Pakistan vs Srilanka
-
మలింగ సూపర్ యార్కర్.. నోరెళ్లబెట్టిన పాక్ కెప్టెన్! వీడియో
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో పాకిస్తాన్-ఎ కథ ముగిసింది. అల్ అమెరత్ వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన తొలి సెమీఫైనల్లో 7 వికెట్ల తేడాతో పాక్ ఓటమి చవిచూసింది. 136 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవర్లలో ఊదిపడేసింది.లంక బ్యాటర్లలో అహన్ విక్రమసింఘే(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లహిరు ఉదరా(43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్, అబ్బాస్ అఫ్రిది తలా వికెట్ మాత్రమే సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులకే విఫలమైంది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ యూసఫ్(68) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో స్పిన్నర్ హేమంత 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. ఇషాన్ మలింగ, రన్షిక తలా రెండు వికెట్లు పడగొట్టారు.మలింగ సూపర్ యార్కర్..అయితే ఈ మ్యాచ్‌లో లంక స్పీడ్ స్టార్ ఇషాన్ మలింగ సంచలన బంతితో మెరిశాడు. పాక్ కెప్టెన్ మహ్మద్ హ్యారీస్‌ను అద్భుతమైన యార్కర్‌తో మలింగ క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్ 6 ఓవర్లో మలింగ ఆఖరి బంతిని వేసే క్రమంలో హ్యారీస్ ముందుగానే తన కుడి వైపునకు వెళ్లి ర్యాంప్ షాట్ ఆడాలనకున్నాడు.ఇది గమనించిన ఎషాన్ మలింగ చాలా తెలివిగా మిడిల్ అండ్ లెగ్‌పై అద్భుతమైన యార్కర్‌ను బౌల్ చేశాడు. బుల్లెట్లా దూసుకు వచ్చిన బంతిని కనక్ట్ చేయడంలో పాక్ కెప్టెన్ విఫలమయ్యాడు. దీంతో బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Ehsan Malinga gets the big fish with a peach of a delivery 🫡@OfficialSLC#MensT20EmergingTeamsAsiaCup2024 #SLvPAK #ACC pic.twitter.com/SK54SWEbdY— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024 -
65 ఏళ్ల కిందటి రికార్డును సమం చేసిన పాక్ వైస్ కెప్టెన్
రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సౌద్ షకీల్ 65 ఏళ్ల కిందటి ఓ రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సయీద్ అహ్మద్ సరసన నిలిచాడు. సయిద్ అహ్మద్, సౌద్ షకీల్ ఇద్దరూ కేవలం 20 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. సయీద్ అహ్మద్ 1959లో ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధించగా.. షకీల్ తాజాగా ఈ ఘనతను సాధించాడు. పాక్ తరఫున వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న టాప్-5 ఆటగాళ్ల జాబితాలో సౌద్, సయీద్ తర్వాత సాదిక్ మొహమ్మద్ (22), జావిద్ మియాందాద్ (23), తౌఫిక్ ఉమర్ (24) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. 158/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్ తొలి సెషన్ సమయానికి 56 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సౌద్ షకీల్ 75, మొహమ్మద్ రిజ్వాన్ 65 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు. తొలి రోజు ఆటలో పాక్ అబ్దుల్లా షఫీక్ (2), సైమ్ అయూబ్ (56), షాన్ మసూద్ (6), బాబర్ ఆజమ్ (0) వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్ ఇస్తాం, హసన్ మహ్మూద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.సౌద్ షకీల్ 20 ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు..37, 76, 63, 94, 23, 53, 22, 55*, 125*, 32, 208*, 30, 57, 28, 24, 9, 24, 5, 2, 75* -
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్‌లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్‌దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్‌లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్‌పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు?
ICC WC 2023- Ind vs Pak: ఆటను ఆటలాగే చూడాలి.. న్యాయం ఒక్కొక్కళ్లకు ఒక్కో విధంగా ఉండదు.. ఎదుటివాళ్లపై నిందలు వేసే ముందు.. మనం ఎలాంటి వాళ్లమో! మన వల్ల ఎదుటివాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి! అంతేతప్ప... అవతలి వాళ్లను అన్నపుడు నవ్వుకొని.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడంలో అర్థం ఉండదు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇంచుమించు ఇదే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా చరిత్రను పునరావృతం చేస్తూ టీమిండియా పాక్‌పై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. జరిగిన దాయాదుల సమరంలో రోహిత్ సేన సమిష్టి ప్రదర్శనతో బాబం ఆజం బృందాన్ని 7 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. అతడు కాస్త భిన్నం నీలి వర్ణంతో నిండిపోయిన స్టేడియంలో చిరకాల ప్రత్యర్థిపై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుని అభిమానులకు సంతోషం పంచింది. ఇదిలా ఉంటే.. పాక్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మిగతా ఆటగాళ్లకు కాస్త భిన్నంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఉద్దేశించి కొంతమంది టీమిండియా ఫ్యాన్స్.. రిజ్వాన్ రీతిలోనే అతడికి కౌంటర్లు ఇచ్చారు. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో రిజ్వాన్‌ను ట్రోల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌కాగా భారత జట్టు అభిమానులపై కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. భారత్- పాక్ మ్యాచ్ అంటే వినోదం మాత్రమే కాదు ఇందుకు బదులుగా.. భారత్- పాక్ మ్యాచ్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. భావోద్వేగాల సమాహారం.. కాబట్టి పరస్పరం కౌంటర్లు విసురుకోవడం సహజమే అని మరికొందరు దీనిని చిన్న విషయంగా కొట్టిపారేశారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ షమీని పాక్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వాళ్ల వల్లే ఓడిపోయాం.. అది కూడా ఓ కారణమే అభిమానుల సంగతి ఇలా ఉంటే.. పాక్ టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలిపై బురదజల్లే ప్రయత్నం చేశాడు. సొంతగడ్డపై ఏ జట్టుకైనా ప్రేక్షకుల మద్దతు బలంగా ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి.. ఇది ఐసీసీ ఈవెంట్‌లా కాదు బీసీసీఐ ఈవెంట్‌లా అనిపిస్తోందని విమర్శించాడు. ఇండియా- పాక్ మ్యాచ్ సందర్భంగా తాను ఒక్కసారి కూడా దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినలేదని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ ఓటమికి ఒక విధంగా టీమిండియాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన మద్దతే కారణమని చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు. పాక్ ఆటగాళ్లు స్పందించనే లేదు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. టీమిండియా అభిమానులను ట్రోల్ చేస్తున్నవాళ్లు, మిక్కీ ఆర్థర్‌కు తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘‘మిక్కీ ఆర్థర్ తప్ప పాకిస్తాన్ ఆటగాళ్లెవరూ స్పందించలేదు. అయినా, కేవలం ఒక్క ఆటగాడి(రిజ్వాన్) విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందని అతడు ఆలోచించలేకపోయాడా? మిగతా వాళ్లు చక్కగా తమ పని తాము చేసుకుని వెళ్లిపోయారు కదా! కొంతమంది 20-30 సెకన్ల వీడియోను ఆధారంగా చూపి కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. భారత్ ప్రజలు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తారు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉన్న వాళ్లు. శ్రీలంక విషయంలో ఎందుకిలా? సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు.. సగం సగం వీడియోలతో అసలు నిజాన్ని దాచేసే ప్రయత్నాలు జరుగుతాయి. దిల్ దిల్ పాకిస్తాన్ అనే మ్యూజిక్ వినిపించనేలేదని మిక్కీ ఆర్థర్ అంటున్నాడు. కొంతమందేమో ప్రేక్షకులు ఇరు జట్లకు మద్దతుగా నిలవాలని సూక్తులు చెబుతున్నారు. మరి శ్రీలంక విషయంలో ఎందుకలా మాట్లాడలేదు? హైదరాబాద్‌లో జరిగిన దానికి లంక జట్టు కూడా పాక్లాగ ఫిర్యాదులు చేయవచ్చు కదా! హైదరాబాద్‌లో జీతేగా భాయ్ జీతేగా అని డీజే పెట్టినపుడు.. ప్రేక్షకులంతా పాకిస్తాన్ జీతేగా అని పాక్ టీమ్‌కు మద్దతు పలికారు. శ్రీలంకకు అసలు సపోర్టు లేదు. అఫ్గనిస్తాన్‌కు ఢిల్లీ ప్రేక్షకుల మద్దతు అదే విధంగా ఢిల్లీలో ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్ సందర్భంగా చాలా మంది అఫ్గనిస్తాన్‌కు మద్దతుగా నిలిచారు. మరి అఫ్గన్ జలేబి గురించి ఇంగ్లండ్ కంప్లైట్ చేయొచ్చా’’ అంటూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలను సమర్థించుకున్నాడు. కొంతమంది చర్యను మొత్తంగా భారత జట్టు అభిమానులకు ఆపాదించడం సరికాదని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు.. ‘నిజం చెప్పారు.. టీమిండియా వరకు వచ్చే సరికే ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తారు ఎందుకో? అందరిని సమానంగా చూడాలన్న వారు అందరి పట్ల ఒకే రీతిలో ఆలోచించాలి’’ అని ఆకాశ్ చోప్రాకు మద్దతు పలుకుతున్నారు. మరికొందరేమో ఇలాంటి సున్నిత అంశాల పట్ల ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని కోరుతున్నారు. చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: రిజ్వాన్ వివాదస్పద ట్వీట్! ఆటను వదిలి ఇతర అంశాల్లోకి!
WC 2023 Pak Vs SL: పాకిస్తాన్ వికెట్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ వివాదాస్పద ట్వీట్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఆటతో సంబంధంలోని విషయంలో తలదూర్చి నెటిజన్ల చేతికి చిక్కాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో రిజ్వాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో లంక విధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(113)తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి పాకిస్తాన్‌కు రికార్డు విజయం అందించాడు. 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో చెలరేగి.. 131 పరుగులతో రాణించి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఎక్స్ వేదికగా రిజ్వాన్ చేసిన పోస్టు విమర్శలకు కారణమైంది. గాజాలో ఉన్న నా సోదర, సోదరీమణుల కోసం ‘‘జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇది సమిష్టి విజయం. అబ్దుల్లా షఫీక్, హసన్ అలీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వాళ్ల వల్లే గెలుపు సులువైంది. హైదరాబాద్ ప్రజలకు మేము రుణపడి ఉంటాం. మీ ఆతిథ్యానికి.. మాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు’’ అని రిజ్వాన్ రాసుకొచ్చాడు. అయితే, పోస్ట్ ఆరంభంలో.. ‘‘ఇది గాజాలో ఉన్న మా సోదర, సోదరీమణుల కోసం’’ అంటూ ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని షేర్ చేయడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నువ్వు ఎవరికి సపోర్టు? ‘‘నువ్వు గాజా ప్రజలకు సపోర్టు చేస్తున్నావా? లేదంటే.. హమాస్ మిలిటెంట్లకు మద్దతు ప్రకటిస్తున్నావా? చర్యకు ప్రతి చర్య ఉంటుందనే విషయం తెలియదా?’’ అంటూ కొంతమంది ఫైర్ అవుతున్నారు. మరికొందరేమో.. ‘‘నీ సెంచరీ గాజా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది. కనీసం ఈ మ్యాచ్‌ను చూసే స్థితిలో కూడా లేరు అక్కడి వాళ్లు. అయినా వరల్డ్‌కప్ లాంటి ఐసీసీ ఈవెంట్ ఆడుతున్నపుడు రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే.. నీ మ్యాచ్ ఫీజులు, రెమ్యునరేషన్లు గాజా ప్రజల కోసం విరాళంగా ఇవ్వు’’ అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ప్రతిసారి ఆటలోకి ఇలాంటివి లాగడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు. కాగా గాజాలో తిష్టవేసిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడికి దిగడంతో యుద్ధానికి తెరలేచింది. పరస్పర దాడుల నేపథ్యంలో ఇటు గాజా.. అటు ఇజ్రాయెల్‌లో కలిపి మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. చదవండి: నవీన్ ఉల్ హక్ రనౌట్ మిస్.. రాహుల్‌పై కోహ్లి సీరియస్! వీడియో వైరల్ -
CWC 2023: కోహ్లి-రాహుల్, రిజ్వాన్-షఫీక్.. ఎవరి భాగస్వామ్యం గొప్పది..?
ప్రస్తుత ప్రపంచకప్‌లో పట్టుమని పది రోజులు కూడా గడవకముందే పలు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటిది భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో రెండో ఆసక్తికర మ్యాచ్ ఏదంటే.. పాకిస్తాన్, శ్రీలంక మధ్య హైదరాబాద్‌లో నిన్న జరిగిన మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో పాక్ సైతం అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి చారిత్రక విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓ కామన్ థింగ్ ప్రస్తుతం క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లి-కేఎల్ రాహుల్.. మొహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీక్‌లు నెలకొల్పిన మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలపై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఈ రెండు భాగస్వామ్యాల్లో ఏది గొప్పది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భారత అభిమానులు సహా యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం విరాట్-రాహుల్ పార్ట్‌నర్‌షిప్‌కు ఓటేస్తుంటే, పాక్ ఫ్యాన్స్ మాత్రం రిజ్వాన్-షఫీక్ భాగస్వామ్యం గొప్పదని డప్పుకొట్టుకుంటున్నారు. ఇరు భాగస్వామ్యాలపై ఓ లుక్కేస్తే.. ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్ స్వల్ప లక్ష్య ఛేదనలో (200 పరుగులు) 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండగా.. విరాట్ (85)-రాహుల్ (97 నాటౌట్) జోడీ 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను గెలిపించింది. శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. లంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ను రిజ్వాన్ (131 నాటౌట్)-షఫీక్ (113) జోడీ 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయతీరాలకు చేర్చింది. ఈ రెండు పార్ట్‌నర్‌షిప్స్‌లో నలుగురు ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో పరుగులు సాధించి, తమతమ జట్లను గెలిపించారు. రెండు సందర్భాల్లో వారు ఒక్కో పరుగు పేరుస్తూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు విజయాలకు దోహదపడ్డారు. వాస్తవానికి ఈ రెంటిని ఒకదానితో ఒకటి పోల్చలేని పరిస్థితి. ఇరు భాగస్వామ్యాలు తీవ్రమైన ఒత్తిడిలో నెలకొల్పివనే. దేని ప్రత్యేకత దానికుంది. దీన్ని అంశంగా తీసుకుని డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అయినా ఈ రెంటిలో గొప్ప భాగస్వామ్యం ఏదని చెప్పాల్సి వస్తే మాత్రం మెజార్టీ శాతం అభిప్రాయంతో వెళ్లాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌ల విషయాలను పక్కన పెడితే.. భారత్-పాక్‌లు అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రస్తుత టోర్నీలో ఇరు జట్ల ప్రదర్శనను చూసిన తర్వాత ఈ మ్యాచ్‌పై మరింత హైప్ పెరిగింది. దీనికి ముందు భారత్ ఇవాళ (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. న్యూఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
CWC 2023: పాపం మతీష పతిరణ! జూనియర్ మలింగగా పేరొచ్చినా...
శ్రీలంక యువ పేసర్ మతీష పతిరణకు ప్రపంచకప్ 2023 అంతగా అచ్చిరావడం లేదనిపిస్తోంది. ఆడింది రెండు మ్యాచ్‌లే కానీ... సమర్పించుకున్న పరుగులు మాత్రం 180కిపైగానే. పోనీ వికెట్లయినా ఎక్కువ తీశాడా? ఊహూ అదీ లేదు. రెండు మ్యాచ్‌లలోనూ చెరో వికెట్ మాత్రమే దక్కింది. దీంతో టోర్నీలోనే అత్యంత ధారాళంగా పరుగులిచ్చిన బౌలర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మొత్తం పది ఓవర్లలో 95 పరుగులిచ్చి ఒక వికెట్ తీసిన పతిరణ నిన్నటి పాకిస్తాన్ మ్యాచ్‌లోనూ ధారాళంగా పరుగులిచ్చాడు. తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ తీసి 90 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో డికాక్, డస్సెన్, మార్క్రమ్ పతిరణకు బౌలింగ్‌లో పరుగుల వరద పారిస్తే... పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్, మొహమ్మద్ రిజ్వాన్ అతని బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. ఈ వరుస దారుణ ప్రదర్శనల నేపథ్యంలో లంక జట్టులో పతిరణ స్థానం ప్రశ్నార్ధకంగా మారింది. ఒక రకంగా అతడి కెరీరే ప్రమాదంలో పడిందని చెప్పాలి. బౌలింగ్ కట్టుదిట్టం చేసుకోకుంటే కేవలం బౌలింగ్ యాక్షన్ ద్వారా జూనియర్ మలింగగా పొందిన పేరు కూడా అతడి కెరీర్‌ను కాపాడలేదని విశ్లేషకులు అంటున్నారు. యువ బౌలర్.... ఇరవై ఏళ్ల పతిరణ కెరీర్లో ఇప్పటివరకూ 12 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు. తన స్వల్ప వన్డే కెరీర్లో 7.28 సగటున పరుగులు సమర్పించుకుని భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఐపీఎల్లో సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నా... తగినన్ని వికెట్లు తీసుకోవడంతో మంచి బౌలర్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ... మున్ముందు పతిరణ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్ శ్రీలంకపై చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక నిర్దేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ప్రపంచకప్‌లో 300కు పైగా లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన తరువాత 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్‌ను మొహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (113)లు తమ సూపర్ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సమర విక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. -
CWC 2023: ఉప్పల్ స్టేడియం సిబ్బందిపై ప్రేమను చాటుకున్న పాక్ కెప్టెన్
శ్రీలంకపై చారిత్రక విజయంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ నగరానికి వీడ్కోలు పలికింది. ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు, రెగ్యులర్ మ్యాచ్‌ల కోసం గత రెండు వారాలుగా నగరంలో బస చేస్తున్న పాక్ జట్టు ఇక్కడి ఆతిథ్యానికి, ఇక్కడి ప్రజల అభిమానానికి, ప్రత్యేకించి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (ఉప్పల్) సిబ్బంది సేవలకు ఫిదా అయ్యింది. ఓ రకంగా చెప్పాలంటే పాక్ క్రికెటర్లు ఇక్కడి వాతావరణంతో, ఇక్కడి ప్రజలతో మమేకమైపోయారు. వారికి హైదరాబాద్ నగరం స్వదేశానుభూతిని కలిగించింది. ఇక్కడి భాష, ఇక్కడి ఆచార వ్యవహారాలు, తిండి, ప్రత్యేకించి క్రికెట్ అభిమానుల ఆదరణ పాక్ క్రికెటర్లకు హోం టౌన్ ఫీలింగ్ కలిగించాయి. ప్రపంచకప్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు (వార్మప్ మ్యాచ్‌లతో కలిపి) ఆడిన పాకిస్తాన్.. నిన్నటి మ్యాచ్ అనంతరం హైదరాబాద్‌ను వదిలి అహ్మదాబాద్‌కు పయనమైంది. అక్టోబర్ 14న పాక్.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాతో తలపడాల్సి ఉంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయానంతరం పాక్ క్రికెటర్లు ఉప్పల్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్‌పై తమ ప్రేమను చాటుకున్నారు. గత రెండు వారాలుగా తమ బసను ఆహ్లాదకరంగా మార్చిన మైదాన సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. స్టేడియం సిబ్బంది యొక్క ఎనలేని సేవలను కొనియాడారు. మ్యాచ్ అనంతరం వారితో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వారికి తన జెర్సీని బహుకరించి ప్రత్యేకంగా ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. Pakistan players saying "Thank you to the ground staff".- A beautiful gesture. pic.twitter.com/xIhwiYHeea— Johns. (@CricCrazyJohns) October 10, 2023 ఇదిలా ఉంటే, శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో పాక్ చారిత్రక విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా పాక్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న పాక్‌ను మొహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్లా షఫీక్ (113) సూపర్ సెంచరీలతో గెలిపించారు. అంతకుముందు కుశాల్ మెండిస్ (122), సమరవిక్రమ (108) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. -
WC 2023: పాక్ బౌలర్లను చితకబాదిన లంక బ్యాటర్లు.. ఫ్యాన్స్ సందడి
-
WC 2023: ‘స్టార్ ఓపెనర్’పై వేటు! కెరీర్‌కు ఎండ్ కార్డ్ అంటూ..
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై వేటు పడింది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో పాక్ మేనేజ్మెంట్ అతడికి చోటు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫఖర్ జమాన్ స్థానంలో అబ్దుల్లా షఫీక్ తుదిజట్టులోకి వచ్చాడు. టాపార్డర్‌లో తమ ఆటగాళ్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో అక్టోబరు 14 నాటి మ్యాచ్ నుంచి ఫఖర్ జమాన్‌ను తప్పిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై నెట్టింట్లో సెటైర్లు పేలుతుండగా.. అభిమానులు మాత్రం ఫఖర్ జమాన్‌కు అండగా నిలుస్తున్నారు. ‘‘బాబర్ ఆజం మాటల్ని బట్టి.. టీమిండియాతో మ్యాచ్ నుంచి జమాన్ అవుట్ అయ్యాడని అధికారికంగా తెలిసిపోయింది. నిజానికి 2019 వరల్డ్‌కప్ టోర్నీలో షోయబ్ మాలిక్‌కు ఇలాగే జరిగింది. ఏదేమైనా పాక్ తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ఘనత ఫఖర్ జమాన్‌ది. తదుపరి మ్యాచ్‌లో ఆడే అవకాశం వస్తుందో లేదో! ఒకవేళ మళ్లీ అతడిని జట్టులోకి తీసుకోలేదంటే కెరీర్ ముగిసిపోతుందనడానికి సంకేతాలు వచ్చినట్లే!’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత 11 ఇన్నింగ్స్‌లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సగటు 18.36తో 202 పరుగులు సాధించాడు. అయితే, 33 ఏళ్ల ఫఖర్ జమాన్ 2023 ఆరంభంలో మాత్రం ఐదు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, ఒక అర్ధ శతకం సాయంతో 454 పరుగులు చేశాడు. ఇక అబ్దుల్లా షఫీక్ చివరగా ఆసియా కప్-2023 మ్యాచ్‌లో శ్రీలంక మీద హాఫ్ సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. 2017లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఫఖర్ జమాన్ ఇప్పటి వరకు 79 వన్డేల్లో కలిపి 3284 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 15 అర్ద శతకాలు ఉన్నాయి. చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన మెండిస్.. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ!
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక స్టార్ ఆటగాడు కుశాల్ మెండిస్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ కుశాల్ మెండిస్.. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో మెండిస్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగర్కర పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 70 బంతుల్లో సంగర్కర సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో సంగర్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 77 బంతులు ఎదుర్కొన్న మెండిస్.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: ODI WC 2023: అందరూ కోహ్లిని మాత్రమే ప్రశంసిస్తున్నారు.. అతడి సంగతి ఏంటి మరి? The fastest century by a Sri Lankan at a Men's #CWC 💯🇱🇰@mastercardindia Milestones 🏏 #CWC23 #PAKvSL pic.twitter.com/4Afiq6ss0e — ICC (@ICC) October 10, 2023 -
CWC 2023: శ్రీలంకతో మ్యాచ్.. పాకిస్తాన్ చరిత్ర పునరావృతం చేసేనా..?
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ (అక్టోబర్ 10) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పాకిస్తాన్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంలో ఉన్న పాక్ టోర్నీలో రెండో విజయంపై కన్నేయగా.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. పాక్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. పాక్‌పై ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంక.. పాక్‌పై ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా నెగ్గింది లేదు. మెగా టోర్నీలో ఇరు జట్లు 7 సందర్భాల్లో ఎదురెదురుపడగా అన్ని సార్లు పాకిస్తాన్‌దే పైచేయిగా నిలిచింది. దీంతో నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పాక్‌కు ఓటమి రుచి చూపించాలని శ్రీలంక జట్టు కసిగా ఉంది. మరోవైపు పాక్ ప్రపంచకప్‌లో శ్రీలంకపై తమ జైత్రయాత్రను కొనసాగించేందుకు ప్రణాళికలతో సిద్దంగా ఉంది. ఓవరాల్‌గా కూడా పాక్‌దే పైచేయి.. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై పాకిస్తాన్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 156 వన్డేల్లో తలపడగా.. పాక్ 92, శ్రీలంక 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్ టై అయ్యింది. ఈసారి లంకతో అంత ఈజీ కాదు.. ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా చూసినా శ్రీలంకపై స్పష్టమైన ఆథిక్యం కలిగిన పాక్‌కు లంకేయులతో ఈసారి అంత ఈజీ కాదని అనిపిస్తుంది. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన చాలా రెట్లు మెరుగుపడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతి భారీ లక్ష్యన్ని (429) ఛేదిస్తూ కూడా శ్రీలంక అంత ఈజీగా చేతులెత్తేయలేదు. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు పరాజయంపాలైనప్పటికీ, బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చారు. కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు అసమానమైన తెగువను చూపి భారీగా పరుగులు సాధించారు. కుశాల్ మెండిస్ (76), అసలంక (79), కెప్టెన్ షనక (68) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లు పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. లంక బ్యాటర్లు మరోసారి మెరుపులు మెరిపిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు. -
ప్రపంచకప్ 2023లో ఇవాళ 2 మ్యాచ్‌లు.. హైదరాబాద్‌లో ఓ మ్యాచ్..!
వన్డే ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 10) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్-బంగ్లాదేశ్‌లు ధర్మశాల వేదికగా తలపడనుండగా.. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్ జట్లు పోటీపడతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రస్తుత ప్రపంచకప్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చావుదెబ్బ తిని బోణీ విజయం కోసం ఎదురుచూస్తుండగా.. బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి మరో విజయం కోసం కసిగా ఎదురుచూస్తుంది. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను మట్టికరిపించిన ఉత్సాహంలో ఉన్న పాక్.. ప్రపంచకప్‌లో రెండో విజయంపై కన్నేయగా.. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అపజయాన్ని ఎదుర్కొన్న శ్రీలంక.. పాక్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తుంది. స్టోక్స్ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన బెన్ స్టోక్స్.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. స్టోక్సీ గత రెండు రోజులుగా నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. శ్రీలంక జోరు కొనసాగించేనా.. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పరాజయంపాలైనప్పటికీ, ఆ జట్టులోని బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చారు. 429 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు అసమానమైన తెగువను చూపి భారీగా పరుగులు సాధించారు. కుశాల్ మెండిస్ (76), అసలంక (79), కెప్టెన్ షనక (68) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. పాక్‌తో జరిగే మ్యాచ్‌లోనూ లంక బ్యాటర్లు ఇదే జోరును కొనసాగిస్తే పాక్‌కు కష్టాలు తప్పవు. -
చివరి బంతి వరకు పోరాడినా ఫలితం లేదు.. ఏడ్చేసిన బాబర్!? వైరల్
Asia Cup 2023- Sri Lanka Eliminate Pakistan: వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్ చేరాలన్న పాకిస్తాన్ ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీలో పాక్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన దసున్ షనక సేన.. ఈసారి ఆ జట్టును కనీసం ఫైనల్ కూడా చేరవనివ్వలేదు. సొంతగడ్డపై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి.. కొలంబోలో బాబర్ ఆజం బృందంపై పైచేయి సాధించింది. టీమిండియాతో పాటు తుదిపోరుకు అర్హత సాధించింది. అఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో మొత్తంగా 12 సార్లు(11 వన్డే, ఒక టీ20) ఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది. కాగా ఈ వన్డే టోర్నీ ఆరంభానికి ముందు శ్రీలంక వేదికగా పాకిస్తాన్ అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో అఫ్గన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది పాకిస్తాన్. నేపాల్‌పై ఘన విజయం.. భారత్ చేతిలో ఘోర పరాభవం ఇక ముల్తాన్ వేదికగా ఈవెంట్ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌పై ఏకంగా 238 పరుగులతో గెలుపొంది అన్ని శుభసూచకాలే అని మురిసిపోయింది. అయితే, లీగ్ దశలో టీమిండియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం.. సూపర్-4లో బంగ్లాదేశ్‌పై గెలిచినా.. భారత జట్టులో చేతిలో భారీ ఓటమి పాక్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. కీలక ఆటగాళ్లు దూరమైనా ఆఖరి వరకు ఈ క్రమంలో ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శక్తిమేర ప్రయత్నించింది. కీలక పేసర్లు హ్యారిస్ రవూఫ్, నసీం షా జట్టుకు దూరమైనా.. ఆఖరి ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగింది. ప్చ్.. ఎంతగా పోరాడినా ఫలితం లేదు అయితే, వరణుడి కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో.. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. లంక ఆల్‌రౌండర్ చరిత్ అసలంక ఏమాత్రం తడ‘బ్యా’టుకు లోనుకాలేదు. గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో సరిగ్గా 2 రన్స్ తీసి లంకను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్ల హృదయాలు ముక్కలయ్యాయి. ఐసీసీ వన్డే నంబర్ 1 బ్యాటర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు కన్నీటి పర్యంతమైనట్లుగా ఉన్న ఫొటో, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాబర్‌కు ఇది అలవాటే! బాబర్ ఆజం సారథ్యంలో పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్-2021లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. గతేడాది ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. ఈసారి సూపర్-4 దశలోనే ఆసియా కప్ ప్రయాణాన్ని ముగించింది. దీంతో కీలక టోర్నీల్లో బాబర్ జట్టును గెలిపించలేడనే అపవాదు మూటగట్టుకుంటున్నాడు. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం I have seen Babar Azam cry for the first time.💔😢 Don't be sad, @babarazam258. You're the No 1 team and No 1 Batsman in the world...... Always #BehindYouSkipper#PAKvsSL #captaincy #PakistanCricket pic.twitter.com/a91w5oQgj9 — King 👑Babar Azam 56❤️ (@fizza258) September 14, 2023 Look at the reaction of babar azam after last ball 😭💔#AsiaCup2023 pic.twitter.com/cate2stPgp — Shehzad Ahmad (@CEShehzad123) September 14, 2023 Babar Azam in Asia cup 2023 without Nepal inning. Matches: 3 Runs : 56 Average : 18.6 Strike rate : 35 And believe me guys he is no.1 ranked ICC ODI batter. Even Akash Chopra is better than him.#PakistanCricket #BabarAzam pic.twitter.com/Y9ge2bb6D2 — Kohlified. (@123perthclassic) September 14, 2023 You can see how hard Babar Azam is trying to hold back his tears 💔#PAKvSL | #PAKvsSL #SLvsPak #SLvPAK #PakvsSri #AsiaCup2023 #AsiaCup23 #AsiaCup #PakistanCricket #colomboweather #Cricket #CricketTwitter #Pakistan #PakistanCricket #PakistanZindabad pic.twitter.com/Vkvpvx5jnh — Babar Adeel Hussain (@AdeelHuss1) September 14, 2023 -
Ind vs SL: టీమిండియాతో ఫైనల్‌కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ
Asia Cup 2023- Sri Lanka To Face India In Final: ఆసియా కప్-2023 ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. తొడ కండరాలు పట్టేయడంతో అతడు నొప్పితో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం రాత్రి వెల్లడించింది. స్కానింగ్ కోసం శుక్రవారం అతడిని ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపింది. కాగా తుదిపోరుకు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో సూపర్-4 మ్యాచ్‌లో గురువారం పాకిస్తాన్‌తో తలపడింది శ్రీలంక. పట్టుదలతో ఫైనల్లోకి శ్రీలంక వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన వన్డే మ్యాచ్‌లో అసాధారణ పోరాటంతో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన హొరాహోరీ పోరులో పట్టుదలగా పోరాడి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ సందర్భంగానే లంక యువ స్పిన్నర్ మహీశ్ తీక్షణకు గాయమైంది. నొప్పి ఉన్న బౌలింగ్ చేసి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కుడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ తన స్పెల్ పూర్తి చేశాడీ రైట్ఆర్మ్ బౌలర్. పాక్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో 42 పరుగులు ఇచ్చి 4.70 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. టీమిండియాతో ఫైనల్‌కు అనుమానమే! మహ్మద్ నవాజ్‌ను బౌల్డ్ చేసిన తీక్షణ బౌలింగ్‌లో.. ఒకవేళ శ్రీలంక గనుక 35వ ఓవర్లో డీఆర్ఎస్ తీసుకుంటే ఇఫ్తికర్ అహ్మద్(47) వికెట్ కూడా అతడి ఖాతాలో చేరేదే! ఇదిలా ఉంటే.. స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్ మీదే సెప్టెంబరు 17 నాటి ఫైనల్లో శ్రీలంక టీమిండియాను ఢీకొట్టనుంది. ఇలాంటి సమయంలో కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయపడటం ఆ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ ఇప్పటి వరకు లంక తరఫున 27 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. ఆసియా కప్-2023లో ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు కూల్చాడు. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం 🚨 Maheesh Theekshana has strained his right hamstring. The player will undergo a scan tomorrow to fully assess his condition. Theekshana sustained the injury while he was fielding during the ongoing game between Sri Lanka and Pakistan.#AsiaCup2023 #SLvPAK pic.twitter.com/6RTSRxhKNQ — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023 -
మేము పాకిస్తాన్‌కు ఛాన్స్ ఇచ్చాం.. కానీ మా వాడు అదరగొట్టాడు: షనక
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: ‘‘ముందు నుంచి మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అయితే, వికెట్లు పడుతూ ఉండటం వల్ల చివరి ఓవర్ వరకు మ్యాచ్ కొనసాగింది. తిరిగి పుంజుకునేందుకు మేము పాకిస్తాన్‌కు అవకాశం ఇచ్చాము. కానీ.. చరిత్ అసలంక మమ్మల్ని గెలిపిస్తాడని మాకు ముందే తెలుసు. టీమిండియాతో మ్యాచ్‌లో తప్పిదాలు బ్యాటింగ్‌కు వెళ్లే ముందు.. టీమిండియాతో మ్యాచ్‌లో మేము చేసిన తప్పిదాల గురించి చర్చించుకున్నాం. మొదటి 10 ఓవర్లలో వికెట్లు పారేసుకున్నాం. ఏదేమైనా కుశాల్, సదీర అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. వారిద్దరు శ్రీలంక జట్టులో ఉన్న అత్యుత్తమ ప్లేయర్లు. అయితే, ఆఖరి వరకు చరిత్ పట్టుదలగా పోరాడిన తీరు ప్రశంసనీయం’’ అని శ్రీలంక కెప్టెన్ దసున్ షనక హర్షం వ్యక్తం చేశాడు. వరుసగా రెండోసారి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోవడం సంతోషంగా ఉందన్నాడు. అదరగొట్టిన కుశాల్, సదీర ఆసియా కప్-2023 సూపర్-4 దశలో చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక గెలుపొందిన విషయం తెలిసిందే. కొలంబోలో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం లంక టార్గెట్ 252గా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(91), నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన సదీర సమరవిక్రమ(48) అద్భుత ఇన్నింగ్స్‌తో లంక గెలుపునకు బాటలు వేశారు. అసలంక ఆదుకున్నాడు అయితే, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో మిగతా వాళ్లంతా విఫలం కాగా ఐదో నంబర్ బ్యాటర్ చరిత్ అసలంక 49 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. గెలవాలంటే ఒక బంతికి రెండు పరుగులు రాబట్టాల్సిన తరుణంలో ఒత్తిడిని జయించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసియా కప్‌లో శ్రీలంక ఏకంగా 11వ సారి(వన్డే ఫార్మాట్) ఫైనల్‌కు చేరింది. గతేడాది చాంపియన్ శ్రీలంక.. ఈసారీ ఫైనల్లో ఇక ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ దసున్ షనక కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఈ టోర్నీలో శ్రీలంక చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఈసారి ఫిఫ్టీ ఓవర్ల ఫార్మాట్లో సెప్టెంబరు 17న టీమిండియాతో ఫైనల్లో దసున్ షనక బృందం తలపడనుంది. చదవండి: అతడు ఆడాలంటే కోహ్లి ఉండొద్దు.. రోహిత్ మాత్రం: భారత మాజీ బ్యాటర్ మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 -
వరల్డ్‌కప్‌నకు ముందు పాకిస్తాన్‌కు మరో భారీ షాక్! అతడు లేకుండానే..
Asia Cup 2023- Pakistan vs Sri Lanka: వన్డే ప్రపంచకప్-2023కి ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ నసీం షా ఐసీసీ టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా శ్రీలంకతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడలేకపోయిన ఈ యువ ఫాస్ట్‌బౌలర్.. మెగా ఈవెంట్ నాటికి కూడా అందుబాటులోకి రావడం కష్టమేనని పాక్ సారథి బాబర్ ఆజం సంకేతాలు ఇచ్చాడు. ఘనంగా ఆరంభించి.. కీలక సమయంలో చేతులెత్తేసిన పాక్ కాగా నేపాల్‌పై భారీ విజయంతో ఘనంగా ఆసియా కప్-2023 టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్.. సూపర్-4లో టీమిండియా చేతిలో అంతే చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో శ్రీలంకతో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలై ఇంటిబాట పట్టింది. పేసర్లకు గాయాలు కొలంబోలో లంకతో మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్ పేస్ త్రయంలో ముఖ్యమైన ఇద్దరు బౌలర్లు హ్యారిస్ రవూఫ్, నసీం షా గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో గురువారం నాటి మ్యాచ్‌లో జమాన్ ఖాన్ వన్డేల్లో అరంగేట్రం చేయగా.. మహ్మద్ వసీం జూనియర్ కూడా తుదిజట్టులో చోటు సంపాదించాడు. అయితే, ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకదే పైచేయి అయింది. రెండు వికెట్ల తేడాతో పాక్ మీద గెలిచి టీమిండియాతో తుదిపోరుకు లంక అర్హత సాధించింది. చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా బాబర్ ఆజం బృందం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. నసీం షా ఆసియా కప్ గోవిందా.. ఇక ప్రపంచకప్‌నకు ముందు మరో షాక్ ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్, నసీం షా గాయాల గురించి బాబర్ ఆజం ఇచ్చిన అప్డేట్ పాక్ అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఆసియా కప్ టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించిన మెన్ ఇన్ గ్రీన్.. వన్డే ప్రపంచకప్‌లో కూడా చేదు అనుభవం ఎదుర్కొంటుందా అనే భయాలు వారిని వెంటాడుతున్నాయి. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘హ్యారిస్ రవూఫ్ పరిస్థితి బాగానే ఉంది. పక్కటెముకల నొప్పితో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే, వరల్డ్‌కప్ నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం ఉంది. నసీం షా కూడా అంతే. అయితే, అతడి రికవరీకి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేను’’ అని బాబర్ ఆజం పేర్కొన్నాడు. అయితే.. ఐసీసీ ఈవెంట్‌కు నాటికి అతడు అందుబాటులోకి వస్తాడనే అనుకుంటున్నానంటూ మాట దాటవేశాడు. గతంలో 14 నెలల పాటు ఆటకు దూరం కాగా నసీం షా గాయం గురించి ఇంతవరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పూర్తి వివరాలు బయటకు వెల్లడించలేదు. కుడి భుజం నొప్పితో విలవిల్లాడుతున్న అతడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక 20 ఏళ్ల నసీం షాకు గాయాల బెడద కొత్తే కాదు. గతంలో వెన్నునొప్పి కారణంగా ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఏకంగా 14 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌కు వన్డేల్లో కీలక బౌలర్‌గా మారిన నసీం ఇప్పటి వరకు ఆ ఫార్మాట్లో అంతర్జాతీయ స్థాయిలో 14 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్-2023కి ముందు నసీం ఇలా గాయపడటం పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 -
మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
Asia Cup, 2023- Pakistan vs Sri Lanka- Babar Azam Comments On Loss: ఆసియా కప్-2023 టోర్నీలో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. చివరి ఓవర్ వరకు నువ్వా- నేనా అన్నట్లు సాగిన గురువారం నాటి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. కొలంబోలో లంక చేతిలో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. శ్రీలంక జట్టు తమ కంటే మెరుగ్గా ఆడిందని.. అందుకే గెలుపు వారినే వరించిందని పేర్కొన్నాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో తమ బౌలింగ్, ఫీల్డింగ్ పేలవంగా సాగిందని అందుకే ఓడిపోయామని తెలిపాడు. వాళ్లిద్దరు అద్భుతంగా ఆడి లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్, సమరవిక్రమ అద్భుతమైన భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ‘‘మేము ఆరంభంలో.. మ్యాచ్ చివర్లో మెరుగ్గా రాణించగలుగుతున్నాం. కానీ మిడిల్ ఓవర్లలో సరిగ్గా ఆడలేకపోతున్నాం. ఈ రెండే కొంప ముంచాయి ఈరోజు కూడా అదే జరిగింది. మిడిల్ ఓవర్లలో మా బౌలింగ్ అస్సలు బాలేదు. ఫీల్డింగ్ కూడా స్థాయికి తగ్గట్లు లేదు. ఈ రెండు కారణాల వల్ల మేము భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని బాబర్ ఆజం లంక చేతిలో తాము ఓడిపోవడానికి గల కారణాలు విశ్లేషించాడు. అందుకే బంతిని అతడి చేతికి ఇచ్చాను ఇక ఆఖరి ఓవర్లో బాల్‌ను వన్డే అరంగేట్ర బౌలర్‌కు ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘ చివరి ఓవర్ వరకు పోరాటం కొనసాగించే క్రమంలో.. ఆఖర్లో అత్యుత్తమ బౌలర్లనే బరిలోకి దించాలని భావించాను. అందుకే సెకండ్ లాస్ట్ ఓవర్లో బంతిని షాహిన్ ఆఫ్రిది చేతికి ఇచ్చాను. ఫైనల్ ఓవర్లో జమాన్ ఖాన్‌పై నమ్మకం ఉంచాను. అయితే, శ్రీలంక మా కంటే మెరుగ్గా ఆడి విజయం సాధించింది’’ అని బాబర్ ఆజం ఓటమిని అంగీకరించాడు. శ్రీలంక అసాధారణ పోరాటం.. ఫైనల్లో టీమిండియాతో కాగా ఆసియా కప్-2023 సూపర్-4 దశలో తమ ఆఖరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 86 పరుగులు(నాటౌట్) పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే వికెట్లు కోల్పోయినా.. వన్‌డౌన్ బ్యాటర్, వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 91 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సమరవిక్రమ 48, ఆఖరి వరకు క్రీజులో ఉన్న చరిత్ అసలంక 49 పరుగులతో రాణించారు. 42వ ఓవర్ చివరి బంతికి జమాన్ ఖాన్ వేసిన బాల్‌కు రెండు పరుగులు తీసిన లంక ఆటగాళ్లు జట్టు ఫైనల్ బెర్తును ఖరారు చేశారు. సెప్టెంబరు 17న టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చదవండి: Ind Vs Ban: జోరు కొనసాగించేందుకు... అయ్యర్ బరిలోకి... Super11 Asia Cup 2023 | Super 4 | Pakistan vs Sri Lanka | Highlightshttps://t.co/QTLYm5AOMO#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 14, 2023 Some effort this from @iamharis63! 🔥#PAKvSL | #AsiaCup2023 pic.twitter.com/rHE9xkV2il — Pakistan Cricket (@TheRealPCB) September 14, 2023 -
SL VS PAK: శ్రీలంక యువ సంచలనం అరుదైన ఘనత
శ్రీలంక యువ సంచలన స్పిన్నర్ దునిత్ వెల్లలగే అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న నాలుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు. వరల్డ్ నంబర్ వన్ వన్డే బ్యాటర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు వరల్డ్ నంబర్ 2 బ్యాటర్, టీమిండియా యంగ్ గన్ శుభ్‌మన్ గిల్.. వరల్డ్ నంబర్ 8, 9 బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను పెవిలియన్‌కు పంపాడు. Young sensation Dunith Wellalage dismantled ODI ranking No. 1, 2, 8 & 9 at the Asia Cup 2023 🌟 Incredible - Dunith Wellalage 🙌 pic.twitter.com/eWFBqFne0k — CricTracker (@Cricketracker) September 14, 2023 సెప్టెంబర్ 12న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, గిల్, కోహ్లిలతో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల వికెట్లు కూడా తీసిన వెల్లలగే.. ఇవాళ (సెప్టెంబర్ 14) పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక పోరులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ భరతం పట్టాడు. వెల్లలగే సంధించిన బంతికి బోల్తా కొట్టిన బాబర్ స్టంపౌటయ్యాడు. వెల్లలగే కేవలం 3 రోజుల వ్యవధిలో వరల్డ్ టాప్ బ్యాటర్లనంతా ఔట్ చేయడంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్, పాక్ మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టిన వెల్లలగే, గ్రూప్ దశలో బంగ్లాదేశ్‌పై ఓ వికెట్.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్పై మరో 2 వికెట్లు.. దీని తర్వాత సూపర్-4లో బంగ్లాదేశ్‌పై మరో వికెట్.. ఇలా మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వెల్లలగే బంతితో మ్యాజిక్ చేయడమే కాకుండా, బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించగలడు. టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఓ పక్క అతని సహచరులు, స్పెషలిస్ట్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా అతను మాత్రం చివరివరకు ఒంటరిపోరాటం (42 నాటౌట్) చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పట్టుబిగించింది. లంక బౌలర్లు 130 పరుగులకే (27.4 ఓవర్లలో) సగం మంది పాక్ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపారు. ఈ దశలో వర్షం ప్రారంభమైంది. మ్యాచ్‌కు ముందు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా, మెరుగైన రన్‌రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో టీమిండియాతో తలపడుతుంది. -
పాక్ ఓటమి ఖాయమే! రిజర్వ్ డే అయినా.. ఇంకేదైనా! టోర్నీ రాతే అంత..
Asia Cup 2023- India vs Pakistan: టీమిండియా- పాకిస్తాన్ ఫైనల్లో తలపడటం ఆసియా కప్ చరిత్రలోనే లేదని.. ఈసారి కూడా అలాగే జరుగుతుందని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎవరు ఎంతగా ప్రయత్నించినా చిరకాల ప్రత్యర్థులను ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో చూసే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నాడు. పాక్‌ను చిత్తు చేసి.. లంకను జయించి ఆసియా కప్-2023లో గ్రూప్-ఏ నుంచి టీమిండియా- పాకిస్తాన్, గ్రూప్- బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్ 4 దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన రోహిత్ సేన.. ఆపై శ్రీలంక మీద జయభేరి మోగించింది. తద్వారా ఈ వన్డే టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో దారుణ ఓటమి చవిచూసిన బాబర్ ఆజం బృందం.. నెట్ రన్‌రేటు పరంగా లంక కంటే వెనుకబడి ఉంది. గాయాలు, వర్షం.. పాక్‌ను వెంటాడుతున్న దురదృష్టం ఈ క్రమంలో చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో గురువారం కొలంబో వేదికగా లంకతో పోటీపడనుంది. ఇప్పటికే కీలక ఆటగాళ్లు గాయపడటంతో డీలా పడిన పాక్ జట్టు.. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే! రిజర్వ్ డే అయినా.. ఇంకేదైనా ఇది జరగదంతే అప్పుడు.. టీమిండియాతో పాటు.. శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శ్రీలంక- పాక్ మ్యాచ్ పరిస్థితులను గమనిస్తే.. విషయం పూర్తిగా అర్థమైపోతోంది కదా! ఇండియా- పాకిస్తాన్‌ను ఫైనల్‌కు పంపించాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా.. ఆ రెండు తుదిపోరులో పరస్పరం ఢీకొట్టడం టోర్నీ చరిత్రలోనే లేదు. అందుకు పరిస్థితులు కూడా అనుకూలించవు! అదంతే!’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. భారత్- పాక్‌ను ఫైనల్ చేర్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఈ కామెంటేటర్.. ‘‘ఈ గ్రూప్‌లో నేపాల్‌ను ఎవరు చేర్చమన్నారు. మొత్తంగా ఆరు జట్లున్న రెండు గ్రూప్‌ల నుంచి నాలుగు సూపర్ 4కి చేరతాయి కదా.. ఆపై రెండు జట్లు ఫైనల్‌కు! కానీ.. మిగతా మ్యాచ్‌లకు కాదని కేవలం ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కే రిజర్వ్ డే కేటాయించడం చూస్తుంటే.. కచ్చితంగా ఇది కేవలం ఈ రెండు జట్ల కోసం మాత్రమే నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లా అనిపించడంలో తప్పులేదు’’ అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వివక్షపూరిత వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. చరిత్రలోనే లేదు.. పాక్ ఓటమి ఖాయమే! ఇక హ్యారిస్ రవూఫ్, నసీం షా వంటి స్టార్ పేసర్ల గైర్హాజరీ.. దాంతో పాటు వర్ష సూచనలు పాక్ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లడం ఖాయమని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా 1984లో మొదలైన ఆసియా కప్ చరిత్రలో దాయాదులు భారత్- పాక్ ఫైనల్లో తలపడ్డ దాఖలాలు లేవు. ఇక రెండేళ్లకోసారి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో టీమిండియా అత్యధికంగా ఏడుసార్లు చాంపియన్‌గా నిలవగా.. శ్రీలంక ఆరు, పాకిస్తాన్ రెండుసార్లు టైటిల్ గెలిచాయి. గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్ చాంపియన్‌గా శ్రీలంక తన పేరును చరిత్రలో లిఖించుకుంది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..
Asia Cup 2023- Pakistan Vs Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కీలక ఆటగాడిపై వేటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ గెలవడం మాట అటుంచితే.. ఫైనల్ చేరడమే కష్టమని.. ఇక ఇంటికి వచ్చేందుకు సిద్ధం కావాలంటూ పాక్ జట్టును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నారు. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఈ దుస్థితిలో కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. శ్రీలంకతో చావోరేవో తేల్చుకోనుంది. కొలంబో వేదికగా గురువారం నాటి ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భారత్‌తో పాటు ఫైనల్‌కు చేరుకుంటుంది. గాయాల కారణంగా కీలక పేసర్లు అవుట్ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్‌ను ఓ వైపు గాయాల బెడద వెంటాడుతుంటే.. మరోవైపు.. ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను తప్పిస్తూ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. లంకతో మ్యాచ్‌కు ముందు పాక్ బుధవారమే తమ తుది జట్టును ప్రకటించింది. లంకతో మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులు స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్, ఆఘా సల్మాన్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. వారి స్థానాల్లో జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఫహీం ఆష్రఫ్పై వేటు పడగా.. మహ్మద్ నవాజ్ జట్టులోకి వచ్చాడు. అయితే, వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ స్థానంలో మహ్మద్ హ్యారిస్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో వేటు! ఇప్పటి వరకు ఈ వన్డే టోర్నీలో మొత్తంగా ఆడిన మూడు ఇన్నింగ్స్‌లో ఫఖర్ జమాన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో 50 బంతులు ఆడి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, పాక్ ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో ఫఖర్ జమాన్‌పై వేటు పడింది. అయితే, డూ ఆర్ డై మ్యాచ్‌లో అతడిని తప్పించడం జట్టుకు మైనస్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సెంచరీలు.. ద్విశతక వీరుడు తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న అనుభవం ఉన్న ఆటగాడిని కాదని హ్యారిస్‌ను ఆడించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఫఖర్ జమాన్ వరుస సెంచరీలు సాధించాడు. రెస్ట్ పేరిట వేటు? జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న ఫఖర్ జమాన్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చిన మేనేజ్మెంట్ ఓపిక నశించి ఈసారి రెస్ట్ పేరిట వేటు వేసినట్లు తెలుస్తోంది. హ్యారిస్ రికార్డు గణాంకాలేమో ఇలా ఇక ఇప్పటి వరకు పాక్ తరఫున 76 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3268 పరుగులు సాధించాడు. ఫఖర్ జమాన్ ఖాతాలో 10 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. పాక్ తరఫున వన్డేల్లో ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్ అతడే! ఇదిలా ఉంటే.. ఫఖర్ జమాన్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన మహ్మద్ హ్యారిస్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 5 వన్డేల్లో కలిపి 27 పరుగులు సాధించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. గందరగోళ పరిస్థితుల్లో లంక చేతిలో పాకిస్తాన్ చిత్తు కావడం ఖాయమంటూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! -
శ్రీలంకతో మ్యాచ్.. తుది జట్టును ప్రకటించిన పాక్.. ఏకంగా ఐదు మార్పులు
ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ తమ తుది జట్టును ప్రకటించింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన హరీస్ రౌఫ్, నసీం షాలు ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. వీరిలో నసీం షా టోర్నీ మొత్తానికే దూరం కాగా.. రౌఫ్ గాయంపై స్పష్టత రావాల్సి ఉంది. నసీం షా స్థానంలో జమాన్ ఖాన్ తుది జట్టులోకి రాగా.. హరీస్ రౌఫ్ ప్లేస్‌లో మొహమ్మద్ వసీం జూనియర్ జట్టులో చేరాడు. ఈ రెండు మార్పులతో పాటు పాక్ మరో మూడు మార్పులు కూడా చేసింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగానే గాయపడిన అఘా సల్మాన్ స్థానంలో సౌద్ షకీల్ జట్టులోకి రాగా.. ఓపెనర్ ఫకర్ జమాన్ స్థానంలో (రెస్ట్) మొహమ్మద్ హరీస్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి వచ్చాడు. భారత్‌తో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఫహీమ్ అష్రాఫ్‌పై (10-0-74-0) వేటు పడింది. అతడి స్థానంలో మొహహ్మద్ నవాజ్ తుది జట్టులోకి వచ్చాడు. మొత్తంగా రేపటి మ్యాచ్ కోసం పాకిస్తాన్ ఏకంగా ఐదు మార్పులు చేసింది. ఇదిలా ఉంటే, ఆసియా కప్-2023లో పాక్ భవితవ్యం రేపు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో తేలిపోతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాక్ ఓడినా లేక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే మాత్రం సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. శ్రీలంకతో మ్యాచ్‌కు పాకిస్తాన్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హాక్, మొహమ్మద్ హరీస్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మొహమ్మద్ నవాజ్, జమాన్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మొహమ్మద్ వసీం జూనియర్ -
ఆసియా కప్-2023 ఫైనల్లో భారత్, పాక్..?
ఆసియా కప్-2023లో భారత్-పాక్‌లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉంది. తొలుత ఈ రెండు జట్లు గ్రూప్ దశలో తలపడగా.. ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆతర్వాత ఇరు జట్లు మరోసారి సూపర్-4 స్టేజీలో ఎదురెదురుపడ్డాయి. అప్పుడు టీమిండియా.. పాక్‌ను 228 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ప్రస్తుత సమీకరణల ప్రకారం భారత్, పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 17న కొలొంబోలో జరిగే ఫైనల్లో మరోమారు దాయాదుల పోరు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఇది జరగాలంటే రేపు (సెప్టెంబర్ 14) శ్రీలంకతో జరుగబోయే గ్రూప్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ తప్పక గెలవాల్సి ఉంటుంది. గెలుపు తప్ప వేరే ఏ ఇతర ఫలితం వచ్చినా, పాక్ ఫైనల్‌కు చేరదు. ఎందుకంటే ప్రస్తుతం పాక్ (-1.892) కంటే శ్రీలంకకు (-0.200) మెరుగైన రన్‌రేట్ ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు భారత్ ఇంకో మ్యాచ్ (బంగ్లాదేశ్‌తో) ఆడాల్సి ఉండగానే ఫైనల్‌కు చేరుకుంది. పాక్, శ్రీలంకలపై వరుస విజయాలతో భారత్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ, రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కారణంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాబట్టి కొలొంబో వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్ తప్పక గెలిస్తేనే, ఫైనల్లో దాయాదుల పోరు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో రేపటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాకుండా ఉండాలని, అలాగే లంకపై పాక్ గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. -
పాకిస్తాన్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! టీమిండియాకు కూడా
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం ముగిసిన ఆఖరి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఆతిథ్య లంకపై గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 563/5తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాక్ 134 ఓవర్లలో 576/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ రిజ్వాన్ (50 నాటౌట్; 4 ఫోర్లు, 1సిక్స్) అర్ధసెంచరీ పూర్తికాగానే డిక్లేర్ చేసింది. ఆగా సల్మాన్ (132 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలి చాడు. దీంతో పాకిస్తాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 67.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఏంజెలో మాథ్యూస్ (63 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ కరుణరత్నే (41; 6 ఫోర్లు) రాణించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ (7/70) చావుదెబ్బ తీశాడు. నసీమ్ షాకు 3 వికెట్లు దక్కాయి. పాకిస్తాన్ అరుదైన ఘనత.. ఇక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. శ్రీలంక గడ్డపై పాకిస్తాన్‌కు ఇది ఐదో టెస్ట్ సిరీస్ విజయం. తద్వారా శ్రీలంక గడ్డపై అత్యధిక టెస్ట్ సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా పాకిస్తాన్ రికార్డులకెక్కింది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు శ్రీలంకలో నాలుగు టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకున్నాయి . తాజా సిరీస్ విజయంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను పాక్ అధిగమించింది. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మూడో స్ధానంలో ఉంది. చదవండి: IND vs WI: మరీ అంత బద్దకమా.. సహాచర ఆటగాడిపై రోహిత్ సీరియస్! వీడియో వైరల్ -
శ్రీలంకపై పాక్ విజయం.. అంత ఓవరాక్షన్ అవసరం లేదు.. సిగ్గు పడాలి..!
శ్రీలంకతో ఇవాళ (జులై 20) ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని పాక్ 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇమాముల్ హక్ (50 నాటౌట్).. కెప్టెన్ బాబర్ ఆజమ్ (24), సౌద్ షకీల్ (30)ల సహకారంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో పాక్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఛేదనలో కీలక ఇన్నింగ్స్ ఆడి, తొలి ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీతో చెలరేగిన సౌద్ షకీల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం తర్వాత పాక్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ జట్టు ఆటగాళ్లు ఏదో సాధించామన్న రేంజ్లో ఓవరాక్షన్ చేశారు. ఏదో వరల్డ్‌కప్ గెలిచేసినట్లు ఫీలైపోయారు. వాస్తవానికి గెలుపు ఎవరిపై అయినా, ఎలాంటి పరిస్థితుల్లో సాధించినా, ఎవరు సాధించినా అంగీకరించాల్సిందే. అయితే, ఇక్కడ పాక్ సాధించిన గెలుపుకు అంత ఓవరాక్షన్ అవసరం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. July 20th, 2022 - 146th Test win for Pakistan July 20th, 2023 - 147th Test win for Pakistan The wait is over, Pakistan won a Test match after a gap of 365 days. pic.twitter.com/RrDQ9lPjWt — Johns. (@CricCrazyJohns) July 20, 2023 ఎందుకంటే, ఆ జట్టు 365 రోజుల్లో సాధించిన ఏకైక విజయం ఇది. ఈ మధ్యలో ఆ జట్టు పదుల సంఖ్యలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడినా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది. సరిగా ఇదే రోజున (జులై 20) 2022లో ఆ జట్టు చివరిసారిగా ఓ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచింది. ఈ విషయం తెలిసే కొందరు నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏడాదిలో ఒక్క విజయం సాధించినందుకు ఇంత సంబరం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిగా తమ ప్రదర్శనను చూసి సిగ్గు పడాల్సింది పోయి, ఏదో సాధించామన్నట్లు ఓవరాక్షన్ ఎందుకని నిలదీస్తున్నారు. ఇంకొందరైతే.. ఏడాది తర్వాత సాధించిన విజయం కాబట్టి ఆ మాత్రం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సౌద్ షకీల్ పుణ్యమా అని పాక్‌కు సరిగ్గా ఏడాది తర్వాత తొలి విజయం లభించింది. -
డాన్ బ్రాడ్‌మన్ తర్వాత ఈ పాక్ ఆటగాడే.. ఏకంగా 98.50 సగటు
పాకిస్తాన్ యువ బ్యాటర్ సౌద్ షకీల్ ప్రపంచ క్రికెట్లో సంచనాలు సృష్టిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ (208) బాదిన షకీల్.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కనీసం 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక యావరేజ్ (99.94) రికార్డు బ్రాడ్‌మన్ పేరిట ఉండగా.. షకీల్, బ్రాడ్‌మన్ వెనువెంటనే ఉన్నాడు. కెరీర్లో 11 ఇన్నింగ్స్‌ల తర్వాత షకీల్ సగటు 98.50గా ఉంది. డబుల్ సెంచరీకి ముందు అతని స్కోర్లు 32, 125 నాటౌట్, 55 నాటౌట్, 22, 53, 23, 94, 63, 76, 37గా ఉన్నాయి. 11 ఇన్నింగ్స్‌ల్లో షకీల్.. 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీ సాయంతో 788 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్ రికార్డు మహ్మద్ హఫీజ్ (196) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో షకీల్.. హఫీజ్ రికార్డును తిరగరాశాడు. కెరీర్లో ఆడుతున్నది ఆరో టెస్ట్ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేసిన షకీల్.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు అతిమూల్యమైన పరుగులు సమకూర్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (73/4) బరిలోకి దిగిన షకీల్.. అఘా సల్మాన్ (83), నౌమన్ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) సాయంతో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. షకీల్ సూపర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. -
రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే అదుర్స్.. షాహీన్ షా అఫ్రిది అరుదైన రికార్డు
టెస్టుల్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ నిషాన్ మదుష్కను ఔట్ చేసిన అఫ్రిది.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. ఈ అరుదైన మైలురాయిని అందుకున్న 18వ పాక్ బౌలర్‌గా షాహీన్ షా అఫ్రిది నిలిచాడు. అఫ్రిది ఈ అరుదైన ఫీట్‌ను కేవలం 26వ టెస్టు మ్యాచ్‌లోనే అందుకున్నాడు. అదే విధంగా కేవలం 23 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన మూడో పాక్ ఫాస్ట్ బౌలర్‌గా అఫ్రిది రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో పాక్ దిగ్గజ బౌలర్లు సీం అక్రమ్, వకార్ యూనిస్‌లు ఉన్నారు. ఇక దాదాపు ఏడాది తర్వాత టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన అఫ్రిది.. తన తొలి మ్యాచ్‌లోనే నిప్పులు చేరుగుతున్నాడు. అదిలోనే మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీశాడు. కుశాల్ మెండిస్, కరుణరత్నే, మధుష్క వికెట్లను అఫ్రిది పడగొట్టాడు. అఫ్రిది కెరీర్లో 4 ఫైవ్ వికెట్ల హాల్స్, ఒక 10 వికెట్ల హాల్ ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో మథ్యూస్(34), ధనుంజయ డిసిల్వా(23) పరుగులతో ఉన్నారు. చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్‌మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్! -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన!స్టార్ బౌలర్ వచ్చేశాడు
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారధ్యం వహించనున్నాడు. అదే విధంగా గతేడాది నుంచి టెస్టు జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది.. శ్రీలంక సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 16 మంది సభ్యుల జట్టులో అఫ్రిదికి చోటు దక్కింది. అతడు చివరగా టెస్టుల్లో గతేడాది జూలైలో శ్రీలంకపై ఆడాడు. అదే విధంగా యువ ఆటగాళ్లు ముహమ్మద్ హురైరా,అమీర్ జమాల్‌కు తొలి సారి పాకిస్తాన్ టెస్టు జట్టులో చోటుదక్కింది. శ్రీలంక సిరీస్‌తో వీరిద్దిరూ రెడ్‌బాల్ క్రికెట్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2023-25లో భాగంగా జరగనుంది. కానీ సిరీస్ జూలైలో జరగనుంది. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. బాబర్ ఆజాం నేతృత్వంలోని పాక్ జట్టు జులై 9న శ్రీలంకకు పయనం కానున్నట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ముందు జూలై 3న కరాచీలో పాకిస్తాన్ జట్టు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో టెస్టులకు పాకిస్తాన్ జట్టు: బాబర్ అజాం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ హురైరా, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది,షాన్ మసూద్. -
Asia Cup Final: స్టార్లు అవసరం లేదని శ్రీలంక నిరూపించింది..!
ఆసియా కప్-2022లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్, పాక్ లాంటి ప్రపంచ స్థాయి జట్లకు షాకిచ్చి ఏకంగా టైటిల్‌ను ఎగురేసుకుపోయిన శ్రీలంక జట్టుపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. పాక్‌ను మట్టికరిపించిన తీరు థ్రిల్లింగ్‌గా అనిపించిందని ట్వీటాడు. క్రికెట్ లాంటి టీమ్ గేమ్‌లో జట్టు గెలవాలంటే సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు అవసరం లేదని లంకేయులు మరోసారి నిరూపించారని అన్నాడు. టీమ్ వర్క్ ఉంటే ఎంత చిన్న జట్టైనా అద్భుతాలు చేయగలదని మరోసారి రుజువైందని తెలిపాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. I am thrilled at Sri Lanka’s victory this evening. Not because I wanted Pakistan to lose. But because Sri Lanka’s victory reminds us that Team Sports are not about celebrities & superstars but about—yes—Teamwork! #AsiaCup2022Final — anand mahindra (@anandmahindra) September 11, 2022 కాగా, దుబాయ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. 23 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) సాయంతో ఆదుకున్నాడు. ఛేదనలో పాక్ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
పాక్‌ను మట్టికరిపించాక కొలొంబో వీధులు దద్దరిల్లాయి..!
ఓ పక్క ఆర్ధిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి.. మరో పక్క చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, బ్రతుకు భారమై ప్రజలంతా రోడ్లెక్కడం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల నడుమ బతుకీడుస్తున్న ద్వీప దేశం శ్రీలంక ప్రజలకు ఓ వార్త భారీ ఊరట కలిగించింది. నిన్న (సెప్టెంబర్ 11) దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్-2022 ఫైనల్లో లంక జట్టు తమకంటే చాలా రెట్లు మెరుగైన పాకిస్తాన్‌కు షాకిచ్చి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టోర్నీ బరిలోకి దిగిన శ్రీలంక.. ఫైనల్లో పాక్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందగానే ద్వీప దేశంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. మాజీ అధ్యక్షుడు గొటబాయ దేశం వదిలి పలాయనం చిత్తగించిన తర్వాత జనాలు మళ్లీ ఆ స్థాయిలో రోడ్లెక్కి సంబురాలు చేసుకున్నారు. కర్ఫ్యూ అంక్షలు సైతం పట్టించుకోని జనం కొలొంబో వీధుల్లో జాతీయ జెండాలు చేతబూని నానా హంగామా చేశారు. ముఖ్యంగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువత చాలాకాలం తర్వాత రోడ్డపైకి వచ్చి డ్యాన్సులు చేస్తూ ఆనందంగా గడిపారు. వారి సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఈ టోర్నీలో శ్రీలంక పుంజుకున్న తీరును ఆ దేశ ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు. విజయ గర్వంతో నినాదాలు చేస్తూ హోరెత్తించారు. Unlimited HAPPY 😊 Congratulations @OfficialSLC Team! We celebrate #AsiaCup2022Final #Srilankan #SriLanka #Amapara #addalaichenaiBoys @Wanindu49 @dasunshanaka1 @SriLankaTweet @AzzamAmeen @KumarSanga2 @MahelaJay @RusselArnold69 @RajapaksaNamal @fernandoharin pic.twitter.com/iJAJE64Cgy — 𝗦𝗮𝗳𝗻𝗲𝗲 ✹ (@SafneeOfficial) September 11, 2022 కాగా, టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భంగపడ్డ శ్రీలంక.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాక్‌లపై వరుస విజయాలు సాధించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలుత 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టుకోల్పోయింది. అయితే భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) సాయంతో చెలరేగి శ్రీలంకు డిఫెండింగ్ టోటల్‌ను (170/6) అందించాడు. ఛేదనలో పాక్ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగి పాక్ ఆటకట్టించారు. పాక్ నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
కోహ్లిని అధిగమించిన రిజ్వాన్
పాకిస్తాన్‌తో ఆదివారం (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్-2022 తుది సమరంలో శ్రీలంక 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక జట్టు.. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భంగపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని భారత్, పాక్‌లపై వరుస విజయాలు సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంక.. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి పాక్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లో షాకిచ్చింది. అద్భుతమైన హాఫ్ సెంచరీతో లంకకు డిఫెండింగ్ టోటల్ అందించిన భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన వనిందు హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. And with that, we close the DP World #AsiaCup 2022, with Sri Lanka as CHAMPIONS! 🇱🇰🏆 What a tournament we've had! 🤩 Here are the overall performers who have impressed us with their incredible displays 👏#ACC #AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/M5v6p5QGEw — AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2022 ఇక ఈ టోర్నీ మొత్తంలో 'టాప్' లేపిన ఆటగాళ్ల విషయానికొస్తే.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (281 పరుగులు).. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (276) అధిగమించి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిజ్వాన్ 6 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 92 సగటున పరుగులు సాధించాడు. వీరి తర్వాత టాప్-5లో ఆఫ్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (196), శ్రీలంక హిట్టర్ భానుక రాజపక్స (191), పతుమ్ నిస్సంక (173) ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌కు దక్కింది. భువీ 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. భువీ తర్వాతి ప్లేస్‌లో లంక స్పిన్నర్ హసరంగ (9 వికెట్లు), పాక్ బౌలర్లు హరీస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురు తలో 8 వికెట్లు సాధించారు. ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా భువీ పేరిటే నమోదై ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ కూడా ఉంది. ఇక, టోర్నీలో నమోదైన ఏకైక సెంచరీ విరాట్ సాధించినదే కావడం విశేషం. -
ఆసియా కప్-2022 ఛాంపియన్ శ్రీలంకకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
ఆసియాకప్-2022 మహా సంగ్రామానికి ఆదివారంతో తెరపడింది. ఈ మెగా ఈవెంట్ ఛాంపియన్స్‌గా శ్రీలంక నిలిచింది. అదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా ఇది శ్రీలంకకు 6వ ఆసియాకప్ టైటిల్ కావడం గమనార్హం. ఇక అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి ఛాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్‌మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్ రన్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? ఆసియాకప్ విజేతగా నిలిచిన శ్రీలంకకు ఫ్రైజ్‌మనీ రూపంలో లక్షా ఏభై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను బీసీసీఐ అద్యక్షుడు సౌరవ్ గంగూలీ శ్రీలంక కెప్టెన్ దసన్ శనకకు అందజేశాడు. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌కు 75,000 డాలర్లు ( భారత కరెన్సీ ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షల అరవై ఆరు వేలు) ఫ్రైజ్‌మనీ దక్కింది. ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు వీరులు వీరే మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 281 పరుగులు విరాట్ కోహ్లి(భారత్)- 5 మ్యాచ్‌ల్లో 276 పరుగులు ఇబ్రహీం జద్రాన్(ఆఫ్గాన్)- 5 మ్యాచ్‌ల్లో-196 పరుగులు భానుక రాజపక్స(శ్రీలంక)- 6 మ్యాచ్‌ల్లో 191 పరుగులు పాతుమ్ నిస్సంక(శ్రీలంక) - 6 మ్యాచ్‌ల్లో 173 పరుగులు ఆసియాకప్‌లో అత్యదిక వికెట్లు తీసిన బౌలర్లు భువనేశ్వర్ కుమార్(భారత్)- 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు వానిందు హసరంగా(శ్రీలంక)- 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు మహ్మద్ నవాజ్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు షాదాబ్ ఖాన్(పాకిస్తాన్)- 5 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు హారిస్ రౌఫ్(పాకిస్తాన్)- 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక ఈ మెగా ఈవెంట్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగాకు మ్యాన్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. అదే విధంగా కీలకమైన ఫైనల్లో పోరులో 71 పరుగలతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్సకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: Asia Cup 2022 Final: అలా అయితే రాజపక్స 70 పరుగులకు విలువే ఉండేది కాదు! కానీ..: పాక్ మాజీ కెప్టెన్ -
పాకిస్తాన్‌పై ఘన విజయం.. శ్రీలంక జెండాతో గంభీర్ సెలబ్రేషన్స్!
Asia Cup 2022 Winner Sri Lanka: ఆసియాకప్-2022 ఛాంపియన్స్‌గా శ్రీలంక అవతరించింది. ఈ మెగా ఈవెంట్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా టైటిల్‌ను ఎగరసేకిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో చిత్తు చేసి 6 వసారి ఆసియాకప్ విజేతగా లంక నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించాక గ్రౌండ్లో భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ శ్రీలంక జెండా పట్టుకోని సంబురాలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంక జాతీయ జెండా పట్టుకోని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. కాగా గంభీర్ ఆసియాకప్‌లో కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను గంభీర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత, ఆఫ్గనిస్తాన్ అభిమానులు లంకేయుల విజయాన్ని తమ విజయంగా భావిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శ్రీలంకకు అభినందనలు తెలుపుతూ.. మరోవైపు పాకిస్తాన్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్ సూపర్-4 దశలోనే భారత్, ఆఫ్గనిస్తాన్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. Superstar team…Truly deserving!! #CongratsSriLanka pic.twitter.com/mVshOmhzhe — Gautam Gambhir (@GautamGambhir) September 11, 2022 చదవండి: Asia Cup 2022 Final: అందుకే శ్రీలంక చేతిలో ఓడిపోయాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్ ఆజం -
ఇదేమి బౌలింగ్రా అయ్యా.. తొలి బంతికే 10 పరుగులు!
ఆసియాకప్-2022 విజేతగా శ్రీలంక నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 23 పరుగుల తేడాతో మట్టికరిపించి ఛాంపియన్‌గా శ్రీలంక అవతరిచింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 147 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్(55) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రమోద్ మదుషన్ 4 వికెట్లతో పాక్‌ను దెబ్బ తీయగా.. హాసరంగా మూడు, కరుణరత్నే రెండు వికెట్లు సాధించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతడితో పాటు వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. తొలి బంతికే పది పరుగులు పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఓవర్ బౌలింగ్ వేసిన శ్రీలంక పేసర్ మధు శంక మొదటి బంతికే ఏకంగా 10 పరుగులు ఇచ్చాడు. తొలి బంతినే నోబాల్‌గా మధుశంక వేశాడు. అనంతరం పాక్ బ్యాటర్లకు ఫ్రీహిట్ లభించింది. అయితే వరుసగా నాలుగు బంతులను కూడా వైడ్‌గానే అతడు వేశాడు. అందులో ఓ బంతి వైడ్‌తో పాటు బౌండరీకి కూడా వెళ్లింది. దీంతో తొలి ఐదు బంతులు లెక్కలోకి రాకుండానే ఎక్స్‌ట్రాస్ రూపంలో పాకిస్తాన్‌కు 9 పరుగులు వచ్చాయి. ఎట్టకేలకు ఆరో బంతిని మధుశంక సరిగ్గా వేశాడు. ఈ ఫ్రీహిట్ బంతికి సింగిల్ మాత్రమే పాక్బ్యాటర్ రిజ్వాన్ సాధించాడు. దీంతో తొలి బంతి పడేటప్పటికి పాక్ ఖాతాలో 10 పరుగులు వచ్చి చేరాయి. మధుశంక బౌలింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 0 ball 9 Runs 😂 It's a Record , thanks Srilanka #PAKvsSL#AsiaCup2022Final pic.twitter.com/ONoxeIiLxr — Mehu 💕🦋 (@mahakhan199) September 11, 2022 చదవండి: Asia Cup 2022 Final: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్ -
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స..
ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్ పోరులో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. బానుక రాజపక్స 45 బంతుల్లో 71, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. వనిందు హసరంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకముందు దనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లంక.. కనీసం 150 పరుగుల మార్క్‌ను దాటుతుందా అన్న అనుమానం కలిగింది. కానీ వనిందు హసరంగాతో కలిసి రాజపక్స ఆరో వికెట్‌కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసి హసరంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే(14 బంతుల్లో 14 పరుగులు) చక్కగా సహకరించడంతో చివరి ఐదు ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం. శ్రీలంక స్కోరు 170 ఉండగా.. అందులో రాజపక్సవే 71 పరుగులు ఉన్నాయి. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3, నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు -
అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు
Asia Cup 2022 Final: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో లంక ఓపెనర్ కుషాల్ మెండిస్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతను అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. కుషాల్ మెండిస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో అతనికి ఇది 26వ డకౌట్. అరంగేట్రం నుంచి అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్ జాబితాలో కుషాల్ మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో జానీ బెయిర్ స్టో(ఇంగ్లండ్) 27 డకౌట్లతో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత మొయిన్ అలీ(ఇంగ్లండ్) 25 డకౌట్లతో మూడో స్థానంలో ఉండగా.. కగిసో రబడా(దక్షిణాఫ్రికా) 23 డకౌట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్ -
ఫైనల్ బరిలో శ్రీలంక, పాకిస్తాన్.. ఆసియా కప్ కొట్టేదెవరు?
ఆసియా కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టి ఫైనల్లో పాకిస్తాన్, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు చూసుకుంటే ఆసియా కప్‌లో చాలా మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టుదే పైచేయిగా నిలిచింది. దీంతో టాస్ మరోసారి కీలకం కానుంది. ఇక సూపర్-4 దశలో పాకిస్తాన్‌ను ఓడించిన లంక మరింత ఆత్మవిశ్వాసంతో ఫైనల్ ఆడనుంది. ఆసియా కప్ ప్రారంభంలో తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక ఆ తర్వాత ఫుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లంక పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌లతో పాటు భానుక రాజపక్స బ్యాట్‌తో చెలరేగుతున్నారు. డెత్ ఓవర్లలో కెప్టెన్ షనక, హసరంగ కూడా రాణిస్తుండటం, బౌలింగ్‌లో తీక్షణ, మదుశంక స్థిరంగా వికెట్లు తీయడం జట్టును ఎదురులేని జట్టుగా మార్చింది. గతమ్యాచ్‌లో హసరంగ తన స్పిన్ ఉచ్చులో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో ఏరకంగా చూసిన లంకను ఆపడం పాక్‌కు కష్టమే! మరోవైపు పాకిస్తాన్ జట్టులో బౌలింగ్ విభాగం బలంగా ఉండగా.. బ్యాటింగ్‌లో మాత్రం కాస్త వీక్‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఆ మ్యాచ్‌లో ఐదో వరుస బ్యాటర్స్ దాకా ఒక్క కెప్టెన్ బాబర్ ఆజమ్ మినహా ఇంకెవరూ 14 పరుగులైనా చేయలేకపోవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని చూపిస్తోంది. మిడిలార్డర్ కూడా లంక బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోటా కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆలౌట్ అవడం పాక్ నిలకడలేమికి అద్దం పడుతోంది. అయితే పాక్ బౌలింగ్ విభాగం బలంగా ఉండడం సానుకూలాంశం. శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్ -
'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్ ఆజాం ఆగ్రహం
ఆసియాకప్-2022లో భాగంగా అఖరి సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు శ్రీలంక షాకిచ్చింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన హాసన్ అలీ బౌలింగ్‌లో ఓ బౌన్సర్ బంతిని షనక కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి మిస్స్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది. అయితే బంతి బ్యాట్‌కు తగిలిందిని భావించిన రిజ్వాన్ కీపర్ క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. దాన్ని ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి మాత్రం తిరస్కరించాడు. ఈ క్రమంలో రిజ్వాన్ రివ్యూ కోసం అంపైర్‌కు సిగ్నల్ చేశాడు. అంపైర్ వెంటనే రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు తాకలేదని రిప్లేలో తెలింది. దీంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది. సాధారణంగా ఏ ఫార్మాట్లోనైనా కెప్టెన్ రివ్యూకి సిగ్నల్ చేస్తేనే.. ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేయాలి. అయితే ఇక్కడ మాత్రం కెప్టెన్‌తో సంబంధం లేకుండా వికెట్ కీపర్ కీపర్ సూచనల మేరకు అంపైర్ రివ్యూకు రిఫర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ‘కెప్టెన్ రిజ్వాన్ కాదు నేను' అంటూ బాబర్ అంపైర్‌కు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో టైటిల్ కోసం పాక్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. #WTH #BabarAzam #DRS #SLvPAK pic.twitter.com/2t33bls4nN — Cricket fan (@Cricket58214082) September 9, 2022 చదవండి: Ravindra Jadejas Knee Injury : రవీంద్ర జడేజాపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం..! -
పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో శ్రీలంక ‘సూపర్–4’లో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్‌లా శుక్రవారం జరిగిన ‘సూపర్–4’ ఆఖరి పోరులో శ్రీలంక 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లు సమష్టిగా పాక్ ఇన్నింగ్స్‌ను కూల్చారు. ఓపెనర్, కెప్టెన్ బాబర్ అజమ్ (29 బంతుల్లో 30; 2 ఫోర్లు), నవాజ్ (18 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు మాత్రమే కాస్త మెరుగనిపించారు. ఫామ్‌లో ఉన్న రిజ్వాన్ (14), ఫఖర్ జమన్ (13), ఇఫ్తికార్ (13) తేలిగ్గానే వికెట్లను సమర్పించుకున్నారు. లంక బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హసరంగ 3 వికెట్లు పడగొట్టగా, తీక్షణ, మదుశన్ రెండేసి వికెట్లు తీశారు. ధనంజయ, చమికలకు చెరో వికెట్ దక్కింది. అనంతరం సునాయాస లక్ష్యాన్ని శ్రీలంక 17 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలిచింది. టాపార్డర్‌లో ఓపెనర్ కుశాల్ (0), గుణతిలక (0) డకౌట్ కావడంతో లంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధనంజయ డిసిల్వా (9) కూడా నిరాశపరిచాడు. ఈ దశలో మరో ఓపెనర్ నిసాంక (48 బంతుల్లో 55 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతగా ఆడి జట్టును గెలిపించాడు. రాజపక్స (19 బంతుల్లో 24; 2 సిక్సర్లు), కెప్టెన్ షనక (16 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నిసాంకకు అండగా నిలిచారు. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే తుదిపోరు జరుగుతుంది. చదవండి: Asia Cup 2022: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి భారత ఆటగాడిగా! -
చెలరేగిన శ్రీలంక బౌలర్లు.. 121 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
ఆసియాకప్-2022లో భాగంగా అఖరి సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు శ్రీలంక చుక్కలు చూపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్లతో చెలరేగగా.. మహేశ్ తీక్షణ, ప్రమోద్ మదుషన్ చెరో రెండు, దనుంజయ డి సిల్వా, , కరుణరత్నే తలా వికెట్ సాధించారు. ఇక పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజాం (30), మహ్మద్ నవాజ్(25) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: Asia Cup 2022: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి భారత ఆటగాడిగా! -
టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..!
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్‌గా మారాడు. 30 ఏళ్ల లేటు వయసులో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్.. తన వైవిధ్యమైన స్పిన్ మాయాజాలంతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ప్రత్యర్ధుల పాలిట సింహస్వప్నంలా మారాడు. ఇప్పటివరకు ఆడిన 3 టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్.. తన జట్టును రెండు పర్యాయాలు ఒంటిచేత్తో గెలిపించాడు. Prabath Jayasuriya in Test cricket: 6 for 118 vs Australia. 6 for 59 vs Australia. 5 for 82 vs Pakistan. 4 for 135 vs Pakistan. 3 for 80 vs Pakistan. 5 for 117 vs Pakistan. pic.twitter.com/KcZjHP4lRn — Johns. (@CricCrazyJohns) July 28, 2022 తాజాగా పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు (3/80, 5/117) పడగొట్టి.. తన జట్టుకు అపురూప విజయాన్నందించిన (246 పరుగుల భారీ తేడాతో ఘన విజయం) ప్రభాత్.. అంతకుముందు ఆసీస్ సిరీస్‌లో రెండో టెస్ట్‌నూ రెచ్చిపోయి (6/118, 6/59) ఆర్ధిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న తన దేశానికి ఊరట కలిగించే విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ప్రభాత్.. ఆతర్వాత పాక్‌పై తొలి టెస్ట్‌లోనూ చెలరేగి 9 వికెట్లు (5/82, 4/135) సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160 నాటౌట్) సూపర్ సెంచరీతో రెచ్చిపోవడంతో పాక్ 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శక్తి వంచన లేకుండా బౌలింగ్ చేసిన ప్రభాత్‌కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో లంక భారీ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్, పాక్ లాంటి జట్లనే వణికించిన ఈ నయా స్పిన్ సెన్సేషన్.. మున్ముందు మరిన్ని రికార్డులను బద్దలుకొడతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. పాక్‌ను మట్టికరిపించిన లంకేయులు
స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య (3/80, 5/117), రమేశ్ మెండిస్ (5/47, 4/101)లు రెచ్చిపోవడంతో పాక్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. 508 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. లంక స్పిన్నర్ల ధాటికి 261 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 246 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 89/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఆట మొదలైన కొద్దిసేపటికే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (49) వెనుదిరగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (81) , వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (37)లు కాసేపు ప్రతిఘటించారు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఫవాద్ ఆలం (1), అఘా సల్మాన్ (4), మహ్మద్ నవాజ్ (12), యాసిర్ షా (27), హసన్ అలీ (11), నసీమ్ షా (18)లు లంక స్పిన్నర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్క ఫవాద్ ఆలం (రనౌట్) వికెట్ మినహా మిగిలిన వికెట్లన్నిటినీ లంక స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకే ఆలౌట్ కాగా.. పాక్ 231 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం శ్రీలంక 360/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. భారీ ఛేదనలో పాక్ చేతులెత్తేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన ధనంజయ డిసిల్వాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 17 వికెట్లు నేలకూల్చిన ప్రభాత్ జయసూర్యకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. కాగా, తొలి టెస్ట్‌లో లంక నిర్ధేశించిన 342 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ సునాయాసంగా ఛేదించి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. స్కోర్ వివరాలు.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్ (చండీమల్ (80), నసీమ్ షా (3/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (అఘా సల్మాన్ (62), రమేశ్ మెండిస్ (5/47)) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 360/8 డిక్లేర్ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్ షా (2/44)) పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 231 (బాబర్ ఆజమ్ (81), ప్రభాత్ జయసూర్య (5/117)) చదవండి: డిసిల్వా అద్భుత శతకం.. పాక్ ఓటమి ఖాయం..! -
డిసిల్వా అద్భుత శతకం.. పాక్ ఓటమి ఖాయం..!
పాక్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక విజయం దిశగా సాగుతుంది. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ ధనంజయ డిసిల్వా (109) సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 360 పరుగుల (8 వికెట్ల నష్టానికి) వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 508 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్ధేశించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (46), కెప్టెన్ బాబర్ ఆజమ్ (26) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రెండో వికెట్‌కు అజేయమైన 47 పరుగులు జోడించారు. ఈ దశలో వెలుతురు లేమి కారణంగా ఆటను కాస్త ముందుగా ఆపేశారు. ఆట ముగిసే సమయానికి పాక్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో లంక విజయానికి 9వికెట్లు అవసరం కాగా.. పాక్ గెలుపుకు 419 పరుగులు చేయాల్సి ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌ను పాక్ కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ధనంజయ డిసిల్వాకు తోడుగా కెప్టెన్ కరుణరత్నే (61), టెయిలెండర్ రమేశ్ మెండీస్ (45 నాటౌట్) రాణించడంతో శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించి ప్రత్యర్ధి ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. స్కోర్ వివరాలు.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 378 ఆలౌట్ (చండీమల్ (80), నసీమ్ షా (3/58)) పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 231 ఆలౌట్ (అఘా సల్మాన్ (62), రమేశ్ మెండిస్ (5/47)) శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 360/8 డిక్లేర్ (ధనంజయ డిసిల్వా (109), నసీమ్ షా (2/44)) పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 89/1 (ఇమామ్ ఉల్ హక్ (46 నాటౌట్), ప్రభాత్ జయసూర్య (1/46)) చదవండి: వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లో! -
పట్టు బిగించిన శ్రీలంక.. పాక్ ముందు కొండంత లక్ష్యం
పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి ఓవరాల్‌గా 323 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కెప్టెన్ కరుణరత్నే (27), ధనంజయ (30) నిలకడగా ఆడుతూ పాక్‌కు కొండంత లక్ష్యాన్ని నిర్ధేశించే పనిలో ఉన్నారు. తొలి టెస్ట్‌లో పాక్ 342 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేసిని నేపథ్యంలో ఈసారి లంక జాగ్రత్త పడుతుంది. మరో 5 వికెట్లు చేతిలో ఉండటంతో కనీసం 450 పరుగుల టార్గెట్‌ను పాక్ ముందుంచాలని భావిస్తుంది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఫలితం లంకకు అనుకూలంగా రావడం ఖాయంగా కనిపిస్తుంది. 191/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 40 పరుగులు జోడించి 231 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్ (62) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లంక స్పిన్నర్లు రమేశ్ మెండిస్ (5/47), ప్రభాత్ జయసూర్య (3/80) పాక్ పతనాన్ని శాసించారు. అంతకుముందు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80), డిక్వెల్లా (51) అర్ధసెంచరీలతో రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా మెంటల్ హెల్త్ కోచ్‌గా మళ్లీ అతనే..! -
తిప్పేసిన స్పిన్నర్లు.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తున్న లంకేయులు
తొలి టెస్ట్‌లో పాక్ చేతిలో దారుణంగా ఓడి కసితో రగిలిపోతున్న శ్రీలంక.. రెండో టెస్ట్‌పై పట్టుబిగిస్తుంది. లంక స్పిన్నర్లు రెచ్చిపోవడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో ఉంది. 315 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను (తొలి ఇన్నింగ్స్) ప్రారంభించిన శ్రీలంక.. మరో 63 పరుగులు జోడించి 378 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ డిక్వెల్లా (51) అర్ధసెంచరీతో రాణించగా.. రమేశ్ మెండిస్ (35) పర్వాలేదనిపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్.. లంక స్పిన్నర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. తొలి టెస్ట్‌లో అజేయ శతకంతో పాక్‌ను గెలిపించిన అబ్దుల్లా షఫీక్ ఈ ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (32), కెప్టెన్ బాబర్ ఆజమ్ (16), వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (24), ఫవాద్ ఆలం (24) లు విఫలం కాగా.. మిడిలార్డర్ ఆటగాడు అఘా సల్మాన్ (62) లంక స్పిన్నర్లకు కాసేపు ఎదురొడ్డాడు. సల్మాన్‌ను ప్రభాత్ జయసూర్య అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించడంతో రెండో రోజు ఆట ముగిసింది. రమేశ్ మెండిస్ 3, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీసి పాక్‌ను కష్టాల్లోకి నెట్టారు. ప్రస్తుతం పాక్ శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రోజు లంక ఆటగాళ్లు ఒషాడో ఫెర్నాండో (50), చండీమల్ (80) అర్ధసెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. చదవండి: సూపర్ ఫామ్‌ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి -
సూపర్ ఫామ్‌ను కొనసాగించిన చండీమల్.. తొలి రోజు లంకదే పైచేయి
గాలే వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 24) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో లంక బ్యాటర్లు సత్తా చాటారు. కుశాల్ మెండిస్ (3) మినహా టాపార్డర్ మొత్తం రాణించడంతో తొలి రోజు శీలంకదే పైచేయిగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆతిధ్య జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పాక్ బౌలర్ల ప్రభావం నామమాత్రంగా ఉండటంతో లంక బ్యాటర్లు సత్తా చాటారు. Dinesh Chandimal scores his 4th consecutive fifty in Tests. What a purple patch he's having, just been too good. pic.twitter.com/b1mDrKM6ev — Mufaddal Vohra (@mufaddal_vohra) July 24, 2022 ఓపెనర్లు ఒషాడో ఫెర్నాండో (50), దిముత్ కరుణరత్నే (40) తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించగా.. ఆ తర్వాత వచ్చిన శతక టెస్ట్‌ల వీరుడు ఏంజెలో మాథ్యూస్ (42), ధనంజయ డిసిల్వా (33) ఓ మోస్తరుగా రాణించారు. గత కొంతకాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్న దినేశ్ చండీమల్ (80) వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌లోనూ (206*, 76, 94*, 80) హాఫ్ సెంచరీ బాది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆట చివరి సెషన్లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్వెల్లా (42 నాటౌట్) మెరుపు వేగంతో పరుగులు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. డిక్వెల్లాకు జతగా దునిత్ వెల్లాలగే (6) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, నౌమాన్ అలీ, యాసిర్ షా తలో వికెట్ సాధించారు. కుశాల్ మెండిస్‌ను అఘా సల్మాన్ రనౌట్ చేశాడు. చదవండి: టెస్ట్ క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్ -
టెస్ట్ క్రికెట్లో అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆల్‌రౌండర్
టెస్ట్ క్రికెట్లో శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గాలే వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ ద్వారా మాథ్యూస్ వంద టెస్ట్‌ల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో లంక తరఫున 100 టెస్ట్‌లు ఆడిన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్‌కు ముందు మహేళ జయవర్ధనే (149), సంగక్కర (134), మురళీథరన్ (133), చమింద వాస్ (111), జయసూర్య (110) మాత్రమే లంక తరఫున వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. Angelo Mathews becomes the sixth Sri Lankan player to feature in 100 Tests!#SLvPAK #SriLanka pic.twitter.com/8vtyeLZoNL — CRICKETNMORE (@cricketnmore) July 24, 2022 పాక్‌తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వద్ద ఔటైన మాథ్యూస్ ఇప్పటివరకు ఆడిన 100 టెస్ట్‌ల్లో 45.2 సగటున 13 సెంచరీలు, 38 అర్ధసెంచరీల సాయంతో 6918 పరుగులు చేశాడు. భుజం గాయం కారణంగా టెస్ట్‌ల్లో బౌలింగ్ చేయడం మానేసిన మాథ్యూస్.. టెస్ట్ కెరీర్లో 33 వికెట్లు పడగొట్టాడు. 35 ఏళ్ల మాథ్యూస్ ఇప్పటికీ వన్డేల్లో, టీ20ల్లో లంక జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే, పాక్‌తో రెండో టెస్ట్ ద్వారా అరుదైన మైలురాయిని చేరుకున్న మాథ్యూస్.. దీంతో పాటు పలు అరుదైన ఘనతలను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న వారిలో 100 టెస్ట్‌ల మార్కును అందుకున్న ఏడో ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. జేమ్స్ అండర్సన్ (172), స్టువర్ట్ బ్రాడ్ (156), జో రూట్ (121), నాథన్ లయన్ (110), ఇషాంత్ శర్మ (105), విరాట్ కోహ్లి (102) మాథ్యూస్‌కు ముందు 100 టెస్ట్‌లు ఆడారు. 2009లో పాకిస్తాన్‌పై టెస్ట్ ఆరంగ్రేటం చేసిన మాథ్యూస్.. తన 25వ, 50వ, 100వ టెస్ట్ మ్యాచ్‌లను అదే ప్రత్యర్థిపై ఆడాడు కెరీర్లో తొలి టెస్ట్, 100వ టెస్ట్ ఒకే వేదికపై (గాలే), ఒకే ప్రత్యర్ధిపై (పాక్) ఆడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. మాథ్యూస్‌కు ముందు ఈ ఫీట్‌ను విండీస్ ఆటగాడు కార్ల్ హూపర్ సాధించాడు. హూపర్.. భారత్‌పై ముంబై వేదికగా తొలి, 100వ టెస్ట్‌లను ఆడాడు. చదవండి: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఇకపై విదేశీ లీగ్‌లలో భారత క్రికెటర్లు..? -
శ్రీలంకతో రెండో టెస్టు.. పాకిస్తాన్‌కు భారీ షాక్..!
గాలే వేదికగా జూలై 24 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాలేలో జరిగిన మొదటి టెస్టులో అఫ్రిది మోకాలి గాయంతో బాధపడ్డాడు. దాంతో అతడు మ్యాచ్ నాలుగు రోజు ఆట మధ్యలో మైదానం వీడాడు. అయితే అతడి గాయం తీవ్రం కావడంతో కీలక రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇక తొలి టెస్టులో పాక్ విజయంలో షాహీన్ షా అఫ్రిది కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును కేవలం 222 పరుగులకే కట్టడి చేశాడు. ఇక గాయ పడిన అతడి స్థానంలో యువ పేసర్ హరీస్ రవూఫ్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాక్ 1-0 అధిక్యంలో ఉంది. రెండో టెస్టుకు పాకిస్తాన్ తుది జట్టు(అంచనా) అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, అజర్ అలీ, బాబర్ ఆజం (సి), అఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్ (wk), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ,హరీస్ రవూఫ్ , నసీమ్ షా చదవండి: WI vs IND 1st ODI: వెస్టిండీస్‌తో భారత్ తొలి పోరు.. ధావన్‌కు జోడీ ఎవరు? -
పాకిస్తాన్ ఓపెనర్ ప్రపంచ రికార్డు.. 93 ఏళ్ల తర్వాత తొలి సారిగా..!
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ జట్టు యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 160 పరుగులతో ఆజేయంగా నిలిచి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షఫీక్ ఏకంగా 408 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో చేజింగ్ సమయంలో అత్యధిక సేపు క్రీజులో నిలిచిన తొలి బ్యాటర్‌గా షఫీక్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 524 నిమిషాలు పాటు షఫీక్ క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు ఈ రికార్డు.. 1998లో జింబాబ్వేపై ఛేజింగ్‌లో 460 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆటగాడు అరవింద డి సిల్వా పేరిట ఉండేది. అదే విధంగా ఛేజింగ్‌లో 400 బంతులు ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చిన రెండో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. అంతకు ముందు 1928-29లో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 462 బంతుల్లో 135 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. దాదాపు 93 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రికార్డును షఫీక్ సాధించడం విశేషం. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 400 పైగా బంతులను ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. షఫీక్ కంటే ముందు హెర్బర్ట్ సట్‌క్లిఫ్, సునీల్ గవాస్కర్, మైక్ అథర్టన్, బాబర్ ఆజాం ఈ ఘనత సాధించారు. అదే విధంగా టెస్టులో నాల్గవ ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన మూడో పాక్ ఆటగాడిగా షఫీక్ నిలిచాడు. చదవండి: NZ vs IRE: తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..! Pakistan's second-highest successful run-chase in Tests ✅ A remarkable win to take a 1️⃣-0️⃣ lead in the series 👏#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/n5B4iFJmZf — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 Who is Abdullah Shafique, Pakistan's new batting star? Read more: https://t.co/qZbdgM5r4B#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/RjM1hKxlbQ — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 🗣️ The star 🇵🇰 duo of @babarazam258 and @imabd28 reflect on the special Galle triumph 🌟🌟#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/oGjOXG2LJw — Pakistan Cricket (@TheRealPCB) July 20, 2022 -
ఎంత పని చేశావ్.. లంక జట్టులో మరో 'హసన్ అలీ'
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (408 బంతుల్లో 160 పరుగులు నాటౌట్) వీరోచిత సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. షఫీక్‌కు తోడూ బాబర్ ఆజం అర్థ సెంచరీతో రాణించగా.. మహ్మద్ రిజ్వాన్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా అబ్దుల్లా షఫీక్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను లంక ఆటగాడు కాసున్ రజిత జారవిడవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసిల్వా బౌలింగ్‌లో షాట్ ఆడబోయి బ్యాట్ ఎడ్జ్ తాకడంతో గాల్లోకి లేచింది. బౌండరీలైన వద్ద ఉన్న కాసున్ రజిత అందుకున్నట్లే అందుకొని జారవిడిచాడు. అయితే ఈ క్యాచ్ పట్టడం వల్ల కూడా లంకకు పెద్ద ఉపయోగం ఉండేది కాదు. ఎందుకుంటే అప్పటికి పాక్ విజయానికి 19 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. కానీ కాసున్ రజితను మాత్రం అభిమానులు ఒక ఆట ఆడుకున్నారు. అతన్ని పాక్ క్రికెటర్ హసన్ అలీతో పోల్చారు. కీలక సమయంలో క్యాచ్‌లను జారవిడుస్తాడన్న అపవాదును హసన్ అలీ ఇంతకముందు చాలాసార్లు మూటగట్టుకున్నాడు. టి20 ప్రపంచకప్ 2021 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్‌వికెట్ వద్ద ఉన్న హసన్ అలీ చేతిలోకి వచ్చినప్పటికి అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతే ఆ తర్వాత మాథ్యూ వేడ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఆసీస్‌ను ఫైనల్ చేర్చాడు. అలా ఆరంభం నుంచి మంచి ప్రదర్శన చేస్తూ వచ్చిన పాకిస్తాన్.. హసన్ అలీ వదిలేసిన ఒక్క క్యాచ్ వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో హసన్ అలీ క్యాచ్‌లు జారవిడిచాడు. తాజాగా లంకతో తొలి టెస్టులోనూ హసన్ అలీ ఇదే సీన్‌ను రిపీట్ చేశాడు. రెండు క్యాచ్‌లు జారవిడవడంతో పాటు సింపుల్ రనౌట్ చేసే చాన్స్‌ను కూడా మిస్ చేశాడు. తాజాగా కాసున్ రజితను కూడా హసన్ అలీతో పోలుస్తూ అభిమానులు కామెంట్స్ చేశారు. ''హసన్ అలీ నుంచి స్పూర్తి పొందినట్లున్నాడు.. వెల్కమ్ టూ హసన్ అలీ అకాడమీ.. లంక జట్టులో హసన్ అలీని చూశాం.. క్యాచ్ పట్టినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదులే..'' అంటూ రజితను ఒక ఆట ఆడుకున్నారు. Welcome to 'Hassan Ali' academy#PAKvSL pic.twitter.com/7rsznXDpOI — Juniii... @searchingsukoon (@searchingsukoon) July 20, 2022 We found hassan ali in Srilankan team.inspired by Real Hassan Ali😜#PAKvSL #SLvPAK#PAKvsSL #SLvsPAK pic.twitter.com/5a5i3sbxNr — ḶQ 💚 🇵🇰 | 🏏 l❤️ (@Saddique_rao) July 20, 2022 #WTC23 Inspired by Hassan Ali😜#PAKvSL pic.twitter.com/QqA4KSfWOZ — Mohammad Asad (@MohammadAsad77) July 20, 2022 చదవండి: షఫీక్ సూపర్ సెంచరీ.. లంకపై పాక్ ఘన విజయం -
షఫీక్ సూపర్ సెంచరీ.. లంకపై పాక్ ఘన విజయం
శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో పర్యాటక పాకిస్తాన్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (160) అజేయమైన శతకంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోని వెళ్లింది. లంక నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 222/3 స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది. అబ్దుల్లా షఫిక్ (406 బంతుల్లో 160; 7 ఫోర్లు, సిక్సర్).. మహ్మద్ నవాజ్ (34 బంతుల్లో 19 నాటౌట్; ఫోర్) సహకారంతో పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో చండీమాల్ (76) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 4, హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు, నసీమ్ షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బాబర్ ఆజమ్ వీరోచిత సెంచరీ (119) సహకారంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసి ఆలౌటైంది. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/82) పాక్‌కు దారుణంగా దెబ్బకొట్టాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. దినేశ్ చండిమాల్ (94 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) 6 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం కలుపుకుని లంక మొత్తంగా 342 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో పాక్ మొదట్లో తడబడినప్పటికీ షఫీక్, కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) ఆదుకున్నారు. వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (40) కూడా జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. వీరిద్దరూ ఔటైనా షఫీక్ టెయింలెండర్ల సహకారంతో పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య (4/135) రాణించాడు. చదవండి: Ind W Vs Pak W: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు! -
ఏమని వర్ణించగలం?.. బాబర్ ఆజంకే దిమ్మ తిరిగింది
యాసిర్ షా ''బాల్ ఆఫ్ ది సెంచరీ''తో కుషాల్ మెండిస్‌ను ఔట్ చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే మరో అద్భుతం చోటుచేసుకుంది. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య పాకిస్తాన్ కెప్టెన్.. ఇన్ఫాం బ్యాటర్ బాబర్ ఆజంను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రీజులో ఉన్న బాబర్ ఆజం తాను ఔటయ్యానా అన్న సందేహం కలిగేలా చేసింది ఆ బంతి. బాబర్ ఆజంకే దిమ్మ తిరిగేలా చేసిన ఆ బంతిని ఏమని వర్ణించగలం. విషయంలోకి వెళితే.. లంకతో తొలి టెస్టులో 342 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్‌ను షఫీక్ అబ్దుల్లా, బాబర్ ఆజం తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టారు. అటు షఫీక్ సెంచరీతో ఆకట్టుకోగా.. బాబర్ ఆజం కూడా అర్థ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరి జోడిని విడదీయడానికి లంక బౌలర్లు తెగ కష్టపడినా లాభం లేకపోయింది. ఇద్దరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో బౌలింగ్‌కు వచ్చాడు ప్రభాత్ జయసూర్య. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన ప్రభాత్ రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి మెరిశాడు. అసలే సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన బాబర్ ఆజం క్రీజులో ఉన్నాడు. దీనికి తోడూ తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత సెంచరీతో లంకకు కేవలం నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ప్రభాత్ జయసూర్య ఓవర్ ది వికెట్ మీదుగా బౌలింగ్ చేశాడు. పూర్తిగా లెగ్‌స్టంప్ అవతల పడిన బంతిని బాబర్ అంచనా వేయడంలో పొరబడ్డాడు. లెగ్ స్టంప్ మీదుగా పడిన బంతి ఆఫ్‌స్టంప్ మీదుగా వస్తుందని భ్రమ పడిన బాబర్ ప్యాడ్లను అడ్డుపెట్టాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. లెగ్‌స్టంప్ అవతల పడిన బంతి బాబర్ కాళ్ల వెనకాల నుంచి టర్న్ తీసుకొని నేరుగా లెగ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీనిని క్రికెట్ భాషలో ''జప్ఫా బంతి'' అని పిలుస్తారు. అంతే లంక బౌలర్ జయసూర్య కళ్లలో ఆనందం కనబడగా.. బాబర్ మాత్రం ఏం జరిగిందో అర్థంగాక చూస్తూ నిల్చుండిపోయాడు. ఆ తర్వాత జయసూర్య బౌలింగ్‌ను మెచ్చుకుంటూ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 112, మహ్మద్ రిజ్వాన్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 120 పరుగులు అవసరం కాగా.. లంకకు ఏడు వికెట్లు అవసరం. మరొక రోజు ఆట మిగిలి ఉండడంతో లంక బౌలర్లు మ్యాజిక్ చేస్తారా.. లేక ప్యాక్ బ్యాటర్లకు దాసోహం అంటారా అనేది వేచి చూడాలి. Babar Azam bowled with a Magical delivery by P Jayasuriya 1st Test Pak vs Sl #testlive #PAKvSL #BabarAzam pic.twitter.com/BBtDvz8wd9 — Vamsi Vemula (@VamsiVemula7) July 19, 2022 Big wicket for Sri Lanka Babar Azam is cleaned up by jayasuriya#BabarAzam #PAKvsSL #SLvPAK #Pakistan #Cricket pic.twitter.com/e6cyRSo5l0 — Khushnood Ali Khan (@KhushnoodAli07) July 19, 2022 చదవండి: యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు -
యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు
టెస్టు క్రికెట్లో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఆస్ట్రేలియన్ దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. జూన్ 4, 1993న వార్న్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన విధానం ఎవరు మరిచిపోలేరు. పూర్తిగా లెగ్‌స్టంప్ దిశగా వెళ్లిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టి.. క్రీజులో ఉన్న మైక్ గాటింగ్ సహా.. ఆసీస్ తోటి ఆటగాళ్లు, అభిమానులు సహా యావత్ క్రీడా ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. క్రికెట్ బతికున్నంతవరకు షేన్ వార్న్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. ఆ తర్వాత ఎంతో మంది బౌలర్లు వార్న్ లాగే ఆ ఫీట్ అందుకున్నప్పటికీ వార్న్ వేసిన బంతికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ స్టార్ యాసిర్ షా కూడా అచ్చం వార్న్ తరహాలోనే వేసిన బంతిని క్రికెట్ అభిమానులు సహా కామెంటేటర్స్ ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా అభివర్ణిస్తున్నారు. అయితే యాసిర్ వేసిన బంతిని దిగ్గజ బౌలర్‌తో పోల్చడం ఏంటని కొందరు అభిమానులు కొట్టిపారేసినప్పటికి.. అచ్చం వార్న్ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉండే.. యాసిర్ షా వేసిన బంతి కూడా అదే తరహాలో చరిత్రలో నిలిచిపోనుంది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌లో ఈ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. యాసిర్ షా డెలివరీకి అప్పటికే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న కుషాల్ మెండిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. కుషాల్ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ 56వ ఓవర్లో యాసిర్ షా బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న కుషాల్‌కు పూర్తిగా లెగ్‌స్టంప్ అవతల వేసిన బంతి అనూహ్యమైన టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది. తాను వేసిన బంతి అంతలా టర్న్ అవుతుందని యాషిర్ షా కూడా ఊహించి ఉండడు. అందుకే వికెట్ పడగానే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో లంక పాక్ ముందు 342 పరుగుల టార్గెట్ ఉంచింది. ప్రస్తుతం పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 3, బాబర్ ఆజం 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 185 పరుగులు దూరంలో ఉండగా.. మరొక రోజు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో శ్రీలంక మిగిలిన 8 వికెట్లు తీయగలిగితే విజయం సాధిస్తుంది. Ball of the Century candidate❓ Yasir Shah stunned Kusal Mendis with a stunning delivery which reminded the viewers of Shane Warne’s ‘Ball of the Century’.#SLvPAK pic.twitter.com/uMPcua7M5E — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 18, 2022 The greatest Test delivery ever? pic.twitter.com/MQ8n9Vk3aI — cricket.com.au (@cricketcomau) March 4, 2022 చదవండి: సరిగ్గా ఇదే రోజు.. ప్రపంచం ఆ అద్భుతాన్ని చూసింది.. ఐసీసీ ట్వీట్ Hasan Ali: అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్ -
రాణించిన మెండీస్,చండిమాల్.. శ్రీలంక స్కోర్: 329/9
గాలె: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓవర్‌నైట్ స్కోరు 36/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. దాంతో లంక ఓవరాల్ ఆధిక్యం 333 పరుగులకు చేరింది. ఇక చండీమాల్(86 బ్యాటింగ్),జయసూర్య(4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా అంతకుమందు లంక బ్యాటర్లు కుశాల్ మెండీస్(76),ఫెర్నాండో(64), పరుగులతో రాణించారు. ఇక పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ 5 వికెట్లు పడగొట్టగా..యాసిర్ షా మూడు, హాసన్ అలీ ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: Ben Stokes: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం! -
పాక్‌ను ఆదుకున్న బాబర్ ఆజమ్..
గాలె: కెప్టెన్ బాబర్ ఆజమ్ (119; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించడంతో... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 90.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. 148 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఆజమ్ ఆదుకున్నాడు. నసీమ్ షా (5 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (5/82) పాక్‌ను దెబ్బతీశాడు. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు సాధించింది. చదవండి: Virat Kohli: మారని ఆటతీరు.. వన్డే కెరీర్లో అత్యంత చెత్త రికార్డు -
అంతుపట్టని డ్యాన్స్‌తో అదరగొట్టిన పాక్ బౌలర్
పాకిస్తాన్ స్టార్ బౌలర్ హసన్ అలీ అంతుపట్టని డ్యాన్స్‌తో అభిమానులను అలరించాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లంక బ్యాటింగ్ సమయంలో ఈ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. బ్రేక్ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హసన్ అలీ.. మ్యాచ్‌కు దూరంగా ఉన్న హారిస్ రౌఫ్‌తో మాట్లాడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఏదో విషయమై చర్చకు రాగా.. కాసేపు చేతులు ముందుకు పెడుతూ డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చాడు. అయితే హసన్ అలీ చేసిన డ్యాన్స్ కాస్త విచిత్రమైన మూమెంట్స్లాగా అనిపించాయి. ఇది గమనించిన కామెంటేటర్ డానిసన్ మోరిసన్ ఈ అంతుపట్టని డ్యాన్స్ ఏంటా అని షాక్‌కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో హసన్ అలీ 12 ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక లంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ ఆజం వీరోచిత సెంచరీ పాక్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా కాపాడింది. నాలుగు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక రెండోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. ఓషాడా ఫెర్నాండో 17, కాసున్ రజిత 3 పరుగులతో ఆడుతున్నారు. Hassan Ali's back!!!! pic.twitter.com/WoQjdftQmQ — Ramiya 2.0 (@yehtuhogaaa) July 16, 2022 చదవండి: Ian Chapell: 'రోజులో 90 ఓవర్లు వేయకపోతే కెప్టెన్‌ను సస్పెండ్ చేయాలి' -
జయసూర్య మాయాజాలం.. టెస్ట్ క్రికెట్లో అరుదైన ఫీట్
టెస్ట్ క్రికెట్లో శ్రీలంక సంచలన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అరుదైన ఫీట్‌ను సాధించాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించడం ద్వారా అతను టెస్ట్ క్రికెట్లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. పాక్‌పై తొలి ఇన్నింగ్స్‌లో (రెండో రోజు లంచ్ సమయానికి 5/41) ఇదేసిన జయసూర్య.. అంతకుముందు ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆరేసి వికెట్లు (6/118, 6/59) పడగొట్టాడు. ప్రస్తుతానికి జయసూర్య ఖాతాలో 3 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 17 వికెట్లు ఉన్నాయి. A five-for each in his first three Test innings 🤯 Take a bow, Prabath Jayasuriya 🙌 Watch #SLvPAK LIVE on https://t.co/CPDKNxoJ9v with a Test Series Pass (in select regions) 📺#WTC23 | 📝 Scorecard: https://t.co/Zjbsh8Hg2c pic.twitter.com/3U65ou7lyn — ICC (@ICC) July 17, 2022 ఇదిలా ఉంటే, గాలే వేదికగా పాక్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టు సాధించింది. తొలి రోజు ఆటలో పాక్ బౌలర్ల ధాటికి 222 పరుగులకే కుప్పకూలిన లంకేయులు.. రెండో రోజు బౌలింగ్‌లో చెలరేగిపోయారు. 24/2 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన పాక్‌ను.. జయసూర్య, కసున్ రజిత (1/21), రమేశ్ మెండిస్ (1/11) దారుణంగా దెబ్బతీశారు. వీరి ధాటికి పాక్ లంచ్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు మాత్రమే చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (34)కు జతగా యాసిర్ షా (12) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాక్ ఇటీవలే లంకలో అడుగుపెట్టింది. జులై 24 నుంచి రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. 10 wicket haul on a debut ✔️ Best figures by a Sri Lankan on a debut ✔️ Dream debut for Prabath Jayasuriya 🤩#SLvAUS pic.twitter.com/BeAg9pMZNv — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2022 చదవండి: మూడో వన్డేలో బంగ్లాదేశ్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్ -
చెలరేగిన షాహిన్ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక
శ్రీలంక, పాకిస్తాన్ మధ్య గాలేలో శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో ఒకే రోజు 12 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 66.1 ఓవర్లలో 222 పరుగులకే కుప్పకూలింది. దినేశ్ చండిమాల్ (115 బంతుల్లో 76; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మహీశ్ తీక్షణ (38), ఒషాదా ఫెర్నాండో (35) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...హసన్ అలీ, యాసిర్ షా చెరో 2 వికెట్లు తీశారు. అయితే వెంటనే కోలుకున్న లంక ప్రత్యర్థిని దెబ్బ తీసింది. ఆట ముగిసే సమయానికి పాక్ 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. షఫీఖ్ (13), ఇమామ్ (2) వెనుదిరగ్గా... ప్రస్తుతం అజహర్ అలీ (3), బాబర్ ఆజమ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు
పాకిస్తాన్ సీనియర్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో యాసిర్ షా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యాసిర్ షా ఐదో స్థానానికి చేరుకున్నాడు. లంక సీనియర్ బ్యాట్స్‌మన్ ఏంజెల్లో మాథ్యూస్‌ను ఔట్ చేయడం ద్వారా యాసిర్ టెస్టుల్లో 237వ వికెట్‌ను దక్కించుకున్నాడు. తద్వారా అబ్దుల్ ఖాదీర్(236 వికెట్లు)ను దాటిన యాసిర్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక యాసిర్ షా కంటే ముందు పాక్ దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్(414 వికెట్లు), వకార్ యూనిస్(373 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్(362 వికెట్లు), దానిష్ కనేరియా(261) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక యాసిర్ షా పాకిస్తాన్ క్రికెట్లో పెను సంచలనం. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ►2014లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యాసిర్ షా పాకిస్తాన్ తరపున 50 వికెట్లు అత్యంత వేగంగా తీసిన బౌలర్‌గా నిలిచాడు. ►టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని(17 టెస్టుల్లో 100 వికెట్లు) అందుకున్న ఆటగాడిగా మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ►200 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా యాసిర్ షా చరిత్ర. 33 టెస్టుల్లో యాసిర్ 200 వికెట్లు సాధించాడు. అంతకముందు ఆస్ట్రేలియా బౌలర్ క్లారీ గ్రిమెట్(36 టెస్టుల్లో 200 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది. ►ఇప్పటివరకు యాసిర్ షా పాకిస్తాన్ తరపున 47 టెస్టుల్లో 237 వికెట్లు, 25 వన్డేల్లో 24 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్‌ను 16 సార్లు అందుకున్నాడు. ఇక దాదాపు ఏడాది విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్న యాసిర్ షా లంకతో టెస్టులో మంచి ప్రదర్శననే ఇచ్చాడు. 21 ఓవర్లు వేసిన యాసిర్ షా 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. అజర్ అలీ (3), బాబర్ ఆజం(1) క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌట్ అయింది. చండీమల్ 76 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మహీస్ తీక్షణ 38 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. యాసిర్ షా, హసన్ అలీ చెరో రెండు వికెట్లు తీశారు. -
ICC POTM: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
ICC Players of the Month- May: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్ విభాగంలో మే నెలకుగానూ శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్.. మహిళల విభాగంలో పాకిస్తాన్ స్పిన్ సంచలనం తుబా హసన్ ఈ అవార్డు గెలుచుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐసీసీ మీడియా ప్రకటన విడుదల చేసింది. తొలి ఆటగాడిగా కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఏంజెలో మాథ్యూస్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంక.. బంగ్లాదేశ్‌లో పర్యటనలో భాగంగా చట్టోగ్రామ్, మీర్పూర్ టెస్టుల్లో కలిపి అతడు 344(వరుసగా 199, 145) పరుగులు సాధించాడు. తద్వారా లంక సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికై ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచిన తొలి శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసి మాథ్యూస్.. తనకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, సిబ్బంది.. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మనపై మనకు నమ్మకం ఉంటే అసాధ్యమన్నది ఏదీ ఉండదని, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాడు. అరంగేట్రంలోనే అదరగొట్టి.. ఇక తుబా విషయానికొస్తే.. 21 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ శ్రీలంకతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఈ సిరీస్‌లో మొత్తంగా 5 వికెట్లు పడగొట్టిన ఆమె.. పాక్ ఏకపక్ష విజయంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును కూడా సొంతం చేసుకుంది. అరంగేట్రంలోనే అదరగొట్టిన తుబాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: Ind Vs SA 3rd T20: వైజాగ్‌లో గ్రౌండ్ చిన్నది.. అతడిని తప్పక ఆడించండి.. లేదంటే! Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో! -
డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర
పాకిస్తాన్ మహిళా లెగ్ స్పిన్నర్ తుబా హసన్ టి20 క్రికెట్లో కొత్త చరిత్ర చరిత్ర సృష్టించింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే బౌలింగ్‌లో బెస్ట్ స్పెల్(4-1-8-3) నమోదు చేసిన పాకిస్తాన్ మహిళా బౌలర్‌గా అరుదైన ఫీట్ సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో తుబా హసన్ 4 ఓవర్లలో 8 పరుగులిచ్చి ఒక మెయిడెన్ సహా మూడు కీలక వికెట్లు తీసుకొని ఆకట్టుకుంది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన తుబా హసన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ట్విటర్లో షేర్ చేస్తూ.. ''ఇంత అద్బుతమైన స్పెల్ ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడలేదు.. సూపర్ బౌలింగ్ తుబా హసన్..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. మాదవి, నిలాక్షి డిసిల్వా చెరో 25 పరుగులు చేశారు. తుబా హసన్, అనమ్ అమిన్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఐమన్ అన్వర్ రెండు వికెట్లు తీసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మహిళల జట్టు 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. నిదా దార్ 36* పరుగులు, బిస్బా మరూఫ్ 28* పరుగులు చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాకిస్తాన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ మే 26న జరగనుంది. చదవండి: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది BAN Vs SL: బంగ్లాదేశ్ 365 ఆలౌట్ 𝟒-𝟏-𝟖-𝟑 Best bowling figures on debut for Pakistan Women in T20Is! 🙌 An incredible spell by Tuba Hassan 💫 🐦 @TheRealPCB_Live Watch Live ➡️ https://t.co/ZY1fdGNHJ6 #⃣ #BackOurGirls | #PAKWvSLW pic.twitter.com/V9G0pTBSyk — Pakistan Cricket (@TheRealPCB) May 24, 2022 -
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా..
అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ కెప్టెన్ ఖాసీమ్ అక్రమ్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐదో ప్లేఆఫ్ స్థానం కోసం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఖాసీమ్ అక్రమ్.. తొలుత బ్యాటింగ్‌లో 135 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో 37 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఖాసీమ్ అక్రమ్ ఘనతను తనదైన స్టైల్లో ట్వీట్ చేసింది. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా ఖాసీమ్ అక్రమ్ నిలిచాడు. టోర్నమెంట్లో అక్రమ్ తన మార్క్‌ను స్పష్టంగా చూపించాడు.. కంగ్రాట్స్ అని ట్వీట్ చేసింది. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఒక సంచలనం.. కోహ్లితో ఉన్న పోలికేంటి! ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ 238 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. కెప్టెన్ ఖాసీమ్ అక్రమ్(80 బంతుల్లో 135 నాటౌట్, 13 ఫోర్లు, 6 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్(151 బంతుల్లో 136, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ముహ్మద్ షెహజాద్ 73 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 34.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఖాసీమ్ అక్రమ్ 37 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక శనివారం టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. చదవండి: ఆకాశ్ చోప్రా అండర్-19 వరల్డ్ బెస్ట్ ఎలెవెన్.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు View this post on Instagram A post shared by ICC (@icc) -
‘మీరు బాగా ఆడారు; లేదు.. ఔటయ్యాను’
రావల్పిండి: శ్రీలంక క్రికెట్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్లో పర్యటిస్తోంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభమైంది. బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఈ క్రమంలో గురువారం ఆట ముగిసిన తర్వాత లంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్ విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్ల ప్రశ్నలు డిక్వెల్‌తో పాటు అక్కడున్న మిగతా ఆటగాళ్లకు నవ్వులు తెప్పించాయి. ఇంతకీ విషయమేమిటంటే... మ్యాచ్ గురించి ఓ విలేకరి మాట్లాడుతూ... ‘ మీరు చాలా బాగా ఆడారు. సెంచరీకి దగ్గరగా ఉన్నారు. ఈ పిచ్‌పై శతకం సాధిస్తానని అనుకుంటున్నారా అని డిక్వెల్‌ను ప్రశ్నించాడు. ఇందుకు చిరునవ్వులు చిందించిన డిక్వెల్... ‘నేను డిసిల్వాను కాదు. డిక్వెల్‌ను అంటూ బదులిచ్చాడు. అయినప్పటికీ మరో విలేకరి సైతం ఇలాంటి ప్రశ్ననే సంధించడంతో..‘ మీరు నా గురించేనా మాట్లాడేది. నేను డిక్వెల్. ఇప్పటికే ఔట్ అయ్యి పెవిలియన్‌లో కూర్చున్నాను. ఒకవేళ రెండో ఇన్నింగ్స్‌లో వీలైతే సెంచరీ గురించి ఆలోచిస్తా’ అంటూ డిక్వెల్ ఓపికగా మళ్లీ అదే సమాధానమిచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో మ్యాచ్ వివరాలు, ఆటగాడి పేరు కూడా తెలుసుకోకుండా విలేకర్ల సమావేశానికి ఎలా వస్తారు. కనీస అవగాహన లేకుండా ప్రశ్నలు అడగడం సబబేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డిక్వెల్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. అదే విధంగా గురువారం ఆట ముగిసే సరికి ధనంజయ డిసిల్వా(72 బ్యాటింగ్) అజేయంగా నిలిచాడు. Dickwella’s classic replies #PAKvSL @OsmanSamiuddin @Athersmike @TheRealPCBMedia pic.twitter.com/s4LYrQwO96 — Rizwan Ali (@joji_39) December 12, 2019 -
క్రికెట్‌కు తక్కువ.. కుస్తీ పోటీకి సిద్ధంగా!
ఇస్లామాబాద్ : శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టీ20ల్లో నంబర్ వన్ జట్టుగా పేరు తెచ్చుకున్న పాక్.. ప్రత్యర్థి జట్టు చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు రాకపోయినప్పటికీ... శ్రీలంక యువ క్రికెటర్లు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సహా హెడ్‌కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్‌పై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆమిర్ సోహైల్ కూడా పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. అయితే క్రికెట్‌కు తక్కువ... కుస్తీ పోటీలకు ఎక్కువ అన్నట్లు క్రికెటర్ల ఆకారం కనబడుతోంది. వీళ్లు ఒలంపిక్స్ లేదా డబ్ల్యూడబ్ల్యూఈ కుస్తీ పోటీలకు సిద్ధం అవుతున్నారో అర్థం కావడం లేదు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. (చదవండి : కటౌట్‌ను కసితీరా తన్నిన ఫ్యాన్..!) కాగా ప్రపంచకప్ సమయంలోనూ పాక్ క్రికెటర్ల ఫిట్నెస్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. టీమిండియాతో ఓటమి తర్వాత.. ‘మా టీం తిండి తినడం మీద చూపే శ్రద్ధలో పావు వంతు అయినా ఫిట్నెస్, క్రమశిక్షణ మీద చూపిస్తే బాగుండేది. పిజ్జాలు బర్గర్లు తింటారు తప్ప మైదానంలో పోరాడలేరు. రేపు మ్యాచ్ ఉందంటే.. ఫిట్నెస్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. జంక్ ఫుడ్ తిని కడుపు నింపుకోవడంలో మా ఆటగాళ్లు బిజీగా ఉంటారు’ అంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పాక్ జట్టుపై విపరీతంగా జోకులు పేలడంతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జట్టు కోచ్‌గా పగ్గాలు చేపట్టిన మిస్బా... ఫిట్నెస్ ప్రమాణాలు పెంచి ఆటగాళ్లు మైదానంలో మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు ప్రణాళికలు రచించాడు. బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వాడి వండే రెడ్ మీట్, మిఠాయిలకు దూరంగా ఉంచాలని అతడు ఆటగాళ్లకు సూచించాడు. -
కటౌట్‌ను కసితీరా తన్నిన ఫ్యాన్..!
ఇస్లామాబాద్ : ఇతర దేశాలతో పోలిస్తే భారత ఉపఖండంలో క్రికెటర్లకు ఉన్న క్రేజే వేరు. అభిమాన ఆటగాళ్లను కలిసేందుకు మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లి అరెస్టైన ఫ్యాన్స్ కూడా కోకొల్లలు. అయితే విజయం సాధించినపుడు ఆకాశానికెత్తేసే కొంతమంది ‘వీరాభిమానులు’.. ఓడిపోయిన సమయాల్లో వారిపై కోపం ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో జయభేరి మోగించిన పాకిస్తాన్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ.. అద్భుత ప్రదర్శనతో లంక యువ ఆటగాళ్లు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సొంతం చేసుకున్నారు. సుదీర్ఘ కాలంగా టీ20ల్లో వైట్‌వాష్ ఎరుగని జట్టుగా ఉన్న పాక్‌ను క్లీన్‌స్వీప్ చేసి ప్రత్యర్థి జట్టుకు గట్టి షాకిచ్చారు.(చదవండి : అందుకే ఓడిపోయాం.. సరేనా: పాక్ కోచ్) ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, కోచ్ మిస్బావుల్ హక్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఆటతో పరువు తీశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో సర్ఫరాజ్ అహ్మద్ కటౌట్‌ను ఓ అభిమాని కసితీరా కొట్టి కాలితో తన్నాడు. కటౌట్ పూర్తిగా నేలమట్టం అయ్యేంత వరకు కోపంతో ఊగిపోతూ తిట్ల వర్షం కురిపించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను సాజ్ సాదిఖ్ అనే నెటిజన్ ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సర్ఫరాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. A fan not happy with Sarfaraz Ahmed after the 3-0 loss to Sri Lanka #PAKvSL #Cricket pic.twitter.com/S6Biri8z4f — Saj Sadiq (@Saj_PakPassion) October 10, 2019 -
పాక్‌కు చివరకు మిగిలింది రిక్తహస్తమే..
లాహోర్: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు చివరకు రిక్తహస్తమే మిగిలింది. తన కంటే ఎంతో బలహీనమైన శ్రీలంక చేతిలో పాక్ వైట్‌వాష్‌కు గురయింది. టీ20లో నంబర్ వన్ స్థానంలో ఉండి, స్వదేశంలో జరుగుతున్న తొలి పొట్టి సిరీస్‌ను పాక్ కాపాడుకోలేకపోయింది. తొలి రెండు టీ20ల్లో ఓడిపోయిన పాక్ చివరి మ్యాచ్‌లో గెలిచి కనీసం పరువు కాపాడుకోవలనుకుంది. కానీ నిరాశే ఎదురైంది. బుధవారం జరిగిన మూడో టీ20లో పాక్‌పై శ్రీలంక 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20 సిరీస్‌ను లంక క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ పనిపట్టడంతో పాటు, సిరీస్‌లో నిలకడగా రాణించిన వనిండు హసనరంగాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు లభించాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఒషాదా ఫెర్నాండో (78 నాటౌట్, 48 బంతుల్లో 8ఫోర్లు, 3 సిక్సర్లు) రఫ్పాడించడంతో పాక్ ముందు లంక మంచి లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్టు కోల్పోఇయ 134 పరుగులే చేసి ఓటమి పాలైంది. పాక్ ఆటగాళ్లలో హారిస్ సోహైల్ (52; 50 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. లంక బౌలర్లలో వనిండు హసరంగా మూడు వికెట్లతో చెలరేగగా.. లహిరు కుమార రెండు వికెట్లతో రాణించాడు. -
అంతా భారతే చేసిందన్న పాక్.. ఖండించిన లంక
హైదరాబాద్: వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై పాకిస్తాన్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తుంటది. అనవసర విషయాల్లో భారత్‌ను బయటకు లాగి పాక్ అనేకసార్లు నవ్వులపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాక్- శ్రీలంక సిరీస్ అంతగా విజయవంతం కాకపోవడంతో పాక్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థంకాక భారత్‌పై బురదజల్లే ఆలోచనలో పాక్ ఉంది. దీనిలో భాగంగా శ్రీలంకకు చెందిన పది మంది క్రికెటర్లు పాకిస్తాన్‌కు వెళ్లకుండా భారత్ అడ్డుకుందని పాక్ మంత్రి ఫావద్ చౌదరీ అసత్య ఆరోపణలు చేశాడు. ‘ పది మంది శ్రీలంక క్రికెటర్లు పాక్‌కు రాకుండా భారత క్రీడా శాఖ ఒత్తిడి చేసింది. భారత్ చవకబారు వ్యూహాల కారణంగానే లంక ఆటగాళ్లు పాక్ పర్యటనకు రాలేదు’అంటూ పాక్ మంత్రి ఫావద్ చౌదరీ ట్వీట్ చేశాడు. ఫావద్ ఆరోపణలను శ్రీలంక ఖండించింది. ఈ వివాదంపై శ్రీలంక క్రీడా శాఖ మంత్రి ఫెర్నాండో ట్విటర్ వేదికగా స్పందించారు. ‘లంక క్రికెటర్లు పాక్ వెళ్లకుండా భారత్ ఎలాంటి ఒత్తిడి చేయలేదు. 2009లో లంక క్రికెటర్లపై జరిగిన దాడి కారణంగానే ప్రస్తుత సిరీస్‌కు పది మంది ఆటగాళ్లు పాక్‌కు వెళ్లడానికి ఇష్టపడలేదు. అంతేకానీ మా ఆటగాళ్లపై బీసీసీఐ ప్రభావం ఉందనడం అవాస్తవం. ఇక పాక్ పర్యటనకు పూర్తిస్థాయి జట్టునే పంపించాం. ప్రస్తుత సిరీస్‌లో లంక ఆటగాల్లు శక్తిమేర ఆడి సిరీస్ గెలుస్తారనే పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు ఉంది’అంటూ ఫెర్నాండో పేర్కొన్నారు. -
రెండో వన్డేలో పాక్ గెలుపు
కరాచీ: నాలుగేళ్ల తర్వాత పాక్ గడ్డపై జరిగిన అంతర్జాతీయ వన్డేలో ఆతిథ్య దేశం గెలిచింది. తొలి వన్డే వర్షార్పణమవగా... సోమవారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 67 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. మొదట పాక్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 305 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (115; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ, ఫకర్ జమన్ (54; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించారు. హరిస్ సొహైల్ (40; 1 ఫోర్) మెరుగ్గా ఆడాడు. హసరంగ డిసిల్వాకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 46.5 ఓవర్లలో 238 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒక దశలో 28 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లంకను షెహన్ జయసూర్య (96; 7 ఫోర్లు, 1 సిక్స్), షనక (68; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 177 పరుగులు జోడించారు. తర్వాత టెయిలెండర్లలో హసరంగ డిసిల్వా (28; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుగనిపించాడు. పాక్ బౌలర్ ఉస్మాన్ షిన్వారి (5/51) నిప్పులు చెరిగాడు. బుధవారం ఆఖరి వన్డే కూడా ఇక్కడే జరుగనుంది. -
పాక్-శ్రీలంక మ్యాచ్ వర్షార్పణం
బ్రిస్టల్: వన్డే వరల్డ్‌కప్‌లో శుక్రవారం పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. వరుణుడు పదే పదే అంతరాయం కల్గించడంతో కనీసం టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం..3.00ని.లకు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా భారీ వర్షం కురిసింది. దాంతో పిచ్, ఔట్ ఫీల్డ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే చివరగా రాత్రి గం.8.30 ని.లకు పిచ్‌ను రిఫరీతో కలిసి పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పిచ్ చిత్తడిగా మారిపోవడంతో గ్రౌండ్స్‌మెన్ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. కనీసం 20 ఓవర్లు మ్యాచ్‌ను నిర్వహించాలని భావించినా అది కూడా సాధ్యం కాలేదు. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది. ఓవరాల్ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంకకు పాయింట్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకముందు ఇరు జట్లు ఏడుసార్లు వరల్డ్‌కప్‌లో తలపడగా అన్ని సందర్భాల్లోనూ పాక్‌నే విజయం వరించింది. -
పాక్-శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ఆటంకం
బ్రిస్టల్: వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంక-పాకిస్తాన్ జట్ల జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో టాస్ ఆలస్యం కానుంది. మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో టాస్‌ను నిలిపివేశారు. ఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో చేతులెత్తేసినా... రెండో మ్యాచ్‌లో విజయం సాధించాయి. అయితే శ్రీలంక కంటే పాకిస్తానే కాస్త పటిష్టంగా కనిపిస్తోంది. మరొకవైపు ప్రపంచకప్‌లో శ్రీలంకపై పాక్‌కు అద్వితీయమైన రికార్డు ఉంది. ఏడు మ్యాచ్‌లాడగా ఏడింట్లోనూ శ్రీలంకపై పాక్‌దే పైచేయి.