శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160) అజేయమైన శతకంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోని వెళ్లింది. లంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 222/3 స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. అబ్దుల్లా షఫిక్ (406 బంతుల్లో 160; 7 ఫోర్లు, సిక్సర్).. మహ్మద్ నవాజ్ (34 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్) సహకారంతో పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో చండీమాల్ (76) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4, హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు, నసీమ్ షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బాబర్ ఆజమ్ వీరోచిత సెంచరీ (119) సహకారంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసి ఆలౌటైంది. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/82) పాక్‌కు దారుణంగా దెబ్బకొట్టాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (94 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) 6 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం కలుపుకుని లంక మొత్తంగా 342 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో పాక్ మొదట్లో తడబడినప్పటికీ షఫీక్, కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) ఆదుకున్నారు. వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (40) కూడా జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. వీరిద్దరూ ఔటైనా షఫీక్ టెయింలెండర్ల సహకారంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య (4/135) రాణించాడు.
చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!
Comments
Please login to add a commentAdd a comment