Maheesh Theekshana
-
'భారత్‌లో అన్ని బ్యాటింగ్ పిచ్లే.. అందుకే ఇక్కడ ఆడలేకపోయారు'
స్వదేశంలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. భారత్‌పై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంకేయులు తమ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించారు. ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.ముఖ్యంగా లంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టారు. మూడు వన్డేల్లో కలిపి ఆతిథ్య జట్టు స్పిన్నర్లు ఏకంగా 27 వికెట్లు పడగొట్టారు. తొలి రెండు వన్డేల్లో కాస్త పర్వాలేదన్పంచిన టీమిండియా.. మూడో వన్డేలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. కొలంబో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 110 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో అన్నీ బ్యాటింగ్ పిచ్లే ఉంటాయని, తమ దేశంలో అలా ఉండవని తీక్షణ తెలిపాడు."భారత్‌లో దాదాపుగా అన్ని పిచ్‌లు ప్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. అంతేకాకుండా బౌండరీలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇటువంటి వికెట్‌పై భారత బ్యాటర్లు బాగా అలవాటు పడి ఉంటారు. అందుకే ఇక్కడ(శ్రీలంక)కు వచ్చి కాస్త ఇబ్బంది పడ్డారు.కొలంబోలోని ప్రేమదాస వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. మేము ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాము. కొంచెం టర్న్ ఉంటే చాలు మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నందున ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు. దేశీవాళీ క్రికెట్లో కూడా మాకు ఇటువంటి పిచ్లే ఉంటాయి. కాబట్టి మా బ్యాటర్లకు ఇటువంటి వికెట్లపై ఎలా ఆడాలో తెలుసు అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థీక్షణ పేర్కొన్నాడు.చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా -
LPL 2024: డిక్వెల్లా మెరుపు అర్దశతకం.. ఉడాన ఆల్‌రౌండర్ షో
లంక ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా నిన్న (జులై 3) రాత్రి జరిగిన మ్యాచ్‌లో గాలే మార్వెల్స్, కొలొంబో స్ట్రయికర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్ట్రయికర్స్పై మార్వెల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మార్వెల్స్ నిర్ణీత ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో స్ట్రయికర్స్ చివరి వరకు పోరాడి (172/9) ఓటమిపాలైంది.డిక్వెల్లా, ఉడాన మెరుపు అర్దశతకాలునిరోషన్ డిక్వెల్లా (18 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇసురు ఉడాన (34 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మార్వెల్స్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. స్ట్రయికర్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ (4-0-21-4), బినుర ఫెర్నాండో (4-0-22-3) అద్భుతంగా బౌలింగ్ చేశారు.బంతితోనూ రాణించిన ఉడాన180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్ట్రయికర్స్.. ఉడాన (2/34), తీక్షణ (2/20), అరచ్చిగే (2/21) చెలరేగడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (172/9) నిలిచిపోయింది. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో దనిత్ వెల్లలగే (45) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. -
ఇకపై ధోని నాకు బౌలింగ్ ఇవ్వనన్నాడు: తీక్షణ కామెంట్స్ వైరల్
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యువ క్రికెటర్లలో శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణ ఒకడు. 2021లో లంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. మూడు ఫార్మాట్లలోనూ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక సభ్యుడిగా ఎదిగి జట్టులో తన స్థానం సుసిర్థం చేసుకున్నాడు. కాగా మహీశ్ తీక్షణ 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు అతడు ఆడుతున్న విషయం తెలిసిందే. అనుకున్న ఫలితాలు రాబడుతూ.. తీక్షణ బౌలింగ్ నైపుణ్యాలను వినియోగించుకుంటూ.. ఎప్పటికప్పుడు అతడిని ప్రోత్సహిస్తూ జట్టుకు కావాల్సిన ఫలితాలు రాబట్టాడు తలా. అంతేకాదు విమర్శలు వచ్చిన సమయంలోనూ అతడికి అండగా నిలబడ్డాడు. ఈ విషయాన్ని మహీశ్ తీక్షణ తాజాగా పునరుద్ఘాటించాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో.. షార్జా వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తీక్షణ.. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి పంచుకున్నాడు. ఐపీఎల్-2024లో ధోని తనకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వనన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నన్ను హగ్ చేసుకున్నారు.. ఇకపై బౌలింగ్ వద్దన్నారు! ‘‘ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత నేను, మతీశ పతిరణ మా దేశానికి పయనం కావాల్సి ఉంది. అప్పటికే పార్టీ ముగించుకున్నాం. అయితే, వెళ్లేముందు ఒకసారి ధోనిని కలిసి వీడ్కోలు చెప్పాలని అనుకున్నాం. ఆయన మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. నన్ను ఆలింగనం చేసుకుని.. ‘వచ్చే సీజన్లో నీకు బౌలింగ్ ఛాన్స్ ఇవ్వను. నువ్వు కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేయాలి’ అని నాతో అన్నారు’’ అంటూ తమ మధ్య జరిగిన సరదా సంభాషణను తీక్షణ వెల్లడించాడు. అదే విధంగా తనపై విమర్శలు వచ్చిన సమయంలో ధోని అండగా నిలబడిన తీరును ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. క్యాచ్‌లు డ్రాప్ చేసినా నన్ను నమ్మారు ‘‘గతేడాది నా ఫీల్డింగ్ సరిగ్గా లేదు. కనీసం 4- 5 క్యాచ్‌లు డ్రాప్ చేశాను. అందుకు నేనే జవాబుదారీగా ఉన్నాను. ఏదేమైనా వాళ్లు(మేనేజ్మెంట్) నాపై నమ్మకం కోల్పోలేదు. నన్ను తుదిజట్టు నుంచి తప్పించలేదు. అందుకే ధోనితో కలిసి ఆడటం అందరికీ అంత ఇష్టం మరి! మనుషులన్నాక తప్పులు చేయడం సహజం.. ఇంకో అవకాశం ఇస్తే వాటిని కచ్చితంగా సరిదిద్దుకుంటారని ఆయనకు తెలుసు. ఆయనలో నాకు ఎక్కువగా నచ్చే గుణం అదే’’ అంటూ మహీశ్ తీక్షణ తలాపై ప్రశంసలు కురిపించాడు. ఎల్లవేళలా అండగా ధోని కాగా గతేడాది ఐపీఎల్ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫు మహీశ్ తీక్షణ 11 వికెట్లు తీశాడు. తద్వారా సీఎస్కే ఏకంగా ఐదోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్ని కీలక మ్యాచ్‌లలో క్యాచ్‌లు డ్రాప్ చేయడం వల్ల అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి సమయంలో ధోని తనకు అండగా నిలిచాడని తాజా ఇంటర్వ్యూలో 23 ఏళ్ల తీక్షణ గుర్తు చేసుకున్నాడు. అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు -
భారత్‌తో ఫైనల్‌కు లంక స్పిన్నర్ దూరం.. జట్టులోకి ఆల్‌రౌండర్
Asia Cup 2023- India vs Sri Lanka In Final: ఊహించినట్లుగానే టీమిండియాతో ఫైనల్‌కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. లంక స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్‌తో తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ సందర్భంగా తీక్షణ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేసినా బౌలింగ్ కొనసాగించి తన స్పెల్ పూర్తి చేశాడు. మెరుగైన ఎకానమీతో ఒక వికెట్ కూడా తీశాడు. అయితే, స్కానింగ్ అనంతరం గాయం తీవ్రమైనదిగా తేలినట్లు తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆసియా కప్-2023 ఫైనల్‌కు అతడు దూరమైనట్లు తెలిపింది. మహీశ్ తీక్షణ స్థానంలో సహన్ అరాచిగేను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. తీక్షణను హై పర్ఫామెన్స్ సెంటర్‌కు పంపిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఎవరీ సహన్ అరాచిగే? 27 ఏళ్ల సహన్ అరాచిగే.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన అతడు.. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్. జింబాబ్వేలో వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్ సందర్భంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో లంక తరఫున అరంగేట్రం చేశాడు. ఫైనల్లో టాప్ స్కోరర్ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక క్వాలిఫయర్స్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు సహన్. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 57 పరుగులతో రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అప్పటికే వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన శ్రీలంక టాప్-1లో నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్.. -
Ind vs SL: టీమిండియాతో ఫైనల్‌కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ
Asia Cup 2023- Sri Lanka To Face India In Final: ఆసియా కప్-2023 ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ జట్టు కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. తొడ కండరాలు పట్టేయడంతో అతడు నొప్పితో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం రాత్రి వెల్లడించింది. స్కానింగ్ కోసం శుక్రవారం అతడిని ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపింది. కాగా తుదిపోరుకు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో సూపర్-4 మ్యాచ్‌లో గురువారం పాకిస్తాన్‌తో తలపడింది శ్రీలంక. పట్టుదలతో ఫైనల్లోకి శ్రీలంక వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన వన్డే మ్యాచ్‌లో అసాధారణ పోరాటంతో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన హొరాహోరీ పోరులో పట్టుదలగా పోరాడి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ సందర్భంగానే లంక యువ స్పిన్నర్ మహీశ్ తీక్షణకు గాయమైంది. నొప్పి ఉన్న బౌలింగ్ చేసి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కుడి తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ తన స్పెల్ పూర్తి చేశాడీ రైట్ఆర్మ్ బౌలర్. పాక్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో 42 పరుగులు ఇచ్చి 4.70 ఎకానమీతో ఒక వికెట్ తీశాడు. టీమిండియాతో ఫైనల్‌కు అనుమానమే! మహ్మద్ నవాజ్‌ను బౌల్డ్ చేసిన తీక్షణ బౌలింగ్‌లో.. ఒకవేళ శ్రీలంక గనుక 35వ ఓవర్లో డీఆర్ఎస్ తీసుకుంటే ఇఫ్తికర్ అహ్మద్(47) వికెట్ కూడా అతడి ఖాతాలో చేరేదే! ఇదిలా ఉంటే.. స్పిన్‌కు అనుకూలిస్తున్న కొలంబో పిచ్ మీదే సెప్టెంబరు 17 నాటి ఫైనల్లో శ్రీలంక టీమిండియాను ఢీకొట్టనుంది. ఇలాంటి సమయంలో కీలక స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయపడటం ఆ జట్టులో ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ ఇప్పటి వరకు లంక తరఫున 27 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. ఆసియా కప్-2023లో ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు కూల్చాడు. చదవండి: మరీ చెత్తగా.. అందుకే ఓడిపోయాం.. వాళ్లిద్దరు అద్భుతం: బాబర్ ఆజం 🚨 Maheesh Theekshana has strained his right hamstring. The player will undergo a scan tomorrow to fully assess his condition. Theekshana sustained the injury while he was fielding during the ongoing game between Sri Lanka and Pakistan.#AsiaCup2023 #SLvPAK pic.twitter.com/6RTSRxhKNQ — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023 -
Asia Cup 2023: నిప్పులు చెరిగిన పతిరణ.. తిప్పేసిన తీక్షణ
ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (ఆగస్ట్ 31) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. ఫాస్ట్ బౌలర్ మతీష పతిరణ నిప్పులు చెరిగే వేగంతో బంతులు సంధించి 4 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ (8-1-19-2) తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వీరికి ధనంజయ డిసిల్వ (10-0-35-1), దునిత్ వెల్లలగే (7-0-30-1), కెప్టెన్ షనక (3-0-16-1) తోడవ్వడంతో బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హొసేన్ షాంటో (122 బంతుల్లో 89; 7 ఫోర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, తన జట్టు ఓ మోస్తరు స్కోరైనా చేసేందుకు తోడ్పడగా.. తౌహిద్ హ్రిదోయ్ (20), ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (16), ముష్ఫికర్ రహీమ్ (13) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. తంజిద్ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ డకౌట్లు కాగా.. కెప్టెన్ షకీబ్ 5, మెహిది హసన్ మీరజ్ 5,మెహిది హసన్ 6, షోరిఫుల్ ఇస్లాం 2 పరుగులతో అజేయంగా నిలిచారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆరంభంలోనే వికెట్లు కోల్నోయి ఎదురీదుతోంది. ఆ జట్టు 43 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. పథుమ్ నిస్సంక (14).. షోరీఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీంకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. కరుణరత్నేను (1) తస్కిన్ అహ్మద్, కుశాల్ మెండిస్‌ను (5) షకీబ్ క్లీన్ బౌల్డ్ చేశారు. 14 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 58/3గా ఉంది. సమరవిక్రమ (25), అసలంక (8) క్రీజ్‌లో ఉన్నారు. -
అజేయ లంక.. క్వాలిఫయర్స్ ఫైనల్లో జయకేతనం
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో శ్రీలంక అజేయ జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని శ్రీలంక.. వన్డేల్లో తమ విజయ పరంపరను కొనసాగించింది. ఈ ఫార్మాట్లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన శ్రీలంక.. ఇవాళ (జులై 9) జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, క్వాలిఫయర్స్ విజేతగా నిలిచింది. 🇦🇪 ✅ 🇴🇲 ✅ 🍀 ✅ 🏴 ✅ 🇳🇱 ✅ 🇿🇼 ✅ 🌴 ✅ 🏆 ✅ 🙏 Namaste India ✅#LionsRoar #CWC23 pic.twitter.com/nO7U14F9ky — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లంక బౌలర్లు చెలరేగిపోయారు. మహేష్ తీక్షణ (6.3-1-31-4), దిల్షన్ మధుశంక (7-1-18-3), హసరంగ (7-1-35-2) నెదర్లాండ్స్ పతనాన్ని శాసించారు. 🔥 Another fiery spell of fast bowling by Dilshan Madushanka! 💪🏏#LionsRoar #CWC23 pic.twitter.com/tCwDdA6ojw — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 47.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. కొత్త ఆటగాడు సహన్ అర్చిగే (57) అర్ధసెంచరీతో రాణించగా.. కుశాల్ మెండిస్ (43), అసలంక (36) పర్వాలేదనిపించారు. ఆఖర్లో హసరంగ (29), తీక్షణ (13) కాసేపు ప్రతిఘటించడంతో శ్రీలంక 200 పరుగుల మైలురాయిని దాటగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్, ర్యాన్ క్లెయిన్, విక్రమ్‌జీత్ సింగ్, సాకిబ్ జుల్ఫికర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. He is unstoppable! 💪 Another match-winning spell by Maheesh Theekshana! 🏏🎉🔥#LionsRoar pic.twitter.com/FY0YwfMAwg — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2023 అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. తీక్షణ, మధుశంక, హసరంగ ధాటికి 23.3 ఓవర్లలో 105 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ ఓడౌడ్ (33), వాన్ బీక్ (20 నాటౌట్), విక్రమ్‌జీత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మధుశంకకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీ ఆసాంతం రాణించిన జింబాబ్వే ప్లేయర్ సీన్ విలియమ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. -
ఎదురులేని లంక.. గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోరులో శ్రీలంక జట్టుకు ఎదురులేకుండా పోయింది. గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన చివరి మ్యాచ్‌లో లంక జట్టు 82 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. నాలుగింటికి నాలుగ విజయాలు సాధించిన లంక 8 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సూపర్ సిక్స్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలను దాదాపు ఖరారు చేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 85 బంతుల్లో 75 పరుగులు చేయగా.. చరిత్ అసలంక 65 బంతుల్లో 63 పరుగులతో రాణించాడు. వీరిద్దరు మినహా మిగతావారిలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ నాలుగు వికెట్లు తీయగా.. మార్క్ వాట్ మూడు, క్రిస్ సోల్ రెండు, ఎవన్స్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి స్కాట్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. క్రిస్ గ్రీవ్స్ ఒక్కడే 56 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో స్కాట్లాండ్ 29 ఓవర్లలోనే 163 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బౌలర్లలో మహీష్ తీక్షణ మూడు వికెట్లతో రాణించగా.. హసరంగా రెండు, కాసున్ రజిత, లాహిరు కుమారా, దాసున్ షనకలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇప్పటికే గ్రూప్-బి నుంచి లంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు సూపర్ సిక్స్‌కు క్వాలిఫై అయ్యాయి. అయితే లీగ్స్టేజీ సహా సూపర్ సిక్స్‌లో సాధించే పాయింట్ల ఆధారంగా ఒక జట్టు మాత్రమే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవుతుంది. ఈ విషయంలో లంక గ్రూప్-బి నుంచి ముందు వరుసలో ఉంది. Sri Lanka bag two crucial points against Scotland going into the Super Six stage of the #CWC23 Qualifier 👏#SLvSCO: https://t.co/FCKWkeNT75 pic.twitter.com/RUq8S7nR7l — ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023 Spinning a web 🕸️ For his figures of 3/41, Maheesh Theekshana is the @aramco #POTM from #SLvSCO 🙌 #CWC23 pic.twitter.com/tjbIXmvjsS — ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023 చదవండి: ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
Viral: మిస్టర్ కూల్‌కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి!
IPL 2023 CSK Vs PBKS- MS Dhoni Loses Cool: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీలంక బౌలర్లు మహీశ్ తీక్షణ, మతీష పతిరణ. ఐపీఎల్-2023లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ తుది జట్టులో వీరు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తూ.. ముందుకు సాగుతున్నారు. మిస్టర్ కూల్‌కు కోపం ఎందుకొచ్చింది? ఈ సీజన్లో ఇప్పటి వరకు తీక్షణ, పతిరణ ఐదేసి వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. ధోని కూడా వీరికి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో తీక్షణ చేసిన తప్పు మిస్టర్ కూల్ ధోనికి కూడా కోపం తెప్పించింది. నరాలు తెగే ఉత్కంఠ చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఎట్టకేలకు విజయం సాధించింది. పతిరణ వేసిన చివరి ఓవర్లో ఆఖరి బంతికి పంజాబ్ బ్యాటర్లు సికిందర్ రజా, షారుక్ ఖాన్ మూడు పరుగులు పూర్తి చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. చెత్త ఫీల్డింగ్ కాగా తీక్షణపై ధోని ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. పంజాబ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్లో బంతిని ధోని.. తుషార్ దేశ్‌పాండేకు అందించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ మొదటి రెండు బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత షార్ట్ బాల్‌ను సంధించాడు ఫాస్ట్‌బౌలర్ తుషార్. దానిని పుల్‌షాట్ ఆడబోయిన లివింగ్‌స్టోన్ లెక్క తప్పడంతో బంతి బౌండరీ దిశగా పయనించింది. ఈ క్రమంలో థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న తీక్షణ బంతిని తప్పుగా అంచనా వేశాడు. బాల్ మిస్ చేశాడు.. ఏకంగా 4 పరుగులు క్యాచ్ అందుకోవడానికి విఫలయత్నం చేశాడు. అనవసరంగా ముందుకు డైవ్ చేసి బాల్‌ను మిస్ చేశాడు. బంతి బౌండరీని తాకడంతో పంజాబ్‌కు నాలుగు పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన ధోని.. మిస్ ఫీల్డింగ్ చేసిన మహీశ్ తీక్షణపై ఫైర్ అయ్యాడు. జట్టు నుంచి తీసిపారేయండి అసలేం ఏం చేస్తున్నావో అర్థం అవుతోందా? అన్నట్లు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. డగౌట్లో ఉన్న కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం తీక్షణ చేసిన పనికి గుస్సా అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘నీకసలు బుద్ధుందా? బౌలింగ్ అంతంత మాత్రమే. చెత్త ఫీల్డింగ్. జట్టులో నుంచి తీసిపారేయండి’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మహీశ్ తీక్షణ 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 36 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్! ఆసియా కప్ రద్దు? పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!? pic.twitter.com/iAB4MTdg4p — CricDekho (@Hanji_CricDekho) April 30, 2023 𝙎𝙈𝙊𝙊𝙏𝙃 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧 😎@imjadeja & @msdhoni combine to get Prabhsimran Singh OUT! Follow the match ▶️ https://t.co/FS5brqfoVq#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/1qS9t5DJ8k — IndianPremierLeague (@IPL) April 30, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SL Vs Ban: ఆ అవసరం లేదు.. బంగ్లాదేశ్ డైరెక్టర్‌కు దిమ్మతిరిగే కౌంటర్!
Asia Cup 2022- Sri Lanka vs Bangladesh: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు డైరెక్టర్ ఖలీద్ మహమూద్‌కు శ్రీలంక యువ స్పిన్నర్ మహీశ్ తీక్షణ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. 11 మంది అన్నదమ్ములు జట్టులో ఉన్నపుడు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అక్కర్లేదంటూ ఖలీద్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా గ్రూప్- బిలో ఉన్న శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య గురువారం కీలక మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. సూపర్-4కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లంక.. బంగ్లాదేశ్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో దసున్ షనక బృందం టోర్నీలో మరో ముందడుగు వేయగా.. బంగ్లాదేశ్ ఇంటిబాట పట్టింది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక కెప్టెన్ దసున్ షనక.. బంగ్లాదేశ్‌పై సులువుగానే విజయం సాధిస్తామంటూ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌కు ముందు మాటల యుద్ధం బంగ్లాదేశ్ పసికూన అన్న ఉద్దేశంలో.. వాళ్ల జట్టులో కేవలం ఇద్దరే ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నాడని వ్యాఖ్యానించాడు. బంగ్లా కంటే అఫ్గనిస్తాన్ బలమైన జట్టుగా కనిపిస్తోందని లంక కెప్టెన్ పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన.. బంగ్లాదేశ్ డైరెక్టర్ ఖలీద్.. ‘‘దసున్ మమ్మల్ని ఎందుకు అంత తేలికగా తీసిపారేసాడో అర్థం కావడం లేదు. అఫ్గనిస్తాన్ టీ20 జట్టు గొప్పగా ఉండొచ్చు. అందుకే అలా అన్నాడేమో! అయితే, మాకు కనీసం ఇద్దరైనా ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారు. కానీ శ్రీలంక జట్టులో ఒక్క వరల్డ్‌క్లాస్ బౌలర్ కూడా లేడు కదా’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో స్వీయ తప్పిదాలతో బంగ్లాదేశ్ భారీ మూల్యం చెల్లించగా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లంక జయకేతనం ఎగురవేసింది. ట్వీట్‌తో తాజాగా యువ బౌలర్! ఈ నేపథ్యంలో మహీశ్ తీక్షణ ట్విటర్ వేదికగా ఈ మేరకు ఖలీద్‌కు రీకౌంటర్ వేశాడు. మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుదలతో సమిష్టిగా రాణిస్తే సరిపోతుందని, తమ సహోదరులతో కలిసి ఈ లాంఛనం పూర్తిచేశామన్న ఉద్దేశంలో 22 ఏళ్ల మహీశ్ ట్వీట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో మహీశ్ తీక్షణ 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రూపంలో కీలక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: SL Vs Ban: టోర్నీ నుంచి అవుట్! మా ఓటమికి ప్రధాన కారణం అదే: షకీబ్ అల్ హసన్ T20 WC 2022- England Squad: ప్రపంచకప్ టోర్నీకి జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. అతడికి మొండిచేయి! No need to have world class players, when you have 11 brothers ❤️ pic.twitter.com/H0rYESlF6i — Maheesh Theekshana (@maheesht61) September 2, 2022 -
అప్పుడూ.. ఇప్పుడూ ధోని మాస్టర్ ప్లాన్‌కు చిత్తు.. ఇగో వదిలెయ్!
IPL 2022 CSK Vs MI- MS Dhoni- Kieron Pollard: ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. నాకు తిరుగులేదు అన్న అహంభావంతోనే చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో వికెట్ కోల్పోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని సూచించాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి ధోని ఫోర్ బాదడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై వరుసగా ఏడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(0), ఇషాన్ కిషన్(0) పూర్తిగా విఫలం కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(51) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో 9 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 14 పరుగులు సాధించిన పొలార్డ్ భారీ స్కోరు చేసేలా కనిపించాడు. అయితే, ప్రమాదకరంగా పరిణమిస్తున్న పొలార్డ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు చెన్నై మాజీ కెప్టెన్ ధోని ఫీల్డ్ సెట్ చేశాడు. తలైవా మాస్టర్ ప్లాన్‌లో చిక్కుకున్న ఈ భారీ హిట్టర్ మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మహీశ్ సంధించిన క్యారమ్ బాల్‌ను తేలికగా తీసుకుని డీప్‌లో ఉన్న దూబేకు దొరికిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ధోనికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇగోకు పోయి బొక్కబోర్లా పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘స్ట్రెయిట్ షాట్లు ఆడటమే పొలార్డ్ బలం. అందుకే అక్కడ వాళ్లు(సీఎస్కే) ఫీల్డర్‌ను పెట్టారు. కాబట్టి పొలార్డ్ కాస్త ఆచితూచి ఆడాల్సింది. కానీ అతడు అప్పుడు కూడా స్ట్రెయిట్ షాట్ ఆడేందుకే మొగ్గు చూపాడు. మూల్యం చెల్లించాడు. మంచి ఇన్నింగ్స్ ఆడుతూ.. మ్యాచ్‌లు గెలిపిస్తూ కీలక ప్లేయర్‌గా అవతరించిన తర్వాత.. ‘‘మీరు నాకోసం వల పన్నారు కదా! చూడండి నా బలమేమిటో చూపిస్తా’’ అన్నట్లుగా పొలార్డ్ వ్యవహరించాడు. ఫలితంగా వికెట్ సమర్పించుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. 12 ఏళ్ల క్రితం ఇదే తరహాలో ఐపీఎల్-2010 ఫైనల్లో సీఎస్కేతో మ్యాచ్‌లో పొలార్డ్ అవుటైన సంగతి తెలిసిందే. ఆల్బీ మోర్కెల్‌కు బంతిని ఇచ్చిన ధోని మిడాఫ్‌లో మాథ్యూ హెడెన్ ఫీల్డర్‌గా పెట్టగా.. పొలార్డ్ అతడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ముంబైపై 22 పరుగుల తేడాతో గెలుపొందిన ధోని సేన టైటిల్ ఎగురేసుకుపోయింది. చదవండి👉🏾: MS Dhoni IPL Record: ఐపీఎల్లో ధోని అరుదైన రికార్డు.. రైనా, డివిల్లియర్స్‌ను వెనక్కి నెట్టి.. Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్‌తో రెండో టీ20.. శ్రీలంకకు భారీ షాక్!
టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన శ్రీలంకకు మరో ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ మహేశ్ తీక్షణ గాయం కారణంగా మిగితా రెండు టీ20లకు దూరమయ్యాడు. అదే విధంగా భారత్‌తో సిరీస్‌కు శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కరోనా బారిన పడి దూరమైన సంగతి తెలిసిందే.కాగా భారత్-శ్రీలంక రెండో టీ20 ధర్మశాల వేదికగా ఫిబ్రవరి 26న జరగనుంది.ఇక ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్ అందుబాటుపై కూడా సందేహం నెలకొంది. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టులో సభ్యులుగా ఉన్న నిరోషన్ డిక్వెల్లా , ధనంజయ డిసిల్వా చివరి రెండు మ్యాచ్‌ల కోసం టీ20 జట్టులో చేర్చబడ్డారు. ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. శ్రీలంకపై టీమిండియా 62 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఇషాన్ కిషన్(89), శ్రేయస్ అయ్యర్(57) సునామీ ఇన్నింగ్స్‌లు ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు సాధించింది. 200 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. చదవండి: IND vs SL: ''కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు'' -
IPL 2022: ధోని జట్టుపై గరం అవుతున్న సొంత అభిమానులు.. కారణం ఇదేనా..?
ఐపీఎల్ మెగా వేలం 2022లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహీశ్ తీక్షణను 70 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లంక క్రికెటర్ ఎంపిక ప్రస్తుతం సీఎస్కే యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమితంగా ఆరాధించే సొంత అభిమానుల చేతనే చివాట్లు తినే స్థాయికి సీఎస్కేను దిగజార్చింది. కొందరు తమిళ తంబిలైతే ఏకంగా సీఎస్కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్విటర్లో #Boycott_ChennaiSuperKings పేరిట వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. #Boycott_ChennaiSuperKings pic.twitter.com/KkHw7T9OUb — மேட்டூர் தினேஷ் (@NTK_DINESH) February 14, 2022 తమిళులకు తీరని అన్యాయం చేసిన లంకేయులను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని వారు మండిపడుతున్నారు. లక్షల సంఖ్యలో భారతీయ తమిళులను శరణార్ధులుగా పంపిన దేశానికి చెందిన ఆటగాడిని తమిళ జట్టులోకి ఎలా తీసుకుంటారని సీఎస్కే యాజయాన్యంపై ఫైరవుతున్నారు. లంక క్రికెటర్ తీక్షణను వెంటనే జట్టులో నుంచి తొలగించాలని లేదంటే సీఎస్కేను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. సీఎస్కేకు మరపురాని విజయాలందించిన సురేశ్ రైనా లాంటి ఆటగాడిని కాదని సింహల ఆటగాడిని ఎంపిక చేయడమేంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తీక్షణను వెంటనే తొలగించి సురేశ్ రైనాను జట్టులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. #Boycott_ChennaiSuperKings pic.twitter.com/LGS61z4s74 — Narasimha Midde (@narasimhamvnr) February 14, 2022 చదవండి: IPL 2022: సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..! -
T20 World Cup Aus Vs SL: గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు
ఆస్ట్రేలియా జోరు పెంచింది... పొట్టి ప్రపంచకప్‌లో తన స్థాయికి తగిన ప్రదర్శనతో గ్రూప్–1లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. కంగారూ ఓపెనర్లు ఫించ్, వార్నర్ లక్ష్యఛేదనలో చెలరేగిపోగా, అంతకంటే ముందు ఆడమ్ జంపా తన స్పిన్‌తో లంకను కట్టేశాడు. దీంతో ఆసీస్ అలవోక విజయంతో సెమీస్ బాటలో పడింది. T20 World Cup 2021: Australia Beat Sri Lanka By 7 Wickets: ఆస్ట్రేలియా ఇన్నేళ్లుగా తమకు అందని టి20 ప్రపంచకప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. తమ లక్ష్యాన్ని వరుస విజయాలతో ఘనంగా చాటి చెబుతోంది. దుబాయ్‌లో గురువారం జరిగిన గ్రూప్–1 లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై అలవోక విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), చరిత్ అసలంక (27 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ఆస్ట్రేలియా స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (2/12) పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. తర్వాత ఆసీస్ 17 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వార్నర్ (42 బంతుల్లో 65; 10 ఫోర్లు) చెలరేగారు. రాణించిన కుశాల్, అసలంక టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్ నిసంక (7) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వన్‌డౌన్‌లో వచి్చన అసలంకతో కలిసి ఓపెనర్ కుశాల్ పెరీరా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరు కూడా బౌండరీలతో ధాటిగా ఆడారు. దీంతో లంక 5.4 ఓవర్లో 50 పరుగులు చేసింది. అయితే పదో ఓవర్లో ఎట్టకేలకు జంపా... అసలంక ఆట కట్టించాడు. దీంతో 63 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత స్వల్ప వ్యవధిలో స్టార్క్... పెరిరా, హసరంగ (4)లను పెవిలియన్ చేర్చగా, అవిష్క ఫెర్నాండో (4)ను జంపా బోల్తా కొట్టించాడు. రాజపక్స (26 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అడపాదడపా బౌండరీలు బాదడంతో లంక స్కోరు 150 దాటింది. మెరిపించిన ఫించ్ ఆసీస్ లక్ష్యాన్ని వేగంగా ఛేదించే పనిలో పడింది. కెప్టెన్ ఫించ్ తొలి ఓవర్లో 2 బౌండరీలు బాదాడు. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఫించ్, వార్నర్ ఎదురుదాడికి దిగారు. ఫించ్ ఫోర్, సిక్స్ కొట్టగా, వార్నర్ 2 ఫోర్లు బాదాడు. ఈ ఒక్క ఓవర్లోనే 20 పరుగులు వచ్చాయి. ఫించ్ క్రీజులో ఉన్నంతసేపూ ధనాధన్ కొనసాగించడంతో కంగారూ పది పైచిలుకు రన్‌రేట్‌తో దూసుకుపోయింది. 4.2 ఓవర్లోనే జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. చమీర వేసిన ఈ ఓవర్లో (5వ) వార్నర్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కీపర్ కుశాల్ పెరీరా నేలపాలు చేశాడు. వార్నర్ ఫిఫ్టీ లైఫ్ దొరికిన తర్వాత వార్నర్ బాధ్యతగా ఆడాడు. బౌండరీలతో వేగం పెంచాడు. ఏడో ఓవర్లో ఫించ్ దూకుడుకు హసరంగ కళ్లెం వేశాడు. 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని ముగించిన ఈ స్పిన్నర్ తన మరుసటి ఓవర్లో డాషింగ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ (5)ను బోల్తా కొట్టించాడు. కానీ వార్నర్ క్రీజులో పాతుకుపోవడం, స్మిత్ నిలకడగా ఆడటంతో లంకకు పట్టు బిగించే అవకాశమే చిక్కలేదు. 11వ ఓవర్లో ఆస్ట్రేలియా వంద పరుగులను అధిగమించింది. తర్వాత ఓవర్లోనే వార్నర్ 31 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీ కూడా పూర్తయ్యింది. ఈ ఓపెనర్ చూడచక్కని ఫోర్లతో ఆసీస్ లక్ష్యంవైపుగా దూసుకెళ్లింది. ఇదే ఉత్సాహంతో షనక బౌలింగ్‌లో భారీ సిక్సర్‌కు ప్రయతి్నంచిన వార్నర్ లాం గాఫ్లో రాజపక్సకు చిక్కా డు. 130 స్కోరు వద్ద నిష్క్రమించాడు. అప్పటికే ఆసీస్ లక్ష్యానికి చేరువైంది. 30 బంతుల్లో 25 పరుగుల లాంఛనాన్ని స్టీవ్ స్మిత్ (26 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్), స్టొయినిస్ (7 బంతు ల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేశారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసంక (సి) వార్నర్ (బి) కమిన్స్ 7; కుశాల్ పెరీరా (బి) స్టార్క్ 35; అసలంక (సి) స్మిత్ (బి) జంపా 35; అవిష్క ఫెర్నాండో (సి) స్మిత్ (బి) జంపా 4; రాజపక్స (నాటౌట్) 33; హసరంగ (సి) వేడ్ (బి) స్టార్క్ 4; షనక (సి) వేడ్ (బి) కమిన్స్ 12; కరుణరత్నే (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–15, 2–78, 3–86, 4–90, 5–94, 6–134. బౌలింగ్: స్టార్క్ 4–0–27–2, హాజల్‌వుడ్ 4–0–26–0, కమిన్స్ 4–0–34–2, మ్యాక్స్‌వెల్ 1–0–16–0, స్టొయినిస్ 3–0–35–0, జంపా 4–0–12–2. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాజపక్స (బి) షనక 65; ఫించ్ (బి) హసరంగ 37; మ్యాక్స్‌వెల్ (సి) ఫెర్నాండో (బి) హసరంగ 5; స్మిత్ (నాటౌట్) 28; స్టొయినిస్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–70, 2–80, 3–130. బౌలింగ్: కరుణరత్నే 2–0–19–0, తీక్షణ 4–0–27–0, చమీర 3–0–33–0, లహిరు కుమార 3–0–48–0, హసరంగ 4–0–22–2, షనక 1–0–6–1. చదవండి: David Warner: టి20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున తొలి బ్యాటర్‌గా -
T20 World Cup 2021 SL Vs IRE: 70 పరుగుల తేడాతో విజయం... సూపర్-12కు అర్హత
T20 World Cup 2021 SL Vs IRE: మాజీ చాంపియన్ శ్రీలంక టి20 ప్రపంచకప్‌లో తొలి దశను విజయవంతంగా దాటింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించి సూపర్–12 దశకు అర్హత పొందింది. ముందుగా శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. హసరంగ (47 బంతుల్లో 71; 10 ఫోర్లు, 1 సిక్స్), నిసాంకా (47 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. ఐర్లాండ్ బౌలర్లలో జోష్ లిటిల్ 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఐర్లాండ్ 18.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఆండీ బల్బర్నీ (39 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మహీశ్ తీక్షణ (3/17) కీలక వికెట్లతో ఐర్లాండ్‌ను దెబ్బ తీయగా, 16 పరుగుల వ్యవధిలోనే ఐర్లాండ్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. Sri Lanka have qualified for the Super 12 🔥 Which other side will join them from Group A? 🤔#T20WorldCup pic.twitter.com/3JVAElBxXP — T20 World Cup (@T20WorldCup) October 20, 2021 -
'వరల్డ్‌కప్ ఉంది.. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడడం ఆపండి'
కొలంబొ: క్రికెట్లో మిస్టరీ స్పిన్నర్ అనే పదం చాలాసార్లు వింటుంటాం. ఒక స్పిన్ బౌలర్ బంతిని వేర్వేరు తన చేతితో వివిధ యాంగిల్స్‌లో విడుదల చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కన్ఫ్యూజ్ చేయడమే వీరి పని.. అందుకే ఇలాంటి వారిని మిస్టరీ స్పిన్నర్స్ అంటారు. అజంతా మెండిస్, సునీల్ నరైన్, సయీద్ అజ్మల్.. తాజగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్లుగా గుర్తింపు పొందారు. అన్‌ఆర్థడాక్స్ బౌలింగ్ వేరియేషన్‌తో క్యారమ్ బాల్, ఆఫ్ బ్రేక్ బంతులను వేస్తూ బ్యాట్స్మన్లను ముప్పతిప్పలు పెడుతుంటారు. మెండిస్(శ్రీలంక), నరైన్(వెస్టిండీస్) లాంటి ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో రెండు మూడేళ్ల పాటు వారి జట్టులో కీలకపాత్ర పోషించారు. తాజాగా మెండిస్ తరహాలోనే శ్రీలంకకు మరో మిస్టరీ స్పిన్నర్ పుట్టుకొచ్చాడు. అతనే మహీష్ తీక్షణ. చదవండి: బీసీసీఐదే తప్పు.. ధోనిని మెంటార్ చేయడం నిరాశపరిచింది దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే ద్వారా శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన తీక్షణ తన మిస్టరీ బౌలింగ్‌తో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో ఎక్కువగా క్యారమ్ బాల్స్, ఆఫ్ బ్రేక్ బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన తీక్షణ ఫలితాన్ని రాబట్టాడు. ఈ నేపథ్యంలో తీక్షణ బౌలింగ్ వేరియేషన్స్‌పై ఇంప్రెస్ అయిన ఒక అభిమాని అతని బౌలింగ్ యాక్షన్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ''తీక్షణ బౌలింగ్ చూస్తుంటే అతని చేతిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక క్యారమ్ బాల్ వేయడానికి మణికట్టును విభిన్న శైలిలో చూపించాడు. మన కాళ్లను ఎలా షేక్ చేస్తామో.. తీక్షణ తన చేతులను అలా చేస్తున్నాడు. అతని బౌలింగ్‌కు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడడం ఖాయం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన శ్రీలంక ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ అభిమానికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ''నీ అనాలిసిస్‌కు కృతజ్ఞతలు.. ముందు మాకు వరల్డ్ కప్ ఉంది.. దయచేసి ప్రతీ విషయాన్ని భూతద్ధంలో చూడడం ఆపండి'' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: SL Vs SA: త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మహీష్ తీక్షణ శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. అయితే లంక మొదట క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17న నుంచి ఒమన్ వేదికగా జరగనున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో పాల్గొననుంది.