. అయితే అసలు బాధ్యత బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. నాయకత్వం కారణంగా నాపై అదనపు భారం పడుతోంది. నా ఆటను మరింతగా ఆస్వాదిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంతో పాటు కుటుంబానికి తగినంత సమయం కేటాయించడం కూడా అవసరం.ఈ రాజీనామా తర్వాత నా శక్తియుక్తులన్నీ బ్యాటింగ్‌పైనే కేంద్రీకరించగలను. నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. జట్టుకు ఒక ఆటగాడిగా అన్ని విధాలా ఉపయోగపడేందుకు నేను సిద్ధం’ అని బాబర్ ఆజమ్ ఒక ప్రకటన విడుదల చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాక్ సెమీస్ కూడా చేరకపోవడంతో బాబర్ నైతిక బాధ్యత వహిస్తూ.. ఆ టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వదలుకున్నాడు. అయితే, టీ20 ప్రపంచకప్-2024కు ముందు అతడినే సారథిగా నియమించింది పీసీబీ. ఈసారి మరీఘోరమైన ప్రదర్శనతో బాబర్ బృందం విమర్శలు మూటగట్టుకుంది. పసికూన అమెరికా జట్టు చేతిలో ఓడి.. సూపర్-8కు కూడా అర్హత సాధించలేకపోయింది.అందుకే ఈ నిర్ణయంఈ నేపథ్యంలో కోచ్ కిర్‌స్టన్ పీసీబీకి ఇచ్చిన నివేదికలో బాబర్ ఆజంనే కారకుడిగా పేర్కొన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అసిస్టెంట్ కోచ్ అజర్ మహ్మూద్ సైతం బాబర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంతో.. ఇక తాను కెప్టెన్‌గా ఉండకూడదని బాబర్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాయి. ఇక బాబర్ ఆజం రాజీనామాను ఆమోదించిన పీసీబీ త్వరలోనే కొత్త కెప్టెన్‌ను నియమించనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది పేర్లు వన్డే, టీ20 కెప్టెన్సీ రేసులో వినిపించగా.. బోర్డు అనూహ్యంగా సౌద్ షకీల్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.రేసులోకి కొత్త పేరుఇక అక్టోబరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 వన్డేలు, 3 టీ20ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆలోగా కెప్టెన్ ఎంపిక పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడుతుంది. పాక్ టెస్టు జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. బాబర్ స్థానంలో పగ్గాలు చేపట్టిన అతడి సారథ్యంలో పాక్ ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చదవండి: కూతురితో షమీ వీడియో.. హసీన్ జహాన్ ఘాటు వ్యాఖ్యలు -
మూడు నెలలుగా జీతాల్లేవు!.. నిధులన్నీ వాటికే?
పాకిస్తాన్ క్రికెట్.. గత కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలు, పసికూనల చేతిలో ఓటములు, టెస్టుల్లో వైట్‌వాష్‌లు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, తరచూ సెలక్టర్లు, కెప్టెన్ల మార్పులు.. వెరసి తీవ్ర విమర్శలు. అసలు దీనంతటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వైఖరే కారణమంటూ మాజీ క్రికెటర్ల నుంచి ఆరోపణలు.తాజాగా పీసీబీ గురించి మరో విషయం తెరమీదకు వచ్చింది. గత మూడు నెలలుగా పురుష, మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది. నెలవారీ పేమెంట్లతో పాటు స్పాన్సర్షిప్ షేర్లు ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆటగాళ్లంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పాక్ క్రికెట్ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ జాప్యంఅంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా విడుదలలోనూ బోర్డు జాప్యం చేయడం ఆటగాళ్లను మరింత చికాకు పెడుతోందని పేర్కొన్నాయి. ఇక వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం.. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను అభివృద్ధి చేసేందుకు పీసీబీ ఉపయోగిస్తోందని తెలిపాయి.తీవ్ర అసంతృప్తిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికి ఈ మూడు మైదానాలను పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై పీసీబీ శ్రద్ధ చూపుతోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, వరుస సిరీస్‌లు ఆడుతున్నా..ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో క్రికెటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దాని ప్రభావం ఆటపై పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల్లోగా బకాయిలన్నీ తీర్చేందుకు పీసీబీ కసరత్తు చేస్తుందని సదరు వర్గాలు వెల్లడించాయి. కాగా గతేడాది వార్షిక కాంట్రాక్టుల విడుదలకు ముందు ఆటగాళ్లతో చర్చించిన పీసీబీ.. జీతాలను పెంచుతూ చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ‘ఎ’ కేటగిరీలో ఉన్న బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ ఆఫ్రిది వంటి వాళ్లకు నెలవారీ 4.5 మిలియన్ల పాక్ రూపాయలతో(టాక్స్ చెల్లింపుల తర్వాత) పాటు.. అదనంగా లోగో స్పాన్సర్షిప్స్ నుంచి పీసీబీకి వచ్చే ఆదాయంలో మూడు శాతం మేర ఇవ్వనున్నట్లు డీల్ కుదిరింది. జీతాల చెల్లింపునకే గతిలేకఅయితే, ఇప్పుడు ఇలా జీతాల చెల్లింపునకే గతిలేక బోర్డు జాప్యం చేయడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచకప్-2024 ఆడేందుకు వెళ్లిన పాక్ మహిళా క్రికెటర్లకు కూడా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.చదవండి: ఇదేం బౌలింగ్?.. హార్దిక్ శైలిపై కోచ్ అసంతృప్తి!.. ఇకపై.. -
పాక్‌కు భారీ షాక్.. షాహీన్ అఫ్రిదికి గాయం! ఆ సిరీస్‌కు దూరం?
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందుకు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరమ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఛాంపియన్స్ వన్డేకప్ 2024లో లయన్స్ జట్టు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్రిది.. డాల్ఫిన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో అతడి మెకాలికి గాయమైంది. డాల్ఫిన్స్ ఆల్‌రౌండర్ ఫహీమ్ అష్రఫ్ వేసిన ఓ డెలివరీ అఫ్రిది మోకాలిగా బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి ఇసుమంత కూడా తగ్గలేదు. దీంతో అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. కాగా అఫ్రిది మోకాలి గాయం బారిన పడడం ఇదేమి తొలిసారి కాదు. గత రెండేళ్లుగా మోకాలి గాయంతో పోరాడుతున్నాడు. జూలై 2022లో, శ్రీలంకతో జరిగిన తొలిసారి గాయపడ్డ అఫ్రిది.. ఆసియాకప్‌కు దూరమయ్యాడు.గతేడాది కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ అదే మెకాలి గాయం కావడంతో పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది. షాహీన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు ఛాంపియన్స్ వన్డే కప్ ప్లే ఆఫ్స్‌కు దూరకావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.ఇంగ్లండ్‌తో సిరీస్ సమయానికి అఫ్రిది ఫిట్నెస్ సాధించాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటించనుంది. ఆక్టోబర్ 7 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. -
మోర్నీ మోర్కెల్ పనికిరాడన్నట్లు చూశారు: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ బౌలర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. అహంభావం పెరిగిపోయి.. ఆటను, కోచ్‌లను కూడా లెక్కచేయని స్థితికి చేరారని మండిపడ్డాడు. అందుకు జట్టు పరాజయాల రూపంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.వరుస వైఫల్యాలతో..గత కొంతకాలంగా పాక్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టిన బాబర్ సేన.. టీ20 ప్రపంచకప్-2024లోనూ మరీ దారుణంగా నిరాశపరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓటమి కారణంగా కనీసం సూపర్-8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ద్వైపాక్షిక సిరీస్‌లనూ ఇదే తంతు.ఆస్ట్రేలియలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన షాన్ మసూద్ బృందం.. ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. పాక్ టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా బంగ్లా చేతిలో మ్యాచ్ ఓడటమే కాకుండా.. 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.టీమిండియా వరుస విజయాలతోమరోవైపు.. పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థిగా భావించే టీమిండియా ఇటీవలే పొట్టి వరల్డ్‌కప్ రెండోసారి సొంతం చేసుకోవడంతో పాటు... వరుస విజయాలతో దూసుకుపోతూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరవవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ జట్టు బౌలర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా‘‘పాకిస్తానీ బౌలర్లు ... క్రికెట్ కంటే కూడా తామే గొప్ప అన్నట్లుగా భావిస్తారు. తమ ముందు మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా ప్రవర్తించారు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ మమ్మల్ని ఓడించింది. అదే భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆటగాళ్ల ఆలోచనా విధానం, ప్రవర్తనపైనే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని బసిత్ అలీ పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్‌లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు.బౌలింగ్ కోచ్గాటీమిండియా ప్రస్తుత పేస్ దళం పాక్ దిగ్గజాలు వసీం అక్రం, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్‌ల మాదిరి అద్భుతంగా ఉందని బసిత్ అలీ ఈ సందర్భంగా కొనియాడాడు. కాగా గతేడాది వరకు పాక్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్.. ప్రస్తుతం టీమిండియా తరఫున విధులు నిర్వర్తిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్ -
Pak vs Ban: షాహిన్ ఆఫ్రిదిపై వేటు వేయడానికి కారణం అదే!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిపై వేటు పడటం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కెప్టెన్ షాన్ మసూద్‌తో దురుసుగా ప్రవర్తించడం సహా డ్రెసింగ్‌రూంలో వాతావరణం దెబ్బతీసినందుకే అతడిని జట్టు నుంచి తప్పించారనే వదంతులు వస్తున్నాయి. కాగా తొలి టెస్టులో ఘోర ఓటమి అనంతరం.. షాన్ మసూద్- షాహిన్ ఆఫ్రిది మధ్య సఖ్యత లోపించినట్లుగా ఉన్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.కొట్టుకునే దాకావెళ్లిన ఆటగాళ్లుషాహిన్ భుజంపై మసూద్ చేయి వేయగా.. అతడు విసురుగా తీసివేసిన దృశ్యాలు అనుమానాలకు తావిచ్చాయి. అయితే, ఆ తర్వాత మసూద్‌తో షాహిన్ గొడవపడ్డాడని.. ఇద్దరూ కొట్టుకునే దాకావెళ్లగా.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మధ్యలోకి రాగా.. అతడి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల్లో భాగంగానే ఆఫ్రిదిపై వేటు వేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే, మరోవైపు ఫామ్‌లేమి కారణంగానే షాహిన్ ఆఫ్రిది జట్టు నుంచి తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఘోర పరాజయం నేపథ్యంలోకాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు... టెస్టుల్లో తొలిసారి బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. టెస్టు చరిత్రలో తొలిసారిగా బంగ్లా చేతిలో ఓటమిని చవిచూసింది. ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా... లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని రెండో టెస్టు జట్టు నుంచి తప్పించింది. రావల్పిండి వేదికగా శుక్రవారం నుంచి ఆఖరి మ్యాచ్ ప్రారంభం కానుండగా... ఈసారి ఒక పేసర్‌ను తగ్గించుకొని అతడి స్థానంలో స్పిన్నర్‌తో బరిలోకి దిగాలని పాకిస్తాన్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. కోచ్ చెప్పిందిదేఈ నేపథ్యంలో పాకిస్తాన్ హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ మాట్లాడుతూ.. షాహీన్ షా భార్య ఇటీవల మగబిడ్డకు జన్మనివ్వగా... కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ విరామం అతడికి ఉపయోగ పడుతుందనిఅన్నాడు. ‘షాహిన్‌తో చర్చించాం. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అత్యుత్తమ కూర్పుతో బరిలోకి దిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని గెలెస్పీ పేర్కొన్నాడు. అయితే, సహచర ఆటగాళ్ల పట్ల షాహిన్ దుందుడుకు వైఖరే ఇందుకు కారణమని తెలుస్తోంది.చదవండి: లక్షల కోట్లకు వారసుడు.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే! -
బంగ్లాతో రెండో టెస్టు.. షాహీన్ అఫ్రిది దూరం! అతడికి ఛాన్స్?
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. ఇప్పుడు రావల్పండి వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సిద్దమవుతోంది. శుక్రవారం(ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పాక్ భావిస్తోంది. ఈ క్రమంలో రెండో టెస్టుకు 12 మంది సభ్యులతో కూడా ప్రిలిమనరీ జట్టును పాకిస్తాన్ టీమ్ మెనెజ్‌మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది దూరమయ్యాడు. ఇటీవలే అఫ్రిది భార్య అన్షూ పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అతడికి పాక్ జట్టు మెనెజ్‌మెంట్ పితృత్వ సెలవు మంజారు చేసింది. ఇక అతడి స్ధానంలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతడితో పాటు ఈ 12 మంది సభ్యుల జట్టులో పేసర్ మీర్ హమ్జాకు కూడా చోటు దక్కింది. అయితే మీర్ హమ్జా బెంచ్‌కే పరిమిత మయ్యే అవకాశముంది. అర్బర్ ఆహ్మద్‌కు ప్లేయింగ్‌లో ఎలెవన్‌లో చోటు దక్కడం దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే తొలి టెస్టులో చేసిన తప్పిదాన్ని ఇప్పుడు మళ్లీ పునరావృతం చేయకూడదని పాక్ భావిస్తోంది. మొదటి టెస్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే పాకిస్తాన్ బరిలోకి దిగింది. అందుకు ఆతిథ్య జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో పాకిస్తాన్ హెడ్‌కోచ్ గిల్లెస్పీ మరోసారి అటువంటి ఘోర తప్పిదం చేయకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది."రావల్పిండి పిచ్ పరిస్థితులపై మా అంచనా ఆధారంగా 12 మంది సభ్యుల జట్టులో అబ్రార్ అహ్మద్‌కు చోటు ఇచ్చాము. అయితే మేము ఆడాల్సిన వికెట్‌ను ఇంకా పరిశీలించలేదని" గిల్లెస్పీ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడ.బంగ్లాతో రెండో టెస్టుకు పాక్ జట్టు: అబ్దుల్లా షఫీక్, సైమ్ అయూబ్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, అబ్రార్ అహ్మద్, నసీమ్ షా, ఖుర్రం షాజాద్, మహమ్మద్ అలీ, మీర్ హమ్జా -
బంగ్లాతో రెండో టెస్టు.. పాక్ సంచలన స్పిన్నర్ ఎంట్రీ
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రెండో మ్యాచ్‌కు ముందు యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కమ్రాన్ గులాంను వెనక్కి పిలిపించింది. వీళ్లిద్దరిని తిరిగి జట్టులో చేర్చింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో భాగంగా పాకిస్తాన్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో రావల్పిండి వేదికగా ఆగష్టు 21-25 మధ్య జరిగిన తొలి టెస్టులో అతి విశ్వాసంతో భారీ మూల్యం చెల్లించింది. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేక కేవలం పేసర్లకు ప్రాధాన్యం ఇచ్చి.. చేజేతులా ఓటమిని ఆహ్వానించింది. వారిద్దరు తిరిగి జట్టులోకి బంగ్లాదేశ్ స్పిన్ వలలో చిక్కి 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తద్వారా బంగ్లా చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన పాక్ తొలి జట్టుగా షాన్ మసూద్ బృందం నిలిచింది. ఈ క్రమంలో రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోవాలని పాక్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా.. ముందుగా చెప్పినట్లుగా అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాంను తిరిగి జట్టులోకి తీసుకుంది. వీరిలో అబ్రార్‌కు తుదిజట్టులో చోటు దాదాపుగా ఖాయం కాగా.. కమ్రాన్ విషయంలో సందిగ్దం నెలకొంది. నాలుగు వికెట్లతో మెరిసిన అబ్రార్ఇక వీరితో పాటు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కూడా వెనక్కి పిలిపించింది పాక్ బోర్డు. ఈ మేరకు.. ‘‘ఆగష్టు 30 నుంచి సెప్టెంబరు 3 వరకు రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో టెస్టు కోసం అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాం తిరిగి జట్టుతో చేరుతున్నారు’’ అని పీసీబీ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా షాహిన్, ఆల్‌రౌండర్ ఆమీర్ జమాల్ కూడా జట్టుతోనే ఉండనున్నట్లు తెలిపింది.కాగా తొలి టెస్టుకు ముందు అబ్రార్‌తో పాటు కమ్రాన్‌ను విడుదల చేయగా.. బంగ్లాదేశ్-ఏ జట్టుతో పాక్ షాహిన్స్ జట్టు తరఫున అనధికారిక టెస్టు ఆడారు. ఈ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అబ్రార్ నాలుగు వికెట్లతో మెరవగా.. కమ్రాన్ 34 పరుగులు చేయడంతో పాటు.. ఆరు ఓవర్లపాటు బౌలింగ్ చేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కాగా అబ్రార్ అహ్మద్ ఇప్పటి వరకు పాక్ తరఫున మొత్తంగా ఆడింది ఆరు టెస్టులే అయినా 38 వికెట్లు తీసి సత్తా చాటాడు.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు పాకిస్తాన్ జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్నెస్ సాధిస్తేనే), అబ్రార్ అహ్మద్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహిన్ షా ఆఫ్రిది.చదవండి: Test Rankings: దూసుకొచ్చిన బ్రూక్.. టాప్-10లో ముగ్గురు భారత స్టార్లు -
తండ్రైన స్టార్ క్రికెటర్.. టెస్టు సిరీస్ నుంచి ఔట్?
పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది తండ్రయ్యాడు. అతడి భార్య అన్షా శనివారం పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ బిడ్డకు అలీ యార్గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని అఫ్రిది కుటంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అఫ్రిది దంపతులకు సోషల్ మీడియా వేదికగా విసెష్ చెబుతున్నారు. కాగా గతేడాది సెప్టెంబర్‌లో అన్షా అఫ్రిదిని షాహీన్ అఫ్రిది వివాహం చేసుకున్నాడు. అయితే అన్షా అఫ్రిది ఎవరో కాదు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షాహీద్ అఫ్రిది కుమార్తే.రెండో టెస్టుకు దూరం..?కాగా షాహీన్ అఫ్రిది ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాక్ తరపున ఆడుతున్నాడు. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వడంతో కరాచీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు షాహీన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
అలాంటి ఇన్నింగ్స్ నా కెరీర్లో చూడలేదు
-
అలాంటి ఇన్నింగ్స్ నా కెరీర్లో చూడలేదు: షాహీన్ షా అఫ్రిది
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2022లో మెల్బోర్న్ వేదికగా పాక్‌పై విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ను అఫ్రిది కొనియాడాడు.అంతర్జాతీయ క్రికెట్లో తను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్ కోహ్లిదే అని ఈ పాక్ స్పీడ్ స్టార్ చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి ఒక అద్భుతమైన ఆటగాడు. మాపై కోహ్లి (58 బంతుల్లో 82 నాటౌట్) ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నా కెరీర్లోనే ఇప్పటివరకు ఇంతకంటే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను చూడలేదు. ఆ రోజు హ్యారీస్ రవూఫ్ వేసిన అద్భుతమైన బంతిని కోహ్లి బౌలర్ తలపై నుంచి కొట్టిన సిక్స్ నమ్మశక్యం కానిది" అంటూ స్టార్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు.వన్ మ్యాన్ కింగ్ షో..కాగా కోహ్లి కెరీర్లో మెల్బోర్న్లో పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయంగా మిగిలుపోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు కింగ్ కోహ్లి. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా . 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో విరాట్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. హ్యారీస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్లో చివరి రెండు బంతులకు విరాట్ కొట్టిన సిక్స్‌లు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమంగా నిలిచిపోయాయి. ఆ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. -
Pak vs Ban: పాక్ తుదిజట్టు ప్రకటన.. యువ పేసర్‌కు చోటు
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. షాన్ మసూద్ సారథ్యంలోని ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నలుగురు పేసర్లకు చోటు దక్కింది. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ ఆఘా ఒక్కడికే స్థానం ఇచ్చారు సెలక్టర్లు.కాగా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ టెస్టు జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు షాన్ మసూద్. అయితే, ఆ టూర్ అతడికి చేదు అనుభవం మిగిల్చింది. అతడి కెప్టెన్సీలో ఆసీస్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక ఈ సిరీస్ తర్వాత మళ్లీ ఇప్పుడే సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది.బంగ్లాపై పైచేయి బంగ్లాతో ఇప్పటి వరకు 13 టెస్టుల్లో పన్నెండు గెలిచి ఘనమైన టెస్టు రికార్డు కలిగి ఉన్నా.. పాకిస్తాన్ ఈ సిరీస్‌లో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే బంగ్లాను క్లీన్‌స్వీప్ చేస్తే మరింత వేగంగా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సిరీస్‌తోనే ఆస్ట్రేలియన్ జాసన్ గిల్లెస్పి పాక్ టెస్టు జట్టు హెడ్‌కోచ్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు.యువ సంచలనానికి చోటుఇక ఆగష్టు 21 నుంచి రావల్పిండి వేదికగా మొదలయ్యే తొలి టెస్టు కోసం పాకిస్తాన్ సోమవారమే తమ తుదిజట్టును ప్రకటించింది. ఓపెనర్లుగా అబ్దుల్ షఫీక్, సయీమ్ ఆయుబ్.. వన్‌డౌన్‌లో షాన్ మసూద్ ఆడనున్నారు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన సౌద్ షకీల్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా ఆ తర్వాతి స్థానాల్లో ఆడనున్నారు.ఇక పేస్ విభాగంలో షాహిన్ ఆఫ్రిది, నసీం షా, యువ సంచలనం ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ బరిలోకి దిగనున్నారు. కాగా ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా పాక్ తరఫున అరంగేట్రం చేసిన షెహజాద్ తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో మెరిశాడు. అయితే, ఇప్పుడే మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఇదిలా ఉంటే.. బంగ్లాతో రెండు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలుత 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన పాక్ బోర్డు.. ఆ తర్వాత 14 మందికి తగ్గించింది. ఆమీర్ జమాల్ వెన్నునొప్పి కారణంగా దూరం కాగా.. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్‌లను బంగ్లాదేశ్-ఎ జట్టుతో బరిలోకి దించనుంది.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తుదిజట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షెహజాద్, మొహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీం షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ ఆఘా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ వరకు ఇషాన్‌కు టీమిండియాలో నో ఛాన్స్! -
అఫ్రిది, షమీ కాదు.. అతడే నా ఫేవరెట్ బౌలర్: వసీం అక్రమ్
భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం తరంలో బుమ్రానే తన ఫేవరెట్ బౌలర్ అని అక్రమ్ కొనియాడాడు. బుమ్రా టీమిండియాలో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. వరల్డ్ క్రికెట్లో టీమిండియా నెం1 జట్టుగా ఎదగడంలో బుమ్రాది కీలక పాత్ర. అంతేకాకుండా గత 13 ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను సైతం తన అద్బుత ప్రదర్శనతో బుమ్రా అందించాడు. తాజాగా అక్రమ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ బౌలర్ ఎవరన్న ప్రశ్న వసీంకు ఎదురైంది. వెంటనే అక్రమ్ ఏమీ ఆలోచించకుండా బుమ్రా పేరు చెప్పాడు.వరల్డ్ క్రికెట్లో బుమ్రాని మించిన వారు లేరు. ప్రస్తుత బౌలర్లలో అందరికంటే బుమ్రా ముందున్నాడ. అతడి బౌలింగ్ ఒక అద్భుతం. బంతితో అతడి కంట్రోల్ చేసే విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.జస్ప్రీత్ బౌలింగ్‌లో ఎక్కువగా వేరియేషన్స్ ఉంటాయి. తన బౌలింగ్ స్కిల్స్‌తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏ పిచ్‌పై ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. కొత్త బంతితో కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. న్యూబాల్‌తో బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతడి ఔట్స్వింగర్లను ఎదుర్కొవడం చాలా కష్టం.చాలా సార్లు నేను ఔట్స్వింగర్లను బౌలింగ్ చేసినప్పుడు నియంత్రణ కోల్పోయి పరుగులు ఇచ్చేవాడిని. కానీ బుమ్రా మాత్రం అలా కాదు. బంతితో పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. కొత్త బంతితో బుమ్రా నాకంటే బెటర్‌గా బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడని అమ్రిక్క్రిక్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీమ్ పేర్కొన్నాడు. కాగా వసీం తమ జట్టు స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదిని తన అభిమాన బౌలర్‌గా ఎంచుకోకపోవడం గమనార్హం. -
ప్రపంచంలో ఆ ఐదుగురే అత్యుత్తమ బౌలర్లు..!
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచంలో తాను మెచ్చిన ఐదుగురు అత్యుత్తమ బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో రషీద్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని ఇచ్చాడు. ఆతర్వాత ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిదికి చోటిచ్చాడు. ఆదిల్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు.కాగా, ఆదిల్ రషీద్ ఎంపిక చేసిన బౌలర్లలో మిచెల్ స్టార్క్ అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు కలిగి ఉన్నాడు. స్టార్క్ తన కెరీర్లో ఇప్పటివరకు 673 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇప్పటిదాకా 611 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో బుమ్రా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు 397 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాతి స్థానంలో షాహిన్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది ఖాతాలో 313 వికెట్లు ఉన్నాయి. ఆదిల్ ఎంపిక చేసిన అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చివరి స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఆర్చర్ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 115 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన ఒమన్ పేసర్.. షాహీన్ అఫ్రిది రికార్డు బద్దలు
ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ వన్డేల్లో తిరుగులేని రికార్డు నెలకొల్పాడు. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బిలాల్‌కు ముందు ఈ రికార్డు పాక్ స్పీడ్‌స్టర్ షాహీన్ అఫ్రిది పేరిట ఉండేది. షాహీన్ 51 మ్యాచ్‌ల్లో 100 వికెట్ల మైలురాయిని తాకగా.. బిలాల్ కేవలం 49 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా (పేసర్లు, స్పిన్నర్లు) వన్డేల్లో ఫాస్టెస్ 100 వికెట్స్ రికార్డు నేపాల్ బౌలర్ సందీప్ లామిచ్చేన్ పేరిట ఉంది. లామిచ్చేన్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని తాకాడు.ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల్లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా బిలాల్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నమీబియాపై ఒమన్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. ఒమన్ 49.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నమీబియా ఇన్నింగ్స్‌లో మలాన్ క్రుగెర్ (73) అర్ద సెంచరీతో రాణించగా.. ఆకిబ్ ఇలియాస్ (68), ఖలీద్ కైల్ (43) ఒమన్‌ను గెలిపించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్ 3, ఫయాజ్ భట్ 2, కలీముల్లా, జే ఒడేడ్రా, షోయబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టగా.. నమీబియా బౌలర్లలో జాక్ బ్రసల్ 2, బెన్ షికోంగో, తంగెని లుంగమెని తలో వికెట్ దక్కించుకున్నారు.వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన పేసర్లుబిలాల్ ఖాన్- 49 మ్యాచ్లుషాహీన్ అఫ్రిది- 51మిచెల్ స్టార్క్- 52షేన్ బాండ్- 54ముస్తాఫిజుర్ రెహ్మాన్- 54వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లుసందీప్ లామిచ్చేన్- 42రషీద్ ఖాన్- 44బిలాల్ ఖాన్- 49షాహీన్ అఫ్రిది- 51మిచెల్ స్టార్క్- 52 -
పాక్ ఆటగాళ్లకు షాకిచ్చిన పీసీబీ!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని తగ్గించింది. ఈ విషయాన్ని పీసీబీ అధికారులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.వన్డే ప్రపంచకప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నీల్లో దారుణ వైఫల్యాల నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్ల ప్రవర్తనపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. క్రికెట్‌పై దృష్టి పెట్టకుండా ఇతర అంశాల్లో జోక్యం చేసుకుంటూ జట్టుకు నష్టం చేకూరుస్తున్నారని పీసీబీ భావిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం, పరస్పర సహాయ సహకారాలు అందించుకునే విషయంలో ఆటగాళ్ల మధ్య ఐక్యత లేదన్నది వాటి ప్రధాన సారాంశం. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.సంస్కరణలకు శ్రీకారంఅదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలోనూ సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పాక్ టెస్టు హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి, వన్డే- టీ20ల ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌తో లాహోర్‌లో సోమవారం చర్చించినట్లు తెలుస్తోంది.పాక్ బోర్డు అధికారులు ఈ విషయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించినట్లు తెలిపారు. ఇందుకు గల కారణాలు వెల్లడిస్తూ.. ‘‘సెంట్రల్ కాంట్రాక్ట్, ఆటగాళ్ల పారితోషికం విషయంలో చర్చ జరిగింది.ఆ రెండిటి ఆధారంగాక్రికెటర్ల ఫిట్నెస్, ప్రవర్తన ఆధారంగా ప్రతీ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రివైజ్ చేయాలని సెలక్టర్లు ప్రతిపాదించారు. అయితే, పారితోషికం విషయంలో మాత్రం ఎలాంటి కోత ఉండబోదు’’ అని పేర్కొన్నారు.అంతేకాదు.. ‘‘పూర్తిస్థాయి ఫిట్నెస్ కలిగి ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇక నుంచి నిరంభ్యంతర పత్రాలు(NOCs- నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగి ఉన్న లీగ్‌లలో మాత్రమే ఆడేందుకు అనుమతినివ్వాలనే యోచనలో ఉన్నాం’’ అని తెలిపారు.కోచ్‌తో అతడి గొడవకాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం, టీ20ల మాజీ సారథి షాహిన్ ఆఫ్రిది మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్‌తో షాహిన్ అనుచితంగా ప్రవర్తించిన విషయం వెలుగులోకి వచ్చింది.అయితే, వెంటనే అతడు కోచ్‌కు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా ఆటగాళ్లను సరైన దారిలో పెట్టేందుకు పీసీబీ కాస్త కఠినంగానే వ్యవహరించనుందని బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా చీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్, సెలక్టర్ అబ్దుల్ రజాక్‌పై ఇప్పటికే పీసీబీ వేటు వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కెప్టెన్‌గా బాబర్ భవితవ్యం కూడా తేలనుంది.చదవండి: ఇంత చెత్తగా వ్యవహరిస్తారా? యువీ, భజ్జీ, రైనాపై విమర్శలు -
తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్ (ఫొటోలు)
-
కోచ్‌తో గొడవ నిజమే!.. బంగ్లాతో సిరీస్‌కు షాహిన్ దూరం
పాకిస్తాన్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టెస్టు జట్టు హెడ్ కోచ్ జేసన్ గిల్లెస్పి ధ్రువీకరించాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందే పాక్ క్రికెట్ బోర్డు ఆఫ్రిదిని పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో బాబర్ ఆజం తిరిగి సారథిగా నియమితుడయ్యాడు.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. కనీసం సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ సమయంలో బాబర్‌తో పాటు కోచ్‌లతోనూ షాహిన్ ఆఫ్రిదికి గొడవలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి.దీంతో పీసీబీ ఆఫ్రిదిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రచురించింది. బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్‌తో షాహిన్‌కు వాదన జరగడం నిజమేనని.. అయితే, ఆటలో ఇవన్నీ సహజమేనని పీసీబీ వర్గాలు పేర్కొన్నట్లు జియో న్యూస్ వెల్లడించింది.తనకు కొత్త పాఠాలు నేర్పవద్దని షాహిన్ యూసఫ్‌తో దురుసుగా ప్రవర్తించాడని.. అయితే, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ వివాదం ఇంతటితో సమసిపోయిందని పేర్కొంది.అయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు షాహిన్ ఆఫ్రిది దూరం కానున్నాడన్న నేపథ్యంలో పీసీబీ చర్యలు తీసుకుంటోందని అంతా భావించారు. అయితే, కోచ్ గిల్లెస్పి ఈ వార్తలను కొట్టిపారేశాడు.షాహిన్ ఆఫ్రిది తండ్రి కాబోతున్నాడని, అందుకే ఆ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలని అతడు కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ కారణంగానే అతడు బంగ్లాతో సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.కాగా పాక్ దిగ్గజ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహిన్ ఆఫ్రిది గతేడాది పెళ్లాడాడు. ఈ జంట త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగష్టు 21 నుంచి సెప్టెంబరు 3 వరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. -
కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
‘‘నేను ఎప్పుడైతే నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగాలని భావించానో అప్పుడే(2023) కెప్టెన్సీ వదిలేశాను. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాను కూడా!ఆ తర్వాత మళ్లీ బోర్డు నాకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత.. ఏం జరిగిందన్న అంశం గురించి చర్చిస్తాం.ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటాం. ఒకవేళ నేను కెప్టెన్సీ వదిలేయాల్సి వస్తే.. కచ్చితంగా అందరి ముందు నేనే ప్రకటిస్తా. ఇందులో దాచాల్సిన విషయం ఏమీ లేదు.ఏం జరిగినా అంతా ఓపెన్‌గానే ఉంటుంది. అయితే, నేనిప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో పీసీబీదే తుది నిర్ణయం’’ అని పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం స్పష్టం చేశాడు.వన్డే వరల్డ్‌కప్-2023లో వైఫల్యం తర్వాతపాక్ బోర్డు ఆదేశాల మేరకే సారథిగా కొనసాగాలా లేదా అన్న విషయమై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ ఘోరంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే.గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.అయితే, అతడిని పీసీబీ ఎక్కువకాలం కొనసాగించలేదు. బోర్డు యాజమాన్యం మారిన తర్వాత మళ్లీ బాబర్ ఆజంనే వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024లో బాబర్ సారథ్యంలో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైంది.గ్రూప్-ఏలో ఉన్న పాక్.. తొలుత అమెరికా.. తర్వాత టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా.. తాజాగా ఐర్లాండ్‌పై గెలుపొందినా అప్పటికే సూపర్-8 నుంచి నిష్క్రమించింది. పాక్ కంటే మెరుగైన స్థితిలో ఉన్న అమెరికా టీమిండియాతో పాటు తదుపరి దశకు అర్హత సాధించింది.అందరి ప్లేస్‌లో నేను ఆడలేను కదా!ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని వెంటనే రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం స్పందిస్తూ.. ‘‘కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఓడిపోలేదు. జట్టుగా గెలిచాం.. జట్టుగానే ఓడిపోయాం. చాలా మంది కెప్టెన్ వైపు వేలు చూపిస్తున్నారు. కానీ ప్రతి ఆటగాడి స్థానంలో నేను వెళ్లి ఆడలేను కదా! జట్టులోని 11 మంది ఆటగాళ్లకు తమదైన పాత్ర ఉంటుంది. జట్టుగా మేము విఫలమయ్యాం. ఈ విషయాన్ని ముము అంగీకరించక తప్పదు. వైఫల్యానికి ఎవరో ఒకరిని బాధ్యులుగా చూపే పరిస్థితి లేదు’’ అని పేర్కొన్నాడు. తనను విమర్శిస్తున్న వాళ్లకు ఈ మేరకు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు బాబర్ ఆజం.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ కెప్టెన్.. ధోని వరల్డ్ రికార్డు బద్దలు View this post on Instagram A post shared by ICC (@icc) -
అతడినే కెప్టెన్‌గా ఉండనివ్వాల్సింది: బాబర్‌పై ఆఫ్రిది ఆగ్రహం
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తీరును మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. షాహిన్ ఆఫ్రిది స్థానంలో బాబర్ పగ్గాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఒకవేళ బోర్డు ఆఫర్ చేసినా.. షాహిన్నే కెప్టెన్‌గా కొనసాగించాలని బాబర్.. కోరి ఉంటే బాగుండేదంటూ తన అల్లుడికి మద్దతు పలికాడు.వన్డే ప్రపంచకప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజం తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి పాక్ క్రికెట్ బోర్డు టెస్టులకు షాన్ మసూద్, టీ20 ఫార్మాట్‌కు ప్రధాన పేసర్, షాహిద్ ఆఫ్రిది అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్లుగా ప్రకటించింది.షాహిన్‌పై వేటుఅయితే, మసూద్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయిన పాకిస్తాన్.. షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను 4-1తో ఓడిపోయింది.ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ షాహిన్ ఆఫ్రిది వైఫల్యం కొనసాగింది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు కొత్త యాజమాన్యం అతడిపై వేటు వేసింది. వన్డే, టీ20లకు బాబర్ ఆజంనే తిరిగి కెప్టెన్‌గా నియమించింది.అయితే, బాబర్ సారథ్యంలోనూ పాకిస్తాన్‌కు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తొలుత ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాక్.. తాజాగా టీ20 ప్రపంచకప్-2024లో గ్రూప్ దశ దాటకుండానే ఎలిమినేట్ అయింది.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. షాహిద్ ఆఫ్రిది తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్ వరకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌గా ఉంటాడని ఒకవేళ పీసీబీ చెబితే.. బాబర్ ఆజం అతడికి మద్దతుగా నిలవాల్సింది.‘లేదు. నాకు కెప్టెన్సీ వద్దు. మేమంతా షాహిన్ సారథ్యంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. అతడు నాతో పాటు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాడు. అందుకే అతడికే కెప్టెన్సీ అప్పగించండి. నేను అతడికి మద్దతుగా ఉంటూ.. అతడి నాయకత్వంలో ఆడతాను’’ అని బాబర్ ఆజం చెప్పాల్సింది.బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదుఇలా చేసి ఉంటే అతడిపై గౌరవం పెరిగేది. అయినా.. ఇందులో బాబర్ ఒక్కడినే తప్పుబట్టడానికి లేదు. సెలక్షన్ కమిటీకి కూడా ఇందులో భాగం ఉంది.సెలక్షన్ కమిటీలోని కొందరకు వ్యక్తులు.. బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదని డైరెక్ట్‌గానే చెప్పారు. అయినా మళ్లీ అతడి చేతికే పగ్గాలు వచ్చాయి’’ అని షాహిద్ ఆఫ్రిది ఘాటు విమర్శలు చేశాడు.ఏదేమైనా బాబర్ ఆజం.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదినే కెప్టెన్‌గా కొనసాగించాలని బోర్డును కోరి ఉండాల్సిందని షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా బాబర్ నాయకత్వంలో 2021 వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన పాకిస్తాన్.. 2022లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం గ్రూప్ స్టేజిలోనే ఇంటిబాట పట్టింది. చదవండి: WC: ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాం: ఇంగ్లండ్ పేసర్ -
జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. మెగా టోర్నీకి జట్టు ఎంపిక మొదలు.. బాబర్ ఆజం కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన వరకు ఏ ఒక్కటి సరిగ్గా లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా సహా వసీం అక్రం, కమ్రన్ అక్మల్, సలీం మాలిక్ తదితరులు భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆట తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా ఈ జాబితాలో చేరాడు. ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్తాన్ కెప్టెన్‌గా తిరిగి నియమితుడైన బాబర్ ఆజంపై అతడు విమర్శలు ఎక్కుపెట్టాడు.‘‘కెప్టెన్ అనే వాడు జట్టును ఒకే తాటి మీదకు తెస్తాడు. జట్టును నాశనం చేయగల.. లేదంటే నిర్మించగల శక్తి అతడికి ఉంటుంది. ఈ వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత నేను ఈ విషయంపై ఇంకాస్త స్పష్టంగా మాట్లాడతాను’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు.అదే విధంగా తన అల్లుడు షాహిన్ ఆఫ్రిది కెరీర్‌లోని ఎత్తుపళ్లాల గురించి ప్రస్తావన రాగా.. ‘‘అతడితో నాకున్న బంధుత్వం కారణంగా.. నేను నా కూతురికి, అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నానని చాలా మంది అనుకుంటారు.నిజానికి నేను ఎప్పుడూ అలా మాట్లాడను. ఒకవేళ నా కూతురైనా.. అల్లుడైనా తప్పు చేస్తే తప్పు చేశారనే చెప్తాను. అంతేతప్ప వెనకేసుకురాను’’ అంటూ షాహిద్ ఆఫ్రిది ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు.ఫలితంగా పాకిస్తాన్ టీ20 కెప్టెన్సీ పదవి ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని వరించింది. అయితే, అతడి సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయింది.ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో పలు మార్పుల అనంతరం బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడి నాయకత్వంలో వరల్డ్‌కప్‌నకు ముందు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడిన పాకిస్తాన్ 0-2తో ఓడిపోయింది.ఇక వరల్డ్‌కప్-2024లోనూ బాబర్ బృందం పరాజయాల పరంపర కొనసాగుతోంది. తమ తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలోనూ పరాజయం పాలైంది. గ్రూపు దశలో మిలిగిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే ఈ టోర్నీలో పాక్ ముందడుగు వేయగలుగుతుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఐక్యత లేనందువల్లే ఈ పరిస్థితి అంటూ షాహిద్ ఆఫ్రిది బాబర్ ఆజంను టార్గెట్ చేయడం గమనార్హం.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ (జూన్ 9) జరుగుతున్న హై ఓల్టేజీ మ్యాచ్‌కు వరుణుడు క్రమం తప్పకుండా ఆటంకం కలిగిస్తూ వస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలవడంతో టాస్ అర్ద గంట ఆలస్యంగా పడింది. టాస్ అనంతరం మరో మారు జల్లులు కురువడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా వరుణుడు మరోసారి పలకరించాడు. వరుణుడు ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో 8 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో రోహిత్ అద్భుతమైన సిక్సర్ బాది భారత ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అఫ్రిది వేసిన తొలి ఓవర్ మూడో బంతికే రోహిత్ లెగ్ సైడ్ దిశగా తన ట్రేడ్ మార్క్ సిక్సర్ బాదాడు. రోహిత్ సిక్సర్ బాదిన విధానం చూసి అఫ్రిది నవ్వుకుంటూ ఉండిపోయాడు. హిట్‌మ్యాన్ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.WHAT A SHOT BY ROHIT SHARMA. 🔥 - The Class of Hitman...!!!! ⭐ pic.twitter.com/F6QrZkpDsC— Tanuj Singh (@ImTanujSingh) June 9, 2024తొలి ఓవర్ ముగియగానే మరోసారి వర్షం పలకరించడంతో మ్యాచ్‌కు బ్రేక్ పడింది. తొలి ఓవర్ తర్వాత టీమిండియా స్కోర్ 8/0గా ఉంది. రోహిత్ 8, విరాట్ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. పాక్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. పాక్.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్‌కు పక్కన పెట్టి ఇమాద్ వసీంను తుది జట్టులోకి తీసుకుంది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్ -
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
ఏప్రిల్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ పేసర్ షహీన్ అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ ఉన్నారు. వీరిముగ్గురూ ఏప్రిల్ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. అఫ్రిది విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్లొ అదరగొట్టాడు.ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన షాహీన్.. 8 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐసీసీ అతడిని ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డకు నామినేట్ చేసింది. ఇక నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్.. ఒమన్ పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఒమన్‌తో టీ20 సిరీస్‌ను నమీబియా సాధించడంలో ఎరాస్మస్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం సైతం ఏప్రిల్ నెలలో అదరగొట్టాడు. ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌లో వసీం దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఏప్రిల్ నెలలో వసీం 44.83 సగటుతో 269 పరుగులు చేశాడు. ఇక మహిళలల విభాగంలో శ్రీలం కెప్టెన్ చమరి అతపట్టు, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ట్ ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు రేసులో ఉన్నారు. -
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్‌ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్‌కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్‌లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024 -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన మార్క్ చాప్మన్, షాహీన్ అఫ్రిది
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను ఇవాళ (ఏప్రిల్ 23) విడుదల చేసింది. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడు ఫార్మాట్లలో టాప్‌లో కొనసాగుతుంది.వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, షాహీన్ అఫ్రిది, ఐష్ సోధి, టిమ్ సీఫర్ట్ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన చాప్మన్ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 33వ స్థానానికి ఎగబాకగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (టీ20) 3 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అఫ్రిది రెండు స్థానాలు మెరుగపర్చుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు. కివీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ 27వ స్థానం నుంచి 24కు.. సోధి 23 స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ తొలిసారి టాప్-50 బ్యాటర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా నేపాల్ తరఫున టాప్-50లో చోటు దక్కించుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్ కప్‌లో హాంగ్‌కాంగ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కారణంగా ఎయిరీ ర్యాంకింగ్స్‌లో మార్పు వచ్చింది.ఇవి కాకుండా తాజా ర్యాంకింగ్స్‌లో చెపుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్, వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్, టీ20 బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతున్నారు. టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. అశ్విన్ టాప్‌లో కొనసాగుతున్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కేశవ్ మహారాజ్, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతున్నారు. -
Official: షాహిన్‌పై వేటు.. పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజం
PCB Announces Babar Azam appointed as white-ball captain: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పునర్నియమితుడయ్యాడు. వన్డే, టీ20 జట్ల సారథిగా మరోసారి పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం మేరకు బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది. సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. బాబర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు సూచించారు. అప్పటి పీసీబీ పెద్దలు సైతం బాబర్ ఆజంకు మద్దతుగా నిలవకపోవడంతో అతడు కెప్టెన్‌గా తప్పుకొన్నాడు. అతడి స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్లను సారథులుగా ఎంపిక చేశారు. ఘోర పరాజయాలు ఈ క్రమంలో షాన్ మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్.. కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అదే విధంగా షాహిన్ సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో 4-1తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో పీసీబీ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ఆఫ్రిదిపై వేటు.. మసూద్ కొనసాగింపు! ఇక షాహిన్ ఆఫ్రిది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో పీసీబీ చీఫ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు బాబర్ ఆజంను వన్డే, టీ20ల కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. అయితే, టెస్టులకు మాత్రం షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ జట్టు తదుపరి ఏప్రిల్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో బాబర్ ఆజం నాయకుడిగా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలుపెట్టనున్నాడు. చదవండి: #Mayank Yadav: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఎవరీ మయాంక్ యాదవ్? Babar Azam appointed as white-ball captain Following unanimous recommendation from the PCB’s selection committee, Chairman PCB Mohsin Naqvi has appointed Babar Azam as white-ball (ODI and T20I) captain of the Pakistan men's cricket team. pic.twitter.com/ad4KLJYRMK — Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024 -
పాకిస్తాన్ కెప్టెన్సీకి షాహీన్ షా ఆఫ్రిది గుడ్ బై..? కొత్త సారథి ఎవరంటే?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్సీ నుంచి షాహీన్ షా ఆఫ్రిది తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీలో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత బాధ్యత వహిస్తూ అఫ్రిది తన పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అఫ్రిదికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ,జాతీయ సెలెక్టర్ల మధ్య పెద్దగా కమ్యూనికేషన్ కూడా లేనిట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పీసీబీ తీరు పట్ల అఫ్రిది ఆంసృప్తితో ఉన్నట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి సాధారణ ఆటగాడిగా కొనసాగాలని షాహీన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజాం పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. వచ్చేనెల 18నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బాబర్ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో జట్టు దారుణ వైఫల్యం తర్వాత మూడు ఫార్మాట్లలో ఆజమ్ కెప్టెన్సీపై వేటు పడింది. ఆ తర్వాత టీ20 కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిది, టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్‌ను పీసీబీ నియమించింది. కానీ వీరిద్దరూ తమ మార్క్ చూపిచండంలో విఫలమయ్యారు. మసూద్ సారధ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను పాక్ కోల్పోగా.. షాహీన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ 4-1 సిరీస్ ఓటమిని చవిచూసింది. -
పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్!.. అల్లుడికి అండగా షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. బోర్డు పెద్దలు మారినప్పుడల్లా వారికి అనుగుణంగా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయని.. తమ క్రికెట్ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొన్నాడు. కాగా పీసీబీ యాజమాన్యం తరచూ మారుతున్న విషయం తెలిసిందే. ప్రధాని షాబాజ్ జోక్యం నేపథ్యంలో రమీజ్ రాజాను అధ్యక్షుడిగా తప్పించి.. నజమ్ సేథీని తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. అనంతరం నజమ్ సేథీ కూడా వైదొలగడంతో.. అతడి స్థానంలో జకా అష్రాఫ్ బాధ్యతలు చేపట్టాడు. అతడు కూడా రాజీనామా చేయడంతో సుప్రీం కోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన పీసీబీ ఎన్నికలు ముగిసే వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. అనంతరం ఎలక్షన్లో గెలిచిన మొహ్సిన్ నఖ్వీ పీసీబీ బాస్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరుకుండా పాకిస్తాన్ నిష్క్రమించడంతో కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేశారు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్‌గా షాహిన్ ఆఫ్రిదిని నియమించారు. అయితే, వీరిద్దరి సారథ్యంలో తొలి సిరీస్‌లలోనే పాకిస్తాన్ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీ బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్ చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీ20లకు షాహిన్ ఆఫ్రిదిని తప్పించి బాబర్‌తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై స్పందించిన షాహిద్ ఆఫ్రిది.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదికి అండగా నిలిచాడు. ‘‘ఒకరిని కెప్టెన్‌గా నియమించినపుడు తనను తాను నిరూపించుకునేందుకు కొంత సమయం కూడా ఇవ్వాలి. అంతేగానీ కొత్త వాళ్లు రాగానే మళ్లీ మార్పులు చేస్తాం అంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఒక ఆటగాడిని సారథిని చేసి వెంటనే తొలగించాలనుకుంటున్నారంటే ఆ నిర్ణయం తప్పుడైది ఉండాలి. లేదంటే మళ్లీ మార్చాలనుకున్న నిర్ణయమైన సరైంది కాకపోయి ఉండాలి’’ అని పీసీబీ తీరును విమర్శించాడు. తన అల్లుడు షాహిన్‌కు మరికొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. -
అతడితో పోలికా?.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ప్రశంసలు కురిపించాడు. ఫాస్ట్‌బౌలర్లకు గాయాలు సహజమేనని.. అయితే, రీఎంట్రీలో బుమ్రా వంటి కొంతమంది మాత్రమే నిలకడగా ఆడగలరని పేర్కొన్నాడు. పాక్ ప్రధాన పేసర్, టీ20 జట్టు కెప్టెన్ షాహిన్ ఆఫ్రిదితో పోలిస్తే.. బుమ్రానే ఉత్తమ బౌలర్ అని మహ్మద్ ఇర్ఫాన్ కుండబద్దలు కొట్టాడు. ‘‘ఫాహిన్ ఎప్పుడైనా ఫిట్నెస్ సమస్యల వల్ల జట్టుకు దూరమైతే.. తిరిగి మైదానంలో దిగినపుడు అతడి బౌలింగ్‌లో పేస్ తగ్గుతుంది. ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ బుమ్రా అలా కాదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతడు మరింత గొప్పగా ఆడతాడు. అందుకే వీరిద్దరిలో బుమ్రానే బెస్ట్’’ అంటూ ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు మహ్మద్ ఇర్ఫాన్. కాగా 2022 ద్వితీయార్థం నుంచి 2023 ప్రథమార్థం వరకు జస్ప్రీత్ బుమ్రా, షాహిన్ ఆఫ్రిది గాయాలతో సతమతమయ్యారు. అయితే, గతేడాది ఆగష్టులో టీమిండియా తరఫున పునరాగమనం చేసిన బుమ్రా అదరగొడుతున్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసి సత్తా చాటాడు. అంతేగాకుండా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడీ స్టార్ పేసర్. ఇక.. వన్డే వరల్డ్‌కప్-2023లోనూ 11 మ్యాచ్‌లు ఆడి 20 మంది బ్యాటర్లను అవుట్ చేశాడు. మరోవైపు.. షాహిన్ ఆఫ్రిది మాత్రం మునుపటిలా రాణించలేక చతికిలపడ్డాడు. ఇక పాక్ టీ20 కెప్టెన్‌గా హోదాలో ఇటీవల న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన షాహిన్ ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. మహ్మద్ ఇర్ఫాన్ పాకిస్తాన్ తరఫున 2012లో అరంగేట్రం చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తంగా నాలుగు టెస్టుల్లో 10, 60 వన్డేల్లో 83, 22 టీ20 మ్యాచ్‌లలో భాగమై 16 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Mohammed Shami: ఐపీఎల్ కోసమే నాటకాలు.. అవునన్న షమీ! వైరల్ -
ఉస్మాన్ ఖాన్ ఊచకోత.. విధ్వంసం సృష్టించిన ఇఫ్తికార్, హెండ్రిక్స్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మరో భారీ స్కోర్ నమోదైంది. లాహోర్ ఖలందర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ డకౌటైనా సుల్తాన్స్ ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), ఇఫ్తికార్ అహ్మద్ (18 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (55 బంతుల్లో 96; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరికి తయ్యబ్ తాహిర్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) జత కలిశాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టగా.. బ్రాత్‌వైట్, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుండగా.. ముల్తాన్ సుల్తాన్స్ 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్, ఇస్తామాబాద్ యునైటెడ్ వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
ఉత్కంఠ సమరంలో చివరి బంతికి విజయం.. వైపర్స్‌ను గెలిపించిన అఫ్రిది
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో నిన్న మరో రసవత్తర సమరం జరిగింది. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్ చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి బంతికి వైపర్స్ మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది (12 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్) కావాల్సిన పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఫలితంగా వైపర్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో వైపర్స్‌కు ఇది రెండో విజయం. pic.twitter.com/s2yg5r0O5B — Jas Pope (@jas_pope93438) January 30, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్.. మొహమ్మద్ ఆమీర్ (4-0-26-3), లూక్ వుడ్ (4-0-32-2), మతీష పతిరణ (4-0-32-2), హసరంగ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (28), అకీల్ హొసేన్ (24), అంబటి రాయుడు (23) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన వైపర్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. షాహీన్ అఫ్రిది చివరి బంతికి మూడు పరుగుల తీసి వైపర్స్‌ను గెలిపించాడు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. అఫ్రిది, లూక్ వుడ్ (6 నాటౌట్) సాయంతో తన జట్టును గెలిపించాడు. వైపర్స్ ఇన్నింగ్స్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (35), హసరంగ (26), ఆజమ్ ఖాన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రోహిద్ ఖాన్ 3 వికెట్లతో వైపర్స్‌ను ఇబ్బంది పెట్టగా.. ఫజల్ హక్ ఫారూకీ, డ్వేన్ బ్రావో తలో 2 వికెట్లు, సలామ్‌కీల్ ఓ వికెట్ పడగొట్టారు. -
#NZvPAK: దంచి కొట్టిన మిచెల్, ఫిలిప్స్.. పాకిస్తాన్‌కు మరో పరాభవం
New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రిజ్వాన్‌కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్‌కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇక పాక్‌తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF — BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024 -
ఫలితాలు పట్టించుకోం.. బాబర్ గెలిపించలేకపోయాడు: షాహిన్ ఆఫ్రిది
"Results don't matter" - Shaheen Afridi's makes bold statement: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న బాబర్ ఆజం బృందం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో చేపట్టిన ప్రక్షాళన చర్యల్లో భాగంగా బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్.. టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా నియమితులయ్యారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ టీమ్ డైరెక్టర్ కమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి తనదైన మార్కు చూపేందుకు విఫలయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా హఫీజ్ మార్గదర్శనంలో మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ టెస్టుల్లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఈ ఘోర అవమానం నుంచి కోలుకోకముందే న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. డునెడిన్ వేదికగా కివీస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పాక్ టీ20 జట్టు కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఓటమిపై స్పందిస్తూ.. ఫలితాలతో మాకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Shaheen Afridi says result doesn't matter, effort of players matters 🤯 Do you agree with this statement? #NZvsPAK pic.twitter.com/Y69482v7ih — Farid Khan (@_FaridKhan) January 17, 2024 ఈ మేరకు..‘‘ మ్యాచ్ ఫలితాలతో మాకు పట్టింపు లేదు. మా ఆటగాళ్లు విజయం కోసం తగినంత ఎఫర్ట్ పెడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం. నాకు తెలిసి మా జట్టులోని ప్రతి ప్లేయర్ పూర్తి నిబద్ధతతో ఆడుతున్నారు. మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బాబర్ ఫామ్‌లేమితో సతమతం కావడం లేదు. ఈ సిరీస్‌లో అతడు మూడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, జట్టుకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇన్నింగ్స్ ఫినిష్ చేయలేకపోయాడు. అతడికి తోడుగా కనీసం ఒక్క బ్యాటర్ అయినా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది. ఈరోజు కూడా అలాగే జరిగింది. బాబర్‌తో పాటు ఇంకొక్కరు రాణించినా ఫలితం వేరేలా ఉండేది’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బాబర్ ఆజం ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి 181 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెగ్యులర్ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో బరిలోకి దిగి ఈ మేరకు పరుగులు రాబట్టాడు. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బాబర్ పోరాటం వృథా
న్యూజిలాండ్ పర్యటనను పాకిస్తాన్ పరాజయంతో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. అక్లాండ్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వేను డకౌట్ చేసి శుభారంభం అందుకుంది. అయితే, మరో ఓపెనర్ ఫిన్ అలెన్(35), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ విలియమ్సన్(57) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ఇక నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొరకరాని కొయ్యలా మారి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో మార్క్ చాప్మప్ 26(11 బంతుల్లో) రన్స్‌తో రాణించాడు. బ్యాటర్లంతా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం ఒక్క హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ మొత్తంగా 35 బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(27), మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) మాత్రమే 20 అంకెల స్కోరు చేశారు. రిజ్వాన్, ఇఫ్తికర్ రూపంలో కీలక వికెట్లు తీసిన టిమ్ సౌతీ.. అబ్బాస్ ఆఫ్రిది(1), హారిస్ రవూఫ్(0)లను త్వరత్వరగా పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుని పాక్‌ను కోలుకోని దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఆడం మిల్నే రెండు, బెన్ సియర్స్ రెండు, ఇష్ సోధి ఒక వికెట్ దక్కించుకున్నారు. కివీస్ బౌలర్ల విజృంభణతో 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక పాకిస్తాన్ కెప్టెన్‌గా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో అతడు బౌలర్‌గా, సారథిగానూ విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ఆఫ్రిది.. కెప్టెన్‌గా అరంగేట్ర మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాడు. మరోవైపు.. కివీస్‌ను గెలిపించిన డారిల్ మిచెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అవార్డు దక్కింది. -
NZ VS PAK 1st T20: డారిల్ మిచెల్ ఊచకోత
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి కివీస్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించగా.. 417 రోజుల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (57) రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిన్ అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో మార్క్ చాప్మన్ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్స్ 19, ఆడమ్ మిల్నే 10 పరుగులు చేశారు. మ్యాట్ హెన్రీ 0, టిమ్ సౌథీ 6 పరుగులతో అజేయంగా నిలిచారు. డారిల్ మిచెల్ క్రీజ్‌లో ఉన్న సమయంలో కివీస్ 250కి పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే అతను ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడకపోవడంలో కివీస్ 226 పరుగులతో సరిపెట్టుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-46-3), ఆమిర్ జమాల్ (4-0-56-0), ఉసామా మిర్‌లను (4-0-51-0) కివీస్ బ్యాటర్లు ఆటాడుకున్నారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్‌లకు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్.. షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 2 సిక్స్‌లు, 3 బౌండరీల సాయంతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. పాకిస్తాన్‌ను అబ్బాస్ అఫ్రిది (4-0-34-3), హరీస్ రౌఫ్ (4-0-34-2) కాపాడారు. వీరిద్దరు కాస్త పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు. -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్‌గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్‌లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
ధన్యవాదాలు.. పాక్ క్రికెట్‌తో ప్రయాణం ముగిసిపోయింది
Pakistan Cricket Team: పాకిస్తాన్ హై పర్ఫామెన్స్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో తన ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. ఐదేళ్లకు పైగా మూడు భిన్న పాత్రలు పోషించానన్న బ్రాడ్‌బర్న్.. ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్‌ను రెండేళ్ల కాలానికి గానూ తొలుత హెడ్‌కోచ్‌గా నియమించుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మే, 2023లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో పాక్ జట్టు కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. తన మార్కు చూపిస్తున్న హఫీజ్ ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ప్రక్షాళన చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా కోచింగ్ సిబ్బంది ఫోర్ట్పోలియోలు మార్చాడు. ఈ క్రమంలో బ్రాడ్‌బర్న్ హై పర్ఫామెన్స్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగా.. ఇటీవల అతడి స్థానంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ యాసిర్ అరాఫత్‌ను నియమించాడు. పాక్‌తో ప్రయాణం ముగిసిపోయింది ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ టీ20 సిరీస్ నుంచి యాసిర్ సేవలను వినియోగించుకోనున్నట్లు పీసీబీ తెలిపింది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బ్రాడ్‌బర్న్ తాజాగా ప్రకటన విడుదల చేశాడు. ‘‘చాలా చాలా ధన్యవాదాలు. పాకిస్తాన్ క్రికెట్‌తో అద్భుతమైన అధ్యాయం ముగిసిపోయింది. అద్భుతమైన ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందితో పనిచేసినందుకు గర్వంగా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’’ అని గ్రాంట్ బ్రాడ్‌బర్న్ ఎక్స్ వేదికగా నోట్ షేర్ చేశాడు. అతడు ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లామోర్గాన్ హెడ్‌కోచ్‌గా నియమితుడైనట్లు సమాచారం. కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌తో కెప్టెన్‌గా షాహిన్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ నియమితుడయ్యాడు. Bohat Bohat Shukriya 🇵🇰 pic.twitter.com/n0k0pagdtb — Grant Bradburn (@Beagleboy172) January 7, 2024 -
పాకిస్తాన్ వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ తప్పుకోవడంతో పాక్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. తాజాగా అఫ్రిదికి డిప్యూటీగా రిజ్వాన్ ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి అఫ్రిది, రిజ్వాన్ బాధ్యతలు చేపడతారు. .@iMRizwanPak has been appointed vice-captain of Pakistan's T20I team 🚨 pic.twitter.com/0Zu6DcstML — Pakistan Cricket (@TheRealPCB) January 8, 2024 కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాక్ న్యూజిలాండ్ గడ్డపై ల్యాండ్ అయ్యింది. జనవరి 12, 14, 17, 19, 21 తేదీల్లో ఆక్లాండ్, హామిల్టన్, డునెడిన్, క్రైస్ట్ చర్చ్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. బాబర్ ఆజమ్ పాక్ కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత ఆ దేశ టెస్ట్ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టెస్ట్, టీ20 జట్లకు కెప్టెన్లను ప్రకటించిన పీసీబీ వన్డే జట్టు కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడిన పాక్.. 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్ మొత్తం పాక్ పేలవ ప్రదర్శన కనబర్చి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌కు ముందు వరల్డ్‌కప్‌లోనూ పాక్ చెత్త ఆడి సెమీస్‌కు చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20లకు పాక్ జట్టు: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్) , మహ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్, జమాన్ ఖాన్ -
ఆసీస్‌తో మూడో టెస్టు: పాక్ తుది జట్టు ప్రకటన.. షాహిన్‌కు నో ఛాన్స్
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు తమ తుది జట్టును పాకిస్తాన్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది దూరమయ్యాడు. గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న అఫ్రిదికి మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై వేటుపడింది. అతడి స్ధానంలో యువ ఓపెనర్ సైమ్ అయూబ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. అదే విధంగా మరో యువ పేసర్ సాజిద్ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టెస్టు సిరీస్ అనంతరం 5 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో పాక్ జట్టును అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు. ఆసీస్‌తో మూడో టెస్టుకు పాక్ జట్టు: సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, సాజిద్ ఖాన్, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్. చదవండి: Petra Kvitova: అభిమానులకు శుభవార్త చెప్పిన టెన్నిస్ స్టార్.. ఆటకు దూరం -
తప్పిదారి షాహిన్ కెప్టెన్ అయ్యాడు: అల్లుడిపై ఆఫ్రిది విమర్శలు!
పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ ఎంపిక గురించి ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథి అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్ రిజ్వాన్‌కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో షాన్ మసూద్‌ను కెప్టెన్ చేసిన పాక్ క్రికెట్ బోర్డు.. టీ20 సారథ్య బాధ్యతలను పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మసూద్ నాయకత్వంలో టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టు.. తదుపరి షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆటగాడిగా రిజ్వాన్‌ను నేను ఆరాధిస్తాను. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిపాయి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. తనొక గొప్ప యోధుడు’’ అని మహ్మద్ రిజ్వాన్‌ను ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘రిజ్వాన్‌ను పాక్ టీ20 కెప్టెన్‌గా చూడాలనుకున్నాను. కానీ తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథిగా ఎంపికయ్యాడు’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆ సమయంలో హ్యారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో పాటు అక్కడే ఉన్న షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా షాహిద్ ఆఫ్రిదికి షాహిన్ ఆఫ్రిది సొంత అల్లుడన్న సంగతి తెలిసిందే. షాహిద్ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్.. జనవరి 3 నుంచి నామమాత్రపు మూడో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్ వా Shahid Afridi praised Muhammad Rizwan and said that Rizwan should have been captain of T20 but Shaheen became it by mistake.#Rizwan #PakistanCricket pic.twitter.com/TSECe93ZPM — Ahtasham Riaz 🇵🇰 (@AhtashamRiaz_) December 30, 2023 -
పాక్ పేసర్ల దెబ్బ: కుప్పకూలిన ఆసీస్ టాపార్డర్.. మార్ష్ సెంచరీ మిస్
బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో పాకిస్తాన్ బౌలర్లు విజృంభించారు. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా కలిసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. అయితే, మిడిలార్డర్లో స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్ అర్ధ శతకాలతో రాణించి ఆసీస్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కానీ.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆట ముగిసే సరికి 62.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. కాగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మంగళవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 318 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించగా.. పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే ఆలౌట్ అయింది. 194/6 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన పాక్ మరో 70 పరుగులు మాత్రమే జతచేయగలిగింది. ఈ క్రమంలో 54 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను పాకిస్తాన్ పేసర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను డకౌట్ చేసిన షాహిన్ ఆఫ్రిది.. మార్నస్ లబుషేన్(4) రూపంలో మరో వికెట్ కూల్చాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(6) వికెట్‌ను మీర్ హంజా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ట్రవిస్ హెడ్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ ఓపికగా ఆడుతూ పాక్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. మిచెల్ మార్ష్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే బాధ్యత తీసుకున్నాడు. వీరిద్దరు కలిసి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే, హంజా బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ బౌల్డ్ కావడంతో ఈ పార్ట్‌నర్‌షిప్‌నకు తెరపడింది. 130 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో అగా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో స్మిత్‌కు తోడైన అలెక్స్ క్యారీ ఆచితూచి ఆడాడు. పరుగులు రాబట్టలేకపోయినా వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే, మూడో రోజు ఆటలో సరిగ్గా ఆఖరి బంతికి స్మిత్‌ను షాహిన్ ఆఫ్రిది అవుట్ చేశాడు. దీంతో స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. దీంతో.. గురువారం 62.3 ఓవర్ వద్ద మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి.. 241 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అలెక్స్ క్యారీ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. Mitch Marsh gone for 96 - to an absolute belter at first slip from Agha Salman! #AUSvPAK pic.twitter.com/KNUP3kDr3j — cricket.com.au (@cricketcomau) December 28, 2023 -
మళ్లీ అదే పొరపాటు.. తలపట్టుకున్న ఆఫ్రిది! ఆటకు వర్షం అంతరాయం
Australia vs Pakistan, 2nd Test Day 1: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక పాక్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ షాన్ మసూద్ నమ్మకాన్ని నిలబెడుతూ పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను 38 పరుగులకే పరిమితం చేశారు. వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ వదిలేశాడు నిజానికి మూడో ఓవర్ ఆఖరి బంతికే అతడు అవుట్ కావాల్సింది. కానీ అబ్దుల్లా షఫీక్ చేసిన పొరపాటు వల్ల వార్నర్‌కు లైఫ్ లభించింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచాడు. అప్పటికి ఈ ఓపెనింగ్ బ్యాటర్ రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడు. అయితే, షషీక్ పొరపాటు వల్ల బతికిపోయిన వార్నర్‌ను పాక్ స్పిన్నర్ ఆఘా సల్మాన్ పెవిలియన్‌కు పంపాడు. 28వ ఓవర్ మొదటి బంతికి సల్మాన్ బౌలింగ్‌లో.. ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. David Warner gets a life on two! Shaheen Afridi gets the ball swinging and Abdullah Shafique puts it down at first slip #AUSvPAK pic.twitter.com/EJc4AptxJk — cricket.com.au (@cricketcomau) December 25, 2023 ఖవాజాను అవుట్ చేసిన హసన్ అలీ ఇక మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(101 బంతుల్లో 42 పరుగులు)ను పేసర్ హసన్ అలీ అద్భుత బంతితో అవుట్ చేశాడు. 33.1 ఓవర్ వద్ద అఘా సల్మాన్ అందుకున్న క్యాచ్‌తో ఖవాజా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ప్రస్తుతం మార్నస్ లబుషేన్ 14, స్టీవ్ స్మిత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆటకు వర్షం అంతరాయం కాగా ఆసీస్- పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఆటను నిలిపివేసే సమయానికి ఆస్ట్రేలియా 42.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అప్పుడు ఖవాజా.. ఇప్పుడు వార్నర్ ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ బృందం ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లోనూ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను షఫీక్ జారవిడిచిన విషయం తెలిసిందే. తాజాగా రెండో టెస్టులోనూ తప్పిదాన్ని పునరావృతం చేశాడు. అయితే, ఈసారి వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో అతడిపై నెట్టింట మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. చదవండి: IPL 2024: పాండ్యా కోసం రూ. 100 కోట్లు చెల్లించిన ముంబై? బంగారు బాతు కదా! -
పాక్ జట్టేమీ నేపాల్‌కు వెళ్లడం లేదు.. వాళ్లకు రెస్ట్ ఎందుకు?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై జనవరి 12 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్ ద్వారానే పాక్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్లు అతడి నాయకత్వంలో తొలిసారి మైదానంలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ సెలక్షన్ కమిటీ కన్సల్టెంట్, మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్‌కు వింత ప్రశ్న ఎదురైంది. స్థానిక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో యాంకర్.. ‘‘సీనియర్లు బాబర్ ఆజం, రిజ్వాన్‌లకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతినివ్వవచ్చు కదా?’’ అని అక్మల్‌ను అడిగారు. ఇందుకు అతడు బదులిస్తూ.. ‘‘సెలక్షన్ కమిటీలోని సభ్యులు కానీ.. మేనేజ్‌మెంట్‌గానీ న్యూజిలాండ్ సిరీస్‌లో బాబర్, రిజ్వాన్‌లకు రెస్ట్ ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే పాక్ జట్టు వెళ్తోంది న్యూజిలాండ్‌కు.. నేపాల్‌కు కాదు. అలాంటి పటిష్ట జట్టుతో పోటీపడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతినివ్వడం ఏమిటి? అసలు ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తారా?’’ అంటూ కమ్రాన్ అక్మల్ కౌంటర్ వేశాడు. ఇక షాన్ మసూద్ కెప్టెన్సీ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘కెప్టెన్‌గా లేదంటే కోచింగ్ సిబ్బందిగా కొత్తగా నియమితులైన వాళ్లకు.. తమను తాము నిరూపించుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే వారి పనితీరును అంచనా వేసే అవకాశం ఉంటుంది’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం అనంతరం పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజం వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లు అయ్యారు. ఈ క్రమంలో మసూద్ సారథ్యంలో తొలిసారి ఆసీస్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ తొలి టెస్టుల్లో చిత్తుచిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఇక డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ముగించుకుని తదుపరి న్యూజిలాండ్‌కు పయనం కానుంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు షాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్. చదవండి: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం? -
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో పాక్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్‌పేసర్ షాహీన్ అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. వన్డే వరల్డ్‌కప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20ల్లో పాక్ కొత్త కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిదిని వహాబ్ రియాజ్‌తో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అఫ్రిదికి కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్. ఇక కివీస్‌తో సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ గాయం కారణంగా దూరంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హ్యారీస్‌ను సెలక్టర్లు తప్పించారు. అదే విధంగా స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్, హసీబుల్లా ఖాన్‌కు తొలి సారి పాక్ టీ20 జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో టీ20లకు పాక్ జట్టు: షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రర్ అహ్మద్, రౌఫ్, జమాన్ ఖాన్. చదవండి: IPL 2024-SRH Captain: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. !? -
Aus Vs Pak: మేమేం తప్పు చేశాం భయ్యా? షాక్‌లో పాక్ ఫ్యాన్స్!
David Warner 164- Australia's dominance over Pakistan on Day 1: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి రోజు పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం సాధించింది. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు గురువారం ఆరంభమైంది. పెర్త్ వేదికగా మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆది నుంచే దూకుడైన బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. కొరకరాని కొయ్యగా మారి.. టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. దానిని శతకంగా మలచడంలో సఫలమయ్యాడు. మొత్తంగా 211 బంతులు ఎదుర్కొన్న ఈ వెటరన్ ఓపెనర్ 16 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 164 పరుగులు సాధించాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అందించిన శుభారంభాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ 16 పరుగులకే పెవిలియన్ చేరగా.. స్టీవ్ స్మిత్ 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ మాత్రం 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. వార్నర్ సెంచరీ కారణంగా ఈ మేరకు స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న వార్నర్ మొదటి మ్యాచ్ మొదటి రోజే సెంచరీ బాదడం విశేషం. అంతర్జాతీయ టెస్టుల్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు ఇది 26వ శతకం కాగా.. ఓవరాల్‌గా 49వది. ఇలా అద్భుత ఇన్నింగ్స్‌తో తనను విమర్శించిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన వార్నర్‌పై క్రికెట్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. పాక్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘మేమేం పాపం చేశాం వార్నర్ భాయ్?’’ అని బాధపడుతూ ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఇమ్రాన్ సిద్ధికీ అనే ఎక్స్ యూజర్.. ‘‘పాకిస్తాన్ మీద వార్నర్‌కు ఇది ఆరో సెంచరీ.. మేం చేసిన తప్పేంటి భయ్యా!’’ అంటూ వార్నర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో షేర్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఆస్ట్రేలియా- పాకిస్తాన్ తొలి టెస్టు తొలి రోజు ఆట మొత్తమంతా డేవిడ్ వార్నర్ ట్రెండింగ్‌లో నిలిచాడు. A century to silence all the doubters. David Warner came out meaning business today.@nrmainsurance #MilestoneMoment #AUSvPAK pic.twitter.com/rzDGdamLGe — cricket.com.au (@cricketcomau) December 14, 2023 Its a 6th Century for David Warner Against Pakistan Bhaii Humne Kya bigara hai ? pic.twitter.com/Gry5QkHbaN — ٰImran Siddique (@imransiddique89) December 14, 2023 -
పాక్ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్ టీ20 ఇన్నింగ్స్! చెత్త ఫీల్డింగ్‌తో
Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. పెర్త్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు ఫీల్డింగ్‌కు దిగిన పాక్‌కు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. ముఖ్యంగా వార్నర్ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ.. పాకిస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. ఖవాజా మాత్రం ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. Twin boundaries in the first! Shaheen has his tail up despite an expensive first over #AUSvPAK pic.twitter.com/oixensArZG — cricket.com.au (@cricketcomau) December 14, 2023 షఫీక్ ఆ క్యాచ్ జారవిడవడంతో పాక్ అరంగేట్ర పేసర్ ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ.. వార్నర్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనిస్తున్నాడు. కాగా పదహారో ఓవర్ ఆరంభంలో ఆమిర్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు ఉస్మాన్ ఖవాజా. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా అబ్దుల్లా షఫీక్ క్యాచ్ పట్టినట్టే పట్టి జారవిడిచాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఖవాజా.. మరోసారి తప్పిదం పునరావృతం చేయలేదు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 25 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది పటిష్ట స్థితిలో నిలిచింది. WTF bcci installed a chip in the ball 😤#AUSvsPAK pic.twitter.com/xoNuaUK3s9 — 𝙕𝙀𝙀𝙈𝙊™ (@Broken_ICTIAN) December 14, 2023 వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు చుక్కలే లంచ్ బ్రేక్ సమయానికి డేవిడ్ వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు సాధించగా.. ఉస్మాన్ ఖవాజా 84 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సహా ఇతర బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టాలని విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖవాజా ఇచ్చిన సిట్టర్‌ను డ్రాప్ చేసిన అబ్దుల్లా షఫీక్‌పై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. ఖవాజా క్యాచ్‌ను అతడు జారవిడిచిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉందన్న విషయం తెలిసిందే. 1995లో కంగారూ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్.. ఇంతవరకు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై? Tired of the conventional, David Warner's 12th boundary of the first session was nothing short of inventive! 😯#AUSvPAK @nrmainsurance #PlayOfTheDay pic.twitter.com/8ih9vnjhUj — cricket.com.au (@cricketcomau) December 14, 2023 -
టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్.. పీసీబీతో కూడా చెప్పాను!
Pakistan Cricket Captains: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ల మార్పుపై మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. టీ20 కెప్టెన్‌గా షాహిన్ షా ఆఫ్రిది నియామకంలో తన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశాడు. తన అల్లుడి కోసం ఎలాంటి లాబీయింగ్ చేయలేదని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీలో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. షాహిన్ కెప్టెన్ కావాలని కోరుకోలేదు ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 కెప్టెన్‌గా నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. టెస్టు పగ్గాలను షాన్ మసూద్‌కు అప్పగించింది. ఈ క్రమంలో టీ20 సారథిగా షాహిద్ నియామకంలో మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రమేయం ఉందనే వదంతులు వ్యాపించాయి. తన అల్లుడి కోసం ఆఫ్రిది పీసీబీ పెద్దల వద్ద లాబీయింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన ఆఫ్రిది.. ‘‘నేను అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చను. షాహిద్‌తో నాకున్న బంధుత్వం కారణంగా ఇలాంటి మాటలు వినిపిస్తాయని నాకు తెలుసు. ఒకవేళ నేను లాబీయింగ్ చేసే వాడినే అయితే.. పీసీబీ చైర్మన్‌ను ఎందుకు విమర్శిస్తాను? నేను ఏ రోజూ కూడా షాహిన్‌ను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేయలేదు. మహ్మద్ రిజ్వాన్‌తో బాబర్ ఆజం నిజానికి అతడు సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండాలనే కోరుకున్నా. అయితే, షాహిన్‌ను సారథిగా నియమించాలన్నది పూర్తిగా పీసీబీ చైర్మన్, మహ్మద్ హఫీజ్ నిర్ణయం. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్ బాబర్ ఆజంనే కెప్టెన్‌గా కొనసాగించాలని పీసీబీ చైర్మన్‌తో గతంలో చెప్పాను. ఒకవేళ అతడు తప్పుకోవాలని భావిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో మహ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా చేయాలని.. టెస్టుల్లో మాత్రం బాబర్‌నే కొనసాగించాలని పీసీబీకి చెప్పాను’’ అని సామా టీవీ షోలో పేర్కొన్నాడు. కాగా షాహిద్ ఆఫ్రిది పెద్ద కుమార్తె అన్షాను షాహిన్ వివాహమాడిన విషయం తెలిసిందే. చదవండి: CWC 2023: ద్రవిడ్‌తో కలిసి పిచ్ పరిశీలించిన రోహిత్! క్యూరేటర్ చెప్పిందిదే! -
పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది.. టెస్టు సారధి ఎవరంటే?
అన్నిఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టెస్టు, టీ20 ఫార్మాట్లలో తమ కొత్త కెప్టెన్లను ప్రకటించింది. పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది ఎంపికయ్యాడు. అదే విధంగా తమ టెస్టు కెప్టెన్‌గా వెటరన్ ఆటగాడు షాన్ మసూద్‌ను పీసీబీ నియమించింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా పీసీబీ పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే వన్డేలకు మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ కొత్త కెప్టెన్‌ను ప్రకటించలేదు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు వన్డేల్లో సారథ్య బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడు ఫార్మాటల్లో వేర్వేరు కెప్టెన్లను నియమించాలని పీసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. చదవండి: CWC 2023: హృదయాన్ని తాకావు.. నా రికార్డు బ్రేక్ చేయడం సంతోషం: సచిన్ ట్వీట్ వైరల్ -
షాహీన్ అఫ్రిది అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్‌కప్ చరిత్రలోనే
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అత్యంత చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ బౌలర్‌గా అఫ్రిది నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 90 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా ఈ చెత్త రికార్డును అఫ్రిది తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లు మొత్తం బౌలింగ్ చేసిన అఫ్రిది ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. కాగా ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు తన సహచర పేసర్ హసన్ అలీ పేరిట ఉండేది. 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌లో అలీ ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో హ్యారీస్ రవూఫ్ కూడా చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో 85 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో రవూఫ్ కూడా హసన్ అలీని దాటేశాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో అఫ్రిది తర్వాత రవూఫ్ ఉన్నాడు. చెలరేగిన కివీస్ బ్యాటర్లు.. కాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. చదవండి: WC 2023: సెంచరీతో చెలరేగిన రచిన్.. సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా -
‘టాప్’ ర్యాంక్‌లో షాహిన్ అఫ్రిది
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది తొలిసారి టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో షాహిన్ అఫ్రిది 673 పాయింట్లతో ఏడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు. హాజల్‌వుడ్ (ఆస్ట్రేలియా) టాప్ నుంచి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్ యాదవ్ వరుసగా మూడు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో షాహిన్ 16 వికెట్లు పడగొట్టి ఆడమ్ జంపా (ఆ్రస్టేలియా), మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వన్డే ఫార్మాట్లో ఏకకాలంలో బౌలింగ్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ క్రికెటర్లు నంబర్‌వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. -
World Cup 2023: వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా షాహిన్ అఫ్రిది..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ స్పీడ్ స్టార్ షాహిన్ షా అఫ్రిది అదరగొట్టాడు. తొలిసారి వరల్డ్ నెంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. వన్డే ప్రపంచకప్-2023లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అఫ్రిది.. ఏకంగా 7 స్ధానాలు ఎగబాకి అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్‌వుడ్‌ని వెనక్కినెట్టి 673 రేటింగ్ పాయింట్లతో టాప్-1లోకి షాహీన్ దూసుకువచ్చాడు. కాగా ఏ ఫార్మాట్లోనైనా నెం.1 ర్యాంక్‌ను చేరుకోవడం అఫ్రిదికి ఇదే మొదటి సారి. వన్డే ప్రపంచకప్-2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన అఫ్రిది 16 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వంద వికెట్ల మైలురాయి.. అంతర్జాతీయ వన్డేల్లో మరో అరుదైన ఘనతను అఫ్రిది అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో షాహీన చెలరేగాడు. చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన డికాక్.. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలోనే! -
అతడు అద్భుతం.. క్రెడిట్ మొత్తం వాళ్లకే.. ఆ రెండు మ్యాచ్‌లు గెలుస్తాం: బాబర్
WC 2023 Ban Vs Pak: Babar Azam Credits to the boys: ‘‘మా ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ అదరగొట్టారు. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకే దక్కుతుంది. ఫఖర్ జమాన్ గనుక 20-30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. తనదైన శైలిలో ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. తనను ఇలా చూడటం సంతోషంగా ఉంది. తదుపరి రెండు మ్యాచ్‌లు కూడా గెలిచేందుకు మేము శాయశక్తులా కృషి చేస్తాం. అప్పుడు మేము ఎక్కడిదాకా చేరుకుంటామో చూద్దాం! ఈరోజు షాహిన్ మాకు అద్భుత ఆరంభం అందించాడు. నిజానికి బంగ్లా ఇన్నింగ్స్‌లో 15-20 ఓవర్ల మధ్యలో వాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆ సమయంలో మా ప్రధాన బౌలర్లు వాళ్లను విడగొట్టడంలో సఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టగలిగారు’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం హర్షం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌పై పాక్ విజయం ఈడెన్ గార్డెన్స్‌లో తమకు మద్దతుగా నిలిచినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా కోల్‌కతాలో మంగళవారం నాటి మ్యాచ్‌లో పాక్.. బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుని సెమీస్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం చేతిలో ఓడిన బంగ్లాదేశ్ అధికారికంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అతడు అద్భుతం ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు ఓటముల తర్వాత దక్కిన విజయంపై స్పందించిన బాబర్ ఆజం సంతోషం వ్యక్తం చేశాడు. కోల్‌కతా ప్రేక్షకులు తమకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై బాబర్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా తమ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే బంగ్లాను దెబ్బకొట్టగా.. అంతా కలిసి సమిష్టిగా బంగ్లాదేశ్‌ను ఓడించగలిగామని తమ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఆరంభ మ్యాచ్‌లలో విఫలమైన ఫఖర్ జమాన్ బంగ్లాతో మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకంతో పాక్‌కు విజయాన్ని అందించడం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ టోర్నీలో పాక్ తదుపరి న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో తలపడనుంది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా ►టాస్: బంగ్లాదేశ్- బ్యాటింగ్ ►బంగ్లాదేశ్ స్కోరు: 204 (45.1) ►పాకిస్తాన్ స్కోరు: 205/3 (32.3) ►ఫలితం: బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో పాక్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫఖర్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు). చదవండి: Virat Kohli: అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్ అంటున్న బాలీవుడ్ స్టార్! ఎందుకంటే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఎట్టకేలకు పాకిస్తాన్ ఓటములకు బ్రేక్.. వరల్డ్‌కప్ రేసు నుంచి బంగ్లా అవుట్
ICC Cricket World Cup 2023 Ban Vs Pak: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజం బృందం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా వరుస ఓటములకు ముగింపు పలికి సెమీస్ రేసు నుంచి తాము పూర్తిగా నిష్క్రమించలేదని చాటిచెప్పింది. వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ మరోవైపు.. పాక్ చేతిలో ఓటమితో బంగ్లాదేశ్ ప్రపంచకప్ ఈవెంట్ సెమీస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ పేసర్ల విజృంభణతో ఆది నుంచే ఎదురుదెబ్బలు తిన్న షకీబ్ అల్ హసన్ బృందం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. View this post on Instagram A post shared by ICC (@icc) పాక్ పేసర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ లిటన్ దాస్(45), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(43), మెహదీ హసన్ మిరాజ్(25) పర్వాలేదనిపించగా.. మహ్మదుల్లా అర్ధ శతకం(56)తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 3, హ్యారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్‌కు మూడు వికెట్లు దక్కగా.. స్పిన్ బౌలర్లు ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ చెరో వికెట్ తీశారు. View this post on Instagram A post shared by ICC (@icc) అదరగొట్టిన పాక్ ఓపెనర్లు ఇక బంగ్లా విధించిన స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన పాకిస్తాన్ 32.3 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షషీక్(68), ఫఖర్ జమాన్(81) హాఫ్ సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. బాబర్ నిరాశపరిచినా.. రిజ్వాన్ పూర్తి చేశాడు అయితే, కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(26), ఇఫ్తికర్ అహ్మద్(17) ఆఖరి వరకు అజేయంగా నిలిచి పాకిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ మ్యాచ్‌లో 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసిన ఫఖర్ జమాన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక బంగ్లాపై గెలుపుతో పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: చరిత్ర సృష్టించిన షాహిన్ ఆఫ్రిది.. తొలి బౌలర్‌గా రికార్డు
ICC WC 2023- Ban Vs Pak: భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023 సందర్భంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో పాక్ తరఫున అరుదైన ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బాబర్ ఆజం బృందం మంగళవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే వికెట్ ఈ క్రమంలో బౌలింగ్ అటాక్ ఆరంభించిన పాక్ స్పీడ్‌స్టర్ షాహిన్ ఆఫ్రిది తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టాడు. మొదటి ఓవర్ ఐదో బంతికి బంగ్లాదేశ్ ఓపెనర్ తాంజిద్ హసన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో ఆఫ్రిది సంధించిన బంతి వికెట్లను హిట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతో తాంజిద్ వెనుదిరగతప్పలేదు. సక్లెయిన్ ముస్తాన్ దీంతో పాకిస్తాన్‌కు తొలి వికెట్ దక్కగా.. షాహిన్ ఆఫ్రిది తన అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 100 వికెట్ల మైలురాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో పాక్ బౌలర్లలో ఇంత వరకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. తక్కువ మ్యాచ్‌లలోనే వంద వికెట్లు పడగొట్టిన పాక్ తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ వన్డేల్లో వేగవంతంగా(మ్యాచ్‌ల పరంగా) వంద వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే.. ►సందీప్ లమిచానే(నేపాల్)- 42 మ్యాచ్‌లలో ►రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 44 మ్యాచ్‌లలో ►షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్)- 51 మ్యాచ్‌లలో ►మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)- 52 మ్యాచ్‌లలో ►సక్లెయిన్ ముస్తాక్(పాకిస్తాన్)- 53 మ్యాచ్‌లలో. చదవండి: టీమిండియా ఇక చాలు! దిష్టి తగులుతుంది.. ఆ గండం గట్టెక్కితే! వరల్డ్ రికార్డు మనదే View this post on Instagram A post shared by ICC (@icc) -
ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మా వాళ్లకు అఫ్గన్తోనూ కష్టమే: పాక్ మాజీ క్రికెటర్
‘‘ఒక్క క్యాచ్ జారవిడిచినందుకు మరీ ఇంత ఘోరంగా శిక్షించడం నేనిదే తొలిసారి చూస్తున్నా. చాలా మంది చాలా సార్లు క్యాచ్‌లు డ్రాప్ చేస్తారు. కానీ.. అలా ఫీల్డర్ తప్పిదం కారణంగా దొరికిన లైఫ్ ద్వారా 150- 160 పరుగులు స్కోరు చేయడమంటే మాటలు కాదు. పాకిస్తాన్‌కు ఇదొక మేలుకొలుపు లాంటిది. క్యాచ్‌లు మిస్ చేసినంత కాలం ఇలాంటి పనిష్మెంట్లు పునరావృతమవుతూనే ఉంటాయి. ఒక్కసారి లయ తప్పితే తిరిగి కోలుకోవడం కష్టం’’ అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా బాబర్ ఆజం బృందానికి చురకలు అంటించాడు. నెలరోజుల క్రితం వరకు వరల్డ్‌క్లాస్ బౌలింగ్ దళం కలిగి ఉన్న జట్టుగా నీరజనాలు అందుకున్న టీమ్ ఏకంగా 365 పరుగులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకోకపోతే ఇంతకంటే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ చిత్తైన విషయం తెలిసిందే. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121)ల అద్భుత ప్రదర్శనతో ఆసీస్ భారీ స్కోరు చేసి గెలుపొందగా.. పాక్‌కు పరాభవం తప్పలేదు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే వార్నర్‌ను అవుట్ చేసే సువర్ణావకాశాన్ని పాక్ చేజార్చుకుంది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను ఉసామా మిర్ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత మరోసారి ఇదే తరహాలో లైఫ్ పొందిన వార్నర్ ఏకంగా 163 పరుగులు స్కోరు చేశాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చేతిలో పాకిస్తాన్ ఓటమిపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా.. ఫీల్డింగ్ తప్పిదాలే కొంపముంచాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక తప్పునకు వార్నర్ ఇంతలా పనిష్ చేస్తాడని ఇకనైనా లోపాలు సరిచేసుకోవాలని హితవు పలికాడు. ఇక తదుపరి మ్యాచ్‌లో పాక్ అఫ్గన్‌తో తలపడనున్న నేపథ్యంలో.. ‘‘చెన్నైలో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ అంత ఈజీ కాదు. పాకిస్తాన్ బ్యాటర్లు స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కోలేరు. ఏం జరుగుతుందో చూడాలి’’ అని మాజీ బ్యాటర్ రమీజ్ రాజా నిట్టూర్చాడు. చదవండి: WC 2023: సన్‌రైజర్స్‌కు ఆడినపుడు చాలా నేర్చుకున్నా: వార్నర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
మరీ చెత్తగా! బ్యాటర్లంతా అతడి వెంటే పడుతున్నారు: పాక్ బౌలర్‌పై సెటైర్లు
ICC ODI WC 2023: పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో వన్డే వరల్డ్‌కప్-2023 బరిలోకి దిగిన అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడని విమర్శించాడు. రవూఫ్ బౌలింగ్ అంటే చాలు బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మరీ చెత్తగా బౌలింగ్ చేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121) విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు పాక్ బౌలర్ల పప్పులు ఉడకలేదు. వీరిద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్‌బౌలర్ హ్యారిస్ రవూఫ్ 8 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ వార్నర్- మార్ష్ ద్వయం కారణంగా అప్పటికే ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. వికెట్లు తీసి ఏం లాభం? ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే కుప్పకూలడంతో 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘షాహిన్ ఆఫ్రిది 5 వికెట్లు తీయడంతో పాకిస్తాన్ తిరిగి పుంజుకోగలిగింది. హ్యారిస్ రవూఫ్ కూడా ఆఖర్లో వికెట్లు తీశాడు. బ్యాటర్లు అతడి వెంట పడి తరుముతున్నారు కానీ ఏం లాభం! ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ట్యాప్ విరిగి నీళ్లు పారినట్లుగా ఆసీస్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు. రవూఫ్ బౌలింగ్‌లో చితక్కొట్టారు. ఇప్పటికే ఈ టోర్నీలో చాలా మంది బ్యాటరుల రవూఫ్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. టెర్రర్ బౌలర్‌గా టోర్నమెంట్లో అడుగుపెట్టిర రవూఫ్ ఆ స్థాయికి తగ్గట్లు ప్రభావం చూపలేకపోతున్నాడు. బ్యాటర్లు అతడి వెంట పరిగెడుతూ పరుగులు సాధిస్తున్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌ను విమర్శించాడు. అయితే, తనదైన రోజు అతడు కచ్చితంగా ప్రభావం చూపుతాడని ఆకాశ్ చోప్రా పేర్కొనడం కొసమెరుపు. చదవండి: కోహ్లి సెంచరీ చేసిన తీరును తప్పుబట్టిన పుజారా! త్యాగం చేయాల్సింది.. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.: బాబర్ ఆజం
ICC ODI WC 2023- Aus Vs Pak- Babar Azam Comments On Loss: ‘‘మా స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. ఇక వార్నర్ లాంటి బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ జారవిడిస్తే.. అతడు వదిలిపెడతాడా? కచ్చితంగా మనం మూల్యం చెల్లించుకునేలా చేస్తాడు. నిజానికి ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు సాధారణమే. మా లక్ష్యం కూడా మరీ ఛేదించలేనిదైతే కాదు. ఏదేమైనా మా ఫాస్ట్‌బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి ఓవర్లలో మెరుగైన ప్రదర్శనతో తిరిగి పుంజుకునేలా చేశారు. మేము టార్గెట్ ఛేజ్ చేయగలమనే సందేశాన్ని ఇచ్చారు. View this post on Instagram A post shared by ICC (@icc) గతంలో ఇలాంటివి మాకు అనుభవమే. కానీ ఈరోజు అలా జరుగలేదు. మిడిల్ ఓవర్లలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్ వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు.. పాక్‌ను 62 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. వార్నర్, మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న బాబర్ ఆజం బృందం.. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121)లను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది. వారిద్దరిని అవుట్ చేసినప్పటికీ అప్పటికే స్కోరు బోర్డుపై భారీ స్కోరుకు పునాది పడింది. ఆరంభంలో వార్నర్ ఇచ్చిన క్యాచ్‌లను రెండుసార్లు మిస్ చేయడంతో పాక్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తిరిగి పుంజుకున్న పాక్ బౌలర్లు ఆసీస్ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌ను దాదాపు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసినా.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఓపెనింగ్ జోడీ శుభారంభం.. కానీ నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. పాక్ పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అత్యధికంగా 5 వికెట్లు దక్కాయి. ఈ క్రమంలో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(64), ఇమామ్ ఉల్ హక్(70) శుభారంభాలు అందించినా.. కెప్టెన్ బాబర్ ఆజం 18 పరుగులకే పెవిలియన్ చేరడం ప్రభావం చూపింది. మిగతా వాళ్లలో మహ్మద్ రిజ్వాన్ 46, సౌద్ షకీల్ 30, ఇఫ్తికర్ అహ్మద్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆసీస్ బౌలర్ల ధాటికి లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్ ఆడం జంపా ఆది నుంచే ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా 45.3 ఓవర్లలో 305 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. ఓటమికి ప్రధాన కారణం అదే ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన పాకిస్తాన్ సారథి బాబర్ ఆజం.. ‘‘ఆసీస్ ఇన్నింగ్స్‌లో తొలి 10 ఓవర్లలో మా బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సింది. అదే విధంగా.. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు ఇంకాస్త బెటర్‌గా ఆడితే బాగుండేది’’ అంటూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో మెరిసిన డేవిడ్ వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: టీమిండియాకు షాక్! బీసీసీఐ కీలక ప్రకటన.. పాండ్యా అవుట్.. ఇక View this post on Instagram A post shared by ICC (@icc) -
అవకాశాలు సృష్టించుకోవడం ఎలాగో రాదు.. కనీసం! పాక్ చెత్త ఫీల్డింగ్ వల్లే..
ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలపై ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. అవకాశాలు సృష్టించుకోవడం ఎలాగో చేతకాదు.. కనీసం బ్యాటర్లు ఇచ్చిన ఛాన్స్‌ను కూడా వినియోగించుకోరా అంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఆరంభం నుంచే ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడారు. అయితే, ఐదో ఓవర్లోనే వార్నర్‌ను పెవిలియన్‌కు పంపే అవకాశం వచ్చింది. పాక్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సంధించిన షార్ట్ బాల్‌ను వార్నర్ మిడాన్ దిశగా గాల్లోకి లేపగా.. ఉసామా మిర్ సింపుల్ క్యాచ్ అందుకోలేకపోయాడు. View this post on Instagram A post shared by ICC (@icc) అంతేకాదు.. 33వ ఓవర్లో మరోసారి వార్నర్ ఇచ్చిన అవకాశాన్ని కూడా పాక్ ఫీల్డర్లు ఉపయోగించుకోలేకపోయారు. ఉసామా మిర్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ డీప్ దిశగా బాదగా.. అబ్దుల్లా షఫీక్ క్యాచ్ జారవిడిచాడు. ఈ నేపథ్యంలో.. ‘‘అవకాశాలు సృష్టించుకోవడం చేతకానపుడు.. కనీసం బ్యాటర్లు ఇచ్చిన అవకాశాలనైనా సద్వినియోగం చేసుకోవచ్చు కదా! ఇన్ని క్యాచ్‌లు డ్రాప్ చేయడం సరికాదు.. కమాన్ బాయ్స్’’ అంటూ షోయబ్ అక్తర్ పాక్ ఆటగాళ్లను విమర్శించాడు. కాగా పాక్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా రెండుసార్లు లైఫ్ పొందిన వార్నర్ మొత్తంగా 124 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 163 పరుగులు చేసి హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక వార్నర్‌కు తోడుగా మరో ఓపెనర్ మిచెల్ మార్ష్(121) సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీ స్కోరు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) As it is, you're not able to create opportunities. Atleast grab the ones which batters are giving. Come on guys, you cant drop so many catches!!!!!! — Shoaib Akhtar (@shoaib100mph) October 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆస్ట్రేలియాతో మ్యాచ్.. పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్!
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్.. మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్ జట్టు చేరుకుంది. అయితే ఆదివారం బెంగళూరుకు చేరుకున్న పాక్ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం పాల్గోనలేదు. ఎందుకంటే పాక్ జట్టులో నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. వారిలో షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరికి వైద్య సిబ్బంది కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌గా తేలింది. అయితే ఆసీస్‌తో మ్యాచ్ సమయానికి వీరు కోలుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు చిన్నస్వామి స్టేడియంలో తమ తొలి ప్రాక్టీస్ పాల్గొనవలసింది. కానీ ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నందన ప్రాక్టీస్ సెషన్స్‌ను సపోర్ట్ స్టాప్ నిర్వహించలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. చదవండి: OTD: లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే..! వీడియో చూశారా -
షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి సోదరి మంగళవారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని అఫ్రిది సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. "మా సోదరి మమ్మల్ని విడిచిపెట్టి ఆ దేవుడు వద్దకు వెళ్లిపోయింది. ఆమె మరణవార్తను మా బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె ఆంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి" అని అఫ్రిది ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ప్రముఖులు, అభిమానులు అఫ్రిదికి సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే "తన చెల్లిని చూసేందుకు వెళ్తున్నాననీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని శనివారం(ఆక్టోబర్ 16) రాత్రి ఆఫ్రిది ట్విట్ చేశాడు. కానీ అతడు ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే ఆమె మృతి చెందింది. కాగా షాహిద్ అఫ్రిది కుటుంబంలో మొత్తం 11 మంది ఉన్నారు. అందులో ఆరుగురు సోదరులు, అయిదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. షాహిద్ సోదరులు తారిక్ అఫ్రిది, అష్ఫక్ అఫ్రిది కూడా క్రికెటర్లే. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది.. షాహిద్ అఫ్రిదికి అల్లుడే అన్న విషయం తెలిసిందే. చదవండి: SMAT 2023: 42 బంతుల్లో శతక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్ (إِنَّا ِلِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ,) Surely we belong to Allah and to him we shall return. With Heavy hearts we inform you that our beloved Sister passed away and her Namaz e Janazah will be at 17.10.2023 after Zuhur prayer at Zakariya masjid main 26th street… https://t.co/Ly4sK6XVGT — Shahid Afridi (@SAfridiOfficial) October 17, 2023 -
WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
ICC ODI World Cup 2023- India vs Pakistan Updates: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ అప్డేట్స్: భారత్ ఘన విజయం.. అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ( 63 బంతుల్లో 86 పరుగులు)అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్పాకిస్తాన్ 191 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, జడేజా తలా రెండు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. పాకిస్తాన్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50),మహ్మద్ రిజ్వాన్(49) టాప్ స్కోరర్లగా నిలిచారు. 25 ఓవర్లకు భారత్ స్కోర్: 165/3 25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 23 పరుగులు అవసరం. 24 ఓవర్లలో టీమిండియా స్కోరు: 162/3 అయ్యర్ 39, రాహుల్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. గెలుపొందాలంటే ఇంకో 30 పరుగులు అవసరం. చేతిలో ఇంకో ఏడు వికెట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ సెంచరీ మిస్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 86 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. భారత్ విజయానికి ఇంకా 36 పరుగులు కావాలి. 21.4 ఓవర్లకు భారత్ స్కోర్: 156/3 19 ఓవర్లకు భారత్ స్కోర్: 129/2 19 ఓవర్లకు భారత్ స్కోర్: 128/2, క్రీజులో రోహిత్ శర్మ(68), శ్రేయస్ అయ్యర్(26) పరుగులతో ఉన్నారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్‌సెంచరీతో చెలరేగాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో రోహిత్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 101/2, క్రీజులో రోహిత్ శర్మ(51), శ్రేయస్ అయ్యర్(15) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్ 79 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హసన్ అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 9 ఓవర్లకు భారత్ స్కోర్: 77/1 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(44)తో పాటు విరాట్ కోహ్లి(15) పరుగులతో ఉన్నాడు. 7 ఓవర్లకు భారత్ స్కోర్: 54/1 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(23), విరాట్ కోహ్లి(13) పరుగులతో ఉన్నారు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 31/1 4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(14), విరాట్ కోహ్లి(0) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్.. 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన గిల్.. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. టీమిండియా విజయ లక్ష్యం: 192 పరుగులు 1: తొలి ఓవర్లో 10 పరుగులు షాహిన్ ఆఫ్రిది పాక్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మొదటి బంతికే ఫోర్ బాదాడు. మూడో బంతినీ బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో టీమిండియా తొలి ఓవర్లో 10 పరుగులు(సింగిల్స్‌తో కలిపి) రాబట్టింది. 42.5: టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ 191 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా బౌలింగ్‌లో హ్యారిస్ రవూఫ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) 40.1: తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి హసన్ అలీ అవుట్. తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. స్కోరు: 187/9 (40.1) 39.6: ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి మహ్మద్ నవాజ్(4) అవుట్. పాక్ స్కోరు: 187-8(40) 39 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 182/7 హసన్ అలీ 7, నవాజ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. 35.2: మరోసారి బుమ్రా మ్యాజిక్ ఏడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. బుమ్రా బౌలింగ్‌లో షాదాబ్ ఖాన్ బౌల్డ్(2). పాకిస్తాన్ స్కోరు: 172/7 (36). హసన్ అలీ, మహ్మద్ నవాజ్ క్రీజులో ఉన్నారు. బుమ్రా సరైన సమయంలో సరైన వికెట్ 33.6: బుమ్రా కీలక వికెట్ పడగొట్టి పాక్‌ను దెబ్బకొట్టాడు. నిలకడగా ఆడుతున్న మహ్మద్ రిజ్వాన్(49) అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. 32.6: ఒకే ఓవర్లో రెండు వికెట్లు టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతం చేశాడు. 33వ ఓవర్ రెండో బంతికి షకీల్(6)ను వికెట్ల ముందు దొరకబ్చుకున్న కుల్దీప్.. ఆఖరి బంతికి ఇఫ్తికర్ అహ్మద్(4)ను బౌల్డ్ చేశాడు. స్కోరు- 166-5. 32.2: నాలుగో వికెట్ కోల్పోయిన పాక్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సౌద్ షకీల్ లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా ఈ వికెట్ సందర్భంగా డ్రామా నెలకొంది. అంపైర్ ఎరాస్మస్ షకీల్‌ను నాటౌట్‌గా ప్రకటించగా.. టీమిండియా రివ్యూకు వెళ్లి సక్సెస్ అయింది. హాక్- ఐ టెక్నాలజీతో షకీల్ ఎల్బీడబ్ల్యూగా తేలగా.. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. పాకిస్తాన్ స్కోరు 32 ఓవర్లలో- 162/3. సౌద్ షకీల్ 6, రిజ్వాన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. 29.5: ప్చ్.. రనౌట్ మిస్ సిరాజ్ బౌలింగ్‌లో సౌద్ షకీల్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.30 ఓవర్లలో పాక్ స్కోరు: 156-3 29.4: సిరాజ్ బౌలింగ్‌లో బాబర్ బౌల్డ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బాబర్ ఆజం(50)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. దీంతో పాక్ మూడో వికెట్ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు సిరాజ్ మియాకు ఇది రెండో వికెట్. పాక్ స్కోరు: 156/3 (29.5) 29: అర్ధ శతకంతో మెరిసిన బాబర్ పాక్ కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా క్రీజులో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సైతం 43 పరుగులతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. 25 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 125-2 బాబర్35, రిజ్వాన్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. 24.3: రివ్యూ కోల్పోయిన టీమిండియా కుల్దీప్ బౌలింగ్‌లో బాబర్ రివర్స్ స్వీప్ షాట్... ఎల్బీకి అప్పీలు చేసిన కుల్దీప్. అంపైర్స్ కాల్ నాటౌట్ కావడంతో రివ్యూకు వెళ్లిన టీమిండియా. కానీ ప్రతికూల ఫలితం.. బతికిపోయిన బాబర్. నిలకడగా ఆడుతున్న రిజ్వాన్, బాబర్ పాక్ బ్యాటర్లు బాబర్ ఆజం 33, రిజ్వాన్ 30 పరుగులతో నిలకడగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 23 ఓవర్లలో పాక్ స్కోరు: 120-2 20వ ఓవర్: పాక్ బ్యాటర్లను కట్టడి చేసిన జడ్డూ.. స్కోరు: 103-2 పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసింది. జడేజా బౌలింగ్‌లో తొలి బంతికి రిజ్వాన్ ఒక పరుగు తీయగా.. మరుసటి బంతుల్లో ఒక్క రన్ కూడా రాలేదు. బాబర్ 30, రిజ్వాన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 19: సెంచరీ దాటిన పాక్ స్కోరు: 102-2 18 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 96-2. 15 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 79-2. రిజ్వాన్ 6, బాబర్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ రివ్యూ సక్సెస్ 13.1: జడేజా బౌలింగ్‌లో రిజ్వాన్ ఎల్బీడబ్ల్యూ.. రివ్యూకి వెళ్లిన పాక్‌కు అనుకూల ఫలితం. బిగ్ వికెట్ నిలుపుకోవడంతో పాక్ శిబిరంలో సంబరాలు. స్కోరు: 75/2 (14). బాబర్ 16, రిజ్వాన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. 12.3: రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(36(38) [4s-6]). స్కోరు: 73/2 (12.3). 12: రంగంలోకి కుల్దీప్.. పాక్ స్కోరు: 68-1 11: రెండు ఫోర్లు కొట్టిన బాబర్ ఆజం టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పాక్ బ్యాటర్లు 11వ ఓవర్లో 11 పరుగులు స్కోరు చేశారు. ఆరంభంలో తడబడ్డా.. బాబర్ ఆజం ఆఖరి రెండు బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు. బాబర్ 14, ఇమామ్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 60-1. 10: కట్టుదిట్టంగా సిరాజ్ బౌలింగ్.. ఒకే ఒక్క పరుగు ►బాబర్ 5, ఇమామ్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 49-1 ►9: పొదుపుగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా: 9వ ఓవర్లో పాక్ 7 పరుగులు(1 0 1 1 0 4) మాత్రమే రాబట్టగలిగింది. 7.6: తొలి వికెట్ కోల్పోయిన పాక్ ►సిరాజ్ బౌలింగ్‌లో అబ్దుల్లా షఫీక్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ తొలి వికెట్ కోల్పోగా.. స్కోరు: 41-1(8). ఇమామ్ ఉల్ హక్ 21, బాబర్ ఆజం క్రీజులో ఉన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) నిలకడగా ఆడుతున్న పాక్ ఓపెనర్లు పాక్ ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ 18, అబ్దుల్లా షఫీక్ 18 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు: 37/0. టీమిండియా బౌలర్లలో పేసర్లు బుమ్రా 4, సిరాజ్ 3 ఓవర్లు పూర్తి చేశారు. ►5 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 23/0. ఇమామ్ ఉల్ హక్ 13, అబ్దుల్లా షఫీక్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ►టీమిండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. పాక్ బ్యాటింగ్‌కు దిగింది. భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్ క్రీజులో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో టీమిండియా- పాక్ ఏడుసార్లు తలపడగా 7 సార్లూ విజయం మనల్నే వరించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ►తుది జట్లు.. టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్. చదవండి: ఆరంభం.. ముగింపు టీమిండియాతోనే! ఆటకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత్‌పై 5 వికెట్లు తీసిన తర్వాతే సెల్ఫీలు: షాహీన్ అఫ్రిది
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై తమ జైత్రయాత్రను కొనసాగించాలని భారత జట్టు భావిస్తుంటే.. కనీసం ఒక్కసారైనా టీమిండియాపై విజయం సాధించాలని పాక్ వ్యూహాలు రచిస్తోంది. ఐదు వికెట్లు తీసిన తర్వాతే? కాగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ డ్రిల్స్‌లో ఎక్కువ సమయం గడుపుతోంది. ఈ క్రమంలో పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ షా అఫ్రిది తన ఫీల్డింగ్ డ్రిల్‌ను ముగించుకుని బయటకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఈ సమయంలో బౌండరీ లైన్ వద్ద అభిమానులు అతడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో షాహీన్ నవ్వుతూ.. "కచ్చితంగా మీకు సెల్ఫీ ఇస్తా.. కానీ ఇప్పుడు కాదు, భారత్‌పై 5 వికెట్ల హాల్ సాధించిన తర్వాత అంటూ" అభిమానులతో అన్నాడు. చదవండి: Steve Smith Dismissal Video AUS Vs SA: స్మిత్‌ది ఔటా? నాటౌటా? టెక్నాలజీ లోపానికి..! వీడియో వైరల్ -
WC: దిగొచ్చిన పీసీబీ.. ఆటగాళ్లే ఆస్తులు! వాళ్లకు ఏకంగా 202 శాతం హైక్
Pakistan announces landmark central contracts: వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లకు అదిరిపోయే బహుమతి ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో చారిత్రాత్మక నిర్ణయంతో కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. మెన్స్ టీమ్‌లోని క్రికెటర్లతో మూడేళ్ల ఒప్పందానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ద్వారా లభించే ఆదాయంలో మూడు శాతం మేర చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో ఆటగాళ్లకు మిలియన్ యూఎస్ డాలర్ల మేర రెవెన్యూ సమకూరనుంది. అయితే.. ఓ కండిషన్ ఇక ఈ ఏడాది జూలై 1 నుంచే ఒప్పందం అమల్లోకి వస్తుందని.. అయితే, 12 నెలలకొకసారి క్రికెటర్ ప్రదర్శనపై సమీక్ష ఆధారంగానే చెల్లింపులు ఉంటాయని పీసీబీ స్పష్టం చేసింది. ఈ చరిత్రాత్మక ఒప్పందంలో భాగమయ్యేందుకు అత్యధికంగా 25 మంది క్రికెటర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు బుధవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా తొలిసారి టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెటర్ల కాంట్రాక్టును మెర్జ్ చేసినట్లు పీసీబీ తెలిపింది. సెలక్షన్ విషయంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అదే విధంగా నెలవారీ ఆదాయంతో పాటు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల ఫీజును 50 శాతానికి, వన్డేలు ఆడేవాళ్ల ఫీజును 25 శాతం, టీ20లు ఆడేవాళ్లకు 12.5 ఫీజును పెంచనున్నట్లు వెల్లడించింది. మరో రెండు టీ20లీగ్‌లలో అంతేకాదు.. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పాక్ ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు మరో రెండు ఇతర టీ20 లీగ్‌లు ఆడేందుకు పీసీబీ అనుమతినిచ్చింది. పీసీబీ తమ డిమాండ్లను అంగీకరించిన నేపథ్యంలో కెప్టెన్ బాబర్ ఆజం స్పందిస్తూ.. ఇది చారిత్రాత్మక ఒప్పందం అంటూ హర్షం వ్యక్తం చేశాడు. ఇక పీసీబీ చైర్మన్ జకా ఆష్రఫ్ మాట్లాడుతూ.. తమ ఆటగాళ్లతో చర్చలు కొలిక్కి వచ్చాయని.. ఇలాంటి డీల్ కుదరడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ నిజమైన ఆస్తులు ఆటగాళ్లేనని.. వాళ్లు ఆర్థికంగా కూడా బలంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. పీసీబీ తాజా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం.. కేటగిరీ-ఏ: బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహిన్ షా ఆఫ్రిదిలకు 202 శాతం హైక్($15,500). కేటగిరీ-బి: ఫఖర్ జమాన్, హ్యారిస్ రవూఫ్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, నసీం షా, షాదాబ్ ఖాన్లకు 144 శాతం హైక్($10,000). కేటగిరీ- సి: ఇమాద్ వసీం, అబ్దుల్లా షఫిక్‌లకు 135 శాతం హైక్$6,000) కేటగిరీ- డి: ఫాహిం ఆష్రఫ్, హసన్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఇహసానుల్లా, మహ్మద్ హ్యారిస్, మహ్మద్ వసీం జూనియర్, సయీమ్ ఆయుబ్, సల్మాన్ అలీ ఆఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షానవాజ్ దహాని, షాన్ మసూద్, ఉసామా మిర్, జమాన్ ఖాన్లకు 127 శాతం హైక్($1,700) హైదరాబాద్‌లో పాక్ జట్టు కాగా పీసీబీతో తాజా ఒప్పందంతో బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ వంటి టాప్ ప్లేయర్లకు నెలకు 15,600 అమెరికా డాలర్ల మేర(భారత కరెన్సీలో దాదాపు పన్నెండు లక్షల తొంభై ఏడువేలు) సాలరీ లభించనుంది. ఇదిలా ఉంటే.. పీసీబీ ప్రకటన నేపథ్యంలో బుధవారం రాత్రే పాక్ క్రికెట్ జట్టు భారత్‌కు చేరుకోవడం విశేషం. హైదరాబాద్‌లో మ్యాచ్‌ల నేపథ్యంలో ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చదవండి: WC: స్వదేశానికి సౌతాఫ్రికా సారథి బవుమా.. కెప్టెన్‌గా మార్కరమ్ A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK — Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023 Ready to roar: @RealHa55an begins the World Cup preparations 🏃☄️#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/4RWGWr4GLR — Pakistan Cricket (@TheRealPCB) September 28, 2023 -
రెండోసారి పెళ్లి చేసుకున్న షాహీన్ ఆఫ్రిది.. హాజరైన బాబర్ ఆజం! ఫోటోలు వైరల్
పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది రెండో సారి పెళ్లి పీటలు ఎక్కాడు. మంగళవారం(సెప్టెంబర్19)న కరాచీలో తన భార్య అన్షా ఆఫ్రిదిని షాహీన్ మరోసారి నిఖా చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో షాహిన్- అన్షా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే షాహీన్ బీజీ షెడ్యూల్ వల్ల అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వీరిద్దరి వివాహం జరిగింది. దీంతో మళ్లీ ఘనంగా పెళ్లి చేసుకోవాలని షాహీన్-అన్షా భావించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి నిఖా మరోసారి జరిగింది. ఇక వీరి వివాహ వేడుకకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు సహచర ఆటగాళ్లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా అన్షా ఎవరో కాదు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూతురే. ఇక రెండో సారి పెళ్లి చేసుకోవడంపై అఫ్రిది స్పందించాడు. "అల్లా మనల్ని జంటగా సృష్టిస్తాడు. మరొక మనిషిని ప్రేమించేలా చేస్తాడు. ఇస్లాం ప్రకారం త్వరగా వివాహం చేసుకోండి. మీ భాగస్వామితో జీవితాన్ని ఆనందించండి. హరామ్(డేటింగ్) సంబంధాలకు దూరంగా ఉండండి" అంటూ అఫ్రిది ఎక్స్‌లో రాసుకొచ్చాడు. ఇక షాహీన్ ఆసియాకప్-2023లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా అఫ్రిది నిలిచాడు. ఓవరాల్‌గా 5 మ్యాచ్‌లు ఆడిన అఫ్రిది 10 వికెట్టు పడగొట్టాడు. మళ్లీ వన్డే ప్రపంచకప్‌తో షాహీన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 6న హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. చదవండి: #Nasir Hossain: బంగ్లాదేశ్ క్రికెటర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. ALLAH Pak creates us in pairs and grants us love in our hearts to love another human being. Get married fast according to Islam and enjoy life with your partner and stay away from haram relationships pic.twitter.com/NNyyyshjCW — Shaheen Shah Afridi (@iShaheenAfridi_) September 19, 2023 -
WC 2023: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! ఆసియా కప్ పోయింది.. ఇక..
WC 2023- Major Blows To Pakistan Team: ఘన విజయంతో ఆసియా కప్-2023 టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్ ఆఖరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. నేపాల్‌ను చిత్తు చేసి సూపర్-4లో తొలుత అడుగుపెట్టిన బాబర్ ఆజం బృందానికి రోహిత్ సేన చెక్ పెట్టిన విషయం తెలిసిందే. కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేసి చిరకాల ప్రత్యర్థిని ఏకంగా 228 పరుగులతో చిత్తు చేసిన టీమిండియా శ్రీలంకతో మ్యాచ్‌లోనూ గెలుపొంది ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. దాయాది చేతిలో ఘోర పరాభవం పాలైన నేపథ్యంలో.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌కు గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడం పాక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. బాబర్ వర్సెస్ ఆఫ్రిది అయినప్పటికీ, ఆఖరి వరకు పోరాడగలిగినా శ్రీలంక చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో లంకతో మ్యాచ్ అనంతరం.. కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది డ్రెస్సింగ్‌రూంలో గొడవపడినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాబర్ ఆజం- షాహిన్ ఆఫ్రిది సీనియర్లు కూడా ఇలాగేనా ఆడేది.. వీరిద్దరి వాగ్యుద్ధం తారస్థాయికి చేరగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సర్దిచెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా సీనియర్ ఆటగాళ్లు కూడా ఆశించిన మేర రాణించకపోవడం లేదని, బాధ్యతాయుతంగా ఆడని కారణంగానే ఓటమి ఎదురైందంటూ బాబర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు మధ్యలో కలుగజేసుకున్న ఆఫ్రిది.. అంత అసహనం పనికిరాదని.. కనీసం మెరుగ్గా ఆడిన బౌలర్లు, బ్యాటర్లను ప్రశంసించవచ్చు కదా అని బాబర్‌కు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా.. జట్టులో ఎవరు బాగా ఆడుతున్నారు.. ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని గట్టిగానే బదులిచ్చినట్లు సదరు మీడియా తెలిపింది. ఈ క్రమంలో రిజ్వాన్ సహా కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ చొరవతీసుకుని బాబర్- ఆఫ్రిదిలను కూల్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఆఫ్రిది మాటలకు నొచ్చుకున్న బాబర్.. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా టీమ్ బస్సులోకెక్కి కూర్చున్నాడని సమాచారం. వరల్డ్‌కప్‌నకు ముందు పాక్‌కు దెబ్బ మీద దెబ్బ కాగా వన్డే వరల్డ్‌కప్-2023కి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆసియా కప్‌లో ఓటమితో నంబర్ 1 స్థానాన్ని పోగొట్టుకున్న పాకిస్తాన్ జట్టు సమస్యలతో సతమతమవుతోంది. ఓవైపు స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్ గాయాల బారిన పడ్డారు. వాళ్లు సెలక్షన్‌కు ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలియదు. ఇలాంటి తరుణంలో.. ఆసియా కప్ పరాభవంతో ఆగ్రహంతో ఉన్న బాబర్‌తో ఆఫ్రిది గొడవ విభేదాలకు దారి తీయడం.. ఇలా ఏది చూసినా పాకిస్తాన్‌కు ప్రస్తుతం టైమ్ బాగా లేదనే అనిపిస్తోందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. చదవండి: WC 2023: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! ఇక మర్చిపోవాల్సిందేనా? -
మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
Asia Cup, 2023- Pakistan vs Sri Lanka- Babar Azam Comments On Loss: ఆసియా కప్-2023 టోర్నీలో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. చివరి ఓవర్ వరకు నువ్వా- నేనా అన్నట్లు సాగిన గురువారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. కొలంబోలో లంక చేతిలో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. శ్రీలంక జట్టు తమ కంటే మెరుగ్గా ఆడిందని.. అందుకే గెలుపు వారినే వరించిందని పేర్కొన్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ పేలవంగా సాగిందని అందుకే ఓడిపోయామని తెలిపాడు. వాళ్లిద్దరు అద్భుతంగా ఆడి లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, సమరవిక్రమ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ‘‘మేము ఆరంభంలో.. మ్యాచ్ చివర్లో మెరుగ్గా రాణించగలుగుతున్నాం. కానీ మిడిల్ ఓవర్లలో సరిగ్గా ఆడలేకపోతున్నాం. ఈ రెండే కొంప ముంచాయి ఈరోజు కూడా అదే జరిగింది. మిడిల్ ఓవర్లలో మా బౌలింగ్ అస్సలు బాలేదు. ఫీల్డింగ్ కూడా స్థాయికి తగ్గట్లు లేదు. ఈ రెండు కారణాల వల్ల మేము భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని బాబర్ ఆజం లంక చేతిలో తాము ఓడిపోవడానికి గల కారణాలు విశ్లేషించాడు. అందుకే బంతిని అతడి చేతికి ఇచ్చాను ఇక ఆఖరి ఓవర్లో బాల్‌ను వన్డే అరంగేట్ర బౌలర్‌కు ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘ చివరి ఓవర్ వరకు పోరాటం కొనసాగించే క్రమంలో.. ఆఖర్లో అత్యుత్తమ బౌలర్లనే బరిలోకి దించాలని భావించాను. అందుకే సెకండ్ లాస్ట్ ఓవర్లో బంతిని షాహిన్ ఆఫ్రిది చేతికి ఇచ్చాను. ఫైనల్ ఓవర్లో జమాన్ ఖాన్‌పై నమ్మకం ఉంచాను. అయితే, శ్రీలంక మా కంటే మెరుగ్గా ఆడి విజయం సాధించింది’’ అని బాబర్ ఆజం ఓటమిని అంగీకరించాడు. శ్రీలంక అసాధారణ పోరాటం.. ఫైనల్లో టీమిండియాతో కాగా ఆసియా కప్-2023 సూపర్-4 దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 86 పరుగులు(నాటౌట్) పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే వికెట్లు కోల్పోయినా.. వన్‌డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 91 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సమరవిక్రమ 48, ఆఖరి వరకు క్రీజులో ఉన్న చరిత్ అసలంక 49 పరుగులతో రాణించారు. 42వ ఓవర్ చివరి బంతికి జమాన్ ఖాన్ వేసిన బాల్‌కు రెండు పరుగులు తీసిన లంక ఆటగాళ్లు జట్టు ఫైనల్ బెర్తును ఖరారు చేశారు. సెప్టెంబరు 17న టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: Ind Vs Ban: జోరు కొనసాగించేందుకు... అయ్యర్ బరిలోకి... Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 Some effort this from @iamharis63! 🔥#PAKvSL | #AsiaCup2023 pic.twitter.com/rHE9xkV2il — Pakistan Cricket (@TheRealPCB) September 14, 2023 -
షాహీన్ అఫ్రిది మంచి మనసు.. బుమ్రాకు సర్ప్రైజ్ గిప్ట్! వీడియో వైరల్
ప్రపంచ క్రికెట్లో బిగ్గెస్ట్ ఫైట్ అంటే టక్కున గుర్తు వచ్చేది భారత్-పాకిస్తాన్ మ్యాచ్. దయాదుల పోరుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పకున్న తక్కువే. చిరకాల ప్రత్యర్థిల క్రికెట్ యుద్దం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అతృతగా ఎదురుచూస్తుంటారు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు జట్ల ఆటగాళ్లపై కూడా తీవ్ర ఒత్తడి ఉంటుంది. అయితే ఏదైమైనప్పటికి ఆటగాళ్ల మధ్య వైరం మైదానం వరకే. ఆఫ్‌ది ఫీల్డ్ ఇరు జట్ల ఆటగాళ్లు మంచి స్నేహితులగా ఉంటారు. ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. భారత స్టార్ విరాట్ కోహ్లి అంటే తనకు ఎంతో ఇష్టమని సృష్టం చేశాడు. కోహ్లి కూడా పాక్ ఆటగాళ్లతో ఆప్యాయంగా మాట్లాడిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి భారత్-పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య మంచి స్నేహ బంధం ఉందని రుజువైంది. షాహీన్ అఫ్రిది మంచి మనసు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది తన మంచి మనసును చాటుకున్నాడు. ఇటీవల టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా తండ్రైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా బుమ్రాను కలిసిన అఫ్రిది శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాకుండా ఓ గిఫ్ట్ సైతం ఇచ్చాడు. అనంతరం వీరిద్దరూ అలింగనం చేసుకున్నారు. 'మీకు చాలా శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా చూడాలి. నయా బుమ్రాను తయారు చెయ్. గుడ్‌లక్" అంటూ అఫ్రిది అన్నాడు. అందుకు బదులుగా బుమ్రా నవ్వుతూ ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బుమ్రా భార్య సంజన గణేషన్ సెప్టెంబర్ 4న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రిజర్వ్ డే(సోమవారం)కు వాయిదా పడింది. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 24.1 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కేన్ మామ వచ్చేశాడు Spreading joy 🙌 Shaheen Afridi delivers smiles to new dad Jasprit Bumrah 👶🏼🎁#PAKvIND | #AsiaCup2023 pic.twitter.com/Nx04tdegjX — Pakistan Cricket (@TheRealPCB) September 10, 2023