సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో తలపడేందుకు పాకిస్తాన్ సిద్దమైంది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు తమ తుది జట్టును పాకిస్తాన్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది దూరమయ్యాడు.
గత కొంత కాలంగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న అఫ్రిదికి మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై వేటుపడింది. అతడి స్ధానంలో యువ ఓపెనర్ సైమ్ అయూబ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు.
అదే విధంగా మరో యువ పేసర్ సాజిద్ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ టెస్టు సిరీస్ అనంతరం 5 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో పాక్ జట్టును అఫ్రిది ముందుండి నడిపించనున్నాడు.
ఆసీస్‌తో మూడో టెస్టుకు పాక్ జట్టు: సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, సాజిద్ ఖాన్, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్.
చదవండి: Petra Kvitova: అభిమానులకు శుభవార్త చెప్పిన టెన్నిస్ స్టార్.. ఆటకు దూరం
Comments
Please login to add a commentAdd a comment