పాకిస్తాన్‌పై అజేయ చరిత్రను కొనసాగిస్తూ టీమిండియా మరోసారి ఐసీసీ టోర్నీలో చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చాటుకుంది. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది.
వరల్డ్‌కప్‌లో టీమిండియా సరికొత్త చరిత్ర
తద్వారా టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై ఏడుసార్లు గెలుపొంది ఈ ఘనత తన పేరిట లిఖించుకుంది.
ఇక దాయాది పాక్‌పై భారత్ విజయంలో ఈసారి బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా.. మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.
మరోవైపు పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం రెండు వికెట్లతో రాణించగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టి పాకిస్తాన్‌ను ఆలౌట్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ విజయం పట్ల టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా రోహిత్ సేనపై.. ముఖ్యంగా బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్!
‘‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్. కొత్త ఖండం.. అయినా అదే ఫలితం. టీ20 ఫార్మాట్ అనేది బ్యాటర్ల గేమ్.. అయితే, న్యూయార్క్‌లో మాత్రం బౌలర్లు కనువిందు చేశారు.
ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్! అమెరికాలో అద్భుత వాతావరణంలో అత్యద్భుతంగా మన ఆట తీరును చూపించారు. బాగా ఆడారు.. టీమిండియాదే విజయం’’ అని సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపాడు.
ఈ క్రమంలో సచిన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు సైతం భారత జట్టును అభినందించారు. ఇదొక ప్రత్యేకమైన విజయమని ఆటగాళ్లను కొనియాడారు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్
👉వేదిక: నసావూ ఇంటర్నేషనల్ స్టేడియం, న్యూయార్క్
👉టాస్: పాకిస్తాన్.. తొలుత బౌలింగ్
👉టీమిండియా స్కోరు: 119 (19)
👉పాకిస్తాన్ స్కోరు: 113/7 (20)
👉ఫలితం: పాకిస్తాన్‌పై ఆరు పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్‌ప్రీత్ బుమ్రా(3/14).
చదవండి: Ind vs Pak: బుమ్రా విషయంలో ఇలా చేస్తారా?: రోహిత్‌పై విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment