సీఎస్‌కేను ఐదోసారి చాంపియన్‌గా నిలిపిన ధోని
ప్రశ్న: ప్రతి ఏడాది జట్టును ప్లే ఆఫ్స్ వరకు ఎలా తీసుకురాగలుగుతున్నావు?
జవాబు: ఒకవేళ ఆ సీక్రెట్ ఏమిటో అందరి ముందు చెప్పేస్తే.. వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు!
ప్రశ్న: అవునూ.. చాలా మంది క్రికెటర్లు మీ సంతకంతో ఉన్న జెర్సీలు అడుగుతారెందుకో?
జవాబు: బహుశా.. నేను రిటైర్ అయి పోతున్నానని వాళ్లు అనుకుంటున్నారేమో! ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాను కదా! ఇక పొట్టి ఫార్మాట్‌కు కూడా గుడ్ బై చెప్తానని భావిస్తున్నట్లున్నారు.
ప్రశ్న: నీకు వయసు మీద పడిందనుకుంటున్నవా? ముసలోడివయ్యావా?
జవాబు: అంతేగా! నిజాన్ని ఒప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అసవరం లేదు.
ప్రశ్న: నిన్ను మళ్లీ యెల్లో జెర్సీలో చూడగలమా?
జవాబు: రిటైర్మెంట్ ప్రకటను ఇదే అత్యుత్తమ సమయం. అయితే.. మరో సీజన్ ఆడాలంటే 9 నెలల పాటు కఠినశ్రమకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. కనీసం మరొక్క ఎడిషన్ అయినా ఆడతాననే భావిస్తున్నా!
ఐపీఎల్-2023 సందర్భంగా కామెంటేటర్ హర్షా భోగ్లే- చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మధ్య జరిగిన సరదా సంభాషణలు ఇవి. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ ధోనికి చివరిదన్న వార్తల నేపథ్యంలో.. మిస్టర్ కూల్ ఆటను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మైదానాలకు తరలివచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధోని నామస్మరణతో అభిమానం చాటుకున్నారు.
ఇక గతేడాది పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ధోని సేన.. ఈసారి ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. పదోసారి ప్లే ఆఫ్స్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించిన చెన్నై.. ఫైనల్లో గుజరాత్‌ను ఓడించింది. వర్షం కారణంగా రిజర్వ్ డే జరిగిన మ్యాచ్‌లో డీఎల్‌ఎస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
తద్వారా ఐదోసారి విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. అదే విధంగా ధోని ఖాతాలో అత్యధిక సార్లు జట్టును గెలిపించిన నాయకుడిగా అరుదైన ఘనత వచ్చి చేరింది. ముంబై సారథి రోహిత్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన కెప్టెన్‌గా ధోని రికార్డు సాధించాడు.
చదవండి: ఇలా ఔటవ్వడం చూసుండరు.. శనిలా వెంటాడిన నాన్‌స్ట్రైక్ బ్యాటర్
"7 Best MS Dhoni-Harsha Bhogle Interactions"😂❤️
— 🏆×3 (@thegoat_msd_) June 21, 2023
(A Thread) pic.twitter.com/19yhD8p21Q
Comments
Please login to add a commentAdd a comment