ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. తను ఎంచుకున్న జట్టుకు కెప్టెన్‌గా భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్‌కే మాజీ సారధి ఎంఎస్ ధోనిని భోగ్లే ఎంపిక చేశాడు. అదే విధంగా తన జట్టు ఓపెనర్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్స్ క్రిస్ గేల్, విరాట్ కోహ్లిలకు అవకాశమిచ్చాడు. ఐపీఎల్‌లో వీరిద్దరూ ఓపెనర్లుగా 28 ఇన్నింగ్స్‌లలో 1210 పరుగుల సాధించారు.
నాలుగు సార్లు 50కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక మూడో స్ధానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు భోగ్లే చోటిచ్చాడు. ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్ రైనానే. తన ఐపీఎల్ కెరీర్‌లో ఏకంగా 109 క్యాచ్‌లను రైనా అందుకున్నాడు.
అతడిని అభిమానులు ముద్దగా చిన్న తలా పిలుచుకుంటున్నారు. ఇక నాలుగో స్ధానంలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు భోగ్లే ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 2017 నుంచి ముంబై ఇండియన్స్ ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్య.. ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లను ఆడాడు.
అదే విధంగా హర్ష తన జట్టుకు కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్‌గా ధోనినే ఎంచుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్, వికెట్ కీపర్లలో ఒకడిగా ధోని పేరు గాంచాడు. ఇక ఈ జట్టులో ఆల్‌రౌండర్‌గా భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు హర్షా అవకాశమిచ్చాడు.
ఫాస్ట్ బౌలర్ల కోటాలో శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగా, టీమిండియా పేసర్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కింది. ఇక చివరగా స్పిన్నర్లగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్‌లకు ఛాన్స్ లభించింది. అయితే ఈ జట్టులో భారత కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం గమనార్హం.
హర్షా భోగ్లే ఐపీఎల్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, సురేష్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోని (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్, సునీల్ నరైన్
Comments
Please login to add a commentAdd a comment