చెలరేగిన షాహిన్‌ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక | SL VS PAK 1st Test: Shaheen Afridi Shines Again As Sri Lanka Bundled Out For 222 On Day 1 | Sakshi
Sakshi News home page

SL VS PAK 1st Test Day 1: చెలరేగిన షాహిన్‌ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక 

Published Sun, Jul 17 2022 6:54 AM | Last Updated on Sun, Jul 17 2022 6:54 AM

SL VS PAK 1st Test: Shaheen Afridi Shines Again As Sri Lanka Bundled Out For 222 On Day 1 - Sakshi

శ్రీలంక, పాకిస్తాన్‌ మధ్య గాలేలో శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో ఒకే రోజు 12 వికెట్లు పడ్డాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 66.1 ఓవర్లలో 222 పరుగులకే కుప్పకూలింది. దినేశ్‌ చండిమాల్‌ (115 బంతుల్లో 76; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, మహీశ్‌ తీక్షణ (38), ఒషాదా ఫెర్నాండో (35) ఫర్వాలేదనిపించారు.

పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...హసన్‌ అలీ, యాసిర్‌ షా చెరో 2 వికెట్లు తీశారు. అయితే వెంటనే కోలుకున్న లంక ప్రత్యర్థిని దెబ్బ తీసింది. ఆట ముగిసే సమయానికి పాక్‌ 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. షఫీఖ్‌ (13), ఇమామ్‌ (2) వెనుదిరగ్గా... ప్రస్తుతం అజహర్‌ అలీ (3), బాబర్‌ ఆజమ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.  
చదవండి: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్‌ బౌలర్‌ ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement