Harsha Bhogle
-
బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. రోహిత్‌కు నో ఛాన్స్!?
ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. తను ఎంచుకున్న జట్టుకు కెప్టెన్‌గా భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్కే మాజీ సారధి ఎంఎస్ ధోనిని భోగ్లే ఎంపిక చేశాడు. అదే విధంగా తన జట్టు ఓపెనర్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్స్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లిలకు అవకాశమిచ్చాడు. ఐపీఎల్లో వీరిద్దరూ ఓపెనర్లుగా 28 ఇన్నింగ్స్‌లలో 1210 పరుగుల సాధించారు. నాలుగు సార్లు 50కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక మూడో స్ధానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు భోగ్లే చోటిచ్చాడు. ఐపీఎల్లో 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్ రైనానే. తన ఐపీఎల్ కెరీర్లో ఏకంగా 109 క్యాచ్‌లను రైనా అందుకున్నాడు. అతడిని అభిమానులు ముద్దగా చిన్న తలా పిలుచుకుంటున్నారు. ఇక నాలుగో స్ధానంలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భోగ్లే ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 2017 నుంచి ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్య.. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లను ఆడాడు.అదే విధంగా హర్ష తన జట్టుకు కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్‌గా ధోనినే ఎంచుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్, వికెట్ కీపర్లలో ఒకడిగా ధోని పేరు గాంచాడు. ఇక ఈ జట్టులో ఆల్‌రౌండర్‌గా భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు హర్షా అవకాశమిచ్చాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగా, టీమిండియా పేసర్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కింది. ఇక చివరగా స్పిన్నర్లగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్‌లకు ఛాన్స్ లభించింది. అయితే ఈ జట్టులో భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం గమనార్హం.హర్షా భోగ్లే ఐపీఎల్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేవిరాట్ కోహ్లి, క్రిస్ గేల్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోని (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్, సునీల్ నరైన్ -
అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్‌లకు నో ఛాన్స్
2023 ఏడాదిలో టీమిండియా టెస్టు క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన టీమిండియా.. ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అయితే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్లో మాత్రం ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. అదే విధంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసింది. అయినప్పటికీ సిరీస్‌ను కాపాడుకునే అవకాశం టీమిండియాకు ఉంది. కేప్‌టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. సిరీస్ 1-1తో సమవుతోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మరో రెండు రోజుల్లో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడనున్న నేపథ్యంలో ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023ను ప్రకటించాడు. భోగ్లే ఎంపిక చేసిన జట్టులో టీమిండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లే చోటు దక్కించుకున్నారు. ఓపెనర్లుగా ఆసీస్ స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖావాజా, ఇంగ్లండ్ ఆటగాడు జాక్ క్రాలీకి చోటు దక్కింది. మూడు, నాలుగు స్ధానాల్లో వరుసగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్, జోరూట్ అవకాశం కల్పించాడు. ఐదో స్ధానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు ప్లేస్ ఇచ్చాడు. వికెట్ కీపర్‌గా ఆశ్యర్యకరంగా న్యూజిలాండ్ ఆటగాడు టామ్ బ్లాండల్ను బోగ్లే ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ల కోటాలో టీమిండియా వెటరన్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవి అశ్విన్‌కు ఛాన్స్ లభించింది. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఆసీస్ స్పీడ్ స్టార్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్, ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు. అయితే ఈ జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మకి చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఏడాది టెస్టుల్లో విరాట్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 55.91 సగటుతో 671 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ 8 మ్యాచ్‌ల్లో41.92 సగటుతో 545 రన్స్ చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Ranji Trophy 2024: రంజీ ట్రోఫీకి జట్టు ప్రకటన.. మహ్మద్ షమీ తమ్ముడు ఎంట్రీ? -
టీమిండియాను అపహాస్యం చేసిన ఫ్యాన్.. దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా ఆట తీరును తక్కువ చేస్తూ మాట్లాడిన పాకిస్తాన్ అభిమానికి ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. సంకుచిత బుద్ధిని వదిలి ప్రపంచాన్ని చూస్తే.. ఎంతో అద్భుతంగా కనిపిస్తుందంటూ చురకలు అంటించాడు. పడిలేచిన కెరటంలా.. టెస్టు చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనతో టీమిండియా ట్రోఫీ గెలిచిన తీరును అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం తగదని హితవు పలికాడు. ఆస్ట్రేలియా పర్యటన 2020-21లో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన(షమీ రిటైర్డ్‌హర్ట్) భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫారూఖ్ ఖాన్ అనే పాక్ నెటిజన్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ‘‘మీకు ఏ రోజైనా చెత్తగా అనిపిస్తే.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఇలా ఘోరంగా ఓడిపోయిన వీడియోను చూడండి’’ అని భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కాడు. ఇందుకు బదులిచ్చిన హార్ష భోగ్లే.. ‘‘ఈ వీడియోను బయటకు తీసినందుకు నాకు సంతోషంగా ఉంది ఫారూఖ్. ఎందుకంటే ఎంతో పట్టుదలగా.. అద్భుతంగా పోరాడి టెస్టు చరిత్రలో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన చేసింది ఈ సిరీస్‌లోనే! అద్భుత నాయకత్వ ప్రతిభ, ఆటగాళ్ల పట్టుదల ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలమన్న నమ్మకం ఇచ్చింది ఇక్కడే! ఇలాంటి వాటిని గుర్తు చేసుకున్నపుడే సరికొత్త ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఎదుటి వ్యక్తుల కష్టాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావంటే అంతకంటే చిన్నబుద్ధి ఇంకోటి ఉండదు. కాస్త క్లాస్‌గా ఆలోచించు. అలా అయితే ఈ ప్రపంచం నీకు అద్భుతంగా కనిపిస్తుంది’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇతరులు కష్టాల్లో ఉంటే ఎంజాయ్ చేయాలని చెప్పడం చీప్ మెంటాలిటీ అనిపించుకుంటుందని ఘాటుగా బదులిచ్చాడు హర్షా భోగ్లే. కాగా నాటి సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. మూడో టెస్టును డ్రా చేసుకుని.. నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి తొలిసారి ఆసీస్ గడ్డపై ట్రోఫీ గెలిచింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్షా భోగ్లే ఫారుఖ్‌కు కౌంటర్ వేశాడు. కాగా ఫారుఖ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కువగా టీమిండియాను అపహాస్యం చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. I am glad you put this out Farooq because it led to one of the greatest performances in Test history. This is a case study on how you convert adversity into match winning performances through great courage, outstanding leadership and self-belief. When you have that pride, you… https://t.co/qXLZTccyjI — Harsha Bhogle (@bhogleharsha) December 6, 2023 -
తిలక్ హాఫ్ సెంచరీని అడ్డుకున్న హార్ధిక్.. కొట్టిపారేసిన హర్షా, ఏకీభవించిన ఏబీడీ
విండీస్‌తో మూడో టీ20లో టీమిండియా యంగ్ గన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ (49 నాటౌట్) చేయకుండా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అడ్డుకున్నాడని (తిలక్ హాఫ్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు) సోషల్‌మీడియాలో పెద్ద రాద్దాంతం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హార్దిక్‌ను తప్పుబడుతూ చాలామంది అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు భారత మాజీలు సైతం ఈ విషయంలో అభిమానులతో ఏకీభవించారు. AB de Villiers concurs with Harsha Bhogle's perspective on Tilak Varma falling short of his half-century in the third T20I. pic.twitter.com/gGNuKR2DNI — CricTracker (@Cricketracker) August 10, 2023 తాజాగా ఇదే విషయంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా స్పందించాడు. తిలక్ విషయంలో ఫ్యాన్స్ అభిప్రాయాన్ని అతను కొట్టిపారేశాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్ కాదని అన్నాడు. ఈ విషయంపై ఇంత పెద్ద చర్చ అనవసరమని అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో సెంచరీ మినహా ఏదీ ల్యాండ్ మార్క్ కాదని తెలిపాడు. అసలు క్రికెట్ లాంటి టీమ్ గేమ్‌లో ల్యాండ్ మార్క్‌ల వ్యామోహం ఉండకూడదని అన్నాడు. టీ20ల్లో హాఫ్ సెంచరీలు పరిగణలోకి తీసుకోవాలని అనుకోనని తెలిపాడు. ఈ ఫార్మాట్లో ఎంత వేగంగా పరుగులు చేశామనేది ముఖ్యమని పేర్కొన్నాడు. తిలక్ హాఫ్ సెంచరీ మిస్ అయిన విషయంలో హర్షా అభిప్రాయంతో దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఏకీభవించాడు. థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. థ్యాంక్యూ. అంతిమంగా ఒకరు నోరు విప్పారు అంటూ హర్షాను సమర్ధిస్తూ ట్వీట్ చేశాడు. -
అలా అయితే వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు.. అయినా సిగ్గెందుకు?: ధోని
ప్రశ్న: ప్రతి ఏడాది జట్టును ప్లే ఆఫ్స్ వరకు ఎలా తీసుకురాగలుగుతున్నావు? జవాబు: ఒకవేళ ఆ సీక్రెట్ ఏమిటో అందరి ముందు చెప్పేస్తే.. వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు! ప్రశ్న: అవునూ.. చాలా మంది క్రికెటర్లు మీ సంతకంతో ఉన్న జెర్సీలు అడుగుతారెందుకో? జవాబు: బహుశా.. నేను రిటైర్ అయి పోతున్నానని వాళ్లు అనుకుంటున్నారేమో! ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాను కదా! ఇక పొట్టి ఫార్మాట్‌కు కూడా గుడ్ బై చెప్తానని భావిస్తున్నట్లున్నారు. ప్రశ్న: నీకు వయసు మీద పడిందనుకుంటున్నవా? ముసలోడివయ్యావా? జవాబు: అంతేగా! నిజాన్ని ఒప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన అసవరం లేదు. ప్రశ్న: నిన్ను మళ్లీ యెల్లో జెర్సీలో చూడగలమా? జవాబు: రిటైర్మెంట్ ప్రకటను ఇదే అత్యుత్తమ సమయం. అయితే.. మరో సీజన్ ఆడాలంటే 9 నెలల పాటు కఠినశ్రమకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. కనీసం మరొక్క ఎడిషన్ అయినా ఆడతాననే భావిస్తున్నా! ఐపీఎల్-2023 సందర్భంగా కామెంటేటర్ హర్షా భోగ్లే- చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మధ్య జరిగిన సరదా సంభాషణలు ఇవి. ఇందుకు సంబంధించిన వీడియోలు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా క్యాష్ రిచ్ లీగ్ పదహారో ఎడిషన్ ధోనికి చివరిదన్న వార్తల నేపథ్యంలో.. మిస్టర్ కూల్ ఆటను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున మైదానాలకు తరలివచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధోని నామస్మరణతో అభిమానం చాటుకున్నారు. ఇక గతేడాది పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ధోని సేన.. ఈసారి ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. పదోసారి ప్లే ఆఫ్స్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించిన చెన్నై.. ఫైనల్లో గుజరాత్‌ను ఓడించింది. వర్షం కారణంగా రిజర్వ్ డే జరిగిన మ్యాచ్‌లో డీఎల్ఎస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా ఐదోసారి విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. అదే విధంగా ధోని ఖాతాలో అత్యధిక సార్లు జట్టును గెలిపించిన నాయకుడిగా అరుదైన ఘనత వచ్చి చేరింది. ముంబై సారథి రోహిత్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన కెప్టెన్‌గా ధోని రికార్డు సాధించాడు. చదవండి: ఇలా ఔటవ్వడం చూసుండరు.. శనిలా వెంటాడిన నాన్‌స్ట్రైక్ బ్యాటర్ "7 Best MS Dhoni-Harsha Bhogle Interactions"😂❤️ (A Thread) pic.twitter.com/19yhD8p21Q — 🏆×3 (@thegoat_msd_) June 21, 2023 -
టీమిండియా బౌలింగ్ క్యాంప్‌లో జేమ్స్ అండర్సన్!
హైదరాబాదీ కామెంటేటర్ హర్షాబోగ్లే క్రికెటర్లతో సమానంగా పాపులారిటీ సంపాదించిన వారిలో ముందు వరుసలో ఉంటాడు. తన వ్యాఖ్యానంతో ఆకట్టుకునే బోగ్లేకు బయట చాలా మంది అభిమానులున్నారు. తాజాగా ఓవల్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా 61 ఏళ్ల హర్షా బోగ్లే జేమ్స్ అండర్సన్ విషయంలో కన్ఫూజన్‌కు గురయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా బౌలింగ్ క్యాంప్‌లో జేమ్స్ అండర్సన్ ప్రత్యక్షమయ్యాడంటూ పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్లకు బౌలింగ్‌లో టిప్స్ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ రియాలిటీలో అతను జేమ్స్ అండర్సన్ కాదు.. సోహమ్ దేశాయ్. ప్రస్తుతం టీమిండియాకు స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సైడ్ యాంగిల్లో సోహమ్ దేశాయ్ అచ్చం జేమ్స్ అండర్సన్‌ను తలపించాడు. అందుకే బోగ్లే అదేంటి అండర్సన్.. టీమిండియా క్యాంప్‌లో ఏం చేస్తున్నాడని కన్ఫూజన్‌కు గురయ్యాడు. అయితే కాసేపటి తర్వాత అసలు విషయం తెలియడంతో నాలుక చరుచుకున్న హర్షా బోగ్లే నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. HAHAHAHAHA! Poor Harsha Bhogle really believed Soham Desai to be Jimmy Anderson pola. Tells on air that Anderson came to help out the Indian team before the final 😂 pic.twitter.com/LuMvln3hTF — Mama | 360° Entertainment (@SriniMaama16) June 7, 2023 చదవండి: 'పదేళ్లుగా మేజర్ టైటిల్ లేదు.. ఇంత బద్దకం అవసరమా?' -
మా వాళ్లకు చుక్కలు చూపిస్తా.. విసిగిస్తా! పాపం వాళ్ల పరిస్థితి చూస్తే: ధోని
IPL 2023- CSK In Final- MS Dhoni: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడే అవకాశం వస్తే బాగుండని ప్రతి యువ క్రికెటర్ కోరుకుంటాడనంలో అతిశయోక్తి లేదు. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను బోల్తా కొట్టించే ధోని.. తన జట్టులోని ప్రతి ఆటగాడితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేశ్ రైనా వంటి భారత ఆటగాళ్లే కాదు ఐపీఎల్లో భాగంగా తలా కెప్టెన్సీలో ఆడిన కెవిన్ పీటర్సన్ వంటి విదేశీ ప్లేయర్లు సైతం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తా ధోని మైదానంలో ఉన్నాడంటే ఇటు అభిమానులకు.. అటు ఆటగాళ్లకు మజా వస్తుందంతే! అయితే, తాను కనిపించేంత మిస్టర్ కూల్ కాదని.. ప్లేయర్లకు చుక్కలు చూపిస్తానంటున్నాడు ధోని. ఆటగాళ్లకు పదే పదే ఆదేశాలు ఇస్తూ వాళ్లను విసిగిస్తానని సరదాగా వ్యాఖ్యానించాడు. పదోసారి ఫైనల్‌కు ఐపీఎల్-2023 తొలి క్వాలిఫయర్‌లో జయభేరి మోగించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. డిఫెండింగ్ చాంపియన్‌ను చిత్తు చేసి తద్వారా ఐపీఎల్లో పదోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఇక ఇప్పటికే సీఎస్కేను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపి విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందిన ధోని.. ఈసారి కూడా టైటిల్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేతో సంభాషణ సందర్భంగా ధోని చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. అలా ఎలా ధోని? హర్షా భోగ్లే మాట్లాడుతూ.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే పట్టిన సంచలన క్యాచ్‌ల గురించి ప్రస్తావిస్తూ ఫీల్డ్ అంత బాగా ఎలా సెట్ చేయగలరంటూ ధోనిని అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘వికెట్, పరిస్థితులకు అనుగుణంగా ఫీల్డ్ సెట్ చేస్తూ ఉంటా. నిజానికి మా వాళ్లను బాగా విసిగిస్తా. ప్రతిసారి ఫీల్డర్‌ను ఒకచోటి నుంచి మరో చోటికి మారుస్తూనే ఉంటా. పాపం వాళ్ల పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి కాబట్టి ఫీల్డర్ ప్రతిసారి నాపై ఓ కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి. ప్రతి రెండు మూడు బంతులకు ఓసారి.. ‘‘నువ్వు రెండు ఫీట్లు అటు జరుగు.. ఓ రెండు ఫీట్లు ఇటు జరుగు’’ అని ఫీల్డర్‌కు చెబుతూ ఉంటే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి! విసుగురావడం సహజం కదా! నాపై ఓ కన్నేసి ఉంచండి.. సరేనా అయితే, నేను మాత్రం వికెట్, లైన్‌కు అనుగుణంగా నా మనసు చెప్పినదాని బట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడను. అందుకు తగ్గ ప్రతిఫలం కచ్చితంగా లభిస్తుంది. ఈ సందర్భంగా మా ఫీల్డర్లకు ఓ విజ్ఞప్తి. మీరు ఎల్లప్పుడూ నాపై ఓ కన్నేసే ఉంచండి. మీరు క్యాచ్ డ్రాప్ చేస్తే నా రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడటానికి మాత్రం కాదు. ఫీల్డ్ సెట్ చేసే అంశం గురించి మాత్రమే’’ అని ధోని వ్యాఖ్యానించాడు. కాగా ధోని మే 28 నాటి ఫైనల్లో క్వాలిఫయర్-2 విజేతతో ఫైనల్లో తలపడనుంది. ఇదిలా ఉంటే.. లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చదవండి: ఫైనల్‌కు ముందు సీఎస్కేకు బిగ్ షాక్.. ధోనిపై నిషేధం! ఏం జరగనుంది? గుజరాత్, లక్నో కాదు.. చెన్నైతో ఫైనల్లో ఆడేది ఆ జట్టే! Emotions in plenty 🤗 Moments of elation, pure joy and the feeling of making it to the Final of #TATAIPL 2023 💛 Watch it all here 🎥🔽 #GTvCSK | #Qualifier1 | @ChennaiIPL pic.twitter.com/4PLogH7fCg — IndianPremierLeague (@IPL) May 24, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సీఎస్కేను విడిచి వెళ్లను.. మరో 8,9 నెలల్లో నిర్ణయం తీసుకుంటా!'
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సీజన్ ధోనికి చివరిదని ఇంకా రూమర్లు వస్తూనే ఉన్నాయి. ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడో లేదో తెలీదు కానీ పదోసారి ఫైనల్లో అడుగుపెట్టిన సీఎస్కే ఎలాగైనా టైటిల్ కొట్టి ధోనికి గిఫ్ట్‌గా అందించాలని భావిస్తోంది. ఇక మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్షా బోగ్లే ధోని రిటైర్మెంట్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్న వేశాడు. చెన్నై వేదికగా ఈ సీజన్లో ధోని ఫైనల్ మ్యాచ్(ఐపీఎల్ 2023 ఫైనల్) ఆడబోతున్నాడా అని అడిగాడు. దీనిపై ధోని స్పందిస్తూ.. ''ఏమో ఆడతానో లేదో తెలీదు.. దానికి మరో ఎనిమిది, తొమ్మిది నెలలు సమయం ఉంది. అప్పుడు ఆడాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటా. ఇప్పటినుంచే ఆ తలనొప్పి ఎందుకు? ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. సీఎస్కేతో ఉంటా.. జట్టును విడిచివెళ్లను.. అది ఆట రూపంలో కావొచ్చు. లేదా బయటినుంచి మద్దతు అవ్వొచ్చు'' అంటూ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ ప్రదర్శనపై మాట్లాడుతూ..''ఐపీఎల్ చాలా పెద్దది.. ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు 8 టాప్ టీంలు ఉండేవి.. ఇప్పుడు పది అయ్యాయి. అయితే ఇదొక ఫైనల్‌గా మాత్రమే తీసుకోము. ఎందుకంటే మేము ఫైనల్లో అడుగుపెట్టడం వెనుక రెండు నెలల కష్టం ఉంది. జట్టు మొత్తం కాంట్రిబ్యూషన్ ఉంది. అయితే మిడిలార్డర్ కాస్త బలపడాల్సి ఉంది. గుజరాత్టైటాన్స్ ఒక అద్బుత జట్టు.. చేజింగ్‌లో ఒక దశలో మమ్మల్ని భయపెట్టారు. జడ్డూ చక్కగా బౌలింగ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. కఠినంగా ఉన్న పిచ్‌లపై జడ్డూ బౌలింగ్ శైలి బాగుంటుంది. బౌలర్లందరిని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకోసం సపోర్ట్ స్టాప్, బ్రావో , ఎరిక్ లాంటి వ్యక్తులు ఉన్నారు. ఒక కెప్టెన్‌గా నా జట్టును గెలిపించుకోవడం నా బాధ్యత. అందుకోసం ఫీల్డర్లను అటు ఇటు మార్చడం నాకున్న అలవాటు. నేను ఫీల్డర్లకు ఎప్పుడు చెప్పేది ఒకటే.. నా దృష్టిని పరిశీలిస్తూ ఫీల్డింగ్ చేయండి. క్యాచ్‌లు మిస్ అయినా పర్లేదు.. పరుగులు రాకూడదు అనేది నా పాలసీ.. ఇక ఆదివారం వరకు ఎదురు చూడాలి.. ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ'' అంటూ ముగించాడు. చదవండి: ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా? -
బ్యాటర్‌గా విఫలం.. కొత్త అవతారం ఎత్తిన హ్యారీ బ్రూక్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ పరాజయాన్ని చవి చూసింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో హోంగ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 145 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. బ్యాటర్ల వైఫల్యంతో ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ ప్రదర్శన ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. స్పిన్నర్ల బలహీతనను అధిగమించలేక బ్రూక్ వికెట్ పారేసుకుంటున్నాడు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో అయితే 14 బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేసి నోర్ట్జే బౌలింగ్‌లో వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్న హ్యారీ బ్రూక్ ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా కాసేపు కెమెరామన్‌గా అలరించాడు. బ్రూక్ కెమెరామన్ పాత్రను పోషించడంపై కామెంటేటర్ హర్షా బోగ్లే స్పందించాడు. ''ఓ మ్యాన్.. ఇవాళ బ్రూక్ రూపంలో మనకు ఒక కొత్త కెమెరామన్ కనిపిస్తున్నాడు. టెలివిజన్ ప్రొడక్షన్ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కెమెరామన్‌గా బ్రూక్ చరిత్ర సృష్టించాడు'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా బ్రూక్‌ను వేలంలో ఎస్ఆర్హెచ్ రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. He'll whack it outta the park and show you how it sails through the air too - Harry Brook 😉#SRHvDC #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/ar6t314xu3 — JioCinema (@JioCinema) April 24, 2023 చదవండి: #JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్ అవతారం -
నువ్వేమీ ముసలోడివి కాలేదు!; సచిన్‌లా 16 ఏళ్లకే ఆట మొదలెడితే: ధోని
IPL 2023 CSK Vs SRH- Dhoni- Harsha Bhogle: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్‌ను ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టి కీలక వికెట్లో భాగస్వామ్యమయ్యాడు. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి కామెంటేటర్ హర్షా బోగ్లే ప్రస్తావించగా వికెట్ కీపర్ బ్యాటర్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్ సైతం ఇలాగే అలాంటి క్యాచ్‌లు అందుకోవడం అంత సులువేమీ కాదు కదా అని హర్ష పేర్కొనగా.. ‘‘నిజానికి అప్పుడు నేను సరైన పొజిషన్లో లేను. మేము గ్లౌవ్స్ వేసుకుంటాం కాబట్టి.. కొంతమందికి మేము తేలికగానే క్యాచ్ పట్టేస్తామని అనిపిస్తుంది. ఈ రోజు నేను అద్భుతమైన క్యాచ్ అందుకున్నాను. కొన్నిసార్లు మన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాలతో సంబంధం లేకుండా.. అనుకోకుండా ఇలా జరిగిపోతుంది. నాకింకా గుర్తే.. ఓ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ సైతం ఇలాంటి క్యాచ్‌నే అందుకున్నాడు’’ అని ధోని పేర్కొన్నాడు. నువ్వేమీ ముసలోడివి కాలేదు అదే విధంగా.. ‘‘వయసు పైబడుతున్న కొద్దీ.. అనుభవం కూడా పెరుగుతుంది. సచిన్ టెండుల్కర్లా 16-17 ఏళ్లకే క్రికెట్ ఆడటం మొదలుపెడితే విషయం వేరేలా ఉంటుంది. ఆటను మరింతగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది’’ అని ధోని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో హర్షా స్పందిస్తూ.. ‘‘నీకేమీ వయసు మీదపడలేదు(నువ్వేమీ ముసలోడికి కాలేదింకా)’’ అని సరదాగా కామెంట్ చేశాడు వయసు పైబడింది.. నేనేమీ సిగ్గుపడను దీంతో.. ‘‘లేదు లేదు! కచ్చితంగా నాకు వయసు పైబడుతోంది. ఈ విషయాన్ని చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గుపడను’’ అంటూ 41 ఏళ్ల ధోని అంతే ఫన్నీగా బదులిచ్చాడు. ఇక అద్భుతమైన క్యాచ్ పట్టినా తనకు అవార్డు ఇవ్వలేదంటూ ఐపీఎల్ నిర్వాహకులను ఉద్దేశించి ధోని సరదాగా కామెంట్ చేశాడు. రుతుకు అవార్డు.. నాకు మాత్రం ఇవ్వలేదు కాగా చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో రైజర్స్పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ధోని సంచలన క్యాచ్ అందుకోవడంతో పాటు.. మయాంక్ అగర్వాల్‌ను స్టంపౌట్, వాషింగ్టన్ సుందర్‌ను రనౌట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో యాక్టివ్ క్యాచ్ అవార్డును చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అందుకున్నాడు. తీక్షణ బౌలింగ్‌లో క్లాసెన్ ఇచ్చిన క్యాచ్ అద్భుత రీతిలో అందుకుని అవార్డు గెలుచుకున్నాడు. చదవండి: Dhoni: నాకూ కూతురు ఉంది.. మరి అక్క ఏది? తంబీ లేడా?.. తప్పు చేశావు కుట్టీ! CSK VS SRH: ఎట్టకేలకు 28 మ్యాచ్‌ల తర్వాత రిపీటైంది..! In his own style, @msdhoni describes yet another successful day behind the stumps 👏 And along with it, shares a special Rahul Dravid story and admiration for @sachin_rt 😃#TATAIPL | #CSKvSRH pic.twitter.com/4gL8zU9o9v — IndianPremierLeague (@IPL) April 21, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంజూపై ప్రశంసల వర్షం.. వైరల్ ట్వీట్! నాకే గనుక ఆ అవకాశం ఉంటే..
IPL 2023 GT Vs RR- Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవరేంటో మరోసారి నిరూపించాడు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్. ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(1)ను గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా, జోస్ బట్లర్(0)ను మహ్మద్ షమీ పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బకొట్టారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(26)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు సంజూ శాంసన్. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసి మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో ఏకంగా 60 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయిర్ తుపాన్ ఇన్నింగ్స్‌తో అజేయ అర్థ శతకం సాధించడంతో రాజస్తాన్ గెలుపు ఖరారైంది. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్‌ను వారి సొంత మైదానంలోనే మూడు వికెట్ల తేడాతో ఓడించిన రాజస్తాన్ జయకేతనం ఎగురవేసింది. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సంజూ ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి ఈ సీజన్లో 157 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే.. ఈ కేరళ బ్యాటర్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ప్రతి రోజూ.. ప్రతి మ్యాచ్‌లో ‘‘నాకే గనుక అవకాశం ఉంటే.. టీమిండియా ఆడే ప్రతీ టీ20 మ్యాచ్‌లోనూ అతడికి ఛాన్స్ ఇస్తా’’ అంటూ ఆకాశానికెత్తాడు. ఈ నేపథ్యంలో.. ‘‘నువ్వు సెలక్టర్వి అయితే బాగుండు. కానీ అది జరగని పని కదా! ఏదేమైనా.. టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి నేరుగా ఇచ్చిపడేశావు కదా!’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజమే హర్షా భాయ్ ఇక సంజూ అభిమానులైతే.. ‘‘సరిగ్గా చెప్పారు హర్షా భాయ్. పరిమిత ఓవర్ల క్రికెట్లో సంజూకు తిరుగులేదు. టీమిండియాలో చోటుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని పేర్కొంటున్నారు. కాగా ప్రతిభ ఉన్నా సంజూకి అవకాశాలు ఇవ్వడం లేదంటూ బీసీసీఐ సెలక్టర్లపై గతంలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో సంజూ శాంసన్‌ను బీసీసీఐ ‘సీ’ గ్రేడ్(రూ. 1 కోటి)లో చేర్చడం విశేషం. ఇదిలా ఉంటే.. ఎప్పుడో ఓసారి వచ్చిన అవకాశాలను కూడా మిస్ చేసుకుంటాడనే అపవాదు కూడా సంజూపై ఉంది. చదవండి: అర్జున్ చాలా కష్టపడ్డాడు.. సచిన్ టెండుల్కర్ భావోద్వేగం! వీడియో వైరల్ ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు; అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’ చెత్తగా ప్రవర్తించారు.. నితీశ్ రాణాకు బీసీసీఐ షాక్! సూర్యకు భారీ జరిమానా WHAT. A. GAME! 👌 👌 A thrilling final-over finish and it's the @rajasthanroyals who edge out the spirited @gujarat_titans! 👍 👍 Scorecard 👉https://t.co/nvoo5Sl96y#TATAIPL | #GTvRR pic.twitter.com/z5kN0g409n — IndianPremierLeague (@IPL) April 16, 2023 I would play Sanju Samson in the Indian T20 team every day. — Harsha Bhogle (@bhogleharsha) April 16, 2023 -
హర్షా భోగ్లేకి ధావన్ సూపర్ పంచ్..
-
నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే 6 పరుగులు పెనాల్టి..!
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 11) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ తర్వాత సీఎస్కే ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఓ ఆసక్తికర ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ దాటితే 6 పరుగులు పెనాల్టి విధించాలని ఆయన కోరాడు. Bishnoi was leaving his crease early. Any silly people out there still saying you shouldn't run the non-striker out? — Harsha Bhogle (@bhogleharsha) April 10, 2023 ఎల్ఎస్జే-ఆర్సీబీ మ్యాచ్‌లో హర్షల్-బిష్ణోయ్ మన్కడింగ్ ఉదంతం తర్వాత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ స్టోక్స్ ఈరకంగా స్పందించాడు. బిష్ణోయ్.. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్ వదిలి వెళ్లాడు. ఇంకా ఎవరైనా ఇలాంటి సందర్భంలో కూడా మన్కడింగ్ (నాన్ స్ట్రయికర్ రనౌట్) చేయొద్దని అంటారా అంటూ హర్షా ట్వీట్ చేయగా.. ఈ ట్వీట్‌కు బదులిస్తూ స్టోక్స్ పైవిధంగా స్పందించాడు. Thought’s Harsha? Umpires discretion.. 6 penalty runs if obviously trying to gain unfair advantage by leaving crease early? Would stop batters doing it without all the controversy https://t.co/xjK7Bnw0PS — Ben Stokes (@benstokes38) April 10, 2023 కాగా, నిన్నటి మ్యాచ్‌లో లక్నో గెలవాలంటే చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సి తరుణంలో నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న రవి బిష్ణోయ్.. బౌలర్ హర్షల్ పటేల్ బంతి వేయకముందే క్రీజ్ దాటి చాలా ముందుకు వెళ్లాడు. ఇది గమనించిన హర్షల్ మన్కడింగ్ చేసి భిష్ణోయ్ను రనౌట్ చేశాడు. అయితే దీన్ని అంపైర్ పరిగణించలేదు. హర్షల్‌కు బౌల్ వేసే ఉద్ధేశం లేకపోవడంతో పాటు క్రీజ్ దాటినందుకు గానూ మన్కడింగ్‌ను అంపైర్ ఒప్పుకోలేదు. Virat Kohli mocking his own RCB teammate Harshal Patel for Mankad / Mankading. R Ashwin gonna get good sleep today. pic.twitter.com/Qnvnv1WaGZ — Chintan (@ChinTTan221b) April 10, 2023 నిబంధనల ప్రకారం బౌలర్ బౌలింగ్ చేసే ఉద్దేశం లేకపోయినా, క్రీజ్ దాటి బయటకు వెళ్లినా మన్కడింగ్ చేయడానికి వీలు లేదు. మన్కడింగ్ రూల్ ప్రకారం బౌలర్ బంతి సంధించే ఉద్దేశం కలిగి, క్రీజ్ దాటకుండా ఉంటేనే రనౌట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తానికి హర్షల్ చివరి బంతికి మన్కడింగ్ చేయలేకపోవడంతో బిష్ణోయ్ బ్రతికిపోయాడు. ఆతర్వాత ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో వికెట్ తేడాతో విజయం సాధించింది. -
IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు!
ఐపీఎల్-2023లో భాగంగా ఎస్ఆర్హెచ్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ దావన్ మాత్రం అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న ధావన్ మాత్రం తన పట్టుదలను కోల్పోలేదు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు 143 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకునే సమయంలో ప్రముఖ మ్యాచ్ ప్రెజెంటర్, వాఖ్యత హర్షా భోగ్లే, ధావన్ మధ్య ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఏప్రిల్ 5న గౌహతి వేదికగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో గబ్బర్ 86 పరుగులు చేశాడు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం హర్షా భోగ్లే ధావన్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో "శిఖర్ ధావన్‌ను తన స్ట్రైక్ రేట్‌ను మరింత పెంచుకోవాలి. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. ముఖ్యంగా గహహుతి వంటి వికెట్‌పై మరింత దూకుడుగా ఆడాలి. ఆఖరిలో అతడు తన స్ట్రైక్ రేట్‌ను పెంచాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఆరంభంలో సింగిల్స్ మాత్రమే తీశాడు. అతడి ఇన్నింగ్స్ చూస్తే..జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడా లేదా అన్న సందేహం కలుగుతుందని" భోగ్లే పేర్కొన్నాడు. ఇక తాజాగా ఎస్ఆర్హెచ్తో పోస్ట్ మ్యాచ్ ప్రేజేటేషన్ సందర్భంగా బోగ్లే వ్యాఖ్యలకు గబ్బర్ కౌంటర్ ఇచ్చాడు. "ఇప్పుడు నా స్ట్రైక్ రేట్‌తో మీరు సంతోషంగా ఉన్నారా" అని ధావన్ నవ్వుతూ బోగ్లేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా "ఈ మ్యాచ్‌లో మీ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఆడిన ఇన్నింగ్స్ వర్ణాతీతం. నిజంగా మీ స్ట్రైక్ రేట్ పట్ల సంతోషంగా ఉన్నాను" అంటూ బోగ్లే సమాధానం ఇచ్చాడు. చదవండి: IPL 2023 GT vs KKR: నరాలు తెగ ఉత్కంఠ.. సంచలన విజయం! కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా -
అశ్విన్ సైంటిస్టా లేక బౌలరా..? జడేజా అదిరిపోయే సమాధానం
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు కూడా చేరింది. BGT-2023లో ఆధ్యంతం అద్భుతంగా రాణించి, 4 టెస్ట్‌ల్లో 47 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు షేర్ చేసుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్టార్ స్పిన్ ద్వయాన్ని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఆడగ్గా, వారు కూడా అదే రేంజ్లో అదిరిపోయే సమాధానలు చెప్పారు. ఈ సంభాషణల్లో భాగంగా హర్షా భోగ్లే అడిగిన ఓ ఆసక్తికర ప్రశ్నకు జడ్డూ ఇచ్చిన అదిరిపోయే సమాధానం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ హర్షా ఏం అడిగాడు, జడ్డూ ఏం చెప్పాడంటే.. హర్షా: అశ్విన్ సైంటిస్ట్‌కు ఎక్కువా.. లేక బౌలర్‌కు ఎక్కువ..? జడేజా: అశ్విన్ అన్నింటి కంటే ఎక్కువ.. జడ్డూ సమాధానం విని హర్షా భోగ్లేకు ఫ్యూజులు ఎగిపోయాయి. ఇందుకు జడ్డూ వివరణ ఇస్తూ.. అశ్విన్‌కు చాలాచాలా మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది.. అతను అనునిత్యం క్రికెట్ గురించే మాట్లాడుతుంటాడు.. అశ్విన్‌కు ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లపై అవగాహణ ఉంది.. ఏ జట్టు ఏ మూలలో ఏ టోర్నమెంట్ జరుగుతుందో కూడా అతనికి తెలిసి ఉంటుంది.. ఇందుకే నేను యాష్ క్రికెట్ బ్రెయిన్‌కు సలాం కొడతాను, అందుకే అశ్విన్ భాయ్ అన్నింటి కంటే ఎక్కువ అని అంటానన్నాడు. ఇదిలా ఉంటే, టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న టీమిండియా ఈ నెల 17 నుంచి ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. తల్లి మరణించిన కారణంగా స్వదేశానికి వెళ్లిన ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండకపోవడంతో స్టీవ్ స్మితే వన్డే జట్టు పగ్గాలు కూడా చేపట్టనున్నాడు. మరోవైపు భారత జట్టుకు కూడా ఓ భారీ షాక్ తగిలింది. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిరీస్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. -
ఆసీస్ క్రికెటర్ కోరికను తీర్చిన హర్షా బోగ్లే
హర్షా బోగ్లే.. పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ కామెంటేటరీకి పెట్టింది పేరు.. తన వాక్చాతుర్యంతో అభిమానులను కట్టిపడేయడం అతని స్పెషాలిటీ. తాజాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో హర్షా బోగ్లే కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రేస్ హారిస్ కోరికను హర్షా బోగ్లే నెరవేర్చాడు. మరి గ్రేస్ హారిస్ కోరిక ఏంటి.. ఆ కథేంటి అనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి. ఆర్సీబీతో తొలి మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రేస్ హారిస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాను బర్గర్‌ను చాలా మిస్సవుతున్నానని పేర్కొంది. గ్రేస్ హారిస్ మాటలు విన్నాడో ఏమో తెలియదు కానీ హర్షా బోగ్లే ఇవాళ ఆమెను సర్ప్రైజ్ చేశాడు. ఇవాళ(మార్చి 7న) యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు గ్రేస్ హారిస్ బెంచ్‌కే పరిమితమైంది. మ్యాచ్ మధ్యలో హర్షా బోగ్లే గ్రేస్ హారిస్ వద్దకు వచ్చి నీకిష్టమైన వస్తువు నా దగ్గర ఉంది.. ఇది నీకే అంటూ బర్గర్‌ను ఆమె చేతిలో పెట్టాడు. దీంతో నవ్వులో మునిగి తేలిన గ్రేస్ హారిస్ సంతోషంగా స్వీకరించి హర్షా బోగ్లేకు కృతజ్క్షతలు తెలిపింది. Grace Harris mentioned her craving for a burger during the press conference in the last match, and Harsha surprised her with one today. Looks like she has become everyone's favorite now. 🤣❤ pic.twitter.com/GDGV1gZvQu— Shivani Shukla (@iShivani_Shukla) March 7, 2023 -
చెత్త ఫామ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇటీవలి కాలంలో దారుణంగా విఫలమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ.. సోషల్‌మీడియాలో ఓ మినీ సైజ్ ఉద్యమమే నడుస్తుంది. పంత్ వరుసగా విఫలమవుతున్నా వరుస అవకాశాలు కల్పిస్తూ అతన్ని వెనకేసుకొస్తున్న బీసీసీఐపై సైతం ఫ్యాన్స్ ఓ రేంజ్లో మండిపడుతున్నారు. టీమిండియాలో చోటుకు అన్ని విధాల అర్హుడైన సంజూ శాంసన్‌కు అవకాశాలు ఇవ్వకుండా పక్కకు పెట్టి, పంత్‌కు వరుస ఛాన్స్‌లు కల్పించడాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై బీసీసీఐతో పాటు జట్టు యాజమాన్యాన్ని, కోచ్, కెప్టెన్లను గట్టిగా నిలదీస్తున్నారు. ఇదే అంశంపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. రిషబ్ పంత్‌నే డైరెక్ట్‌గా క్వశ్చన్ చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేకి ముందు పంత్‌తో మాట్లాడుతూ.. పేలవ ఫామ్‌పై ఇబ్బందికర ప్రశ్నలు సంధించాడు. Rishabh Pant interview with Harsha Bhogle before 3rd ODI against NZ talking about rain, batting position, stats and scrutiny over T20i performance & WK drills. #NZvINDonPrime pic.twitter.com/TjOUdnPTCz — S H I V A M 🇧🇷 (@shivammalik_) November 30, 2022 హర్షా భోగ్లే: గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను కూడా ఇదే ప్రశ్న ఆడిగాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే మీ టెస్ట్ మ్యాచ్‌ల రికార్డు బాగా ఉంది. దీనిపై మీరేమంటారు..? పంత్: సర్.. రికార్డులనేవి కేవలం నంబర్లు మాత్రమే. అయినా నా వైట్ బాల్ గణాంకాలు కూడా ఏమంత చెత్తగా లేవని నేననుకుంటాను. హర్షా భోగ్లే: నా ఉద్దేశం మీ వైట్ బాల్ గణాంకాలు బాగాలేవని కాదు.. టెస్ట్ రికార్డులతో పోలిస్తే.. అవి కాస్త నార్మల్‌గా ఉన్నాయన్నదే నా ఉద్దేశం. పంత్: సర్.. కంపారిజన్ అనేది నా లైఫ్‌లో పార్ట్ కాదు.. ఇప్పుడు నాకు 25, 30-32 ఏళ్లు వచ్చాక మీరు ఇలా చేస్తే ఓ అర్ధం ఉంటుందంటూ అసహనంగా సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పంత్ మూడో వన్డేలోనూ విఫలం కావడంతో నెటిజన్లు అతన్ని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఏదైనా ఉంటే బ్యాట్‌తో సమాధానం చెప్పాలి.. కరెక్ట్‌గా ప్రశ్నించినప్పుడు అంత అసహనం ఎందుకని నిలదీస్తున్నారు. -
టీ20 వరల్డ్‌కప్ అత్యుత్తమ జట్టు.. భారత్ నుంచి ఒకే ఒక్కడు!
టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12 సమరానికి మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా శనివారం ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక కీలక పోరుకు ముందు ప్రముఖ వాఖ్యాత హర్ష భోగ్లే తన ఆల్-టైమ్ గ్రేటెస్ట్ టీ20 వరల్డ్‌కప్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. అతడు ఎంచుకున్న జట్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి చోటు దక్కింది. కాగా హర్ష భోగ్లే ప్రకటించిన జట్టులో భారత్ నుంచి కోహ్లి ఒక్కడికే ఛాన్స్ లభించింది. ఇక ఈ జట్టులో ఓపెర్లుగా వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను భోగ్లే ఎంపిక చేశాడు. అదే విధంగా మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా రన్ మిషన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చోటు దక్కింది. ఐదో స్థానంలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు మైఖల్ హస్సీకు అవకాశమిచ్చాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్, పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికు భోగ్లే ఛాన్స్ ఇచ్చాడు. ఇక తన జట్టులో బౌలర్లగా ఉమర్ గుల్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, శామ్యూల్ బద్రీని భోగ్లే ఎంపికచేశాడు. హర్ష భోగ్లే ఎంచుకున్న జట్టు: క్రిస్ గేల్, జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ, కెవిన్ పీటర్సన్, మైకేల్ హస్సీ, షేన్ వాట్సన్, షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, శామ్యూల్ బద్రీ చదవండి: T20 WC 2022: పేరుకే రెండుసార్లు చాంపియన్.. మరీ ఇంత దారుణంగా! సూపర్-12లో ఐర్లాండ్ -
వరల్డ్‌కప్ కామెంటేటర్ల జాబితా విడుదల.. వివాదాస్పద వ్యాఖ్యాతకు దక్కని చోటు
టీ20 వరల్డ్‌కప్-2022లో కామెంట్రీ చెప్పబోయే వ్యక్తుల జాబితాను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌కు చోటు దక్కకపోగా.. భారత్ నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. మొత్తంగా ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందిన 29 మందికి చోటు లభించింది. ఐసీసీ వరల్డ్‌కప్-2022 కామెంటేటర్ల ప్యానెల్లో ఈ సారి ఏకంగా ముగ్గురు మహిళా వ్యాఖ్యాతలకు చోటు దక్కడం విశేషం. ఇంగ్లండ్‌కు చెందిన ఇషా గుహ, మెల్ జోన్స్, నథాలీ జెర్మానోస్ వరల్డ్‌కప్‌లో మహిళా వాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. వరల్డ్‌కప్ వ్యాఖ్యాతల ప్యానెల్లో భారత్‌కు చెందిన రవిశాస్త్రి, హర్షా భోగ్లే, న్యూజిలాండ్‌కు చెందిన డానీ మారిసన్, సైమన్ డౌల్, వెస్టిండీస్‌కు చెందిన ఇయాన్ బిషప్, ఇంగ్లండ్‌కు చెందిన నాసిర్ హుసేన్ వ్యాఖ్యానం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలువనుంది. What an elite commentary line-up for #T20WorldCup 2022 😍 Details 👉 https://t.co/sCOReFrnTH pic.twitter.com/CuTJlwBeOk — ICC (@ICC) October 16, 2022 వరల్డ్‌కప్-2022 కోసం ఎంపిక చేసిన కామెంటేటర్ల వివరాలు.. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా), అథర్ అలీ ఖాన్ (బంగ్లాదేశ్), బాజిద్ ఖాన్ (పాకిస్తాన్), బ్రియాన్ ముర్గత్రయోడ్ (నమీబియా), కార్లోస్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్), డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా), డానీ మారిసన్ (న్యూజిలాండ్), డిర్క్ నానెస్ (ఆస్ట్రేలియా), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్), హర్షా భోగ్లే (ఇండియా), ఇయాన్ బిషష్ (వెస్టిండీస్), ఇయాన్ స్మిత్ (న్యూజిలాండ్), ఇషా గుహా (ఇంగ్లండ్), మార్క్ హోవర్డ్ (ఆస్ట్రేలియా), మెల్ జోన్స్ (ఆస్ట్రేలియా), మైఖేల్ అథర్టన్ (ఇంగ్లండ్), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), నాసిర్ హుస్సేన్ (ఇంగ్లండ్), నథాలీ జెర్మానోస్ (గ్రీస్), నీల్ ఓబ్రెయిన్ (ఇంగ్లండ్), పోమి ఎంబాంగ్వా (జింబాబ్వే), ప్రెస్టన్ మోమ్సేన్ (స్కాట్లాండ్), రవిశాస్త్రి (ఇండియా), రసెల్ ఆర్నాల్డ్ (శ్రీలంక), సామ్యూల్ బద్రి (వెస్టిండీస్), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), షాన్ పొలాక్ (సౌతాఫ్రికా), సైమన్ డౌల్ (న్యూజిలాండ్), సునీల్ గవాస్కర్ (ఇండియా) -
IND Vs ENG: కామెంటరీ ప్యానెల్ ఇదే.. మరో క్రికెట్ జట్టును తలపిస్తుందిగా!
క్రికెట్ ఆటలో మైదానంలో రెండు జట్ల ఆటగాళ్లు.. అంపైర్లు.. బంతి.. బ్యాట్ ఉంటే (వెలుతురు కూడా ఉండాలనుకోండి) మ్యాచ్‌కు ఏ ఆటంకం ఉండదు. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు లైవ్‌లో ఆస్వాధిస్తారు. మ్యాచ్‌కు వెళ్లలేని అభిమానులు కూడా ఉంటారుగా. మరి వారి కోసం టీవీల్లో పలు స్పోర్ట్స్ చానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. అయితే లైవ్‌లో మ్యాచ్ చూసే ప్రేక్షకులకు.. ఇంట్లో టీవీలో చూసే ప్రేక్షకుల మధ్య ఒక చిన్న అంతరం ఉంటుంది. ఆ అంతరం ఏంటో ఈపాటికే మీకు అర్థమయి ఉంటుంది.. అదే క్రికెట్ కామెంటరీ . మన చిన్నప్పడు అంటే టీవీలు రాకముందు.. రేడియోలు ఉన్న కాలంలో చాలా మంది అభిమానులు స్కోర్‌తో పాటు క్రికెట్ కామెంటరీ వింటూ ఉండేవారు. అలా క్రికెట్‌తో పాటు కామెంటరీకి కూడా సెపరేట్ ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. టీవీల్లో కామెంటరీని వింటూనే మ్యాచ్‌లో బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లను ఎంజాయ్ చేస్తుంటాం. మరి ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. జూలై, ఆగస్టు నెలల్లో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తిస్థాయి జట్టును బీసీసీఐ ప్రకటించింది. మరి ఈ మ్యాచ్‌లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్న స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం కూడా తమ కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది. మొత్తం 13 మందితో కూడిన ఈ ప్యానెల్లో హిందీ, ఇంగ్లీష్ కామెంటేటర్లు ఉన్నారు. ఇంగ్లీష్‌లో కామెంటరీ చేయనున్నవాళ్లు: హర్షా బోగ్లే, నాసర్ హుస్సేన్, సంజయ్ మంజ్రేకర్, గ్రేమ్ స్వాన్, డేవిడ్ గ్రోవర్, మైకెల్ ఆర్థర్ టన్ హిందీలో కామెంటరీ చేయనున్నవాళ్లు: వివేక్ రజ్దన్, వీరేంద్ర సెహ్వాగ్, అజయ్ జడేజా, సాబా కరీమ్, మహ్మద్ కైఫ్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగార్కర్ ఈ 13 మందిలో హర్షా బోగ్లేను మినహాయిస్తే మిగతా 12 మంది ఏదో ఒక దశలో క్రికెట్ ఆడినవారే. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కామెంటరీ ప్యానల్‌ను సరదాగా ట్రోల్ చేశారు. ''ఇంగ్లండ్, ఇండియాల జట్ల కంటే ఈ కామెంటరీ ప్యానెల్ పటిష్టంగా కనిపిస్తోంది.. 12 మంది ఆటగాళ్లు ఉన్నారు.. అందులో బ్యాటర్స్, బౌలర్స్ ఉండడంతో మరో క్రికెట్ జట్టును తలపిస్తోంది. వీళ్లకు కూడా ఒక మ్యాచ్ నిర్వహించండి'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఏకైక టెస్టుకు అంతా సిద్ధమయింది. ఇప్పటికే ఇంగ్లండ్‌కు చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఒక టెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ .. జూన్ 24-27 వరకు లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ జులై 1-5 వరకు రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్, ఎడ్జ్‌బాస్టన్ జులై 7న తొలి టీ20, సౌతాంప్టన్ జులై 9న రెండో టీ20, బర్మింగ్‌హామ్ జులై 10న మూడో టీ20, నాటింగ్‌హామ్ జులై 12న తొలి వన్డే, లండన్ జులై 14న రెండో వన్డే, లండన్ జులై 17న మూడో వన్డే, మాంచెస్టర్ చదవండి: Cheteshwar Pujara: 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే ఇది! అతడు లేడు కాబట్టి... రోహిత్‌పై మరింత భారం! -
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లే పై దాడి..? లైవ్ ప్రోగ్రాం జరుగుతుండగానే..!
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లేపై దాడి జరిగిందన్న వార్త సోషల్‌మీడియాను షేక్ చేసింది. క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ అనే ఛానెల్‌తో కలిసి ఐపీఎల్ 2022 సీజన్ లైవ్ ప్రోగ్రామ్ చేస్తుండగా హర్షా అకస్మాత్తుగా స్క్రీన్‌పై కనిపించకుండా పోయాడు. అతనిపై ఎవరో దాడి చేసినట్టు అరుపులు, కేకలు వినిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో గురువారం (మార్చి 24) న సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. This is what happened to Harsha Bhogle during a live Show and Johns now confirmed that he is fine pic.twitter.com/fvdbQooaW1 — Kaveen Wijerathna (@CricCrazyKaveen) March 24, 2022 హర్షా భోగ్లేపై ఎవరు దాడి చేశారు..? ఎందుకు చేశారు..? అని క్రికెట్ అభిమానులు తెగ ఆందోళన పడ్డారు. దీనికి మరింత హైప్ పెంచుతూ క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్.. ‘హర్షా భోగ్లేకి ఏమైందో, అక్కడేం జరిగిందో మాకు తెలీదు. తెలుసుకునేందుకు హర్షా భోగ్లేతో, అతని టీమ్‌తో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలో మీకు సమాచారం ఇస్తాం’ అంటూ ట్వీట్ చేసింది. I am fine. Sorry to have got a lot of you worried. Thank you for the love and concern. It became more viral than I anticipated. That too is a learning. It was meant to lead to something else. Sorry. And cheers. — Harsha Bhogle (@bhogleharsha) March 24, 2022 కట్ చేస్తే.. అసలు హర్షా భోగ్లేపై దాడి జరిగిందన్నది వాస్తవం కాదని, సదరు ప్రోగ్రామ్‌కి హైప్ తెచ్చేందుకు ఆ ఛానెల్ వాళ్లు ప్లే చేసిన చీప్ ట్రిక్ అని తేలింది. తాజాగా హర్షా ఈ ఎపిసోడ్‌పై స్పందించాడు. ‘నేను క్షేమంగానే ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన చెందకండి. వాస్తవానికి నాపై ఎలాంటి దాడి జరగలేదు. సదరు వీడియోలో మేమనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని ఇలా చేయలేదు. ఏదిఏమైనప్పటికీ అందరిని క్షమాపణలు కోరుతున్నాను, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. సారీ అండ్ ఛీర్స్ అంటూ ట్వీటర్ ద్వారా వివరణ ఇచ్చాడు. కాగా, హర్షా భోగ్లే క్రికెట్ వ్యాఖ్యానంలో విశ్వవ్యాప్తంగా అభిమానులను కలిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన భోగ్లే తెలుగులో సైతం అనర్గళంగా మాట్లాడగలడు. దీంతో అతనికి తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..! -
IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..!
Two Players Who May Fetch High Price In IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న వేళ ఏ జట్టు ఏ ఆటగాడికి ఎంత వెచ్చించి కొనుగోలు చేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో క్రికెట్ విశ్లేషకులు, మాజీలు వేలంలో ఆటగాళ్ల కొనుగోలు అంశంపై తమతమ అంచనాలు వెల్లడిస్తున్నారు. ఇదే విషయమై ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాత హర్షా బోగ్లే సైతం తన అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడు. వేలంలో అత్యధిక ధర సొంతం చేసుకునే భారత ఆటగాళ్లు వీరే నంటూ ప్రకటన చేశాడు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరిగే మెగా ఆక్షన్‌లో టీమిండియా యువ వికెట్‌కీపర్, ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ ఇషాన్ కిషన్, అలాగే తమిళనాడు పవర్ హిట్టర్, పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ షారుక్ ఖాన్లు రికార్డు ధర సొంతం చేసుకునే భారత ఆటగాళ్లుగా నిలుస్తారని జోస్యం చెప్పాడు. ఈ ఇద్దరి కోసం మొత్తం 10 ఐపీఎల్ జట్లు ఎగబడతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అందులోనూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం ఇషాన్ కిషన్‌కు అదనంగా కలిసొచ్చే అంశమని.. లోయర్ ఆర్డర్లో పవర్ఫుల్ హిట్టర్ కావడమే షారుక్ ఖాన్‌కు ప్లస్ పాయింట్ అని.. ఈ కారణాల చేతనే ఈ ఇద్దరు భారత ఆటగాళ్లకు జాక్‌పాట్ ధర లభిస్తుందని హర్షా బోగ్లే అంచనా వేశాడు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్‌ను టీమిండియా మాజీ హిట్టర్ యూసఫ్ పఠాన్‌తో పోల్చాడు. షారుక్ కూడా యూసఫ్ పఠాన్ లాగే భారీ సిక్సర్లతో విరుచుకుపడి ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడని కొనియాడాడు. వేలంలో షారుక్ ఖాన్‌కు 10 నుంచి 13 కోట్లు, ఇషాన్ కిషన్.. 10 నుంచి 17 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. కాగా, గతంలో ఇషాన్ కిషన్(6.5 కోట్లు)ను ముంబై, షారుక్ ఖాన్(5.25 కోట్లు)ను పంజాబ్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇషాన్.. గతేడాది ఐపీఎల్‌ల్లో 10 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీలతో 241 పరుగులతో పర్వాలేదనిపించగా, షారుక్.. 11 మ్యాచ్‌ల్లో కేవలం 153 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. చదవండి: IPL 2022: అతను కెప్టెన్ కాలేడు.. అయినా భారీ ధర పలకడం ఖాయం..! -
ఆజమ్ కంటే రిజ్వాన్ బెటర్... భారత్ నుంచి ఒక్కడే.. నా ఫేవరెట్ జట్టు ఇదే!
ఈ ఏడాది కొన్ని క్రికెట్ జట్లకు మధురానుభూతులు పంచితే.. మరికొన్ని టీమ్‌లకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ముఖ్యంగా తమకు అందని ద్రాక్షగా ఉన్న టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి ఆస్ట్రేలియా పండుగ చేసుకుంటే.. టీమిండియా కనీసం మెగా టోర్నీ సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. మరోవైపు భారత దాయాది జట్టు పాకిస్తాన్ మాత్రం ఈ మేజర్ ఈవెంట్ టైటిల్ గెలవలేకపోయినా.. పూర్తి స్థాయి పోరాటపటిమ కనబరించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి గానూ తన అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే... ఇద్దరు పాక్ ఆటగాళ్లకు చోటిచ్చాడు. టీమిండియా నుంచి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే అవకాశం ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో చాట్ సందర్భంగా.... జట్టు ఎంపికలో తాను పరిగణనలోకి తీసుకున్న అంశాలను ప్రస్తావించాడు. ‘‘బాబర్ ఆజమ్.. మహ్మద్ రిజ్వాన్ ఇద్దరి గణాంకాలు బాగానే ఉన్నాయి. ఇద్దరి స్ట్రైక్ రేటు దాదాపుగా.. 130 ఉంది. ఇద్దరికీ ఈ ఏడాది చాలా బాగా కలిసివచ్చింది. అయితే, పవర్‌ప్లేలో స్ట్రేక్ రేటును బట్టి వీరిద్దరిలో నేను రిజ్వాన్ వైపే మొగ్గు చూపుతాను. ఇక ఆల్‌రౌండర్ల విషయానికొస్తే ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్‌ను ఎంపిక చేసుకుంటాను. బౌలర్లలో రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, బుమ్రాను ఎంచుకుంటాను. ఓపెనర్లుగా జోస్ బట్లర్, రిజ్వాన్ నా ఛాయిస్’’ అని హర్షా బోగ్లే చెప్పుకొచ్చాడు. హర్షా బోగ్లే 2021 అత్యుత్తమ టీ20 జట్టు: జోస్ బట్లర్, మహ్మద్ రిజ్వాన్, మిచెల్ మార్ష్, మొయిన్ అలీ, గ్లెన్ మాక్స్వెల్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, రషీద్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, అన్రిచ్ నోర్జే, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: David Warner: ఎంతైనా వార్నర్ కూతురు కదా.. ఆ మాత్రం ఉండాలి -
IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన కేకేఆర్ ఆటగాడు.. ఫ్యాన్స్ ఫిదా
Dinesh Karthik Speaking Telugu In IPL 2021 Final: 2021 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్‌కీపర్ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మెగా ఫైనల్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో తెలుగు మాట్లాడి ఆకట్టుకున్నాడు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. డీకే అనర్గలంగా తెలుగులో మాట్లాడాడు. Wow. @DineshKarthik is killing it in Telugu. As fluent as his on field conversations in Tamil with Varun Chakravarthy. #IPLFinal pic.twitter.com/pLABDPES4U — PK - VJ (@msd21888) October 15, 2021 మెగా ఫైనల్ అని ఏమైనా ఒత్తిడి ఉందా అని హర్షా ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, సాధారణ మ్యాచ్‌లానే ఈ మ్యాచ్‌నూ పరిగణిస్తున్నామని తెలిపాడు. అయితే ఫైనల్ మ్యాచ్ అంటే సహజంగా ఎవరికైన కాస్తో కూస్తో ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేశామని, సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. తమ జట్టు సెకండాఫ్‌లో అద్భుతంగా రాణించిందని, ఫైనల్‌కు చేరేందుకు ఆటగాళ్లు ఎంతో శ్రమించారని అన్నాడు. ఈ సందర్భంగా డీకే.. కేకేఆర్ ఆటగాళ్లందరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. Ha! Never thought I would do a pre-game interview in Telugu with @DineshKarthik. Bagane Telugulo mataladtaadu mana DK! — Harsha Bhogle (@bhogleharsha) October 15, 2021 కాగా, దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటం పట్ల తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు. డీకే అచ్చం తెలుగువాడిలా అద్భుతంగా మాట్లాడుతున్నాడంటూ సోషల్‌మీడియాలో వీడియోని షేర్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు. ఇదిలా ఉంటే, డీకే.. 2020 ఐపీఎల్ సందర్భంగా కూడా తెలుగులో మాట్లాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చదవండి: IPL 2021 Final: ఐపీఎల్ చరిత్రలో అద్భుత రికార్డు -
‘టీ20 వరల్డ్ కప్ జట్టు’: వారిద్దరికీ హర్ష జట్టులో చోటు లేదు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లో తదుపరి మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ గురించి క్రీడావర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వివిధ జట్ల బలాలు, బలహీనతలను అంచనా వేస్తూ దిగ్గజ క్రికెటర్లు, కామెంటేటర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష బోగ్లే టీ20 ప్రపంచకప్‌నకై తన టీమిండియా జట్టును ప్రకటించాడు. తన స్క్వాడ్‌లో భారత ఐదుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌కు చోటిచ్చిన హర్ష... వెటరన్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను మాత్రం విస్మరించాడు. ఇక భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లతో పాటు.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి కొత్త ఆటగాళ్లకు కూడా తన జట్టులో చోటు ఉందని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే... హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు టీ20 వరల్డ్ కప్ ఆడే జట్టులోఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోగా.. కరోనా కలకలం నేపథ్యంలో వరుస ఓటములతో టీ20 సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. హర్షా బోగ్లే టీ20 వరల్డ్ కప్ భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ/నటరాజన్, యజువేంద్ర చహల్. -
'మీ అభిమానానికి థ్యాంక్స్.. జడేజా అని పిలిస్తే చాలు'
ఢిల్లీ: సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ 14వ సీజన్లో ఆకట్టుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. 7 మ్యాచ్‌లాడి 131 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ 6 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడేజా ప్రదర్శనను ఎప్పటికి మరిచిపోలేం. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో 28 బంతుల్లోనే 62 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ 3 కీలక వికెట్లు తీయడంతో పాటు మెరుపు రనౌట్ చేసి తానెందుకు ఆల్‌రౌండర్ అనేది మరోసారి చూపించాడు. ముఖ్యంగా బ్యాటింగ్ సమయంలో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో జడ్డూ విశ్వరూపం ప్రదర్శించాడు. ఐదు వరుస సిక్సర్లు, ఫోర్ సహా మొత్తం 37 పరుగులు పిండుకొని ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గేల్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. తాజాగా ప్రముఖ కామెంటేటర్ హర్షా బోగ్లే మరోసారి జడేజా ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకుంటూ ప్రశంసలతో ముంచెత్తాడు. క్రిక్‌బజ్‌తో జరిగిన ఇంటర్య్వూలో ఈ సీజన్లో మిమ్మల్ని అమితంగా ఆకట్టుకున్న ఇన్నింగ్స్ ఏంటో చెప్పగలరా అని బోగ్లేని అడిగారు. దానికి బోగ్లే స్పందిస్తూ.. ' ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్‌తో ఆల్‌రౌండర్ అంటే ఎలా ఉంటాడో చూపించాడు. అతనే సర్ రవీంద్ర జడేజా. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడేజా ఇన్నింగ్స్ నన్ను ఆకట్టుకుంది. ఈ సీజన్లో నేను బాగా ఎంజాయ్ చేసిన ఇన్నింగ్స్‌లో దానిది తొలి స్థానం. మొదట 62 పరుగులు( చివరి ఓవర్లో 37 పరుగులు), బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లతో పాటు డైరెక్ట్ రనౌట్‌తో మెరిశాడు. ఒక్క మ్యాచ్‌లోనే ఇన్ని రకాల యాంగిల్స్ చూపడమనేది జడేజాకు మాత్రమే సాధ్యమైంది. అతన్ని సర్ ఎందుకంటారో ఇప్పుడు తెలిసింది. అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హర్షా బోగ్లే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జడేజా రీట్వీట్ చేశాడు. ' మీ అభిమానానికి థ్యాంక్స్ హర్షా బోగ్లే జీ.. కానీ మీరు నన్ను సర్ అనేకంటే రవీంద్ర జడేజా అని పిలిస్తేనే బాగుంటుంది అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్‌కు కరోనా సెగ తగిలింది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. చదవండి: వారిని చూస్తే బాధేస్తోంది.. కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకు విమర్శించారో నాకైతే అర్థం కాలేదు The Voice of Cricket, @bhogleharsha, believes @imjadeja has been a standout All-Rounder in the tournament so far. Who do you think is the #AboveTheNoisePerformer when it comes to all-around abilities? #AboveTheNoise #CricbuzzPlus #harshaBhogle #RavindraJadeja #IPLT20 pic.twitter.com/jnKwwdBFQd — Cricbuzz (@cricbuzz) May 3, 2021 -
కామెంటేటర్స్ మీరు మారండి.. పంత్ స్టన్నింగ్ రిప్లై
అహ్మదాబాద్: టీమిండియా నాలుగో టెస్టులో విజయం సాధించడం వెనుక రిషబ్ పంత్ కీలకపాత్ర పోషించాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 143 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో పంత్.. సుందర్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించడమేగాక అద్భుత సెంచరీ సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం పోస్ట్ ప్రెజంటేషన్ సందర్భంగా పంత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్న తర్వాత హర్ష బోగ్లే అతన్ని సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ''ఈ మధ్యన మైక్ స్టంప్‌లో నువ్వు చేసే వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే నువ్వే మాట్లాడే మాటలు క్లియర్‌గా లేవని.. కామెంటేటర్లు సైలెంట్‌గా ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తామని అభిమానులు అంటున్నారు.. దీనిపై నీ స్పందనేంటి పంత్ అని'' ప్రశ్నించాడు. దీనికి పంత్ తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు. ''వాళ్లు చెప్పినదానిని నేనైతే కాంప్లిమెంట్ అని అనుకుంటున్నా. అలా అనిపిస్తే మాత్రం.. సమస్య లేకపోతే మీరు మారండి'' అంటూ బదులిచ్చాడు. ఇక నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వరుసగా హ్యాట్రిక్ గెలుపును అందుకుంది. ఫలితంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరగా, తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 135 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్ విజయం లభించింది. అక్షర్ పటేల్, అశ్విన్ చెరో 5 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. చదవండి: వైరల్: ఇంగ్లండ్‌కు సెహ్వాగ్ అదిరిపోయే పంచ్ అరె పంత్.. బెయిల్ నీ గ్లోవ్స్‌లోనే ఉంది -
అది జాతీయ జంతువు.. అందుకే కట్ చేయలేదు
అజింక్య రహానే.. ప్రస్తుత టీమిండియా జట్టులో కీలక ఆటగాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీలో ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోపీ గెలిచిన భారత జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒకపక్క జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరమవుతున్నా సరే... తనలోని పట్టుదలను మాత్రం వదలని రహానే ఉన్న జట్టులోనే తన మాటలతో స్పూర్తి నింపి సిరీస్ గెలవడంలో ప్రముఖపాత్ర పోషించి చరిత్ర సృష్టించాడు.కోహ్లి గైర్హాజరీలో ఆసీస్ గడ్డపై నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వహించినందుకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందాయి. స్వదేశానికి వచ్చాక తాను నివసిస్తున్న ప్రాంతంలో అతనికి రెడ్ కార్పెట్ పరిచి ఘనస్వాగతం పలికారు. అయితే సిరీస్ విజయం తర్వాత రహానే ఎన్నో సందర్భాల్లో గెస్టర్స్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కంగారు బొమ్మ ఉన్న కేక్ మాత్రం రహానే కట్ చేయలేదు. అది ఎందుకు చేయలనేది తాజాగా రహానే రివీల్ చేశాడు. ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా బోగ్లేతో జరిగిన చిట్‌చాట్‌లో పాల్గొన్న రహానే దానివెనుక ఉన్న కారణం వివరించాడు. రహానే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: 'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం' 'కంగారూ అనేది ఆస్ట్రేలియా జాతీయ జంతువు.. దేశమేదైనా సరే వారి గౌరవాన్ని కించపరచడం కరెక్ట్ కాదు. ఒక దేశంపై గెలిచామా.. చరిత్ర సృష్టించామా అన్నది ముఖ్యం కాదు.. ప్రత్యర్థి దేశాన్ని ఎంత గౌరవించామా అనేది ప్రధానంగా చూడాలి. అందుకే కంగారు బొమ్మ ఉన్న కేక్‌ను కట్ చేయలేదు అని వివరించాడు. కాగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే చెన్నైకు చేరుకొని ఆరు రోజుల క్వారంటైన్లో ఉన్నారు. చదవండి: 'స్వదేశానికి వచ్చాక అస్సలు టైం దొరకలేదు' -
వరద తాకిడి : హర్ష భోగ్లే విచారం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో నెలకొన్న వరద పరిస్థితిపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే విచారం వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని అధిగమించి ఇరు రాష్ట్రాలు త్వరలోనే కోలుకుంటాయని ఆయన ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ ప్రజలు ఈ పరిస్థితిని అధిగమించాలని కోరుకుంటున్నానని హర్ష భోగ్లే ట్వీట్ చేశారు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పలువురు మరణించగా భారీగా ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. హైదరాబాద్, విజయవాడ నగరాలు సహా పలు ప్రాంతాలు కుంభవృష్టితో అతలాకుతలమయ్యాయి. పలు కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. ఇక వరద తాకిడికి హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా 24 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఏపీలో వరద బీభత్సానికి పది మంది మరణించారు. చదవండి : ధోని కోరిక తీరకపోవచ్చు! Worried for the people in Andhra and Telangana today. Twaralo vishayaalu baagupadataayani aasistunnaanu. — Harsha Bhogle (@bhogleharsha) October 14, 2020 -
‘కోహ్లిలా ఆడాలి.. పాక్‌ను గెలిపించాలి’
హైదరాబాద్: టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజామ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కవర్ డ్రైవ్ షాట్లలో కోహ్లిని మించిన మరో బ్యాట్స్‌మన్ ఉండడని ప్రశంసించాడు. హర్ష బోగ్లే హోస్ట్‌గా క్రిక్ బజ్ నిర్వహించిన లైవ్ షోలో పాల్గొన్న అజామ్ కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. ‘ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకరు. అతనితో పోల్చి చూసుకుంటే నేను చాలా వెనకబడి ఉన్నాను. నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నేను పాకిస్తాన్ తరుపున కోహ్లిలా ఆడాలి.. మ్యాచ్‌లను గెలిపించాలి.. రికార్డులను సృష్టించాలి’ అంటూ బాబర్ పేర్కొన్నాడు. (‘అదే కోహ్లిని గ్రేట్ ప్లేయర్‌ను చేసింది’) ‘ఓపెనర్‌గా బరిలోకి దిగితే చివరి బంతి ఆడేవరకు ప్రయత్నం చేయాలి. అలా చేస్తే బ్యాటింగ్‌లో అన్ని దశలను చూస్తావు. అంతేకాకుండా చివరి బంతి వరకు ఆడితే పరుగులు సాధించడమే కాకుండా జట్టుకు కూడా అవసరమైన మంచి స్కోర్‌ను అందిస్తావు, సహచర బ్యాట్స్‌మన్‌కు సహకారం అందిస్తావు’ అని తన కోచ్ తరుచూ పేర్కొనేవాడని, దాని అర్థం ఇప్పుడిప్పుడే అర్థం అవుతందని బాబర్ వివరించాడు. (కోహ్లితో పాటు ఆడటం నా అదృష్టం) ఇక అండర్-19 సమయంలో తొలి సారి రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయాబ్ అక్తర్‌ను కలిశానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో అతడి బౌలింగ్‌ను కూడా ఎదుర్కొన్నానని, అది మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నాడు. ఇక బాబర్ అజామ్‌ను పాకిస్తాన్ కోహ్లి అని అక్కడి అభిమానులు పిలిచే విషయం తెలిసిందే. కేవలం అభిమానులే కాకుండా తాజా, మాజీ క్రికెటర్లు సైతం కోహ్లితో ఈ బ్యాట్స్‌మన్‌ను పోల్చడం విశేషం. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ అయితే ఏకంగా విరాట్ కోహ్లి కంటే బాబర్ అజామ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడటం గమనార్హం. -
గల్లీ క్రికెట్: గేల్‌కు పాండ్యా ఛాన్స్
ముంబై : ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లే హోస్ట్‌గా క్రిక్ బజ్ నిర్వహించిన లైవ్ సెషన్లో టీమిండియా విధ్వసంకర ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పాల్గొన్న విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన ఈ సెషన్లో తన టెస్టు కెరీర్, నటాషా స్టాన్కోవిచ్తో ప్రేమాయణం, ‘కాఫీ విత్ కరణ్ షో’ వివాదానికి సంబంధించి అనేక విషయాలపై పాండ్యా చర్చించారు. అయితే ఈ కార్యక్రమం ముగింపులో గల్లీ క్రికెట్ జట్టును ఎంపిక చేయాల్సిందిగా పాండ్యాను హర్ష భోగ్లే కోరాడు. అంతేకాకుండా జట్టులో ఎంపిక చేసే ఒక్కో స్థానం కోసం పలు ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా తన తొలి ఛాయిస్ వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అని తేల్చి చెప్పాడు. (అప్పుడే డేటింగ్ మొదలు : హార్దిక్) ఓపెనర్ స్థానం కోసం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, డికాక్, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్ పేర్లను హర్ష బోగ్లే సూచించగా గేల్ వైపే పాండ్యా మొగ్గుచూపాడు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లిను ఎంపిక చేశాడు. జట్టులో ఫినిషర్ స్థానంలో ఎంఎస్ ధోనిని తప్ప మరొకరిని ఊహించుకోలేనని తెలిపాడు. అయితే డివిలియర్స్ పేరును భోగ్లే సూచించినప్పటికీ ధోనినే ఎంపిక చేస్తానని స్పష్టం చేశాడు. స్పిన్నర్‌గా తన సోదరుడు కృనాల్‌ను ఎంచుకుంటానని తెలిపాడు. ఇక రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, షకీబుల్ హసన్, డ్వేన్ బ్రావోలను పక్కకు పెట్టి ఆల్‌రౌండర్ కోటాలో ఆండ్రీ రస్సెల్‌ను జట్టులోకి తీసుకున్నాడు. పేస్ బౌలర్‌గా జస్ప్రిత్ బుమ్రా తన జట్టులో ఉండాలని పాండ్యా పేర్కొన్నాడు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ సెషన్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. (ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే) -
ధోని కోరిక తీరకపోవచ్చు!
ముంబై: 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టని మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని ఐపీఎల్‌పై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఐపీఎల్లో రాణిస్తే వచ్చే టి20 వరల్డ్‌కప్ ఆడే అవకాశాలు కూడా మెరుగయ్యేవి. సెలక్టర్లు కూడా పదే పదే ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఐపీఎల్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ భారత జట్టుకు ఆడాలనే అతని కోరిక నెరవేరకపోవచ్చని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. ఇక జాతీయ జట్టు తరఫున అతని కెరీర్ ముగిసినట్లేనని అతను వ్యాఖ్యానించాడు. ‘ప్రస్తుతం ధోని ఆలోచనలు ఎలా ఉన్నాయో మనమే కాదు అతని నీడ కూడా చెప్పలేదు. అయితే టెస్టులకు గుడ్‌బై చెప్పినప్పుడు, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు ఎలా వ్యవహరించాడో ఇప్పుడూ అదే చేస్తాడు. భారీ ఆర్భాటపు వీడ్కోలు మ్యాచ్ ఉండదు. ఇది నా గట్టి అభిప్రాయం. అసలు ధోని ఎప్పుడు తప్పుకున్నాడనే విషయం కూడా మనకు తెలీకుండా అతని కెరీర్ ముగిసిపోతుంది. కాబట్టి ప్రస్తుత స్థితిలో అతను భారత జట్టులోకి పునరాగమనం చేయడం కష్టం. ఇంకా ప్రపంచకప్ కోసం నవంబర్ వరకు, ఆ తర్వాతి వరకు వేచిచూసే పరిస్థితి లేదు. ఐపీఎల్ జరగకపోతే ఇక ఏమాత్రం సాధ్యం కాదు’ అని భోగ్లే విశ్లేషించాడు. -
అందుకే మంజ్రేకర్‌పై వేటు పడిందా?
ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్, ప్రఖ్యాత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా అతను ఒక్క బీసీసీఐ ప్యానెల్ నుంచే గాక ఐపీఎల్ 2020 కామెంటరీ ప్యానెల్ నుంచి కూడా వైదొలగినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఇంకా బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా మంజ్రేకర్ కొన్ని సంవత్సరాల నుంచి టీమిండియా స్వదేశంలో ఆడుతున్న మ్యాచ్‌లకు కామెంటరీ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ధర్మశాలలో జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో మంజ్రేకర్ కామెంటరీ ప్యానెల్‌కు రాలేదని తెలిసింది. కాగా సునీల్ గవాస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళి కార్తిక్‌లు మాత్రమే కామెంటరీ ప్యానెల్లో పాల్గొన్నారని ఒక పత్రిక తన కథనంలో ప్రచురించింది. కాగా వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.అయితే మంజ్రేకర్ కామెంటరీ చేయకపోవడం పట్ల సరైన కారణం తెలియరాలేదు. (మంజ్రేకర్‌ను టీజ్ చేసిన జడేజా) కాగా గతేడాది జరిగిన వరల్డ్‌కప్ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ' రవీంద్ర జడేజా లాంటి బీట్స్ అండ్ పీసెస్ ఆటగాళ్లకు తాను ఫ్యాన్ కాదని, జడేజా టెస్టు క్రికెటర్ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్ అంటూ' అంటూ పేర్కొన్నాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనికి జడేజా కూడా ధీటుగానే బదులిచ్చాడు. ఆ తర్వాత సహచర కామెంటేటర్ హర్షా భోగ్లేపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మంజ్రేకర్ క్షమాపణలు చెప్పాడు. అయితే తాజాగా మంజ్రేకర్ బీసీసీఐ కామెంటేటరీ ప్యానెల్ నుంచి తప్పుకోవడం వెనుక అతని పనితీరు నచ్చకనే బీసీసీఐ తీసేసిందా అనేది తెలియదు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో భారత్‌లో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. (మంజ్రేకర్.. నీ సహచర వ్యాఖ్యాతను అవమానిస్తావా!) (వాయిదా వేసి మంచిపని చేసింది : గవాస్కర్) -
ఇదొక వరస్ట్ ఇయర్: మంజ్రేకర్
న్యూఢిల్లీ: ఒక కామెంటేటర్‌గా, ఒక క్రికెట్ విశ్లేషకుడిగా ఈ ఏడాది(2019) తన చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిందని అంటున్నాడు సంజయ్ మంజ్రేకర్. ఈ ఏడాది కచ్చితంగా తనకు ఒక ‘వరస్ట్ ఇయర్’ అంటూ పేర్కొన్నాడు. తాను కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయిన మాట వాస్తవేమనని ఏడాది ముగింపు సందర్భంగా తెలిపాడు. ప్రధానంగా సహచర కామెంటేటర్ హర్షా భోగ్లేపై చేసిన కామెంట్ చాలా పెద్ద తప్పిదమని ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. దీనికి హర్షా భోగ్లేను క్షమాపణలు కోరుతున్నట్లు మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఆ సమయంలో తన ఎమోషన్స్ అదుపు తప్పాయన్నాడు. తనన తాను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లే హర్షా భోగ్లేతో ఘాటుగా మాట్లాడానని తెలిపాడు. దీనికి క్షమించమని హర్షాభోగ్లేను కోరుతున్నట్లు మంజ్రేకర్ అన్నాడు. ఒక ప్రొఫెషనల్ కామెంటేటర్‌గా అలా మాట్లాడటం సరైన చర్య కాదన్నాడు.2019లో మంజ్రేకర్ తరచు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మంజ్రేకర్ దేనిపై వ్యాఖ్యానించినా అది విపరీతార్థంలో ఉండటంతో అతన్ని క్రికెట్ అభిమానులు ఆడేసుకున్నారు. ఈ క్రమంలోనే హర్షా భోగ్లే పట్ల కూడా మంజ్రేకర్ దూకుడుగాప్రవర్తించాడు. నవంబర్ నెలలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరించిన మంజ్రేకర్.. సహచర వ్యాఖ్యాత హర్షా భోగ్లే చిన్నబుచ్చుకునేలా మాట్లాడాడు. పింక్ బాల్ టెస్టుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని ఇరు జట్ల ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్లే సూచించాడు. ప్రధానంగా బంతి ఎలా కనిపిస్తుంది అనే దానిపై క్రికెటర్లను అడిగితేనే కానీ తెలియదని భోగ్గే పేర్కొన్నాడు. దీనికి వెంటనే స్పందించిన మంజ్రేకర్.. ఈ విషయం నువ్వే అడగాలి. ఏమో ఏదో సాధారణ క్రికెట్ మాత్రమే ఆడం. మాకు అర్హత లేదు’ అని మాట్లాడాడు. హర్షా భోగ్లే క్రికెట్ ఆడకుండానే ప్రముఖ వ్యాఖ్యాతగా ఎదిగిన విషయాన్ని మంజ్రేకర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ అవమానించాడు. -
క్షమించండి: హర్షా బోగ్లే భావోద్వేగ పోస్టు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లే స్పందించాడు. ప్రభుత్వం కరుణ కలిగి ఉండాలని.. నవతరాన్ని ఇటువంటి ఒత్తిడుల నుంచి విముక్తుల్ని చేయాలని విఙ్ఞప్తి చేశాడు. మనం ఎంతో మంచి ఇన్నింగ్స్ ఆడామని.. ఇప్పటి యువత సైతం అదేవిధంగా మధురానుభూతులు సొంతం చేసుకునే వాతావరణం కల్పించాలని పాలకులకు సూచించాడు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎన్నికల్లో గెలవాలనుకునే ఆలోచన సరైంది కాదని పరోక్షంగా నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ‘నవ భారతం ఇప్పుడు మనతో మాట్లాడుతోంది అనుకుంటున్నా. వాళ్లకి ఏం కావాలో దాని గురించి మాత్రమే. చాలా ఏళ్ల క్రితం దేశంపై నాకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. ఇందుకు ఓ కారణం ఉంది. ఇంగ్లండ్ పాలనలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మా తరానికి ఓ అవగాహన ఉంది. ఇక నా తల్లిదండ్రుల తరంలో వారికి కనీస సదుపాయాలు, వనరులు అందుబాటులో లేవు. అంతేకాదు అభిప్రాయాలు చెప్పలేని ఒక భయానక వాతావరణం ఉండేది. అయితే ఇప్పుడు మనం చాలా అదృష్టవంతులం. అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మన ఆలోచనలు పంచుకునే అవకాశం దక్కింది. అయితే మళ్లీ పురాతన రోజుల్లోకి తీసుకువెళ్లొద్దు. ప్రభుత్వం దయగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతికత గురించి ఆలోచించాలి. మన ఆలోచనల స్థాయిని దాటి కొత్తగా ఆలోచిస్తున్న నవతరాన్ని స్వేచ్చగా విహరించేలా చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వాళ్ల భుజాలపై భారం మోపి ఎందుకు వెనక్కి లాగుతున్నట్టు. మన మధ్య తారతమ్యాల గురించి వాళ్లను ఎందుకు కుచించుకుపోయేలా చేస్తున్నట్టు? వీటన్నింటి వల్లే నవభారతం సంతోషంగా లేదని మనకు చెబుతోంది.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) మనం పెద్ద పెద్ద భావోద్వేగ పోస్టులు పెట్టనవసరం లేదు. కనీసం ఓ ఐదుగురు యువకుల్ని ప్రోత్సహించండి. వెన్ను తట్టి వారిలో కొత్త ఉత్సాహం నింపండి. ప్రపంచాన్ని కొత్తగా చూసేలా మట్లాడండి. గత మూడేళ్లలో నేను ఇలా చేసి విజయవంతం అయ్యాను. ఇప్పుడు వాళ్లు క్రిక్‌బజ్ క్రియేట్ చేశారు. కాబట్టి పాలకులారా... నేటి యువత మనం ఆస్వాదించిన స్వాతంత్ర్యం కంటే ఇంకాస్త ఎక్కువ స్వేచ్ఛను పొందేలా చేయండి. వారిని సంతోషంగా, స్వేచ్చా ప్రపంచంలో.. లౌకిక రాజ్యంలో విహరించేలా చేయండి. నా పోస్టు ఎవరినైనా బాధిస్తే క్షమించండి. ఇవి కేవలం నా వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే అని హర్ష తన పోస్టులో పేర్కొన్నాడు. -
మంజ్రేకర్.. నీ సహచర వ్యాఖ్యాతను అవమానిస్తావా!
కోల్‌కతా: ఇటీవల కాలంలో పదే పదే నెటిజన్ల కోపానికి గురౌవుతున్న కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి దొరికిపోయాడు. టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టుకు కామెంటేటర్‌గా వ్యవహరించిన మంజ్రేకర్.. సహచర వ్యాఖ్యాత హర్షా భోగ్లే చిన్నబుచ్చుకునేలా మాట్లాడాడు. పింక్ బాల్ టెస్టుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని ఇరు జట్ల ఆటగాళ్లను అడిగి తెలుసుకోవాలని భోగ్లే సూచించాడు. ప్రధానంగా బంతి ఎలా కనిపిస్తుంది అనే దానిపై క్రికెటర్లను అడిగితేనే కానీ తెలియదని భోగ్గే పేర్కొన్నాడు. దీనికి వెంటనే స్పందించిన మంజ్రేకర్.. ఈ విషయం నువ్వే అడగాలి. ఏమో ఏదో సాధారణ క్రికెట్ మాత్రమే ఆడం. మాకు అర్హత లేదు’ అని మాట్లాడాడు. ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హర్షా భోగ్లే క్రికెట్ ఆడకుండానే ప్రముఖ వ్యాఖ్యాతగా ఎదిగిన విషయాన్ని మంజ్రేకర్ పరోక్షంగా ప్రస్తావిస్తూ అవమానించాడని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే మంజ్రేకర్ వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు. ‘ క్రికెట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంజ్రేకర్‌ను అడగండి. ఫీల్డ్‌లో అంపైర్ ఔటిచ్చిన సందర్భంలో కూడా మంజ్రేకర్ని అడిగిన తర్వాతే ఇవ్వాలి’ అని ఒక నెటిజన్ విమర్శించగా, ‘ నువ్వు అసలు కామెంటరీ బాక్స్‌లో ఉండాలని ఏ భారత అభిమాని కోరుకోవడం లేదు’ అని మరొకరు మండిపడ్డారు. ‘ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త కామెంటేటర్ ఎవరైనా ఉన్నారంటే అది మంజ్రేకరే’ అని మరొక అభిమాని ఎద్దేవా చేశాడు. ‘ ఇరు జట్ల ఆటగాళ్లను పింక్ బాల్ ఎలా కనిపిస్తుందని అడిగితే బాగుంటుందని హర్హా భోగ్లే చెప్పిన దాంట్లో తప్పేముంది. అది ఒక మంచి వ్యాఖ్యానం. కానీ భోగ్లేతో నువ్వు చాలా దారుణంగా ప్రవర్తించావు. నీకు నీ సహచర కామెంటేటర్‌తో ఎలా మాట్లాడాలో తెలీదు. అతని కనీసం ఒక మ్యాచ్ కూడా ఆడకపోయినా కామెంటేటర్‌గా సక్సెస్ అయ్యాడు’ అని మరొకరు పేర్కొన్నారు. -
కోహ్లి.. నీకిది తగదు!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే తన ఓటు రవిశాస్త్రికేనంటూ బహిరంగంగా ప్రకటించిన కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వస్తున్నాయి. ఇంకా కోచ్ ఎంపికపై దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇలా మాట్లాడటం తగదని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే పేర్కొన్నాడు. ‘ ఇలా బహిరంగంగా చెప్పడం ఎంతమాత్రం సరైనది కాదు. దరఖాస్తులకు ఆహ్వానించిన దానికి సంబంధించిన ప్రొసెస్ ఇంకా జరుగుతుండగానే కోచ్ ఎంపికలో ముఖ్య పాత్ర పోషించే వ్యక్తులు ఇలా బహిరంగ ప్రకటనలు చేయడం తగదు’ అని భోగ్లే పేర్కొన్నాడు. అంతకుముందు కోచ్ ఎంపిక కోసం నియమించబడ్డ క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)లో సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ కూడా రవిశాస్త్రికే మద్దతు పలికాడు. రవిశాస్త్రి హయాంలో భారత్ అద్భుతమైన విజయాలో సాధించిందంటూ పేర్కొన్నాడు. ఈ రెండు ఘటనలను కోడ్ చేస్తూ హర్షా భోగ్లే ట్వీటర్ వేదికగా స్పందించాడు. (ఇక్కడ చదవండి: రవిశాస్త్రి వైపే మొగ్గు?) విండీస్ పర్యటనకు బయల్దేరి ముందు మీడియాతో ముచ్చటించిన కోహ్లి.. తనకు రోహిత్‌తో ఎటువంటి విభేదాలు లేవంటూ పేర్కొన్నాడు. జట్టులో అంతా బాగానే ఉందని, రోహిత్ సెంచరీలు సాధించిన క్రమంలో ఎక్కువగా తానే అభినందించానంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ప్రధాన కోచ్ ఎంపిక విషయంలో రవిశాస్త్రికే మద్దతు పలికాడు. ‘కోచ్ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు, శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేసేశాడు. -
కపిల్‌దేవ్ డ్రెస్‌పై సరదా వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ బయోపిక్‌లో మాజీ ఆల్ రౌండర్ కపిల్‌దేవ్ నటిస్తున్నారా? అదేంటి కపిల్ పాత్రలో కదా రణ్వీర్ నటిస్తున్నాడు. రణ్వీర్ పాత్రలో కపిల్ నటించడమేంటి అనుకుంటున్నారా? బోథమ్ చారిటి కార్యక్రమానికి వెళ్లిన కపిల్ చూసిన వాళ్లంతా ఇదే మాట అంటున్నారు. ఎరుపు రంగు టీ షర్ట్.. నీలం, తెలుపు, ఎరుపు రంగుల గీతలతో ఉన్న బాటమ్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరైయ్యాడు హరియాణా హరికేన్. చిత్రవిచిత్ర డ్రెస్సులతో మెరిసే రణ్వీర్ను తలపించాడు. కపిల్ ఫొటోను నటుడు షరీబ్ హష్మి, క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్విటర్లో షేర్ చేయడంతో నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. రణ్వీర్ బయోపిక్‌లో నటించేందుకు కపిల్ సిద్ధమవుతున్నారని చాలా మంది వ్యాఖ్యానించారు. తన బయోపిక్‌లో నటిస్తున్న రణ్‌వీర్‌కు కపిల్ ఈవిధంగా ఫేవర్ చేస్తున్నారని మరొకరు కామెంట్ చేశారు. కపిల్, రణ్వీర్ ఒకరికొకరు పరస్పరం తమ పాత్రల్లో నటించనున్నారని చలోక్తులు విసిరారు. కపిల్‌ను ఎప్పుడూ చూడనివిధంగా వెరైటీ డ్రెస్‌లో చూడటం అభిమానులకు కొత్తగా ఉంది. కపిల్‌దేవ్ సారథ్యంలో ఇండియన్ క్రికెట్ టీమ్ 1983లో ప్రపంచకప్ సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంలో సారథిగా కపిల్‌దేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ మధుర క్షణాలను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు బాలీవుడ్ దర్శకుడు కబీర్‌ఖాన్ ‘1983’ టైటిల్‌తో సినిమా మొదలుపెట్టారు. కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటిస్తున్నారు. ఈనెల 6న ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. వివాహం తరవాత తొలిసారి ఈ సినిమాలోనే జంటగా నటిస్తున్నారు రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పదుకోన్. -
ఆవును ఆవహించిన ఫుట్‌బాలర్!
-
ఆవును ఆవహించిన ఫుట్‌బాలర్.. వీడియో!
క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆవు ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను ఆయన తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. నవ్వు తెప్పించే ఈ వీడియో చూడండి అంటూ క్యాప్షన్ పెట్టారు. నిజంగానే ఈ వీడియోలోని దృశ్యాలు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తన దగ్గరకు వచ్చిన ఫుట్‌బాల్‌ను వదిలిపెట్టకుండా ఆటగాళ్లతో పాటు చేసిన ఆవు విన్యాసాలు తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియోకు 74 వేల లైక్‌లు, 2,500 కామెంట్లు వచ్చాయి. 24 మంది రిట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. గత జన్మలో ఈ ఆవు ఫుట్‌బాలర్ అని ఒకరంటే, ఫుట్‌బాలర్ ఆత్మ ఆవులోకి ప్రవేశించిందని మరొకరు వ్యాఖ్యానించారు. ఫుట్‌బాల్‌ను తన దూడగా భావించి కాపాడుకునేందుకు ఆవు అలా చేసిందని ఇంకొరు అభిప్రాయపడ్డారు. బెస్ట్ మిడ్ ఫీల్డర్ మరొకరు కితాబిచ్చారు. ఫుట్‌బాల్‌ను పుచ్చకాయ అనుకునివుండొచ్చని ఆవు పొరబడిందని కూడా కామెంట్ చేశారు. అయితే వీడియోలో ఉన్నది ఆవో, ఎద్దో స్పష్టంగా కనబడటం లేదు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలేమి లేవు. -
అది రిటైర్ అయ్యాక చెబుతా: ధోని
చెన్నై : సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోపాటు ఫ్లే ఆఫ్ బెర్త్‌ను కాయం చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై ఆటగాడు షేన్ వాట్సన్ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్బుత ఇన్నింగ్స్‌తో చెలరేగి విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా కోచ్, కెప్టెన్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం ప్రతి సీజన్లో ప్లే ఆఫ్ చేరుకుంటున్న చెన్నై జట్టు విజయ రహస్యం ఏంటని వ్యాఖ్యాత హర్షబోగ్లే ప్రశ్నించగా... కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫన్నీగా సమాధానమిచ్చాడు. ఒకవేళ అందరికీ ఆ రహస్యాన్ని చెబితే.. వచ్చే ఐపీఎల్ వేలంలో చెన్నై యాజమాన్యం తనను కొనుగోలు చేయదన్నాడు. అది వ్యాపార రహస్యమని నవ్వుతూ సమాధానమిచ్చాడు. అయితే, జట్టు విజయాల్లో అభిమానుల మద్దతు, యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహం కీలక పాత్ర పోషిస్తున్నాయన్నాడు. కెమెరాల వెనుక సహాయక బృందం తమ కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతానికి ఇంతకు మించి నేను ఎక్కువగా చెప్పలేనని, రిటైర్ అయ్యాక ఏమైనా ఉంటే చెప్తానన్నాడు. ఇక షేన్ వాట్సన్‌కు అవకాశం ఇవ్వడంపై స్పందిస్తూ.. గత మ్యాచుల్లో వాట్సన్ రాణించకలేకపోయినా సరే నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తూనే ఉన్నాడు. బంతిని అంచనా వేయడంలో వాట్సన్‌కు కచ్చితత్వం ఉంటుంది. అందుకే జట్టు యాజమాన్యం అతినికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. అలా వచ్చిన అవకాశాన్ని వాట్సన్ సద్వినియోగం చేసుకున్నాడు. జట్టు నమ్మకాన్ని నిలబెట్టాడని ధోని తెలిపాడు. బౌలింగ్‌లోనూ చెన్నై జట్టు బాగా రాణిస్తోండటం మంచి పరిణామమన్నాడు. ప్రపంచకప్ సమీపిస్తున్న సమయంలో తాను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. పస్తుతం తన వెన్ను బాగానే ఉందన్నాడు. ఇక ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్‌కు ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. -
‘అతని వరల్డ్‌కప్ బెర్తు ఖాయం’
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ షమీపై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ప్రశంసలు కురిపించాడు. భారత మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్లలో షమీ ఒకడని భోగ్లే కొనియాడాడు. దీనిలో భాగంగా కివీస్‌తో మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన షమీ వరల్డ్‌కప్ బెర్తును ఖాయం చేసుకున్నాడన్నాడు. ‘ దాదాపు ఏడాదిన్నర కాలంగా భారత్ పలువురు పేసర్లు పరీక్షిస్తూ వస్తుంది. ప్రధానంగా వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని పలు ప్రయోగాలు చేసింది. భువనేశ్వర్, బూమ్రాలకు జతగా సరైన పేసర్ కోసం అన్వేషిస్తుంది. ఈ తరుణంలో షమీ ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం. వరల్డ్‌కప్‌కు ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టులో షమీకి చోటు ఖాయం. కాకపోతే అతనిపై ఎక్కువ వర్క్‌లోడ్ పడకుండా జాగ్రత్త పడటం మంచింది. ఈ విషయంలో మాత్రం టీమిండియా యాజమాన్యం తగిన వ్యూహంతో ముందుకెళ్లాలి’ అని హర్షా భోగ్లే తెలిపాడు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో షమీ మూడు వికెట్లు సాధించి ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రోలను బౌల్డ్ చేసిన షమీ.. మిచెల్ సాంత్నార్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. దాంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 157 పరుగులకే కివీస్ ఆలౌట్ కాగా, ఆపై భారత్ 34.5 ఓవర్లలో(డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించింది. -
కోహ్లి వ్యాఖ్యలపై హర్షా భోగ్లే స్పందన
న్యూఢిల్లీ: చాలా విషయాల్లో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆచితూచి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇటీవల కోహ్లి చేసిన ఒక కామెంట్ విమర్శలకు దారి తీసింది. తన బర్త్ డే సందర్భంగా విరాట్ కోహ్లి అఫీషియల్ యాప్‌ను ఆవిష్కరించాడు. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ కోహ్లిని అనవసరంగా ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అతని బ్యాటింగ్‌లో తనకు ఎలాంటి ప్రత్యేకత కనిపించదని, అతని కంటే ఇంగ్లిష్, ఆస్ట్రేలియా ఆటగాళ్లే ఆటే నచ్చుతుందని కామెంట్ చేశాడు. అయితే ఈ మాటలను స్పోర్టివ్ గా తీసుకోలేదు కోహ్లి.. అలాంటప్పుడు ‘నువ్వు ఇండియాలో ఉండాల్సిన అవసరం లేదు.. వెళ్లి అక్కడే ఉండు. ఈ దేశంలో ఉంటూ ఆ దేశాలను ఎందుకు పొగుడుతున్నావు? ముందు నీ పద్ధతి మార్చుకో’ అంటూ క్లాస్ పీకాడు. దాంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు కోహ్లి. ‘ఒక వ్యక్తికి ఆటగాళ్లు నచ్చడం అనేది వారి అభిప్రాయాల్ని బట్టే ఉంటుంది. చాలా మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు తమ మాజీ ఆటగాళ్ల కంటే సచిన్ టెండూల్కర్‌గా పేర్కొంటారు. ఏబీ డివిలియర్స్, జయసూర్య, షాహిద్ ఆఫ్రిది ఇలా ఆటగాళ్లకు దేశాలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ఈ విషయాన్నే ఆ అభిమాని చెప్పాలని అనుకున్నాడు’ అంటూ నెటిజన్లు కోహ్లికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. కాగా, ఈ ఘటనపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించాడు. ఈ విషయంలో కోహ్లి స్పందించిన తీరు సరిగా లేదని భోగ్లే అభిప్రాయపడ్డాడు. చాలా మంది ప్రముఖులు పడిపోయే బుడగలోనే కోహ్లి కూడా పడ్డాడని అతడు అన్నాడు. కోహ్లిలాంటి సెలబ్రిటీలు ఇలాంటి బుడగలు ఏర్పడకుండా చూసుకోవాలని సూచించాడు. చాలా మంది ప్రముఖులు తమకు నచ్చే విషయాలే వినాలన్న ఓ రకమైన బుడగను తమ చుట్టూ ఏర్పర్చుకుంటారు. ఇది మంచిది కాదు. ఇదే భిన్నాభిప్రాయాలకు దారి తీస్తుంది అని భోగ్లే ట్విటర్లో తన అభిప్రాయాన్ని చెప్పాడు. Virat Kohli's statement is a reflection of the bubble that most famous people either slip into or are forced into. The voices within it are frequently those that they wish to hear. It is a comfortable bubble and that is why famous people must try hard to prevent it from forming — Harsha Bhogle (@bhogleharsha) 8 November 2018 -
భోగ్లేకు భాగ్యం లేదు
ఐపీఎల్ కామెంటేటర్ల జాబితాలో దక్కని చోటు న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ వ్యాఖ్యాత హర్షా భోగ్లేకు ఈ ఐపీఎల్‌లోనూ కామెంటరీ చేసే భాగ్యం లేకపోయింది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ సంస్థ విడుదల చేసిన ఎలైట్ ప్యానెల్ కామెంటేటర్ల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఆటకు దూరంగా ఉన్న పుణే ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ సీజన్లో తెరవెనక వినిపించనున్నాడు. 20 మంది ఎలైట్ ప్యానెల్లో అతనితో పాటు మైకేల్ క్లార్క్, సునీల్ గావస్కర్ తదితరులున్నారు. వీరంతా 47 రోజులపాటు పది వేదికల్లో తమ వ్యాఖ్యానాన్ని వినిపిస్తారు. జాబితాలో స్థానం పొందిన పలువురు కామెంటేటర్లు ఐపీఎల్–10పై ఇలా స్పందించారు. ‘ఐపీఎల్ అంటే నాకెంతో ఇష్టం. ఇంతకు మించిన ఈవెంట్ నాకేది కనిపించలేదు’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ‘గతంలో ప్లేయర్‌గా ఐపీఎల్ అనుభూతిని పొందాను. ఇప్పుడు కొత్తగా కామెంటేటర్‌గా మైక్ పట్టుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని క్లార్క్ అన్నారు. ఈయన ఇటీవల జరిగిన భారత్, ఆసీస్ టోర్నీకి వ్యాఖ్యాతగా పనిచేశారు. పీటర్సన్ మాట్లాడుతూ మళ్లీ భారత్‌లో క్రికెట్ యాక్షన్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. ‘వాడా’ జాబితాలో మూడో ఏడాదీ మూడో స్థానంలో... న్యూఢిల్లీ: క్రీడల్లో ప్రతిభ చూపడమేమో కానీ ఆటగాళ్లు డోపింగ్‌కు పాల్పడిన విషయంలో భారత్ వరుసగా ‘మంచి’ స్థానమే పొందుతోంది. అత్యధికంగా డోపింగ్‌కు పాల్పడిన దేశాలతో కూడిన జాబితాను తాజాగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) విడుదల చేసింది. 2015కు సంబంధించిన ఈ డోపింగ్ అత్రికమణ జాబితాలో భారత్ వరుసగా మూడో ఏడాదీ మూడో స్థానంలో నిలిచింది. 117 మంది భారత ఆటగాళ్లు నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు తేలారు. ‘వాడా’ జాబితాలో రష్యా సమాఖ్య (176 మంది ఆటగాళ్లు) తొలి స్థానంలో నిలవగా... ఇటలీ (129) రెండో స్థానంలో ఉంది. -
బౌలింగే సన్‌రైజర్స్ బలం
హర్షాభోగ్లే బౌలర్లు మ్యాచ్‌లను గెలిపిస్తే చూడముచ్చటగా ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కున్న వనరులు పరిమితమైనవి. జట్టులో భారీ హిట్టర్లు అనదగ్గ స్టార్లు లేరు. అయితే తమ బలమేమిటో వారు త్వరగానే తెలుసుకోగలిగారు. జట్టు ప్రధాన ఆయుధమైన బౌలింగ్‌తోనే వారు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజా ఐపీఎల్ ఆకర్షణీయంగా సాగుతున్నదంటే దానికి సన్రైజర్స్లాంటి జట్లే కారణం. వార్నర్ సేన ఇప్పుడు నిర్ణయాత్మక దశలో ఉంది. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరైన సమయంలో జట్టులో చేరాడు. ఎందుకంటే ఇంకాస్త ఆలస్యంగా అతడు జట్టులో చేరినా గాడిలో పడేందుకు సమయం ఉండేది కాదు. అలాగే పేసర్ ఆశిష్ నెహ్రా పునరాగమనం కూడా లాభించేదే. ముంబై ఇండియన్స్ జట్టులో బ్యాటింగ్ పవర్ సమృద్ధిగా ఉంది. దీంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేందుకే యత్నిస్తుంది. అలాగే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. హైదరాబాద్‌కన్నా ముంబై ఇండియన్స్ అన్నిరంగాల్లో పటిష్టంగానే ఉందని చెప్పవచ్చు. అలాగే తమ స్కోరును కాపాడుకునే సత్తా కూడా వారికి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఛేజింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చినా వారు ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాలి. -
మాటల ‘మాంత్రికుడు’
► కామెంటరీలో స్టార్ హర్షా భోగ్లే ► క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ► ఐపీఎల్లో వినిపించని గొంతు అతని మాటల్లో మత్తు ఉంటుంది, మండే స్వభావం ఉంటుంది... పదాల రసాయనం ఎంత మోతాదులో కలిపితే పేలుతుందో, పరిమితుల్లో ఉంటుందో అతనిలోని కెమికల్ ఇంజినీర్‌కు బాగా తెలుసు. ఎలా మాట్లాడితే ప్రేక్షకులకు చేరువవుతామో, అక్షరాల అల్లికతో ఏ విధంగా ఒక కార్యక్రమాన్నిహిట్ చేయవచ్చో అతనికి బాగా తెలుసు. దానికి మార్కెటింగ్ రంగు అద్ది సక్సెస్‌ఫుల్‌గా మార్చడంలో అతనిలోని ఐఐఎం విద్యార్థి తెలివితేటలు కనిపిస్తాయి.నాకు క్రికెట్ పరిజ్ఞానం ఉన్నా అతనితో మాట్లాడితే ఇంకేదో కొత్త విషయం తెలుస్తుంది’ అంటూ స్వయంగా సచిన్ నుంచి ప్రశంసలు అందుకున్నా... అది హర్షాభోగ్లేకే సాధ్యమైంది. అందుకే కావచ్చు ఒక్క టోర్నీకి అతడిని దూరం పెట్టగానే ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం ఉలిక్కి పడి అతనికి మద్దతుగా నిలిచింది. సాక్షి, హైదరాబాద్: ‘లార్డ్స్ మైదానంలో సచిన్ సెంచరీ చేయలేదు నిజమే. కానీ దాని వల్ల అక్కడి ఆనర్స్ బోర్డ్‌కే నష్టం తప్ప సచిన్‌కు కాదు’... ‘ఈ రోజు సెహ్వాగ్ అదృష్టం ఎలా ఉందంటే గంతలు కట్టుకొని హైవేపై వెళ్ళినా యాక్సిడెంట్ జరగదు’... ‘అవతలి ఎండ్‌కి చేరాలనే రూల్ ఉంది కాబట్టి గేల్ సింగిల్ తీస్తున్నాడు తప్ప లేదంటే అక్కడే ఉండిపోయేవాడు’... హర్షా భోగ్లే మాటల చాతుర్యానికి ఈ వ్యాఖ్యలు మచ్చుతునకలు. అతను గవాస్కర్‌లా ఆటలో అణువణువు విశ్లేషించే రకం కాదు. శాస్త్రిలా మైక్ బద్దలయ్యేలా అరవడు. చెప్పదల్చుకున్న అంశంలో స్పష్టత ఉంటుంది. విఫలమైన ఆటగాడిని కూడా ఏకిపారేయకుండా సున్నితమైన మందలింపు తరహాలోనే వ్యాఖ్య చేస్తాడు. ఈ శైలే అతడిని అందరిలోకి ప్రత్యేకంగా నిలబెట్టింది. క్రికెటర్ కాని కామెంటేటర్లలో నంబర్‌వన్‌ను చేసింది. భారత క్రికెట్లో భాగం క్రికెట్‌ను అభిమానించే అందరికీ హర్షా భోగ్లే గొంతు సుపరిచితం. ఆటగాడిగా మైనర్ స్థాయి క్రికెట్‌కే పరిమితమైనా... మాటగాడిగా పలువురు దిగ్గజాలతో పోటీ పడుతూ తనదైన ముద్ర వేసిన అతను, కామెంటరీ ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. దూరదర్శన్ను దాటి క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారం ఈఎస్‌పీఎన్‌లో మొదలైనప్పుడు తొలి కామెంటరీ బృందంలో సభ్యుడిగా అడుగు పెట్టిన తర్వాత... నాటినుంచి నేటి వరకు అతని మాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇన్నేళ్లలో భారత క్రికెట్లో భాగంగా మారిపోయాడు. చాలా మంది ఆటగాళ్లకంటే అతనికి పాపులార్టీ ఎక్కువ. పెప్సీ, హోండా, ఎయిర్‌టెల్‌లాంటి ఎన్నో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్లో మిలియన్‌కు పైగా ఫాలోయర్లు ఉన్న ఏకైక బ్రాడ్‌కాస్టర్ కావడం అతని పాపులార్టీకి నిదర్శనం. అవార్డులు, రివార్డులు క్రికెట్లో గణాంకాలు, రికార్డులకు ఉండే విలువే వేరు. ఆ రకంగా చూస్తే హర్ష కూడా ఎన్నో ఘనతలు సాధించాడు. 100కు పైగా టెస్టులు, 400కు పైగా వన్డేలకు కామెంటరీ చేసిన అతను టి20 క్రికెట్ పుట్టిన దగ్గరినుంచి దాదాపు ప్రతీ చోట, అన్ని ప్రపంచ కప్‌లలో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో కూడా ఆరంభంనుంచి ఉన్న అతడిని ఈ సీజన్‌కు మాత్రం అనూహ్యంగా తొలగించారు. క్రికెట్ మాత్రమే కాదు, విద్యార్థుల కోసం క్విజ్ నిర్వహణ, ట్రావెలింగ్కు సంబంధించిన షో... ఇలా ఎన్నో కార్యక్రమాల్లో అతను రాణించాడు. ఇక వేర్వేరు చానల్స్, సైట్ల ద్వారా లెక్కలేనన్ని సార్లు ఫేవరేట్ కామెంటేటర్ అవార్డులు అందుకున్నాడు. క్రికెటర్ కాకుండానే క్రికెట్లో సూపర్ స్టార్ స్థాయికి అతను ఎదిగాడని చెప్పడంలో సందేహం లేదు. సీజన్ నుంచి అవుట్ ఐపీఎల్-9 ప్రచార వీడియోలో ఉన్నాడు, ఆ తర్వాత మ్యాచ్‌ల కోసం ఫ్లయిట్ టికెట్లు కూడా పంపించారు. కానీ భోగ్లేకు కారణం చెప్పకుండానే కామెంటరీ బృందంనుంచి తప్పిస్తున్నట్లు సమాచారం అందించారు. సరిగ్గా కారణమేమిటో బీసీసీఐ చెప్పలేదు. అతను కూడా తనకేమీ తెలీదని చెప్పుకున్నాడు. కానీ వరల్డ్ కప్ సందర్భంగా మన కామెంటేటర్లు ప్రత్యర్థి జట్లకు మద్దతుగా మాట్లాడుతున్నారని నటుడు అమితాబ్ బచ్చన్ బహిరంగంగా వ్యాఖ్యానించడం, ఈ అభిప్రాయానికి ధోని కూడా మద్దతు పలకడం కారణమని వినిపిస్తోంది. మరో వైపు నాగ్‌పూర్ మ్యాచ్ సందర్భంగా విదర్భ క్రికెట్ సంఘం అధికారితో వాదన జరగడం శశాంక్ మనోహర్ ఆగ్రహానికి కారణమైందని కూడా తెలిసింది. అయితే అతడిని తప్పించిన రోజున క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం భోగ్లేకు అండగా నిలిచారు. రాజకీయాలతో ఒక మంచి వ్యక్తిని ఎలా తప్పిస్తారంటూ తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఒక కామెంటేటర్‌కు ఈ స్థాయిలో మద్దతు దక్కడం అనూహ్యం . అది భోగ్లే గొప్పతనం. ఈ ఐపీఎల్‌కు అతను దూరమైనా భోగ్లేలాంటి వ్యాఖ్యాతను ఏ చానల్ కూడా కావాలని పక్కన పెట్టదు. కాబట్టి ఇక ముందు సిరీస్‌లలో అతని గొంతు మళ్ళీ వినిపించడం ఖాయం. మన హైదరాబాదీయే... మరాఠీ కుటుంబానికి చెందిన 55 ఏళ్ల హర్షా భోగ్లే స్వస్థలం హైదరాబాద్. బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదివిన అతను... నగరంలోనే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం ప్రతిష్టాత్మక ఐఐఎం అహ్మదాబాద్‌లో పీజీ చేశాడు. అవకాశం వచ్చినప్పుడల్లా నగరంలో వేర్వేరు కార్యక్రమాల నిర్వహణ ద్వారా అతను భాగ్యనగరంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తుంటాడు. ‘చైల్డ్ ఆఫ్ డెస్టినీ’ పేరుతో అజహరుద్దీన్ జీవిత చరిత్రను రాసింది ఇతనే. ఆ తర్వాత అతని వ్యాసాల సంకలనం ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ పేరుతో పుస్తకంగా వచ్చింది. తన భార్యతో కలిసి ‘విన్నింగ్ వే’ అనే పుస్తకాన్ని కూడా రచించిన భోగ్లే... ప్రస్తుతం కామెంటరీతో పాటు పలు కార్పొరేట్ సంస్థల్లో మేనేజర్లకు క్రీడా పాఠాలు కూడా చెబుతుంటాడు. -
'అది క్రికెటర్ల ఫిర్యాదుగా భావించడం లేదు'
న్యూఢిల్లీ: ఐపీఎల్-9వ సీజన్ ఆరంభంలోనే ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆకస్మికంగా తొలగించడం వెనుక కారణాలేమిటన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ టీ 20 అనంతరం భారత క్రికెట్ జట్టులోని కొంతమంది సీనియర్ క్రికెటర్లు బోగ్లేపై ఫిర్యాదు చేయడంతోనే అతన్ని కామెంటేటర్ పదవికి ఉద్వాసన పలికారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను హర్షా బోగ్లే ఖండించాడు. టీమిండియా క్రికెటర్లు తనపై ఫిర్యాదు చేసి తొలగింపుకు కారణమవుతారని అనుకోవడం లేదన్నాడు. 'వ్యాఖ్యాతగా ఉన్న నేను ప్రతీ క్రికెటర్ గురించి మాట్లాడుతుంటాను. వాళ్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కామెంటరీతో వారు చేసే పరుగుల్ని, వికెట్లను, క్యాచ్‌లను ఆపలేను. ఒక యూనివర్శిటీ స్థాయి క్రికెటర్ అయినా వారి గురించి చెప్పడమే నా విధి. అటువంటప్పుడు క్రికెటర్లు నా గురించి ఫిర్యాదు చేస్తారని ఎలా అనుకుంటాను. అది క్రికెటర్ల పని కాదనేది నా బలమైన నమ్మకం' అని హర్షాబోగ్లే పేర్కొన్నాడు. భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. -
ఐపీఎల్-9 వివాదంలో మిస్టరీ
ఐపీఎల్-9వ సీజన్‌నూ వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ నుంచి ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను ఉన్నఫళంగా తొలగించడానికి కారణమేంటన్నది మిస్టరీగా మారింది. దీనికి కొందరు టీమిండియా సీనియర్ క్రికెటర్లే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. భోగ్లేకు వ్యతిరేకంగా వారు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. టి-20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా సీనియర్ క్రికెటర్లు భోగ్లేపై బోర్డుకు ఫిర్యాదు చేసి ఉంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు సురేష్ రైనా, అశ్విన్ మీడియా సమావేశాల్లో దురుసుగా మాట్లాడటాన్ని నెటిజన్లు ప్రస్తావించారు. భోగ్లే ఇటీవల విదర్భ క్రికెట్ సంఘం గురించి పరుష వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. భోగ్లే పేరును ప్రస్తావించకుండా ఇటీవల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భోగ్లే ఉద్వాసనకు కారణమేంటన్నది మిస్టరీగా మారింది. -
ఐపీఎల్ -9లో మరో వివాదం
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు, రెండు దిగ్గజ జట్లపై వేటు, లలిత్ గేట్.. ఇలా అనేక అవరోధాలను దాటుకుంటూ ప్రారంభమైన ఐపీఎల్ 9వ సీజన్ లో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించే అంశం కోర్టుదాకా వెళ్లింది. తాజాగా ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేపై బీసీసీఐ అనూహ్యరీతిలో వేటువేసింది. హర్షా భోగ్లే కామెంటేటింగ్ కాంట్రాక్టును బోర్డు ఉన్నపళంగా రద్దుచేసింది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటర్లపై.. ప్రధానంగా హర్షా భోగ్లేను ఉద్దేశిస్తూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కామెంట్లుకూడా వేటుకు బలమైన కారణమని తెలుస్తున్నది. సోషల్ మీడియా ద్వారా కామెంటేటర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలను సేకరిస్తోన్న బీసీసీఐ.. అదే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కారణంగా హర్షా భోగ్లేపై వేటు వేసినట్లు ఓ అధికారి చెప్పారు. కామెంట్రీపై ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 9వ సీజన్ ప్రారంభమైన రోజే హర్షాను కామెంటేటర్ల ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. హర్షా కూడా తాను ఇకపై ఐపీఎల్ కు అందుబాటులో ఉండబోనంటూ ట్వీట్ చేశారు. వరల్డ్ కప్ లో ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియన్ కామెంటేటర్లు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లు తాను చేసినవే కావడంతో మ్యాచ్ అనంతరం హర్షా భోగ్లే తనను తాను సమర్థించుకున్నారు. ఇదేకాకుండా న్యూజిలాండ్ తో నాగపూర్ లో జరిగిన ప్రారంభమ్యాచ్ లోనూ విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో గొడవపడ్డారట హర్షా భోగ్లే. రెండు భాషల్లో (ఇంగ్లీష్, హిందీల్లో) కామెంట్రీ చెప్పేందుకు అస్తమానం అటూఇటూ తిరుగుతోన్న హర్షాను 'ఇది వీఐపీ లాంజ్ మీరు నిమిషానికోసారి అలా తిరిగితే కుదరదు'అని చెప్పారట. దీనికి హర్షా సదరు అధికారులపై చిందులేశారట. అన్ని కారణాలను బేరిజు వేసుకున్న తర్వాత హర్షాకు షాక్ ఇవ్వాల్సిందేనని ఫిక్సైన బీసీసీఐ ఆయనపై వేటు వేసింది. ఐపీఎల్ ప్రసార హక్కులు సోని-ఈఎస్ పీఎన్ చానెల్ వి కాబట్టి వారు పట్టుబట్టి హర్షాభోగ్లేను కొనసాగిస్తారా, లేక బీసీసీఐ నిర్ణయానికి సరేనంటారా చూడాలి. శని, ఆదివారాలనాటి మ్యాచ్ లకైతే భోగ్లే అందుబాటులోలేరు. 90వ దశకం నుంచి క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్న హర్షా భోగ్లే ఐపీఎల్ ప్రారంభం(2008) నుంచి ఆ టోర్నీకి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
సచిన్ కోసం కామెంటేటర్ గా మారిన అమీర్ ఖాన్
సచిన్ టెండూల్కర్ ఆడుతున్న చివరి టెస్ట్ అనేక విశేషాలకు వేదికైంది. సచిన్ ఆటనే కాకుండా బాలీవుడ్ తారల్లో కొందరు వాంఖెడే స్టేడియానికి తరలివచ్చారు. సచిన్ ఆటను చూడటానికి వచ్చిన బాలీవుడ్ తారల్లో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అమీర్ ఖాన్ కామెంటేటర్ గా మారడం క్రికెట్ అభిమానులను ఆకర్షించింది. క్రికెట్ కామెంటేటర్లు రవిశాస్త్రి, హర్షా భోంగ్లేతో కలిసి అమీర్ ఖాన్ కామెంటేటర్ అవతారం ఎత్తారు. కామెంటరీ బాక్సులో సచిన్ తో ఉన్న అనుబంధాన్ని, గడిపిన క్షణాలను అమీర్ ఖాన్ నెమరు వేసుకున్నారు. దూమ్ 3 చిత్రంలోని దూమ్ మచాలే పాటను క్రికెట్ దేవుడికి అంకితమిచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి దూమ్3 చిత్ర ప్రమోషన్ ఈవెంట్ ఈ సాయంత్రం 4.30 గంటలకు ఉండగా, ఈ సాయంత్రం 6 గంటలకు వాయిదా వేశారు. వెస్టిండీస్ ఆలౌట్ అయిందనే సమాచారం అందుకున్న అమీర్ ఖాన్ స్టూడియోలో అన్ని పనులు వదులకొని తాను అదృష్టంగా భావించే నీలం రంగు టీషర్ట్ వేసుకుని స్టేడియంలో అడుగుపెట్టారు.