టెస్టుల్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ నిషాన్ మదుష్కను ఔట్ చేసిన అఫ్రిది.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న 18వ పాక్ బౌలర్‌గా షాహీన్ షా అఫ్రిది నిలిచాడు.
అఫ్రిది ఈ అరుదైన ఫీట్‌ను కేవలం 26వ టెస్టు మ్యాచ్‌లోనే అందుకున్నాడు. అదే విధంగా కేవలం 23 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన మూడో పాక్ ఫాస్ట్ బౌలర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో పాక్ దిగ్గజ బౌలర్లు సీం అక్రమ్, వకార్ యూనిస్‌లు ఉన్నారు. ఇక దాదాపు ఏడాది తర్వాత టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన అఫ్రిది.. తన తొలి మ్యాచ్‌లోనే నిప్పులు చేరుగుతున్నాడు.
అదిలోనే మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు. కుశాల్ మెండిస్, కరుణరత్నే, మధుష్క వికెట్లను అఫ్రిది పడగొట్టాడు. అఫ్రిది కెరీర్‌లో 4 ఫైవ్ వికెట్ల హాల్స్, ఒక 10 వికెట్ల హాల్ ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో మథ్యూస్(34), ధనుంజయ డిసిల్వా(23) పరుగులతో ఉన్నారు.
చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్!
Comments
Please login to add a commentAdd a comment