PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ దావన్ మాత్రం అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న ధావన్ మాత్రం తన పట్టుదలను కోల్పోలేదు.
ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు 143 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకునే సమయంలో ప్రముఖ మ్యాచ్ ప్రెజెంటర్, వాఖ్యత హర్షా భోగ్లే, ధావన్ మధ్య ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది.
ఏం జరిగిందంటే?
ఏప్రిల్ 5న గౌహతి వేదికగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో గబ్బర్ 86 పరుగులు చేశాడు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం హర్షా భోగ్లే ధావన్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో "శిఖర్ ధావన్‌ను తన స్ట్రైక్ రేట్‌ను మరింత పెంచుకోవాలి. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. ముఖ్యంగా గహహుతి వంటి వికెట్‌పై మరింత దూకుడుగా ఆడాలి.
ఆఖరిలో అతడు తన స్ట్రైక్ రేట్‌ను పెంచాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఆరంభంలో సింగిల్స్ మాత్రమే తీశాడు. అతడి ఇన్నింగ్స్ చూస్తే..జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడా లేదా అన్న సందేహం కలుగుతుందని" భోగ్లే పేర్కొన్నాడు. ఇక తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో పోస్ట్ మ్యాచ్ ప్రేజేటేషన్ సందర్భంగా బోగ్లే వ్యాఖ్యలకు గబ్బర్ కౌంటర్ ఇచ్చాడు.
"ఇప్పుడు నా స్ట్రైక్ రేట్‌తో మీరు సంతోషంగా ఉన్నారా" అని ధావన్ నవ్వుతూ బోగ్లేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా "ఈ మ్యాచ్‌లో మీ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఆడిన ఇన్నింగ్స్ వర్ణాతీతం. నిజంగా మీ స్ట్రైక్ రేట్ పట్ల సంతోషంగా ఉన్నాను" అంటూ బోగ్లే సమాధానం ఇచ్చాడు.
చదవండి: IPL 2023 GT vs KKR: నరాలు తెగ ఉత్కంఠ.. సంచలన విజయం! కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా
Comments
Please login to add a commentAdd a comment