PC: IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ టోర్నీ. ఐపీఎల్‌లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే కాసుల వర్షం కురవడం ఖాయం. ఇంతటి ఖ్యాతి ఉన్న పొట్టి లీగ్‌లో.. కెప్టెన్లుగా ఇప్పటికే తమ జట్లను ఐదుసార్లు చాంపియన్లుగా నిలిపిన ఘనత టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)ల సొంతం.
ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడితే
కానీ.. మరో స్టార్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం ఐపీఎల్ ట్రోఫీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఈ ముగ్గురు మేటి క్రికెటర్లలో ధోని 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తోనే ఉండగా.. కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రోహిత్ మాత్రం ఆరంభంలో దక్కన్ చార్జర్స్‌కు ఆడినా.. తర్వాత ముంబై ఇండియన్స్‌లో చేరాడు.
ఇదిలా ఉంటే... ఈ ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది? ముగ్గురిలో ఒకరిని మాత్రమే తుదిజట్టులోకి తీసుకోవాలనే నిబంధన ఉంటే?.. ఇలాంటి క్రేజీ ప్రశ్నే ఎదురైంది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్‌లకు ఎదురైంది. ఇందుకు మైకేల్ వాన్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.
ధోనిని ఆడిస్తాను.. కెప్టెన్‌గా
‘‘నేనైతే ఎంఎస్ ధోనిని ఆడిస్తాను. అతడి కంటే మెరుగైన ఆటగాడు మరొకరు ఉండరు. అంతేకాదు నా జట్టుకు ధోనినే కెప్టెన్. విరాట్‌కు నా జట్టులో స్థానం ఉండదు. అతడిని వేరే జట్టుకు అమ్మేస్తాను. ఎందుకంటే అతడు ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.
రోహిత్ ఓవరాల్‌గా ఆరుసార్లు గెలిచాడు. ధోనికి ఐదు ట్రోఫీలు ఉన్నాయి. కాబట్టి ధోనిని ఆడించి.. రోహిత్‌ను అతడికి సబ్‌స్టిట్యూట్‌గా పెడతా. విరాట్‌కు మాత్రం చోటివ్వను’’ అని మైకేల్ వాన్ ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.
చదవండి: టీమిండియాకు అతడే కీలకం.. ఆ ఒక్కడిని కట్టడి చేస్తే: కమిన్స్
Comments
Please login to add a commentAdd a comment