ఆసియా కప్-2023 బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారత క్రికెట్ జట్టు సారథి ఎవరో కూడా తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ బ్రాండ్ అంబాసిడర్లను ప్రమోట్ చేసుకునే క్రమంలో టీమిండియా కెప్టెన్‌ను అవమానించడం సరికాదని ట్రోల్ చేస్తున్నారు.
కాగా ఆగష్టు 30న ఆసియా వన్డే కప్ టోర్నీకి తెరలేవనున్న విషయం తెలిసిందే. శ్రీలంక, పాకిస్తాన్‌లు సంయుక్తంగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ లంకలోనే జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కొత్త ప్రోమోను విడుదల చేసింది.
భారత జట్టుకు గుండెకాయలాంటి అభిమానుల భావోద్వేగాల సమాహారంగా రూపొందించిన ఈ ప్రోమోలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని హైలైట్ చేసింది. #HandsUpForIndia అనే హ్యాష్‌ట్యాగ్‌తో ‘మీ ఫేవరెట్ మూమెంట్ ఏది?’’ అంటూ నిమిషం నిడివి గల వీడియోలో రోహిత్ శర్మకు స్థానం కల్పించలేదు.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్, శ్రీలంక సారథి దసున్ షనక తదితరులతో కూడిన పోస్టర్‌ను ఉంచింది. ఆఖర్లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు సంబంధించిన డేట్ పోస్టర్‌లో మాత్రం కోహ్లితో పాటు రోహిత్ శర్మను చూపించింది.
ఇక ప్రోమో మొత్తానికి కింగ్ కోహ్లిని హైలైట్ చేయడం అతడి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచగా.. రోహిత్ అభిమానులకు చిరాకు తెప్పించింది. దీంతో స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా అంటే కోహ్లి ఒక్కడే కాదని, మిగతా వాళ్లకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలంటూ చురకలు అంటిస్తున్నారు.
కాగా కోహ్లి స్టార్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం విదితమే. ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2023 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య సెప్టెంబరు 2న తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం..
Through thick & thin, fans always have their hands up in support of #TeamIndia. Now, we back them to conquer both Asia & the world! 🙌🏻🏆
— Star Sports (@StarSportsIndia) August 8, 2023
Tell us your favourite #HandsUpForIndia moment in the comments.
Tune-in to #AsiaCupOnstar
Aug 30 Onwards | Star Sports Network#Cricket pic.twitter.com/z7zSlbqBfz
Comments
Please login to add a commentAdd a comment