Asia Cup, 2023- Pakistan vs India, Super Fours: ‘‘భారీ విజయం అన్న మాట అటుంచితే... చాకిరేవులో బట్టలు ఉతికినట్లు వాళ్లను మనవాళ్లు ఉతికి ఆరేశారు. జట్టు పటిష్టంగా ఉన్నపుడు గత మ్యాచ్ తాలూకూ ఫలితం ఏమాత్రం ప్రభావం చూపలేదు. ముగిసిపోయిన దాని గురించి ఆలోచించే కంటే.. తదుపరి ఏం చేయాలన్న దానిపైనే దృష్టి సారించాలి.
పాకిస్తాన్ మరీ చెత్తగా
పాకిస్తాన్ మరీ ఇలాంటి తప్పిదాలు చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు’’ అని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. ఆసియా కప్-2023 సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత జట్టును అభినందిస్తూ ఈ మేరకు ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన కేఎల్ రాహుల్‌ను సైతం గావస్కర్ కొనియాడాడు.
రాహుల్, బుమ్రా సూపర్
‘‘కేఎల్ రాహుల్ కేవలం సెంచరీ సాధించడమే కాదు.. వికెట్ కీపింగ్ కూడా చేశాడు. తన ఫిట్‌నెస్ గురించి వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు. పూర్తి ఫిట్‌గా ఉన్నానని నిరూపించుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సైతం తిరిగి లయ అందుకున్నాడని.. బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడని ప్రశంసించాడు.
బాబర్‌కు చుక్కలు
ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించిన... బుమ్రా బౌలింగ్‌లో వరల్డ్‌క్లాస్ బ్యాటర్ బాబర్ ఆజం సైతం ఇబ్బంది పడ్డాడని స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడుతూ గావస్కర్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. కాగా వర్షం కారణంగా సోమవారం జరిగిన రిజర్వ్ డే మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 228 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. సెంచరీ హీరో విరాట్ కోహ్లి(122- నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
మన ఓపెనర్ల బ్యాటింగ్ ప్రశంసనీయం
‘‘కొన్నిసార్లు మ్యాచ్‌లో ఓటమికంటే రద్దు కావడమే మంచిది. ఇరు జట్లూ పాయింట్లు పంచుకునే అవకాశం ఉంటుంది. గ్రూప్ దశలో పాకిస్తాన్‌తో భారత్ బ్యాటింగ్ చేసిన తర్వాత వర్షంతో మ్యాచ్ రద్దు కాగానే భారత అభిమానులందరూ కాస్త ఊరట చెందారు. ఒకవేళ నేపాల్‌తో మ్యాచ్ రద్దు అయినా సరే భారత్ సూపర్–4 దశకు అర్హత సాధించేది.
బ్లాక్‌బస్టర్ మ్యాచ్ ఖాయంగా
అదే జరిగితే నెట్‌రన్‌రేట్ పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చేది. అలా చూసినా సరే 266 పరుగులు చేసిన భారత్ రన్‌రేట్ మెరుగ్గానే ఉండేది. సాధారణంగా ఎప్పుడూ కూడా భారత్, పాకిస్తాన్ జట్లు తర్వాతి దశకు చేరేలాగే గ్రూప్‌లు విభజిస్తున్నారు. ఐసీసీ ఈవెంట్లలో కూడా ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉంటే కనీసం ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ మ్యాచ్ ఖాయంగా ఉంటోంది.
శ్రీలంక తక్కువేం కాదు
శ్రీలంకపై భారత్ రికార్డు మెరుగ్గానే ఉంది. తర్వాతి మ్యాచ్‌లకు కూడా వాతావరణం కీలకంగా మారనుంది. ఆసియా కప్‌లో భారత్ 7 సార్లు, శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు మాత్రమే విజేతగా నిలిచాయని విషయాన్ని మరచిపోవద్దు. పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్, గిల్ ఆకట్టుకునే ప్రదర్శనతో ప్రత్యర్థి బౌలింగ్ బలహీతనలను సమర్థంగా చూపించారు.
గిల్ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడగా మరో ఎండ్‌లో చెలరేగుతున్న నసీమ్ షా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని రోహిత్ తన విలువను చూపించాడు. మ్యాచ్ రిజర్వ్ డేకు సాగడంతో భారత్ వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని అంతకుముందు తన కాలమ్‌లో గావస్కర్ రాసుకొచ్చాడు.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు ముందే ప్లాన్ చేసుకున్నారు: బాబర్ ఆజం
TIMBERRRR! 💥@imkuldeep18 puts himself in the wickets column, foxing ace batter @FakharZamanLive!
— Star Sports (@StarSportsIndia) September 11, 2023
Huge blow for #Pakistan.
Can #TeamIndia wrap this up soon?
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/giFQcgKRdG
The Man with the Golden Arm! 😍🫡@imShard has a happy knack of taking wickets & he wastes no time in breaking through immediately after the 🌧 interval.
— Star Sports (@StarSportsIndia) September 11, 2023
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/fSGgzjhAlc
Comments
Please login to add a commentAdd a comment