హర్షాభోగ్లే
బౌలర్లు మ్యాచ్‌లను గెలిపిస్తే చూడముచ్చటగా ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కున్న వనరులు పరిమితమైనవి. జట్టులో భారీ హిట్టర్లు అనదగ్గ స్టార్లు లేరు. అయితే తమ బలమేమిటో వారు త్వరగానే తెలుసుకోగలిగారు. జట్టు ప్రధాన ఆయుధమైన బౌలింగ్‌తోనే వారు ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజా ఐపీఎల్ ఆకర్షణీయంగా సాగుతున్నదంటే దానికి సన్‌రైజర్స్‌లాంటి జట్లే కారణం. వార్నర్ సేన ఇప్పుడు నిర్ణయాత్మక దశలో ఉంది. డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సరైన సమయంలో జట్టులో చేరాడు. ఎందుకంటే ఇంకాస్త ఆలస్యంగా అతడు జట్టులో చేరినా గాడిలో పడేందుకు సమయం ఉండేది కాదు. అలాగే పేసర్ ఆశిష్ నెహ్రా పునరాగమనం కూడా లాభించేదే. ముంబై ఇండియన్స్ జట్టులో బ్యాటింగ్ పవర్ సమృద్ధిగా ఉంది. దీంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేందుకే యత్నిస్తుంది.
అలాగే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. హైదరాబాద్‌కన్నా ముంబై ఇండియన్స్ అన్నిరంగాల్లో పటిష్టంగానే ఉందని చెప్పవచ్చు. అలాగే తమ స్కోరును కాపాడుకునే సత్తా కూడా వారికి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఛేజింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చినా వారు ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయాలి.
బౌలింగే సన్‌రైజర్స్ బలం
Published Sun, May 8 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM
Advertisement
Advertisement