Asia Cup 2023- Sri Lanka To Face India In Final: ఆసియా కప్-2023 ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. తొడ కండరాలు పట్టేయడంతో అతడు నొప్పితో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం రాత్రి వెల్లడించింది.
స్కానింగ్ కోసం శుక్రవారం అతడిని ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపింది. కాగా తుదిపోరుకు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో సూపర్-4 మ్యాచ్‌లో గురువారం పాకిస్తాన్‌తో తలపడింది శ్రీలంక.
పట్టుదలతో ఫైనల్లోకి శ్రీలంక
వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన వన్డే మ్యాచ్‌లో అసాధారణ పోరాటంతో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన హొరాహోరీ పోరులో పట్టుదలగా పోరాడి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ సందర్భంగానే లంక యువ స్పిన్నర్ మహీశ్ తీక్షణకు గాయమైంది.
నొప్పి ఉన్న బౌలింగ్ చేసి
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కుడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ తన స్పెల్ పూర్తి చేశాడీ రైట్‌ఆర్మ్ బౌలర్. పాక్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో 42 పరుగులు ఇచ్చి 4.70 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు.
టీమిండియాతో ఫైనల్‌కు అనుమానమే!
మహ్మద్ నవాజ్‌ను బౌల్డ్ చేసిన తీక్షణ బౌలింగ్‌లో.. ఒకవేళ శ్రీలంక గనుక 35వ ఓవర్లో డీఆర్‌ఎస్ తీసుకుంటే ఇఫ్తికర్ అహ్మద్(47) వికెట్ కూడా అతడి ఖాతాలో చేరేదే! ఇదిలా ఉంటే.. స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్ మీదే సెప్టెంబరు 17 నాటి ఫైనల్లో శ్రీలంక టీమిండియాను ఢీకొట్టనుంది.
ఇలాంటి సమయంలో కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయపడటం ఆ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ ఇప్పటి వరకు లంక తరఫున 27 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. ఆసియా కప్-2023లో ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు కూల్చాడు.
చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం
🚨 Maheesh Theekshana has strained his right hamstring.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023
The player will undergo a scan tomorrow to fully assess his condition.
Theekshana sustained the injury while he was fielding during the ongoing game between Sri Lanka and Pakistan.#AsiaCup2023 #SLvPAK pic.twitter.com/6RTSRxhKNQ
Comments
Please login to add a commentAdd a comment