Adam Gilchrist
-
వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం!
ఆడమ్ గిల్‌క్రిస్ట్.. ప్రపంచ క్రికెట్‌ను ఏలిన గొప్ప వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడు. ఆస్ట్రేలియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తన ఆటతో, వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాకు ఓంటి చేత్తో ఎన్నో విజయాలను అందించిన ఘనత అతడిది.ఆసీస్ తరపున మూడు వన్డే వరల్డ్‌కప్ టైటిల్స్ అతడి ఖాతాలో ఉన్నాయి. 2007 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గిల్లీ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికి సగటు క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ ఆసీస్ లెజెండ్ ఆ మరుసటి ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశాడు. 2008లో భారత్‌తో జరిగిన అడిలైడ్ టెస్టు మధ్యలో తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. తన కెరీర్లో 100 టెస్టుల మైలు రాయిని అందుకోవడానికి కేవలం 4 మ్యాచ్‌ల దూరంలో ఉన్న సమయంలో గిల్లీ రిటైర్మెంట్ ప్రకటించడం అప్పటిలో తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే తాజాగా గిల్‌క్రిస్ట్ తన సడన్ రిటైర్మెంట్కు గల కారణాన్ని వెల్లడించాడు. భారత దిగ్గజ బ్యాటర్ వీవీయస్ లక్ష్మణ్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టిన కారణంగానే తను రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు గిల్లీ తెలిపాడు. వెంటనే తన నిర్ణయాన్ని మరో ఆసీస్ లెజెండ్ మాథ్యూ హేడెన్‌కి చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ అన్నాడు."నేను చివరగా నా కెరీర్లో భారత్‌పై ఆడాను. ఆడిలైడ్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. బ్రెట్ లీ బౌలింగ్‌లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాను. కానీ బంతిని సరిగ్గా అందుకోలేకపోయాను. ఆ రోజు రాత్రి నా భార్యకు ఫోన్ చేసి మాట్లాడాను. మేము భారత్‌తో సిరీస్ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్నాం. అందుకు సంబంధించిన విషయాలను ఆమెతో చర్చించాను.విండీస్ పర్యటనలో మొత్తం మూడు మ్యాచ్‌లతో కలిపి నా 99వ టెస్టు మ్యాచ్ మార్క్‌ను అందుకోనున్నాను. ఆ తర్వాత మేము ఇండియా టూర్‌కు వెళ్లనున్నాం. భారత్‌లో నా 100వ టెస్టు ఆడతాను అని ఆమెతో చెప్పాను. 100 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్ల లిస్టులో చేరుతానని భావించాను. ఆ అరుదైన గౌరవం దక్కుతుందని నేను అనుకున్నాను. కానీ ఆ మరుసటి రోజు నా కథ మొత్తం మారిపోయింది.ఆ తర్వాతి రోజు ఆటలో భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన సునయాస క్యాచ్‌ను నేను జారవిడిచాను. లక్ష్మణ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న వచ్చిన బంతి నా గ్లవ్స్‌లో పడి నేలకు తాకింది. దీంతో ఈజీ క్యాచ్‌ను అందుకోలేకపోయాను. ఎలా మిస్స్ అయ్యిందో అని బిగ్ స్క్రీన్ మీద రిప్లే చూశాను. పదే పదే అదే చూపించారు. ఏకంగా 32 సార్లు దాన్ని ప్లే చేస్తూనే వచ్చారు. ఇక చాలు, విడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను. వెంటనే స్లిప్‌లో ఉన్న మాథ్యూ హేడెన్ వైపు చూస్తూ నా పని అయిపోయింది, నేను రిటైర్మెంట్ అవ్వాల్సిన సమయం అసన్నమైంది చెప్పాను. వెస్టిండీస్ పర్యటను గురించి ఆలోచించకండి, భారత్‌లో 100వ టెస్టు గురించి కూడా ఆలోచించవద్దు చెప్పా. బంతి, నా గ్లవ్స్‌ని తాకి పిచ్‌పైన పడ్డప్పుడే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని హెడన్తో అన్నాను. కానీ హెడన్ మాత్రం నేను అటువంటి సంచలన నిర్ణయం తీసుకోకుండా ఒప్పించే ప్రయత్నం చేశాడని క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లో పేర్కొన్నాడు. కాగ గిల్లీ ఆసీస్ తరపున 96 టెస్టుల్లో 47.6 సగటుతో 5570 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.చదవండి: 'టాటా, బై బై.. నీ పని అయిపోయింది'.. పాక్ హెడ్ కోచ్‌పై సంచలన వ్యాఖ్యలు -
‘ధోని, రోహిత్‌లకే చోటు.. కోహ్లిని అమ్మేస్తాను’
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 క్రికెట్ టోర్నీ. ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే కాసుల వర్షం కురవడం ఖాయం. ఇంతటి ఖ్యాతి ఉన్న పొట్టి లీగ్‌లో.. కెప్టెన్లుగా ఇప్పటికే తమ జట్లను ఐదుసార్లు చాంపియన్లుగా నిలిపిన ఘనత టీమిండియా దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్)ల సొంతం.ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడితే కానీ.. మరో స్టార్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి మాత్రం ఐపీఎల్ ట్రోఫీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక ఈ ముగ్గురు మేటి క్రికెటర్లలో ధోని 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తోనే ఉండగా.. కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రోహిత్ మాత్రం ఆరంభంలో దక్కన్ చార్జర్స్‌కు ఆడినా.. తర్వాత ముంబై ఇండియన్స్‌లో చేరాడు.ఇదిలా ఉంటే... ఈ ముగ్గురు లెజెండ్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది? ముగ్గురిలో ఒకరిని మాత్రమే తుదిజట్టులోకి తీసుకోవాలనే నిబంధన ఉంటే?.. ఇలాంటి క్రేజీ ప్రశ్నే ఎదురైంది ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్క్రిస్ట్లకు ఎదురైంది. ఇందుకు మైకేల్ వాన్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.ధోనిని ఆడిస్తాను.. కెప్టెన్‌గా‘‘నేనైతే ఎంఎస్ ధోనిని ఆడిస్తాను. అతడి కంటే మెరుగైన ఆటగాడు మరొకరు ఉండరు. అంతేకాదు నా జట్టుకు ధోనినే కెప్టెన్. విరాట్‌కు నా జట్టులో స్థానం ఉండదు. అతడిని వేరే జట్టుకు అమ్మేస్తాను. ఎందుకంటే అతడు ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. రోహిత్ ఓవరాల్‌గా ఆరుసార్లు గెలిచాడు. ధోనికి ఐదు ట్రోఫీలు ఉన్నాయి. కాబట్టి ధోనిని ఆడించి.. రోహిత్‌ను అతడికి సబ్‌స్టిట్యూట్‌గా పెడతా. విరాట్‌కు మాత్రం చోటివ్వను’’ అని మైకేల్ వాన్ ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. చదవండి: టీమిండియాకు అతడే కీలకం.. ఆ ఒక్కడిని కట్టడి చేస్తే: కమిన్స్ View this post on Instagram A post shared by cricket.com (@cricket.com_official) -
గిల్‌క్రిస్ట్ టాప్-3 వికెట్ కీపర్లు వీరే.. ధోనికి ఛాన్స్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. తన బ్యాటింగ్, కీపింగ్ స్కిల్స్‌తో ప్రత్యర్ధిలకు చుక్కలు చూపించిన చరిత్ర గిల్ క్రిస్ట్ది. ఈ ఆసీస్ క్రికెట్ దిగ్గజం తనకు ఇష్టమైన ముగ్గురు వికెట్ కీపర్లను తాజాగా ఎంచుకున్నాడు. అందులో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంస్ ధోనికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో మొదటి స్థానం తన రోల్ మోడల్ అయిన ఆసీస్ మాజీ వికెట్ కీపర్ రాడ్నీ మార్ష్‌కు గిల్‌క్రిస్ట్ ఇచ్చాడు."రోడ్నీ మార్ష్ నా రోల్‌మోడల్. అతడిని ఆదర్శంగా తీసుకుని వికెట్ కీపర్‌గా ఎదిగాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ఫీల్డ్‌లో ధోని ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతడి కూల్‌నెస్ అంటే నాకెంతో ఇష్టం. ఇక చివరగా నా మూడో ఫేవరేట్ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర. అతడొక క్లాస్. వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు టాప్ ఆర్డర్లో విజయవంతమైన బ్యాటర్" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: గిల్‌క్రిస్ట్‌ను అధిగమించిన డికాక్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా యూఎస్ఏతో నిన్న (జూన్ 19) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ మెరుపు అర్దశతకంతో (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ హాఫ్ సెంచరీతో డికాక్ ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ వికెట్‌కీపర్, బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో శ్రీలంక ఆల్‌టైమ్ గ్రేట్ కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు.ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లు వీరే..కుమార సంగక్కర (84 ఇన్నింగ్స్‌ల్లో 2855 పరుగులు)క్వింటన్ డికాక్ (53 ఇన్నింగ్స్‌ల్లో 1685 పరుగులు)ఆడమ్ గిల్‌క్రిస్ట్ (50 ఇన్నింగ్స్‌ల్లో 1636 పరుగులు)జోస్ బట్లర్ (56 ఇన్నింగ్స్‌ల్లో 1550 పరుగులు)ముష్ఫికర్ రహీం (61 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు)కాగా, యూఎస్ఏతో నిన్న జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (74), మార్క్రమ్ (46), క్లాసెన్ (36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (20 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (80 నాటౌట్), హర్మీత్ సింగ్ (38) యూఎస్ఏను గెలిపించేందుకు విపలయత్నం చేశారు. సౌతాప్రికా బౌలర్లలో కగిసో రబాడ (4-0-18-3) అద్భుతంగా బౌలింగ్ చేసి యూఎస్ఏను కట్టడి చేశాడు. -
నువ్వేమీ హెడెన్ కాదు.. జస్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్‌వి: సెహ్వాగ్
‘‘అనుభవమే ప్రాతిపదికగా అతడిని జట్టులోకి తీసుకుని ఉంటే మాత్రం.. అతడు అందుకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు. కనీసం కొంతసేపైనా క్రీజులో నిలబడాలి కదా.షార్ట్ బాల్‌ను కూడా పుల్ షాట్ ఆడటానికి నువ్వేమీ మాథ్యూ హెడెన్వో లేదంటే ఆడం గిల్క్రిస్ట్వో కాదు. కేవలం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆటగాడివి అంతే. నీ స్థాయి, ప్రమాణాలకు తగ్గట్లు ఆడాలి.హుక్ లేదంటే పుల్ షాట్ ఆడే నైపుణ్యం నీకు లేనట్లయితే.. నీకు తెలిసిన షాట్లు మాత్రమే ఆడవచ్చు కదా!’’ అంటూ బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు.టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో షకీబ్ పూర్తిగా విఫలం కావడంతో ఈ మేరకు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా గ్రూప్-డిలో భాగమైన బంగ్లాదేశ్ సోమవారం నాటి మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలుపునకు దూరమైంది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 113 పరుగులు చేసింది.స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా ఆది నుంచే తడబడింది. టాపార్డర్ చేతులెత్తేయగా.. నాలుగో స్థానంలో వచ్చిన షకీబ్ అల్ హసన్ కేవలం మూడు పరుగులే చేశాడు. అనవసరపు షాట్‌కు యత్నించి అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.జట్టులో సీనియర్ ఆటగాడైన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇలా పూర్తిగా నిరాశపరచడంతో సెహ్వాగ్ పైవిధంగా స్పందించాడు. ఆస్ట్రేలియా దిగ్గజాలు మాథ్యూ హెడెన్, ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేర్లు ప్రస్తావిస్తూ విమర్శించాడు. తెలిసిన షాట్లు మాత్రమే ఆడుతూ తెలివిగా వ్యవహరించే బాగుండి ఉండేదని క్రిక్‌బజ్ షోలో షకీబ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.కాగా ఈ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ ఒక ఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీ20 ప్రపంచకప్ మొదటి ఎడిషన్(2007) నుంచి ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మాత్రమే! ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024 గ్రూప్-డిలో ఉన్న బంగ్లాదేశ్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి.. ఒకటి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు.. బంగ్లాపై విజయంతో మూడో గెలుపు నమోదు చేసిన సౌతాఫ్రికా సూపర్-8లో అడుగుపెట్టింది.చదవండి: SA vs Ban: నరాలు తెగే ఉత్కంఠ: ఆ క్యాచ్ గనుక వదిలేసి ఉంటే.. -
CSK Vs MI: 'హార్దిక్ ఒంటరిగా ఫీలవుతున్నాడు.. ముంబై జట్టులో ఏదో జరుగుతోంది'
ఐపీఎల్-2024లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతుంది. ఈ ఏడాది సీజన్‌తో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి తిరిగి గాడిలో పడినట్లు కన్పించిన ముంబై.. మళ్లీ పాత ఆట తీరునే కనబరిచించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్‌లో హార్దిక్ మాట్లాడుతూ.. సీఎస్కేకు వికెట్ల వెనక ధోని లాంటి మాస్టర్ మైండ్ ఉన్న ఆటగాడు ఉన్నాడు. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ధోనికి బాగా తెలుసు. అందుకు తగ్గట్టు మిగతా ఆటగాళ్లకు సూచనలు ఇస్తుంటాడని హార్దిక్ చెప్పుకోచ్చాడు. దీంతో ముంబై జట్టులో రోహిత్, బుమ్రా వంటి సీనియర్ల ఆటగాళ్ల నుంచి మద్దతు హార్దిక్‌కు లేదని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. కాగా రోహిత్ స్ధానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంపికచేసినప్పటి నుంచి ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయిందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది రోహిత్‌కు సపోర్ట్‌గా ఉంటే మరి కొంతమంది హార్దిక్ వైపు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు హార్ధిక్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి క్రెడిట్ ఇవ్వడానికి బదులుగా హార్దిక్.. ధోని పేరును ప్రస్తావించడం తనను ఆశ్చర్యపరిచందని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. "పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ధోని గురించి హార్దిక్ చేసిన కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. హార్దిక్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జట్టులో తనకు సహాచరుల నుంచి సపోర్ట్ లేనిట్లు అన్పిస్తోంది. అతడు తన నిర్ణయాలతో ముందుకు వెళ్లుతున్నట్లు నేను భావిస్తున్నాను. ఈ మ్యాచ్‌లో అద్బుతంగా ఆడిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గురించి హార్దిక్ కనీసం మాట్లాడలేదు. అతడు కెప్టెన్సీకి కూడా క్రెడిట్ ఇవ్వలేదు. అతడి వెనుక ధోని ఉన్నాడని అందుకే సీఎస్కే గెలుస్తుందని పాండ్యా చెబుతున్నాడు. దీని బట్టి హార్దిక్ ఆలోచనా విధానం ఎలా ఉందో నాకు ఆర్ధమవుతోంది. హార్దిక్ ఒంటరిగా ఫీలవుతున్నాడు. ముంబై ఇండియన్స్ క్యాంపులో ఆనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే కొనసాగితే ఈ టోర్నీలో ముందుకు సాగడం కష్టమని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లీ పేర్కొన్నాడు. -
అంపైర్‌తో గొడవపడ్డ పంత్.. తప్పెవరిది?.. మండిపడ్డ దిగ్గజం
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. రివ్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో చాలాసేపు వాగ్వాదానికి దిగాడు. ఆఖరికి తప్పు తనదే అని తేలడంతో మిన్నకుండిపోయాడు. లక్నో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో ఈ ఘటన జరగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్ రిషభ్ పంత్ తీరుపై మండిపడ్డాడు. అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించిన పంత్ లాంటి ఆటగాళ్లను కచ్చితంగా పనిష్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా లక్నోలో ఢిల్లీతో జరిగిన శుక్రవారం నాటి మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రీప్లేలో పంత్ రివ్యూ కోరినట్లుగానే ఈ క్రమంలో మూడో ఓవర్లో బంతిని కెప్టెన్ పంత్ ఇషాంత్ శర్మకు ఇచ్చాడు. నాలుగో బాల్‌ను అంపైర్ వైడ్‌గా ప్రకటించగా.. పంత్ రివ్యూకు అప్పీలు చేసినట్లుగా కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ అడిగి అతడితో కన్ఫామ్ చేసుకునీ మరీ డీఆర్ఎస్ కాల్ ఇచ్చాడు. రివ్యూలో అది వైడ్ బాల్‌గానే తేలడంతో పంత్ అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో అసలు తాను డీఆర్ఎస్ కోరనేలేదని అంపైర్‌తో వాదించాడు. అయితే, రీప్లేలో పంత్ రివ్యూ సిగ్నల్ ఇచ్చినట్లుగా తేలింది. అయితే, అతడు ఫీల్డర్లతో సంప్రదించేందుకు అలా చేశాడా? లేదంటే నిజంగానే అంపైర్‌కే సిగ్నల్ ఇచ్చాడా అన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ గొడవ జరిగింది. పంత్ తీరుపై ఆసీస్ దిగ్గజం ఆగ్రహం ఈ నేపథ్యంలో ఆడం గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘‘అంపైర్లకు మ్యాచ్‌ను నియంత్రించేందుకు మరింత వెసలుబాటు కల్పించాలి. ఏ ఫార్మాట్లోనైనా ఇలాంటి విషయాల్లో తమ పని తాము చేసుకునే వీలు ఉండాలి. రిషభ్ పంత్ రివ్యూకు వెళ్లాడా లేదా అన్నది ఇక్కడ వాగ్వాదానికి దారితీసింది. సమన్వయలోపం జరిగిందనే అనుకుందాం. కానీ అందుకోసం సుమారు 3- 4 నిమిషాలు వృథా అయ్యాయి. రిషభ్ పంత్ ఒక్కడే కాదు.. ఇంతకు ముందు ఇలాగే చాలా మంది అంపైర్లతో గొడవకు దిగడం చూశాను. కావాలని వాదనను పొడిగిస్తే పంత్ అయినా.. ఇంకెవరైనా కచ్చితంగా వారి తప్పునకు తగిన శిక్ష పడాల్సిందే’’ అని పేర్కొన్నాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఈ సీజన్లో రెండో గెలుపు అందుకుంది. Rishabh Pant and on-field umpire Rohan Pandit had a word on review.#LSGvsDC #IPL2024 #RishabhPant pic.twitter.com/NjIVgsAR5p — 𝗖𝗿𝗶𝗰 𝗶𝗻𝘀𝗶𝗱𝗲𝗿 (@cric_insiderr) April 12, 2024 చదవండి: Rishabh Pant: పంత్ అరుదైన ఘనతలు.. ఐపీఎల్లో తొలి కెప్టెన్‌గా #KL Rahul: అతడొక సర్ప్రైజ్.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Victory in Lucknow for the @DelhiCapitals 🙌 A successful chase power them to their second win of the season as they win by 6⃣ wickets! Scorecard ▶️ https://t.co/0W0hHHG2sq#TATAIPL | #LSGvDC pic.twitter.com/6R7an9Cy8g — IndianPremierLeague (@IPL) April 12, 2024 -
అందుకే ధోని అలా చేస్తున్నాడు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మైదానంలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్-2024లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ఈ మిస్టర్ కూల్. ఇందులో భాగంగా 42 ఏళ్ల మహి.. నెట్ సెషన్స్‌లో పాల్గొంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సమయంలో ధోని ఉపయోగించిన బ్యాట్‌పై అభిమానుల దృష్టి పడింది. ముఖ్యంగా.. ఆ బ్యాట్ మీద ప్రైమ్ స్పోర్ట్స్ పేరిట ఉన్న స్టిక్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధోని స్వస్థలం రాంచికి చెందిన పరమ్‌జిత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన షాపు పేరు అది. క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో తనకు సాయం అందించిన పరమ్‌జిత్ షాపును ప్రమోట్ చేస్తూ ధోని తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల మనసు దోచుకుంది. ఈ విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఎంఎస్ ధోని నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం చూశాను. అతడి బ్యాట్‌పై కొత్త స్టిక్కర్ కనిపించింది. MS Dhoni with the 'Prime Sports' sticker bat. It is owned by his friend. MS thanking him for all his help during the early stage of his career. pic.twitter.com/sYtcGE6Qal — Mufaddal Vohra (@mufaddal_vohra) February 7, 2024 తన స్కూల్‌మేట్‌కు చెందిన స్థానిక స్పోర్ట్స్ స్టోర్ పేరు అది. తన స్నేహితుడి షాపులో అమ్మకాలు పెంచడం కోసం ధోని ఇలా తన బ్యాట్‌పై ఆ స్టిక్కర్ వేయించుకున్నాడు’’ అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ మధ్య రెండో టీ20 సందర్భంగా కామెంట్రీ చేస్తున్న సందర్భంలో గిల్‌క్రిస్ట్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోని సొంతం. అయితే, వయసు పైబడుతున్న దృష్ట్యా తాజా సీజన్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దాల నడుమ.. తలా బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేయడం అభిమనుల్లో జోష్ నింపింది. ధోని ఈసారి కూడా కెప్టెన్‌గా బరిలోకి దిగడం ఖాయమంటూ నెట్టింట సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. Michael Hussey, Adam Gilchrist and Mark Howard talking about MS Dhoni - Unreal Influence 🐐🔥pic.twitter.com/S8q3xSmfQ5 — MN 👾 (@CaptainnRogerrs) February 11, 2024 -
రిషబ్ పంత్ ఒక అద్భుతం.. ఎంతో మంది వికెట్ కీపర్లకు ఆదర్శం: గిల్‌క్రిస్ట్
గతేడాది డిసెంబర్లో కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. రిషబ్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేశాడు. అతడిని త్వరలోనే తిరిగి మైదానంలో చూసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏదమైనప్పటికీ పంత్ వంటి విధ్వంసకర బ్యాటర్ వరల్డ్‌కప్‌కు దూరం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ప్రపంచకప్‌లో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక తన దూకుడుతో వరల్డ్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పంత్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిసబ్ తన విధ్వంసకర ఆట తీరుతో ఎంతో మంది యువ వికెట్కీపర్లకు ఆదర్శంగా నిలిచాడని గిల్‌క్రిస్ట్ కొనియాడాడు. "ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వికెట్ కీపర్ బ్యాటర్లను రిషబ్ పంత్ తను ఆడే విధంగా ప్రేరేపించాడు. యువ వికెట్ కీపర్లు పంత్‌ను ఫాలో అవుతున్నారు. ఇది నిజంగా చాలా గ్రేట్. ఇక భారత్‌కు వికెట్ కీపర్లు చాలా మంది అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌కు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో రెండు ఎంపికలు ఉన్నాయి. కేఎల్ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడు తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. ఇది నిజంగా భారత క్రికెట్‌కు శుభసూచికం అంటూ" గిల్‌క్రిస్ట్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: #Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు -
'ధోని, రోహిత్, కోహ్లి కాదు.. అతడే ఐపీఎల్ సూపర్ కెప్టెన్'
ఐపీఎల్-2023 సీజన్ మరో నాలుగు రోజుల్లో షూరూ కానుంది. మార్చి 31 నుంచి ఈ ధానాధాన్ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక క్యాష్ రిచ్ లీగ్ ఎంతో మంది క్రికెటర్లు కెప్టెన్లగా తమ సత్తా చాటుకున్నారు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎంస్ ధోని, రోహిత్ శర్మ, కోహ్లి, పాంటింగ్, వార్నర్ వంటి వారు సారథిలగా తమ జట్లకు ఎన్నోచిరస్మరణీయ విజయాలను అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ముంబై జట్టుకు ఐదు సార్లు టైటిల్‌ను అందించగా.. ధోని సారథ్యంలో సీఎస్కే నాలుగు సార్లు విజేతగా నిలిచింది. ఇక కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ టైటిల్ సాధించకపోయనప్పటికీ.. ఒక్క సారి ఫైనల్, రెండు సార్లు ఫైనల్‌కు చేరింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్ ఫేవరేట్ కెప్టెన్ ఎవరన్న ప్రశ్న భారత మాజీ పేసర్ ఆర్పీసింగ్‌కు ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. అతడు చాలా మందిని ఆశ్చర్యపరిచే విధంగా తన ఫేవరేట్ కెప్టెన్‌గా సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఎంచుకున్నాడు. జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీసింగ్ మాట్లాడుతూ.. "ఐపీఎల్లో నాకు ఇష్టమైన కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్. అతడు ఆస్ట్రేలియాతో పాటు డెక్కన్ ఛార్జర్స్‌కు మూడేళ్లపాటు నాయకుడిగా ఉన్నాడు. అతడు సారథిగా మేము తొలి సీజన్లోనే ఛాంపియన్స్‌గా నిలిచాం. అందుకే గిల్‌క్రిస్ట్ నా ఫేవరేట్ కెప్టెన్. అనంతరం 2010 సీజన్లో కూడా మేము అద్భుతంగా రాణించాము. దురదృష్టవశాత్తూ ఫైనల్‌కు చేరడంలో విఫలమయ్యాం" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్(సన్రైర్స్ హైదరాబాద్) తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అనంతరం 2010 సీజన్లో కూడా డెక్కన్ ఛార్జర్స్ అదరగొట్టింది. ఫైనల్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ సరికొత్తగా బరిలోకి దిగబోతుంది. ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్క్రమ్ వ్యవహరించనున్నాడు. చదవండి: 'రోహిత్, కోహ్లి కాదు.. అతడే టీమిండియా అత్యుత్తమ ఆటగాడు' -
BGT 2023: ‘అతడికి ఘోర అవమానం.. అసలు ఎందుకు సెలక్ట్ చేశారు?’
India vs Australia, 2nd Test: భారత పర్యటనలో అష్టన్ అగర్ పట్ల మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ అన్నాడు. అందుకే అతడు స్వదేశానికి తిరిగి వచ్చే యోచనలో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అగర్‌ను టీమిండియాతో మ్యాచ్‌లలో ఎందుకు ఆడించడం లేదో అర్థం కావడం లేదని.. అలాంటపుడు ఎంపిక చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. కాగా ఇప్పటి వరకు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ 9 వికెట్లు తీశాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడో మ్యాచ్ సందర్భంగా టెస్టు ఆడాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అష్టన్ అగర్. రెండుసార్లు మొండిచేయి ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్‌కు అనూలించే ఉపఖండ పిచ్‌లపై కీలక సిరీస్ నేపథ్యంలో నలుగురు స్పిన్నర్లకు స్థానం కల్పించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆష్టన్ అగర్(లెఫ్టార్మ్ స్పిన్నర్), నాథన్ లియాన్(రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్), మిచెల్ స్వెప్సన్(రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్)లతో పాటు 22 ఏళ్ల ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తొలిసారిగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని తొలి టెస్టులో అరంగేట్రం చేసిన మర్ఫీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. రెండో మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. అష్టన్ అగర్ అరంగేట్రం చేసిన యువ ప్లేయర్లు ఇలా ఇక మిచెల్ స్వెప్సన్ తన బిడ్డను చూసుకునేందుకు స్వదేశానికి పయనం కాగా.. మాథ్యూ కుహ్నెమన్‌ను భారత్‌కు పంపించింది యాజమాన్యం. ఈ క్రమంలో స్వెప్సన్ స్థానంలో వచ్చిన కుహ్నెమన్ ఢిల్లీ టెస్టుతో అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలి టెస్టులో 2 వికెట్లతో రాణించాడు. ఇలా వీరిద్దరు ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్(మొత్తం 8 వికెట్లు )తో పాటు తమ వంతు పాత్ర పోషించారు. అయితే, అష్టన్ అగర్‌కు మాత్రం ఈ రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో అతడు ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేయాలని భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఘోర అవమానం ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్.. అష్టన్ అగర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘జట్టుకు ఎంపికకావడం, విదేశీ పర్యటనల్లో జట్టుతో పాటే ఉండటం.. అయినా ఒక్కసారి కూడా ఆడే అవకాశం రాకపోవడం.. నిజంగా పెద్ద అవమానమే! అందుకే అతడు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు’’ అని ఆస్ట్రేలియా రేడియో చానెల్లో గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. అగర్‌ను మేనేజ్మెంట్ దారుణంగా అవమానిస్తోందని చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో ఓడి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఛాన్స్‌ను మరింత సంక్లిష్టం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఇండోర్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్ BGT 2023: మూడో టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. సిరీస్ నుంచి వైదొలిగిన స్టార్ బౌలర్ -
వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు వీళ్లే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ
టీ20 వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించబోయే బ్యాటర్ల జాబితాను ఐసీసీ ఇవాళ విడుదల చేసింది. బ్యాటర్ల ప్రస్తుత ఫామ్,స్ట్రయిక్ రేట్ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. ప్రమాదకర బ్యాటర్లుగా పరిగణించబడే బ్యాటర్లు ఎవరంటే.. సూర్యకుమార్ యాదవ్ (ఇండియా) స్ట్రయిక్ రేట్: 176.81 జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 163.65 ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 161.72 టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 160.08 గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 150.40 ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) స్ట్రయిక్ రేట్: 155.51 రిలీ రొస్సో (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 152.87 ఎయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 151.16 ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఎంపిక చేసిన టాప్-6 టీ20 బ్యాటర్లు వీరే.. హార్ధిక్ పాండ్యా దినేశ్ కార్తీక్ హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ మొయిన్ అలీ జోస్ బట్లర్ -
రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే!
Adam Gillchrist Picks One Indian In World T20I Top 5 List: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం అన్ని జట్లు సిద్దమవుతున్నాయి. ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా అన్ని ప్రాధాన జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లలో బీజీబీజీగా గడుపుతున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రపంచంలోనే టాప్ 5 టీ20 ఆటగాళ్లను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఎంపిక చేశాడు. ఈ జాబితాలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గిల్‌క్రిస్ట్ చోటిచ్చాడు. గిల్‌క్రిస్ట్ ఎంపిక చేసిన ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఆగ్ర స్థానంలో చోటు దక్కింది. అదే విధంగా రెండో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో హార్దిక్ పాండ్యా, ఆఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను గిల్‌క్రిస్ట్ ఎంపిక చేశాడు. ఇక అఖరిగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను ఈ మాజీ ఆసీస్ ఓపెనర్ అవకాశమిచ్చాడు. చదవండి: IND vs SA: టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్ కుమార్? -
T20 WC: పంత్‌కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్ దిగ్గజం
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 భారత తుది జట్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు కచ్చితంగా అవకాశం ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ అన్నాడు. పంత్‌తో పాటు దినేశ్ కార్తిక్ కూడా చోటు ఇవ్వాలని సూచించాడు. ఈ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో టీ20 ఫార్మాట్లో రిషభ్ పంత్ గణాంకాల దృష్ట్యా అతడికి ప్రపంచకప్ తుదిజట్టులో చోటు ఇవ్వకూడదంటూ విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వసీం జాఫర్ వంటి టీమిండియా మాజీలు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. పంత్‌ను కాదని దినేశ్ కార్తిక్‌కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఇక ఐసీసీ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొదటి టీ20లో పంత్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్.. పంత్‌కు ప్రపంచకప్ తుది జట్టులో స్థానం ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై అతడు మెరుగ్గా రాణించగలడని పేర్కొన్నాడు. గిల్‌క్రిస్ట్ ఈ మేరకు ఐసీసీతో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘బౌలర్లపై విరుచుకుపడుతూ అద్భుత షాట్లు ఆడ గల సత్తా పంత్‌కు ఉంది. తను కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందే’’ అని పేర్కొన్నాడు. ఇక అదే విధంగా దినేశ్ కార్తిక్ ఆట తీరు గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పంత్‌తో పాటు డీకే కూడా జట్టులో ఉండాలి. అతడొక విలక్షణమైన బ్యాటర్. టాపార్డర్‌లో.. మిడిలార్డర్లోనూ ఆడగలడు. ఫినిషర్‌గా అద్భుత పాత్ర పోషించగలడు. అందుకే అతడికి కూడా జట్టులో చోటు దక్కాల్సిందే’’ అని ఆడం గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: Dewald Bravis: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! -
ఇండియన్ ప్లేయర్లను ఫారిన్ లీగ్‌ల్లో ఆడనివ్వండి..!
భారత క్రికెటర్లు విదేశీ లీగ్‌ల్లో ఆడకపోవడం అనే అంశంపై లెజెండరీ వికెట్‌కీపర్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందించాడు. ఈ విషయంలో బీసీసీఐ కాస్త పట్టువీడాలని సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా భారత ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వారిని విదేశీ టీ20ల లీగ్‌ల్లో ఆడనివ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. భారత క్రికెటర్లు బిగ్‌బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫారిన్ లీగ్స్‌లో పాల్గొనడం వల్ల ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ పెరగడంతో పాటు బీసీసీఐకి విశ్వవ్యాప్త గుర్తింపు వస్తుందని అన్నాడు. భారత క్రికెటర్లు విదేశాల్లో (టీ20 లీగ్‌ల్లో) ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తే, అది క్రికెట్ వ్యాప్తికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్‌ల్లో భారత క్రికెటర్లు ఆడితే అద్భుతంగా ఉంటుందని, ఐపీఎల్ ఆరు సీజన్లు ఆడిన అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని తెలిపాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అని, దాన్ని నడిపిస్తున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నయ్య లాంటిదని ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌పై ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆధిపత్యం ఎక్కువైందని సంచలన వ్యాఖ్యలు చేసిన మరునాడే గిల్లీ బీసీసీఐకి ఈ రకమైన సూచన చేయడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: బిగ్‌బాష్ లీగ్ లో ఆడనున్న భారత ఆల్ రౌండర్..! -
Ind Vs Sl: పంత్ ఖాతాలో అరుదైన రికార్డు.. ధోని, గిల్‌క్రిస్ట్‌లను ‘దాటేశాడు’!
Rishabh Pant Stats: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆడేది టెస్టు మ్యాచ్ అని నాకు తెలుసు కానీ నా బ్యాట్‌కు తెలియదన్నట్లుగా షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బోర్ అనే మ్యాచ్‌కు బోలెడంత జోష్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో అందివ్వగల సమర్థుడు పంత్. భారత బ్యాటర్ హనుమ విహారి అవుటైన 34 ఓవర్లో క్రీజులోకి వచ్చిన పంత్ ఐదో బంతిని డీప్‌మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా తరలించాడు. మరుసటి ఓవర్ వేసిన ధనంజయ డిసిల్వాకు వరుస 4, 6లతో తన ధాటిని చూపించాడు. తర్వాత ఓవర్లోనే విరాట్ కోహ్లి అవుటైనా పంత్ జోరు మాత్రం తగ్గలేదు. లంక స్పిన్ బౌలింగ్ కొనసాగించినంత సేపు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో మెరిపించాడు. పది ఓవర్లయినా క్రీజులో నిలువని రిషభ్ కేవలం 28 బంతుల్లోనే (7 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీ కొట్టి మరీ ఫిఫ్టీ పూర్తి చేయడం విశేషం. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మాత్రమే కాదు. ఇది కూడా! ఈ క్రమంలో పంత్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఫీట్ నమోదు చేశాడు. తద్వారా టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్ (1982లో పాక్‌పై 30 బంతుల్లో) రికార్డును బద్దలుకొట్టాడు. సిక్సర్ల వీరుడు! అంతేగాకుండా.. టెస్టుల్లో ఆడిన 50 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు(42) బాదిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు (51 ఇన్నింగ్స్)తో కలిపి మొత్తంగా 44 సిక్సర్లు బాదాడు. ఇక ఈ జాబితాలో పంత్ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని(31 సిక్సర్లు), ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడిన్(31), ఆడం గిల్‌క్రిస్ట్(30), ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్(21) ఉన్నారు. కాగా ధోని తన టెస్టు కెరీర్లో భాగంగా 90 టెస్టుల్లో 78 సిక్సర్లు కొట్టాడు. యువ సంచలనం పంత్ మాత్రం 30 మ్యాచ్‌లలోనే 44 సిక్స్‌లు బాదడం గమనార్హం. ఇక మొత్తంగా టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వికెట్ కీపర్ల జాబితాలో గిల్‌క్రిస్ట్ 100 మాక్సిమమ్స్తో టాప్‌లో ఉన్నాడు. ధోని 79, బ్రాడ్ హాడిన్ 54 సిక్స్‌లు కొట్టారు. ఇదిలా ఉండగా.. శ్రీలంకతో మ్యాచ్‌లో 42వ ఓవర్ ఆఖరి బంతికి జయవిక్రమ రిటర్న్ క్యాచ్‌తో పంత్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. చదవండి: IPL 2022- Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ జెర్సీ ఆవిష్కరణ.. సర్ప్రైజ్కు సిద్ధంగా ఉండాలన్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా -
చనిపోవడానికి 8 గంటల ముందు మెసేజ్ చేశాడు.. అప్పుడు: గిల్‌క్రిస్ట్
హఠాన్మరణం చెందిన దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్‌ను తలచుకుని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడం గిల్‌క్రిస్ట్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు తనకు మెసేజ్ చేశాడంటూ సహచర ఆటగాడిని గుర్తు చేసుకున్నాడు. తన నుంచి వచ్చిన ఆ సందేశాన్ని ఎన్నడూ డెలిట్ చేయనంటూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా మార్చి 4న థాయ్‌లాండ్‌లోని విల్లాలో వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే. అప్పటి వరకు సరాదాగా గడిపిన స్పిన్ మాంత్రికుడు హఠాన్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో అతడి భౌతిక కాయాన్ని శుక్రవారం నాటికి ఆస్ట్రేలియాకు పంపించనున్నారు. ఈ క్రమంలో ఏబీసీ న్యూస్‌తో మాట్లాడిన గిల్‌క్రిస్ట్ వార్న్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘‘తనతో మాట్లాడి వారం కావస్తోంది. బహుశా తను చనిపోవడానికి ఎనిమిది గంటల ముందు అనుకుంటా.. నాకో చక్కని సందేశం పంపాడు. నన్ను ముద్దుగా చర్చ్ అని పిలిచేవాడు. ఈ నిక్‌నేమ్ మా స్నేహితుల్లో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. చనిపోవడానికి ముందు పంపిన మెసేజ్‌లో.. ‘‘చర్చ్, రాడ్ మార్ష్‌కు నువ్వు ఘన నివాళి అర్పించావు’’ అని కొనియాడాడు. అదే చివరిసారి తను నాకు పంపిన సందేశం. దానిని నా జీవితంలో డెలిట్ చేయను’’ అని గిల్‌క్రిస్ట్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతి చెందిన గంటల వ్యవధిలోనే వార్న్ సైతం తుదిశ్వాస విడవడం గమనార్హం. చదవండి: IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే! -
కప్పలా నోరు తెరిచాడు.. ఏమైంది గిల్లీ!
ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కప్పలా నోరు తెరిచాడు. బీబీఎల్ 11వ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గిల్లీ.. మ్యాచ్‌లో ఒక బ్యాటర్ కొట్టిన షాట్‌కు షాక్‌తో నోరు తెరిచాడు. ఈ సంఘటన పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఇవాన్స్ ఒక బంతిని భారీ సిక్స్ కొట్టాడు. లాంగాన్ దిశగా వెళ్లిన ఆ సిక్స్ స్టాండ్స్‌లోని లోవర్ కవర్‌కు తగిలి ప్రేక్షకుల మధ్యలో పడింది. ఇవాన్స్ షాట్‌ను కామెంటరీ బాక్స్ నుంచి చూసిన గిల్‌క్రిస్ట్.. గుడ్షాట్.. అంటూ కప్పలా కాసేపు నోరు తెరిచాడు. ఆ సమయంలో గిల్‌క్రిస్ట్‌ను కెమెరాలు క్లిక్‌మనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11) సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పెర్త్ స్కార్చర్స్ బీబీఎల్ టైటిల్ గెలవడం నాలుగోసారి కాగా.. సిడ్నీ సిక్సర్స్‌ను ఫైనల్లో ఓడించడం ఇది మూడోసారి.76 పరుగులు నాటౌట్‌తో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మన్ లారీ ఇవాన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే పెర్త్ స్కార్చర్స్ ఆరు ఓవర్లలో 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ ఆస్టన్ టర్నర్, లారీ ఇవాన్స్‌లు ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ ఇద్దరు కలిసి 59 బంతుల్లో 104 పరుగులు జతచేయడంతో పెర్త్ స్కార్చర్స్ భారీ స్కోరు చేయగలిగింది. The @foxcricket commentators reaction say it all 😯 Is this the shot of #BBL11? A BKT Golden Moment pic.twitter.com/c32higINi3 — cricket.com.au (@cricketcomau) January 28, 2022 -
Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి కూడా!
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శల పర్వం కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో మూడో రోజు ఆట సందర్భంగా కోహ్లి వ్యవహరించిన తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. కాగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ విషయంపై టీమిండియా ఆటగాళ్లు.. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైకు దగ్గరకు వెళ్లి ప్రసారకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే కోహ్లిది చెత్త ప్రవర్తన అంటూ విమర్శించాడు. ఇక ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైకేల్ వాన్ కోహ్లికి భారీ జరిమానా వేయాలని.. లేదంటే నిషేధం విధించాలని ఐసీసీకి సూచించాడు. ప్రతి ఒక్కరు భావోద్వేగాలు ప్రదర్శించడం సహజమని.. అయితే నాయకుడు ఇలా చేయడం సరికాదన్నాడు. ఈ విషయంలో ఐసీసీ వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ డారిల్.. భారత కెప్టెన్ చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ సైతం టీమిండియా సారథి తీరుపై పెదవి విరిచాడు. ప్రతి విషయంలోనూ ఓ హద్దు ఉంటుందని... అది దాటితే తప్పును ఉపేక్షించాల్సిన అవసరం లేదని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. షేన్ వార్న్ మాట్లాడుతూ... ‘‘అంతర్జాతీయ జట్టు కెప్టెన్ ఇలా వ్యవహరిస్తాడని నేను అనుకోను. ఒక్కోసారి అసహనం హద్దు దాటుతుంది. నిజమే.. అయితే పదే పదే ఇలా చేయడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. సహించాల్సిన అవసరం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆటలో వైఫల్యం కంటే కూడా ఇలాంటి వాగ్యుద్దాలు, గొడవలతోనే ఎక్కువ అప్రదిష్టను మూటగట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 -
గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్ మజాక్.. వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్స్ మధ్య జరిగే సంభాషణలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. మ్యాచ్ గురించి ప్రస్తావన తెస్తూనే తమదైన శైలిలో జోక్‌లు.. పంచ్‌లు పేల్చుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిసెంబర్ 12న మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంది. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్ మధ్య స్పిన్ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్ అంశం చర్చకు వచ్చింది. క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో గిల్‌క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. ''డబుల్ మీనింగ్ మరీ ఎక్కువైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ashes 2021: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ ఇక మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. A reasonable question from @isaguha 👀😂😂😂😂😂😂 pic.twitter.com/Tzu5F2emUg — Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021 -
మ్యాక్స్‌వెల్ టీ20 ప్రపంచకప్ జట్టు.. అనూహ్యంగా ఆ ఇద్దరికి చోటు
Maxwell Lists His Top Five T20 Players Ahead Of T20 WC 2021: పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, దిగ్గజ ఆటగాళ్లు, విశ్లేషకులు తమతమ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్ డాషింగ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ సైతం ప్రపంచ టీ20 జట్టుకు తన ఐదుగురు ఫేవరెట్ ఆటగాళ్ల లిస్ట్‌ను ప్రకటించాడు. ఈ జాబితాలో మ్యాక్సీ అనూహ్యంగా ఇద్దరు ఆసీస్ వెటరన్ ప్లేయర్స్‌కు చోటు కల్పించడం విశేషం. తన ఫస్ట్ ఛాయిస్ ఆటగాడిగా అఫ్గాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్‌ను ఎంపిక చేసిన మ్యాక్స్‌వెల్.. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్, విండీస్ విధ్వంసకర ప్లేయర్ ఆండ్రీ రసెల్‌లను తన జట్టులోకి ఎంపిక చేశాడు. అయితే వికెట్‌కీపర్ కోటాలో అతను అనూహ్యంగా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు చోటు కల్పించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆఖరుగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్‌ను మ్యాక్సీ తన జట్టులోని తీసుకున్నాడు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సమర్ధులని, అందుకే వీరిని తన జట్టులోకి ఎంపిక చేశానని మ్యాక్సీ చెప్పుకొచ్చాడు. చదవండి: పేలవ డ్రాగా ముగిసిన పింక్ బాల్ టెస్ట్ Two all-rounders, a leg-spinning sensation and two Australians of the past 🏏 Glenn Maxwell’s top five T20 Players 🎥 pic.twitter.com/Yn2lUsCgE4 — T20 World Cup (@T20WorldCup) October 6, 2021 -
అదే టీమిండియా కొంపముంచింది..
అడిలైడ్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన కోహ్లి గ్యాంగ్.. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా తేలిపోయింది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డును లిఖించింది. కనీసం ఆసీస్‌కు పోటీ ఇవ్వకుండానే టీమిండియా లొంగిపోవడంతో విమర్శల వర్షం కురుస్తోంది. అసలు కేఎల్ రాహుల్‌ను తీసుకోలేకపోవడమే ఇంతటి ఘోర పరాభవానికి కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా తన టెస్టు చరిత్రలోనే తక్కువ స్కోరుకు ఇన్నింగ్స్‌ను ముగించడం చాలా దారుణమని ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటున్నాడు. ఈ తరహా దారుణ ఓటమికి సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం రాకపోవడమేనని తెలిపాడు. (చదవండి: స్మిత్, కోహ్లి ర్యాంక్‌లు యథాతథం) ప్రధానంగా పృథ్వీ షా ఘోర వైఫల్యమే టీమిండియాను వెనక్కునెట్టిందన్నాడు. ‘మిడ్ డే’ కు రాసిన కాలమ్‌లో పృథ్వీ షా ప్రదర్శన గురించి గిల్‌క్రిస్ట్ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ తొలి టెస్టులో పృథ్వీ షా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. ఓపెనర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. టీమిండియా గతంలో ఇక్కడ పర్యటించిన జట్టులో పృథ్వీషా ఒక సభ్యుడు. పృథ్వీ షాకు ఆస్ట్రేలియాలోని పరిస్థితులు తెలియంది కాదు. పృథ్వీ షాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని షా నిలబెట్టలేదు. అతని బ్యాటింగ్ టెక్నిక్ విమర్శలకు దారితీస్తోంది. బ్యాట్‌కు ప్యాడ్‌కు మధ్య దూరాన్ని అంచనా వేయడంలో షా విఫలం అయ్యాడు. ఓపెనర్‌గా షా తొందరగా విఫలం కావడమే టీమిండియా కొంపముంచింది. ఆస్ట్రేలియాలో పరిస్థితులు తెలిసినా షాట్ల ఎంపిక సరిగా లేదు. అతనొక టాలెంటెడ్ యువ క్రికెటర్. కానీ తొలి టెస్టులో అతని ఆట సెలక్టర్లను డైలమాలో పడేసింది. బాక్సింగ్ డే టెస్టుకు షాను పక్కకు పెట్టి శుబ్‌మన్ గిల్‌కు అవకాశం కల్పించాలి’ అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. (నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..) -
తప్పు నాదే.. క్షమించండి : గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్ పెద్ద పొరపాటు చేశాడు. ఇటీవలే టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిరాజ్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు భారత జట్టు ఆటగాళ్లతో పాటు ఆసీస్ క్రికెటర్లు కూడా సానుభూతి ప్రకటించారు. (చదవండి : రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్) శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో గిల్‌క్రిస్ట్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. కామెంటరీ సమయంలో సిరాజ్ తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడిన గిల్‌క్రిస్ట్ పొరపాటున సిరాజ్ బదులు నవదీప్ సైనీ పేరును ప్రస్తావించాడు. 'తండ్రి చనిపోయిన వెంటనే బీసీసీఐ సైనీకి ఇంటికి వెళ్లేందుకు అవకాశమిచ్చింది. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అతను వెళ్లలేదు' అని పేర్కొన్నాడు. అయితే గిల్‌క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి : హార్దిక్ బౌలింగ్ ఇప్పట్లో లేనట్లేనా?) గిల్లీ వ్యాఖ్యలను గుర్తించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మెక్లీన్‌గన్‌తో పాటు కొంతమంది అభిమానులు ట్విటర్ ద్వారా అతని పొరపాటును ట్యాగ్ చేశారు. చనిపోయింది సిరాజ్ తండ్రి.. నవదీప్ సైనీ తండ్రి కాదంటూ తెలిపారు. విషయం గ్రహించిన గిల్లీ వెంటనే ట్విటర్లో స్పందించాడు.' నా పొరపాటును గ్రహించాను. సిరాజ్‌కు బదులు పొరపాటుగా సైనీ పేరు వాడాను. ఈ సందర్భంగా సిరాజ్, సైనీలకు ఇవే నా క్షమాపణలు. నేను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను గుర్తించిన మెక్లీన్‌గన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా.. మరొకసారి మీ అందరిని క్షమాపణ కోరుతున్నా' అంటూ గిల్లీ ట్వీట్ చేశాడు. Yes, thanks @anshu2912 I realize I was mistaken in my mention. Huge apologies for my error, to both @navdeepsaini96 and Mohammed Siraj. 🙏😌 https://t.co/618EUIEyNU — Adam Gilchrist (@gilly381) November 27, 2020 Yep, thanks @Mitch_Savage My huge apologies again to all. https://t.co/F8rYsD6fxm — Adam Gilchrist (@gilly381) November 27, 2020 -
భజ్జీతో గొడవను గుర్తుచేసుకున్న గిల్‌క్రిస్ట్
ముంబై : 2019, ఆగస్టు నెలలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌తో ట్విటర్ వేదికగా చోటుచేసుకున్న వివాదాన్ని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. శుక్రవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. గతంలో ట్విటర్లో జరిగిన ఆ చిన్న వివాదం వల్ల తమ మధ్య దూరం పెరగలేదని అన్నాడు. ప్రస్తుతం హర్భజన్‌తో సఖ్యతగానే ఉంటున్నానని స్పష్టం చేశాడు. ఆ రోజు జరిగిన గొడవలో భజ్జీనే పై చేయి సాధించాడని, అతడి మాటలకు సమాధానం చెప్పలేకపోయానని పేర్కొన్నాడు. (రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్) గతంలో హర్భజన్ బౌలింగ్ గురించి గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్ భజ్జీనే’’నని అన్నాడు. కాగా, 2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో హర్భజన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వీటిలో గిల్‌క్రిస్ట్ వికెట్ కూడా ఉంది. భజ్జీ తన వికెట్ తీయటంపై గిల్‌క్రిస్ట్ వ్యంగ్యంగా స్పందించటంతో వివాదం మొదలైంది. -
భారత ఫీల్డర్లు ఏదో అనేవారు.. కానీ
సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియాల మధ్య గతంలో జరిగిన సిరీస్‌ల గురించి ప్రస్తావిస్తే మనకు హర్భజన్ సింగ్ ‘మంకీగేట్’ వివాదమే మనకు గుర్తుకొస్తుంది. ఆస్ట్రేలియా ఆటగాడు సైమండ్స్‌ను ఉద్దేశిస్తూ భజ్జీ చేసిన కామెంట్ ఒకానొక సమయంలో పెద్ద దుమారం రేపింది. అయితే ఆ వివాదం పెద్దది కాకుండా చేయడంలో సచిన్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు. అయితే హర్భజన్ సింగ్ తనను ఔట్ చేసిన సందర్భంలో భారత ఫీల్డర్లు ఒకే పదాన్ని ఎక్కువ ఉపయోగించేవారని ఆసీస్ మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. లైవ్ కనెక్ట్ షోలో భాగంగా టీవీ ప్రెజంటర్ మడోనా టిక్సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌ల విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు గిల్‌క్రిస్ట్. (24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఓపెనర్‌గా..) ఈ క్రమంలోనే ఒకనాడు భారత ఫీల్డర్ ఉపయోగించే ఆ పదానికి అర్థం ఏమిటో ఇప్పటికీ తెలీదన్నాడు. ఇప్పుడు ఆ పదాన్ని కూడా మరిచిపోయానని గిల్లీ చెప్పుకొచ్చాడు. ప్రధానంగా భజ్జీ బౌలింగ్‌లో తాను ఔటైన సందర్భంలోనే ఆ పదాన్ని వాడేవారన్నాడు. 2001 సిరీస్‌లో ఆసీస్‌కు చుక్కలు చూపించిన హర్భజన్.. మూడు టెస్టుల సిరీస్‌లో 32 వికెట్లు సాధించి భారత్‌కు సింగిల్ హ్యాండ్ విజయం అందించాడు. కాగా, భజ్జీ తన టెస్టు కెరీర్లో అత్యధికంగా ఔట్ చేసిన వారిలో పాంటింగ్(10సార్లు) తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో మాధ్యూ హేడెన్(9సార్లు), గిల్ క్రిస్ట్(7సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. (ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?) ఇక భారత్‌లో ఎప్పుడూ తమకు గ్రాండ్ వెల్కమ్ ఉండేదని గిల్లీ గుర్తు చేసుకున్నాడు. అయితే ముంబైలో తనకు ఎదురైన ఫన్నీ ఘటనను గిల్లీ ప్రస్తావించాడు. ఒక మార్నింగ్ తాను ఒకచోట జాగింగ్ చేస్తుంటే క్రికెట్ ఫ్యాన్స్ పరుగులు పెట్టించారన్నాడు. తాను సన్‌గ్లాసెస్, ఇయర్ ఫోన్స్, తలపై హ్యాట్ పెట్టుకోవడమే కాకుండా తల కిందకు వంచి జాగింగ్ చేసుకుంటుంటే కొంతమంది తనను ఆపేశారన్నాడు. ఈ క్రమంలో తనను గుర్తించి ఒక ఫోటో కోసం వెంటపడ్డారన్నాడు. ఇది చాలా సరదాగా అనిపించిందని గిల్లీ పేర్కొన్నాడు. తాను మళ్లీ ఎప్పుడు భారత్‌కు వస్తానో తెలీదన్న గిల్లీ.. భారత్‌కు రావడమంటే ఎప్పుడూ కొత్తగా ఉంటుందన్నాడు.