టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ (జూన్ 9) జరుగుతున్న హై ఓల్టేజీ మ్యాచ్‌కు వరుణుడు క్రమం తప్పకుండా ఆటంకం కలిగిస్తూ వస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలవడంతో టాస్ అర్ద గంట ఆలస్యంగా పడింది. టాస్ అనంతరం మరో మారు జల్లులు కురువడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కాగా వరుణుడు మరోసారి పలకరించాడు.
వరుణుడు ఆటంకాల నడుమ సాగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పాక్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్‌లో 8 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో రోహిత్ అద్భుతమైన సిక్సర్ బాది భారత ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అఫ్రిది వేసిన తొలి ఓవర్ మూడో బంతికే రోహిత్ లెగ్ సైడ్ దిశగా తన ట్రేడ్ మార్క్ సిక్సర్ బాదాడు. రోహిత్ సిక్సర్ బాదిన విధానం చూసి అఫ్రిది నవ్వుకుంటూ ఉండిపోయాడు. హిట్‌మ్యాన్ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
WHAT A SHOT BY ROHIT SHARMA. 🔥
- The Class of Hitman...!!!! ⭐ pic.twitter.com/F6QrZkpDsC— Tanuj Singh (@ImTanujSingh) June 9, 2024
తొలి ఓవర్ ముగియగానే మరోసారి వర్షం పలకరించడంతో మ్యాచ్‌కు బ్రేక్ పడింది. తొలి ఓవర్ తర్వాత టీమిండియా స్కోర్ 8/0గా ఉంది. రోహిత్ 8, విరాట్ 0 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించగా.. పాక్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. పాక్.. వికెట్‌కీపర్ బ్యాటర్ ఆజం ఖాన్‌కు పక్కన పెట్టి ఇమాద్ వసీంను తుది జట్టులోకి తీసుకుంది.
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్
Comments
Please login to add a commentAdd a comment