Asia Cup 2023: వర్షం కారణంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు | Asia Cup 2023 Ind Vs Pak: Toss Playing XI Of Both Teams Updates | Sakshi
Sakshi News home page

Asia Cup 2023: వర్షం కారణంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు

Published Sat, Sep 2 2023 2:31 PM | Last Updated on Sat, Sep 2 2023 10:00 PM

Asia Cup 2023 Ind Vs Pak: Toss Playing XI Of Both Teams Updates - Sakshi

వర్షం కారణంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు
ఎడతెరిపి లేని వర్షం కారణంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దైంది. భారత ఇన్నింగ్స్‌ తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో భారత్‌, పాక్‌లకు చెరో పాయింట్‌ దక్కింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఇషాన్‌ కిషన్‌ (82), హార్ధిక్‌ పాండ్యా (87) రాణించడంతో 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌటైంది.

Asia Cup, 2023 India Vs Pakistan Updates: ఆసియా కప్‌-2023 భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ అప్‌డేట్స్‌!
పాక్‌ పేసర్ల విజృంభణ.. టీమిండియా ఆలౌట్‌
Asia Cup 2023 Ind Vs Pak: Team India All Out For 266: పాక్‌ పేసర్ల విజృంభణ నేపథ్యంలో టీమిండియా టాపార్డర్‌ కుదేలైన వేళ.. ఇషాన్‌ కిషన్‌(82), హార్దిక్‌ పాండ్యా జట్టు(87)ను ఆదుకున్నారు. వీరిద్దరు హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో రోహిత్‌ సేన  మెరుగైన స్కోరు చేయగలిగింది. 48.5 ఓవర్లలో 266 పరుగులు సాధించింది. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ ఆఫ్రిది అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 267 పరుగుల లక్ష్యంతో ఇక పాక్‌ బరిలోకి దిగనుంది.

48.5: నసీం షా బౌలింగ్‌లో బుమ్రా అవుట్‌.
తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

48.2: కుల్దీప్‌ యాదవ్‌ రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. నసీం షా బౌలింగ్‌లో రిజ్వాన్‌కు క్యాచ్‌ ఇచ్చి కుల్దీప్‌ నిష్క్రమించాడు. స్కోరు: 261/9 (48.2)

కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా క్రీజులో ఉన్నారు. 47 ఓవర్లలో భారత్‌ స్కోరు: 257/8

46 ఓవర్లలో టీమిండియా స్కోరు: 252/8

ఎనిమిదో వికెట్‌ డౌన్‌.. టీమిండియా స్కోరెంతంటే!
శార్దూల్‌ ఠాకూర్‌ అవుట్‌ కావడంతో టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 242/8 (44.1)

ఏడో వికెట్‌ డౌన్‌
రవీంద్ర జడేజా(14) రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. 

పాండ్యా అవుట్‌
43.1: షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో హార్దిక్‌ పాండ్యా ఆఘా సల్మాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పాండ్యా 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 239/6 (43.2). శార్దూల్‌ ఠాకూర్‌, జడేజా క్రీజులో ఉన్నారు.

పాండ్యా ప్రతాపం 
87 బంతుల్లో 86 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్న హార్దిక్‌ పాండ్యా. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్నాడు.
టీమిండియా స్కోరు: 237/5 (42). పాండ్యాతో పాటు జడ్డూ(13) క్రీజులో ఉన్నాడు.

అయ్యో ఇషాన్‌
37.3: టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ 82 పరుగుల వద్ద ఔటయ్యాడు. సెంచరీ దిశగా కొనసాగుతున్నాడని అభిమానులు సంబరపడుతున్న వేళ.. హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో బాబర్‌ఆజంకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా క్రీజులో ఉన్నారు. 39 ఓవర్లలో టీమిండియా స్కోరు: 209-5

ఫిఫ్టీ పూర్తి చేసుకున్న హార్దిక్‌ పాండ్యా
ఇషాన్‌ కిషన్‌తో కలిసి పాండ్యా నిలకడగా ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 62 బంతుల్లో హార్దిక్‌ పాండ్యా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. టీమిండియా స్కోరు: 178/4 (34)

31 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 156-4

హాఫ్‌ సెంచరీతో మెరిసిన ఇషాన్‌ కిషన్‌.. అండగా పాండ్యా
జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఇషాన్‌ కిషన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అర్ధ శతకం(55)తో మెరిసి తన విలువేంటో చాటుకున్నాడు.  మరో ఎండ్‌లో పాండ్యా ఇషాన్‌కు అండగా.. 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కాగా ఇషాన్‌ కిషన్‌కు వన్డేల్లో ఇది వరుసగా నాలుగో హాఫ్‌ సెంచరీ.. ఓవరాల్‌గా ఏడోది.

25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 127/4

ఇషాన్‌, పాండ్యా నిలకడగా
నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్న ఇషాన్‌(42), హార్దిక్‌ పాండ్యా(25). వీరిద్దరి మెరుగైన ఇన్నింగ్స్‌ కారణంగా 24 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 122 పరుగులు చేసింది.

21 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.

టీమిండియా ఎట్టకేలకు సెంచరీ కొట్టింది. ఆరంభం నుంచే తడ‘బ్యా’టుకు గురైన భారత జట్టు 19.4వ ఓవర్‌ వద్ద వంద పరుగుల మార్కును అందుకుంది.

18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 92-4
కిషన్‌ 30, పాండ్యా 11 పరుగులతో ఆడుతున్నారు.

16 ఓవర్లలో భారత్‌ స్కోరు: 83/4
ఇషాన్‌ 23, పాండ్యా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

శుబ్‌మన్‌ గిల్‌ బౌల్డ్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
14.1:
హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో గిల్‌(10) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 71/4 (14.3). పాండ్యా ,ఇషాన్‌ క్రీజులో ఉన్నారు.

13 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు:  63-3. ఇషాన్‌ 12, గిల్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
వర్షం తెరిపినివ్వడంతో టీమిండియా బ్యాటింగ్‌ మొదలైంది.

వరణుడు మరోసారి
11.2: వర్షం అంతరాయం కలిగించడంతో మళ్లీ ఆటను నిలిపివేశారు.
11: ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 51-3. గిల్‌, ఇషాన్‌ కిషన్‌ క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ డౌన్‌
9.5: శ్రేయస్‌ అయ్యర్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో ఫఖర్‌ జమాన్‌కు క్యాచ్‌ ఇచ్చి 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్‌ పెవిలియన్‌ చేరాడు. సుదీర్ఘ కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఆరంభంలో దూకుడు కనబరిచినా.. త్వరగానే వికెట్‌ పారేసుకున్నాడు.

కోహ్లి అవుట్‌
6.3:
 టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి ఆఫ్రిది బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు.

5.5: నసీం షా బౌలింగ్‌లో ఫోర్‌ బాది పరుగుల ఖాతా తెరిచిన కోహ్లి. 6 ఓవర్లలో టీమిండియా స్కోరు: 26/1 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
4.6: వర్షం తెరిపినివ్వడంతో ఆట మొదలుపెట్టిన టీమిండియాకు షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూపంలో జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. విరాట్‌ కోహ్లి, గిల్‌(1) క్రీజులో ఉన్నారు.

బ్యాడ్‌న్యూస్‌
హైవోల్టేజీ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న ఫ్యాన్స్‌కు వరుణుడు షాకిచ్చాడు. క్యాండీలో వర్షం మళ్లీ మొదలైంది. వాన అంతరాయం కలిగించడంతో ప్రస్తుతం ఆటను నిలిపివేశారు.

కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న పాక్‌ బౌలర్లు
పాక్‌ పేసర్లు షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. దీంతో నాలుగో ఓవర్‌ ముగిసే సరికి టీమిండియా 15 పరుగులు చేయగలిగింది.



►3:మూడు ఓవర్లలో 14 పరుగులు చేసిన భారత జట్టు

►2: రెండో ఓవర్‌ ముగిసే సరికి టీమిండియా స్కోరు: 9.
►రోహిత్‌ శర్మ 7 పరుగులు, గిల్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
►1: తొలి ఓవరల్లో ఆరు పరుగులు చేసిన టీమిండియా

►క్రికెట్‌ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థుల పోరుకు రంగం సిద్ధమైంది. శ్రీలంకలోని క్యాండీలో గల పల్లెకెలె స్టేడియంలో భారత్‌- పాకిస్తాన్‌ అమీతుమీకి సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

తుది జట్లు
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్తాన్‌:
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌ కీపర్‌), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్.

చదవండి: మా దగ్గర షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌ లేరు కదా!.. అదే ప్లస్‌: రోహిత్‌ శర్మ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement