WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్‌.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం | ODI World Cup 2023: India Vs Pakistan Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

WC2023- Ind Vs Pak: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్‌.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం

Published Sat, Oct 14 2023 2:20 PM | Last Updated on Sat, Oct 14 2023 8:08 PM

WC 2023 Ind Vs Pak Ahmedabad: Updates And Highlights - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- పాక్‌ సారథి బాబర్ ఆజం (PC: ICC)

ICC ODI World Cup 2023- India vs Pakistan Updates: వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అప్‌డేట్స్‌:

భారత్‌ ఘన విజయం..
అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  టీమిండియా బ్యాటర్లలో కెప్టెన్‌  రోహిత్‌ శర్మ( 63 బంతుల్లో 86 పరుగులు)అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు  శ్రేయస్‌ అయ్యర్‌(53 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌పాకిస్తాన్‌ 191 పరుగులకే కుప్పకూలింది.  భారత బౌలర్లలో కుల్దీప్‌, సిరాజ్‌, బుమ్రా, హార్దిక్‌, జడేజా తలా రెండు వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించారు. పాకిస్తాన్‌ బ్యాటర్లలో బాబర్‌ ఆజం(50),మహ్మద్‌ రిజ్వాన్‌(49) టాప్‌ స్కోరర్లగా నిలిచారు.

25 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 165/3

25 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి  165 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి ఇంకా 23 పరుగులు అవసరం. 

24 ఓవర్లలో టీమిండియా స్కోరు: 162/3
అయ్యర్‌ 39, రాహుల్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. గెలుపొందాలంటే ఇంకో 30 పరుగులు అవసరం. చేతిలో ఇంకో ఏడు వికెట్లు ఉన్నాయి.

రోహిత్‌ శర్మ సెంచరీ మిస్‌..
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 86 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.  భారత్‌ విజయానికి ఇంకా 36 పరుగులు కావాలి. 21.4 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 156/3

19 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 129/2
19 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 128/2, క్రీజులో రోహిత్‌ శర్మ(68), శ్రేయస్‌ అయ్యర్‌(26) పరుగులతో ఉన్నారు.

రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ..
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హాఫ్‌సెంచరీతో చెలరేగాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో రోహిత్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌: 101/2, క్రీజులో రోహిత్‌ శర్మ(51), శ్రేయస్‌ అయ్యర్‌(15) పరుగులతో ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌
79 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. హసన్‌ అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాడు.

9 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 77/1
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(44)తో పాటు విరాట్‌ కోహ్లి(15) పరుగులతో ఉన్నాడు.

7 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 54/1
7 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(23), విరాట్‌ కోహ్లి(13) పరుగులతో ఉన్నారు.

4 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 31/1
4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌ శర్మ(14), విరాట్‌ కోహ్లి(0) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..
192 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 16 పరుగులు చేసిన గిల్‌.. షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి విరాట్‌ కోహ్లి వచ్చాడు.

టీమిండియా విజయ లక్ష్యం: 192 పరుగులు
1: తొలి ఓవర్లో 10 పరుగులు
షాహిన్‌ ఆఫ్రిది పాక్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించగా.. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మొదటి బంతికే ఫోర్‌ బాదాడు. మూడో బంతినీ బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో టీమిండియా తొలి ఓవర్లో 10 పరుగులు(సింగిల్స్‌తో కలిపి) రాబట్టింది.

42.5: టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 191 పరుగులకు ఆలౌట్‌ అయింది. జడేజా బౌలింగ్‌లో హ్యారిస్‌ రవూఫ్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో పాక్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేశారు.

40.1: తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి హసన్‌ అలీ అవుట్‌. తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌. స్కోరు: 187/9 (40.1)

39.6: ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన పాక్‌
హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చి మహ్మద్‌ నవాజ్‌(4) అవుట్‌. పాక్‌ స్కోరు: 187-8(40)

39 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 182/7
హసన్‌ అలీ 7, నవాజ్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.

35.2: మరోసారి బుమ్రా మ్యాజిక్‌
ఏడో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌. బుమ్రా బౌలింగ్‌లో షాదాబ్‌ ఖాన్‌ బౌల్డ్‌(2). పాకిస్తాన్‌ స్కోరు:  172/7 (36). హసన్‌ అలీ, మహ్మద్‌ నవాజ్‌ క్రీజులో ఉన్నారు.

 బుమ్రా సరైన సమయంలో సరైన వికెట్‌
33.6: బుమ్రా కీలక వికెట్‌ పడగొట్టి పాక్‌ను దెబ్బకొట్టాడు. నిలకడగా ఆడుతున్న మహ్మద్‌ రిజ్వాన్‌(49) అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు.

32.6: ఒకే ఓవర్లో రెండు వికెట్లు
టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అద్భుతం చేశాడు. 33వ ఓవర్‌ రెండో బంతికి షకీల్‌(6)ను వికెట్ల ముందు దొరకబ్చుకున్న కుల్దీప్‌.. ఆఖరి బంతికి ఇఫ్తికర్‌ అహ్మద్‌(4)ను బౌల్డ్‌ చేశాడు. స్కోరు- 166-5.

32.2: నాలుగో వికెట్‌ కోల్పోయిన పాక్‌
కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో సౌద్‌ షకీల్‌ లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా ఈ వికెట్‌ సందర్భంగా డ్రామా నెలకొంది. అంపైర్‌ ఎరాస్మస్‌ షకీల్‌ను నాటౌట్‌గా ప్రకటించగా.. టీమిండియా రివ్యూకు వెళ్లి సక్సెస్‌ అయింది. హాక్‌- ఐ టెక్నాలజీతో షకీల్‌ ఎల్బీడబ్ల్యూగా తేలగా.. అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో పాక్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది.

పాకిస్తాన్‌ స్కోరు 32 ఓవర్లలో- 162/3. సౌద్‌ షకీల్‌ 6, రిజ్వాన్‌ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు.

29.5: ప్చ్‌.. రనౌట్‌ మిస్‌
సిరాజ్‌ బౌలింగ్‌లో సౌద్‌ షకీల్‌ రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.30 ఓవర్లలో పాక్‌ స్కోరు: 156-3

29.4: సిరాజ్‌ బౌలింగ్‌లో బాబర్‌ బౌల్డ్‌
హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న బాబర్‌ ఆజం(50)ను సిరాజ్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో పాక్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకు సిరాజ్‌ మియాకు ఇది రెండో వికెట్‌.  పాక్‌ స్కోరు: 156/3 (29.5) 

29: అర్ధ శతకంతో మెరిసిన బాబర్‌
పాక్‌ కెప్టెన్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా క్రీజులో ఉన్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ సైతం 43 పరుగులతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. 

25 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 125-2
బాబర్‌35, రిజ్వాన్‌ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు.

24.3: రివ్యూ కోల్పోయిన టీమిండియా
కుల్దీప్‌ బౌలింగ్లో బాబర్ రివర్స్‌ స్వీప్‌ షాట్‌... ఎల్బీకి అప్పీలు చేసిన కుల్దీప్‌. అంపైర్స్‌ కాల్‌ నాటౌట్‌ కావడంతో రివ్యూకు వెళ్లిన టీమిండియా. కానీ ప్రతికూల ఫలితం.. బతికిపోయిన బాబర్‌.

నిలకడగా ఆడుతున్న రిజ్వాన్‌, బాబర్‌
పాక్‌ బ్యాటర్లు బాబర్‌ ఆజం 33, రిజ్వాన్‌ 30 పరుగులతో నిలకడగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 23 ఓవర్లలో పాక్‌ స్కోరు: 120-2

20వ ఓవర్‌: పాక్‌ బ్యాటర్లను కట్టడి చేసిన జడ్డూ.. స్కోరు: 103-2
పాకిస్తాన్‌ కేవలం ఒకే ఒక్క పరుగు చేసింది. జడేజా బౌలింగ్‌లో తొలి బంతికి రిజ్వాన్‌ ఒక పరుగు తీయగా.. మరుసటి బంతుల్లో ఒక్క రన్‌ కూడా రాలేదు. బాబర్‌ 30, రిజ్వాన్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

19: సెంచరీ దాటిన పాక్‌ స్కోరు:  102-2

18 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 96-2.

15 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 79-2.
రిజ్వాన్‌ 6, బాబర్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.  

పాక్‌ రివ్యూ సక్సెస్‌
13.1:
జడేజా బౌలింగ్‌లో రిజ్వాన్‌ ఎల్బీడబ్ల్యూ.. రివ్యూకి వెళ్లిన పాక్‌కు అనుకూల ఫలితం. బిగ్‌ వికెట్‌ నిలుపుకోవడంతో పాక్‌ శిబిరంలో సంబరాలు. స్కోరు: 75/2 (14). బాబర్‌ 16, రిజ్వాన్‌ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

12.3: రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్తాన్‌
హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైన పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(36(38) [4s-6]). స్కోరు: 73/2 (12.3). 

12: రంగంలోకి కుల్దీప్‌.. పాక్‌ స్కోరు: 68-1

11: రెండు ఫోర్లు కొట్టిన బాబర్‌ ఆజం
టీమిండియా పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో పాక్‌ బ్యాటర్లు 11వ ఓవర్లో 11 పరుగులు స్కోరు చేశారు. ఆరంభంలో తడబడ్డా.. బాబర్‌ ఆజం ఆఖరి రెండు బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు.  బాబర్‌ 14, ఇమామ్‌ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 60-1.

10: కట్టుదిట్టంగా సిరాజ్‌ బౌలింగ్‌.. ఒకే ఒక్క పరుగు
►బాబర్‌ 5, ఇమామ్‌ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ స్కోరు: 49-1

►9: పొదుపుగా బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా: 9వ ఓవర్లో​ పాక్‌ 7 పరుగులు(1 0 1 1 0 4) మాత్రమే రాబట్టగలిగింది.

7.6: తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌
►సిరాజ్‌ బౌలింగ్‌లో అబ్దుల్లా షఫీక్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. దీంతో పాక్‌ తొలి వికెట్‌ కోల్పోగా.. స్కోరు: 41-1(8). ఇమామ్‌ ఉల్‌ హక్‌ 21, బాబర్‌ ఆజం క్రీజులో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న పాక్‌ ఓపెనర్లు
పాక్‌ ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ 18, అబ్దుల్లా షఫీక్‌ 18 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి పాక్‌ స్కోరు:  37/0. టీమిండియా బౌలర్లలో పేసర్లు బుమ్రా 4, సిరాజ్‌ 3 ఓవర్లు పూర్తి చేశారు.

►5 ఓవర్లలో పాకిస్తాన్‌ స్కోరు: 23/0.
ఇమామ్‌ ఉల్‌ హక్‌ 13, అబ్దుల్లా షఫీక్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ మొదలైంది. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. పాక్‌ బ్యాటింగ్‌కు దిగింది.
భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు. పాక్‌ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌, ఇమామ్‌-ఉల్‌-హక్‌ క్రీజులో ఉన్నారు. కాగా ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో టీమిండియా- పాక్‌ ఏడుసార్లు తలపడగా 7 సార్లూ విజయం మనల్నే వరించింది.

తుది జట్లు..
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

చదవండి: ఆరంభం.. ముగింపు టీమిండియాతోనే! ఆటకు ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌ వీడ్కోలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement