
ICC CT 2025 India vs Pakistan Updates: చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 2017 ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. దాయాది జట్టు విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. లక్ష్య ఛేదనలో కోహ్లి 42.3 ఓవర్లో కోహ్లి ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకొని.. భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి వంద పరుగులతో అజేయంగా నిలవగా.. శ్రేయస్ అయ్యర్(56), శుబ్‌మన్ గిల్(46) రాణించారు. ఈ విజయంతో భారత్ సెమీస్ రేసులో ముందుకు దూసుకుపోయింది.
పాక్ 241 ఆలౌట్
క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన దాయాదుల పోరుకు తెరలేచింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్(India vs Pakistan) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాక్ తొలుతబ్యాటింగ్ చేసి 241 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా ఛేజింగ్‌కు దిగింది.
41 ఓవర్లలో టీమిండియా స్కోరు: 225-4
విజయానికి ఇంకా 17 పరుగుల దూరంలో భారత్
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
హార్దిక్ పాండ్యా రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో పాండ్యా(8) కీపర్ రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 223-4. కోహ్లి 86 పరుగులతో ఉండగా అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఖుష్దిల్ బౌలింగ్‌లో శ్రేయస్ ఇచ్చిన క్యాచ్‌ను ఇమామ్ అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ అయ్యర్ నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్యా క్రీజులోకి రాగా కోహ్లి 85 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 215/3 (39). విజయానికి 66 బంతుల్లో 27 పరుగులు కావాలి.
అర్ధ శతకం పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్
శ్రేయస్ అయ్యర్ తన వన్డే కెరీర్‌లో 21వ హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ విజయానికి ఇంకా 41 పరుగుల దూరంలో ఉంది. స్కోరు: 201/2 (37)
విజయం దిశగా భారత్
36 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోహ్లి 81, శ్రేయస్ 49 పరుగుల వద్ద ఉన్నారు. విజయానికి 42 పరుగులు కావాలి.
34 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 185/2
కోహ్లి 69, శ్రేయస్ 46 రన్స్‌తో ఆడుతున్నారు. పాక్‌పై గెలవాలంటే ఇంకా 57 పరుగులు కావాలి.
టీమిండియా స్కోరు: 168/2 (31)
కోహ్లి 65, శ్రేయస్ అయ్యర్ 34 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి.
29 ఓవర్లలో టీమిండియా స్కోరు: 150/2.
శ్రేయస్ అయ్యర్ 17, కోహ్లి 64 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ కలిసి 69 బంతుల్లో యాభై పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి.
కోహ్లి హాఫ్ సెంచరీ
విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో 63 బంతుల్లో కోహ్లి అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ 28 బంతుల్లో 12 పరుగులతో ఉన్నాడు. టీమిండియా స్కోరు: 132/2 (26.1).
భారత్ రెండో వికెట్ డౌన్..
100 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 46 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. అర్బర్ ఆహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 102/2
14 ఓవర్లకు భారత్ స్కోర్: 87/1
14 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి(23) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్(41) పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.
టీమిండియా తొలి వికెట్ డౌన్..
242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. 20 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను షాహీన్ అఫ్రిది అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు.
దూకుడుగా ఆడుతున్న రోహిత్..
4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(16), శుబ్‌మన్ గిల్(9) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు భారత్ స్కోర్: 12/0
2 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(11), శుబ్‌మన్ గిల్(0) ఉన్నారు.
241 పరుగులకు పాక్ ఆలౌట్..
టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకోగా.. రోహిత్ సేన ఫీల్డింగ్‌కు దిగింది. ఈ క్రమంలో 49.4 ఓవర్లలో పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో వన్‌డౌన్ బ్యాటర్ సౌద్ షకీల్(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ రిజ్వాన్(46), ఖుష్దిల్ షా(38) మెరుగ్గా ఆడారు. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు.
పాక్ ఆలౌట్.. స్కోరెంతంటే?
49.4: హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఖుష్దిల్ (38) కోహ్లికి క్యాచ్ ఇచ్చి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. పాక్ స్కోరు: 241 (49.4).
48.6: తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
షమీ బౌలింగ్‌లో హ్యారిస్ రవూఫ్ సింగిల్ పూర్తి చేసుకుని రెండోరన్ కోసం పరిగెత్తగా అక్షర్ పటేల్ అద్భుత త్రో వేశాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ స్టంప్స్‌ను గిరాటేయడంతో రవూఫ్(7) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. పాక్ స్కోరు: 241/9 (49.2)
46.4: ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్
నసీం షా(14) రూపంలో పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నసీం పెవిలియన్ చేరాడు. పాక్ స్కోరు: 222/8 (47). ఖుష్దిల్ షా 27 పరుగులతో ఉన్నాడు.
ఏడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
42.5: కుల్దీప్ బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిది లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆరో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
42.4: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగిన సల్మాన్ ఆఘా. పందొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చిన సల్మాన్ పెవిలియన్ చేరాడు.
40 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 183/5 (40)
ఖుష్దిల్ షా 8, సల్మాన్ ఆఘా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఐదో వికెట్ డౌన్
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో తయ్యబ్ తాహిర్(4) బౌల్డ్. ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్. స్కోరు: 165/5 (36.1)
నాలుగో వికెట్ కోల్పోయిన పాక్
34.5: హాఫ్ సెంచరీ వీరుడు సౌద్ షకీల్(62) రూపంలో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో షకీల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ ఒడిసిపట్టాడు.
33.2: మూడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన రిజ్వాన్. షకీల్‌తో కలిసి రిజ్వాన్ వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేయగా అక్షర్ ఈ జోడీని విడదీశాడు. 77 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ మూడు ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సల్మాన్ ఆఘా క్రీజులోకి వచ్చాడు. షకీల్ 57 పరుగులతో ఉన్నాడు.
30 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 129/2
రిజ్వాన్ 39, షకీల్ 44 రన్స్‌తో క్రీజులో ఉన్నారు.
25 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 99/2
షకీల్ 29, రిజ్వాన్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

21 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు: 82-2
రిజ్వాన్ 15, షకీల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పొదుపుగా బౌల్ చేస్తున్న టీమిండియా ప్లేయర్లు
17 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 72/2 (17). రిజ్వాన్ 23 బంతుల్లో 10, సౌద్ షకీల్ 27 బంతుల్లో 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కట్టుదిట్టంగా భారత్ బౌలింగ్
పవర్‌ప్లే ముగిసే సరికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి కేవలం 52 పరుగులు చేసింది. రిజ్వాన్ 4, షకీల్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 52-2

9.2: రెండో వికెట్ డౌన్
పాక్ మరో ఓపెనర్ ఇమామ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో మిడాన్ మీదుగా షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇమామ్.. సింగిల్ కోసం వెళ్లాడు. అయితే, సరైన సమయంలో క్రీజులోకి చేరకోకపోవడంతో అవుటయ్యాడు. ఫీల్డర్ అక్షర్ పటేల్ డైరెక్ట్ త్రోతో వికెట్ కోల్పోయాడు. 26 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేసి ఇమామ్ వెనుదిరిగాడు. రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. పాక్ స్కోరు: 48/2 (9.3)

8.2: తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి బాబర్ ఆజం పెవిలియన్ చేరాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇమామ్‌కు జతగా సౌద్ షకీల్ క్రీజులోకి వచ్చాడు. పాక్ స్కోరు: 45/1 (8.3)
ఆరు ఓవర్లలో పాక్ స్కోరు: 26/0 (6)
బాబర్ 10, ఇమామ్ 9 పరుగులతో ఉన్నారు.

మూడు ఓవర్లో పాకిస్తాన్ స్కోరు: 14-0
రెండు ఓవర్లు ముగిసే సరికి పాక్ స్కోరు: 10-0
బాబర్, ఇమామ్ చెరో రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి ఓవర్లో పాకిస్తాన్ స్కోరు: 6-0
బాబర్ ఆజం 0, ఇమామ్ ఉల్ హక్ ఒక పరుగుతో ఉన్నారు. తొలి ఓవర్లో మీ ఏకంగా ఐదు వైడ్లు వేయడం గమనార్హం. తద్వారా పాకిస్తాన్‌కు అదనంగా ఐదు పరుగులు వచ్చాయి.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుది జట్లు
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

పాకిస్తాన్:
సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.