T20 WC: పాకిస్తాన్‌కు ‘శుభవార్త’.. కానీ ఆ గండం దాటితేనే! | What India's T20 WC Win vs USA Means For Pakistan Super 8 Qualification? | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు శుభవార్త అందించిన టీమిండియా.. అయితే ఓ ట్విస్ట్‌!

Published Thu, Jun 13 2024 10:24 AM | Last Updated on Thu, Jun 13 2024 10:37 AM

What India's T20 WC Win vs USA Means For Pakistan Super 8 Qualification?

అమెరికాపై టీమిండియా విజయం నేపథ్యంలో పాకిస్తాన్‌ సంతోషంలో మునిగిపోయింది. సూపర్‌-8 దశకు చేరుకునే క్రమంలో తమ ఆశలు పదిలం కావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభంలో పాకిస్తాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన విషయం తెలిసిందే. గ్రూప్‌-ఏలో ఉన్న అమెరికా, టీమిండియా చేతిలో చిత్తైన బాబర్‌ ఆజం బృందం... కెనడాపై గెలుపుతో ఊపిరి పీల్చుకుంది.

అయితే, సూపర్‌-8లో అడుగుపెట్టాలంటే అమెరికాతో పోటీ పడాల్సిన పరిస్థితి. అప్పటికే మొనాంక్‌ పటేల్‌ సేన రెండు విజయాలు సాధించి.. పాకిస్తాన్‌ కంటే మెరుగైన స్థితిలో ఉండటమే ఇందుకు కారణం.

మొన్న ఏడిపించి... ఇపుడేమో శుభవార్త
ఇలాంటి దశలో టీమిండియా- అమెరికా మ్యాచ్‌ ఫలితంపై పాక్‌ ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన అమెరికాను ఓడిస్తే పాక్‌ సూపర్‌-8కు చేరవయ్యే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే భారత జట్టు బుధవారం నాటి మ్యాచ్‌లో అమెరికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.

దీంతో పాయింట్ల పరంగా అమెరికా కంటే వెనుకబడి ఉన్నా.. రన్‌రేటు పరంగా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలోకి వెళ్లింది పాక్‌ జట్టు. ఈ క్రమంలో తదుపరి ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో తాము గెలవడం.. అమెరికా ఓడటం జరిగితే పాక్‌ సూపర్‌-8లో అడుగుపెట్టే అవకాశం ముంగిట నిలిచింది. కాగా గత మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ను ఓడించిన విషయం తెలిసిందే.

పాకిస్తాన్‌ సూపర్‌-8కు చేరాలంటే..
గ్రూప్‌-ఏలో ఉన్న టీమిండియా ఇప్పటికే మూడు విజయాలతో(ఆరు పాయింట్లు) టాపర్‌గా నిలిచి సూపర్‌-8కు చేరుకుంది.

రెండో స్థానం కోసం అమెరికా, పాకిస్తాన్‌ పోటీ పడుతున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే గ్రూప్‌ దశలో మూడేసి మ్యాచ్‌లు ఆడాయి.

అమెరికా రెండు విజయాలు(4 పాయింట్లు) సాధించగా.. పాకిస్తాన్‌ ఒకటి గెలిచింది(2 పాయింట్లు). అయితే, టీమిండియా చేతిలో ఓటమి తర్వాత నెట్‌ రన్‌రేటు పరంగా అమెరికా(+0.127) పాక్‌ కంటే (+0.191) కాస్త వెనుకబడింది.

ఈ నేపథ్యంలో లీగ్‌ దశలో తమకు మిగిలిన ఆఖరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సూపర్‌-8కు చేరుతుంది. అయితే, రెండూ తమ తమ మ్యాచ్‌లలో గెలిస్తే అప్పుడు నెట్‌ రన్‌రేటు కీలకంగా మారుతుంది. 

ఇక ఆఖరి మ్యాచ్‌లలో అమెరికా, పాకిస్తాన్‌ల ప్రత్యర్థి ఐర్లాండ్‌ కావడం విశేషం. ఈ రెండు జట్లలో ఏది సూపర్‌-8 చేరాలన్నా ఐర్లాండ్‌ ఆట తీరుపైనే ఆధారపడి ఉంది.

చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్‌ వాళ్లకే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement