మిస్టర్ కూల్‌కు కోపం తెప్పించిన బౌలర్ (PC: IPL/Twitter)
IPL 2023 CSK Vs PBKS- MS Dhoni Loses Cool: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీలంక బౌలర్లు మహీశ్ తీక్షణ, మతీష పతిరణ. ఐపీఎల్-2023లో సీఎస్‌కే ఇప్పటి వరకు ఆడిన దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ తుది జట్టులో వీరు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తూ.. ముందుకు సాగుతున్నారు.
మిస్టర్ కూల్‌కు కోపం ఎందుకొచ్చింది?
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తీక్షణ, పతిరణ ఐదేసి వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. ధోని కూడా వీరికి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో తీక్షణ చేసిన తప్పు మిస్టర్ కూల్ ధోనికి కూడా కోపం తెప్పించింది.
నరాలు తెగే ఉత్కంఠ
చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్‌కే ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోని సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఎట్టకేలకు విజయం సాధించింది. పతిరణ వేసిన చివరి ఓవర్లో ఆఖరి బంతికి పంజాబ్ బ్యాటర్లు సికిందర్ రజా, షారుక్ ఖాన్ మూడు పరుగులు పూర్తి చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.
చెత్త ఫీల్డింగ్
కాగా తీక్షణపై ధోని ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. పంజాబ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్లో బంతిని ధోని.. తుషార్ దేశ్‌పాండేకు అందించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ మొదటి రెండు బంతుల్లో సిక్సర్లు బాదాడు.
ఆ తర్వాత షార్ట్ బాల్‌ను సంధించాడు ఫాస్ట్‌బౌలర్ తుషార్. దానిని పుల్‌షాట్ ఆడబోయిన లివింగ్‌స్టోన్ లెక్క తప్పడంతో బంతి బౌండరీ దిశగా పయనించింది. ఈ క్రమంలో థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న తీక్షణ బంతిని తప్పుగా అంచనా వేశాడు.
బాల్ మిస్ చేశాడు.. ఏకంగా 4 పరుగులు
క్యాచ్ అందుకోవడానికి విఫలయత్నం చేశాడు. అనవసరంగా ముందుకు డైవ్ చేసి బాల్‌ను మిస్ చేశాడు. బంతి బౌండరీని తాకడంతో పంజాబ్‌కు నాలుగు పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన ధోని.. మిస్ ఫీల్డింగ్ చేసిన మహీశ్ తీక్షణపై ఫైర్ అయ్యాడు.
జట్టు నుంచి తీసిపారేయండి
అసలేం ఏం చేస్తున్నావో అర్థం అవుతోందా? అన్నట్లు సీరియస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. డగౌట్‌లో ఉన్న కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం తీక్షణ చేసిన పనికి గుస్సా అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు.. ‘‘నీకసలు బుద్ధుందా? బౌలింగ్ అంతంత మాత్రమే. చెత్త ఫీల్డింగ్. జట్టులో నుంచి తీసిపారేయండి’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మహీశ్ తీక్షణ 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 36 పరుగులు సమర్పించుకున్నాడు.
చదవండి: MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్!
ఆసియా కప్ రద్దు? పాక్‌కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!?
— CricDekho (@Hanji_CricDekho) April 30, 2023
𝙎𝙈𝙊𝙊𝙏𝙃 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧 😎@imjadeja & @msdhoni combine to get Prabhsimran Singh OUT!
— IndianPremierLeague (@IPL) April 30, 2023
Follow the match ▶️ https://t.co/FS5brqfoVq#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/1qS9t5DJ8k
Comments
Please login to add a commentAdd a comment